Vinaykumar Patakala

Drama

3.3  

Vinaykumar Patakala

Drama

విధి కలిపినా ప్రేమ బంధం ( 2 )

విధి కలిపినా ప్రేమ బంధం ( 2 )

9 mins
31


వినయ్ ఇంకా భవాని తమ మొదటి మీట్ కోసం నెక్లెస్ రోడ్ కి వెళ్ళారు, కానీ... అది న్యూ ఇయర్ కారణంగా ఆరోజు ఆ ప్లేస్ అంత చాలా రద్దీగా ఉంది పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరు కలిసి ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.

వినయ్ ఇంకా భవాని ఒకరికోసం ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వినయ్ మనసులో భవాని పట్ల ఉన్న ప్రేమ భవానిని ఎపుడెపుడు కలుస్తాను అని ఆరాటం మెలిపెడుతూ ఉంది...


ఏంట్రా బాబు నా మనసు ఇంతగా కలవరపడుతూ ఆరాట పెడుతూ ఉంది నన్ను.... నా లైఫ్ లో ఇంతగా దేనికోసం వెయిట్ చేయలేదు నా టెన్త్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా లేదు, ఇంత టెన్షన్ ఐఐటీ లో సీట్ కోసం కూడా ఇంతగా టెన్షన్ పడలేదు అలాంటి నన్ను ఇంతగా మార్చేసింది ఈ ప్రేమ....తను ఎలా ఉంటుందో... ఎప్పుడు వస్తుందో అసలు తను నా ప్రేమని అగీకరిస్తుందా లేదా ఇలా రకరకాల ప్రశ్నలతో నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.


వినయ్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ఆ రెస్టారెంట్ చుట్టూ తిరుగుతున్న ప్రతిసారి ఒక టేబుల్ దగ్గరికి రాగానే తన మనసు ఎంతో గట్టిగా కొట్టుకుంటూ ఉంది. ఆలా ఎందుకు కొట్టుకుంటుందో అతనికే అర్ధం కావట్లేదు.


అప్పుడు సమయం రాత్రి 11:51.


నెక్లెస్ రోడ్ రాత్రి పూట చాలా ఆందంగా ఉంటుంది పైగా న్యూ ఇయర్ కావడంతో రోజూ ఉండే జనం కంటే ఆ రోజు చాలా ఎక్కువగా ఉన్నారు.....అక్కడ ఉన్న జనాలందరు సందడి చేస్తూ కొలహలంగా ఉంది ఆ చోటు.


వినయ్ మాత్రం తనని వెతికే పనిలో ఉండగా అంతలో అక్కడకి ఒక చిన్న పాప తన బాల్ తో ఆడుకుంటూ వచ్చింది.


అనుకోకుండా ఆ బాల్ రోడ్ మీదకి వెళ్ళింది. అంతలో అక్కడికి ఒక కార్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు అది గమనించిన భవాని వెంటనే ఆ పాపని రక్షించడానికి తన టేబుల్ నుండి పరుగులు తీస్తూ వెళ్ళింది కానీ, అంతలో భవాని కంటే ముందుగా అక్కడికి చేరుకున్న వినయ్ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కార్ ఆ పాపని ఢీ కొట్టేముందే సరైన సమయానికి వెళ్లి ఆ పాపని రక్షించి పక్కకి తీసుకెళ్లాడు వినయ్.


అది చుసిన భవాని హమ్మయ్యా అని గట్టిగ ఊపిరి పీల్చుకొని సంతోష పడింది... వెంటనే ఆ పాప తల్లిదండ్రులు వచ్చి చిన్ని... చిన్ని ... అని కంగారు పడుతూ ఆ పాపని తీసుకొని ముద్దాడుతూ.... చాలా థాంక్స్ అండి మా బిడ్డని రక్షించినందుకు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, అని చెబుతూ సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ అన్నాడు ఆ పాపా తండ్రి.


అయో ఇందులో నేను చేసిందేమి లేదు నా స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతారు అని అంటూ.... ఎం లడ్డు పిల్ల బాల్ ఆడుకుంటున్నావా అయితే వెళ్ళి మీ అమ్మ నాన్నలతో ఆడుకో అంతే కానీ ఇలా రోడ్ మీద ఆడకు...ఒకవేళ మర్చిపోయి ఆడితే మళ్లి నువ్వు మీ అమ్మ నాన్నల్ని చూడలేవు బుడ్డిదాన అని అంటూ చాక్లెట్ కావాల్నా అని అంటూ తన దగ్గర ఉన్నా చాక్లెట్ బాక్స్ లో నుండి ఒక చాక్లెట్ తీసి ఆ పాపకి ఇచ్చి.... హ్యాపీ న్యూ ఇయర్ లడ్డు పిల్ల అని విష్ చేస్తూ ఆ పాపా చెంప మీద ఒక ముద్దు పెట్టి తన తల మీద తన చేయి పెట్టి నిమురుతూ... జాగ్రత్తగా ఆడుకో ఒకే నా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు .... అలా వెళ్తున్న అదే టైంలో హఠాత్తుగా ఎక్కడనుండో అతి వేగంగా ఒక పెద్ద కార్ అదుపు లేకుండా వచ్చి వినయ్ ని ఒక్కసారిగా తన పూర్తి బలంతో గుద్దేసింది ఆ కార్.


ఆ వెంటనే వినయ్ ఒక్కసారిగా గాలిలోకి యెగిరి ఆమాంతం నేల మీద పెడేల్ మని పడిపోయాడు తను .... కార్ చాలా వేగంగా వచ్చి గుద్దడంతో వినయ్ తల నేలకి తగిలి బ్లడ్ రావడం మొదలైంది,... అది చూసిన అక్కడి స్థానికులు వెంటనే ఆ కార్ ని డ్రైవ్ చేసిన వాడిని పట్టుకొని నాలుగు చితకబాది అక్కడే ఉన్న పోలీసులకి అప్పగించి వెంటనే కాల్ చేసి అంబులెన్సు ని రప్పించి, వినయ్ ని ఆ అంబులెన్సు లోకి ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు 

వినయ్ కళ్లు బైర్లుకమ్మడం తో అతనికి తన చుట్టు ఎం జరుగుతుందో కనిపించడం లేదు కేవలం వారి మాటలు తప్ప,... అలా తన తలని అటుఇటు తిప్పుతుండగా నెమ్మదిగా మూసుకుపోతున్న తన కళ్లకి, అంతలోనే వినయ్ వైపుకి పరిగెడుతూ వస్తున్న ఒక అమ్మాయి వైపుకి తిరిగింది ...కానీ అప్పటికే తన కంటి చూపు మసకబడడంతో ఆ అమ్మాయి ని సరిగ్గా చూడలేకపోయాడు వినయ్.


ఆ అమ్మాయి వచ్చి... హే... హలో మిమ్మల్నే.... ప్లీజ్ కళ్లు మూసుకోకండి,.... దయచేసి కళ్లను తెరవండి అని చెబుతూ వినయ్ చెంపల మీద కొడుతూ వినయ్ నీ కళ్లు మూసుకోనివ్వకుండా ప్రయత్నం చేస్తుంది భవాని.


అంబులెన్సు వచ్చి అంబులెన్సు లో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి వినయ్ నీ ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఎక్కిస్తుండగా... తన రెండు చేతుల్లోని,.... ఒక చేతితో గులాబీల బొకే నీ పట్టుకొని మరో చేతిలో భవాని కి ఇవ్వాలని ఎంతో ఇష్టంగా కొన్న ఒక డైమండ్ రింగ్ నీ పట్టుకున్నాడు.... అది చూసిన అంబులెన్సు వ్యక్తి ఆ పిడికిలిగా ఉన్న చేతిని తెరిచేందుకు ప్రయత్నించాడు కానీ ఆ వ్యక్తి తన పూర్తి బలాన్ని ఉపయోగించినా ఆ పిడికిలి మాత్రం అసలు తెరువకపోవడంతో... అది చుసిన భవాని...


హే ఎం చేస్తున్నారు అని కంగారు పడుతూ అడిగింది..


మేడం అది ఇతని చేతిలో ఎదో ఉంది మేడం అదేంటో తెలియట్లేదు... అదేంటో చూద్దామని అని అనుకుంటున్న అన్నాడు.


అంతలో భవాని కోపంతో, మీకేమైనా పిచ్చ అవతల చావుబ్రతుకుల మధ్యలో అతను విలవిలలాడుతూ ఉంటే మీకు అతని చేతిలో ఎం ఉంది అని తెలుసుకోవడం ముఖ్యమా అని కోపంగా చూస్తూ అడిగింది భవాని.


అది కాదు మేడం అతనికి సంబందించిన వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందేమో అని చూస్తున్నాను అంతే అని చెప్పాడు ఆ అంబులెన్సు వ్యక్తి.


అది చూడాలి అంటే అతని పోకెట్లో చూడాలి అంతేకాని ఇలా బలవంతంగా అతని పిడికిలి తెరిచి కాదు.... ముందు వెంటనే అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని కోపంగా అరుస్తూ అంది భవాని.


దానికి హడలెత్తి... హ ఇప్పుడే తీసుకెళ్తున్నాం అని అంటూ వినయ్ ని అంబులెన్సు లోకి ఎక్కించుకున్నారు...


అంబులెన్సు బయలుదేరుతున్న అదే సమయంలో భవాని ఇందాక చేయి బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చూసింది... అతని మొఖంలో ఎదో తెలియని దుర్భుద్ది పుట్టినట్లు కంగారు పడటం గ్రహించి తనకి ఎదో దురాశ కలిగిన చూపుతో వినయ్ పిడికిలి వైపుకే చూస్తూ ఉన్నాడు... అది గ్రహించిన భవాని తన మనసులో ఎదో తెలియని అలజడి రేగడం మొదలైంది.... తనకి తెలియకుండానే తాను ఇంతగా దేని గురించి ఎపుడు కంగారు పడలేదు.... నేనేమైన తప్పు చేస్తున్నానా అని తన మనసుని ప్రశ్నించుకుంటూ వినయ్ వైపుకి చూస్తూ తనకు తను ఆలోచిస్తూ అడిగింది భవాని.


అంబులెన్సు బయలుదేరుతున్న అదే సమయంలో వెంటనే భవాని తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ...ఇలా కాదు అని వెంటనే వెళ్తున్న అంబులెన్సు ని ఆపింది భవాని.


హలో ఏంటి మేడం ఇందాక ఆలస్యం అవుతుంది అని మీరే గొడవ చేసి ఇప్పుడు మీరే మమల్ని ఆపుతారేంటి మేడం,... తమాషాగా ఉందా ఏంటి అని చిరాకు పడుతూ అన్నాడు అంబులెన్సు డ్రైవర్.


సోరి.... సోరి ఇలా ఆపినందుకు నేను కుడా అతనితో పాటు వస్తాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్లకి ఇన్ఫర్మ్ చేయడానికి అని చెబుతూ డ్రైవర్ దగ్గరికి వచ్చింది భవాని.


సరే త్వరగా రండి మేడం వచ్చి వెనకాల కూర్చోండి అవతల లేట్ అయితే ఆ అబ్బాయి ప్రాణాలు పోతాయి అని హడావిడి పెడుతూ అన్నాడు డ్రైవర్.


సోరి... నిజంగా సోరి అని చెబుతూ వెంటనే అంబులెన్సు వెనక్కి వెళ్ళి అంబులెన్సు డోర్ నీ హటాత్తుగా తెరిచి చూసింది భవాని...


అప్పుడు తన కంటికి ఇంతకుముందు వినయ్ పిడికిలి తెరువడానికి ట్రై చేసిన అదే వ్యక్తి వినయ్ చేతిని గట్టిగ పట్టుకొని ఉండడం చూసిన భవాని... హే ఎం చేస్తున్నావ్ అని అడిగింది భవాని.


ఆ మాటలకి లోపల ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి ... భవాని నీ చూసి ఎం మాట్లాడాలో అర్ధం కాక చూస్తూ ఉండిపోయాడు అతను.


అడుగుతుంది నిన్నే ఏం చేస్తున్నావ్ అని అడుగుతూ లోపలికి ఎక్కింది భవాని...


అది నేను అతని పల్స్ రేటింగ్ నీ చూస్తున్నాను అని తడబడుతూ చెప్పాడు ఆ వ్యక్తి.


నిన్ను చూస్తుంటే ఆలా కనిపించట్లేదు అని అనుమానంగా చూస్తూ అడిగింది భవాని.


దానికి కంగారు పడుతూ తన తప్పుని దాచుకుంటూ ఇంతకీ మీరెవరు అండి నన్ను అడగడానికి ఐనా మిమ్మల్ని ఈ అంబులెన్సు లోకి ఎవరు ఎక్కమన్నారు అని ఎదురు ప్రశ్న వేస్టు దబాయిస్తూ అడిగాడు ఆ వ్యక్తి.


అంతలో డ్రైవర్ అరుస్తూ.... ఓరేయ్ అబ్దుల్ తొందరగా రారా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పుడు నువ్వు ముందుకి రాకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను ఆతరువాత నీ ఇష్టం అని ముందు నుండి అరుస్తూ అన్నాడు డ్రైవర్.


డ్రైవర్ మాటలు విన్న అబ్దుల్ ... అది కాదన్నా ఈ అమ్మాయి బలవంతంగా లోపలికి వచ్చింది అడిగితే దబాయిస్తూ మాట్లాడుతుంది అని సమాధానం ఇస్తూ అన్నాడు అబ్దుల్ .


ముందు నువ్వు రారా బాబు అవతల అబ్బాయి ప్రాణం పోతుంటే మధ్యలో నీ గోల ఎంటి అని చిరాకు పడుతూ కోపంగా అన్నాడు డ్రైవర్...


అది కాదన్నా ఈ అమ్మాయి అని అంటున్న అంతలో డ్రైవర్ కోపంగా... చూడు ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అది ఒక్కటి చెప్పు అని సీరియస్ గా అరుస్తూ అడిగాడు డ్రైవర్.


డ్రైవర్ మాటల్లో ఉన్నా కోపాన్ని గ్రహించిన అబ్దుల్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు ఇప్పుడు సైలెంట్గా ఉండి టైం దొరికినప్పుడు ఆ చేతి గుప్పెట ని తెరిచి చూద్దాం అని మనసులో అనుకుంటూ... హా సరే అన్న నేనొస్తున్నాను అని అంటూ అంబులెన్సు దిగి ముందుకొచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు అబ్దుల్.


అబ్దుల్ బయటకి రాగానే వెంటనే డోర్స్ లాక్ చేసి వినయ్ దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉన్నాడా అని చూస్తూ తన చేతిని పట్టుకుంది భవాని.


మరో వైపు అబ్దుల్ ముందుకొచ్చి తన పక్కన వచ్చి కూర్చోగానే మరో క్షణం ఆలస్యం చేయకుండ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు డ్రైవర్.


సరిగ్గ పది నిముషాల తరువాత అంబులెన్సు హాస్పిటల్ కి చేరుకుంది..


ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హాస్పిటల్ స్థానికులు వెంటనే ఒక స్ట్రెచర్ తీసుకొచ్చి వినయ్ నీ దాని మీద పడుకోబెట్టి వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు ఒక డాక్టర్ ఇంకా ఇద్దరు వార్డ్ బాయ్స్.


వినయ్ నీ పూర్తిగా స్కానింగ్ చేసాక వెంటనే ఇతనికి ఆపరేషన్ చేయాలి లేకపోతే బ్రతకడు అని చెప్పారు ఇతనికి సంబందించిన వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే షూరిటీ సైన్ తీసుకొని ఐదు నిమిషాలలో ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకురండి అని చెప్పాడు ఒక డాక్టర్.. ఆ వెంటనే ఆ వినయ్ ని లోపలికి తీసుకొచ్చిన డాక్టర్, భవాని దగ్గరికి వెళ్లి మేడం మీరు తీసుకొచ్చిన వ్యక్తి కి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు ఆ డాక్టర్.


ఆపరేషన్ అన్న పదం వినగానే భవాని గుండెలో ఒక భయం పుట్టింది.


ఏంటి ఆపరేషనా అని కంగారు పడుతూ అంది భవాని.


హా మేడం అవును ఆపరేషన్ చేయాలి తన పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయకపోతే అతను బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు డాక్టర్ అని చెప్పాడు డాక్టర్.


ఆ...! మరి.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేయండి డబ్బు గురించి ఆలోచించద్దు వెంటనే చేసేయండి,... డబ్బు గురించి నాకొదిలేయండి నేను చూసుకుంటాను ఆ విషయం అని హామీ ఇస్తూ అంది భవాని.


అయ్యో మేడం విషయం డబ్బు గురించి కాదు మేడం... విషయం షూరిటీ గురించి...తనకి సంబందించిన వ్యక్తి కానీ లేదా కుటుంబ వ్యక్తి కానీ ఎవరొకరు షూరిటీ పేపర్స్ మీద సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్.... మీరు ఆ వ్యక్తి కి ఎం అవుతారు మేడం అని చెబుతూ అడిగాడు డాక్టర్.


ఆ... అని అంటూ ఒక నిమిషం ఎం చేయాలో తెలియని స్థితిలో ఆలోచిస్తూ అయోమయం లో పడిపోయింది భవాని...


అంతలో తన మనసు తన అదుపులో లేకుండా.... నేను తన భార్యని అని చెబుతూ ఆ సైన్ నేను చేస్తాను మీరు వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి అని అంటూ.... హామీ ఇచ్చింది భవాని.


ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే వార్డ్ బాయ్ తో షూరిటీ పేపర్స్ నీ తీసుకురమ్మని చేప్పి ఆపరేషన్ థియేటర్ కి బయలుదేరాడు అతను.


సరిగా ఒక నిమిషం తరువాత ఒక వార్డ్ బాయ్ వచ్చి... మేడం.... మేడం మిమ్మల్నే మేడం అని పిలుస్తూ పలకరించాడు ఆ వార్డ్ బాయ్...


వార్డ్ బాయ్ పిలిచిన పిలుపుకి తన ఆలోచనల నుండి వెంటనే బయటకు వచ్చి... హ ఎంటి ఏం అయ్యింది అని కంగారు పడుతూ అడిగింది భవాని.


ఈ పేపర్స్ మీద మీ సంతకం పెట్టండి మేడం అని చెబుతూ తన చేతిలో ఉన్న పేపర్స్ భవాని కి ఇచ్చాడు ఆ వార్డ్ బాయ్.


ఆ పేపర్స్ నీ తీసుకోని వెంటనే సంతకం పెట్టి తిరిగిచ్చేసి.... ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడిగింది భవాని.


అల్రెడీ డాక్టర్స్ అదే పనిలో ఉన్నారు మేడం... మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం మీ వారికి ఎం కాదు అని చెబుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వార్డ్ బాయ్.


డాక్టర్స్ హడావిడిగా పరుగులు తీస్తూ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళారు..


డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన సరిగ్గా రెండు నిముషాలు తరువాత చీఫ్ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసారు.


అంతలో భవాని గుండెలో భయం మరింత ఎక్కువ కావడం దైర్యం కోసం హాస్పిటల్ ఎదురుగా ఉన్నా విగ్నేశ్వరుడి గుడికి వెళ్ళింది భవాని.


భవాని ఆలా హాస్పిటల్ డోర్ దాటినా మరో క్షేణం ఒక పెద్ద బెంజ్ కార్ వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది.


అందులో నుండి ఒక నలభై తొమ్మిది వయసు గల ఒక మహిళ ఇంకా ఏబై మూడు సంవత్సరాలు గల ఒక పురుషుడు హడావిడిగా కార్ లో నుండి దిగి హాస్పిటల్ లోకి పరిగెత్తారు.


ఆలా లోపలికి వచ్చి రాగానే వెంటనే అక్కడ ఉన్నా రిసిప్షన్ నీ.... ఇదిగో అమ్మాయి ఇక్కడికోక ఆక్సిడెంట్ జరిగిన అబ్బాయిని తీసుకొచ్చారు అంటకదా ఎక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు అని కంగారు పడుతూ అడిగింది ఆ ఆంటీ.


అతనికి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తున్నారు నేరుగా వెళ్ళి మూడో రైట్ తీసుకుంటే రెండో గది ఆపరేషన్ రూమ్ వస్తుంది ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు అని చెబుతూ ఇంతకీ మీరెవరు అంది అని అడిగింది ఆ రిసిప్షనిస్ట్ అమ్మాయి.


వాడు మా అబ్బాయి.... అమ్మ నా కొడుకు వాడు అని చెబుతూ మరో క్షణం కుడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళారు.


వాళ్లిద్దరూ హడావిడిగా కంగారు పడుతూ పరుగులుతీస్తూ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళారు ఆలా వాళ్లు ఆ గది దగ్గరికి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ థియేటర్ లో నుండి ఒక డాక్టర్ ఇంకా ఒక నర్స్ బయటకి వస్తారు .... వెంటనే... ఒ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ తీసుకురా వెంటనే పెషేంట్ కి చాలా బ్లడ్ పోయింది అని చెబుతూ ఆర్డర్ వేశాడు డాక్టర్.


డాక్టర్ ఆర్డర్ విని నర్స్ వెంటనే ఒ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ నీ తీసుకురావటానికి వెళ్ళింది... అంతలో వినయ్ వల్ల తల్లి శాంభవి,...


డాక్టర్ మా అబ్బాయి కి ఇప్పుడెలా ఉంది డాక్టర్ అని కన్నీళ్లు కరుస్తూ కంగారు పడుతూ అడిగింది శాంభవి.


అతనికి మీరేం అవుతారమ్మ అని ఆ డాక్టర్ అడిగాడు.


వాడు మా ఒక్కగానొక అబ్బాయి అంది పేరు వినయ్ కుమార్ అని కన్నీళ్లు కారుస్తూ చెపింది.


చుడండమ్మా మీ అబ్బాయికి చాలా పెద్ద ఆక్సిడెంట్ జరిగింది లోపల ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడే మేమేం చెప్పలేము తన తలకి చాలా బలంగా దెబ్బ తగలడంతో బ్లడ్ చాలా పోయింది వెంటనే అతనికి బ్లడ్ ఎక్కించాలి మీరు అతని తల్లిదండ్రులు అంటున్నారు కదా మీలో ఎవరికైనా ఒ పాజిటివ్ బ్లడ్ ఉంటే చెప్పండి... అని అన్నాడు డాక్టర్.


కానీ డాక్టర్ నాకు షుగర్ ఉంది ఇప్పుడు నేను వాడికి బ్లడ్ ఇస్తే ఆ జబ్బు వాడికి కుడా వస్తుంది కదా డాక్టర్ పోనీ ఇంకెవరిదైనా బ్లడ్ అడగచ్చా అని చెబుతూ అడిగాడు వినయ్ తండ్రి అశోక్ కుమార్.


మా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఉంటుంది అక్కడ బ్లడ్ దొరికితే మీ అబ్బాయి కి ఏ ప్రమాదం ఉండదు ఒకవేళ లేకపోతే ఇక మీ అబ్బాయి నీ ఆ భగవంతుడే కాపాడాలి అని అంటూ పైకి చూసి ఆ భగవంతుడిని ప్రార్దించుకున్నాడు ఆ డాక్టర్.


ఇంతలో నర్స్ వచ్చి... సార్ సోరి సార్ బ్లడ్ బ్యాంకులో మీరు అడిగిన బ్లడ్ స్టాక్ లేదంట సార్ అని టెన్షన్ గా సమాధానం ఇచ్చింది నర్స్.


అది విన్న డాక్టర్... వాట్ ఎం మాట్లాడుతున్నారు మీరు నిన్ననే గా ఒ పాజిటివ్ బ్లడ్ తో నాలుగు బాటిల్స్ వచ్చాయి మరి ఇప్పుడు లేదంటారేంటి అని సీరియస్ గా అడిగాడు డాక్టర్.


సార్ ఈరోజు మార్నింగ్ జూబ్లీహిల్స్ లో ఉన్నా మన మరో బ్రాంచ్ కి అర్జెంట్ గా ఒ పాజిటివ్ బ్లడ్ కావాలి అంటే అక్కడికి పంపించారు సార్ అని భయపడుతూ సమాధానం ఇచ్చింది ఆ నర్స్.


ఓహ్ షిట్ మాన్ మరి ఇప్పుడు అతని పరిస్థితి ఎంటి అని కంగారు తో కూడిన కోపంతో అరుస్తూ అడిగాడు డాక్టర్.


ఇదంతా చూస్తున్నా అశోక్ కుమార్.... చూడండి డాక్టర్ మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తాను కావాలంటే విదేశాల నుండి పెద్ద పెద్ద డాక్టర్స్ ని రప్పిద్దాం కానీ ఎలాగైనా సరే దయచేసి నా కొడుకుని మాత్రం కాపాడండి అని చెబుతూ తన రెండు చేతులని జోడించి కన్నీళ్ళు కారుస్తూ వేడుకుంటూ అడిగాడు వినయ్ తండ్రి అశోక్ కుమార్..


చూడండి సార్ మీరు ఈ ప్రపంచంలో మీ అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్లిన వాళ్లు కుడా ఒక్కటే మాట అంటారు అతనికి మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ లేనిదే ఆపరేషన్ ఎవరు చేయరు సార్ అని చెబుతూ హాస్పిటల్లో ఎవరైనా మీ అబ్బాయికి ఉన్నా బ్లడ్ గ్రూప్ ఉందొ ఓసారి కనుక్కొని చెప్తాను అని అంటూ తన పక్కనే ఉన్న నర్స్ కి విషయం చేప్పి ... ఎవరైనా ఒ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపించాడు డాక్టర్.


డాక్టర్ చెప్పిన మాటలు విన్న శాంభవి అయ్యో భగవంతుడా నా బిడ్డకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావ్ తండ్రి వాడేం తప్పు చేసాడు అని తన తల్లీ మనసుతో కన్నీళ్లు కారుస్తూ ప్రశ్నిస్తూ ఏడస్తుంది శాంభవి.


నువ్వేం కంగారు పడకు మన బిడ్డకి ఎం కాదు నేనుండగా వాడికేం కానివ్వను అంటూ ఓదారుస్తూ దైర్యం చెబుతూ కన్నీళ్లు కారుస్తూ అన్నాడు అశోక్ కుమార్.



               కొనసాగుతుంది






Rate this content
Log in

Similar telugu story from Drama