kishorekumar Arige

Action Thriller

3.3  

kishorekumar Arige

Action Thriller

Never Judge a Women_3

Never Judge a Women_3

22 mins
478


ఈ భాగం చదివే ముందు క్రింద తెలిపిన మొదటి భాగం,రెండవ భాగం తప్పక చదవండి . ఇది పార్ట్_3


part1: https://storymirror.com/read/story/telugu/585jk172/aaddvaarini-veeletti-cuupddu/detail

part2 : https://storymirror.com/read/story/telugu/d1ibyqk2/never-jddj-vimen-2/detail


జరిగినది అంతా వారికీ చెప్పిన తరువాత: 


సుభాష్: హేమంత్ సార్ 2 రోజుల్లో ఇక్కడికి వస్తారు, సార్ తో ఏమి చెప్పకండి ఇక్కడ జరింగింది!!ఇద్దరు సరే అంటారు.


కొంచెంసేపు తరువాత హేమంత్ వెళ్లి అడుగుతాడు సుభాష్ ని 


హేమంత్: హేమంత్ సార్ హెల్ప్ మనం తీసుకోవచ్చు కదా? . 


సుభాష్: లేదురా, చెప్పాను కదా ఒక విషయంలో సార్ ఇప్పటికే చాలా మధన పడుతున్నాడు, మళ్ళి ఈ విషయం ఎందుకు? వాడు ఎవడో ముందు కనిపెడుదాం, తరువాత అవసరం అయితే అప్పుడు సార్ Help తీసుకుందాం. 


హేమంత్: సరే 


హేమంత్ సార్, అభిరామ్ సార్ ఇద్దరు కలిసి వస్తారు అక్కడికి (సుభాష్ వాళ్ళ ఇంటికి), సుభాష్ ఏమి కానట్టు చాలా Normalగా ఉంటాడు . 


హేమంత్, సుభాష్, మానస అక్కడే ఉంటారు. హేమంత్ సార్, అభిరామ్ సార్ ని వాళ్ళ స్నేహితులకి పరిచయం చేస్తాడు.


హేమంత్: సార్ నా పేరు కూడా హేమంత్, సార్, మీ గురించి చాలా చెప్పాడు సార్ సుభాష్. 


అభిరామ్ సార్: మరి నా గురించి ఏమి చెప్పలేదా? (చమత్కరిస్తాడు)


మానస జరిగింది అంతా హేమంత్ సార్ తో చెప్పి తన సహాయం తీసుకుందాం అనుకుంటుంది, కానీ సుభాష్ చెప్పింది గుర్తుకువచ్చి వెనుక అడుగు వేస్తుంది.  సుభాష్ మీద మాటల మీద నమ్మకం ఉంచి ఏమి చెప్పకుండా వారితో కలిసిపోతుంది.  


హేమంత్: ఒక పని మీద ఇక్కడికి వచ్చాము, అలాగే నిన్ను కూడా కలిసి వెళ్లుదాం అని వచ్చాము, ఇంతకీ నువ్వు సెలవులో ఉన్నావ్ అని అన్నారు, ఏమైంది. హాస్పిటల్ కూడా ఉన్నావ్ అని చెప్పారు campలో .


సుభాష్: అదేమి లేదు సార్, చిన్న బైక్ accident అంతే, నాకేమి కాలేదు. 


కానీ హేమంత్ సార్ కి అనుమానం వస్తుంది. వెంటనే అడుగుతాడు ఏమైనా దాస్తున్నావా అని? కానీ సుభాష్ ఏమి లేదు సార్, నిజంగానే బండి మీద నుంచి పడ్డాను అంటాడు. 


అభిరామ్: జాగ్రత్త సుభాష్, మనం సరైన దారిలో వెళ్లిన ఒక్కోసారి ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్త!!


సుభాష్: అలాగే సార్ 


మానసని చూసి హేమంత్ సార్ ఇలా మాట్లాడుతాడు 


హేమంత్ సార్: అమ్మాయి చాలా బాగుంది సుభాష్, సుభాష్ నా తమ్ముడు బాగా చూసుకోవాలి అమ్మ. 


అభిరామ్ సార్: "సుభాష్ అమ్మాయి నా కూతురు, కళ్ళలో కన్నీరు అనేది వస్తుంది అని తెలియకుండా చూసుకోవాలి"


అభిరామ్ సార్ హేమంత్(సుభాష్ స్నేహితుడు) వైపు చూస్తూ, నువ్వేం చేస్తావు, వాళ్ళిద్దరికీ ఏ కష్టం రాకుండా చూసుకో. 


హేమంత్(మనుసులో): మరి నన్ను ఎవరు చూసుకుంటారు. కచ్చితంగా సార్ (బయటకి మాత్రం )


అభిరామ్ సార్: అయినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ??


సుభాష్: ఇంకా ఏమి అనుకోలేదు సార్! తన చెల్లి కూడా ఇక్కడ లేదు, వచ్చాక చేసుకుంటాం. 


అభిరామ్: పెళ్లి ఐతే తరువాత చేసుకోండి, కనీసం మా కోసం ఈ రింగ్స్ మార్చుకోండి, engagement అనుకుంటాం!! 


సుభాష్: అప్పుడే ఎందుకు అని అనుకుంటున్నాము సార్.


హేమంత్: చెడు పనికి ఐతే ఆలోచించాలి కానీ, మంచి పనికి ఎక్కువ ఆలోచించకూడదు. పెళ్లి ఎప్పుడైనా చేసుకోండి సుభాష్, engagement కదా, మళ్ళి మేము నీ పెళ్లి సమయానికి మేము ఎక్కడ ఉంటామో, ఏమి చేస్తుంటామో, కుదురుతుందో లేదో?


సుభాష్ :అదేంటి సార్ మీరు రాకపోతే ఎలా సార్?


అభిరామ్ సార్: నీకు బాగా తెలుసు సుభాష్ మీ సార్ ఆ సమయానికి ఏదైనా అత్యవసర మిషన్ ఉంటె ఎవరికీ దొరకడు, మనం చేసేది ఎలాంటి పనో నీకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నా!! 


సుభాష్ కి ఒకవైపు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తను ఎంతగానో అభిమానించే హేమంత్ సార్ పక్కనే ఉండి చేపించడం, మరోవైపు మానస చెల్లీ లేకపోవడం కొంచెం బాధగా ఉంటుంది 


అప్పుడే మానస పిలుస్తుంది సుభాష్ ని, ఇద్దరు పక్కకి వెళ్తారు 


మానస: నాకు అర్ధమైంది మా చెల్లి లేదు అనే కదా? ఏమి కాదు తను పెళ్ళికి అయినా వస్తుంది. కానీ హేమంత్ సార్ చేతుల మీదుగా ఇది జరగడం నీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో నాకు బాగా తెలుసు. 


సుభాష్: Thank you, Thank you very much


ఇద్దరు హేమంత్ సార్ దగ్గరికి వెళ్తారు, కానీ రింగ్స్ లేవు కదా అంటారు? 


అభిరామ్ సార్: మా దగ్గర ఉన్నాయ్ కదా!!


హేమంత్ (సుభాష్ స్నేహితుడు): మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు ఉన్నారు.  


అభిరామ్ సార్: నీ స్నేహితుడు నాకు బాగా నచ్చాడు సుభాష్, చాలా సరదాగా ఉన్నాడు.


అభిరామ్ సుభాష్ కి, హేమంత్ మానస కి రింగ్స్ ఇస్తారు, వాళ్ళు ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారు. 


చాలా సేపు ఆనందంగా గడుపుతారు అక్కడే, భోజనం కూడా చేస్తారు, మానస వండినా చేపల పులుసు హేమంత్ సార్ కి బాగా నచ్చింది, ఒక పట్టు పట్టాడు . 


హేమంత్ సార్: అవును హేమంత్ నువ్వు ఏమి చేస్తున్నావ్?


హేమంత్: ఇప్పటికి ఐతే ఒక software కంపెనీ లో చేస్తున్న, నాకు కూడా ఆర్మీ లోకి రావాలని ఉంది సార్ మిమ్మల్ని ఇలా చుసిన తరువాత 


హేమంత్: సుభాష్ అందర్నీ బాగానే inspire చేస్తున్నావ్!!


చాలా మంచింది ప్రయత్నించు. "కానీ కేవలం ఆశ పడితే సరిపోదు దానికి సరిపోయే సాధన, శ్రమ, passion ఉండాలి". 


మానస కి ఇవి ఎక్కడో విన్నట్టు అనిపించింది, సుభాష్ ఈ మాటలు మానస కి చెప్పాడు. అప్పుడే అర్ధం అవుతుంది మానస కి, అది అంతా చెప్పింది హేమంత్ సార్ అని, సుభాష్ సొంత మాటలు కావు అని, సుభాష్ నవ్వుతూ, కొంచెం సిగ్గుతో తల దించుకుంటాడు.


హేమంత్ సార్ : అందరూ ఆర్మీ కె వచ్చి దేశ సేవ చేయాల్సిన అవసరం లేదు . 


నేను చెప్పినట్టు చెయ్యి అదికూడా దేశ సేవ చేసినట్టే,


"మన దేశపు కంపెనీ వస్తువులు కొను చాలు, ఇంకో రకపు యుద్ధంలో మన దేశాన్ని మీరు గెలిపించినట్టే"


హేమంత్: అది ఎలా ?


అభిరామ్ సార్ : చాలా Simple అయ్యా, మన దేశపు కంపెనీ ఐతే వచ్చే లాభాలు అన్ని మళ్ళి ఇక్కడే పెడుతాడు, అదే బయట కంపెనీ వాడు అయితే పెట్టుబడి మనమీద పెట్టి , లాభం వాడి దేశం లో పెట్టుకుంటాడు . అప్పుడు దేశపు అభివృద్ధి ఎలా ముందకు వెళ్తుంది. 


"మన దేశపు సంపంద ఇంకొకరికి ఇంకా ఎన్ని రోజులు ఇస్తాం".?


హేమంత్ సార్ : మన దేశపు కంపెనీస్ ని ప్రోత్సహిస్తేనే కదా ఇంకోరు ముందడుగు వేసేది, 


"ఒకప్పుడు ఒక దేశం మీద గెలవాలి అంటే యుద్దం చేసేవారు, ఇప్పుడు ఆ దేశంతో బిజినెస్ చేస్తున్నారు. Business is equal to a WAR"


హేమంత్: చాలా బాగా చెప్పారు సార్, నేను నా వల్ల అయినా అంత మన దేశపు Products వాడుతా.


అభిరామ్ సార్: very good my boy.


చేతులు కడిగే దగ్గర సుభాష్, అభిరామ్ సార్ ని ఇలా అడుగుతాడు:


సుభాష్: హేమంత్ సార్ ని ఇలా ఎప్పుడు చూడలేదు, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు??


అభిరామ్: వాడు చాలా తక్కువ మందితో ఆలా ఉంటాడు, నీలో ఏదో తెలియని ఒక magic ఉందయ్యా, అందుకే నీ ఇంటి దాకా వచ్చాడు, ఇంత ఆనందంగా నీతో గడుపుతున్నాడు. 

Thank you very much my son, for giving such a wonderful time to us.


సుభాష్: లేదు సార్, మీలాంటి పెద్ద వాళ్ళు ఇక్కడికి రావడం, ఇది అంతా చేయడం. I am so Blessed.  


అప్పుడే హేమంత్ ఇద్దరిని పిలుస్తాడు 


హేమంత్: ఇంతకీ మేము ఎందుకు వచ్చామో చెప్పాలి, కొంచెం ఏకాంతంగా!!


సుభాష్: మానస, హేమంత్ ఒకసారి మీరు లోపలికి వెళ్ళండి.


హేమంత్ సార్: టెర్రరిస్ట్స్ ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్స్ ప్లాన్ చేసారు అని మనకి సమాచారం వచ్చింది, అందుకనే మేము ఇక్కడికి వచ్చాము, ఈ సమస్య తీరేవరకు మేము ఇక్కడే ఉంటాం.  


అభిరామ్ సార్: గాయం మానితే రేపు క్యాంపులో కలుద్దాం కెప్టెన్. 


 ఇద్దరు బయటకి వెళ్లి కారు లో కూర్చుంటారు . 


అభిరామ్ : రేపు క్యాంపు కి వస్తాడా, రాడా ?


హేమంత్ సార్: కచ్చితంగా వస్తాడు.


అభిరామ్ సార్: చూద్దాం !!!


మరుసటి రోజు అభిరామ్ సార్, హేమంత్ సార్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సుభాష్ వస్తాడు 


అభిరామ్ సార్: రావని అనుకున్న అయ్యా, వచ్చేసావ్ (కొంచెం నిరాశగా )


హేమంత్ సార్ కళ్ళతో అతను వచ్చిన సంతోషం కనబడుతుంది (& confidence)


ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కొంతసేపు, ఆ తరువాత అభిరామ్ సార్ ని ఎవరో పిలిస్తే లోపలికి వెళ్ళాడు. 


హేమంత్ సార్: సుభాష్ నీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి.  


చెప్పండి సార్ అని సుభాష్ అంటాడు. అంతలోపే అభిరామ్ సార్ వచ్చి..


 సిటీలో ఒకచోట బాంబ్ పెట్టినట్టు సమాచారం వచ్చింది అని చెప్తాడు 


హేమంత్: (చాలా Seriousగా): "సుభాష్ చివరిసారి, మనం బాంబ్స్ ని పేలనిచ్చాం, కానీ ఈసారి ఒక్క బాంబు కూడా పేలడానికి నేను ఒప్పుకోను"


సుభాష్: "ఒక్క బాంబు పేలదు, ఒక్క ప్రాణం పోదు సార్".


హేమంత్ సార్ టీంతో అక్కడికి వెళ్తారు. బాంబు ఉన్న లొకేషన్ ని గుర్తుపడుతారు. ఒక బాంబుని నిర్వీర్యం చేసేలోపు ఇంకోటి ఎక్కడ ఉందొ

కనిపెడుతారు, సుభాష్ మొదటి రెండిటిని నిర్వీర్యం చేసేస్తాడు, కానీ మూడోది ఉన్న చోటుకి వెళ్ళేటప్పుడు, టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది, అది ఒక ఆఫీసర్ వచ్చి హేమంత్ సార్ కి చెప్తాడు.


ఒక టీంని అక్కడ ఉంచి హేమంత్, సుభాష్ ఇద్దరు కలిసి "వికారాబాద్ అడవికి" వెళ్తారు. వాళ్ళు చేరుకోగానే ఫోన్ వస్తుంది మూడో బాంబుని కూడా నిర్వీర్యం చేసారు అని.  


సుభాష్, హేమంత్ సార్ ఇంకా కొంత మంది టెర్రరిస్ట్స్ ఉన్న అడవికి వెళ్తారు. 


అడవిలోకి వెళ్ళగానే అక్కడ ఒక ఇల్లు దూరంగా కనపడుతుంది, దానివైపుగా వెళ్లడం మొదలు పెట్టారు.


అంతలో ఒకడు చెట్టు వెనుక నుంచి కాల్చడం గమనించిన హేమంత్ వాడిని కాల్చుతాడు, కానీ వాడు కాల్చిన బులెట్ హేమంత్ వైపు రావడం గమనించి సుభాష్, హేమంత్ సార్ ని పక్కకి నెట్టేస్తాడు, ఎవరికీ ఏమి కాలేదు.  


ఆ తరువాత టీం వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ చేసింది. సుభాష్ backup request చేసాడు.


ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే హేమంత్ తనతో పాటు నిర్వీర్యం చేసిన బాంబ్స్ కూడా తీసుకువస్తాడు. అవి వాళ్ళ మీద విసురుతాడు. హేమంత్ గురి తప్పలేదు, దానివల్ల ముగ్గురు చనిపోయారు. 

హేమంత్ ఎప్పటి లాగానే చాలా ధీటుగా పోరాడుతున్నాడు, శత్రువుల మీద బుల్లెట్ల దాడి భీకరముగా చేస్తూనే ఉన్నాడు. 


చాలా సేపు Firing జరిగింది, లాభం లేదు అనుకున్న సుభాష్ లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే ఇద్దరిని చంపేస్తాడు. 

హేమంత్ సుభాష్ ని ఫాలో చేస్తూ వెనుకనే వెళ్ళాడు, అప్పుడే ఒకడు సుభాష్ ని షూట్ చేస్తుంటే, హేమంత్ సార్ దూకి కాపాడుతాడు. అది గమనించిన సుభాష్ వెంటనే వాడిని చంపేస్తాడు ఆ టెర్రరిస్టుని.


అప్పుడే ఒక టెర్రరిస్ట్ AK47తో కాల్పులు గట్టిగా చేయడం మొదలు పెట్టాడు, అవి తగిలి ఇద్దరు జవాన్లు చనిపోయారు. అది గమనించిన హేమంత్ సార్, సుభాష్ వాళ్ళ వైపు పరిగెత్తారు. వాళ్ళ ఇద్దరిని పక్కకి లాగారు, కానీ అప్పటికే వాళ్ళు ఇద్దరు చనిపోతారు. అది చూసి హేమంత్ ఆవేశం కట్టలు తెంచుకుంది. హేమంత్ కాల్చిన వాడి వైపు పరిగెత్తాడు, వాడి వైపు వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చిన ముగ్గురు టెర్రరిస్టులని చంపేశాడు. కానీ అంతలో అప్పుడే ఒకడు హేమంత్ సార్ గుండెల మీద కాలుస్తాడు, బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకపోవడం వల్ల గాయం చాలా గట్టిగ తగిలింది, సుభాష్ వెంటనే హేమంత్ sirని ఒక చెట్టు పక్కకి లాగి కుర్చోపెడుతాడు. 


అప్పుడు హేమంత్ సార్ సుభాష్ చేతిలో ఒక satellite ఫోన్ ఇస్తాడు.


 హేమంత్ సార్: ఈ నెంబర్ కి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, తన పేరు " సూర్య"


తనకి నీ పేరు చెప్పు చాలు, తన దగ్గర ఉన్న సమాచారం మనకి చాలా అవసరం.  తన దగ్గర ఉన్న ముఖ్యమైన విషయాలు మీడియాకి వెళ్తే అది మనకి మంచిది కాదు. ఎలాగైనా అన్ని సాక్ష్యాలు ప్రధాన మంత్రి కి చేర్చు, వాళ్ళని వదిలిపెట్టకు. దీన్ని నువ్వే జరగకుండా ఆపాలి.


కానీ సుభాష్ హేమంత్ సార్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తా అంటాడు.


హేమంత్: నేను బతకను అని నాకు తెలుసు, నీకు తెలుసు . . 


హేమంత్ అక్కడే చనిపోతాడు ........ 
అప్పటి దాకా అతనిలో ఎవరు చూడనటువంటి ఒక ఉగ్రరూపం వాళ్ళకి చూపించాడు సుభాష్ , సుభాష్ ఆ కోపంతో అక్కడ ఉన్నవారిని అందరిని చంపేస్తాడు. 
ఎవరు ఆపినా ఆగకుండా హేమంత్ సార్ శరీరాన్ని సుభాష్ మోసుకుంటూ అంబులెన్సు దాకా తీసుకువస్తునాడు, కళ్ళలో నుంచి కన్నీరు ఆగలేదు!తరువాత హేమంత్ సార్ భౌతికకాయాన్ని postmortem నిమిత్తం హాస్పిటల్ కి తరలిస్తారు, అతనితో పాటు ఇతర జవాన్ల భౌతికకాయాలని కూడా తరలిస్తారు.సైన్యం సందర్శనం కోసం ఆరోజు Army Camp దగ్గర పెడుతారు.హేమంత్ సార్ ని చూడగానే సుభాష్ కి అతను ఒకసారి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. 


హేమంత్ సార్ : మనం మరణించిన తరువాత మన మీద మన జాతీయ పతాకం ఎందుకు ఉంచుతారో తెలుసా?


"మనం మరణించిన తరువాత మన ఆత్మ, మనలో ఉన్న దేశభక్తి ఆ జెండాలో కలుస్తుంది అని, 


అందుకే ఆ జెండా ఎప్పుడు అంత గర్వంగా ఎగురుతూ ఉంటుంది".


స్వేచ్ఛగా ఎగిరే ఆ జెండా లోపల కొన్ని లక్షల మంది సైనికుల దేశభక్తి, ఆత్మగౌరవం ఉంటాయి".


అది గుర్తుచేసుకున్న సుభాష్ పక్కనే ఉన్న జాతీయ జెండా దగ్గరికి వెళ్తాడు, అది చాలా గర్వంగా ఎగురుతుంది.. దాన్ని చూడగానే అందులో హేమంత్ సార్ కనపడి నవ్వుతు ఉంటాడు. 


ఇంతకన్నా ఒక సైనికుడికి ఇంకా ఏమికావాలి సుభాష్ (సుభాష్ కి ఆలా వినిపిస్తాడు). 


అది చూసి ఆ జెండా కి సుభాష్ సెల్యూట్ చేస్తాడు, వెనుకకి తిరిగి చూస్తే అతనితో పాటు హేమంత్ సార్ టీం కూడా salute చేస్తారు.


అభిరామ్ సార్ కూడా ఉంటారు. హేమంత్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. అభిరామ్ సార్ తో పాటు అతని కూతురు కూడా వస్తుంది. 


అభిరామ్: హేమంత్ లాంటి ఆఫీసర్ చనిపోవడం ఎప్పటికి జీర్ణించుకోలేని సంఘటన, అలాంటి వాడు మళ్ళి మనకి (చాలా బరువైన గుండెతో). సుభాష్: "దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం మాత్రమే తెలిసింది ఒక్క సైనికుడికి మాత్రమే,


హేమంత్ సార్ కి మాత్రం ఇవ్వడం, కాపాడడం రెండు తెలుసు. సార్ స్థానంలో నేను ఉన్న బాగుండు" !!


అభిరామ్ కూతురు: ఉండనివ్వడు, అదే హేమంత్. తన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాడు, కానీ తన కోసం ఎవరైనా ఆలా చేస్తాను అంటే మాత్రం ఒప్పుకోడు... నీ గురించి చాలా చెప్పాడు. 


చాలా కాలం తరువాత తనని నేను కలిసాను, అప్పుడు నీ గురించే చెప్పాడు. సుభాష్ కొంత ఆశ్చర్యానికి గురి అవుతాడు.


ఎవరు ఈమె అని? హేమంత్ sir ఎందుకు నా గురించి అంతగా ఆమెకు చెప్పాడు అని!!అప్పుడే అభిరామ్ సార్ 


అభిరామ్: ఈమె నా కూతురు, ఇంకా చెప్పాలి అంటే హేమంత్ సార్ ని ఎంతగానో ప్రేమించిన అమ్మాయి.


కానీ ఆర్మీ కోసం తనని పెళ్లి చేసుకోలేదు, తనకి చాలా దూరంగా ఉన్నాడు, చివరగా నీ గురించే తను మాట్లాడాడు నా కూతురితో


సుభాష్ కళ్ళు ఇంకా ఎరుపు ఎక్కాయి. ఆమెను చూస్తూ లోపల చాలా బాధపడ్డాడు.


అది చూసిన అభిరామ్ సార్ కూతురు, అక్కడ నుంచి సుభాష్ ని తీసుకొని వెళ్తుంది.


అభిరామ్ మాత్రం అదే జెండాని అలానే చూస్తూ ఉండిపోతాడు, అప్పటికే కొంచెం చీకటి పడిపోతుంది.


అక్కడ జరిగేది అంతా జయరామ్ చూస్తూ ఉంటాడు, కానీ దగ్గరికి వెళ్లలేకపోయాడు, అక్కడ నుంచే హేమంత్ సార్ కి సెల్యూట్ చేస్తాడు.


హేమంత్ దహన కార్యక్రమాలు సుభాష్ చేస్తాడు. అభిరామ్ సార్ కోరిక మీద.

అందుకే ఒకసారి నిన్ను చూసి వెళ్లుదాం అని వచ్చా. 

మరుసటి రోజు సుభాష్ ఇంట్లో ఉండగా:


అభిరామ్ సార్ సుభాష్ తో మాట్లాడి వెళ్లుదాం అని వస్తాడు.


అభిరామ్ సార్: వాడు చివరగా చాలా సంతోషంగా గడిపింది ఇక్కడే, నీతోనే.


అది విన్న అందరికి కళ్ళలో నుంచి నీరు ఆగలేదు. 


వాళ్ళు వెళ్లిపోయిన కొంతసేపటి తరువాత 


ఆర్మీ డాక్టర్, ఎవరైతే హేమంత్ సార్ పోస్టుమార్టుమ్ చేసాడో అతను వస్తాడు . అతను హేమంత్ సార్ శిష్యుడు, సుభాష్ కి batch mate. 


సుభాష్: నువ్వు ఏంటిరా ఇక్కడ ?


సౌరవ్: (batch mate): నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి . 


హేమంత్ సార్, మిగతా వారి పోస్టుమార్టుమ్ చేశా, అక్కడ పడీ ఉన్న బుల్లెట్స్ అన్ని చూసా, అంత బాగానే ఉంది.. కానీ. 


సుభాష్: మరి ఏంటి ( కొంచెం కోపంగా)సౌరవ్: సార్ శేరీరంలో దొరికిన బుల్లెట్, మిగితా వారి శరీరంలో ఉన్న బుల్లెట్స్ కి, అక్కడ దొరికిన బుల్లెట్స్ కి పొంతన లేదు.  


అది ఒక sniper షాట్. 


సుభాష్: దూరంగా ఉండి ఒక టెర్రరిస్ట్ వాడి ఉండవచ్చు కదా. 


సౌరవ్: ఇది చాలా advanced weapon. కచ్చితంగా ఇంకా ఎవరో దీని వెనుక ఉన్నారు. 


సుభాష్: అంటే సార్ ని ఎవరో కావాలనే చంపారు, టెర్రరిస్టులు కాదు. 


సౌరవ్: నువ్వు కొంచెం జాగ్రత్త రా.. 


సౌరవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


హేమంత్: (సుభాష్ స్నేహితుడు): నాకు ఎందుకో ఆ బులెట్ ప్రూఫ్ జాకెట్ వెనుక ఏదో పెద్ద network ఉంది అనిపిస్తుంది. 


హేమంత్ చెప్పేది నిజమే అనిపిస్తుంది సుభాష్ కి కూడా.


సుభాష్: కానీ ఎవరు, ఆ బుల్లెట్ ఎవరిది ? దాని వల్ల లాభం ఎవరికీ ?దీని వెనుక ఎవరు ఉన్నారు ?


 అప్పుడే గుర్తుతెచ్చుకుంటాడు, సార్ ఏదో చెప్పాలి అని ప్రయత్నించాడు అని campలో .


కచ్చితంగా లోపలి వాడి సహాయం లేకుండా ఇంతలా చేయడం కష్టం!!


1. ఈ బుల్లెట్ ఎవరిదో తెలుసుకోవాలి 2. ముందు హేమంత్ సార్ గురించి ఎవరు చెప్పారో తెలుసుకోవాలి. 3. దీని వెనుక అసలు ఎవరు ఉన్నారు?


సుభాష్: ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది అని చెప్పాడు సార్, ఆ అమ్మాయే సమాచారం ఇచ్చిందా ? లేకపోతే సార్ దగ్గర ఉన్న సమాచారంతో తన సహాయం అడిగాడా ? అసలు ఎవరు ఈ అమ్మాయి ?


సుభాష్ అభిరామ్ కి కాల్ చేస్తాడు 


సుభాష్: హేమంత్ సార్ ని కావాలనే చంపేసారు అని తనకి తెలిసిన విషయం అంతా సార్ కి చెప్తాడు.  


అది విన్న అభిరామ్ సార్ కోపంతో ఊగిపోతారు.


అభిరామ్ : "ఎప్పుడు ఆర్మీ నా కుటుంబం అనే వాడు, వాడిని నేను సొంత కొడుకు అని అనుకున్న, వాడు నిన్ను సొంత తమ్ముడు అనుకున్నాడు అలాంటీ వాడినే చంపేసారు, వాడి చావు వెనుక ఉన్న ఏ ఒక్కడు బతకడానికి వీలు లేదు సుభాష్"


సుభాష్: నా మాట సార్, " మనం పీల్చే గాలి వాళ్ళు పిల్చినంత వరకు నేను బతికి ఉన్నట్టే కాదు సార్"అంతలో హేమంత్ సార్ ఇచ్చిన ఫోన్ కి Callవస్తుంది ... 


సూర్య కాల్ చేస్తుంది.!!!


Lot More Coming...


Motto:


ఒకప్పుడు ఒక దేశం మీద గెలవాలి అంటే యుద్దం చేసేవారు, ఇప్పుడు ఆ దేశంతో బిజినెస్ చేస్తున్నారు. Business is equal to a WAR""When you stand strong on this land and proudly salutes to our National flag...it Always remembers you who we are, what we are, where we stand."


Rate this content
Log in

Similar telugu story from Action