kishorekumar RD

Action Crime Inspirational

4  

kishorekumar RD

Action Crime Inspirational

త్రిశూల్-I _సైనికుల పోరాటం

త్రిశూల్-I _సైనికుల పోరాటం

77 mins
199


”మన జీవితంలో మనకి చాలా మంది రోల్ మోడల్స్ ఉండవచ్చు. కానీ ఒక సైనికుడికి, అతని రోల్ మోడల్ ఎల్లప్పుడూ తన దేశం కోసం పోరాడే మరొక సైనికుడే నిజమైన రోల్ మోడల్.


           చాప్టర్ I: ది బిగినింగ్ఈ కథ చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 

భారతదేశంపై ద్వేషంతో జీవించే కుటుంబంలో ఫైజల్‌ అనే ఒక క్రూరుడు పుట్టాడు. అతను ఒక మొరాకో నివాసి.

భారతదేశం & పాకిస్తాన్ విడిపోయిన సమయంలో ఫైజల్ యొక్క తాత తన కుటుంబాన్ని మరియు ఆస్తిని కోల్పోయి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఫైజల్ తాత భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వెళ్లిన తొలినాళ్లలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్తాపత్రికను ప్రారంభించాడు.

ఆ వార్తాపత్రిక పేరు "J & K". పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) పాకిస్తాన్‌లో భాగమని వార్తలను రాయడం మరియు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రచురించడం ఆ వార్తాపత్రిక యొక్క ప్రధాన లక్ష్యం.

కానీ మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఊహించని కారణాల వల్ల ఆ పేపర్ ప్రెస్ మూతపడింది, ఫైజల్ తాత తన వార్తాపత్రికను మూసివేయడానికి భారత ప్రభుత్వమే కారణమని గట్టిగా నమ్మాడు. అతనికి అక్కడ కూడా అన్ని అడ్డంకులే అని భావించిన తరువాత ఫైజల్ తాత కుటుంబం పాకిస్తాన్ వదిలి మొరాకో వెళ్లింది, వారి బంధువులు అక్కడ బాగా స్థిరపడ్డారు.

ఇఫ్తికార్ (ఫైజల్ తాత) ఫైజల్ చిన్నతనం నుండి భారతదేశం & పాకిస్తాన్ విభజన గురించి, అక్కడ ఏం జరిగిందో మరియు భారతదేశంలో వారు కోల్పోయిన వాటిని అతనికి చెప్పేవారు. ఇఫ్తికార్ ఎప్పుడూ భారతదేశం గురించి తనకున్న తప్పుడు అభిప్రాయాన్ని వారికీ నూరిపోశాడు .

ఈ మాటలు ఫైజల్ మనసును విషపూరితం చేశాయి, ఆ విషం భారతదేశంపై మాటల్లో చెప్పలేని ద్వేషాన్ని కలిగించింది.

ద్వేషంతో నిండిన వ్యక్తి చనిపోయే వరకు వినాశనాన్ని మాత్రమే కోరుకుంటాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత, మొరాకోలో జరిగిన కారు ప్రమాదంలో ఫైజల్ తల్లి మరియు తండ్రి మరణించారు. ఆ తర్వాత ఫైజల్‌కు ఇఫ్తికార్‌ సర్వస్వం అయ్యాడు. 

అతనే ఫైజల్ యొక్క గురువు, తండ్రి మరియు తల్లి, అన్ని అయ్యాడు. తాత మాటలు ఫైజల్ బలంగా నమ్మేవాడు.

వయసుతో పాటు భారత దేశంపై ఫైజల్‌కు ద్వేషం కూడా పెరిగింది.

కొన్నిరోజులకి ఇఫ్తికార్ కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఫైజల్‌ను చూసుకోవడానికి ఎవరూ లేరు.

అతను తన చిన్న వయసులోనే చాలా మరణాలు చూశాడు. కారు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చాలా బాధలో ఉన్నాడు, బాగా ఏడ్చాడు. కానీ అతని తాత చనిపోయినప్పుడు మాత్రం అతను చాలా కోపంగా, అంతుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు.

పగ, ద్వేషం, కోపం తప్ప అతనికి మిగిలింది ఏమీ లేదు. అతను ప్రతీకారం తీర్చుకోవటానికి అవకాశాన్ని ఇచ్చే మార్గం కోసం వెతకడం ప్రారంభించాడు.

కొన్ని నెలల తర్వాత ఫైజల్ ఉగ్రవాద సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నాడు.

ఊహించిన విధంగా, అతను చాలా తక్కువ సమయంలో ఒక తీవ్రవాద సంస్థతో పని చేయడం చేయడానికి అవకాశం వచ్చింది. 

చేరిన కొద్ది రోజులకే అతని పని తీరు అక్కడ ఉన్న టెర్రరిస్టు నాయకులందరికీ నచ్చింది. మెల్లమెల్లగా గ్రూప్ నాయకుల నుంచి నమ్మకం తెచ్చుకున్నాడు.

కొన్ని నెలల తర్వాత, అతని పనితీరు నచ్చి అతణ్ణి పాకిస్తాన్‌లోని క్రియాశీల ఉగ్రవాద గ్రూపులతో కలిసి పని చేయడం కోసం పంపించారు.

అతడు వారితో & వారి కోసం చాలా కాలం పనిచేశాడు. అతను చాలా క్రూరమైన మరియు వ్యూహాత్మకమైన వ్యక్తి & అతను ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా, అనుకున్న సమయంలో జరిగి తీరాలి, లేదంటే దాని పర్యవసానాలు ఊహించని రీతిలో ఉంటాయి. 

అక్కడ అతను అంటే నచ్చని వారు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అతని వ్యూహాలు తిరస్కరించేలా చేశారు. ఫైజల్ కి అది నచ్చలేదు, కానీ మొదట్లో చూసి చూడనట్టు వెళ్ళిపోయా.

టెర్రరిస్ట్ లీడర్లలో ఒకరు (ముస్తాక్) ఎప్పుడూ ఫైజల్‌ను సమస్యలలోకి లాగుతూ ఉండేవాడు. ఫైజల్ ఇదంతా ఓపికతో చూశాడు, కానీ ఒక సందర్భంలో ముస్తాక్ కారణంగా ఫైజల్ వ్యూహం ఆమోదం పొందకుండా తిరస్కరించబడింది. 

అది ఫైజల్‌కి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.

ముస్తాక్ దానికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాడు, ఫైజల్‌ అతణ్ణి అతి దారుణంగా చంపాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ముస్తాక్ & అతని అనుచరుల మృతదేహాలు ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు.

అతను ఎంత క్రూరమైన, ప్రమాదకరమైనవాడో అప్పుడే ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు మరియు వారిలో కొందరు ఆ వైఖరిని చూసి చూడనట్టు వదిలేసారు.

అయితే ఫైజల్‌ అనుకున్న పనులు అనుకున్న సమయానికి అక్కడ పూర్తి కాకపోవడంతో సొంతంగా ఓ ప్రైవేట్ ఉగ్రవాద సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

అతనికి వచ్చిన ఆ ఒక్క ఆలోచన ఎంత పెద్ద మారణకాండ చేయబోతుందో ఎవరికీ తెలియదు. తను అనుకున్నది అధిగమించేందుకు అతను ఎంతో మందిని దారుణంగా చంపేశాడు. 

ఉగ్రవాద సంస్థను ప్రారంభించేందుకు అవసరమైన నిధులు సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు ఫైజల్ ప్రారంభించాడు. వివిధ ఉగ్రవాద సంస్థల నేతలతో సమావేశమయ్యాడు.

అతను మొదటి నుంచి వివిధ తీవ్రవాద సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు మరియు అతని పనిపై వారికి నమ్మకం ఉంది.

కొన్నిరోజులకి కొంత మంది ఫైజల్ వద్దకు నిధులు, ఆయుధాలు ఇచ్చేందుకు రాగా, వారితో కలిసి పనిచేయడానికి ఓకే చెప్పారు. అయితే ఫైజల్ ముందు ఓ షరతు అయితే పెట్టారు.

ఆ షరతు ఏమిటంటే?

ఫైజల్ ముందు భారత దేశం మీద దాడి చేసి తనను తాను నిరూపించుకోవాలి. 

వారు ఫైజల్ సామర్థ్యాలను పరీక్షించాలని అనుకున్నారు, ఏదైనా తప్పు జరిగితే ఫైజల్ ఇరుక్కుంటాడు, ఒకవేళ అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే మరొక క్రూరమైన ఉగ్రవాద నాయకుడు వారి జాబితాలో చేరుతాడు. తను కోరుకున్నది పొందాలంటే అది చేసి తీరాలని అతనికి బాగా తెలుసు. అతను కూడా అదే కోరుకున్నాడు. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసాడు.

దాడికి కావాల్సిన ఆయుధాలు, నిధులు అన్నీ ఇచ్చారు. ఆ మందుగుండు సామగ్రితో అతను ఒక ఆర్మీ క్యాంపుపై దాడి చేయవచ్చు. ఆ తర్వాత ప్లానింగ్ లో చాలా బిజీ అయిపోయాడు.

నాణేనికి ఎల్లప్పుడూ రెండు వైపులు ఉంటాయి.

ఫైజల్ ఇక్కడ కూడా అదే చేసాడు. ఒక ముఖం, అతను ప్రపంచాన్ని ముఖ్యంగా భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న అసలు రూపం. ప్రపంచానికి కనిపించని ఫైజల్ ముఖం ఇది. మరోవైపు, బయటి ప్రపంచం దృష్టిలో అతను సాధారణ వ్యక్తి. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.       


అధ్యాయం II: హేమంత్ & సుభాష్ పరిచయం.

చెడు ఉంటే, దాని తల తన్నడానికి మంచి కూడా ఉంటుంది.

మేజర్ హేమంత్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్.

అతను కుటుంబానికి సైన్యంలో చేరడం ఇష్టం లేకపోవడంతో తన సొంత కుటుంబం నుంచి విడిపోయి సైన్యంలో చేరాడు. .

హేమంత్ తండ్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి జమీందార్. హేమంత్ చిన్నప్పుడే తల్లి చనిపోయింది. హేమంత్ ఆర్మీలో చేరడం అతని తండ్రికి ఇష్టం లేదు.

అందుకే ఇల్లు వదిలి, ఆర్మీనే తన ఇల్లు అనుకోని వచ్చేసాడు. అప్పటి నుంచి మళ్లీ అక్కడికి వెళ్లలేదు. అతని కుటుంబం గురించి భయుంగ్ కి తప్ప సైన్యంలో ఎవరికీ తెలియదు.

మేజర్ హేమంత్ చాలా తెలివైనవాడు మరియు అతని ప్రణాళిక మరియు అమలు చేసే పద్ధతి అంతా విభిన్నంగా ఉంటాయి, అన్నిట్లో చాలా కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, వెనకడుగు వేసే ఆలోచనే ఎప్పటికీ రాదు అతనికి. అతను ఒక మిషన్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. అతి తక్కువ కాలంలోనే ఆర్మీలో మేజర్‌ స్థాయికి ఎదిగాడు.

కానీ సమస్య ఏమిటంటే కొన్నిసార్లు అతను తన పై అధికారుల ఆదేశాలను పాటించకుండా మిషన్లను పూర్తి చేసేవారు. ఈ తరహా విధానం వల్ల చాలా సందర్భాల్లో సస్పెండ్‌ అయ్యాడు.

హేమంత్ గురించి అంతగా తెలియని వారు చాలా మొండివాడు, రూల్స్ పాటించడు అనుకుంటారు. 

అతని గురించి బాగా తెలిసిన వారు అతన్ని "ఘోస్ట్" అని పిలుస్తారు". నిజానికి ఇది అతని మొదటి ఆపరేషన్ సమయంలో అతని కోడ్ పేరు.

అతనికి ఒక స్పెషల్ టీం ఉంది , వాళ్ళతో అతను అనేక ఆపరేషన్స్ పూర్తి చేశాడు. 

హేమంత్ బాధపడ్డా.. సంతోషించిన, దానికి కారణం ఏంటో అతని టీం కి తెలిసిపోతుంది.

"భయుంగ్ " ఆ టీంలో హేమంత్‌కి సన్నిహిత మిత్రుడు మరియు ఇద్దరూ ఒకేసారి సైన్యంలో చేరారు. 

భయుంగ్ మిజోరాం రాష్ట్రంకి చెందిన ఒక అటవీ తెగకు యువరాజు, అతను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం కోసం సైన్యంలో చేరారు.

ఒకప్పుడు భారత సైన్యం చేసిన సహాయానికి ప్రతిఫలంగా తన కొడుకు భారత సైన్యంలో చేరుతాడని భయుంగ్ తండ్రి చాలా కాలం క్రితం ప్రమాణం చేశారు.

ఆ హామీని నెరవేర్చేందుకు భయుంగ్ సైన్యంలో చేరాడు. హేమంత్‌తో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని వ్యక్తి. ఎక్కువగా తను నేర్చుకున్న కోడ్ భాషను (సంకేతాలు) ఉపయోగిస్తాడు.

మరియు అతని వద్ద అతని తండ్రి ఇచ్చిన కత్తి ఉంది. ఇది చాలా అరుదైన లోహంతో తయారు చేయబడింది, పదునైన అంచు కలిగి ఉంటుంది మరియు చాలా సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. అలాగే దానిపై వారి తెగకు సంబంధించిన కొన్ని రాతలు కూడా ఉన్నాయి. కత్తి ఈటెలాగా, చాలా పొట్టిగా, చిన్న హ్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఆ కత్తికి ఒక బటన్ ఉంది. దాని ద్వారా కత్తిని బయటకి తీయవచ్చు. 

భయుంగ్ విల్లును కూడా ఉపయోగిస్తారు. వాటిని వాడేందుకు ఆర్మీ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

వారు చేసిన ప్రతి మిషన్ విజయవంతమైంది. హేమంత్ టీం కి సాటిలేని ట్రాక్ రికార్డ్ ఉంది.

హేమంత్‌ను హతమార్చాలి అనుకుంటున్నా ఉగ్రవాదుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.

మన కర్తవ్యం దేశభక్తి అయితే, దేశద్రోహుల ప్రతి అడుగు, ప్రతి ఆయుధం మన మరణాన్ని కోరుకుంటాయి.

కొన్ని రోజుల తర్వాత హేమంత్ టీమ్‌కి అనుకోని సంఘటన ఒకటి ఎదురైంది. ఒక ఉగ్రవాద ముఠా హేమంత్‌ టీంలో ఒకరిని కిడ్నాప్ చేసింది. అది మేజర్ హేమంత్ బృందం పై ప్రతీకారం తీర్చుకోవటానికి చేసిన చర్య.

సైనికుడిని కిడ్నాప్ చేయడం వారి మొదటి తప్పు, ఇదంతా హేమంత్‌కి ఫోన్ చేసి చెప్పడం పెద్ద తప్పు.

కాల్‌లో ఖాసిం (ఉగ్రవాద నాయకుడు): "నేను నిన్ను సవాలు చేస్తున్నాను,

నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని కనుగొని మీ సహచరుడిని రక్షించుకో, నీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను, నువ్వు 24 గంటల్లో అతణ్ణి కాపాడుకోలేకపోతే మీ స్నేహితుడిని నేను చంపేస్తా"

హేమంత్ ఇలాంటి కాల్స్ & పరిస్థితులకు భయపడే వ్యక్తి కాదు


హేమంత్:  నువ్వు మా సైనికుడిని వదిలేసి పారిపోవడానికి నేను కూడా ఒక గంట సమయం ఇస్తున్న, లేదంటే అక్కడ ఎవరు ఉండరు. 

ఖాసిం: దమ్ముంటే ముందు నీ స్నేహితుడిని ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి కాపాడుకో. 

హేమంత్: "If you think you are playing a game with me, let me tell you one thing, I am not the game you want to play. I am the game you never want to be a part of. It's a death game".

ఆ మాటలకు తీవ్రవాద నాయకుడికి కోపం వస్తుంది.

ఖాసిం : "నేను మీ సహచరుడిని మరియు మీ జట్టు మొత్తాన్ని చంపబోతున్నాను, ఇది గుర్తుంచుకో" అని బెదిరించాడు.

దానికి హేమంత్ : “I don't mind if you kill me, But I mind if you miss. And I won't give you a chance to regret that."

హేమంత్ మాటలకు ఖాసిం కోపంతో తన దగ్గర బందీగా ఉన్న సైనికుడి కాలుపై కాల్చి ఫోన్ కట్ చేశాడు. ఖాసిం తమ పాపాలకు మూల్యం చెల్లించుకోవడానికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఊహించలేకపోయాడు.

ఉగ్రవాదుల స్థావరాన్ని కనిపెట్టేందుకు ఆర్మీ ఇంటెలిజెన్స్ కసరత్తు చేస్తోంది. ఉగ్రవాదులు కిడ్నాప్ జరిగిన ప్రదేశం నుండి చాలా దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో దాక్కున్నారు.

హేమంత్ కిడ్నాప్ జరిగిన లొకేషన్ నుంచి తన దర్యాప్తు ప్రారంభించారు, అక్కడ ఉన్న క్లూస్ ఆధారంగా అతణ్ణి తీసుకెళ్లిన మార్గాన్ని కనుగొంటాడు. నిఘా బృందం సీసీ కెమెరాలతో తనిఖీలు చేస్తుంది. హేమంత్ తన స్థానిక నెట్‌వర్క్ ద్వారా వారు కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును కనుగొన్నాడు. ఆ క్లూ నుంచి అతడు ఉగ్రవాదుల దాక్కున్న ఏరియా ని సర్కిల్ చేశారు. అది లోయ ప్రాంతం, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రదేశం.

సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లడం అసాధ్యం.

హేమంత్ తన రాయల్ ఎన్ఫీల్డ్ (250 ccటైప్ 11F_1939 ప్రపంచ యుద్ధం 2 మోడల్) మరియు అతని రాంబోతో పాటు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆర్మీలో చేరినప్పటి నుంచి ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తన వద్దే ఉంచుకున్నాడు.

హేమంత్ తన కుక్క (రాంబో) సహాయంతో టెర్రరిస్టుల ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుక్కున్నారు. అదే సమాచారం బేస్ స్థానానికి పంపించారు. బ్యాక్ అప్ టీం అక్కడికి వచ్చే వరకు కొంత సమయం వేచి ఉండాలని ఆదేశించారు.

అయితే టీమ్‌ని అక్కడికి పంపక ముందు హేమంత్ రంగంలోకి దిగేసారు. ఆ ప్రదేశం అంతా చీకటిగా ఉంది.

తెల్లటి పొగమంచు చుట్టూ ఉంది. రాంబో బందీగా ఉన్న సైనికుడిని గుర్తించి . సంకెళ్లను విప్పింది, హేమంత్ రాంబోకి అన్ని నేర్పించారు. 

చీకటి, తెల్లటి పొగమంచు, అక్కడే ఒక దగ్గర కొంతమంది మంట వేసుకొని ఉన్నారు. ఒకటేసారి ఆ మంటలో నుంచి కొన్ని బుల్లెట్స్ వాళ్ళకి తగిలాయి, ఆలోచించుకునే సమయంలోనే ఆ మంటలోనుంచి హేమంత్ వాళ్ళ మీదకు దూకాడు. హేమంత్ మెరుపు వేగంతో ఒక్కొక్కరిని మట్టుపెడుతూ ముందుకు వెళ్లారు, వారు అతని వేగాన్ని అంచనా వేయాలకపోయారు. మేజర్ హేమంత్ తన పనిని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసాడు, వారి నాయకుడు ఖాసీంని తప్ప అందరిని చంపేశారు. 

ఖాసిం తన గుడారంలో ఉన్నాడు. ఖాసిమ్‌కి తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు, అంతా త్వరగా అయిపోయింది. బయటకు వచ్చేసరికి అందరూ చనిపోయారు. అందరూ చనిపోవడం చూసి ఖాసిం తనలోని భయాన్ని దాచుకోలేక పోయాడు.

అప్పుడే అతని ఎదురుగా హేమంత్ వచ్చాడు. ఖాసిం కళ్ళలో భయం రెట్టింపయింది.

ఖాసీం తన లోపల ఉన్న భయాన్ని దిగమింగుతూ హేమంత్ ముందు ఒక సవాలు ఉంచాడు.  

"ఎలాంటి ఆయుధం లేకుండా నాతో పోరాడు". 

హేమంత్ నవ్వి సరే అన్నాడు. హేమంత్ తన ఆయుధాలను విసిరేశాడు.

ద్వంద్వ పోరు మొదలైంది.

హేమంత్ కష్టపడకుండానే ఖాసీం లోపల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు, హేమంత్ వ్యూహాల ముందు ఖాసీం నిలబడలేకపోయాడు. నిమిషం కాకుండానే, ఖాసీంకి అర్ధం అయింది అతని మీద ఇలా కూడా గెలవలేము అని. 

ఖాసిం భయంతో అరిచాడు ' 'నన్ను వదిలేయండి' 'నన్ను వదిలేయండి, అని. హేమంత్ ఖాసిం నుండి వెనక్కి నడిచాడు. హేమంత్ గాలిలోకి బుల్లెట్ పేల్చాడు. అది చూసి ఖాసిం సంతోషించాడు. హేమంత్ తనను క్షమించాడని అనుకున్నాడు.

హేమంత్ మాట్లాడుతూ: ”కనీసం వచ్చే జన్మలోనైనా మరణానికి మళ్లీ కాల్ చేయవద్దు”.

ఖాసింకి అర్థం కాలేదు.

హేమంత్ అప్పుడు రాంబోని పిలుస్తారు, రాంబో దాడి చేసి ఖాసిమ్‌ని చంపేస్తుంది. అక్కడి నుంచి హేమంత్ బందీగా ఉన్న సైనికుడితో కలిసి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. .

ఈసారి కూడా హేమంత్ ఆదేశాలను పాటించకుండా ఒంటరిగా వెళ్లారు. అతని సొంత నిర్ణయం పట్ల ఉన్నతాధికారులు కోపంగా ఉన్నారు. ఈ రకమైన విధానం కారణంగా అతను సైన్యం నుండి కొన్ని రోజులు సస్పెండ్ చేయబడ్డాడు, ఇది హేమంత్‌కి, అతని పై అధికారులకు కొత్త కాదు.


ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర “సుభాష్”.

సుభాష్ కుటుంబం వైజాగ్ నగరంలో ఉండేది. సుభాష్ తండ్రి నిర్మాణ సంస్థ యజమాని. వీరికి వైజాగ్, హైదరాబాద్‌లో చాలా ఆస్తులున్నాయి. దురదృష్టవశాత్తు సుభాష్ చిన్నప్పుడు, అతని తల్లి మరియు తండ్రి ఇద్దరు కారు ప్రమాదంలో మరణించారు.

తల్లిదండ్రుల మరణానంతరం సుభాష్ తన బంధువుల వద్ద ఉండేందుకు ఇష్టపడలేదు. ముఖ్యంగా అతను తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు.

తన దగ్గర నుంచి అన్ని తీసుకున్న దేవుడు కనీసం అతనికి మంచి స్నేహితుడిని అయితే ఇచ్చాడు. అతని పేరు అజయ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.

అజయ్ ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎథికల్ హ్యాకర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతరుల జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల హ్యాకర్ అయ్యాడని సుభాష్ ప్రతిసారీ అజయ్‌ని ఆటపట్టించేవాడు.

సుభాష్ ఇండియన్ ఆర్మీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి దేశం పట్ల ఉన్న అపార గౌరవం కారణంగా సైన్యంలో చేరాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి అతను ఎప్పుడూ తన దేశానికి సేవ చేయాలని కోరుకుంటాడు.

సుభాష్ తండ్రి సైన్యంలో చేరేందుకు ప్రయత్నించినా కుదరలేదు.

అతను సైన్యంలో ఎందుకు చేరలేదో అతని తండ్రి అతనికి చెప్పేవారు. ఆ కథలు సుభాష్ మనసులో బలంగా నాటుకుపోయాయి.

సైన్యంలో చేరడానికి "బలమైన సంకల్పం" ఉంటే సరిపోదు, సరైన వ్యాయామం చేయాలి మరియు అన్ని కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా శరీరాన్ని & మనస్సును సిద్ధం చేసుకోవాలి!!

సుభాష్ అన్ని అంశాల్లో తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడు .

సుభాష్ తెల్లవారుజామున వైజాగ్ బీచ్‌లో ప్రతిరోజూ 10కిమీలు పరిగెత్తేవారు & స్ట్రెచింగ్‌లు చేసేవారు. సుభాష్ అనేక సార్లు నేవీ సీల్ బృందంతో ఉదయం జాగింగ్ చేసేవారు. సుభాష్ వారి దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. వారు అతనికి అనేక అంశాలలో మెళకువలు నేర్పించారు, ముఖ్యంగా అండర్ వాటర్ బ్రీతింగ్. 

అజయ్ కూడా అతనితో పాటు వచ్చేవాడు, కానీ 1km వరకు మాత్రమే.

నిజానికి సుభాష్ భారత సైన్యంలో చేరడం అజయ్‌కి ఇష్టం లేదు. ఆ విషయం సుభాష్‌కి కూడా తెలుసు, అప్పుడప్పుడు ఇద్దరూ చర్చించుకునేవారు.

కొన్ని రోజుల తర్వాత, సుభాష్ ఎంపిక అయినట్టు సంబంధిత అధికారుల నుండి లెటర్ అందుకున్నాడు, దరఖాస్తు ప్రక్రియలో అతను IMA ఎంచుకున్నాడు. సుబాష్ ఆ ఉత్తరాన్ని చూసి చాలా సంతోషించి, తన మిత్రుడు అజయ్‌ని కౌగిలించుకున్నాడు. సుభాష్ కల నెరవేరినందుకు సంతోషించిన అజయ్, ఆర్మీలో చేరితే సుభాష్ కి ఏమైనా అవుతుందా అని లోలోపల భయాందోళనకు గురయ్యారు.

కొన్ని రోజుల తర్వాత సుభాష్ వెళ్ళే రోజు రానే వచ్చింది. అదే రోజు ఉదయం ఇద్దరూ జాగింగ్‌కి వెళ్లారు.

జాగింగ్ చేస్తున్నప్పుడు అజయ్ తన మనసులో ఏముందో సుభాష్‌కి స్పష్టంగా చెప్పాడు.

అజయ్: “నువ్వు ఇప్పుడు ఆర్మీలో చేరడం అవసరమా? నువ్వు ఇక్కడ ఉండి మామూలు ఉద్యోగం చేసుకోలేవా? మీ నాన్నకి సంబంధించిన బిజినెస్ కూడా ఉంది. ఆర్మీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అక్కడ నీకు ఏదైనా జరిగితే ఏమవుతుంది?”

ఆ సమయంలో సుభాష్ జాగింగ్ చేస్తుండగా, సింపుల్ గా నవ్వుతూ సమాధానమిస్తాడు

అజయ్ తన ప్రశ్నలు ఆపలేదు. “నువ్వు ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు?బిజినెస్ ఇష్టం లేకపోతే, నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. సైన్యంలో ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో తెలుసా”

అజయ్‌కి కొంచెం కోపం వచ్చి “యుద్ధం వచ్చి నీకు ఏదైనా జరిగితే? బహుశా ఆ సమయంలో మృతదేహాన్ని మోయడానికి ఎవరు ఉండకపోవచ్చు.

సుభాష్ జాగింగ్ ఆపి, వాకింగ్ చేస్తూ అజయ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు.

“నాకు ఆర్మీ అంటే ఎంత ఇష్టమో, నా ఆశయం ఏమిటో మీకు బాగా తెలుసు!

అన్నీ తెలిసిన తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నావు రా ?

నాలో ధైర్యం నింపు, భయాన్ని కాదు. 

నీకు బాగా తెలుసు, నేను జీతం కోసం సైన్యానికి వెళ్లడం లేదు అని. సైన్యంలో పని చేయడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే.

చాలా మంది ఆర్మీలో ఉద్యోగం అంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు అనుకుంటారు.  కానీ సైనికుడికి సైన్యమే ప్రాణమని ఎవరికీ తెలియదు. 

ఆర్మీ అనేది ఉద్యోగం కాదు, ఒక జీవన విధానం.

ఈ భూమి మీద నా గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించేది నువ్వేనని నాకు బాగా తెలుసు. నీ భయమేమిటో కూడా నాకు తెలుసు.

నీలో ఉన్న భయం, నీ మనుసుకి బాగా తెలిసిన ఒక విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది, ఆ హృదయానికి నా ఆనందం, నా ఆశయం గురించి తెలుసు.

ఈ దేశంలో రెండు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అందరి అడుగులు రెండడుగులు వెనక్కి వెళ్తాయి.

1. వ్యవసాయం, 2. సైన్యం.

వ్యవసాయం చేసే రైతు లేకుండా ఏ దేశం ఆరోగ్యంగా ఉండదు

& దేశం కోసం పోరాడే సైనికులు లేకుంటే ఏ దేశం ప్రశాంతంగా ఉండదు

లాభం చూడకుండా ఈ ప్రపంచంలో చేసే రెండే రెండు ఉద్యోగాలు వ్యవసాయం, ఆర్మీ!!

కానీ అందరూ "ఈ పని ఎందుకు" అని అడుగుతారు.

నేను సైన్యంలో చనిపోతే?

ప్రతి సైనికుడు ఈ యూనిఫాంలో ఉన్నప్పుడు చనిపోవడానికి ఇష్టపడతారు.

సైనికుడిలా చనిపోవడం కంటే గొప్ప మరణం లేదు.

ఒక సైనికుడికి ఈ ఉద్యోగం ద్వారా లభించే గౌరవం, సంతృప్తి, గౌరవం ప్రపంచంలోని ఏ ఉద్యోగం నుండి పొందలేరు ”

ఎట్టకేలకు సుభాష్ మాటల్లోని లోతు అజయ్‌కి అర్థమైంది. అప్పటిదాకా సుభాష్ కి ఏమవుతుందోనని భయపడిన అజయ్ ఇప్పుడు తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడు.

అతను సుభాష్‌ని గట్టిగా కౌగిలించుకుని, “సారీ మిత్రమా” అని చెప్పి, 

సరదాగా ”నీ జాగింగ్ ఇంకా అయిపోలేదు అనుకుంటే కొనసాగించు. నువ్వు ట్రైన్ క్యాచ్ చేయాలి . ఆలస్యం చేయకు” (అంటే అజయ్ వెళ్ళడానికి అంగీకరించాడు).

"ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ రక్షించడానికి ఒక హీరో కావాలి, కానీ అదే హీరో వారి ఇంటి నుండి వస్తాడని ఎవరూ అంగీకరించరు..నేను కూడా అలానే ఉన్నాను తనలో తానే అనుకున్నాడు అజయ్.

తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. సుభాష్ అన్నీ సర్దుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో సుభాష్ పేపర్లు అజయ్ చేతిలో పెట్టి సంతకం చేయమని అడిగాడు. అతను సంరక్షకుడిగా సంతకం చేస్తారు. 

సుభాష్ క్యూట్ గా నవ్వాడు, నువ్వు సంతకం చేశావు, పెద్దవాడివి అయ్యావు అని .

ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం, ఒకరిపై ఒకరికి ఉన్న దృఢమైన నమ్మకం వాళ్ల కళ్ళలో కనిపిస్తోంది, ఆ క్షణం చెరగనిది.

అజయ్, సుభాష్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి అతన్ని రైలు ఎక్కించారు. సుభాష్ వెళ్ళే ముందు వాళ్ళు చిన్నగా కబుర్లు చెప్పుకున్నారు.

సుభాష్ రైళ్లు బయలుదేరిన తర్వాత, అజయ్ మనసులో అప్పుడే

“ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు, ఒకరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేశం కోసం తన ప్రాణాలను అర్పించే సైనికుడు, మరొకరు అదే సైనికుడి మరణానికి సోషల్ మీడియాలో RIP పోస్ట్‌లు, పోస్ట్ చేసి తమ పని అయిపోయింది అని భావించే వారు.

నా స్నేహితుడు మొదటిదాన్ని ఎంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను, నేను రెండవ రకానికి చెందినవాడిని అవుతానేమో అని భయపడుతున్నాను."

సుభాష్ IMA డెహ్రాడూన్‌లో చేరాడు, అక్కడ అతను చాలా నేర్చుకున్నాడు. సుబాష్ చాలా మంది ప్రతిభావంతులైన సైనికులను & దేశభక్తి నిండిన భవిష్యత్ అధికారులను కలుసుకున్నారు, అక్కడ అతనికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతను ఎప్పటికీ మరచిపోలేడు.

కొన్ని రోజుల తర్వాత, అతని శిక్షణ ముగిసింది.



                అధ్యాయం III: శత్రు స్థావరాల పై మీద దాడి. 

పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ RAW ఏజెంట్ నుండి భారత సైన్యానికి ఒక క్లాసిఫైడ్ ఇంటెల్ వచ్చింది.

దాని సారాంశం ఏమిటి అంటే??

ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేయడానికి పథకం రచించారు. దానికి సంబంధించిన ఫోటోలు (లాంచ్ ప్యాడ్‌లు, ఆయుధాలు) కూడా అందాయి.

భారత సైన్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది మరియు సుదీర్ఘ చర్చ తర్వాత అందరూ కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

టెర్రరిస్టులందరినీ చంపడానికి మరియు వారి ఆయుధాలు & లాంచ్ ప్యాడ్‌లను కూడా ధ్వంసం చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు.

అంతా సెట్ అయినట్లుంది. కానీ ఆ పనిచేయడానికి ఒక బృందం అవసరం మరియు ఈ ఆపరేషన్ కోసం అత్యంత ఖచ్చితమైన సైనికులు అవసరం.

చర్చల తర్వాత, అందరూ మేజర్ హేమంత్ బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు.

హేమంత్ బృందంతో పాటు, ఇతర రెజిమెంట్ల నుండి ఉత్తమ అధికారులు ఈ ఆపరేషన్‌కు ఎంపికయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే పరిస్థితిని, ఆవశ్యకతను హేమంత్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న హేమంత్ అక్కడికి వచ్చారు. కొన్ని గంటల తర్వాత మళ్ళి అందరూ మీటింగ్ రూంలో మళ్ళి సమావేశమయ్యారు. వారు హేమంత్‌కు పరిస్థితిని వివరించారు.

దానికి హేమంత్ ఓకే చెప్పాడు. కానీ హేమంత్ ఇంటెల్ గురించి వివరాలు అడిగారు. హేమంత్ “ఈ ఇంటెల్ పై ఎంతవరకు ఆధారపడగలం” అని ప్రశ్నించాడు.

RAW ఏజెంట్ల నుండి మాకు ఈ సమాచారం అందిందని అధికారులు బదులిచ్చారు. “ఈ ఏజెంట్ చాలా కాలంగా అక్కడే ఉన్నాడు, మనకి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అతను చాలా సార్లు అందిచారు, ఇప్పటికీ ఇస్తున్నాడు” అని ఒక అధికారి బదులిచ్చాడ్డు. 

RAW ఏజెంట్ల నుండి వచ్చిన సమాచారం కాబట్టి హేమంత్ దాని మీద పూర్తి విశ్వాసం ఉంచాడు. 

అయితే అసలు సమస్య సమయం, మరో రెండు రోజుల్లో దాడి జరగాలి, అదే అతి పెద్ద సమస్య.

హేమంత్ టీంలో ఉన్న వారందరిని అందరిని అసెంబుల్ చేయడానికి కొంత సమయం పట్టింది .

ఆర్మీ అధికారులు అందించిన మిషన్ & ఎగ్జిక్యూషన్ ప్లాన్‌ని హేమంత్ తన బృందానికి వివరించాడు, హేమంత్‌ టీమ్‌కి ఎక్కువ సమయం లేదు. మరుసటి రోజు ఆపరేషన్ చేయాలని వాళ్ళకి బాగా తెలుసు. 

మరుసటి రోజు రాత్రి హేమంత్ తన జట్టుతో కలిసి పాకిస్థాన్‌కు బయలుదేరాడు. పాక్ సరిహద్దుల్లోని రాడార్ గుర్తించబడకుండా ఉండేందుకు వారు హెలికాప్టర్లలో చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించారు. మరియు పైలెట్ దాడి ప్రదేశానికి దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో బృందాన్ని విడిచిపెట్టాడు. అక్కడి నుంచి హేమంత్ టీమ్ దాడి చేయాల్సిన ప్రదేశానికి వెళ్లడం ప్రారంభించింది. 

అక్కడి నుండి చాలా దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక భారతీయ ఏజెంట్‌ను కలిశారు. అతని పేరు నుమాన్ అసలు పేరు రవిశాస్త్రి.

హేమంత్ బృందం అంతా తమ ముఖాలను కప్పి ఉంచే నల్లని ముసుగులు ధరించి ఉన్నారు, హేమంత్ తన ముసుగును తీసివేసి ఏజెంట్ రవిశాస్త్రిని కలుస్తారు, RAW ఏజెంట్ కూడా అలాగే చేస్తాడు. భారత ఆర్మీ బృందాన్ని కలిసిన తర్వాత RAW ఏజెంట్ తన మీటింగ్ కోడ్‌లను ఖచ్చితంగా ఇచ్చారు. ఏజెంట్ ప్రస్తుతం అక్కడ ఎంత మంది టెర్రరిస్ట్స్ ఉన్నారు మరియు వారు ఎలాంటి ఆయుధాలను కలిగి ఉన్నారు అనే దాని గురించి కొన్ని కీలకమైన సమాచారాన్ని అందించారు.

ఆ తర్వాత RAW ఏజెంట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఏజెంట్ సూచన మేరకు హేమంత్ బృందం దాడి చేయాల్సిన లొకేషన్ వైపు వెళ్ళింది.

ఆ రోజు హేమంత్ తన జీవితంలో ఎన్నడూ చూడనిది ఆరోజు చూడబోతున్నాడు అనేది తెలియదు.

ఓటమిని చూడని యుద్ధం లేదు, మరణాన్ని చూడని సైనికుడు లేడు.

సమయం తెల్లవారుజామున 2 గంటలవుతోంది.

ప్రదేశానికి చేరుకునే ముందు ప్రతి ఒక్కరు ఇన్ఫ్రారెడ్ అద్దాలు మరియు హీట్ సిగ్నేచర్ లెన్స్‌లు ధరించారు. నిర్ధారణ కోసం వాళ్ళతో తీసుకువచ్చిన తీసుకువచ్చిన డ్రోన్‌ను గాలిలోకి విడుదల చేశారు, డ్రోన్ సమీపంలోని ఏదైనా పేలుడు పదార్థాలను గుర్తించగల కొత్త సాంకేతికతతో ఆ డ్రోన్ తయారు చేయబడింది. హేమంత్ బృందం డ్రోన్ నుండి కొన్ని షాకింగ్ విజువల్స్ చూశారు.

ఏజెంట్ ఇచ్చిన ప్రదేశానికి కొంత దూరంలో ఉగ్రవాదులకు మరో స్థావరం ఉందని హేమంత్ బృందం ధృవీకరించింది.

కొత్తగా కనిపెట్టిన ప్రదేశంలో 20 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్ లొకేషన్ కి గస్తీ కాస్తున్నట్లు గుర్తించారు.

ఇంకో తీవ్రవాద స్థావరాలను మన ఇంటెలిజెన్స్ గుర్తించి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ప్రస్తుత ఉగ్రవాద ప్రదేశం నుండి దూరంగా, లోతట్టు భూగర్భంలో ఉంది.

అక్కడ ఇంకేదో జరుగుతోందని హేమంత్ అనుమానిస్తున్నారు.

హేమంత్ వెంటనే ప్లాన్ మార్చాడు.

హేమంత్ మాట్లాడుతూ "సగం టీమ్ కొత్త లొకేషన్‌లో స్ట్రైక్ చేస్తుంది, మిగిలిన టీమ్ మొదటి లొకేషన్‌లో స్ట్రైక్ చేయాలి, మన పాత ప్లాన్ ఫాలో కావడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరైనది కాదు. మనం అలా చేయకపోతే వారు మనల్ని చుట్టుముట్టవచ్చు"

కానీ ఇతర జట్టు సభ్యులకు భిన్నమైన అభిప్రాయం ఉంది.

మనం ప్రణాళికకు కట్టుబడి ఉండాలని జోసెఫ్ చెప్పారు.

టీమ్‌లోని అందరూ అది ప్లాన్‌లో భాగం కాదని చెప్పారు, భయుంగ్ తప్ప.

హేమంత్ "దానిని కూడా నాశనం చేయడం మన బాధ్యత" అని గట్టిగా చెప్పాడు. 

హేమంత్‌కి ఇక్కడ ఏదో సరిగ్గా లేదని గట్టి నమ్మాడు. 

అలా అని వెనుక అడుగు వేసే ఆలోచన అతనికి లేదు, ముందు ఉన్న శత్రువు చీకట్లో ఉన్న, ఆ చీకటే అతని బలమైన, ఆయుధం ఎక్కు పెట్టలేని పరిస్థితి ఉన్న. చీకటినైనా చీల్చుకుంటూ, శత్రువులను అంతం చేయడం ఒక్కటే అతనికి తెలుసు. 

అదే సమాచారం స్థావరానికి పంపించారు.

ఉన్నతాధికారులకు ఏం చేయాలో తోచకపోవడంతో తుది నిర్ణయాన్ని హేమంత్‌కే వదిలేశారు.

హేమంత్ తనలో తానే కొద్దిసేపు ఆలోచించుకుంటారు. 

రెండో ప్రదేశంలో ప్రమాదం ఎక్కువగా ఉంది అని హేమంత్ భావించాడు, ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకే తన నిర్ణయాన్ని హేమంత్ మార్చుకున్నారు. 

హేమంత్ తన జట్లను రెండు జట్లుగా విభజించారు 

హేమంత్ : "నేను మరియు భయుంగ్ మాత్రమే ఆ లొకేషన్2కి వెళ్తాము" 

మిగిలిన వారు అందరూ ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. కానీ హేమంత్ లొకేషన్2కి ఎక్కువ మంది సైనికులను తీసుకెళ్లడం ఇష్టం లేదు, ఇది జట్టును బలహీనపరుస్తుంది అని అనుకున్నారు 

కేవలం ఇద్దరితో మాత్రమే అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరమని టీమ్‌లోని మిగిలిన వారు అన్నారు. అయితే హేమంత్ తన నిర్ణయం తీసుకున్నారు. అతను భయుంగ్ వైపు చూసి, తన సమాధానం అడిగాడు.

భయుంగ్ తన ఆయుధాన్ని తీసి "After you major" అని బదులిచ్చాడు.

జట్టు రెండు జట్లుగా విడిపోయింది, మొత్తం టీంలో ఇద్దరు స్నిపర్లు ఉండడం వలన టీంకి ఒకరు వెళ్లారు. 

టీమ్ 1(ఆల్ఫా) లొకేషన్ 1కి.

Bravo team, Hemanth & భయుంగ్ లొకేషన్ 2కి వెళ్లారు.

లొకేషన్ 2లో, హేమంత్ & భయంగ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని చంపుకుంటూ భూగర్భంలోకి వెళ్లారు. అక్కడ క్షిపణి లాంచర్లు మరియు అనేక ఆయుధాలు సిద్ధంగా ఉంచబడ్డాయి.

ఒక తీవ్రవాది హేమంత్ మరియు భయుంగ్ ని అక్కడ చూసి, "ఏ లోగ్ ఇదర్ కైసే ఆయ" అంటాడు. అతను ఇంకా ఏదో చెప్పేలోపు భయుంగ్ వెంటనే అతనిని బాణంతో చంపేస్తాడు.

జోసెఫ్ నేతృత్వంలోని ఆల్ఫా టీమ్, ప్రణాళిక ప్రకారం లొకేషన్1 లోపలికి వెళ్ళింది, లోపలికి వెళుతున్నప్పుడు వారు కొంతమంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. మరియు వారు క్షిపణి లాంచర్లను కూడా కనుగొన్నారు.

అయితే సాటిలైట్ కమ్యూనికేషన్ బాక్స్ దాడిలో బుల్లెట్స్ తగిలి పాడవుతుంది. ఆ తరువాత వారు బేస్ కి కమ్యూనికేట్ చేయలేకపోయారు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే అక్కడ లాంచర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, రాకెట్లు కాదు. జోసెఫ్, వెంటనే విషయాన్ని హేమంత్‌కి రేడియో ద్వారా నివేదించాడు. జోసెఫ్‌ నుండి అది విన్న తర్వాత హేమంత్‌కి ఒక విషయం గుర్తుకు వచ్చింది.

లొకేషన్2లో హేమంత్ & భయుంగ్ ని చూసిన టెర్రరిస్టులలో ఒకరు "మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?" అని అంటాడు.

మనం ఇక్కడికి వస్తున్నామని వాళ్లకు ముందే తెలిసిపోయిందని హేమంత్ అనుమానించాడు.

మరియు అదే సమయంలో టెర్రరిస్టులు బయట ఉన్న స్నిపర్లను చంపారు.

హేమంత్ స్నిపర్లను కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదు. 

అంతా ట్రాప్ అని హేమంత్ కి తెలుస్తుంది. అతను వెంటనే లొకేషన్ 1 నుండి టీమ్ ఆల్ఫాను బయటకు రమ్మని చెప్పాడు.

హేమంత్ లొకేషన్ 2లో ఒక్కడిని తప్ప అందరినీ చంపేస్తాడు, మిగిలిన ఒక్క టెర్రరిస్టు మీద తుపాకీ పెట్టాడు కానీ అతను ఏమీ మాట్లాడలేదు.

హేమంత్ అక్కడ ఉన్న ఆయుధాల అన్నింటినీ వెరిఫై చేస్తారు మరియు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు కూడా అక్కడ కనిపిస్తాయి హేమంత్ అనుమానాలను అవి బలపరిచాయి, వాళ్ళ ప్లాన్ ఏంటో హేమంత్ పసిగట్టాడు. అయితే వాళ్ళు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు. అనేది మొదట అర్థం కాలేదు, కానీ అది కూడా హేమంత్ తెలుసుకున్నారు 

మరోవైపు, అదే సమయంలో అపాచీ హెలికాప్టర్ ల్యాండింగ్ పరిథిలోకి కొందరు ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నట్లు పైలట్ గమనించాడు. పైలట్ సమస్యను హేమంత్‌కు నివేదించాడు.

వెంటనే పైలట్‌ని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని హేమంత్ చెప్పాడు. పైలట్ లేదు అన్నాడు.

హేమంత్ "ఇది నా ఆర్డర్, అక్కడకి వచ్చిన టెర్రరిస్ట్ లను చంపండి, కానీ వారి చేతికి మాత్రం హెలికాప్టర్ దొరకనివ్వకండి" అని చెప్పాడు, ఆపై అతను హేమంత్ ఆజ్ఞను అనుసరించి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు, ఉగ్రవాదులు పైలట్‌పై కాల్పులు జరిపారు కానీ ఎటువంటి నష్టం జరగలేదు

2లొకేషన్‌లోని ఉగ్రవాదులందరినీ హతమార్చిన తర్వాత, అతను క్షిపణులను పేల్చడానికి టైమ్ బాంబులను అమర్చాడు మరియు ఆర్మీ యూనిఫామ్‌లను కాల్చాడు. జట్టు మొత్తం చనిపోయిన, దాడి చేయడానికి వారికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంటుందని అతను భావించాడు.

లొకేషన్1లో, ఆల్ఫా టీమ్‌కి హేమంత్ నుండి సందేశం వచ్చినప్పుడు, ఆ సమయంలో వారు చాలా మంది ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. వారందరినీ చంపిన తర్వాత మేము బయలుదేరుతాము అని జోసెఫ్ చెప్పాడు. ఉచ్చు అని తెలిసిన తర్వాత కూడా వారందరినీ చంపిన తర్వాతే బయటకు రావాలి అనుకుంటారు జోసెఫ్. అక్కడ ఉన్న అందరినీ చంపినప్పుడు, అది పూర్తయిందని వారు భావించారు. ఆ ప్రదేశం నుండి బయటకు రావడానికి ప్రయత్నించారు, ఎక్కడి నుంచో ఉగ్రవాదులు అన్ని వైపుల నుండి దాడి చేయడం ప్రారంభించారు.

50 మందికి పైగా ఉగ్రవాదులు టీమ్ ఆల్ఫాను చుట్టుముట్టారు, ఇంటెల్ ప్రకారం 10 నుండి 20 మంది ఉగ్రవాదులు ఉండాలి, కానీ అంతమంది టెర్రరిస్ట్స్ అక్కడికి ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు. (అందరూ వేర్వేరు చోట్ల దాక్కున్నారు, సమయం వచ్చినప్పుడు అక్కడికి వచ్చారు.) ఆల్ఫా టీమ్ పరిస్థితిని హేమంత్‌కి తెలియజేసింది.

అది విన్న హేమంత్ వెంటనే అక్కడి నుండి లొకేషన్ 1కి పరిగెత్తాడు.

హేమంత్ తన టీమ్‌ని రక్షించడానికి చాలా వేగంతో అక్కడికి పరుగెత్తాడు.

ఆ నిమిషం

తన దగ్గర లేని సమయం తన శత్రువు అయింది, అదే సమయం శత్రువుకి ఆయుధం అయింది

హేమంత్ అక్కడికి చేరుకునే సమయానికి ఆల్ఫా టీమ్ ఉగ్రవాదుల చేతిలో హతమై ఉంది. హేమంత్ అక్కడికి రాకముందే వారి నాయకుడు & కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయారు, అక్కడ కొంతమంది ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారు.

ఆ ఉగ్రవాదులకు "వీడియో తీసి వారిని బూడిద చేయమని" ఆదేశాలు వచ్చాయి. దానికోసం వారు అక్కడ ఉన్నారు. ఆ వీడియోతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నాడు ఉగ్రవాద నాయకుడు

మన సైనికుల పై పెట్రోల్ పోసే సమయానికి హేమంత్ అక్కడికి చేరుకున్నారు.

అక్కడి పరిస్థితి చూసి హేమంత్‌కి ఆవేశం కట్టలు తెచ్చుకుంది, ఇన్ని రోజులు తన టీంలో పని చేసినవారు, తన ఫ్యామిలీ అనుకున్నవారు ఆలా పడి ఉండడం హేమంత్ చూడలేకపోయాడు. 

హేమంత్ కాల్పులు ప్రారంభించాడు, అతని వేగాన్ని మెషిన్ గన్ కూడా అందుకోలేకపోయింది. మెషిన్ గన్ మధ్యలో ఆగిపోయింది, మరో వైపు భయుంగ్ తనకు వీలైనంత మందిని చంపుతూ పోతున్నాడు. భయుంగ్ తన వద్ద ఉన్న ఖడ్గాన్ని హేమంత్ వైపు విసిరాడు. అందజేస్తాడు.

హేమంత్ చేతిలో ఖడ్గం సుదర్శన చక్రంలా శత్రువుల తలలను కనికరం లేకుండా శరీరం నుండి వేరు చేస్తుంది..

ఆ క్షణం అతణ్ణి ఆపాలి అంటే ఇంకో సైన్యం రావాలి అన్నంత అతను వాళ్ళని చంపుతూ పోయాడు. అక్కడ ఉన్న ఉగ్రవాదుల అందరినీ హేమంత్ ఊచకోత కోశాడు.

అక్కడ రక్తాన్ని చూస్తుంటే రక్తంతో కొత్త నది పుట్టినట్టు అనిపించింది.

అక్కడికి స్థానిక పోలీసులు రావడం భయుంగ్ గమనించాడు.

భయుంగ్ హేమంత్‌ను అక్కడి నుంచి వెళ్ళిపోదామని అభ్యర్థించాడు. హేమంత్ అక్కడ మన సైనికుల పార్థివ దేహం వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాడు.

అతని కళ్ళలోంచి కన్నీళ్లు మెల్లగా రాలాయి, ఆ కన్నీళ్లు అతని దృష్టిని కప్పాయి. తన స్నేహితులను చివరిసారి చూసేందుకు కన్నీళ్లు తుడిచాడు.

భయుంగ్ హేమంత్ వైపు విచారంగా చూస్తున్నాడు, హేమంత్ ఇలా చేయవద్దు అన్నారు, హేమంత్ తల దించుకుని సరే అన్నాడు.

అక్కడి నుంచి మృతదేహాలను తీసుకెళ్లలేని పరిస్థితి, అక్కడ వదిలేస్తే మన సైనికులే అని ప్రపంచానికి తెలిసిపోతుంది. లేదా శత్రువు వారితో రాజకీయం చేయవచ్చు.

అందుకే వారి నుండి వారి బ్యాడ్జీలు మరియు గొలుసులు తీసివేసి, మృతదేహాలను అక్కడే నిప్పు అంటించారు. 

గ్యాస్ సిలిండర్‌ను పేల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

లొకేషన్ 2లో ఉంచిన పేలుడు పదార్థాలు కూడా టైమర్ ద్వారా సెట్ చేయబడ్డాయి . అదే సమయంలో అవి కూడా పేలాయి.

అక్కడి నుండి బయలుదేరే సమయంలో హేమంత్‌కి అక్కడ ఒక తుపాకీ కనిపించింది, అది అతనికి చాలా వింతగా అనిపించింది.

కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమని అర్థం వచ్చే గన్‌పై లోగో కనిపించింది, దానికి అర్ధం అప్పుడు హేమంత్ కి తెలియదు. దానిని హేమంత్ తన వెంట తీసుకెళ్లాడు.

పాకిస్తాన్ అధికారులకు అక్కడ జరిగింది అంతా తెలుసు, కానీ ఏమీ బయటకు రాకుండా చేసారు.

హేమంత్ & భయుంగ్ ఇద్దరూ చాలా కష్టపడి భారత సరిహద్దుకు చేరుకున్నారు. ఇద్దరూ సరిహద్దులో ఎత్తైన కొండపై కూర్చున్నారు. భారత సరిహద్దుకు కొద్ది దూరంలోనే వారు ఆగిపోయారు.

హేమంత్ నిశ్శబ్దంగా, కోపంగా మరియు విచారంగా ఉన్నాడు.

అతని కోపం బద్దలయ్యే అగ్నిపర్వతంలాగా తన కళ్ళలో కనిపిస్తుంటే, గుండెల్లో బాధ మాత్రం అతను ఎప్పుడు మోయలేని భారం అయింది 

 

ఆ బాధ, కోపంతోనే తన చేతిలోఉన్న ఖడ్గాన్నిబలంగా భూమిలో గుచ్చాడు 

తన టీమ్ చావుకు తానే కారణమని హేమంత్ తనను తానే నిందించుకున్నాడు. ప్లాన్ ప్రకారం లొకేషన్ 1లో ఉంటే టీమ్‌ని కాపాడేవారమని, లేదంటే వాళ్లతో పాటు మనం కూడా వీర మరణం పొందే వాళ్లమని హేమంత్ చెప్పాడు.

అయితే భయుంగ్ మాట్లాడుతూ “మనం లొకేషన్1లో ఉండి ఉంటే, మనం వారిని రక్షించి ఉండేవాళ్లం, లేదా వారితో చనిపోయి ఉండేవాళ్లం.

మనం ఆల్ఫాతో ఉంటే, ఉగ్రవాదులు భారత ఆర్మీ స్థావరంపై విధ్వంసం సృష్టించేవారు. అదే జరిగితే ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. నీ వల్లనే వాళ్ళ ప్లాన్ విఫలమైంది.

మీ నిర్ణయాన్ని నిందించవద్దు”

ఆ మాటలు తనకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేదని భయుంగ్‌కు తెలుసు.

హేమంత్ మనసు, ఆలోచన, ఊపిరి అన్నీ చనిపోయిన సైనికుల మరణానికి సమాధానం కోసం వెతుకుతున్నాయి.

హేమంత్ కత్తిని బయటకు తీసాడు, కత్తి నుండి రక్తం ఇంకా కారుతూ నేలపైకి వస్తుంది. హేమంత్‌, భయంగ్‌ ఇద్దరు వారి చావును తలుచుకొని కన్నీరురాలుస్తున్నారు .

భయుంగ్ హేమంత్ చేతిలో లాకెట్లు మరియు బ్యాడ్జ్‌లను పట్టుకుని "కిసి కో నా చోడేంగే". లాకెట్లు రక్తం కారడంతో తడిసి నేలపై పడ్డాయి.

యుద్ధంలో సైనికుడి రక్తంతో తడిసిన నేలా కన్నా, సైనికుడి కన్నీళ్లతో తడిసిన నెలే బరువైనది ." ఆ కన్నీరు సాక్షిగా చేసిన ప్రమాణం. 

హేమంత్ "నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ మారణకాండకు ఎవరు కారణమైతే వారు ఎన్నడూ చూడని, ఊహించని బాధతో ప్రాణాలు కోల్పోతారు".

సరిగ్గా అప్పుడే ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ పైలట్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు.

ఇంటెల్ ఇచ్చిన ఏజెంట్(నుమాన్)పై హేమంత్‌కు అనుమానం. అతను ఇచ్చిన ఇంటెల్ వల్ల ఇది జరిగింది, అతను ఖచ్చితంగా డబుల్ ఏజెంట్ అని హేమంత్ అనుమానించాడు.

 కొన్ని రోజుల తర్వాత, ఆర్మీ అధికారులు హేమంత్‌ను పాకిస్తాన్‌లో మిషన్ గురించి వివరణ అడిగారు.

ఆ సమయంలో హేమంత్ తన జట్టును కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు, కానీ అతను తన ఉన్నతాధికారులకు సమాధానం చెప్పడానికి అక్కడికి వెళ్లాడు.

అధికారులు అడిగిన ప్రశ్నలకు హేమంత్ సమాధానం చెప్పడం ప్రారంభించాడు. హేమంత్‌ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హేమంత్‌ ఇలా అంటాడు, “మీరు మాకు ఇచ్చిన ఇంటెల్ వల్ల నా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ చనిపోయారు, మేము అక్కడికి వెళ్తున్నామని వారికి ముందే తెలుసు, ఈ ప్లాన్ గురించి మాకు మరియు మీ ఏజెంట్‌కు మాత్రమే తెలుసు. అప్పుడు మేము వస్తున్నామని వారికి ఎలా తెలిసింది? నేను ఏజెంట్‌ని అనుమానిస్తున్నాను"

అందుకు గల కారణాలు హేమంత్ వివరించారు. 

హేమంత్ "నాకు అనుమతి లభిస్తే నేను అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి నిజాలు బయటపెడతాను" అని చెప్పాడు.

కానీ రా ఏజెంట్ రవిశాస్త్రి చనిపోయాడని, అతని మరణానికి సంబంధించిన ఫోటోలను చూపుతూ రహస్య సమాచారాన్ని అధికారులు వెల్లడించారు. ఆ రిప్లైతో షాక్ అయ్యారు హేమంత్, షాక్ లో ఉండడం వల్ల ఫోటో కూడా సరిగ్గా చూడలేదు.

అతను మన ఏజెంట్ అని మీరు కాంఫర్మ్ చేసుకున్నారా అని హేమంత్ అడిగారు, దానికి అవును అని చెప్తారు. 

మిషన్‌ కోసం, దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి ఏజెంట్‌పై ఇలా మాట్లాడడం సరికాదని అధికారులు బదులిచ్చారు.

హేమంత్ అప్పటిదాకా అన్నీ ఆ ఏజెంట్ చేసాడు అనుకున్నాడు. అకస్మాత్తుగా అంతా మారిపోయింది. అతను అక్కడ ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదు. ఇదంతా అతనే చేస్తే అతను ఎలా చచ్చిపోతారు? కాకపోతే వీటన్నింటికీ వెనుక ఎవరున్నారు, ఏజెంట్ మరణం ఒక్కసారిగా హేమంత్ మనసును కలవరపరిచింది.

దీని వెనుక ఎవరున్నారో నిజానిజాలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

కానీ హేమంత్ ఉన్న పరిస్థితిలో ఇలాంటివి చేయడం ప్రమాదకరమన్నారు.

దీనిపై అనుమతి ఇచ్చేందుకు ఆర్మీ అధికారులు నిరాకరించారు. దీంతో హేమంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లొకేషన్ బయట భయుంగ్ హేమంత్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఏమి జరిగింది అని అడుగుతాడు?

హేమంత్: మనం ఈ సంగతి మర్చిపోవాలి అంటా !! మనం సైనికులం, రాజకీయ నాయకులం కాదన్న విషయం వాళ్లు మర్చిపోయి ఉండవచ్చు. నువ్వు తప్పక విశ్రాంతి తీసుకోవాలి భయుంగ్ మనకి చాలా పని ఉంది, సమయం వచ్చినప్పుడు నేను నిన్ను సంప్రదిస్తాను, అప్పటివరకు సెలవు. 

హేమంత్ మాటల్లో అతనికి అర్ధమైంది. భయాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు

హేమంత్ అక్కడి నుండి బయటకు వచ్చి, తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై చాలా దూరం ప్రయాణించి, ఒక కొండ ప్రాంతాన్ని చేరుకుని, ఆ రోజు అక్కడే ఉంటాడు, చాలా వర్షం పడుతుంది.

ఆ రోజు వర్షం ఆగలేదు. హేమంత్ కళ్ళల్లోనుంచి కన్నీరు కూడా.

వాన దేవుడు కూడా తన కన్నీళ్లు లోకానికి చూపించదలచుకోలేదు. 

హేమంత్ క్యాంప్‌ఫైర్‌తో రాత్రి అక్కడే ఉన్నాడు.

పాకిస్థాన్‌లో జరిగినదంతా గుర్తు చేసుకుంటున్నాడు. 

జోసెఫ్ చివరి హేమంత్‌కి చెప్పిన విషయాలు కూడా.

అతని మాటలు “వాళ్ళ బాస్ వెళ్ళిపోతున్నాడు, స్కార్పియన్ ".

హేమంత్ స్కార్పియన్ వెనుక ఉన్న అర్ధాన్ని  కనుగొనడానికి ప్రయత్నించాడు, 

తుపాకీ & జోసెఫ్ క్లూ గురించి హేమంత్ సైన్యానికి చెప్పలేదు.

హేమంత్‌కి సైన్యం నో చెప్పడంతో హేమంత్ తనదైన శైలిలో వీటన్నింటి వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత హేమంత్ ఒక నెల సెలవు తీసుకున్నాడు.

ఆ రోజు నుంచి తన సొంత ప్రణాళికతో పనిచేయడం ప్రారంభించాడు. ఆ సంఘటన తర్వాత హేమంత్ ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోలేదు, ప్రతిరోజూ అతనికి అదే కల, అతని చేతిలో మరణించిన సైనికుల రోజు అతని కలల్లోకి వచ్చేవారు. . 

తుపాకీపై ఉన్న లోగో ఏంటనే దానిపై కొన్ని రోజులు పరిశోధనలు చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత అది కొత్త ఉగ్రవాద గ్రూపు అయి ఉండొచ్చని అతనికి తెలిసింది. అయితే దీని వెనుక ఎవరున్నారో, ఎవరు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియదు.

 

శత్రువు నష్టం: మరోవైపు:

ఉగ్రవాద నాయకుడు ఫైజల్ ప్లాన్ విఫలమైంది. దాడికి అవసరమైన హెలికాప్టర్, ఆయుధాలు దొరకలేదు. ఆ తర్వాత రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి.

పాకిస్తాన్‌లో భారత ఆర్మీ సైనికులు చనిపోయారని టెర్రరిస్ట్ ఫండర్లు కూడా నమ్ముతారు, కాని ప్రయోజనం లేని కారణంగా నిధులు ఇవ్వలేదు. దాంతో ఫైజల్‌కు తీవ్ర కోపం వచ్చింది.

ఇది ఎలా జరిగిందో ఫైజల్‌కు అర్థం కాలేదు, కానీ తరువాత అతనికి తెలిసింది, భారత సైన్యం మొదట ఆయుధాలపై దాడి చేసి, ఆపై అనుకున్న ప్రదేశానికి రావడం అతనికి చాలా కోపం తెప్పించింది. చాలా అజాగ్రత్తగా ఉన్నందుకు వారి సభ్యులను చంపేస్తాడు.

కానీ అతను ఏదో అనుమానాస్పదంగా భావించాడు మరియు ప్రతిదీ గురించి ఆరా తీశాడు.

అతను తనకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం కోసం అడుగుతాడు, కానీ మిషన్‌లో ఉన్న వారందరూ అక్కడే మరణించారని తేలింది.

ఆ తర్వాత ఆ టెర్రరిస్టు నాయకుడు దాన్ని పెద్దగా పట్టించుకోడు.

ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఆ ప్లాన్ విఫలమైనప్పటికీ అతను పెద్ద ప్రణాళికలు వేసుకున్నాడు. ఆ తరవాత అతనిని ఎవరు చుడలేదు. 


 అధ్యాయం IV: కఠినమైన నిర్ణయాలు

మరోవైపు, హేమంత్ దీని వెనుక ఉన్నది ఎవరు అని కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు, అతనికి తెలిసిన అనేక చానెల్స్, ఇంఫార్మెర్స్ ద్వారా ప్రయత్నించాడు. కానీ ఒక్కటి కూడా ఫలించలేదు. వివరాలను కనుగొనడానికి ఇతర దేశాలకు కూడా వెళ్ళాడు, కానీ ఉపయోగం లేదు.

ఆ సంఘటన తర్వాత హేమంత్ ఎప్పుడూ ఇంట్లో లేడు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వేళ్తాడో కూడా తెలియదు. రాంబోని చూసుకోవడానికి ఒక వ్యక్తిని మాత్రం అక్కడ ఉంచాడు,

ఆ సంఘటన హేమంత్ జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. 

 అందులో ఒకటి తనకు బాగా నచ్చిన(ప్రేమించిన) అమ్మాయిని ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు.

తనకు వచ్చే ప్రతి సమాచారం, స్వయంగా అతనే కన్ఫర్మ్ చేసుకునేవారు.

·మరొకటి, ఆ తర్వాత అతను ఎప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించలేదు.

 చావుకు భయపడనని చెప్పాలి అనుకుంటున్నాడో లేదా దాని కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పాలి అనుకుంటున్నాడో తెలియడం లేదు. 

హేమంత్‌కి ఆ సంఘటన కోలుకోలేని గాయంలా మిగిలిపోయింది

అతనికి ఆర్మీ పట్ల ఎటువంటి కోపం లేదు, తన తోటి సైనికులను కాపాడుకోలేక పోయాను అని తన మీద తనకే ద్వేషం.

హేమంత్ సరిహద్దులో చాలా మందిని విచారించాడు, అతను తన ఇంఫార్మెర్స్ ద్వారా చాలా మంది ఉగ్రవాదులను విచారించాడు, లోగో గురించి అడిగాడు మరియు విచారణ తర్వాత తెలియదు అని చెప్పిన ఉగ్రవాదుల అందరినీ చంపాడు.

       కొన్ని రోజులు గడిచాయి::

ఒకరోజు కల్నల్ అరవింద్ సార్ హేమంత్ ఇంటికి వచ్చారు . హేమంత్ బయట బాగానే ఉన్నాడని, కానీ లోపల మాత్రం చాలా బాధ పడుతున్నాడు అని అరవింద్‌కి బాగా తెలుసు.

అరవింద్ సార్ ని అక్కడ చూసి, హేమంత్ కి పరిస్థితి అర్ధం అయింది అతను ఎందుకు వచ్చారో అని. 

అరవింద్ హేమంత్ పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు, అరవింద్ అక్కడికి కొన్ని విషయాలు చర్చించడానికి వచ్చారు. 

అరవింద్ హేమంత్‌ని ప్రశ్నించారు, "ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు, ప్రపంచం నుండి దూరంగా, నీకు నచ్చిన సైన్యానికి దూరంగా ఉంటావు, నువ్వు ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు అని నాకు తెలుసు, నువ్వు ఏ రోజు ఎక్కడ ఉంటావో కూడా తెలియట్లేదు నాకు. 

నువ్వు చెప్పిన మాటలు నీకే గుర్తు చేయాల్సివస్తుంది. 

“నీ కుటుంబం ఎవరు, ఆ మిషన్‌లో మరణించిన సైనికులు మాత్రేమేనా ? లేక సైన్యంలో ఉన్నవారంతానా ? నీ కుటుంబం అంటే నీ టీం కాదు, బెటాలియన్ కాదు, మొత్తం సైన్యం నీ కుటుంబం, ప్రతి సైనికుడు నీ కుటుంబం. 

ఆ కుటుంబం ఎప్పుడూ నీ గుండెల్లో ఉంటుంది. అది నీ నుండి ఎప్పటికీ పోదు. నీ స్నేహితులతో సహా అందరూ అందులో ఉన్నారు. ఇవన్నీ నీ మాటలు!!

నాకు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది, ఎక్కడ నువ్వు ప్రాణంగా అనుకునే అర్మిని వదిలేసి వెళ్ళిపోతావేమో అని “(అరవింద్ కావాలనే ఆ మాటలు అన్నాడు)

దానికి హేమంత్ ఒక్కటే చెప్పారు. 

 "I know only one thing, Live like a soldier or Die like a warrior. Not to be a survivor

నేను ఇక్కడ ఉన్నంత కాలం ఆర్మీని వదిలి వెళ్ళను, నా నుండి ఆర్మీని ఎవరూ వేరు చేయలేరు. 

ఒక సైనికుడు నిజంగా ఆర్మీ నుంచి ఎలా బయటకు రావాలనుకుంటున్నాడో తెలుసా  సార్ ?

“Instead of carrying Retirement papers. A soldier always wishes his name in the paper as heroic death”

ఆ మాటలు విన్న కల్నల్ అరవింద్ కాస్త శాంతించాడు. తన స్నేహితుల చావుకి కారణమైన వ్యక్తులని చంపకుండా ఉండడని అతనికి బాగా తెలుసు.

అరవింద్ ఇలా అంటాడు “మరికొద్ది రోజుల్లో మళ్లీ సర్వీసులో చేరాలని నీకు గుర్తుందా?

అరవింద్ కొంచెం అలోచించి, నీకు కొంచెం మార్పు అవసరమని నాకు తెలుసు పారా బ్యాచ్ ట్రైనింగ్ హెడ్ కోసం ఒక మంచి ఆఫీసర్ కావాలి, నువ్వు అయితే దానికి సరిగ్గా సరిపోతావు , దాని కోసం మేము నీ పేరును పంపాము.

హేమంత్ వెళ్ళాలి అనుకుంటున్నా దారి ఎంత ప్రమాదకరమైనదో అతనికి బాగా తెలుసు, ఆ దిశను మార్చడానికి కల్నల్ కొద్దిగా ప్రయత్నించాడు. హేమంత్ సామర్ధ్యం ఏమిటో అతనికి బాగా తెలుసు, కానీ ఆర్మీ సహాయం లేకుండా చేయాలి అనుకోవడమే అతణ్ణి కలవరపడేలా చేస్తుంది. 

హేమంత్ "నాకు కొంత సమయం కావాలి" అని చెప్పాడు.

హేమంత్ మనసులో ఒక్కటే ఉంది, అందుకే ఏమీ మాట్లాడలేదు.

కల్నల్, "నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? 

అడగండి అని హేమంత్ అంటారు. 

నీ స్నేహితులని చంపినా హంతకుడిని పట్టుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు?"

ఆ మాటకు హేమంత్ తన దగ్గరున్న లాకెట్ల వైపు చూస్తున్నాడు.

అరవింద్ స్పందిస్తూ “మీ స్నేహితులను చంపినందుకు నువ్వు వాడిని చంపేస్తావా ? లేదా వాడు ఒక ఉగ్రవాది కాబట్టి నువ్వు వాడిని చంపేస్తావా ? రెండిట్లో చర్య ఒకటే, వాడి మరణం!!

కానీ నీ ఉద్దేశ్యం రెండు సందర్భాలలో భిన్నంగా ఉంటుంది.

ఒకటి పగ తీర్చుకోవడం, మరొకటి విధి నిర్వహణ.

దానికి సమాధానం ఇప్పుడు చెప్పకు, అతన్ని చంపే అవకాశం వచ్చినప్పుడు నీకు నువ్వే ప్రశ్నించుకో.

కానీ నాకు తెలిసిన హేమంత్ వేరే , అతను ఎప్పుడూ వారిద్దరి కంటే ఒక అడుగు ముందే ఉంటాడు, అతను ఎప్పుడూ తనకంటే ఒకడుగు ముందుంటాడు”.

తర్వాత కల్నల్ అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాసేపటి తర్వాత హేమంత్‌కి పార్శిల్ వచ్చింది. అందులో కొన్ని కాగితాలు ఉన్నాయి, హేమంత్ ఆ పార్శిల్ తెరిచాడు, హేమంత్ వెతుకుతున్న J & K గన్ లోగో గురించి కొన్ని వివరాలు, మరో లేఖతో పాటు.

అందులో "“I too miss them, Remember that I am always with you...."      

ఆ పార్శిల్ అరవింద్ పంపారు, హేమంత్ J & K లోగో గన్ కోసం వెతుకుతున్న విషయం అరవింద్‌కి తెలుసు, మరియు అరవింద్ లోగో గురించి ముఖ్యమైన క్లూలను కనుగొన్నాడు, ఆపై అతను హేమంత్‌ని కలవడానికి వస్తాడు. హేమంత్ వాటి గురించి వెతుకుతున్నాడు అనే విషయం భయుంగ్ ద్వారా అరవింద్ తెలుసుకుంటారు. 

అరవింద్‌కి హేమంత్ వెళ్లబోయే దారి ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు. తన మనుసు మారడం జరగని పని అని తెలిసిన అరవింద్ మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ అది జరగలేదు. 

 ఆ తుపాకీ వివరాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించినవి . సైన్యం సహాయం లేకుండా అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదరకం. 

ఒక నెల తర్వాత హేమంత్ సెలవు సమయం ముగిసిన రిపోర్ట్ చేయలేదు, కుటుంబ సమస్యల కారణంగా అతను ఇంకో నెల సెలవు కోసం అభ్యర్థించాడు. హేమంత్ సాధారణంగా సెలవు తీసుకోడు, కానీ ఇప్పుడు అతను నెలల తరబడి సెలవు తీసుకుంటున్నాడు. కానీ అతను సైనికుడిగా చేయవల్సిన పని మాత్రం ఆపలేదు, అతను అరవింద్ ఇచ్చిన లీడ్స్‌ను అనుసరించాడు.

హేమంత్ అక్కడికి ఫేక్ పాస్స్పోర్ట్స్, వీసా ద్వారా అక్కడికి వెళ్తారు, తన వేషధారణ అంతా మార్చుకొని అక్కడ కొంత సమాచారాన్ని కనుక్కుంటారు. 

అది ఒక న్యూస్ పేపర్ అని అరవింద్ ఇచ్చిన పేపర్ లో ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ మొదట పాకిస్థాన్‌లో ప్రారంభించిన సంగతి,మూసేసిన విషయం కూడా తెలుసు. మిగితా విషయాలు మాత్రం దొరకలేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో హేమంత్ కొన్ని ఇతర సంబంధిత సమాచారాన్ని కనుగొంటాడు. హేమంత్ వ్యవస్థాపకుని పేరు ఇఫ్తాకర్ అని తెలుసుకున్నారు. అతను మొరాకో వెళ్లిపోయారు ఆ తరువాత అని తెలుసుకుంటారు. 

సంబంధిత యజమాని వివరాల కోసం హేమంత్ మొరాకో వెళ్లాడు. అక్కడ అతని కోసం చాలా వెతికారు. అతను ప్రతి వీధిని వెతికినా అతని చిరునామా కనుగొనలేకపోయాడు. అడ్రస్ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు.

తర్వాత ఏం చేయాలనే ఆలోచన లేదు. చాలా అసంతృప్తి పాలు అయ్యారు. ఎంత కష్టపడినా ఫలితం వృధా అని. చివరకు అతనికి నిరాశే మిగిలింది

సమీపంలో "క్యూద్ ద్రా " నది దగ్గర కూర్చుని చాలా ఆలోచిస్తారు, అక్కడే చీకటి పడే వరకు ఉంటారు. 

 అక్కడి నుంచి హేమంత్ ఇండియాకు వచ్చాడు.

అతను ఇండియాకి వచ్చిన కొన్ని రోజుల తరువాత, హేమంత్ అరవింద్‌ని కలుస్తాడు, ఇద్దరూ లోపల చాలా విషయాలు మాట్లాడుకుంటారు, చాలా సమయం గడిచిపోయింది. 

హేమంత్ ఈసారి తన పద్దతిని మార్చుకున్నాడు. హేమంత్ మళ్లీ టీంని ఏర్పాటు చేయాలనీ భావించాడు. 

అరవింద్ చెప్పినట్లుగా, అతను PARA SF ట్రైనింగ్ కమాండర్ కావడానికి అంగీకరించాడు. హేమంత్ తనకు కావాల్సిన వారిని సెలెక్ట్ చేసి తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నాడు. ఆర్మీ ట్రైనర్ కావడానికి అరవింద్ అన్ని పనులు చూసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత, హేమంత్ పారా SF బ్యాచ్ ట్రైనింగ్ కమాండర్ అయ్యాడు. 

అనేక రోజులు గడిచాయి, చాలా మంది శిక్షణ పొందారు, కానీ హేమంత్ టీంలోకి ఎవరిని తీసుకోలేదు. హేమంత్ ఎవరినీ అంత తేలిగ్గా సెలెక్ట్ చేయడని అరవింద్‌కి కూడా బాగా తెలుసు, కానీ కచ్చితంగా టీమ్‌ని తయారు చేస్తాడనే నమ్మకం ఉంది.

 అదే సమయంలో సుభాష్ శిక్షణ పూర్తి చేశారు.

సుభాష్ CDS యొక్క బ్యాచ్ టాపర్, బ్యాచ్‌లోని ఇద్దరు పారా రెజిమెంట్‌ను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రొబేషన్ విఫలమైతే, వారు పేరెంట్ రెజిమెంట్‌కు తిరిగి నివేదించాలి. సంబంధిత ఫారమ్‌లు ఇప్పటికే పూరించబడ్డాయి.

పారా-ప్రొహిబిషన్ పీరియడ్‌కు అవసరమైన అన్ని ప్రీ-క్వాలిఫికేషన్ (మెడికల్, ఫిజికల్ టెస్ట్) పూర్తిచేశారు


అధ్యాయం V: PARA SF కమాండో శిక్షణజవాన్లు మరియు ర్యాంక్ అధికారులతో సహా 30 మంది పారా SF ప్రొబేషన్ శిక్షణ కోసం ఎంపిక అయ్యారు .

కానీ ఒక్కసారి అక్కడ అడుగుపెడితే ర్యాంకులు లేవు, జవాన్లు లేరు, అధికారులు లేరు. కేవలం ప్రొబిస్.

శిక్షణలో, వారి మానసిక బలం, శారీరక బలం, బ్రేకింగ్ పాయింట్లు, సంకల్ప శక్తి, ఓర్పు, ఒత్తిడి స్థాయిలను తెలుసుకోవడానికి కఠినమైన పరీక్షలు నిర్వహించబడతాయి.

ఎవరు అవన్నీ అధిగమించలేరో వారికి పారా రెజిమెంట్‌లో చోటు లేనట్టే.

ఈ శిక్షణ వారిలోని భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది.

మరియు క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదురుకోవాలి & ఒక ఆపరేషన్‌ను ఎలా పూర్తి చేయాలో అక్కడ నేర్చుకుంటారు.

శిక్షకులు ఎల్లప్పుడూ వారిపై నిఘా ఉంచుతారు మరియు ఏదైనా సంఘటన జరిగితే వెంటనే వైద్య చికిత్స అందించడానికి శిక్షణ సమయంలో వైద్య అధికారి అందుబాటులో ఉంటారు.

ఆ బ్యాచ్ కమాండర్ హేమంత్ కావడం విశేషం, అదే బ్యాచ్ లో సుభాష్ కూడా ఉన్నారు. 

హేమంత్ టీంలో మరో ఇద్దరు శిక్షకులు కూడా ఉన్నారు.

మొదటి రోజు ట్రైనింగ్ స్టార్ట్ చేసే సమయంలో హేమంత్ వాళ్ళని పరిచయం చేసుకుని ముఖ్యమైన విషయాలు చెప్పారు

వాళ్ళకి ఇష్టమైతే ఎప్పుడైనా తిరిగి వాళ్ళ పేరెంట్ రెజిమెంట్ కి వెళ్ళచ్చు అని గుర్తుచేశారు అలాగే క్వాలిఫై అవ్వకపోతే కూడా పేరెంట్ రెజిమెంటుకి వెళ్ళిపోతారు అని హెచ్చరించారు 

Hemanth: “Remember once you enter here, You belong to Para SF, India. Not to any religion & caste.

We have only one religion, the Army. 

మీరు ఈ రెజిమెంట్ కి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రెజిమెంట్ మీరు విన్నదానికన్నా, అనుభవం చెందాల్సిందే ఎక్కువగా ఉంటుంది

మీ అందరికి రూల్స్ అన్ని మా ట్రైనర్లు ముందే చెప్పి ఉంటారు. 

We don't want to see you as a soldier at the end of the training, We want to see every individual as "one Army"

మీరు ఈ రెజిమెంట్‌కి చెందాలనుకుంటే, మీ ప్రాణం కంటే ఈ రెజిమెంట్ మీకు ఎక్కువ అని నిరూపించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ రెజిమెంట్‌కు చెందినవారు అవుతారు లేదంటే తిరిగి మీ పేరెంట్ రెజిమెంట్ కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

మీరు పొరపాటు చేస్తే, ఇక్కడ సరిదిద్దడం ఉండదు, రెండవ అవకాశం ఉండదు, ఎందుకంటే మీ ఒక్క పొరపాటు కొంతమంది జీవితాలు కోల్పోయే అవకాశం ఉంది, "ఇక్కడ మినహాయింపు లేదు" మరియు దానిని ఆశించవద్దు.


ఇక్కడ సైన్యంలో,బలహీనమైన పదం అదృష్టం. అదృష్టం అనే పదాన్ని బలహీనమైన వ్యక్తులు మాత్రమే ఉపయోగిస్తారు.

మనం బలవంతులం. ప్రతిసారీ మనం దానిని నిరూపించాము అని గుర్తుంచుకోండి. అదృష్టాన్ని ఎప్పుడూ నమ్మవద్దు, మీ నైపుణ్యాలను మరియు మీ టీం మీద నమ్మకం ఉంచండి 

PARA SF రెజిమెంట్ గురించి మరో విషయం.

Maroon is something you can't get . you have to earn it. 

Relationship with blood. Blood of your color is Baret.” 

అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత శిక్షకులు ప్రోబిస్‌లకు మరికొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చారు.

తర్వాత అందరూ తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లిపోయారు. ఆ రాత్రి వారు మంచి విశ్రాంతి తీసుకున్నారు

మరుసటి రోజు 30 ప్రోబిస్ బ్యాచ్‌తో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణ ప్రారంభం అయింది. ఎవరైనా శిక్షణ మధ్యలో వెళ్లిపోవాలి అనుకుంటే అక్కడ ఉన్న ట్రైనర్లు దానికి సంబంధించిన పేపర్ వర్క్ చేసి వారిని పంపించేస్తారు. 

ఈ శిక్షణ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణగా పేరొందింది.

మొదటి కొన్ని రోజులు కొన్ని శారీరక వ్యాయామాలు చేస్తూ గడిపారు, ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొల్పడం, కొన్నిసార్లు తెల్లవారుజామున 3 గంటలకు, వారికి సరైన నిద్ర ఎప్పటికి ఇవ్వరు. వారి మానసిక ఒత్తిడి స్థాయిని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక రకమైన పరీక్ష. మొదటి కొన్ని రోజులు కష్టంగా ఉన్న ప్రోబిస్ దానికి అలవాటు పడ్డాడు.

కొన్ని కఠినమైన శారీరక వ్యాయామాలు చేపట్టడం, దానితో పాటు బ్లైండ్‌ఫోల్డ్ వెపన్ అసెంబ్లీని నేర్పించారు, ఇందులో వివిధ రకాల రైఫిల్స్‌ను ఉంచుతారు, 5 సభ్యులు కలిగిన ఫార్మ్ చేస్తారు, ఒక్కొక్క టీం, ఒక్కొక్కటిగా ఒక్కో రైఫిల్‌ను అసెంబుల్ చేయాలి .

మొదట్లో అలా చేయడం అందరికీ చాలా కష్టంగా అనిపించింది. చెప్పాలంటే చేయడం అసాధ్యం అనుకున్నారు. కానీ మేజర్ హేమంత్ చాలా ఈజీగా చేయడం చూసి ప్రోబిస్ కి మొదట అర్థం కాలేదు. 

హేమంత్ ఎలా చేయాలో, ఎలా గుర్తు పెట్టుకోవాలో అందరికీ ప్రత్యేకంగా నేర్పించాడు. ఆ తర్వాత అందరూ దాన్ని అనుసరించి విజయం సాధించారు.

శిక్షణ సమయంలో ప్రతి ప్రోబీకి ఒక బడ్డీని ఇవ్వడం జరిగింది. మరియు శిక్షణ పూర్తయ్యే వరకు అతనే వారి టీం. ఇద్దరూ ఒకరికొకరు 100% సమన్వయంతో ఉండేలా శిక్షణ ఇస్తారు. దీని ద్వారా, టీమ్‌వర్క్ మరియు రెండు ప్రోబిస్ మధ్య సమన్వయం కూడా నిర్మించబడుతుంది. తర్వాత శిక్షణలో బడ్డీని 1కి.మీ దూరం మోసుకొని తీసుకెళ్లాలి.

డెమోలిషన్ శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ శిక్షణ చూడటానికి చాలా తేలికగా అనిపించినప్పటికీ, ఒక చిన్న పొరపాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ శిక్షణలో చాలా చిన్న విషయాలను కూడా ప్రత్యేక శ్రద్ధతో నేర్పించారు.

ఎలాంటి జీపీఎస్ లేకుండానే నావిగేషన్, మార్గాన్ని తెలుసుకోవడంలో మెలకువలు నేర్పించారు. ఎలాంటి ల్యాండ్‌మార్క్‌లు లేకుండా అడవిలో నావిగేషన్ మార్గాలను ఎలా కనుగొనాలో కూడా వారు వారికి నేర్పించారు.

అడవిలో ఉన్నప్పుడు ఆహారం ఎలా సమీకరించాలో నేర్పించారు. ఆ తర్వాత వంట చేయడం, వైద్య సహాయం, వివిధ భాషలు నేర్పించారు. మరియు మట్టిలో క్రాల్ చేయడం, పర్వతారోహణ రెండింటినీ నేర్పించారు.

తర్వాత పరీక్ష వారి బడ్డీ లక్ష్యానికి 45 సెం.మీ దూరంలో టార్గెట్ పక్కన నిలబడాలి, మరియు అతని బడ్డీ 50 మీ లేదా 25 మీటర్ల దూరం నుండి టార్గెట్ షూటింగ్‌ను ప్రారంభిస్తారు. పారా sfలో జీరో ఎర్రర్ పాలసీ, ఏ చిన్న పొరపాటు అనుమతించబడదు.

ఈ పరీక్ష ఏకాగ్రత మరియు నైపుణ్యాలను అన్నింటినీ పరీక్షిస్తుంది. 

చిన్న పొరపాటు వారి స్నేహితులకు ప్రాణ హాని కలిగిస్తుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ప్రోబిస్ ఎలా దృష్టి కేంద్రికరించాలో ఈ పరీక్ష ద్వారా నేర్చుకుంటారు.

ఒక్కరు తప్ప అందరూ చాలా దృష్టి సారించారు, అతను ఆ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. అతన్ని రెజిమెంట్ నుండి పంపించేశారు. అసలైన శిక్షణ ఇప్పుడిప్పుడే మొదలవుతుందని అక్కడి శిక్షకులు హెచ్చరించారు. అందరిలోనూ చిన్నపాటి భయాందోళన మొదలైంది.

హేమంత్ టీం ప్రతిరోజూ వారు చేసే చిన్న చిన్న పొరపాట్లను నోట్ చేసుకుంటూ, వాటిని ఎలా అధిగమించాలి సూచనలు ఇచ్చారు. రైఫిల్ హ్యాండ్లింగ్, రన్నింగ్‌లో కదలిక, చివరకు శ్వాస మరియు మనుగడ ప్రవృత్తి వంటి వాటిపై సూచనలు ఇస్తూ, వారికి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు మరియు వారిలో ధైర్యాన్ని నింపారు.

ప్రతి రోజు వారి పనితీరు నివేదిక హేమంత్‌కి వెళ్తుంది, ప్రతి సాయంత్రం హేమంత్ ఒక్కొక్కరిని కలిసి వారు చేస్తున్న తప్పులు, ట్రైనర్లు గుర్తించిన పాయింట్లు మరియు ఫీడ్‌బ్యాక్ ద్వారా ఎలా మెరుగుపడాలో చెబుతాడు.

వారు చాలా నేర్చుకున్నారు, మొదటి కొన్ని రోజుల్లో చాలా కష్టపడ్డారు, చాలా ఆనందించారు, కానీ నిజమైన పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు.

ప్రతి పరీక్ష వారి భయాలు మరియు బలాలను బయటకు తెస్తుంది. మరుసటి రోజు ఉదయం, అత్యంత క్లిష్టమైన పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

36 గంటల ఒత్తిడి స్థాయి పరీక్ష. శిక్షణలో ఇది అత్యంత కఠినమైన పరీక్ష.

ట్రైనర్ తెల్లవారుజామున మూడు గంటలకు అందరినీ నిద్రలేపి నిద్ర లేవని వారికి ప్రత్యేక శిక్ష విధించారు.

అందరూ మైదానంకి చేరుకున్నారు. పరీక్ష ప్రారంభించడానికి హేమంత్ వచ్చాడు.

పరీక్ష ప్రారంభానికి ముందు హేమంత్ ఓ విషయం చెప్పాడు.

"Be focused, Your close Friend is YOur Skills, Your fear is your biggest enemy Not the Enemy”. 

తర్వాత పరీక్ష మొదలైంది.

అందరూ మూడు గంటల్లో 10 కిలోల బరువుతో 10 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత బడ్డీని మోస్తూ మరో 1 కి.మీ.

 ఆ తర్వాత వెయిట్ షిఫ్టింగ్ టెస్ట్ ప్రారంభించారు.

మొదటి రౌండ్‌లో 1. 2 కి.మీ రౌండ్‌లో 30 కిలోల బ్యాగ్ + 7 కిలోల రైఫిల్ + 20+20 వాటర్ క్యాన్‌తో లాంగ్ రన్.

కొంతమందికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. వదిలేద్దాం అనుకునేవారూ, పేపర్లు పట్టుకుని ట్రైనర్లూ ఎదురుచూస్తూ ఉన్నారు. అందరికీ చాలా కష్టంగా ఉండేది, పరీక్ష భరించలేక కొందరు నిష్క్రమించారు.

అదంతా గమనిస్తున్న సుభాష్ చుట్టుపక్కల వారిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు.

"ఇక్కడ దాకా వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు. ఈ టెస్ట్ కేవలం మనలో ఉన్నా శారీరక శక్తిని పరీక్షించుకోవడం కోసం మాత్రమే. మనలో ఉన్న శక్తి ఈ పరీక్షకి కావలసిన దానికన్నా చాలా లోతైనది, బలమైంది. ఇక్కడ నుంచి వెనక్కి వెళితే అది మెరూన్ baret తోనే. మిమ్మల్ని మీరు నమ్మండి, మీలోని శక్తిని నమ్మి ముందుకు వెళ్ళండి అని సుభాష్ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు

అందరూ ఉత్సాహంతో మళ్లీ తమ శక్తిని కూడగట్టుకుని ముందుకు సాగారు.

తదుపరి రౌండ్‌లో 60 కిలోల టైర్‌ను తీసుకెళ్లారు. చాలా మంది విసిగిపోయారు. వారు చాలా గంటలు తినలేదు లేదా నిద్రపోలేదు.

 తర్వాతి రౌండ్‌లో ఇద్దరు 50 కిలోల కర్ర మొద్దుని మోసుకొని వెళ్ళాలి, బడ్డీతో పాటు, కలిసి ఈ పని చేయాలి, అత్యంత కష్టపడి పరీక్షను పూర్తి చేశారు.

తదుపరిది అత్యంత కష్టతరమైన పరీక్ష, నీటిలో ముంచడం !!

చాలా కష్టమైన టాస్క్ తర్వాత, ప్రోబిస్‌లను వెంటనే వాటర్ ట్యాంక్‌లోకి విసిరి, వారిని అందులో ముంచి బయటకు తీశారు.

అప్పటికే శారీరకంగా బాగా అలసిపోయి ఉన్నారు ఆ పరీక్షను తట్టుకోలేకపోయారు. వారిలో కొంత భయాన్ని కలిగించి, ఆ భయం నుండి బయటకు వస్తారో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష. మరికొంత మందిని తాళ్లతో కట్టి అందులో నీటిలో పడేసారు.

తర్వాత మరో 5 మంది ప్రోబిస్ నిష్క్రమించారు. సుభాష్ కూడా అప్పటికే బాగా అలసిపోయారు, మునగడం, తేలడం వల్ల సుభాష్ లోపల ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయాయి.

లోపల ఊపిరి పీల్చుకోవడం అతనికి చాలా కష్టంగా మారింది. ఒక్క నిమిషం అతనికి ఏమీ అర్థం కాలేదు. అతనిలోని శక్తి అంతా పోయింది. అప్పుడు అతనికి హేమంత్ మాటలు గుర్తొచ్చాయి.

""If you are not a slave to your inner fear, your biggest strength always show you the path"  "

ఎప్పుడైతే మనం బాగా అలసి పోతామా అప్పుడే మనలో కొత్త శక్తి పుడుతుంది, ఆదే మనో శక్తి ఆదే మనల్ని ముందుకు నడుపుతుంది

సుభాష్ కాసేపు లోపల అలాగే ఉండడంతో ట్రైనర్లు కూడా కాస్త భయపడ్డారు. భయంతో లోపలికి వెళ్లిన సుభాష్ చాలా ప్రశాంతంగా బయటకు వచ్చాడు. ఆ నిమిషం వారికి అర్థమైంది సుభాష్ యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది. జట్టు 30 నుండి 18 వరకు వెళ్ళింది. ఆ తర్వాత వారికి ఒక గ్లాసు మురికి నీరు ఇచ్చారు. కానీ అవి డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి తయారు చేసిన నీరు.

సాయంత్రం మరొక పరీక్ష : పరిశీలన పరీక్ష.

ఉదయం పరీక్షలు జరిగిన చోట్ల కొన్ని బొమ్మలు, మరిన్ని గుర్తులు ఉంచారు, వాటి పై పరీక్షలు నిర్వహించారు. వారి ఇంద్రియములు/మనస్సు తీవ్ర స్థాయిలో ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడానికి ఈ పరీక్ష. ఆ పరీక్షలో ఆశించిన స్థాయిలో ఎవరూ రాణించలేకపోయారు సుభాష్‌తో సహా. టీమ్‌ని ముందుకు నడిపించడంపైనే తన దృష్టి ఎక్కువగా ఉందని, చిన్న చిన్న ఆధారాలను పట్టించుకోలేదని, అది సుభాష్ చేసిన తప్పు అని సుభాష్ గుర్తించాడు. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా సాగడంతో 10 కిలోమీటర్ల నడక ప్రారంభించారు. 

అక్కడ రెండు గుడ్లు, చపాతీ ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రోబిస్ ప్రపంచంలోనే గొప్ప ఆహారం తమ చేతుల్లో ఉన్న ఆహారమని చెప్పారు. కానీ అందరి కళ్లు నీరసంగా, నిద్రలేకుండా ఉన్నాయి. అందరినీ తలకిందులు చేసి నిద్రపోకుండా కొన్ని కసరత్తులు చూపించారు. ఆ స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక అక్కడే మరికొంతమంది క్విట్ చేసారు. 

ఆ తర్వాత అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఒక స్టిమ్యులేట్ ఎమర్జెన్సీ సృష్టించారు , అక్కడే ఎనేమి లైన్స్ ఎలా ఒబ్సెర్వె చేయాలి అని నేర్పించారు. అప్పటికే వారి చెయ్యి , కన్ను కో-ఆర్డినేషన్ సరిగ్గా లేదు. 

క్షతగాత్రులను తిరిగి శిబిరానికి తీసుకెళ్లేందుకు అవసరమైన స్ట్రెచర్‌ను తయారు చేయడం, ఆపై అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం, అప్పటికే వాళ్లలో ఉన్న శక్తి అంతా నిరసించింది. 

ఆ పరీక్షలో మరో ఇద్దరు తప్పుకున్నారు. మిగిలిన ప్రోబీలు పరీక్షను పూర్తి చేసారు . ఆపై 36 గంటల్లో చివరి టెస్టు. బురదలో పాకుతూ ముందుకు వెళ్ళాలి. 

అది ముగిసిన తర్వాత హేమంత్ సుభాష్ ని కలవాలని పిలిచాడు. సుభాష్ వాళ్లలో మోటివేషన్ నింపడం హేమంత్ గమనిస్తాడు. దానికి గల కారణం ఏమిటి అని తెలుసుకుంటాడు. 

దానికి సుభాష్, "వారు గొప్ప సైనికులని నేను నమ్ముతున్నాను, అందుకే వారు ఇక్కడ ఉన్నారు, అందుకే సులభంగా వదులుకోవద్దని నేను వారికి చెప్పాను. 

పారా sf అంటే చావుని గెలవడంతో సమానం, మనల్ని మనం గెలవడం, మనలోని భయాలని గెలవడం అదే వాళ్ళకి చెప్పాను " అది ఫలించింది".

హేమంత్ సుబాష్‌ని అడుగుతాడు “నువ్వు ఆర్మీలో ఎందుకు చేరావు? ఏదైనా ప్రేరణ”?

సుభాష్ తన తండ్రి గురించి చెబుతూ ” నా చిన్నప్పుడు మా నాన్న ఆర్మీ కథల గురించి చెప్పారు.

మా నాన్న నాకు ఎప్పుడూ గుర్తుండే ఒక విషయం చెప్పారు.

"If you want to live great life, Be a soldier “

సుబాష్: నేను గొప్ప జీవితాన్ని గడుపుతానో లేదో నాకు తెలియదు, కానీ నేను మంచి సైనికుడిగా ఉండాలనుకుంటున్నాను

ఈ ఉద్యోగంలో, యూనిఫాములొ ఏదో ఉంది సార్, ఈ ఉద్యోగం చేస్తున్న అనుభూతి మనకు ఎక్కడా కనిపించదు.మీరు 

ఆ మాటలు హేమంత్ కి తన మాటల్లా అనిపించాయి.

హేమంత్ మాట్లాడుతూ “మీ నాన్నకు కృతజ్ఞతలు. you are a good soldier, I believe that”.

అతిపెద్ద పరీక్ష : ఎండ్యూరెన్స్ పరీక్ష:

100 కి.మీ పరుగు. ఇది మారథాన్ కంటే పెద్దది. మరియు చాలా కఠినమైనది. 100 km అని వినగానే లోపల ఒక భయం. కానీ ఎక్కడ ఎవరు ధైర్యాన్ని వీడలేదు, ప్రోబిస్ తో పాటు ట్రైనర్లు కూడా మారథాన్ స్టార్ట్ చేసారు. ఒక అంబులెన్స్ సిద్ధంగా ఉంది.

వారు ఈ పరుగును సకాలంలో పూర్తి చేయకపోతే, వారు అనర్హులు అవుతారు. పరుగు ప్రారంభించిన తర్వాత, మొదటి 10 కిమీ అందరికీ చాలా సులభం అనిపించింది, కానీ నెమ్మదిగా అందరికీ కాళ్లలో నొప్పి మొదలైంది. కొంతమంది మొదట్లో వేగంగా పరిగెత్తారు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు ఆ తర్వాత , ఎందుకంటే వారు మొత్తం శక్తిని ఉపయోగించారు, వారు ఇప్పుడు కష్టపడుతున్నారు.

30 కి.మీ పరుగు తర్వాత అందరికీ ఒక గ్లాసు నీరు అందరికి ఇచ్చారు, అందరూ అలసిపోయారు. అయినా ఎవరూ బయటకు చూపించలేదు. ప్రొబిస్ అందరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ పరుగు ఆపలేదు. 50 కి.మీ పూర్తి చేశారు. శిక్షకులను "ఎవరైనా నిష్క్రమించాలనుకుంటున్నారా" అని అడిగారు, ఎవరూ నిష్క్రమించలేదు.

అందరూ 75 కి.మీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక పరుగెత్తలేమని అందరూ అనుకున్నారు. ఎవరైనా క్విట్ చేస్తారా అని మళ్ళీ అడిగారు, ఎవరు చేయలేదు

ఒక గ్లాసు నీరు అందించబడింది మరియు అందరికీ శక్తి కోసం ఒక చాక్లెట్ అందించారు.

దాదాపు 80 కి.మీల దూరంలో ఒక ప్రోబీ కింద పడ్డారు, దాని వల్ల అతని మోకాలికి కొద్దిగా గాయమైంది, అతను నిష్క్రమిస్తాడు అందరూ అనుకున్నారు, కానీ ఆశ్చర్యకరంగా అతను క్విట్ చేయలేదు. 95 కి.మీ వద్ద అతను నడవలేకపోయాడు.

వదిలేద్దాం అనుకున్నాడు. శిక్షకులు వచ్చి అడిగారు, అతను అయోమయంలో ఉన్నాడు, నిష్క్రమించాలని ఆలోచిస్తున్నప్పుడు సుభాష్ వద్దు అని చెప్పాడు. సుభాష్ మరియు మరొక ప్రోబీ అతనిని తమ భుజాలపై ఎక్కించుకున్నారు. 

అందరూ కలిసి మంచి సమయంలో 100 కి.మీ. పూర్తి చేస్తారు. అది చుసిన హేమంత్ మరియు ఇతర ట్రైనర్లు ఆశ్చర్యపోయారు. 

హేమంత్ సుభాష్ దగ్గరికి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇలా చేసావు అది నిబంధనలకు విరుద్ధం.

దానికి సుభాష్, సార్, మీరు "Never leave a soldier behind “

ఆ మాట హేమంత్‌కి తన టీమ్‌ని గుర్తు చేసింది.

మీరందరూ ఈ పరీక్షకు అర్హత సాధించారని హేమంత్ ప్రకటించి, అందరికీ అభినందనలు తెలిపారు.

ఆ తర్వాత 30 రోజుల పాటు అందరూ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్ శిక్షణ కోసం వెళ్లారు. అక్కడ వారికి ఎనిమిది లైన్లలో ఫైట్ చేయడం నేర్పించారు. వారి స్థావరాలపై ఎలా దాడి చేయాలి అనేది ఇందులో చాలా ముఖ్యమైన భాగం.

ఆ తర్వాత అందరూ పాస్ అయ్యారు. హేమంత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాచ్ మీదే రికార్డ్ బద్దలు కొట్టారని, సాధారణంగా 5% మంది మాత్రమే ఇంత దూరం వస్తున్నారని చెప్పారు. కానీ మీ బ్యాచ్‌లో 40% మంది మాత్రమే అర్హత సాధించారని చెప్పారు.

కానీ అది అక్కడితో ముగియలేదు, చివరకు వారు మెరూన్ బెరెట్ కాప్ ధరించే అవకాశాన్ని పొందారు.

దాని కోసం వారు ఒక కప్పు ప్రత్యేక పానీయం తాగాలి మరియు దానితో పాటు గ్లాస్ తినాలి.

ఇది కూడా కఠినమైన పరీక్ష. పరీక్ష అని అనడం కంటే పారా SF కల్చర్ అనాలి. అందరూ అది కూడా ఉత్తీర్ణులయ్యారు, అందరికీ బలిదాన్ బ్యాడ్జ్‌లు ఇచ్చారు.

బలిదాన్ బ్యాడ్జ్ అంటే: "Men Apart, every man an emperor Shatrujeet"

ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కనీసం 5 పారా జంప్‌లు చేయాల్సిన పారాచూట్ ట్రూపర్ టెస్ట్‌లో కూడా అర్హత సాధించాలి. HALO & H.A.H.O పరీక్ష అర్హత పొందింది. .

ఆ తర్వాత సుబాష్ స్పెషలైజేషన్ కోసం నహ్న్‌లోని స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ హౌస్‌కి వెళ్లాడు. అధునాతన ఆయుధ శిక్షణ, అర్బన్ వార్‌ఫేర్, కౌంటర్ టెర్రరిజం మరియు మార్షల్ ఆర్ట్స్ శిక్షణను అక్కడ అందిస్తారు.


అధ్యాయం VI: మిషన్ ఇన్ కాశ్మీర్సుభాష్ అధునాతన శిక్షణలో ఉన్నప్పుడు, మేజర్ హేమంత్‌ని కలవడానికి ఒక కెప్టెన్ వచ్చాడు.

అతని పేరు కెప్టెన్ కార్తీక్.

ఇద్దరూ కలిసి జమ్మూ & కాశ్మీర్‌లో సీక్రెట్ ఆపరేషన్ చేసారు, సైన్యం వారి గుర్తింపును బయటి ప్రపంచానికి వెల్లడించదు, కానీ హేమంత్ సార్ ఆ ఆపరేషన్ చేశాడని సుభాష్‌కి బాగా తెలుసు.

కొన్ని రోజుల తర్వాత హేమంత్ అనుకున్నట్టుగానే మంచి టీమ్‌ని తయారు చేశాడు. ఈ బృందం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మయన్మార్ ("మిషన్ యురేనియం")కి మిషన్‌కు వెళ్లవలసి వచ్చింది.

అక్కడ మిషన్ విజయవంతమైంది, కానీ హేమంత్ బృందంలోని ఇద్దరు మిషన్‌లో మరణించారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు గెలుపు/ఓటముల గురించి మాత్రమే పట్టించుకుంటాయి. అక్కడ కూడా అదే జరిగింది.

ఆ మిషన్ తర్వాత, కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత, హేమంత్ మినహా మిగిలిన బృందం బేస్ లొకేషన్‌కు తిరిగి రిపోర్ట్ చేశారు.

ఆ సంఘటన తర్వాత హేమంత్‌ని ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉంది, హేమంత్‌కి రెండు రోజులు నిద్ర పట్టలేదు, చనిపోయిన సైనికుడి కలలు అతని కలల్లో వస్తూనే ఉన్నాయి. అంతకుముందు కూడా అతనికి అదే జరిగింది. అప్పటి నుంచి కొద్దిరోజులుగా ఆర్మీకి దూరంగా ఉన్నారు.

ఒకప్పుడు, అతను రాంగ్ ఇంటెల్ కారణంగా తన జట్టును కోల్పోయాడు, ఇప్పుడు అతను తన జట్టులోని ఇద్దరిని కోల్పోయాడు. ఈసారి అది అతని తప్పా లేక సైన్యమా, లేక శత్రువుల బలమా అనేది తెలియదు. అయితే అమరవీరులైన జవాన్లు, హేమంత్ కుటుంబాలకు శిక్ష విధించారు.

హేమంత్ చనిపోయే ముందు సైనికుల్లో ఒకరు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేడు.

"నీ వైఫల్యానికి నా మరణం కారణం కాకూడదు, నా మరణం నిన్ను 100 అడుగులు ముందుకు వేయాలి.

మా ముందు మరణం చాలా చిన్నది సార్, మీ కింద సేవ చేయడం గౌరవం, మీ చేతుల్లో నేను చనిపోతున్నందుకు సంతోషంగా ఉంది"

ఆ మిషన్ తర్వాత, సుభాష్ లెఫ్టినెంట్ నుండి కెప్టెన్‌గా ప్రమోషన్ పొందుతాడు. కానీ అది అతనిలో గొప్ప ఆనందాన్ని నింపలేకపోయింది. వారిద్దరి మరణం అందరినీ తీవ్ర బాధను నింపింది. ఆ మిషన్ కారణంగా భయ్యూంగ్ ఆర్మీని విడిచిపెట్టాడు. తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు.

సుభాష్ కొన్ని రోజులు సెలవు తీసుకుని హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. హేమంత్ సిద్ధమవుతున్న సమయంలో సుబాష్‌ని కలవడానికి అక్కడికి వస్తాడు.

హేమంత్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అక్కడికి రావడంతో సుభాష్ సంతోషించాడు.

హేమంత్ ఇలా అన్నాడు, “నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు, కానీ నువ్వు సైనికుడివి అని మర్చిపోవద్దు. లోలోపల ఎంత బాధ ఉన్నా అది మన కర్తవ్యాన్ని ఎప్పటికీ ఆపదు.

నువ్వు సెలవు పెట్టి ఇంటికి వెళ్తున్నావని నాకు తెలుసు, నీకు ఇది కావాలి, అన్నీ మర్చిపోయి కాసేపు అక్కడే ఉండు”.

సుభాష్ మెల్లగా ఎగ్జిట్ వైపు నడిచాడు. హేమంత్ సుభాష్‌కి ఫోన్ చేసి "అభినందనలు, నిన్ను చూసి గర్విస్తున్నాను" అన్నాడు.

సుభాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు, మేజర్ హేమంత్ తిరిగి వచ్చి సైన్యంలో చేరాడు. విధుల్లో చేరిన తర్వాత మొదటి విషయం ఏమిటంటే, అతను J & K లోగోకు సంబంధించిన కొంత సమాచారం గురించి కెప్టెన్ కార్తీక్‌కు సన్నిహితుడైన “విక్రమ్”కి కాల్ చేసాడు, అతను ఆ సమయంలో UKలో ఉన్నాడు.

 


VII అధ్యాయం: సుభాష్ ప్రేమ కథ చాలా కాలం తర్వాత సుభాష్ సెలవుపై హైదరాబాద్ వచ్చాడు, అజయ్ అప్పటికే ఉద్యోగరీత్యా హైద్రాబాదులో ఉంటున్నారు. అజయ్ హైదరాబాదులో ఉన్న సుభాష్ ఇంట్లోనే ఉంటున్నారు. యురేనియం మిషన్ తర్వాత కాస్త గ్యాప్ కావాలని భావించి సుభాష్ సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు, చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అప్పటికే అలిసిపోయిన సుభాష్ తొందరగా వెళ్లి పడుకున్నాడు. 

(మరుసటి రోజు ఉదయం అజయ్ లేవకముందే సుభాష్ తన ఛాతీపై బుల్లెట్ తగిలిన గాయాన్ని శుభ్రం చేసుకొని వచ్చాడు, అజయ్ చూసి అడిగాడు ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు. సుభాష్ నిద్ర పట్టడం లేదు అని సమాధానం ఇస్తారు. , అది యురేనియం మిషన్ నుండి వచ్చింది, అతను దాని గురించి ఎవరికీ చెప్పలేదు, అజయ్‌కి తెలియకుండా కొంచెం జాగ్రత్త పడ్డాడు)

అజయ్ ఎందుకో ఆ మాటలు నమ్మలేదు, వెంటనే సుభాష్ కి ప్రమోషన్‌ వచ్చిందన్న వార్తను సంతోషంగా ప్రకటించాడు. ఆ మాటలు విన్న అజయ్ ఏం చేద్దాం అని అడిగాడు. సుభాష్ నువ్వు ఏమి అనుకుంటున్నావు అని అడిగాడు, దానికి అజయ్ తాగుదాం అని సైగ చేసాడు, సుభాష్ కొంచెం కోపంగా (కోపం నటిస్తూ) చూసాడు, దానికి అజయ్ నువ్వు ఎలా చెబితే అలా అని అన్నాడు. 

సుభాష్: ఇద్దరం కలిసి అనాధ శరణాలయానికి వెళ్దాం. అక్కడ చిన్న పిల్లలకు కొన్ని గిఫ్ట్స్, బట్టలు మరియు ఇతర వస్తువులు తీసుకు వెళదాము. అలాగే, వార్డెన్‌కి కొంత డబ్బు ఇస్తే ఆమె పిల్లల అవసరాలు చూసుకుంటుంది.

అజయ్ కూడా మంచి ఐడియా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు.

అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు. పిల్లలకు మిఠాయిలు, పుస్తకాలు తీసుకెళ్లి వారితో కాసేపు గడిపారు, వారితో కొంత సమయం చాలా సంతోషంగా గడిపారు.

అజయ్ ఒక చిన్న అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమెతో ఆడుకుంటూ కాసేపు మాట్లాడటానికి ప్రయత్నించాడు.

అజయ్ ఆమెను “పెద్దయ్యాక ఏమవుతావు అమ్మ, నీకు ఏమి చదవాలని ఉంది? అని అడిగాడు, దానికి ఆ చిన్నారి, "నేను నీ కంటే పెద్దగా అవుతాను, ప్రపంచాన్ని చదువుతాను" అని తుంటరిగా సమాధానం ఇచ్చింది. 

ఆ సమాధానం విని అజయ్ కి మాటలు రాలేదు.

అజయ్, “ఈ రోజుల్లో పిల్లలు కూడా బుల్లెట్ కంటే గట్టిగా దింపేస్తున్నారు, వారికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు, భవిష్యత్తులో వీళ్ళే మనకి నేర్పిస్తారు” 

అజయ్ అక్కడి నుండి సుభాష్ వైపు మెల్లగా వస్తాడు.

దూరం నుంచి అంతా గమనించి సుభాష్ నవ్వుతూనే ఉంటారు. 

చాలు, లోపలికి వెళ్లి వార్డెన్‌ని కలుద్దాం అని సుభాష్‌ని తనతో పాటు లోపలికి తీసుకువెళ్లాడు.

వారు వార్డెన్‌తో మాట్లాడుతుండగా, కొద్దిసేపటికి బయట పిల్లలందరూ చాలా అల్లరి చేస్తున్నారు . 

అది గమనించిన వార్డెన్ నవ్వుతూ శృతి వచ్చినట్టు ఉంది అని సంతోషంగా చెప్పింది. 

తను అనుకున్నట్లుగానే శృతి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ అందరికీ చాక్లెట్లు తెచ్చి అందరికీ ఇచ్చింది.

అజయ్ "శృతి ఎవరు" అని అడిగాడు?

వార్డెన్, “శృతి ప్రతినెలా ఇక్కడికి వస్తుంది, వచ్చిన ప్రతిసారీ పిల్లలకు ఏదో ఒక వస్తువు తెచ్చి, ఇక్కడి అనాథ పిల్లలతో గడిపేస్తుంది. ఆమె కూడా అనాథ అని చెప్పింది.

అంతకు మించి ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు. ప్రతినెలా మాకు కొంత డబ్బు ఇస్తుంది , ఆమె ఇచ్చిన డబ్బుతో మేము ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాము.

తన వల్ల ఒక బిడ్డ చదువుకోవాలనే కోరిక నిజమైతే చాలా సంతోషిస్తాను ఆమె ఎప్పుడూ చెబుతుంది.”

ఆమె చెప్పిన మాటలు వింటూనే, ఇంకోవైపు సుభాష్ అక్కడ నుండి శృతి వైపు చూస్తున్నాడు. అక్కడ శృతి పిల్లలతో ఆడుకుంటుంది. ఆమె ముఖం కనిపించడం లేదు. 

ఆమెను చూడకముందే సుభాష్ ఆమె స్వచ్ఛమైన మనుసుకి కనెక్ట్ అయ్యారు. సుభాష్ కి ఆ అమ్మాయి బాగా నచ్చింది.

సుభాష్ అజయ్‌తో ముందే చెప్పినట్లు వారికి సహాయం చేయాలనీ అనుకున్నాడు, వార్డెన్‌కు అదే మాట చెప్పారు, సుభాష్ ప్రతి నెలా జీతంలో కొంత భాగాన్ని ఇస్తామని హామీ ఇచ్చాడు, దానితో పాటు వార్డెన్‌కు 50 వేలు ఇచ్చాడు.

“మా ఈ చిన్న సహకారంతో ఒక చిన్నారి భవిష్యత్తు మారిన అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది” అంటారు సుభాష్. సరిగ్గా శృతి చెప్పిన మాటలు లాగానే ఉంటాయి 

సుభాష్ మరియు అజయ్ బయటకు వస్తున్నప్పుడు శృతిని మొదటిసారి చూశాడు, సుభాష్ ఆమె వైపు చూస్తుండగా ఆ క్షణం సుభాష్ ప్రపంచం మారిపోయినట్లు అనిపించింది. సుభాష్ కదలకుండా అలాగే ఉన్నాడు. 

అజయ్ సుభాష్ భుజం తట్టి పిలిచాడు, అప్పటి వరకు సుభాష్ విగ్రహంలా ఉన్నాడు.

ఇద్దరూ వార్డెన్ కి వెళ్తామని చెప్పి బయటికి వస్తారు. శృతి కూడా బయటకు వచ్చింది. సుభాష్, అజయ్ ఆమెను అనుసరించారు.

శ్రుతి రోడ్డు పక్కన సైడ్ వాక్ పై నడుస్తుంటే, ఒక అబ్బాయి శృతిని ఢీకొట్టి వెళ్ళిపోయాడు. శృతికి అది అస్సలు నచ్చలేదు. అతన్ని వాడిని వెనక్కి పిలిచి చెంప మీద కొట్టింది. వాడు కావాలనే అలా చేసాడని శృతికి బాగా తెలుసు, శ్రుతిని చెంప మీద కొట్టడంతో వాడు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు.

సుభాష్, అజయ్ దూరం నుంచి అక్కడ జరిగింది అంతా చూసారు. 

అజయ్ అడిగాడు, "నీకు ఆమె నచ్చిందా" అని ?

దానికి సుభాష్, “ఇతరులకు సహాయపడే మంచి మనసు, ఆకతాయిల చెంప చెళ్లుమనిపించిన ధైర్యం. she is a perfect girl”.

ఇద్దరు ఆమెను వెంబడిస్తూ శృతి ఫ్లాట్ దాకా వెళ్లారు. అమ్మాయి వివరాలు కనుక్కోవాలని సుభాష్ అజయ్‌ని అడుగుతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. ఆరోజు సుభాష్ ఇంట్లోనే ఉంటాడు. అజయ్ అదే పని మీద బయటకి వెళ్తాడు.

మరుసటి రోజు ఉదయం, అజయ్ బయటకి వెళ్ళాడు. సుభాష్ ఇంట్లో ఉన్నాడు, యురేనియం మిషన్ లో మరణించిన తన స్నేహితులు గుర్తుకు వచ్చారు. అదే సమయంలో అజయ్ ఇంటికి వస్తాడు. సుభాష్, సుభాష్ అని రెండు సార్లు పిలిచి ఇంటి లోపలికి వస్తాడు. అయితే అజయ్ పిలుస్తున్న సుభాష్ వేరే ఆలోచనలో ఉన్నాడు. అజయ్ ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? అని అడుగుతాడు. కానీ సుభాష్ దాటేశాడు.

సుభాష్ అజయ్‌ని అడిగాడు ఆమె గురించి మీకు తెలుసా?

అజయ్ "ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను" అని చెప్పాడు.

సరే చెప్పు ఆమె గురించి అని సుభాష్ అడుగుతాడు. 

అది అది, ఆమె అని అజయ్ నీళ్లు నవులుతున్నాడు. 

అది ఏమిటి, ఆమె ఎవరు?? అని సుభాష్ ప్రశ్నించారు.

అజయ్ భయపడుతూ ఆమె ఒక వ్యభిచారి అని బదులిస్తాడు. 

అది విన్న సుభాష్ మొదట షాక్ అయ్యాడు, కానీ వెంటనే ఆ షాక్ నుంచి బయటపడ్డాడు.

అజయ్ సుభాష్ మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. 

“ఆమె గురించి మర్చిపోరా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నీకు బాగా నచ్చిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది, ఆమెను మర్చిపో”.

కానీ సుభాష్ మాత్రం నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. 

అజయ్ “నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటే. ఆమె గురించి అంతా తెలిసిన తర్వాత కూడా ఆమెను ప్రేమిస్తావా ? అలాంటి అమ్మాయిని ఎవరు ప్రేమించరు."

దానికి సుభాష్ "నేను ఆమెను ప్రేమిస్తున్నాను మరియు ప్రేమిస్తూనే ఉంటాను" అని చెప్పాడు.

అజయ్ కోపంతో ఇలా అన్నాడు, "అలాంటి పని చేసే అమ్మాయితో ప్రేమ ఏంటి రా “?

సుబాష్ మాట్లాడుతూ “నువ్వు అలాంటి అమ్మాయిని ఎవరు ప్రేమించరు అంటున్నావ్, అలాంటి పని చేస్తున్న తన మనసు ఎంత పవిత్రంగా ఉంది అని నేను చూస్తున్న"

నా మాట ఒక్కసారైనా విను రా అని అజయ్ అడుగుతాడు. 


సరే నీకోసం మళ్ళీ అక్కడికి వెళ్దాం, తనని చూస్తా, తను అలాంటిది అని తెలిసిన తర్వాత కూడా తన మీద ప్రేమ తగ్గింది అనిపిస్తే మళ్ళి తనని చూడ... ఓకే నా? అది కూడా కేవలం నీకోసం అని సుభాష్ చెప్పాడు. 


తర్వాత ఇద్దరు ఆమె ఇంటి దగ్గరికి వెళ్లారు. కొంచెంసేపు ఆమె కోసం వెయిట్ చేసారు. కొంతసేపటికి శృతి బయటకు వచ్చింది. సుభాష్ దూరం నుంచి ఆమెకు కనపడకుండా కాసేపు శ్రుతిని చూస్తూ ఉండిపోయాడు. 

అజయ్ "నువ్వు ఇప్పుడు చెప్పు, అది (ప్రేమ) ఇప్పుడు తగ్గిందా" అని అడిగాడు.

సుభాష్: తగ్గలేదు, పెరిగింది. మీరందరూ ఆమె ఏం చేస్తుందో అని చూస్తున్నారు, నేను మాత్రమే ఆమె స్వచ్ఛమైన మనసును చూస్తున్నాను, అందుకే ఆమెపై ప్రేమ రోజురోజుకు ప్రేమ పెరుగుతోంది

అజయ్ కి చాలా కోపం వస్తుంది, సుభాష్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. 

అజయ్ అన్నాడు, “సరే సరే, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అని ? నీకు ఏది ఇష్టమో అది చేసుకో” 

అని అతని భుజాల మీద చేయి వేసి కారు వరకు తీసుకువెళ్తాడు. 

సుభాష్ అజయ్‌ని అడిగాడు, “నువ్వు ఆమె గురించి ఏమి గమనించారో నాకు చెప్పు.

అజయ్ స్పందిస్తూ, “శృతి ఎక్కువగా రాత్రిపూట బయటకు వస్తుంది. ఆమె సాధారణంగా నిన్న చూసినట్లుగా చాలా ఫార్మల్ దుస్తులు ధరిస్తుంది, కానీ ఆమె పని కోసం బయటకు వెళ్ళినప్పుడు, ఆమె పాశ్చాత్య దుస్తులు ధరిస్తుంది (వ్యంగ్యంగా)”.

ఆమె గురించి నువ్వు కనుగొన్న వివరాలు ఇవా ?అని సుభాష్ చిరాకుగా అంటారు . 

అజయ్: “ఆమె గురించి ఇంకేమి కనుక్కోలేము, సోషల్ మీడియా ఖాతా లేదు, స్నేహితులు లేరు. కుటుంబం లేదు. ఆమె గురించి పూర్తిగా తెలియాలంటే ఆమె చెప్పాలి ”.

నువ్వు నిజంగా హకెర్ అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది అని సరదాగా అంటాడు సుభాష్. 

సుభాష్: "అప్పుడు మనం ఆమె గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కచ్చితంగా ఆమె గురించి తెలిసిన వారు ఎవరొకరు ఉంటారు. "

"నువ్వు ఆర్మీ ఇంటెలిజెన్స్ లేదా నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చు కథ?" అని అజయ్ అడిగాడు.

సుభాష్: ఇది పర్సనల్ వర్క్.

అజయ్: ఎమ్మెల్యే నర్సింగ్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడని, లేదంటే ఆమె తన వద్దకు వెళ్తుందని అజయ్ చెప్తాడు. ఎమ్మెల్యే ఇంటికి వెళదామా (వ్యంగ్యంగా )

ఇప్పుడు కాదు, అవసరమైతే కచ్చితంగా కలుద్దాం, ఇప్పటికి అమ్మాయిని కలిస్తే చాలు అంటారు సుభాష్. 

తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

దూరంగా నుండి ఒక వ్యక్తి అజయ్, సుభాష్ చేస్తున్నదంతా చూస్తున్నాడు. అది వారికి తెలియదు 

సుభాష్ మరియు అజయ్ తరువాతి మూడు రోజులు ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు.

ఒకరోజు ఆమెను అనుసరిస్తుండగా. మధ్యలో అజయ్, “ఇంకా ఎన్ని రోజులు ఇలా చూస్తావు? అదేమైనా కాలేజీ స్టూడెంట్ ఆ ??అని అంటాడు 

"అది" కాదు , "ఆమె" అనాలి ! సుభాష్ చెప్తాడు. 

అప్పుడే అర్థమైంది అజయ్ కి కాస్త జాగ్రత్తగా ఉండాలని.

సుభాష్ కూడా ఆమెను ఇలా ఫాలో అవ్వడం నచ్చలేదు. 

సుభాష్ శ్రుతి దగ్గరకు వెళ్లి "నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను" అన్నాడు.

సుభాష్ తనని ఫాలో అవుతున్నాడని శృతికి ముందే తెలుసు.

“చెప్పండి, ఏమైంది? కొన్ని రోజులుగా నిన్ను ఇక్కడ చూస్తున్నాను, అద్దె ఇంటి కోసం చూస్తున్నారా? ఏదైనా సహాయం కావాలా? మీరు ఊరికి కొత్తగా వచ్చారా ”? అని వ్యంగ్యంగా అడుగుతుంది.

"సరిహద్దులో శత్రువుల ఆయుధాలకు సమాధానమిచ్చే ఈ సైనికుడు ఇక్కడ ఒక అమ్మాయి విసిరిన బాణానికి లొంగిపోయాడు" అని అజయ్ కారులో తనతో తానే మాట్లాడుకుంటున్నారు . .

సుభాష్ ఆమె మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ “నేను నిన్ను ప్రేమిస్తున్నాను"!!! అన్నాడు

శృతికి షాక్!! "ప్రేమా? నాతో ? నేనెవరో, ఏం చేస్తానో తెలిస్తే ప్రేమ, కొవ్వు కరిగిపోతాయి”.

దూరంగా ఉన్న అజయ్: “వాడు ఎవరో తెలిస్తే నీకు ఏమవుతుందో ”?

సుభాష్: నువ్వు ఏమి చేస్తావో నాకు తెలుసు, కానీ అది ముఖ్యం కాదు 

శృతి స్పందిస్తూ, “నా గురించి తెలిసినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ కథ కాస్త తేడాగా ఉంది బాస్! నీకు ఉన్నంత సమయం నాకు లేదు”. అని శృతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత ఆమె సుభాష్‌కి రెండు రోజులు కనిపించదు. రెండు రోజులు ఇద్దరు అక్కడికి వచ్చారు కానీ ఆమె కనబడలేదు.

రెండు రోజుల తర్వాత ఆమె మళ్లీ కనిపించింది, సుభాష్ వెళ్లి మాట్లాడుతూ, “నేను నిన్ను రెండు రోజులుగా నిన్ను చూడలేదు? నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా”?

శృతి, “ఏంటి నీ సమస్య? నన్ను ఎందుకు అనుసరిస్తున్నారు?

ఎవరైనా కాలేజీ అమ్మాయి వెనుక పడచ్చు కదా, పడే అవకాశం అయినా ఉంటుంది. 

చూడడానికి కూడా బాగానే ఉన్నావు కదా! నాలాంటి అమ్మాయిని వెనుక ఎందుకు పడుతున్నావు? 

నిన్ను ఏమనుకోవాలి కూడా తెలియట్లేదు, ప్రేమికుడా లేదా కామాంధుడా ?”

సుభాష్ (నవ్వుతూ) " నువ్వు ఏమనుకుంటున్నావు "?

శృతి: నువ్వు రెండో రకం అయితే ఇప్పటికే తెలిసిపోయేది, నా వెనుక పడటం మానేయండి, ఇది నీ మంచి కోసమే చెప్తున్నా, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి.

దానికి సుభాష్ " ఒక అమ్మాయి అందం చూసీ వచ్చే ప్రేమ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఒక అమ్మాయి మైండ్ సెట్ చూసి వచ్చే ప్రేమ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉంటుంది ఏమో, కానీ ఎప్పుడైతే మంచితనం, వ్యక్తిత్వం నచ్చి వచ్చే ప్రేమ ఉంటుందో అది జీవితాంతం ఉంటుంది, That love is Forever 


నాకు అలాంటి ఫీలింగ్ నిన్ను చూసినప్పుడే మాత్రమే వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే అది నిన్నే“ 


శృతి చిరాకుగా, మాటలు బాగానే మాట్లాడుతున్నావు... అయినా నా గురించి అంత బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు? ఎమ్ తెలుసు నా గురించి ?


సుభాష్ శ్రుతిని ఆశ్రమంలో చూసిన విషయం, అక్కడ నుంచి తనను ఫాలో అయిన విషయం, అప్పటి నుంచి తను అంటే ఇష్టం అని చెప్పాడు. 


అది విన్న శృతి ఒకసారి ఆలోచిస్తుంది, ఒకసారి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కానీ బయటపడదు.


సుభాష్ తన లోపల అనుకున్నది చెప్పేసాడు, “అయినా నువ్వు ఈ పని ఇష్టంతో చేయట్లేదు అని మాత్రం నీ కళ్ళు చెబుతున్నాయి. 


నీ కళ్ళ లోపల సముద్రం అంత కన్నీరు, అంతే లోతు అగాధం, బాధ, మరియు ప్రతీకారం ఉన్నాయ్". 


 ఆ మాట విన్న శృతి లోపలనుంచి వచ్చిన బాధను ఒక్కసారిగా దిగమింగుకుంటుంది. 

శ్రుతి వెంటనే బదులిస్తూ, “నువ్వు నన్ను చూసిన విధానం వలన నీకు అలా అనిపించింది అంతే, నీ చావు నువ్వు చావు, నేను చెప్పాల్సింది నేను చెప్పా” 

అని అక్కడ నుంచి శృతి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది, కానీ సుభాష్ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది.

అప్పటివరకు ఆమె వెనుక ఏదో తెలియని కథ ఉంది అని అనుకున్న, ఆమె రియాక్షన్ ద్వారా అది నిజం నిర్ధారించుకున్నాడు. ఆమె మనసులో ఉన్న ఆ లోతైన బాధని తుడిచేయాలి అని సుభాష్ నిశ్చయించుకున్నాడు. దానికి కావాల్సిన మార్గం అయితే అప్పటికి సుభాష్ కి తెలియదు. 


సుభాష్ శృతితో మాట్లాడం జనార్దన్ అనే ఒక వ్యక్తి చూస్తుండేవాడు. శృతిని వాళ్ళు కలిసిన మొదటి రోజు నుంచి వాళ్ళని అతను గమనిస్తూనే ఉన్నారు, అతను సుభాష్ గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు, అలాగే అజయ్ గురించి కూడా. అతను MLA దగ్గర పనిచేసే PA. 

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జనార్దన్ శృతిని గమనిస్తూ ఉంటారు. 

సుభాష్ గురించి అంతా తెలిసిన తర్వాత, జనార్ధన్ సుభాష్‌ని కలవాలనుకున్నాడు. కాని మరుసటి రోజు సుభాష్‌కి మేజర్ హేమంత్ నుండి కాల్ వస్తుంది. మేజర్ హేమంత్ వెంటనే రమ్మని చెప్తారు.

మేజర్ హేమంత్ పిలిస్తే అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుందని సుభాష్‌కి బాగా తెలుసు అందుకే వెంటనే హేమంత్ దగ్గరకు బయలుదేరాడు.

శ్రుతిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని సరదాగా అజయ్ కి చెప్పి వెళ్ళాడు. ట్రైనులో జనార్దన్, సుభాష్ ని కలుస్తాడు. 

జనార్దన్ రైలులో సుబాష్‌ని కలుస్తాడు.

అతను సుబాష్‌ని  కలిసి శృతి గతం గురించి అంతా చెప్పాడు.

శ్రుతి గతం గురించి, ఆమె పరిస్థితికి కారణం, ఆమె ఎందుకు ఈ స్థితిలో ఉంది, ఆమె కుటుంబం గురించి, ఆమె సోదరి గురించి అన్నీ సుభాష్‌కి చెబుతాడు.

అంతా విని సుభాష్ చాలా బాధపడ్డాడు. ఇది బాధపడాల్సిన సమయం కాదు, ఆమెకు జరిగిన అన్యాయంకి న్యాయం చేసే సమయం అని సుభాష్ నమ్ముతాడు. అందుకే ఆ దిశగా ప్లాన్ చేయాలనుకుంటున్నాడు. జనార్దన్‌కి దానికీ ఒక ప్రణాళిక ఉందని, సుబాష్‌కి వివరించాడు.

సుభాష్: ప్లాన్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావ్?

జనార్దన్: మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, కానీ మేము చావుని చూశాము, భయాన్ని చూసాము. వాటి నుండి ఆమె బయటకు రావాలంటే అంతకు బలమైంది ఒకటి కావాలి, అది ప్రేమ. నమ్మకం, తన కోసం నిలబడే వ్యక్తి. సరైన సమయంలో ఆమెను బయటకు వచ్చేలా ఒప్పించగల వ్యక్తి కోసం ఆగాము. 

సుభాష్ కూడా ఓకే చెప్పాడు. సుభాష్‌కి అంతా చెప్పి రైలు దిగి వెళ్ళిపోతాడు జనార్ధన్.

సుభాష్ హేమంత్ ఉన్న లొకేషన్ కి వెళ్ళాడు. అక్కడ కొన్ని కీలక అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. ఇద్దరూ చర్చలో ఉండగా, ఆర్మీ కార్ప్స్ ఇర్ఫాన్ హేమంత్ కోసం వస్తారు, కానీ హేమంత్ అక్కడ లేరు. సుబాష్‌ని కలవడానికి అప్పుడే బయటకు వెళ్లారు. 

హేమంత్ తనని పిలవడానికి అసలు కారణం చెప్పాడు, హైదరాబాద్‌లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది, దానికి సుభాష్ అవసరం ఉంది, దానికోసం సుభాష్‌ని అక్కడికి బదిలీ చేస్తాడు. దానికి సంబంధించిన పేపర్లు సుభాష్‌కి ఇస్తారు. సుభాష్ వెళ్ళిపోయినా తరువాత హేమంత్ మెరైన్ కమాండర్ విక్రమ్‌కి రెండవసారి కాల్ చేసి, కొంత సమాచారాన్ని కనుగొనమని చెప్తారు.


అధ్యాయం VIII: ప్లాన్ D_ హైదరాబాద్ అసలు కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ??

కొన్ని రోజుల క్రితం!!

హేమంత్ & కార్తీక్ కలిసి జమ్మూ & కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడి చేసినప్పుడు, వారు అక్కడ ఉన్న ఉగ్రవాదులందరినీ చంపేశారు, కానీ ఒక ఉగ్రవాది మాత్రమే ప్రాణాలతో తప్పించుకోగలిగాడు, ఆ విషయం హేమంత్‌కి కూడా తెలియదు.

అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, తప్పించుకున్న ఉగ్రవాది తన బాస్ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ మార్గం మధ్యలో అతనికి యాక్సిడెంట్ జరిగింది. అతని బాస్ పేరు అన్వర్.

(జమ్మూ & కాశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేసింది అతనే. అతను అమలు చేయాలనుకుంటున్న ప్లాన్‌లలో ఇది ఒకటి మాత్రమే. అతని వద్ద ఇంకా చాలా ప్లాన్‌లు సిద్ధంగా ఉన్నాయి మరియు అతను మన దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు. హేమంత్ & కార్తీక్ ఇద్దరూ జమ్మూ & కాశ్మీర్‌లో ఆ కుట్రను ఆపారు.)

హేమంత్‌కి ఫైజల్ గురించి గానీ, అన్వర్ గురించి గానీ అప్పటికి తెలియదు.

నిజానికి అన్వర్ ఎవరో కాదు ఫైజల్.

అతను UKలో తన పేరును అన్వర్‌గా మార్చుకున్నాడు దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి చేసి పెట్టాడు, పాకిస్తానులో జరిగిన ఆ సంఘటన తర్వాత అతని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు.

తప్పించుకున్న ఆ టెర్రరిస్టు ఫైజల్ లొకేషన్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న ఫైజల్ అతడిని ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే ఉంచి వైద్యం చేయించి స్పృహలోకి వచ్చే వరకు ఎదురుచూశాడు. ఆ దాడి గురించి తనకు కొంత తెలిసి ఉండవచ్చని ఫైజల్ అభిప్రాయపడ్డాడు.

కొన్ని రోజుల తర్వాత, యురేనియం మిషన్ పూర్తయిన తర్వాత, అతను స్పృహలోకి వచ్చాడు. అక్కడ దాడికి కారణం ఎవరని ప్రశ్నించారు. అతను గుర్తుపడతాను అని చెప్పడంతో దాడి చేసిన వారి చిత్రాలు గీయడానికి వారు ఒక స్కెచ్ కళాకారుడిని తీసుకువచ్చారు.

వాడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ముఖచిత్రాలు గీస్తారు, వచ్చిన ముఖచిత్రాలు సరియైనదేనా అని అతనిని అడుగుతారు, అతను ఔను అని చెప్పాడు. ఆ ముఖచిత్రం ఫైజల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. .

ఆ ఫోటోలు ఫైజల్ కి చూపించి ఆ రోజు మన వాళ్ళని చంపింది వీడే అని అంటారు ఆ చిత్రాలను చూసిన ఫైజల్‌ నోరు మెదపలేదు. అప్పుడే అతనికి జరిగింది అంతా అర్ధం అవుతుంది, ఆ రోజు జరిగిన సంఘటన గురించి, అక్కడ జరిగిన బాంబు బ్లాస్ట్, తన వాళ్ళు కొంతమంది చనిపోవడం దీనికి అంతటికి కారణం హేమంత్ అని అర్ధం అవుతుంది, అతని శరీరం నుంచి నుంచి చెమటలు ధారలుగా వస్తున్నాయి. 

ఫైజల్ ఆ ఫోటోలు చూస్తుండగానే ఫైజల్ కి రియల్ షాక్ ఇచ్చిన మరో విషయం కూడా గాయపడిన ఆ టెర్రరిస్ట్ చెప్పాడు.

అదే హేమంత్ J & K లోగో గన్ గురించి కూడా ఆరా తీయడం. ఆ విషయం ఫైజల్ ను చాలా కలవరపెట్టింది.హేమంత్ బతికే ఉన్నాడని ఫైజల్ నమ్మలేకపోయాడు.

ఇంతలో అక్కడ ఉన్న సాదిక్ బాబా ఫోటోలు కూడా చూస్తారు (ఫైజల్ UK వెళ్ళినప్పటి నుంచి, సాదిక్ బాబా అతని దగ్గరే ఉంటూ, ఫైజల్ దగ్గర పని చేస్తున్నాడు. అతనికి మార్గనిర్దేశం చేస్తున్నారు. )

హేమంత్ ఫోటో చూసి సాదిక్ బాబా పడిపోయాడు. ఫైజల్ కి ఏమీ అర్థం కాలేదు.

ఫైజల్ అతనిని నిద్రలేపి, "నీకు అతను తెలుసా" అని అడిగాడు.

సాదిక్ బాబా ఫైజల్‌ని అడిగాడు " J&K ఆపరేషన్ ఫెయిల్యూర్‌కి కారణం అతనా?? మన వాళ్ళని చంపింది అతనా"?

ఫైజల్ “అవును బాబా, నాకు ఇప్పుడే అర్ధమైంది పాకిస్తాన్లో, జమ్మూ కాశ్మీరులో మన వాళ్ళని చంపింది వీడే. అంతే కాదు, పాకిస్థాన్‌లో అతని టీంలో ఉన్న వారందరిని నేను చంపేసాను. వాడు కూడా చనిపోయాడని అనుకున్నాను”.

సాదిక్ బాబా భయమైన కంఠంతో నువ్వు ఇంకా బతికే ఉన్నావు అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఒకటి వాడిని చంపెయ్, లేదా నువ్వే చచ్చిపో. ఒకవేళ నీ అసలు రూపం గురించి కానీ, ఎక్కడ ఉంటావో కానీ వాడికి తెలిసిన రోజు ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు. 


నీ కొత్త ముసుగు వలనే నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు, అదే నిన్ను ఇంకా కాపాడుతుంది. ఈ ముసుగు వెనుక ఉన్నదీ ఎవరో అతనికి తెలిసిన వేళ కచ్చితంగా నీకోసం వస్తాడు. 


"వాడు ప్రతీకారంతో మనవైపు అడుగువేస్తే మరణం తప్ప ఇంకేదీ మనల్ని కాపాడలేదు". 

ఫైజల్ మళ్ళీ అడిగాడు, "మీకు వాడు తెలుసా , ఎలా తెలుసు"?

సాదిక్ బాబా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు.

"యుద్ధం చూడాలనుకునే ఏకైక ఆయుధం అతను. మృత్యువు జయించాలనుకునే శాశ్వత శత్రువు అతడు.

ఒక్కటి మాత్రం మర్చిపోకు, వాడు బ్రతికుండగా మనం ఏమి చేయలేము, వాడు మనల్ని చేయనివ్వడు. ముందు వాడిని చంపేయండి. లేదా వాడి చేతిలో చావడానికి సిద్ధపడండి”.

అయితే హేమంత్‌ ఎలా తెలుసు అని సాదిక్ బాబాని ఫైజల్ మళ్లీ అడగ్గా, అతను చెప్పలేదు.

ఫైజల్ ఏదో పెద్ద కారణం ఉంటుందని భావించి మళ్లీ అడగలేదు.

ఫైజల్ చాలా ఆలోచించిన తరువాత, హేమంత్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. హేమంత్‌ బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదేమని హేమంత్‌ని చంపేందుకు పెద్ద ప్లాన్ వేసాడు, అతను అదే విషయం అతని బాస్ అయిన జాన్ రిప్పర్‌కి చెప్పాడు.

((ఫైజల్ ఇప్పుడు UKలో పెద్ద ఆయుధాల వ్యాపారి, జాన్ రిప్పర్ సహాయం పొంది అతను అక్కడ చాలా ఎదిగాడు, ఫైజల్ అతను ఏమి చెప్తే అది చేస్తాడు. ఫైజల్ వెనుక ఉన్న అతిపెద్ద శక్తి అతనే))

కానీ జాన్ రిప్పర్ తాను చెప్పినట్లే చేయమని ఫైజల్‌కు సలహా ఇస్తాడు. ఆ తరువాత జాన్ రిప్పర్ ఇంకో పెద్ద ప్లాన్ వేసాడు. 

హేమంత్‌ని హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ పెద్ద బ్లాస్ట్ చేద్దాం అంటాడు, హేమంత్ మరణం, హైదరాబాద్‌లో గందరగోళం ఒకే దెబ్బకు రెండు పిట్టలు, హేమంత్‌ని హైదరాబాద్‌లో చంపేయాలని అనుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉంది.

హేమంత్ బ్రతికి ఉంటే వాళ్లు అనుకున్నది జరగదని జాన్ రిప్పర్‌కి ఫైజల్ గట్టిగా చెబుతాడు మరియు "హేమంత్  చావు చూసే వరకు నేను ఇంకో పని చేయను అని కూడా గట్టిగా చెప్పాడు. అందుకే ముందుగా హేమంత్‌ని హతమార్చాలని, ఆ తర్వాత హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నారు.

వారు అనుకున్న ప్రకారం హేమంత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఓ నకిలీ ఏజెంటును సిద్ధం చేశారు. ఇంటెల్ సహాయంతో హేమంత్‌ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఊహించినట్లుగానే, ఇంటెల్ హేమంత్ బృందానికి చేరుకుంది & హైదరాబాద్‌లో పెద్ద పేలుడు జరగబోతోందని సమాచారం అందించబడింది.

జనవరి 26న హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

అయితే టెర్రరిస్టుల మొదటి టార్గెట్ హేమంత్ అని వారికి తెలియదు. 

అయితే లీకైన సమాచారంతో పేలుడు పదార్థాలు ఎక్కడ ఉన్నాయి అనేది హేమంత్ కనిపెట్టే ప్రమాదం ఉంది 

అందుకే ఫైజల్ దానికి కూడా ఇంకో ప్లాన్ సిద్ధం చేసాడు. దానికోసం రెండు టీమ్స్ సిద్ధం చేసాడు. మొదటి టీం దొరికిన, రెండో టీం అమలు చేస్తుంది. దీనికోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.


అధ్యాయం IX: ప్రేమ సుభాష్ హేమంత్ దగ్గర ముంబాయిలో ఉన్నప్పుడు హైద్రాబాదులో:

శ్రుతి పని మీద బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అజయ్‌ని చూసింది, కానీ ఆమెకు సుబాష్ కనిపించలేదు. ఆమె అజయ్‌ని రెండు సార్లు గమనించింది కానీ సుబాష్ అతనితో రెండు సార్లు లేడు, ఇది శృతిని చాలా నిరాశకు గురి చేసింది.

ఆమెకు తెలియకుండానే ఆమె సుభాష్‌తో ప్రేమలో పడింది. ఉత్సుకతతో ఆమె అజయ్ వద్దకు వెళ్లి సుభాష్ గురించి అడగాలని నిర్ణయించుకుంది, కానీ ధైర్యం సరిపోలేదు, కానీ ఆమెలోని ప్రేమ అతని గురించి అడగకుండా ఆపలేకపోయింది.

శృతి అజయ్ దగ్గరికి వెళ్ళింది. శృతి రావడం గమనించిన పట్టించుకోనట్టు ఉన్నాడు అజయ్. 

"మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు" ? అని ఆమె అడిగింది 

అజయ్ కాస్త చిరాకుగా సమాధానం చెప్పాడు "సుభాష్ పని మీద బయటకు వెళ్ళాడు"

శృతి: ఎప్పుడు వస్తాడు?

అజయ్: నీకెందుకు? నాకు ఒక విషయం అర్థం కాలేదు? నీలాంటి అమ్మాయిని చూసి ఎవరూ ప్రేమించరు, కానీ నువ్వే తన ప్రాణం అని చెబితే, నువ్వు వాడిని పట్టించుకోవడం లేదు. వాడు చాలా మంచివాడు & నిజాయితీపరుడు, వాడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నువ్వు వాడిని చాలా బాధపెట్టావు. 

అందరూ నువ్వు చేసే పనిని చూసి నువ్వు అంటే ఏమిటో చెప్తున్నారు, కానీ వాడు మాత్రమే నీ మనసును చూసి నువ్వు ఎలాంటి దానివి అని చెప్పాడు అది వాడు.

వాడిని అర్థం చేసుకోకపోవడమే నీ కర్మ. అయినా వాడు ఏమైనా రోడ్ మీద పని పాట లేకుండా తిరిగే వాడు అనుకుంటావా? He is an Indian Army కెప్టెన్. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే ఒక సైనికుడు.

ఆ మాటలు విన్న తర్వాత శృతి కళ్ళ నిండా కన్నీళ్లతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది.


 వెళ్ళిపోతూ ఉండే సమయంలో తనలో తాను ఇలా అనుకుంటుంది.

"నాలాంటి అమ్మాయి వెనుక పడుతున్నప్పుడే అర్థమైంది అతను ఎంత మంచి వాడు అని. నా వల్ల అతని జీవితం నాశనం అవుతుంది అని తెలిసి ఎలా తను అంటే ఇష్టం అని చెప్పగలను".

I know my life will be happy if he is in my life, But if he comes to my life maybe his life will be ruined. 

దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అతను ఎక్కడ? నేను ఎక్కడ? 


నేను ఇక్కడే ఉంటే ఏదైనా జరగవచ్చు, ముందు నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి”


అని తనలో తానే బాధపడుతూ, ఒక చిన్న బ్యాగులో బట్టలు పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. పక్కనే ఉన్న కేఫ్ లో కూర్చుని ఉంటుంది. 

కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు, నిజం చెప్పాలంటే ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. 

అదే సమయంలో, సుభాష్ హైదరాబాద్ వస్తాడు, వచ్చిన తర్వాత సుభాష్ శృతి గురించి అడిగాడు మరియు అజయ్ ఏం జరిగిందో చెప్పాడు. అనుమానం వచ్చిన సుభాష్ వెంటనే శృతి ఉన్న ఫ్లాట్ దగ్గరికి బయలుదేరాడు. తన హ్యాకింగ్ ల్యాప్‌టాప్ తీసుకురావాలని సుభాష్ అజయ్‌ని కోరాడు.

శ్రుతి ఇంటికి వెళ్ళే దారిలో సుభాష్ అజయ్‌కి శృతి గురించిన నిజాలన్నీ చెప్పాడు.

ఇద్దరూ కలిసి శృతి అపార్ట్‌మెంట్‌కి వెళ్తారు కానీ ఆమె అక్కడ లేదు. ఫోన్ ఎత్తడం లేదు. వారు బయటకు వచ్చి ఆమె కోసం వెతుకుతున్నారు కానీ ఆమె ఎక్కడ కనిపించలేదు. 

చివరగా కొంతసేపటికి దగ్గర్లోని కేఫ్‌లో శృతి కనిపించగా, సుబాష్ ఆ కేఫ్‌కి వెళ్లాడు.

శ్రుతికి సుభాష్‌ని చూడగానే లోపల తెలియని ఆనందం కలిగింది. కానీ ఆమె దాన్ని బయటకు చూపించలేదు. ఆమె కొంచెం కోపంగా ఉన్నట్లు నటిస్తోంది.

సుబాష్ ఆమె దగ్గరకు వెళ్లి, “ఎక్కడికైనా వెళ్తున్నావా, నిన్ను ఎక్కడికైనా డ్రాప్ చేయమంటావా” అని వ్యంగ్యంగా అడిగాడు.

ఆ సమయంలో శ్రుతి కొంచెం కోపంగా "అవసరం లేదు, నేను వెళ్ళగలను" అని సమాధానం ఇచ్చింది.

వెళ్లిపోతే నెలనెలా ఆ పిల్లలతో ఆడుకునేదెవరు, మంచి మంచి కథలు చెప్పేదెవరు ? నన్ను ఎవరు చూసుకుంటారు, నాతో ఎవరు మాట్లాడతారు? అని సుభాష్ ప్రశ్నించారు.

శ్రుతి, “పిల్లలని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నీతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎవరు ? అసలు నీ పేరు ఏమిటి?

శృతికి తన పేరు కూడా తెలియదని సుబాష్ ఆశ్చర్యపోతూ, “నా పేరు కూడా నీకు తెలియదా”??

"నువ్వు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని ఎందుకు చెప్పలేదు" అని శ్రుతి అడుగుతుంది.

నీకు నేనంటే ఇష్టమా కాదో ఇంకా చెప్పలేదు? సుభాష్ మళ్ళీ అడిగాడు

శ్రుతి కోపంగా “నువ్వు ఆర్మీ ఆఫీసర్ అని మొదట ఎందుకు చెప్పలేదు” అని అడిగింది.

అతను ఇలా బదులిచ్చాడు “నేను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పడం కన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడం ముఖ్యం అని నేను భావించాను, కాబట్టి నేను చెప్పలేదు.

శృతి ఆ సమాధానానికి పెద్దగా స్పందించలేదు. 

సుభాష్: సరే, నేను ఇండియన్ ఆర్మీ సైనికుడిని అయితే నన్ను ప్రేమించావా ?

శృతి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఆమె మౌనంగా ఉంటుంది.

నేను వెళ్ళిపోతాను, నీకు నేనంటే ఇష్టం లేదని తెలిసి ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను అన్నాడు సుభాష్.

అతను వెళ్లిపోతుంటే శ్రుతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

అది అంతా గమనించిన సుభాష్ తిరిగి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.

“ఇంత ప్రేమ ఉన్న , ఎందుకు చెప్పలేకపోతున్నావు”?

శృతి సుభాష్ కళ్ళలోకి చూస్తూ ఏడుస్తూనే ఉంది, అతని భుజం మీద తల ఆనించి మాట్లాడటం మొదలు పెట్టింది.

శృతి: నీ జీవితంలో నేను సరైన వ్యక్తిని కాదు. నీ జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. నీకు నా గురించి పూర్తిగా తెలియదు.

సుభాష్: నువ్వే నా ప్రాణం, నీ కంటే మంచి వ్యక్తి నాకు ఎవరు దొరకరు.

అదే సమయంలో జనార్ధన్ అక్కడికి వస్తాడు. అతనిని చూసిన శ్రుతి వెంటనే లేచి నిలబడుతుంది, జనార్ధన్ శృతికి అంతకు ముందు జరిగిందంతా చెప్పారు.

జనార్ధన్ “నేను సుభాష్‌కి నీ గతం గురించి అన్నీ చెప్పాను”

శృతి సుభాష్ కళ్ళలోకి చూస్తోంది. సుభాష్ కళ్ళతోనే సమాధానం చెప్పాడు.

సుభాష్ మాట్లాడుతూ “ నీకు ఇంత వరకు ఎవరూ లేకపోయి ఉండవచ్చు, కానీ ఇక నీకు అన్ని నేనే!! అని సుభాష్ అంటారు.. 

అదే సమయంలో అజయ్ కూడా అక్కడికి వచ్చి శృతికి క్షమాపణలు చెప్పాడు. ఇదంతా నా తప్పే అంటాడు. దానికి శృతి చిన్నగా నవ్వింది.

అజయ్ వెంటనే తన పని ప్రారంభించాడు. అతను శ్రుతి చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌ని హ్యాక్ చేసి ఆమె చేతి నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు.

సుభాష్‌ని కలిసినప్పుడు జనార్ధన్ చెప్పిన మరో నిజం ఏమిటంటే, ఆమె చేతికి ఉన్న బ్రాస్‌లెట్, అది మనం అంతా సులువుగా తీయలేము, అది ఆమె లొకేషన్ తెలియజేసే ట్రాకర్. ఒక సాధారణ హ్యాకర్ దానిని తీయలేరు. జనార్దన్ అజయ్ గురించి కూడా ఆరా తీస్తారు, అతని హ్యాకింగ్ సామర్ధ్యాల గురించి అతను తెలుసుకున్నాడు. అందుకే అంతా ముందే ప్లాన్ చేసాడు. .

శ్రుతి మొదట్లో తీసేయొద్దు అని చెప్పింది, అది తీయడానికి ప్రయత్నిస్తుంటే శృతికి భయం ఎక్కువైంది. శృతి దొరక్కపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని భయపడుతోంది. సుభాష్ అప్పుడే ఆమె దగ్గరికి వెళ్లి ఆమె భుజం మీద తన చేయి ఉంచి ధైర్యం చెప్తాడు. 

శృతి ఒకవేళ దొరకకపోతే తన చెల్లిని టార్గెట్ చేస్తారని ఆమెకు తెలుసు. అది ఆమె భయం, శృతికి ఒక చెల్లెలు ఉంది.

ఆమె భయానికి కారణం ఏమిటో జనార్దన్ కి అర్ధం అయింది, తన సోదరి క్షేమంగా ఉందని జనార్దన్ హామీ ఇచ్చిన తర్వాతే, ఆమె బ్రాస్‌లెట్‌ను తొలగించడానికి అంగీకరించింది.

సుభాష్ ముంబైకి వెళ్లిన రోజు, అదే రాత్రి శృతి చెల్లెలు ఎమ్మెల్యే వ్యక్తుల నుంచి పారిపోయి వేరే ప్రదేశానికి వెళ్లింది, జనార్దన్ అదే విషయం సుభాష్‌కి చెబుతాడు. ఆ తర్వాత శృతిని అక్కడి నుంచి తీసుకెళ్లాలనుకున్నారు.

ట్రాకర్‌ను తొలగించిన తర్వాత అజయ్ ట్రాకర్‌ను ఎవరూ చూడకుండా రైల్వే కంపార్ట్‌మెంట్ వాష్‌రూమ్‌లో ఉంచాలని ప్లాన్ చేశాడు.

ఇప్పుడైనా నువ్వు సుభాష్ దగ్గరికి వెళ్ళిపో అని జనార్దన్ అంటారు, అయినా తను వెళ్ళను అనే చెప్తుంది, దానికి గల కారణం సుభాష్‌కి అర్ధం అవుతుంది.


నువ్వు ఎందుకు వాడి దగ్గర ఉన్నవో నాకు తెలుసు, నువ్వు అనుకున్నది చేసే బాధ్యత నాది. ఇది ఒక సోల్జర్ మాట " నువ్వు ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంతా నేను చూసుకుంటా” అని సుభాష్ చెప్పాడు. 

కానీ శృతికి వెళ్లడం ఇష్టం లేదు, ఇదే సరైన సమయం అని జనార్ధన్ ఆమెకు చెప్పాడు.

ప్లాన్ చేసింది తన చెల్లి అనే విషయం చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. 

కానీ అంతకు ముందు ఆమె తన సోదరితో మాట్లాడాలనుకుంటోంది, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది, ఆమె సోదరి ఎప్పుడు బిజీగా ఉంటుంది. 

జనార్దన్ తన సోదరి ఎక్కువగా తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉంచుతుందని, శ్రుతికి కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయం శ్రుతికి కూడా తెలుసు. ఆమె బిజీగా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. 

కొంత నిరాశ దానితో పాటు కొంత అనుమానం. కానీ జనార్దన్ మళ్ళీ చెప్పాడు తను వాళ్ళ నుంచి తప్పించుకున్న అని చెప్పిన తర్వాత ఇది ప్లాన్ చేసాం అని చెప్పిన జనార్దన్ మాటలు నమ్ముతుంది. శృతి చెల్లెలు, జనార్దన్ ఇద్దరు సుబాష్‌ని కలిసిన తర్వాత అనుకున్న ప్లాన్ ఇది. 

శ్రుతి జనార్దన్‌కి తిరిగి కాల్ చేస్తే తనకు కాల్ చేయమని జనార్దన్‌ని కోరింది.

ఆ తర్వాత శృతి నెంబర్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అయితే సిమ్‌ని డ్రాప్ చేయవద్దు అని సుభాష్ చెప్పాడు. జనార్ధన్ ఎవరికీ తెలియకుండా కొత్త నెంబర్ తో సుభాష్‌తో టచ్ లో ఉంటాడు.

సుబాష్, జనార్దన్‌లకు అజయ్ రెండు మొబైల్ ఫోన్లు ఇచ్చాడు. రెండు ఫోన్‌లు ఎవరూ హ్యాక్ చేయాలనీ హ్యాక్ ప్రూఫ్ ఫోన్స్ వాళ్ళకి ఇస్తాడు. సుభాష్ శృతిని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. శృతి చెల్లిని కాంటాక్ట్ చేయడానికి జనార్ధన్ వాడే ఇంకో సిమ్ కూడా ఆ మొబైల్‌లో పెట్టాడు.

మరోవైపు, హేమంత్ సార్ చెప్పిన సమాచారాన్ని తెలుసుకునే పనిలో ఉన్నాడు సుభాష్. ఈ టాస్క్‌లో అతి ముఖ్యమైన పని ఏమిటంటే, దాడిలో చేయాలనుకునే ఉగ్రవాదులను మరియు వారి ఆయుధ స్థావరాన్ని కనుగొనడం.

హేమంత్ ఎవ్వరినీ డైరెక్టుగా ఎంగేజ్ చేయవద్దని పదే పదే చెప్పారు\, సుభాష్ దానికి సరైనవాడు అని బాగా తెలుసు అందుకే ఆ పనిని సుభాష్ చేతిలో పెట్టాడు. నిఘా మాత్రమే.

హేమంత్ చెప్పిన లిస్ట్ ప్రకారం రాత్రి వేళల్లో ఎవరికీ తెలియకుండా సుభాష్ కొన్ని ముఠాలు, వాటికి సంబంధించిన కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఒకరోజు పబ్, ఇంకో రోజు కాలేజీలు, ఇంకో రోజు దినసరి కూలీలు అందరినీ చాలా దగ్గరగా అనుసరించారు.

ఆ గుంపులో చాలా మంది విద్యార్థులు ఉండగా కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళు ఇలా చేసేవారు.

సుభాష్ ప్రతి ఒక్కరి గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు, అలానే అన్ని విషయాలు హేమంత్‌కు అప్‌డేట్ చేస్తున్నాడు.

అన్ని గ్యాంగ్‌లలో, ఒక ముఠా మాత్రమే దాడికి ప్లాన్ చేస్తుంది, అందరూ ఆ దాడిలో పాల్గొనకపోయినా, వారు అందరినీ అనుసరించి, అసలు వారిని ఫిల్టర్ చేయాలని, ఆపై వారి ద్వారా ఆయుధాల గురించి సమాచారాన్ని పొందాలని అతను భావిస్తాడు. సుభాష్ ముఠా మరియు దానిలోని కొంతమంది అనుమానితుల జాబితా మరియు వారి కదలికలను కనుగొనే పనిలో ఉన్నాడు.

శృతికి ఇచ్చిన మాట, మరో వైపు హేమంత్ సార్ అప్పగించిన మిషన్ చాలా ముఖ్యం. హేమంత్ సార్ హేమంత్‌కు చేసే ఏకైక వ్యక్తి సుభాష్.

శృతి కనిపించడం లేదు అనే విషయం నర్సింగ్ కి తెలిసింది. శృతి కనిపించకపోవడంతో ఎమ్మెల్యే నర్సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆమె ఉన్న లొకేషన్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ట్రాకర్ మాత్రమే ఉంది.

సుభాష్ శృతికి చెప్పినట్లుగా ఎమ్మెల్యే నర్సింగ్ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయడానికి సుభాష్ & అజయ్ కలిసి వ్యూహాలు పన్నుతున్నారు. ఆ క్రమంలో అజయ్, శృతి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

ముందుగా ఎమ్మెల్యే పరువు తీయాలని అజయ్ ప్లాన్ చేశారు, తెలియని నంబర్ నుండి లింక్ పంపి అతని ఫోన్‌ను హ్యాక్ చేయాలనుకున్నాడు మరియు అది ప్లాన్‌లో భాగం. తెలియని వ్యక్తి లింక్ పంపితే, అతను దానిపై క్లిక్ చేయడు, కాబట్టి తెలిసిన వ్యక్తి నుండి పంపాలనుకుంటున్నాడు.

అందుకే శృతి ఫోన్ నుంచి పంపిస్తారు. కానీ అతను లింక్‌పై క్లిక్ చేయలేదు. అప్పటికే అతనికి శృతి అక్కడ లేదని తెలిసింది. అందుకే రిస్క్ తీసుకోలేదు. తన ప్లాన్ ఫలించకపోవడంతో అజయ్ నిరాశ చెందుతాడు.

అయితే శృతి పగ తీర్చుకోవడం కోసం చాలా కాలంగా అతనితో కలిసి ఉంది! అందుకే ఆమె అతనికి వ్యతిరేకంగా ఆధారాలు, అతడు చేసిన కొన్ని అక్రమాలకు సంబంధించిన వీడియోలను సేకరించి ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్ లో దాచిపెట్టింది.

ఆమె ఆ పెన్ డ్రైవ్‌ను అజయ్‌కి ఇచ్చింది, తర్వాత ఏమి చేయాలో అజయ్‌కి తెలుసు.

శ్రుతి సుభాష్ ఇంటికి వెళ్ళిన తర్వాత, జనార్ధన్ శృతి సోదరిని సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అతను సుభాష్‌కి ఈ సమాచారం ఇచ్చాడు. కానీ వారు శృతికి ఆమె సోదరి గురించి చెప్పలేదు.

శృతి చెల్లి గురించి అడిగితే. ‘‘మీ చెల్లి అప్పుడప్పుడు ఫోన్ చేస్తోంది’’ అని జనార్దన్ చెప్పాడు. 

తను అక్కడ నుంచి తప్పించుకున్నాను అని తెలిసిన ఇంకా చెల్లి ఎందుకు ఫోన్ కూడా చేయలేదు అని శృతి ఆలోచనలో పడింది. 

జనార్దన్: తను ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ లో ఉంది అని చెప్పింది, అది అయిపోగానే నీ దగ్గరికే వస్తాను అని చెప్పమంది. ఆ మాట ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. 

శ్రుతి సోదరి ఏదైనా ముఖ్యమైన వార్తలను కవర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుందని వారిద్దరికీ తెలుసు, అందుకే వారు దానిని చాలా సీరియస్‌గా తీసుకులేదు , ఇది చాలాసార్లు జరిగింది. కానీ శృతి మాత్రం చెప్తుంది, "తను కాల్ చేస్తే ఒకసారి నాతో మాట్లాడమని చెప్పండి" అని 

సుబాష్, అజయ్, శ్రుతి ఇంట్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే నర్సింగ్‌కి సంబంధించిన ఒక టీవీ న్యూస్ టెలికాస్ట్ అవుతోంది. ల్యాండ్ మాఫియా, హత్యలు, లంచం వంటి అతని నేరాలకు సంబంధించిన వీడియోలు న్యూస్ ఛానెల్‌లకు లీక్ అయ్యాయి. ఆ పని అజయ్ & సుభాష్ చేశారు. 

ఆ క్షణం శ్రుతి చాలా సంతోషంగా ఉంది, ఎమ్మెల్యే నర్సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు, అయితే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారు.

అప్పటికే శ్రుతి మిస్ అయిందని చాలా కోపంగా ఉన్నాడు అతను. ఆమె సోదరి కూడా తప్పించుకుందని అతని మనుషులు వచ్చి అతనికి చెప్తారు. అతని అరెస్టు వెనుక శృతి ఖచ్చితంగా ఉందని అతను గ్రహించాడు.

ఎమ్మెల్యే "ఏం చేస్తున్నావు" అని జనార్దన్‌పై అరిచాడు. మీరు అరెస్టు చేయబడినప్పటి నుండి, నేను మీ కోసం బెయిల్ కోసం బిజీగా ఉన్నందున నేను ఆమెను పట్టించుకోలేదు అని అతను బదులిచ్చాడు.


అధ్యాయం X: ఊహించని సంఘటన.ముంబయిలో: సుభాష్ ముంబాయికి వచ్చి వెళ్లిన మరుసటి రోజు ఉదయం::

ఆర్మీ కార్ప్స్‌లో పనిచేస్తున్న ఇర్ఫాన్ (గతంలో హేమంత్‌తో కలిసి పనిచేశాడు). అతను ముందు రోజు రాత్రి కారు ప్రమాదంలో మరణించారు.

ప్రమాదం గురించి తెలియగానే హేమంత్ ఇర్ఫాన్ ఇంటికి వెళ్లాడు.

ఇర్ఫాన్ చనిపోయే ముందు హేమంత్‌ని కలవాలనుకున్నాడు కానీ కుదరలేదు. అదే సమయంలో హేమంత్ సుభాష్‌ని కలవడానికి బయటకు వెళ్లాడు.

అతను అంత్యక్రియలలో ఉన్నప్పుడు, ఇర్ఫాన్ తల్లి హేమంత్ దగ్గరకు వచ్చింది.

ఇర్ఫాన్ తల్లి చెప్పిన ఒక విషయం చాలా ప్రశ్నలకు దారితీసింది.

ఆమె మాట్లాడుతూ ‘‘నా కొడుకు ఇర్ఫాన్ తన జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదు. మాంసాహారం ముట్టుకోలేదు, కానీ చివరకు మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడని పేర్కొంటూ కేసు క్లోజ్ చేశారు.

నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణమిస్తాడు కానీ, ఇలా చేయడు. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. వాడి చావుకి విలువ లేకుండా చేశారు, వాడిని ఒక మంచి సైనికుడు అని ఈ దేశం గుర్తిస్తే అది చాలు అనుకునేవాడు. అదే గుర్తింపు వాడికి దూరం చేసారు

నా కొడుకు రోజూ నీ గురించే మాట్లాడుతుంటాడు, నువ్వంటే వాడికి చాలా అభిమానం, నువ్వు సైనికులకు అండగా నిలబడేవాడివి అన్నాడు.

కానీ వాడు చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు. మీరు తనతో ఉంటే ఈ రోజు వాడు నాతో ఉండేవాడు

నా కొడుకు నిజాయితీని ఈ ప్రపంచానికి నిరూపించగలవా? ఒక తల్లిగా నాకు కావాల్సింది అదొక్కటే.”

హేమంత్ ఇర్ఫాన్ తల్లితో కలిసి అతని మృతదేహం వద్దకు వెళ్లి ఇర్ఫాన్ చేతులు పట్టుకుని ఇలా అన్నాడు

"నన్ను క్షమించు ఇర్ఫాన్, నీకు తగిన గౌరవం లభిస్తుంది, దీని వెనుక ఎవరున్నారో వాళ్ళని నీ వద్ధుకు వచ్చేలా చేస్తాను, నా మాట”

హేమంత్ అంత్యక్రియలు వరకు అక్కడే ఉంటారు.

ఇర్ఫాన్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదిక నిర్ధారిస్తుంది, అయితే అతనికి మద్యం అలవాటు లేదని ఇర్ఫాన్ తల్లి చెప్పింది. ఆ విషయం హేమంత్‌కి కూడా తెలుసు.

పోస్ట్‌మార్టం నివేదిక చదివిన తర్వాత, హేమంత్ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, కేసు ఫైల్‌ను గమనించారు, అలానే కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసురుని కూడా కలవడానికి వెళ్ళాడు. 

సిఐ రమాకాంత్, పోలీసు అధికారి. హేమంత్‌కి మంచి స్నేహితుడు మరియు హేమంత్‌కు అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో సహాయం చేశాడు. మరియు యాక్సిడెంట్ జరిగిన స్థలాన్ని కూడా ఇద్దరు వెళ్లి గమనిస్తారు 

(అక్కడ CC కెమెరా కవరేజ్ లేదు, నేరాలకు అనువైన ప్రదేశం, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగినట్లు అనిపిస్తుంది)

ఇర్ఫాన్ చివరిసారిగా ఎవరిని కలుసుకున్నారు అని ఆరా తీశారు, చివరగా కలిసింది అతని స్నేహితురాలు, ఆమె ఒక క్రైమ్ జర్నలిస్ట్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇర్ఫాన్ చనిపోయిన తర్వాత ఆమె కూడా కనిపించలేదు. ఓ క్రిమినల్ జర్నలిస్టును ఇర్ఫాన్ ఎందుకు కలిశాడు?

ఆమెను కూడా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ గుర్తు తెలియని మృతదేహం దొరకలేదు. హేమంత్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు, ఆమె ఇంకా బతికే ఉంటుందని అతను విశ్వసించాడు. రమాకాంత్ కూడా తన బృందంతో ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు.

ఆమె కోసం పోలీసులు & హేమంత్ మాత్రమే కాకుండా ఇంకో టీం కూడా వెతుకుతున్నారని తర్వాత తెలిసింది. జర్నలిస్ట్ ఇంటికి వెళ్లిన తర్వాత కొందరు లోపల పరిస్థితిని బట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఉంటారని అర్థమైంది, లోపల వస్తువులన్నీ ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వారు ఏదో వస్తువు కోసం వెతికి ఉండవచ్చు అని తెలుస్తుంది. 

ఇర్ఫాన్ చనిపోయిన రోజు ఆమె చివరిగా ఫ్లాట్‌కి వచ్చింది. ఫ్లాట్ చుట్టుపక్కల విచారించగా, ఇర్ఫాన్ మరణానికి ముందు ఒక అమ్మాయి ఒక వ్యక్తి తలపై కొట్టి పారిపోయిందని తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం ఆమె జర్నలిస్ట్ అని తెలుసుకుంటారు. 

గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకుంటారు, అతని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారు. అతను హైదరాబాద్‌కు చెందినవాడని తెలుసుకుని ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఆరా తీశారు. ఇర్ఫాన్ హత్యతో అతనికి ఏమైనా సంబంధం ఉందా అని రమాకాంత్ దర్యాప్తు ప్రారంభించాడు.

కొంతమంది రష్యన్ మాఫియా వ్యక్తులు హైదరాబాద్‌లో దిగారు, వారు ఎవరి కోసమో తీవ్రంగా వెతుకుతున్నారు.

మరోవైపు, హేమంత్ ఆ జర్నలిస్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించమని చెప్తారు.

అప్పటికే పరువు పోగొట్టుకున్న ఎమ్మెల్యేను రష్యా గ్యాంగ్ హైదరాబాద్‌లో కలిశారు, అతను సహాయం చేయను అని చెప్తాడు, కానీ వారు వెతుకుతున్నది శృతి అని చెప్పడంతో అతను ఆలోచించడం మొదలు పెట్టాడు.

చాలా సేపు ఆలోచించిన తరువాత ఎమ్మెల్యే వారికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు అది కూడా ఒక షరత్తు మీద. 

ఉగ్రవాదుల పేలుడుకు మరికొద్ది రోజులే సమయం ఉంది.

ఇర్ఫాన్ చనిపోయాడు మరియు క్రైమ్ జర్నలిస్ట్ గురించి ఆచూకీ తెలియదు ఈ విషయాలు వాళ్ళని బయటపడుతున్నాయి. 

తీవ్రవాదుల గురించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సుభాష్ సేకరించి, ఎప్పటిలాగానే హేమంత్‌కి పంపుతున్నాడు.

హేమంత్‌కి ఆ జర్నలిస్టు ఎవరో తెలిసింది. ఆమె పేరు సూర్య, అక్క శృతి.

అవును, శృతి చెల్లెలు. రష్యన్ మాఫియా & హేమంత్ ఆమె కోసం వెతుకుతున్నారు. ఇర్ఫాన్ నుంచి ఆమెకు ఎలాంటి సమాచారం వచ్చింది? వారు ఆమెను ఎందుకు చంపాలనుకుంటున్నారు? అని హేమంత్ ఆలోచిస్తున్నాడు.

హేమంత్‌కి వాళ్ల అక్క హైదరాబాద్‌లో ఉన్నట్లు హేమంత్‌కి తెలుస్తుంది. కానీ అతనికి ఖచ్చితమైన ప్రదేశం తెలియదు. అలాగే సూర్య చేతిలో దెబ్బ తిన్న వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఓ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న తెలుస్తుంది. సూర్య గతం మరియు ఎమ్మెల్యే డర్టీ విషయాల గురించి పోలీసు నెట్‌వర్క్ & CI రమాకాంత్‌ని ఉపయోగించి హేమంత్ ఇదంతా తెలుసుకుంటారు.

ఇప్పుడు ఇర్ఫాన్ మరణం వెనుక ఎమ్మెల్యే ప్రమేయం లేదని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యే మనిషి సూర్య కోసమే మాత్రమే అక్కడ ఉన్నారు.

శ్రుతి కోసం రష్యా గ్యాంగ్ హైదరాబాద్ అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యే మనుషులు కూడా సాయం చేస్తున్నారు. కానీ ఫలితం లేదు.

మరుసటి ఉదయం, శృతి సుభాష్ వార్డ్ రోబ్ శుభ్రం చేస్తుంది. సుభాష్ ఆర్మీ డ్రెస్ చూసింది. ఆమె సుభాష్ యూనిఫార్మ్ ని తన చేతుల్లో పట్టుకుంది.

ఆమె తండ్రి పోలీస్ ఆఫీసర్!! శృతి ఆ యూనిఫార్మ్  తాకుతూ వాళ్ళ నాన్నని గుర్తుకు చేసుకుంటుంది. శృతి కళ్లలో నుంచి తనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. 

అంతలోనే సుభాష్ లోపలికి వచ్చాడు. ఆమె సుభాష్ వైపు చూసి చిరునవ్వుతో యూనిఫాంను ముట్టుకుంటూ తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టింది.

"మా నాన్న కూడా మీలాగే చాలా నిజాయితీపరుడు. డ్యూటీ అంటే ప్రాణం, అదే ఆయన ప్రాణం తీసింది. కొన్నేళ్ల క్రితం మా జీవితాలు చాలా బాగుండేవి, నాన్న అప్పుడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.

హత్య మరియు అత్యాచారం కేసులో, స్థానిక గ్యాంగ్‌స్టర్ నర్సింగ్ యాదవ్‌ను మా నాన్న అరెస్టు చేసి నడి రోడ్ మీద ఇడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. అయితే స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు.

వాడిని అవమానించినందుకు నాన్నపై పగ పట్టాడు. సమయం కోసం ఎదురు చూశాడు.

 నా కళ్ల ముందే నాన్నని చంపేశాడు. అయినా నేను ఏమి చేయలేక పోయాను. 

నేను వాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వాడు నన్ను కొట్టి అత్యాచారం చేశారు. అప్పుడు మా చెల్లి ఇంట్లో లేదు. అయినా వాడి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. మా నాన్న మీద ఉన్న కోపం చల్లారాక వాడికి నచ్చినప్పుడు నాతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. 

"ఒక అమ్మాయిని గెలవడానికి తెలిసిన ఏకైక మార్గం ఆమెను అనుభవించడమేనా"? 

మేము వాడి నుంచి పారిపోవాలి అని ప్రయత్నం చేసాం కానీ దొరికిపోయాం, నన్ను ఏమి చేయలేదు కానీ ఆ రాక్షసుడు నా చెల్లి వేలిని తీసేసాడు, ఒకవేళ పారిపోతే మీ చెల్లిని చంపేస్తా అని బెదిరించాడు. 

అప్పటి నుంచి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. తర్వాత జనార్దన్ అంకుల్ సహాయంతో మా చెల్లిని అతనికి తెలియకుండా ఇక్కడి నుంచి ముంబైకి పంపించాం.

బయలుదేరే సమయంలో, మా చెల్లి నన్ను తనతో పాటు రమ్మని కోరింది.

వెళ్లే సమయంలో చెల్లితో పాటు నన్ను రమ్మని బతిమిలాడింది, కానీ నాన్నని చంపి, మా జీవితాలని నాశనం చేసినవాడి నుంచి తప్పించుకోవాలా? లేదా వాడి నాశనం మా కళ్లారా చూడాలా అని మేము అనుకున్నాం? 


‘ఎమ్మెల్యే నాశనం చూసే వరకు నేను తిరిగి రాను’ అని మా చెల్లి ముంబై వెళ్ళింది. 

మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే "వాడి  నాశనం".

ఆ తర్వాత నర్సింగ్ నా దగ్గరకు వచ్చి చెల్లి గురించి అడిగాడు.

అతనికి నేను మాత్రమే కావాలని నాకు బాగా తెలుసు, అందుకే నేను వాడికి చెప్పాను , "నీకు కావాల్సింది నేను అయితే నా చెల్లి ఎక్కడ ఉంటె నీకు ఎందుకు అని అడిగా"?

నువ్వు ఇక్కడ నేను చెప్పింది చేస్తున్నావు అంటే దానికి కారణం నీ చెల్లి ప్రాణాల కోసమే, అదే ఇక్కడ లేకపోతే నువ్వు పారిపోతావు కదా అని ప్రశ్నించాడు. 

అయినా నువ్వు అన్నట్టు నాకు కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే కాబట్టి, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ చెల్లి క్షేమంగానే ఉంటుంది అని చెప్పాడు, ఆ తరువాతనే నా చేతికి ఒక ట్రాకింగ్ డివైస్ ఏర్పాటు చేసాడు. 

నా సోదరి ఎక్కడ ఉందో కనుక్కొని, ఆమెపై నిఘా ఉంచాడు, నేను పారిపోతే తనని చంపేస్తానని బెదిరించాడు.

అతడిని చంపేందుకు మా సోదరి ముంబైలో చాలా మంది సహాయం తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్కసారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

వాడితో నేను ఉన్నదీ కేవలం వాడి నాశనం చూడడానికి మాత్రమే కాదు వాడు చేసే పనులకి సాక్ష్యాలు సంపాదించడానికి కూడా. అవి అవసరమైన సమయంలో బయట పెట్టాలి అనుకున్న, అందుకే చెల్లికి కూడా ఇవ్వాలే.

నేను క్షేమంగా బయటకు వచ్చే వరకు ఆ సాక్ష్యాలను మా సోదరికి ఇవ్వలేను. అలా చేస్తే ఆధారాలు లేకుండా చంపేస్తారు. మేమిద్దరం ఒకే సమయంలో తప్పించుకోవాలి, అప్పుడు మాత్రమే మేము దాన్ని విడుదల చేయగలము.

ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి అజయ్‌కి ఆధారాలు ఇచ్చాను.

మేమిద్దరం క్షేమంగా బయటకు వచ్చే రోజు వస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రమాదంలో పడవచ్చు.

అంకుల్ చెప్పారు నువ్వు నన్ను అక్కడి నుండి తీసుకురావడానికి ముందు రోజు మా చెల్లి తప్పించుకుంది అని. ఆమె త్వరలో ఇక్కడికి వస్తుంది. అయినా ఇంత వరకూ ఎందుకు నాకు ఫోన్ చేయలేదు ?"

శృతి ఆలోచించింది. వెంటనే సుభాష్,

“మీ చెల్లి తన ఫోన్‌ను చాలాసార్లు ఆఫ్ చేస్తుందని నీకు తెలుసు, నీ ఫోన్ కూడా ఆఫ్ చేయబడింది మరి ఆమె ఎలా చేయగలదు?. ఆమె జనార్దన్ అంకుల్ కి కాల్ చేసింది కదా, జనార్ధన్ అంకుల్ తో టచ్ లో ఉంది, మీ చెల్లి గురించి నీకు బాగా తెలుసు, ఆమె గురించి కంగారు పడకు, ఆమె ఎక్కడ ఉన్న క్షేమంగానే ఉంటుంది, త్వరలోనే నిన్ను కలుస్తుంది. ”

ఆ ఆలోచనల నుంచి శృతిని బయటకు తీసుకురావాలని సుభాష్ భావిస్తాడు. ప్రమాదం ఉందని తెలిసిన సుభాష్ ఆమెను బయటకు తీసుకెళ్తాడు.


అధ్యాయం XI: R మాఫియా దాడిసుభాష్, శ్రుతి ఇద్దరూ ఒక రెస్టారెంట్ కి డిన్నర్ కోసం వెళ్తారు. ఆ రెస్టారెంట్ అజయ్ క్లోజ్ ఫ్రెండ్ కి చెందినది.

ముంబైలో అదే సమయంలో, హేమంత్‌కి సూర్య & శృతి గురించి తెలిసి వెంటనే సుభాష్‌కి శృతి ఫోటో పంపాడు. అప్పుడే ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఆమె ఫోటో చూసి సుభాష్ ఒకింత ఆశ్చర్యపోయాడు. హేమంత్ ఫోన్ చేసి శృతి ఎక్కడ ఉందొ తెలుసుకోవాలని చెప్తాడు. శృతి తన దగ్గర ఉంది అని చెప్పడంతో హేమంత్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. హేమంత్ ఆమె గురించి అలానే ఎమ్మెల్యే గురించి కొన్ని వివరాలు అడిగారు. సుభాష్ శృతి కొంచెం దూరంగా లాబీ దగ్గరికి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. శృతి కోసం వెతుకుతున్నామని హేమంత్ చెప్పాడు. మరియు ఆమె సోదరి సూర్య, మరియు వీటన్నింటికీ కారణాలను వివరించారు. ఇవన్నీ విని సుభాష్‌కి షాకింగ్‌గా అనిపించింది.

సుభాష్ జరిగినదంతా చెప్పి, అలాగే సూర్య మాలో ఎవరికీ ఫోన్ చేయలేదని కన్ఫర్మ్ చేశాడు. ఆ తర్వాత సూర్య గురించి కొన్ని వివరాలు అడిగారు హేమంత్.

నేను ముంబయికి వచ్చే ముందు రోజు వరకు ఆమె కాంటాక్ట్‌లో ఉండేదని, అయితే ఆతరువాత నుంచి మాలో ఎవరితో కాంటాక్టులో లేదని చెప్పారు సుభాష్. 

హేమంత్ మాట్లాడుతూ, “కొంతమంది రష్యన్ మాఫియా గ్యాంగ్‌స్టర్లు హైదరాబాద్‌కు వచ్చారని మాకు ఇంటెల్ వచ్చింది, ఆ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనది, వారు సూర్య సమాచారాన్ని పొందడానికి శృతిని చంపడానికి లేదా కిడ్నాప్ చేయడానికి వచ్చారు అని నేను అనుకుంటున్నాను. శృతిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీకు సూర్య గురించి ఏమైనా తెలిస్తే చెప్పు”.

ఆ తర్వాత హేమంత్ కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు.

ముంబైలో: 

ఇర్ఫాన్ చావుకి కారణాలు తెలుసుకొనే క్రమములో ఆరోజు క్యాంపులో ఎం జరిగిందో తెలుసుకోవడానికి హేమంత్ అక్కడికి వెళ్లారు. ఇర్ఫాన్ యొక్క చివరి లాగిన్ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, ఇర్ఫాన్ ఆర్మీ కార్ప్స్ ల్యాబ్‌ను సందర్శించిన తర్వాత మరణించాడు. ఆశ్చర్యకరంగా అతను ఆ రోజు లాగిన్ చేయలేదని తెలిసింది, ఆది సరి అయినా రిపోర్ట్ కాదు అని హేమంత్ అనుమానం.

ఆ రోజు, ఇర్ఫాన్ అక్కడ ఉన్నాడు అని హేమంత్‌కి తెలుసు(ఇర్ఫాన్ లోపలికి వెళ్ళడం హేమంత్‌కి తెలిసిన ఒక సోల్జర్ చూసారు) కానీ అతని లాగిన్ వివరాలు లేవు. ఇర్ఫాన్ ల్యాబ్‌లోకి ప్రవేశించినప్పుడు ఆ సమయంలో లాగ్ బుక్ లేదు, కాబట్టి అతను తన లాగ్‌ను నమోదు చేయలేదు. లాగ్ అవుట్ అయినప్పుడు అతను లాగౌట్ చేయలేదు. అతను హడావిడిగా & టెన్షన్‌లో ఉన్నందున అతను లాగ్ అవుట్ చేయలేదు. అది ఎవరికో ప్రయోజనంగా మారింది. అలాగే, సెక్యూరిటీ ఫుటేజీ డేటా కూడా అక్కడ లూప్ చేయబడింది. అంతా అనుమానాస్పదంగా ఉంది.

లోపల ఉన్న వారిని అడగగా, రోజూ చాలా మంది అక్కడికి వస్తుంటే గుర్తుకు రావడం లేదని అంటారు. వీరిలో నుంచి ఎవరో ఒకరు ఎవరికో సహాయం చేస్తున్నారనేది నిజం. ఆ తర్వాత హేమంత్ ఆరోజు అక్కడ ఉన్న వారందరిపై నిఘా పెట్టాడు.

ఎవ్వరికీ తెలియని విషయాన్ని దాచిపెట్టడానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉండాలి.

భారత ప్రభుత్వం చేసిన చివరి కొనుగోళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు హేమంత్ ప్రయత్నించాడు.

హైదరాబాద్ రెస్టారెంట్‌లో ::

సుభాష్ శ్రుతి వైపు వస్తుంటే, కొంతమంది దూరం నుండి రెస్టారెంట్‌లో కాల్పులు జరపడం మొదలుపెట్టారు, లోపల క్రౌడ్ తక్కువగానే ఉంది. వారు కాల్పులు జరపడంతో లోపల ఉన్నవారు చాలా భయపడ్డారు. వారు అమాయక ప్రజల కళ్ళలో భయాన్ని చూడటానికి ఇష్టపడే క్రూరమైన గ్యాంగ్.

శృతి & సుబాష్ మినహా అందరూ రెస్టారెంట్ నుండి బయటికి వస్తున్నారు. బుల్లెట్లు తగలక ముందే శృతిని గోడ వెనుకకు సుభాష్ తీసుకెళ్లాడు.

తుపాకీ కాల్పులు కొనసాగాయి.

ఇప్పుడు లోపల ఎవరూ లేరు, రష్యన్ మాఫియా, shruthi మరియు సుభాష్.

వాళ్లు శ్రుతి కోసం వచ్చారని, తన కోసం కాదని సుభాష్‌కి అర్ధమమైంది, వాళ్లు మాస్క్‌లు ధరించి దాడి చేశారు. వారు దాడి చేసే విధానం మరియు అధునాతన తుపాకులను వాడే పద్ధతి బట్టి, వారు ఖచ్చితంగా శిక్షణ పొందిన నిపుణులు అని సుభాష్ భావించాడు.

వారిలో కొందరి శరీరంపై రష్యన్ భాషలో టాటూలు ఉండటం సుభాష్ గమనించాడు.

అయితే సుభాష్ గురించి రష్యన్ మాఫియా వాళ్ళకి తెలియదు. గన్ ఫైర్ చేయకుండా మెల్లగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశారు సుభాష్. శృతిని సురక్షిత ప్రదేశంలో దాక్కోమని సుభాష్ చెప్పాడు.

సుబాష్‌పై కాల్పులు మాత్రం చేస్తూనే ఉన్నారు. సుభాష్ వారికి ఆలోచించటానికి సమయం ఇవ్వలేదు. వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించాడు. సుభాష్ ఎదురు దాడిని చూసి రష్యా గ్యాంగ్ వాళ్ళ కళ్లు భయంతో నిండిపోయాయి.

వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు మెల్లగా సుభాష్ చేతిలోకి వస్తున్నాయి.

సుభాష్ చేతిలోకి ఆయుధాలు వచ్చాక అవి ఎంత శక్తివంతమైనవో వారికి అర్థమైంది.

వారు ఆశ్చర్యపోయారు, ఆ తుపాకీలను సుభాష్ వారి కంటే బాగా ఉపయోగించినప్పుడు వాటి సామర్థ్యాన్ని వారు అర్థం చేసుకుంటారు.

కానీ ఇక్కడ కూడా, సుభాష్ మొదట వారి కాళ్లపై కాల్చాడు, అతను ఎవరినీ చంపడానికి ఇష్టపడలేదు. అందరూ తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఎవరూ చనిపోలేదు.

ఇదంతా చూసిన రష్యన్ మాఫియా గ్యాంగ్ లీడర్ అలెక్స్ కారులోంచి AK203ని బయటకు తీస్తాడు, అలెక్స్ సుభాష్‌పై కాల్పులు జరిపాడు. అందులోంచి ఒక బుల్లెట్ సుభాష్ ఛాతీకి తగిలింది.

సుబాష్‌ని చూసి అలెక్స్ నవ్వాడు. కానీ ఆ గాయం అతడిని ఏమీ చేయలేక పోయింది.

అప్పటి వరకు ఆయుధాలను చాలా జాగ్రత్తగా వాడిన సుభాష్ ఇప్పుడు ఏమాత్రం సంకోచించకుండా షూటింగ్ ప్రారంభించాడు. వారి శరీరాలు బుల్లెట్లతో చీలిపోతున్నాయి.

శృతిని చంపడం ఈరోజు కుదరదని తెలిసిపోయింది. వారు కొన్ని బుల్లెట్ గాయాలతో బయటపడ్డారు. గాయాలపాలైన సుభాష్ నిలదొక్కు కాగలిగాడు.

సుభాష్ దాడిని చూసిన తర్వాత అలెక్స్ అతను కచ్చితంగా పోలీస్, ఆర్మీకి చెందినవాడని అర్ధం అవుతుంది.

కాల్పుల విషయం తెలిసిన అజయ్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు(శృతి అతనికి ఫోన్ చేసింది), సుభాష్ చెప్పినట్లు ఆ ప్రదేశంలోని సెక్యూరిటీ ఫుటేజీని తీసుకుంటాడు, సుభాష్ హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు జరిగినదంతా హేమంత్‌కి చెప్పాడు.

అలెక్స్ గ్యాంగ్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింది. కానీ అలెక్స్ మాత్రం సుబాష్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నాడు. సుభాష్‌ని వ్యక్తిగతంగా చంపాలనుకుంటున్నాడు. అతను సుబాష్ గురించి కనుక్కోవడం ప్రారంభించాడు. అక్కడ ఫ్యూటజీ కోసం రెస్టారెంట్‌కి ఒకరిని పంపాడు.కానీ అప్పటికే ఆ డేటా అజయ్ డిలేట్ చేసేసాడు. 

హాస్పిటల్‌లో చేరిన తర్వాత సుభాష్ పరిస్థితి గురించి హేమంత్‌ అడిగి తెలుసుకుంటారు అజయ్ ద్వారా. ఎప్పటికప్పుడు అజయ్ నుంచి సమాచారం తెలుసుకునేవాడు. మొబైల్ ద్వారా సుభాష్‌తో మాట్లాడేవాడు .

సూర్య స్థితి గురించి తెలియకుండా హేమంత్‌ హైదరాబాద్ వెళ్లలేడు. ఆమె శత్రువు చేతిలో చిక్కుకుంటే? అది చాలా ప్రమాదకరం. అతను ముంబైలో ఉండాలని అతనికి తెలుసు. హేమంత్ పరిస్థితి సుభాష్‌కి అర్థమైంది. 

సుభాష్‌ని ఎందుకు పోలీసు ఫిర్యాదు చేయలేదని మరియు డేటాను ఎందుకు తొలగించమని అడిగావు అని అజయ్ సుబాష్‌ని అడుగుతాడు 

సుభాష్ ఇలా అంటాడు “వారు శ్రుతి కోసం వచ్చారు నా కోసం కాదు, నువ్వు అనుకుంటున్నట్లుగా వారు శృతి కోసం వచ్చిన ఎమ్మెల్యే మనుషులు కాదు, శ్రుతి కోసం వచ్చిన రష్యన్ మాఫియా. దీని వెనుక పెద్ద రహస్యం దాగి ఉంది”.

నీకు ఎలా తెలుసు? అజయ్ అడుగుతాడు

మన మొదటి పని శృతి చెల్లి ఎక్కడ ఉంది, కనుక్కోవాలి అని అంటాడు సుభాష్, మిగితావి ఇంటికి వెళ్ళాక చెప్తా.. 

శ్రుతిపై దాడి గురించి తెలిసిన ఎమ్మెల్యే రష్యా గ్యాంగ్‌ను రహస్య ప్రదేశంలో కలుస్తాడు. శ్రుతి పై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వారిపై అరుస్తాడు. వారి ఒప్పందం ప్రకారం వారు శృతిని చంపకూడదు.

అలెక్స్ ఆమెను చంపాలని అనుకోవడం లేదని నమ్మించేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వినలేదు.

అలెక్స్ తన బాస్ కి కాల్ చేస్తాడు.

అలెక్స్ బాస్ "మనం అతనితో కలిసి పని చేయాలి, కాబట్టి అతన్ని ఇప్పుడు చంపవద్దు" అని చెప్పాడు, లేకపోతే వారు అక్కడే ఎమ్మెల్యేను చంపేసేవారు .

ఆ సంభాషణ అంతా జనార్ధన్ వింటాడు. ఎమ్మెల్యే రష్యన్ మాఫియా వాళ్ళతో చేతులు కలిపాడని జనార్దన్ తెలుసుకుంటాడు. వెంటనే ఈ విషయం సుభాష్‌కి చెప్పడానికి ప్రయత్నిస్తాడు.

ఆసుపత్రిలో ఉన్న సుభాష్ డాక్టర్‌ని అదే రోజు డిశ్చార్జ్ చేయమని కోరాడు. టెర్రరిస్ట్ ఎటాక్ డేట్ దగ్గర పడటంతో హేమంత్ సార్ ప్లాన్ గురించి ఆలోచించాడు సుభాష్, అందుకే డిశ్చార్జ్ ఇవ్వాలని పట్టుబట్టాడు.

కానీ ఈ గాయం మునుపటి గాయం పైన ఉందని, ఈసారి బుల్లెట్ కొద్దిగా లోపలికి వెళ్లిందని డాక్టర్ చెప్పారు. తనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని గట్టిగా చెప్పారు .

శృతి మరియు అజయ్ ఇద్దరూ సుబాష్ గురించి ఆందోళన చెందుతున్నారు, అయితే సుభాష్ నవ్వుతూ డాక్టర్‌ని డిశ్చార్జ్ చేయమని చెప్పాడు.

శ్రుతి మరియు అజయ్ అతనికి ఇంతకు ముందు తగిలిన గాయం గురించి అడిగారు, కానీ సుభాష్ మొదట చెప్పలేదు, కానీ స్నేహితులు వదిలిపెట్టరు కదా ఏది ఏమైనా.

సుభాష్ గాయం గురించి చెప్పడానికి అంగీకరిస్తాడు కానీ డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే అని చెప్తాడు. సుభాష్ డాక్టర్‌ని డిశ్చార్జ్ చేయడానికి ఒప్పించాడు, తర్వాత అందరూ ఇంటికి వెళతారు.

మరోవైపు, క్రాస్ ఫైరింగ్‌లో గాయపడిన సుభాష్ గురించి సమాచారం తెలుసుకోవడానికి అలెక్స్ ఎమ్మెల్యే నర్సింగ్ వ్యక్తులను అన్ని ఆసుపత్రులకు పంపుతాడు.

చివరకు సుభాష్‌ను చేర్చిన ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే డిశ్చార్జి అయ్యి వెళ్లిపోయారని, అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. అజయ్ CC కెమెరాను డిసేబుల్ చేయడానికి హై పవర్ లేజర్ కిరణాలు ఉపయోగించాడు. వాళ్ళు అక్కడికి వచ్చే ప్రమాదం ఉందని సుభాష్ లోపలికి వచ్చేముందే ఆ పని చేయమని చెప్తాడు. 

సుభాష్‌ స్మార్ట్‌నెస్ మరియు హ్యాకింగ్ వ్యూహాలను అలెక్స్ అర్థం చేసుకున్నాడు. అందుకే శృతిలోని ఎమోషనల్ సైడ్‌ని టార్గెట్ చేయాలనీ అనుకుంటారు, శృతికి సహకరించిన వ్యక్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతనికి సుభాష్ గురించి ఏమీ తెలియదు.

ఇంటికి వెళ్లిన తర్వాత గాయానికి గల కారణాలను వివరించాడు.

"కొన్ని గాయాలు శరీరానికి చాలా బాధని ఇస్తాయి, కానీ మరికొన్ని గాయాలు గుండె లోతుల్లో ఎప్పటికి అలానే ఉంటుంది" అలాంటి గాయమే ఇదీ "

సుభాష్, వాళ్ళ ఇద్దరు రోల్ మోడల్స్ ఎవరు అని అడుగుతారు. ఇద్దరు పవన్ కళ్యాణ్, కిరణ్ బేడీ, అబ్దుల్ కలాం అని జవాబు ఇస్తారు. 


కానీ సుభాష్ రోల్ మోడల్ ఎవరని సమాధానం ఇస్తాడంటే 


"మనకి ఎంత మంది రోల్ మోడల్స్ ఉన్న, ఒక సైనికుడికి మాత్రం దేశం కోసం పోరాడే మరో సైనికుడే రోల్ మోడల్". 

అలాంటి వారిలో ఒకరు "మేజర్ హేమంత్ సార్".

హేమంత్ సార్ గురించి తనకు తెలిసిన ప్రతి విషయాన్ని సుభాష్ వారికి చెప్పాడు, ప్రత్యేకించి తన శిక్షణ రోజుల్లో జరిగిన ఒకే ఒక్క పరిస్థితిని వివరించారు.

"మా 90 రోజుల శిక్షణ పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు, కొంతమంది ఉగ్రవాదులను మా శిబిరానికి బందీలుగా తీసుకువచ్చారు, సాధారణంగా మేము వారిని శిక్షణా శిబిరాల్లో ఉంచము.

కానీ వారిని తరలిస్తున్నప్పుడు వారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు మరియు మా క్యాంపు మాత్రమే సమీపంలో ఉంది. అందుకే వారిని క్యాంపులో ఉంచి ఉదయాన్నే తరలించాలని ఆదేశాలు వచ్చాయి. ఉగ్రవాదులను విడుదల చేసేందుకు మిగితా ఉగ్రవాదులు ఆ ప్రమాదం చేశారు.

వారిని ప్రత్యేక గదిలో బంధించి కొంతమంది సైనికులను కాపలాగా ఉంచారు. అలాగే మా ప్రోబిస్‌లో కొందరు గాయపడిన సైనికులకు ప్రథమ చికిత్స చేశారు.

మా శిక్షణలో ప్రాథమిక వైద్య చికిత్స కూడా కవర్ అవుతుంది. మరియు మేము హేమంత్ సార్ కి కూడా తెలియజేశాము.

సార్ క్యాంపుకి ఇంటి నుంచి బయలుదేరారు, సార్ అనుమానం వచ్చి అందరినీ అలర్ట్ చేశారు.

మరో బెటాలియన్ రావడానికి సమయం పట్టవచ్చు, కాబట్టి హేమంత్ సర్ ప్రోబిస్‌ని సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. హేమంత్ సార్ నాతో అందరినీ సిద్ధం చేసే బాధ్యత తీసుకోమని చెప్పారు.

హేమంత్ సార్ ఊహించినట్లుగానే, ఉగ్రవాదులు మా క్యాంపుపై దాడి చేశారు, వారంతా సమీపంలోని అడవి నుండి ప్రవేశించారు.

వారిని విడిపించే క్రమంలో ఉగ్రవాదులు అక్కడి సైనికులపై కాల్పులు జరిపారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. నేను, మిగతా వాళ్ళు వాళ్ళ మీద క్రాస్ ఫైరింగ్ చేస్తూనే ఉన్నాం.

పట్టుబడిన ఉగ్రవాదులను అక్కడి నుంచి విడిపించి అటవీ మార్గం గుండా తిరిగి వెళ్లిపోయారు. అంతలోనే హేమంత్ సార్ అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారితో పాటు కొంత మందిని ఆసుపత్రికి తరలించారు.

నేను, హేమంత్ సార్, మరికొందరు ప్రోబిస్‌తో కలిసి ఉగ్రవాదుల వెనుక అడవిలోకి వెళ్ళాము. హేమంత్ సార్ మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు మరియు సమీపంలోని కొండ నుండి స్నిపర్ పొజిషన్ తీసుకోమని నన్ను అడిగారు. 

 ఆ రోజు మాలో ఎక్కడో దాక్కున్న చిన్నపాటి భయం మాలోనుంచి దూరమైంది.

నేను దొరికిన ఉగ్రవాదులను కాల్చివేస్తున్నాను, మరోవైపు స్నిపర్ గన్ నుంచి హేమంత్ సార్ షో చూసే అవకాశం వచ్చింది.

హేమంత్ సార్ అక్కడ గాలితో పోటీ పడి శత్రువులను చంపేస్తున్నాడు, కేవలం అది చూడ్డానికి మాత్రమే అక్కడికి వచ్చామని మిగతా వాళ్ళు ఒక్క క్షణం అనుకున్నారు.

సార్ వేగం, తెలివితేటలు, సంకల్పం ముందు ఎవరు నిలబడలేకపోయారు!! సార్ వారిని చంపడమే కాకుండా మరో వైపు ఇతర టీమ్ సభ్యులను కాపాడుతున్నాడు.

నాకు దొరికిన ఉగ్రవాదులను కాళ్లకు కాల్చి సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించాను.

హేమంత్ సార్ వాళ్ళని చంపుతూ ముందుకు వెళ్ళాడు, అప్పుడు టెర్రరిస్టులలో ఒకడు హేమంత్ సార్ ని చంపడానికి వెనుక నుండి వెళ్ళాడు, కానీ నేను చాలా దూరం నుండి డేగ కళ్ళతో సిద్ధంగా ఉన్నానని అతనికి తెలియదు.

ఈసారి, నేను కాల్చిన బుల్లెట్ అతని నుదిటి లోపల నుంచి వెళ్ళింది. హేమంత్ సార్ తీవ్రవాది మృతదేహం దగ్గరికి వెళ్లి గాయాన్ని చూశాడు.

కొంత సేపటికి అందరి కథ అయిపోయిన తర్వాత అందరూ క్యాంపుకి వెళ్ళాము. మన సైనికులకు చిన్న గాయం కూడా కాలేదు.

తప్పించుకున్న ఇద్దరు ఉగ్రవాదులు తిరిగి పట్టుబడ్డారు, వారిద్దరికీ నా వల్ల బుల్లెట్ గాయాలు ఉన్నాయి.

అక్కడ సార్ ని చూసి చాలా నేర్చుకున్నాం, ఎలా ఫైట్ చేయాలి, శత్రువుల కదలికలను ఎలా గమనించాలి, ఎంత వేగంగా ఉండాలి, టీమ్ ని ఎలా ముందుకు నడిపించాలి, పక్కనే ఉన్న మన సైనికులను ఎలా కాపాడుకోవాలి.

మరుసటి రోజు, సైన్యం సంఘటన గురించి హేమంత్ నుండి నివేదిక కోరింది”.

ఎమ్మెల్యే రహస్య స్థలంలో::

ఎమ్మెల్యేను ఎవరైనా మోసం చేస్తున్నారని అనుమానం వచ్చిన అలెక్స్ మొదటి నుంచి అందరిపై నిఘా పెట్టారు. జనార్ధన్ ఎవరికీ తెలియని నెంబర్ ద్వారా సుభాష్ ని కాంటాక్ట్ అయ్యేవాడు దాని వలన తప్పించుకున్నాడు మొదటినుంచి. 

అతను సూర్య తప్పించుకున్న రోజు కూడా ఆమెతో కాంటాక్ట్ లో ఉంటాడు. అయితే ఇద్దరు కొత్త నంబర్స్ తో కాంటాక్ట్ అయ్యేవారు, అందువలన వాళ్ళకి ఎటువంటి సమాచారం దొరకలేదు. 

రష్యాన్స్, ఎమ్మెల్యే కలిసి పనిచేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ సుభాష్‌కి తెలియజెసె సమయంలో జనార్దన్ వారికి దొరికిపోతాడు. అతణ్ణి అక్కడే చంపేస్తారు. అతని సీక్రెట్ ఫోన్ అలెక్స్ తీసుకుంటాడు. 


ఫోన్లో చివరి కాల్ ఎవరికీ చేసారో చూసి ఆ నెంబర్ ట్రాక్ చేయాలనీ చూస్తారు కానీ అది సాధ్యపడలేదు, ఎందుకంటే అజయ్ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అలెక్స్ కాల్ లిస్ట్ ఆధారంగా సుభాష్ నెంబర్ కి కాల్ చేస్తాడు. 

అలెక్స్ కాల్ చేసి మాట్లాడలేదు, అనుమానం వచ్చిన సుభాష్ కూడా మాట్లాడలేదు. సుభాష్‌కి పరిస్థితి అర్థమైంది.

వారు జనార్దన్‌ని చంపారని సుబాష్ అర్ధం చేసుకుంటాడు. అలెక్స్ మాట్లాడటం ప్రారంభించాడు. అలెక్స్ సుబాష్‌ని రెచ్చగొట్టాలని అనుకుంటాడు.

అలెక్స్ : దానిని రక్షించింది నువ్వేనని నాకు తెలుసు, ఒక్కరోజు మాత్రమే దాని మరణాన్ని ఆపగలిగావు, నేను దానిని నీ కళ్ళ ముందే చంపేస్తాను.

దానికి సుభాష్, “Do you think you are the only person having the guns & having the people back you”

అలెక్స్ "నా మనుషులు బాగా శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్, వాళ్ళని నువ్వు గాయపరిచావు అంటే , నువ్వు కచ్చితంగా బాగా శిక్షణ పొందిన ప్రొఫెషనల్ అని అర్థం, అయితే పోలీస్ లేదా ఆర్మీ "?

సుబాష్: No I am the one who makes you Nothing, ఆయనని చంపి మీరు చేయకూడని తప్పు చేశారు. you are going to be part of our land forever. 

వెంటనే సుబాష్ కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు.

అలెక్స్ శ్రుతి యొక్క ఎమోషనల్ సైడ్ లక్ష్యంగా చేసుకున్నాడు. అందుకే జనార్దన్‌ను హత్య చేశాడు. మరియు అతను ఇతర విషయాల కోసం వెతుకుతున్నాడు, నర్సింగ్ అతనికి సహాయం చేస్తున్నాడు.

కొద్దిసేపటికి జనార్దన్ యాక్సిడెంట్ లో చనిపోయాడన్న వార్త బయటకు వస్తుంది. జనార్ధన్ చనిపోయాడన్న వార్త తెలియగానే శృతి చాలా ఏడ్చింది.

చాలా కాలంగా శ్రుతికి అన్ని విధాలా సాయం చేసిన వ్యక్తి హత్యకావడం శృతి తట్టుకోలేకపోయింది. 

రష్యన్లు కూడా సుభాష్ కోసం వెతకడం ప్రారంభించారు. శ్రుతి ఫోటోను స్థానిక గ్యాంగ్‌లకు ఇచ్చి ఆమె కోసం వెతకమని చెప్పారు. అలెక్స్ శ్రుతి పాత ఫ్లాట్ & రెస్టారెంట్ నుంచి మొత్తం 5 కి.మీ వ్యాసార్థానికి వెతకమని చెప్పాడు, అతని ఇల్లు అక్కడే ఉండవచ్చని అనుమానించాడు. అతని మనుషులు, మరిన్ని ముఠాలు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు.

సుభాష్ డిశ్చార్జ్ అయిన విషయం అజయ్ కాల్ చేసి హేమంత్ కి చెప్పాడు. 

ముంబైలో::

హేమంత్ ఇంట్లో, రాంబో ఆహారం అయిపోయింది. హేమంత్ రాంబో ఆహారం కోసం ఒక డాగ్ షాప్ కి వెళ్తారు, ఆ షాప్ హేమంత్ రెగ్యులర్ గా వెళ్లే షాప్. హేమంత్ రాంబోని అక్కడికి తీసుకెళతాడు.

కానీ షాప్ బయట హేమంత్ కోసం ఒక గ్యాంగ్ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది, ఆ విషయం హేమంత్ గమనించాడు. హేమంత్ వాళ్ళ ఓపికని పరీక్షిస్తున్నాడు. 

అదే సమయంలో సూర్య ఆ షాప్ లోపలికి వెళ్తుంది. సూర్యకి బాగా తెలుసు హేమంత్ అక్కడికి అప్పుడప్పుడు వస్తారు అని, హేమంత్‌ని కలవడానికి ఆమె చాలా రిస్క్ తీసుకుని బయటకు వస్తుంది.సూర్యని అక్కడ చూసి ఆ గ్యాంగ్ ఆశ్చర్యపోతారు. వాళ్ళు అక్కడికి వచ్చింది హేమంత్ కోసమే, కానీ వాళ్ళ దగ్గర సూర్య ఫోటో కూడా ఉంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనుకోని సంతోషిస్తారు. 

హేమంత్ సూర్యని లోపల చూసి, ఆమె తనను కలవడానికి వచ్చిందా అని అడిగాడు. హేమంత్ బయట ఉన్న గ్యాంగ్‌ని, వారి కదలికలను కూడా గమనిస్తాడు.

వారు హేమంత్ కోసమే అక్కడికి వచ్చారు. కానీ వారు సూర్యని చూడగానే వారు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు, హేమంత్ సూర్యని అడుగుతాడు.

"నీకు హైదరాబాద్‌లో మాత్రమే స్నేహితులు ఉన్నారని అనుకున్నాను, కానీ ముంబైలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. మీరు ఇర్ఫాన్‌కు స్నేహితురాలు కావడం వలనే వారు మీ కోసం వెతుకుతుంటే, నేను ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ముట్టుకోలేరు".

అప్పుడే హేమంత్ మెల్లగా సూర్యని తీసుకుని బయటకు వచ్చాడు. వారు దాడి చేయడానికి హేమంత్ & సూర్యని చుట్టుముట్టారు.

నీకు కంపెనీగా మా రాంబో ఉంటాడు, సూర్య మన స్నేహితురాలే అని రాంబోకి చెప్తాడు. 


రాంబో సూర్య దగ్గరే నిలబడుతుంది. రాంబోని చూసి వాళ్ళు కొంచెం భయపడి సూర్య దగ్గరికి వెళ్లడం లేదు. 


హేమంత్ చిన్నగా నవ్వుతూ ముందుకు అడుగులు వేస్తూ వాళ్ళకి రమ్మని రెండు వేళ్ళతో రమ్మని చెప్తాడు. అందులో ఎవరిని కూడా హేమంత్ బలంగా కొట్టాలనుకోలేదు, అందరూ వయసులో కొంచెం చిన్నవాళ్లు. 


కానీ అందరూ ఆయుధాలు పట్టుకుని వస్తారు. వాళ్ళకి భయం అంటే ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నాడు అందుకే వాళ్ళని లీడ్ చేస్తున్న వాడిని బాగా కొడతాడు. అది చూసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు 

తప్పించుకునే సమయంలో, ఒక కారు ఢీకొని చనిపోగా, మిగిలిన వారు తప్పించుకుంటారు. అతని జేబులో హేమంత్ మరియు సూర్య ఇద్దరి ఫోటోలు ఉన్నాయి.

కొన్ని రోజులుగా హేమంత్ ఇంటి పై నిఘా ఉంచారు. హేమంత్ తన CC కెమెరాస్ ద్వారా వాళ్ళని చూసాడు.

అతను లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కాని రాంబో అక్కడ ఉన్నాడు. అది వారిపై దాడి చేయడంతో, వారు మళ్లీ ఆ సాహసం చేయలేకపోయారు.

హేమంత్ వారి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వాళ్ళ ఓనర్ ఎవరో హేమంత్‌కి ముందే తెలుసు. అంతకు ముందు ఒక కిడ్నాప్ కేసులో ఒక బిల్డరుని పట్టిస్తాడు, అతని దగ్గరే వీళ్ళు పని చేస్తున్నారు. 


ఆ సమయంలో ఇప్పుడు ఉన్న సీఐకి హేమంత్ బాగా హెల్ప్ చేస్తాడు. లేదంటే అతని జాబ్ కూడా పోయి ఉండేది. పాత విషయంలో వాళ్ళు తన మీద పగ తీర్చుకోవడం కోసం వచ్చారు అనుకుంటారు హేమంత్. 


అందుకే వాళ్ళని సీరియస్ గా తీసుకోలేదు ముందు. 


కానీ ఎప్పుడైతే సూర్య ఫోటో కూడా వాళ్ళ దగ్గర కనిపించిందో అప్పుడే వాళ్ళు వేరే విషయంలో చంపడానికి వచ్చారు అని హేమంత్ తెలుసుకుంటారు. 

అలాగే, చనిపోయిన వ్యక్తి మొబైల్ ద్వారా హేమంత్ తన యజమాని ఫోన్ నంబర్‌ను తెలుసుకుంటాడు. అక్కడికి వచ్చిన పోలీసు అధికారి రమాకాంత్, నేను చూసుకుంటాను అంటాడు.

హేమంత్ వాళ్ళ ఓనర్ డీటెయిల్స్ ఇచ్చి అతని గురించి కనుక్కోమని చెప్పగానే వెంటనే అతని దగ్గరికి రమాకాంత్ వెళ్తాడు. అతని ఫోన్ నెంబర్ ఆధారంగా అతని లొకేషన్ ట్రాక్ చేసి అక్కడికి వెళ్తారు రమాకాంత్. 



అధ్యాయం XII: ప్రణాళికసూర్య, హేమంత్ ఇద్దరు కలిసి హేమంత్ ఇంటికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన సూర్య, హేమంత్ ఇంట్లో బోర్డు మీద ఉన్న చాలా ఫోటోలు & డ్రాయింగ్‌లు ఉండడం గమనించింది. హేమంత్ ఆ బోర్డు మీద ట్రాక్ చేస్తున్న కొంతమంది ఫొటోస్, మరికొన్ని డీటెయిల్స్ ఉన్నాయి 

ఆశ్చర్యకరంగా ఇంతకు ముందు అతనిని అనుసరించిన వ్యక్తులు, అతని బాస్ ఫోటోలతో పాటు వారి ఫోటోలు కూడా ఉన్నాయి. మరియు J & K లోగో కూడా ఉంది. మరియు ఇర్ఫాన్ కేసుకు సంబంధించిన కొన్ని కోడ్‌లు కూడా.

మరియు బోర్డు మీద “అవినాష్ గుప్తా” అని ఒక పేరు ఉంది, ఆ సమయంలో అతను ఎవరో ఎవరికీ తెలియదు హేమంత్ కి తప్ప.

J & K లోగో గురించి సూర్య అడిగింది .

హేమంత్ : అది నా శత్రువు వదిలి వెళ్లిన వాడి నీడ & నా శత్రువును కనుగొనే మార్గం. 

ప్రతి గాయానికి తగ్గడానికి మందు ఉంటుంది, కానీ ఇది తగ్గకుండా ఉండేందుకు నేను వాడే మందు. 

హేమంత్ మాటలు సూర్యకి అర్థం కాలేదు. కానీ అతని మాటల్లో లోతు మాత్రం ఆమెకు అర్థమైంది. 

బిల్డర్ మనుషుల ఫొటోస్ చూసి ఆమె ఇలా అడుగుతుంది, “వారు మిమ్మల్ని అనుసరిస్తున్నారని మీకు ముందే తెలిస్తే మీరు ఎందుకు ఏమీ చేయలేదు”.

హేమంత్‌ సరదాగా, " ఫాలోవర్స్ ని ఎవరు ఇష్టపడరు??"అన్నాడు

హేమంత్ తనకు మరియు బిల్డర్‌కు మధ్య గతంలో జరిగిన కిడ్నాప్ సంఘటనను వివరించాడు

హేమంత్ “ప్రతీకారం కోసం వాళ్లు నా పై నిఘా వేసి ఉంచారని మొదట అనుకున్నాను కానీ ఆ తర్వాత అసలు కథ నాకు తెలిసింది. ఏది ఏమైనా వారు కేవలం పావులు , మనకు సూత్రధారులు కావాలి”

అప్పుడే సూర్య తన దగ్గర ఉన్న ఆధారాలు హేమంత్‌కి చూపిస్తుంది. పెన్ డ్రైవ్‌లోని కొన్ని వీడియోలు & సర్టిఫికెట్లు అతనికి చూపిస్తుంది.

సూర్య కొన్ని రోజులు కనపడక కుండా పోయింది ఆధారాలు సేకరించడానికి, భయపడి కాదు. 

దీని వెనుక రక్షణ మంత్రి హస్తం ఉందని సూర్య అనుమానిస్తోంది, అతని ప్రయాణాలు ఎక్కువగా రష్యా సరిహద్దుల్లో ఉన్నాయి, ఆమె అతని ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. అతని తదుపరి సమావేశం రష్యాలోని ఫ్యాక్టరీలో జరగబోతోందని కూడా ఆమె దగ్గర సమాచారం అందింది. సూర్య తనకు తెలిసిన విషయాలన్నీ వివరించింది. కారణమైన సర్టిఫికేట్‌ను కూడా చూపించింది.

రష్యన్లు శృతిని ఎందుకు వెంబడించారో హేమంత్‌కి ఇప్పుడు అర్థమైంది.

హైద్రాబాదులో ::

తదుపరి లక్ష్యం వార్డెన్ కావచ్చునని సుబాష్ అనుమానించాడు, శృతి ఎక్కువగా వెళ్ళేది అక్కడికే కాబట్టి నర్సింగ్ ఆ విషయం అప్పటికే అలెక్స్ కి చెప్పేయవచ్చు అని అజయ్‌కి ఆ విషయం చెప్పి అనాథాశ్రమానికి పంపాడు.

సుభాష్ అనుకున్నట్టుగానే అలెక్స్ మరియు నర్సింగ్ అనాథాశ్రమానికి చేరుకున్నారు, కానీ వారు అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. అజయ్ వాళ్ళందరినీ వేరే రాష్ట్రానికి పిక్నిక్ కి పంపిస్తారు. అలెక్స్ ముందే అనుకున్నాడు, సుభాష్ ఒకడుగు ముందే ఉంటాడు అని. ఏదోకటి చేయాలి అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు. 

చాలా సేపటి తరువాత వార్డెన్ తిరిగి ఆశ్రమంకి వస్తుంది. 

ఆమెకు విరాళాల కోసం కాల్స్ రావడంతో వార్డెన్ మళ్లీ అనాథాశ్రమానికి వచ్చారు. కానీ ఆ కాల్ అలెక్స్ టీమ్ నుంచి వచ్చింది. అనాథాశ్రమానికి చేరుకోగానే అది ఉచ్చు అని ఆమెకు తెలిసింది. ఆమె వారి నుంచి తప్పించుకోలేక పోయింది. ఆమె నుంచి సుభాష్ లొకేషన్ రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకి కూడా తెలియదు వారు ఎక్కడ ఉంటారో. సుబాష్‌కి ఫోన్‌ చేసి వార్డెన్‌ వాళ్ల దగ్గర ఉంది అని చెప్పారు. ఆమె కావాలంటే శ్రుతిని అప్పగించాలి అని చెప్తారు. 

సుబాష్‌కి శృతిని అప్పగించడం అస్సలు ఇష్టంలేదు, ఎందుకంటే సూర్యని బయటకు రప్పించడం కోసం వారు ఆమెను చంపేస్తారని అతనికి బాగా తెలుసు. ఒకవేళ నర్సింగ్ మధ్యలో వచ్చిన వారు అతడిని కూడా చంపేస్తారు. కాబట్టి శృతిని అప్పగించడం సరియైన నిర్ణయం కాదు అని సుభాష్ భావిస్తాడు. అలా అని వార్డెన్ వాళ్ళ దగ్గర ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం.

ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు సుభాష్, అతనికి ఒక్కటే ఆప్షన్ ఆమెను రక్షించడం. 

అలెక్స్ వార్డెన్ స్థానాన్ని నర్సింగ్ ఫామ్‌హౌస్‌కి మార్చారు. ఇద్దరిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అలెక్స్ ఆశ్రమంకి రమ్మని చెప్తాడు. 

ఫామ్‌హౌస్‌లో దాదాపు 5-6 మంది ఉన్నారు, అనాథాశ్రమంలో సుబాష్ వస్తాడని అలెక్స్ ఎదురు చూస్తున్నాడు.

వార్డెన్ లొకేషన్ గురించి సుబాష్‌కి తెలియదు, కానీ అజయ్ వార్డెన్ పేస్‌మేకర్ గురించి సమాచారాన్ని సేకరించి ఆమెను ట్రాక్ చేస్తాడు. 

కొన్ని రోజుల క్రితం ఆమెకు పేస్‌మేకర్ సమస్య వచ్చినప్పుడు అజయ్ & సుభాష్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సుభాష్ ఆ ప్రదేశానికి వెళ్లి, వారిలో ఎవరినీ చంపకుండా విజయవంతంగా ఆమెను రక్షించాడు.

చాలాసేపు సుభాష్ వస్తాడు అని అలెక్స్ ఎదురు చూస్తాడు, కానీ అతడు రాలేదు. అనుమానంతో అలెక్స్ ఫార్మ్హౌస్ కి కాల్ చేస్తాడు. ఎవరు ఫోన్ ఎత్తకపోవడంతో అది సుభాష్ పని అని వాడికి అర్ధం అయింది. 

అలెక్స్ తన జట్టును విఫలమైనందుకు చాలా కోపంగా ఉన్నాడు. ఆ ప్లాన్ ఇచ్చినందుకు ఎమ్మెల్యేను అలెక్స్ తిట్టాడు. 

అలెక్స్‌కి ఆ ప్లాన్ నచ్చలేదు మొదటి నుంచి. అతను వార్డెన్‌ని చంపాలి అనుకున్నాడు. కానీ నర్సింగ్ అలా చేయడం మానేసి, శృతి & సుబాష్‌ని తీసుకురావాలని ప్లాన్ చేశాడు. కానీ వారి ప్లాన్ పని చేయలేదు.

ఆమెని కాపాడి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో వార్డెన్‌కి గుండెపోటు వచ్చింది, సుభాష్ ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

ఈ విషయాన్ని సుభాష్ శృతికి తెలియజేయలేదు.


ముంబైలో::

సూర్య ఇచ్చిన ఆయుధాల ఒప్పంద పత్రం చూసిన తర్వాత హేమంత్‌కి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అతను భారత ప్రభుత్వ చివరి ఒప్పందాల వివరాలని సేకరించేటప్పుడు ఆ జాబితాలో ఒకటి సూర్య చెప్పిన కాంట్రాక్టు ఉంది. 

ఇర్ఫాన్ చనిపోయిన తర్వాత రష్యన్లు ఎందుకు హేమంత్‌ని చంపడానికి ప్రయత్నించలేదో ఇప్పుడు హేమంత్‌కు అర్థమైంది. దానికి బదులుగా వారు కొంతమంది లోకల్ గ్యాంగుతూ అతని మీద నిఘా వేశారు. అందులో భాగంగానే బిల్డర్ మనుషులు అతని మీద నిఘా పెట్టారు. 

కానీ ఎప్పుడైతే హేమంత్ ఇర్ఫాన్ వెళ్లిన ల్యాబ్ కి వెళ్ళాడో అలానే భారత ప్రభుత్వం చివరి ఒప్పందాలు గురించి తెలుసుకోవడం ప్రారంభించాడో అతణ్ని కూడా చంపడానికి ప్రయత్నిచారు. మరియు రష్యన్ బాస్ ఇందులో రష్యన్ గ్యాంగ్ వాళ్ళని పాల్గొనవద్దని వారికి చెప్పారు, అందుకే వారు దీనిని స్థానిక ముఠాకు ఇచ్చారు. ఎందుకంటే హేమంత్‌కు స్థానిక గ్యాంగ్‌తో సమస్యలు ఉన్నాయి అని వారికీ తెలుస్తుంది, అందుకే బిల్డరుతో డీల్ చేసుకున్నారు. 

అయితే అవి సరిపోవని, అసలైన ఆధారం లేదు అని హేమంత్ చెప్పాడు. 

అప్పుడే సీఐ రమాకాంత్ హేమంత్‌కి ఫోన్ చేశాడు. తాను వెళ్లిన లొకేషన్‌లో జరిగినదంతా చెబుతాడు.

CI అక్కడికి వెళ్లేలోపు ఎవరో బిల్డర్‌ని చంపారు, కానీ అతని ఫోన్ అక్కడే ఉంది. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

ఆ బిల్డర్‌కి ఎవరో రెండు కాంట్రాక్టులు ఇచ్చారు.

ఒకటి హేమంత్ & సూర్యని చంపడం

మరొకటి హేమంత్‌ని చంపడం.

ఇదే విషయాన్ని హేమంత్‌కు తెలిపాడు.

వారి ఫోన్ నెంబర్ వివరాల ఆధారంగా సీఐ రమాకాంత్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటారు.

ఒకటి రష్యన్ గ్యాంగ్ అలెక్స్ అని అందరికీ తెలుసు, కాని రెండవ వ్యక్తి ఎవరో ఇప్పుడు సిఐ రమాకాంత్‌కు మాత్రమే తెలుసు.

రెండో వ్యక్తి గురించి సమాచారం హేమంత్‌కి చెప్తారు.

అలాగే సీఐ రమాకాంత్ రెండో వ్యక్తికి సంబంధించిన కొన్ని కీలక సమాచారాన్ని కనుక్కొని ఆ విషయాలు కూడా ఇస్తారు. 

ఆ కాల్ తర్వాత కమాండర్ విక్రమ్ కొన్ని కీలకమైన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి హేమంత్‌ను సంప్రదించాడు, హేమంత్ రమాకాంత్ చెప్పిన రెండవ వ్యక్తి గురించి, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నాడు వంటి పూర్తి వివరాలు తెలుసుకోమని చెప్పారు.

(అసలు గేమ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది)

నిర్ణయం తీసుకునే సమయం, హేమంత్ మరియు సూర్య చర్చలు:

హేమంత్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు, రష్యా వెళ్లలేని పరిస్థితి వెళ్ళాలి ఎందుకంటే హైద్రాబాదులో మిషన్ చాలా ముఖ్యమైనది, రష్యా పంపడానికి సరైన వ్యక్తి ఎవరు అని తనలో తాను ఆలోచిస్తాడు.


అది గమనించిన సూర్య మీ ప్రాబ్లెమ్ రష్యా అయితే అక్కడికి నేను వెళ్తాను అని చెప్తుంది.


ఆమె తెగింపు హేమంత్‌కి బాగా నచ్చాయి. కానీ ఆమెను అక్కడికి పంపడం ఆమె ప్రాణాలకే ప్రమాదం అని హేమంత్ పంపలేను అని చెప్పాడు. 

సూర్య ముందుకు వచ్చి హేమంత్ సర్‌తో ఇలా అంటుంది 

“ఈ స్కామ్ బయటకి రావడానికి నా స్నేహితుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు, నేను నా ప్రాణాలు ప్రాణంగా పెడుతున్న, అక్కడికి వెళ్లడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను, నాకు ఏమైనా అవుతుందేమో అని మాత్రం భయపడకండి సార్, నన్ను కూడా ఒక సోల్జర్ అనుకోని పంపించండి” అని చెప్తుంది

ఆమెలో ఒక సోల్జర్ ని చూశారు హేమంత్. హేమంత్ అన్ని విషయాలు ఆలోచిస్తారు తర్వాత సరే నువ్వు వెళ్లి పడుకో ఉదయం మాట్లాడుకుందాం అంటారు. 

హేమంత్ రాత్రి అంతా బాగా ఆలోచిస్తాడు. సూర్య రష్యా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అని  హేమంత్ నిర్ణయించుకుంటారు.

నిజానికి హేమంత్ సార్ తలుచుకుంటే తన దగ్గర ఉన్న వేరే ఆఫీసర్ ఎవరినైనా పంపించవచ్చు కానీ సూర్యని రిస్క్ లో పెట్టి మరి పంపడానికి గల కారణం??

ఈ మిషన్‌ను పూర్తి చేయడానికి సూర్యకు మాత్రమే అన్ని అర్హతలు ఉన్నాయని హేమంత్ నమ్ముతున్నాడు, దాని కోసం అతని స్నేహితుడు ఇర్ఫాన్ మరణించాడు, అంతకుమించిన విషయం ఇర్ఫాన్ కూడా ఆమెను నమ్మాడు. అందుకే ఆమెని రష్యా పంపడానికి సుముఖంగా ఉన్నారు

సూర్య ఉదయం లేచే సరికి అన్ని రెడీ చేస్తారు, రష్యాలో సూర్యకి తోడుగా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని ఏర్పాటు చేశారు, అతను ఆమె భద్రతను చూసుకుంటాడు. సూర్య ఉదయాన్నే లేచి హేమంత్ దగ్గరకు రాగానే, ఫేక్ పాస్‌పోర్ట్ & వీసా చేతిలో పెట్టాడు, అది కూడా 70 ఏళ్ల వృద్ధుడిలా.

సూర్యకి ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆమెకు కావాల్సినవన్నీ ఒక బ్యాగులో సిద్ధంగా ఉంచుతారు .

 రాత్రి అంతా తను మెలకువగానే ఉంటారు. అవసరమైన ఏర్పాట్లు చేశారు.

రష్యా వెళ్లాలనే ఉత్సాహంతో ఉన్న సూర్య మొహం ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. దాని వెనుక కారణం హేమంత్‌కి బాగా తెలుసు. అతను తన ఫోన్ తీసుకొని ఒక నంబర్ డయల్ చేస్తాడు.

హేమంత్ పక్కకు వెళ్లి ఫోన్ లో ఏదో చెప్పారు. ఆ తర్వాత సూర్య కి ఫోన్ ఇస్తారు. అటువైపు నుంచి హలో అనగానే సూర్య కళ్ళలో నుంచి కన్నీరు ఆగటంలేదు. ఆటుపక్కన మాట్లాడేది వాళ్ళ అక్క శృతి. శృతి కళ్ళలో కూడా నీళ్లు వస్తాయి.

సూర్య గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ అక్క తో మాట్లాడలేకపోయింది, ఇర్ఫాన్ ఆక్సిడెంట్ ముందురోజు నుంచి. 

నన్ను క్షమించు అక్క అని సూర్య అంటుంది, ఎక్కడ ఉన్నావ్, ఎలా ఉన్నావ్ అని శృతి అడుగుతుంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది సూర్య. 


నీకు చాలా చెప్పాలి అనుకున్న కొన్ని రోజుల నుంచి నీ ఫోన్ కలవలేదు ఏమైంది అని ఆడుతుంది శృతి , సూర్య ఏమి లేదు చిన్న పని మీద చూసుకోలేదు అని దాటేస్తుంది. 

శృతి అడిగింది “నాకు నిన్ను చూడాలని ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు? నేను నీతో చాలా చెప్పాలి”

హేమంత్ సర్‌ని చూసి “రెండు రోజుల్లో మీ దగ్గరకు వస్తాను” అంటుంది సూర్య.

వాడు జనార్దన్ అంకుల్ ని కూడా చంపేశాడు అని శృతి బాధపడుతూ చెపుతుంది.

సూర్య “డోంట్ వర్రీ అక్కా, నీకు నేనున్నాను, అంకుల్ ఎప్పుడూ మన గురించే ఆలోచించేవారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. నర్సింగ్ తన పాపాలకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు ముందే ఉంది "

ఫోన్ కట్ చేసిన తర్వాత, శ్రుతి సుభాష్‌ని అడుగుతుంది, సూర్య మీకు ఎలా ఫోన్ చేసింది అని ?

సుబాష్ స్పందిస్తూ, కొన్ని రోజుల క్రితం నేను జనార్దన్ అంకుల్ కి చెప్పాను, సూర్య ఫోన్ చేస్తే నా నెంబర్ ఇవ్వమని. తనకు ఈరోజు కుదిరింది అనుకుంటా ఫోన్ చేయడానికి. (కానీ ఆమె ఎక్కడ ఉందో, ఎక్కడికి వెళ్తుందో అతను చెప్పలేదు)

ఎలా మా అక్క గురించి తెలుసు అని సూర్య అడుగుతుంది, దానికి హేమంత్ "నాకు నా ఇంటెల్ ఉంది" అని చెప్పాడు.

వెళ్లేముందు హేమంత్ దగ్గరికి వచ్చి నాకు ఒకే ఒక్క మాట ఇస్తారా సార్ అని అడుగుతుంది. 

మా అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా? అని అడుగుతుంది.

హేమంత్ బదులిస్తూ “నీకు కావాల్సింది మాట కాదు, మీ అక్కని తన కన్నా ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తి , అతను ఇప్పుడు మీ అక్కతోనే ఉన్నాడు, అతను నా దగ్గర ఉన్న బెస్ట్ సోల్జర్స్ లో ఒకరు, అతను పక్కన ఉండగా మీ అక్క మీద చిన్న గీత కూడా పడనివ్వడు”.

సూర్యకి సుభాష్ గురించి జనార్దన్ చెప్పాడు, కానీ హేమంత్ చెప్పడం వలన ఇంకా నమ్మకం పెరుగుతుంది. 

"మీరు మాతో ఉండటం మా అదృష్టం సార్" అంటుంది సూర్య

హేమంత్ స్పందిస్తూ..”సైనికులు అదృష్టాన్ని నమ్మరు, మేము నమ్మేది దేశభక్తిని, మాలాంటి వారికే సహాయం చేయడానికి మీలాంటి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం”. 

ఆ మాట విన్న సూర్య లోపలికి ఒక తెలియని శక్తి తన లోపలికి వచ్చినట్టు ఫీల్ అయింది. 


ఆమె ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరే ముందు, హేమంత్ సూర్య అపార్ట్‌మెంట్‌లో వదిలిపెట్టిన రైలు టికెట్ ఇచ్చాడు, ఆమె దానిని తీసుకెళ్లడం మర్చిపోయింది. ఏమి జరిగిందో చెప్పమని హేమంత్ అడిగాడు, 

సుబాష్‌ని వెళ్లి కలవడం ఆమెకు చాలా ముఖ్యం.

కానీ ఆమె ఎందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా ఇర్ఫాన్‌ను కలవడం ఎందుకు ముఖ్యం అనుకున్నది ? 


ఆ సమయంలో ఏం జరిగిందో సూర్య వివరించడం ప్రారంభించింది


“నాపై గూఢచారిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వ్యక్తి, ప్రతి సాయంత్రం ఎమ్మెల్యేకు నా గురించి ఫోన్ చేస్తాడు. సాయంత్రం కాల్ చేసిన తర్వాత మేము ప్లాన్ చేసిన ప్రకారం నేను అతన్ని కొట్టి, అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాను. దానివల్ల మరుసటి రోజు సాయంత్రం వరకు ఎమ్మెల్యే నా గురించి ఆలోచించరు. నేను అందులో విజయం సాధించాను. 


సుభాష్ ముంబైకి వస్తున్నాడని నాకు తెలుసు. అతని నుండి తప్పించుకున్న తర్వాత, నేను సుభాష్ ని కలవాలని అనుకున్న. ఆ తర్వాత శ్రుతిని రక్షించడానికి అతనితో పాటు ప్రయాణం చేయాలి అని ప్లాన్ చేసా. 


కానీ నేను నా టికెట్ మర్చిపోయాను, టిక్కెట్ కోసం తిరిగి అపార్ట్‌మెంట్‌కి వెళుతున్నప్పుడు, నాకు ఇర్ఫాన్ నుండి కాల్ వచ్చింది, అతను అత్యవసరమని చెప్పాడు. అందుకే అతణ్ణి కలవడానికి వెళ్లాను.


నేను ఇర్ఫాన్‌ను కలిసినప్పుడు, ఇర్ఫాన్ కొన్ని డాకుమెంట్స్ ఇచ్చాడు. నేను అతణ్ణి గమనించా అతను చాలా హడావిడిగా మరియు టెన్షన్‌లో ఉన్నాడు. అతను నన్ను సురక్షితంగా ఉండమని చెప్పాడు, ఆ తర్వాత ఎవరినో కలవాలని చెప్పి వెళ్ళిపోయాడు.


ఇర్ఫాన్ మాటలు విన్న తర్వాత జనార్ధన్ అంకుల్ కి ఫోన్ చేసి నేను తప్పించుకున్నాను, సుభాష్ సహాయంతో శ్రుతిని రక్షించమని చెప్పాను, ఎందుకంటే నేను హైదరాబాద్ చేరుకునే వరకు అంకుల్ వేచి ఉంటే, బహుశా మా శృతి తప్పించుకోవడం కష్టం అని అనుకున్న. 

ఆ తర్వాత ఇర్ఫాన్ నుంచి నాకు ఎటువంటి సమాచారం అందలేదు. కొద్దిసేపటికి ఇర్ఫాన్ యాక్సిడెంట్‌లో చనిపోయాడని తెలిసింది, కానీ ఎవరో హత్య చేశారని నాకు బాగా తెలుసు. 

 నేను అతనితో ఉండి ఉంటే బాగుండేది. ఆరోజు ఇర్ఫాన్ ఒక బ్యాగ్ కూడా ధరించి ఉన్నాడు, అది ఏమిటో, అందులో ఏముందో మీకు కూడా తెలుసు, కానీ ఆ బ్యాగ్ ఇర్ఫాన్ చనిపోయిన దగ్గర దొరకలేదు, కచ్చితంగా అతనితో పాటు దాన్ని కూడా నాశనం చేసి ఉంటారు. 


ఇర్ఫాన్ నుంచి డాకుమెంట్స్ సేకరించిన తర్వాత, నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్న. కానీ నేను ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూసాను. కానీ నేను అతని గురించి తెలుసుకున్న తర్వాత, నేను ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే శ్రుతికి అది సురక్షితం కాదు, నేను అక్కడికి వెళితే ఇర్ఫాన్ ని చంపిన వారు అక్కడికి కూడా వస్తారు. మరియు నేను ఇర్ఫాన్ ప్రారంభించిన దాన్ని పూర్తి చేయాలి అనుకున్న. 


మరుసటి రోజు ఉదయం నేను మా అక్క గురించి అడిగాను. జనార్దన్ అంకుల్ క్షేమంగా ఉన్నారని, అంతా మనం అనుకున్నట్టే జరిగింది అని చెప్పారు. ఇప్పుడు సుబాష్‌తో ఉన్నారని కూడా చెప్పారు. అప్పుడు నేను కొన్ని రోజులు అందుబాటులో ఉండను అని అతనికి చెప్పాను 

ఆ తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది.

ఒకవైపు మా అక్క విషయంలో చాలా ఆనందంగా ఉంది , మరోవైపు స్నేహితుడి చావు చెప్పలేని బాధని మిగిల్చింది. అతణ్ణి ఎవరు చంపారనే కోపం కూడా. చంపినా వాడిని ఇంకా బయటనే తిరిగణిస్తున్నాం అనే నిస్సహాయత. 


నేను హైదరాబాద్ వెళ్లకపోయినా, శ్రుతిని రక్షించడానికి సుభాష్ అక్కడ ఉంటాడని నాకు తెలుసు, కానీ నేను ఇర్ఫాన్‌ను కలవకపోతే అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతాను అనుకున్న. కాని వారు అతన్ని చంపేశారు.


హేమంత్: నువ్వు కాదు, ఆ సమయంలో నేను ఇర్ఫాన్‌తో ఉండాల్సింది, ఈపాటికి అందరూ బయటకు వచ్చేవారు.


ఆమె బయలుదేరే ముందు సూర్య ఒకటి గమనించారు. "ప్లాన్ A & ప్లాన్ B". అని బోర్డు మీద ఉంది. కానీ వారు దాని గురించి చర్చించలేదు.

సూర్య రష్యాకు బయలుదేరింది. మరుసటి రోజు హేమంత్ హైదరాబాద్ చేరుకున్నాడు. వారిని ఎవరూ అనుసరించకుండా హేమంత్ జాగ్రత్త పడ్డాడు.

హేమంత్ మరియు అరవింద్ కలిసి సుభాష్ ఇంటికి వెళతారు, అక్కడ వారు శృతి మరియు సుభాష్ స్నేహితుడు అజయ్‌ని కలుస్తారు. గతంలో సుభాష్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు హేమంత్ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడాడు.

హేమంత్ సార్ ని చూడగానే శృతి వెళ్లి హేమంత్ & అరవింద్ కాళ్ళకి నమస్కరించింది. చక్కటి సంస్కారవంతమైన అమ్మాయి నీ ఇంటికి వచ్చింది అని అరవింద్ సుభాష్‌కి చెప్తారు. 


దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ అని అరవింద్ ఆశీర్వదిస్తారు. అజయ్ హ్యాకింగ్ టాలెంట్ గురించి కూడా సుభాష్ చెప్పాడు. 

మరోవైపు, రష్యాలో సూర్యకి హేమంత్ స్నేహితుడు సహాయం చేస్తున్నాడు. సూర్య రష్యా చేరుకోవడానికి ముందు, హేమంత్ స్నేహితుడు కార్గో ఫ్లైట్ సర్వీస్ ద్వారా ఒక కొరియర్ ఇండియా పంపాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ గురించి వివరాలన్నీ ఆమెకు చెప్పాడు. ఆ ఫ్యాక్టరీ కి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా ఇస్తారు. అతను సమావేశానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించి సూర్యకి అందించారు.

సుభాష్ & హేమంత్ చాలా సేపు విడిగా మాట్లాడుకున్నారు.

హేమంత్: మనం సిద్ధంగా ఉండాలి, రేపు ఉగ్రవాదులు మనపై దాడికి ప్రయత్నిస్తారు, అప్పటి వరకు సుభాష్‌కి ప్లాన్ సగం మాత్రమే తెలుసు. 

“పేలుడు పదార్థాలు ఎక్కడ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు వాటిపై ఎందుకు దాడి చేయకూడదు” అని సుభాష్ అడిగాడు.

అందుకు గల కారణాలు హేమంత్ చెప్పాడు. తన కొత్త ప్రణాళికల గురించి వివరించారు. అసలు ప్లాన్ గురించి అరవింద్‌కి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్లాన్‌లో పాల్గొన్న మూడో, నాల్గవ వ్యక్తుల గురించి హేమంత్ చెప్పాడు. అతను ప్లాన్ A గురించి మొదట్లో వివరించారు. ఇప్పుడు మొత్తం ప్లాన్ చెప్తారు. 

అదే సమయంలో శృతి టీ తీసుకుని అక్కడికి వచ్చింది. హేమంత్ ఆమెను చూడగానే చాలా సూర్య గుర్తుకొచ్చింది. రష్యాలో సూర్యకి ఏమైనా జరిగితే అది తన తప్పే అని హేమంత్ సంకోచించాడు. సుభాష్‌కి అది అర్థమైంది. శృతి టీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. 

హేమంత్ "సూర్య ఇప్పుడు రష్యాలో ఉంది, నేను వెళ్ళకుండా ఆమెను పంపవలసి వచ్చింది" అని చెప్పారు.

సుభాష్, “ఆమెను అక్కడికి పంపారు అంటే, మీరు ఆమెను ఎంతగానో నమ్ముతున్నారో అర్ధం చేసుకోగలను సార్”

హేమంత్ "నేను ఆమెకు చెప్పాను, కేవలం అక్కడ కెమెరా పెట్టి వచ్చేయ్ అని, వాటి ద్వారా సమాచారం తెలుసుకుందాం అని "

ఆమెకు సత్తా ఉందని నమ్మి పంపించాడు.

ఆమె గురించి ఆలోచించడం కంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి సార్‌ అని సుభాష్‌ చెప్పారు.

సుభాష్ ఇంటి నుండి బయలుదేరే ముందు, హేమంత్ అజయ్ వద్దకు వెళ్లి ఒక సహాయం అడిగాడు, అజయ్ షాక్ అయ్యాడు. ఒక విషయం ఎంక్వైరీ చేయమని చెప్పారు. అజయ్ వెంటనే దానికి ఓకే చెప్పాడు, హేమంత్ ఆ సమాచారాన్ని సుబాష్‌కి అప్పగించమని అడిగాడు.

మరోవైపు హేమంత్ హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి మరో రష్యన్ గ్యాంగ్ కూడా హైదరాబాద్ చేరుకుంది.

(అదే ఉగ్రవాది మనుషులు హేమంత్ ఆచూకీ గురించి రష్యన్‌లకు సమాచారం ఇచ్చారు)

రష్యా లో:

రష్యాలోని మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో జరిగే సమావేశానికి వెళ్లాలని అంతా ప్లాన్ చేస్తున్నారు. హేమంత్ స్నేహితుడు సూర్యతో ఉన్నాడు.

కంపెనీ పేరు "అన్నా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ‘‘ఆ కంపెనీ సీఈవో అన్నా ఇవాన్‌, కానీ అతణ్ణి మాఫియా డాన్ డిమిత్రి బెదిరించాడు". 

డిమిత్రి ఆ కంపెనీ ద్వారా చాలా అక్రమ వ్యాపారం చేస్తున్నాడు, అతను అక్కడ అండర్ వరల్డ్ డాన్ లా చక్రం తిప్పుతున్నాడు. 

తనకు అడ్డుగా ఉన్న చాలా మందిని అతను దారుణంగా చంపేశాడు. అతను ఎవరినైనా చంపి ఆత్మహత్య చేసుకున్నారు అని చిత్రీకరిస్తారు, కొంతమంది స్థానిక పోలీసులు మరియు రాజకీయ నాయకులు కూడా అతనికి సహాయం చేస్తారు మరియు ప్రతిఫలంగా వాళ్ళ వద్దకు అతని డబ్బు వారికి చేరుతుంది.

బిడ్డింగ్‌లో అవకతవకల కారణంగా, ఆ కంపెనీకి భారత రక్షణ రంగం నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాని వెనుక మన దేశంలోని అవినీతిపరులైన కొందరు నాయకులు ఉన్నారు.

కానీ రష్యా ప్రభుత్వానికి ఈ అక్రమాల గురించి తెలియదు, మన ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే తెలుసు.


హైద్రాబాదులో: పేలుడుకు ముందు రోజు అర్ధరాత్రి, హేమంత్‌ని కలవడానికి ఒక గుర్తుతెలియని వ్యక్తి వస్తాడు, అతను హేమంత్‌కి ఒక కవర్‌ను ఇచ్చి వెళ్లిపోతాడు.

హేమంత్ తన టీమ్‌లోని ప్రతి ఒక్కరిని బాంబు గురించి తెలిస్తే వెంటనే సమాచారాన్ని చెప్పాలని గట్టిగా చెప్పారు. 

కొద్దిసేపటి తరువాత , హేమంత్‌కి బాంబు గురించి అత్యవసర కాల్ వచ్చింది. నగరం చివరన ఉన్న ఆనకట్ట పై బాంబును ఫిక్స్ చేసారు టెర్రరిస్ట్స్. అది పేలితే డ్యాం నుంచి వచ్చే నీరు చాలా గ్రామాలు ముంచేసే ప్రమాదం ఉంది.

వెంటనే సుభాష్, అరవింద్, హేమంత్ అక్కడికి చేరుకున్నారు. కానీ సుభాష్, అరవింద్ మాత్రమే బాంబు లొకేషన్‌కి వెళతారు.

హేమంత్‌కి అనుమానం వచ్చి దూరం నుండి అంతా గమనిస్తాడు.

ఉగ్రవాదులు తన కోసం ఎదురు చూస్తారని హేమంత్‌కి తెలుసు కధ.

అతను అనుకున్నట్టుగానే అక్కడ ఒక ఉగ్రవాది ఉన్నాడు. హేమంత్ కనపడక పోవడంతో అక్కడ ఉన్న టెర్రరిస్ట్ చాలా కంగారు పడిపోతారు, హేమంత్ దూరం నుండి బైనాక్యులర్స్ ద్వారా అన్ని విషయాలు గమనిస్తున్నాడు మరియు అక్కడికి వచ్చిన వారిని కూడా గమనిస్తున్నాడు.

ఉగ్రవాది తప్ప బాంబు పేలదని టీమ్‌లోని అందరికీ తెలుసు. సెల్ ఫోన్ బాంబ్ కాబట్టి సెల్ ఫోన్ తోనే ఆపరేట్ చేయాలి.

హేమంత్ వచ్చిన తర్వాత పేల్చివేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే హేమంత్ రాకముందే జామర్లు అక్కడ సెట్ చేశారు. దానిని నిర్వీర్యం చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. హేమంత్ అనుమానాస్పదంగా ఫోన్ పట్టుకున్న వ్యక్తిని గమనించాడు. ఆ తర్వాత హేమంత్ అక్కడికి వస్తాడు.

హేమంత్ అక్కడికి రావడం చూసి టెర్రరిస్ట్ దానిని పేల్చడానికి ప్రయత్నించాడు కానీ జామర్లు ఉండటంతో అది పేలలేదు.

హేమంత్ అక్కడికి వెళ్లకపోతే ఉగ్రవాదులు మొబైల్ ఆపరేట్ చేయరు, అప్పటి వరకు అనుమానం మాత్రమే ఉంది, అతను అక్కడికి వెళ్లి వ్యక్తిని ధృవీకరించారు.

బాంబు పేలకపోవడంతో తీవ్రవాది భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు

(అది కూడా టెర్రరిస్టుల ప్లాన్‌లో భాగమే, వాళ్ళ మీద అనుమానం వచ్చేలా చేసి, హేమంత్ వాళ్ళని ఫాలో అయ్యేలా చేయడమే వాళ్ళ రెండో ప్లాన్)

హేమంత్ అతనిని అనుసరించాడు. సుభాష్ మాత్రమే అక్కడే ఉంటాడు, హేమంత్ ఎవరికీ కనిపించకుండా నిమిషంలో అదృశ్యమయ్యాడు. సుభాష్ బాంబును నిర్వీర్యం చేశారు. హేమంత్ అక్కడ లేకపోవడంతో సుభాష్ కూడా వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ అదే సమయంలో అతనికి ఏదో గుర్తు వచ్చింది. అతని పరిశోధనల ప్రకారం 10 కిలోల పేలుడు పదార్థాలు ఉండాలి.

కానీ సుభాష్‌కి 5 కిలోలు మాత్రమే అక్కడ దొరికాయి. అంటే ఎక్కడో మరో 5 కిలోలు ఉన్నాయని అనుమానం వస్తుంది. అందరినీ అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పాడు.

సుభాష్ ప్రశాంతంగా ఉండి పరిసరాలను గమనిస్తున్నాడు. ఈ వంతెనను కూల్చివేయడమే వారి లక్ష్యం. అయితే ఈ వంతెనపైనే మరో బాంబు ఉండవచ్చని అనుకున్నాడు.

సుభాష్‌కి ఒక చోట చిన్న టిక్ టిక్ శబ్దం వినిపిస్తుంది. అక్కడ బాంబు కింద మరో బాంబును అమర్చారు.

మొదటి బాంబు పెట్టిన దగ్గర దాని కింద సస్పెన్షన్ జాయింట్ దగ్గర ఉన్న చిన్న రంధ్రం నుండి శబ్దం వస్తుంది. సుభాష్ ఆ బాంబుని కనిపెట్టారు. 

10 నిమిషాల్లో బాంబు పేలేందుకు సమయం ఉంది. ఇది మొదటి బాంబు కంటే భిన్నంగా ఉంది మరియు అది టైమ్ బాంబ్.

హేమంత్‌ని చంపలేకపోతే అక్కడి సైనికులను అయినా చంపాలని అనుకున్నారు. అందుకే రెండు బాంబులు పెట్టారు.

తీవ్రవాదుల పథకం: అక్కడికి వచ్చిన ఆర్మీ బృందం పైన బాంబును నిర్వీర్యం చేసే పనిలో పడుతుంది. మరియు అందరి దృష్టి బాంబ్ 1 పైనే ఉంటుంది. బ్రిడ్జి కింద ఉన్న బాంబు పేలుతుందని, జట్టులోని అందరూ చనిపోతారని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు, కానీ అది కూడా పని చేయలేదు.

సుభాష్ చాలా తెలివిగా గుర్తించాడు. కానీ దానిని నిర్వీర్యం సులభం కాదు, సమయం చాలా తక్కువ. ఆ బాంబు చాలా క్లిష్టమైన అల్లిక కలిగి ఉంది. ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని సుభాష్‌కు తెలుసు.

అయితే, సుభాష్ రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు మరియు అతను మిగిలిన జట్టును అక్కడి నుంచి పంపించాడు. సుభాష్ చాలా ప్రయత్నించారు మరియు అతను చివరి నిమిషం వరకు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవాలని అతనికి తెలుసు. అతను జట్టులోని ప్రతి ఒక్కరినీ చూసాడు మరియు అతను దాన్ని కచ్చితంగా నిర్వీర్యం చేయాలని అతనికి తెలుసు. చివరకు సుభాష్ చివరి నిమిషంలో దానిని నిర్వీర్యం చేశారు. అక్కడున్న వారంతా అతన్ని మెచ్చుకున్నారు.

కానీ సుభాష్ సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా లొకేషన్ నుండి వెళ్ళిపోయాడు. అతను హేమంత్ రూట్‌ని అనుసరిస్తాడు. తన సమయం తక్కువ అని అతనికి బాగా తెలుసు. 120కి పైగా వేగంతో కారు నడుపుతున్నాడు.

నిజానికి అతను హేమంత్ వెనకాలే వెళ్ళాలనుకున్నాడు కానీ అనుకోకుండా అక్కడ మరో బాంబు దొరికి ఆగాల్సి వచ్చింది. హేమంత్ ఉగ్రవాదిని అనుసరించి అడవిలోకి వెళ్తాడు

 ఉగ్రవాది చివరికి దట్టమైన అడవిలో ఉన్న ఫామ్‌హౌస్‌లోకి వెళ్తాడు. ఫాంహౌస్ అడవి మధ్యలో ఉంది. హేమంత్ ఉగ్రవాదిని అనుసరించాడు. ప్లాన్ ఎ విఫలమైనా ఉగ్రవాదులు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ప్లాన్ బి విజయవంతమవుతుందని వారు భావించారు.

అప్పటికి ఇంకా సూర్యుడు ఉదయించ లేదు, హేమంత్ చీకట్లో వారిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. అయితే ఇది అపరిమిత బుల్లెట్లను కాల్చే సినిమా కాదు.

హేమంత్ వారి తుపాకీలలో బుల్లెట్లు అయిపోయే వరకు వారితో ఆడుకున్నాడు, వారి బుల్లెట్లు అయిపోయేలా చేసాడు మరియు అతను కాల్చబడకుండా తప్పించుకున్నాడు.

వారి వద్ద ఇప్పుడు బుల్లెట్లు అయిపోయాయి.

ఆ తర్వాత హేమంత్ తన ఆట ప్రారంభించాడు. అతను ఎవరినీ విడిచిపెట్టడు మరియు అందరినీ చంపుకుంటూ ముందుకు వెళ్ళాడు. బయట వారందరినీ చంపిన తర్వాత.

హేమంత్ ఆ ఫామ్‌హౌస్‌లోకి వెళ్లాడు. హేమంత్ బిల్డింగ్‌లోని అందరినీ చంపిన కొద్దిసేపటికే, హేమంత్ బయటకు వస్తుండగా మరికొందరు ఉగ్రవాదులు అక్కడికి వచ్చి హేమంత్‌పై కాల్పులు ప్రారంభించారు.

ఈసారి హేమంత్ సర్ మెరుపు వేగంతో అందరినీ కాల్చిచంపాడు. అతను ఎక్కడి నుండి వస్తున్నాడో కూడా వారు గమనించరు.

కానీ అనుకోకుండా దూరం నుండి స్నిపర్ షాట్ హేమంత్ గుండెను చీల్చుకొని లోపలికి వెళ్తుంది.

ఆ స్నిపర్ బుల్లెట్ సమీపంలోని కొండ నుండి వస్తుంది. హేమంత్ కిందపడిపోయాడు, కానీ మృత్యువును అతని చేతిలో గట్టిగా పట్టుకున్నాడు, చివరి నిమిషంలో సుభాష్ అక్కడికి చేరుకుంటారు.

హేమంత్ సుభాష్‌కి ముందు కొన్ని మాటలు చెప్పాడు, సుభాష్ తన కారులో హేమంత్‌ని హాస్పిటల్‌కి తీసుకెళతాడు. హేమంత్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు.

కొన్ని గంటల తర్వాత హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అయితే ఆ స్నిపర్ గన్ ట్రిగ్గర్‌ను ఎవరి వేలితో ఆపరేట్ చేశారో ఎవరికీ తెలియదు.

అది సుబాష్. అవును తన గురువుని కాల్చింది సుభాష్. హేమంత్‌ను ఎవరూ కాల్చలేరు, కానీ సుభాష్ కాల్చగలడు. 


 

             కథ ఇంకా ఉంది ____________


                        >>కార్తీక్ & విక్రమ్ కథ రాబోతోంది.<<


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Action