Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kishorekumar Arige

Drama

4.3  

kishorekumar Arige

Drama

నెవెర్ జడ్జ్ ఏ Women_2

నెవెర్ జడ్జ్ ఏ Women_2

15 mins
601


"ఈ భాగం చదివే ముందు క్రింద తెలిపిన మొదటి భాగం తప్పక చదవండి . ఇది పార్ట్_2


part 1 : https://storymirror.com/read/story/telugu/585jk172/aaddvaarini-veeletti-cuupddu/detail


సుభాష్ అక్కడ నుంచి మానసని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు.  సుభాష్ మరియు మానస ఒకే దగ్గర ఉంటున్నారు .


ఇద్దరు చాలా అనందంగా ఉంటున్నారు కొన్ని రోజులు ఆలా గడిచిపోయాయి . 


ఒక రోజు సుభాష్ మానస ఇద్దరు మాట్లాడుకుంటారు సరదాగా 


సుభాష్: నువ్వు ఎంత వరుకు చదువుకున్నావు ?


 మానస : డిగ్రీ కంప్లీట్ చేశా, అది కూడా చెల్లి కోసం. తనకి చదువు అంటే చాలా ఇష్టం. 


ప్రస్తుతం తను ముంబైలో ఉంటుంది. తనని కొన్ని సంవత్సరాల క్రిందనే "ముంబై" పంపించేసా. కానీ తనకి నేను ఈ పని చేయడం అసలు ఇష్టం లేదు, అన్ని వదిలేసి తనతో వచ్చేయ్ అని చాలా సార్లు అడిగింది . కానీ ఆలా వెళ్లడం అంతా సులభం కాదు అని తనకి తెలియదు. 


అప్పటినుంచి నాతో పెద్దగా మాట్లాడదు, అక్కడే ఒక న్యూస్ పేపర్ లో పని చేస్తూ ఉంటుంది .


ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది. మనం ఫోన్ చేయలేము తనకి, ఎందుకంటే తనకి అవసరమైతేనే ఫోన్ ON చేస్తుంది.


ఇది అంత విన్న సుభాష్ తను ఎందుకో, ఎవరికో భయపడుతుంది అని గమనిస్తాడు, కానీ బయటకి మాత్రం తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. 


సుభాష్: "నువ్వు ఇప్పుడు, ఇంకెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీ వెనుక నేను ఉన్నాను. మీ చెల్లి నిన్ను కచ్చితంగా అర్ధం చేసుకుంటుంది, నిన్ను చూసి సంతోషిస్తుంది. ఇది నా మాట"


నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటున్నావా ? ఉద్యోగం లాంటివి ?


మానస: నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆర్మీ లోకి రావాలి ఉంది . 


సుభాష్: Good. నిజంగా నీకు దేశానికి సేవా చేయాలి అని ఉంటె నిన్ను నేను తయారు చేస్తా, ఒక సైనికురాలులా .

 

"కానీ కేవలం ఆశ పడితే సరిపోదు దానికి సరిపోయే సాధన, శ్రమ , passion ఉండాలి".


మానస: కానీ నేను ఆర్మీ లోకి రావచ్చా? 


సుభాష్: "అది Indian Army. దేశం లోపల ఎలా ఉందొ ఆలా మాత్రం అక్కడ ఉండదు.

నువ్వు ఎవరు? ఏమిటి అనేది అక్కడ అనవసరం. ఈ దేశం కోసం నువ్వు ఏమి చేయగలవు అనేది మాత్రమే అక్కడ ముఖ్యం".


దేశం లో ఉన్న కుట్రలు కుతంత్రాలు, వర్గాలు, మతాలు, కులాలు ఏమి అక్కడ ఉండవు.


ఆ త్రివర్ణ పతాకం ముందూ అందరూ సమానమే, ప్రతి సైనికుడు సమాధానం చెప్పాలిసింది ఎగిరే  ఆ జెండాకే" .  


మానస: నువ్వు వెనుక ఉంటె ఏమైనా చేయగలను అనిపిస్తుంది . 


సుభాష్: నీకో విషయం చెప్తా బాగా గుర్తుపెట్టుకో . ఒక అబ్బాయి నిజంగా ఎప్పుడు గెలుస్తాడంటే, 


 "ఒక అమ్మాయిని కష్టం రాకుండా పక్కనే ఉండి చూసుకున్నప్పుడు కాదు. 

ఎటువంటి కష్టం వచ్చిన ఎదురించి నిలబడేలా తనని సిద్ధం చేసినప్పుడు, ఆపద సమయంలో ఎవరి సహాయం కోసం చూడకుండా తనంతట తానే ఆ సమస్యని పరిష్కరించేలా తనని తీర్చిదిద్దినప్పుడు, అప్పుడే వాడు నిజమైన మొగాడు"


మానస: నాకు అర్థమైంది, నువ్వు ఎలా ఐతే అనుకుంటున్నావో అలాగే నేను ఉంటా.


అప్పుడే హేమంత్ వస్తాడు. .


హేమంత్: ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా ఏదో Discuss చేస్తున్నారు 


మానస: ఏమి లేదు, సాయంత్రం సినిమా కి వెళుదామా ?


హేమంత్: నేను రెడీ 


సుభాష్: సరే వెళ్లుదాం .. 


మానస అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏదైనా చేద్దాం అని తినడానికి 


తను వెళ్లడం చూసి హేమంత్ మాట్లాడుతాడు ఇలా 


సుభాష్: తను ఏదో విషయం గురించి చాలా ఇబ్బంది పడుతుంది మన దగ్గర ఏదో దాస్తోంది. తన చిన్నప్పటి వివరాలు, తన మిగతా విషయాలు అన్ని నాకు తెలియాలి ఈ విషయం తనకి తెలియకూడదు 


3 రోజుల తరువాత : సుభాష్ మరియు హేమంత్ మధ్య సంభాషణ 


హేమంత్ : మానస వాళ్ళ నాన్న ఒక sincere పోలీస్ ఆఫీసర్. ఒక కేసు విషయంలో అప్పటి లోకల్ దాదా అయినా "నరసింగ్ యాదవ్" ని అరెస్ట్ చేసాడు, రోడ్ మీద ఈడ్చుకొని వెళ్ళాడు, ఆ కేసు లో బలమైన సాక్ష్యాలు కూడా సంపాదించాడు మానస వాళ్ళ నాన్న. అది తెలుసుకున్న నరసింగ్ మానస వల్ల నాన్నని వాళ్ళ ఇంటోలోనే దారుణంగా చంపేశాడు . 


అయినా అతని మీద పగ తీరని వాడు, అక్కడే ఉన్న మానసని దారుణంగా రేప్ చేసాడు. 


బయట చెప్పిన, ఊరు వదిలి వెళ్లిపోయిన, నిన్ను వదిలిన నీ చెల్లని చంపేస్తా అని బెదిరించాడు. అమ్మ,నాన్న లేరు, వెనుక ఎవరు లేరు.

తప్పక అప్పటి నుంచి వాడు చెప్పినట్టే చేస్తుంది. 


అప్పటినుంచి నరసింగ్ తన పని కోసం అతని clients దగ్గరికి తనని ఎరాల, Giftలా పంపుతూ ఉన్నాడు, వాడు చెప్పిన పని చేయడమే తన పని. 


ఒకరోజు తెగించి ఊరు వదిలి పారిపోదాం అని చూసారు కానీ దొరికి పోయారు. ఇంకో సారి పారిపోతే నీ చెల్లిని కూడా ఇందులోకి లాగుతా అని చెప్పేసరికి తను చేసేదేమి లేక అలానే ఉండిపోయింది 


కానీ చెల్లని మాత్రం అనాధ ఆశ్రమంలో Join చేసింది. అక్కడ ఉంటె తనకు ప్రమాదం అని అప్పుడప్పుడు వెళ్లి చూసేది . 


ఒకరోజు బయట నరసింగ్ మానస చెల్లిని చూసి తప్పుగా మాట్లాడాడు, జాగ్రత్తపడ్డ మానస తనని మాత్రం అక్కడ నుంచి దూరంగా పంపించేసింది 


నర్సింగ్ కి కూడా మానసనే ముఖ్యం, తన చెల్ల కాదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు మౌనిక గురించి 


సుభాష్: మరి ఇది అంతా ముందే ఎందుకు కనుక్కోలేదు నువ్వు.


హేమంత్: అప్పుడు నేను అక్కడ ఉన్న వారిని మాత్రమే కనుక్కున్న, కానీ అసలు నిజం మనల్ని వెతుక్కొని దానంతట అదే వస్తుంది అని అనుకోలేదు, 


అక్కడ మౌనికకి కావాల్సినవి చూసుకున్నది, అక్కడ మంచి Seat ఇప్పించింది ఎవరో తెలుసా?


సుభాష్: ఎవరు?


హేమంత్: ఆ రౌడీ. ఇప్పటి ఎమ్మెల్యే యొక్క "పీఏ . జనార్దన్"


అతను మానస వాళ్ళ నాన్న వాళ్ళ మంచి జరిగిన వాళ్లలో ఒకడు, అందుకే ఆ ఎమ్మెల్యేకి తేలవకుండా వీళ్ళకి చాలా సహాయం చేస్తున్నాడు. కానీ అతణ్ణి మాత్రం ఎదురించలేడు 


సుభాష్: ఎందుకు 


హేమంత్: భయం, పెళ్ళాం ,పిల్లలు ఉన్నారు అతనికి కూడా. అదే గతి అతని పిల్లలకి కూడా పడుతుంది అని అతని భయం, కానీ కావాలంటే సహాయం చేస్తా అన్నాడు.


సుభాష్: సరే నేను చూసుకుంటా వాడి సంగతి. బతకడం ఏంత బాధకరమో వాడికి నేను చూపిస్తా


 ఇప్పటికే వాడు తన గురించి వెతకడం మొదలు పెట్టి ఉండవచ్చు, ఎలాగో మానస చెల్లి వాడికి దొరకడంచాలా కష్టం, జనార్దన్ కి కొంచెం టచ్ లో ఉండు. ఒకవేళ వాడికి తన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి చెప్పమను 


హేమంత్: ముందే చెప్పా, అలాంటి వాడిని ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. 

 

సుభాష్: సరే మానస వస్తుంది నేను చూసుకుంటా, నువ్వు వెళ్లి రెడీకా. సినిమా వెళ్లుదాం . 


కొన్ని రోజుల తర్వాత:


 మానస , సుభాష్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో కలిసి భోజనం చేస్తున్నారు 


అప్పుడే ఒకడు దూరంనుంచి షూట్ చేస్తాడు subashనీ కానీ మిస్ అవుతుంది ఎవరికీ తగలదు . కొంతమంది ముఖానికి గంతలు కట్టుకొని లోపలికి వచ్చి చంపడానికి ప్రయత్నయిస్తారు, కానీ సుభాష్  అడ్డుకుంటాడు . వారు Shoot చేయడం మాత్రం ఆపటం లేదు. సుభాష్ అందులో ఒకడి నుండి గన్ తీసుకొని ఒకడి నుదిటి మీద షూట్ చేశాడు.


 వాడు అక్కడే చచ్చిపోతాడు, ఇంకొకడు సుభాష్ భుజం మీద కాలుస్తాడు, అయినా సరే వాళ్ళ మీద షూటింగ్ చేయడం ఆపలేదు సుభాష్. కొంతమంది మానస మీద షూట్ చేసారు కానీ సుభాష్ కాపాడాడు.


చివరికి police siren విని పారిపోతూఉంటే సుభాష్ ఒకడి కాలు మీద కూడా కాల్చుతాడు . 


ఫేస్ కవర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరో గుర్తు పట్టలేకపోయారు . 


 తరువాతి రోజు హాస్పిటల్లో :


సుభాష్ కి ఏమవుతుందో అని చాలా భయపడ్డ మానస డాక్టర్ తో కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.  సుభాష్ పడుకొని ఉంటాడు అప్పుడు మానస మాట్లాడుతూ ఉంటుంది. 


ఏడుస్తూ


మానస: "నువ్వు నా జీవితంలోకి వచ్చినా తరువాతే నాకు జీవితం మీద మళ్ళి ఆశలు వచ్చాయి . మళ్ళి జీవించడం మొదలుపెట్టా"


ఈ సమయంలో నీకు ఈలా అవుతుంది అనుకోలేదు , 


"నువ్వు నా పక్కనే ఉంటె మా నాన్న ఒకప్పుడు నా పక్కనే ఉన్నంత అండగా, ధైర్యంగా ఉంది"


అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తాడు, డాక్టర్ తో పాటు హేమంత్ కూడా వస్తాడు. 


డాక్టర్ : ఇతని ఏమి కాలేదు, ఇప్పుడూ బాగానే ఉన్నాడు . 


అప్పుడే సుభాష్ లేచి నవ్వుతాడు, మానస సుభాష్ చేతిని కొడుతూ నవ్వుతుంది ( కనీళ్ళు , సంతోషం రెండు ఉంటాయి ఆ సమయంలో తన కళ్ళల్లో )


అప్పుడే డాక్టర్ 


డాక్టర్: బుల్లెట్ తీసేసాం, కానీ బుల్లెట్ ఇంతకుముందు తగిలిన గాయం మీదనే తగలడం వల్ల చాలా రక్తం పోయింది . 


మానస: ఇంతకముందు తగిలిన గాయం ఏంటి డాక్టర్ ?


డాక్టర్ : చాలా బలమైన గాయం లాగా ఉంది మీకు తెలియదా ?


హేమంత్: మాకు ఏమి తెలియదు సార్ 


సుభాష్: చిన్న గాయమే సార్, Discharge ఎప్పుడు చేస్తున్నారు?


డాక్టర్: డాక్టర్ నువ్వా నేనా? ఇంకో రెండు రోజులు ఉండాలి ఇక్కడే 


సుభాష్: ఈ డాక్టర్లు అంత ఇంతే ఉంటారా ? మా మాటా వినరా ?


డాక్టర్: జోక్ చేసా, సాయంత్రం మీరు వెళ్లిపోవచ్చు 


డాక్టర్ వెళ్ళిపోతాడు 


హేమంత్: గాయం ఏంటిరా, ఎక్కడ తగిలింది, అంతా పెద్ద దెబ్బ తగిలినా చెప్పలేదు నాకు, అంటే ఏదో దాస్తున్నావు రా నువ్వు మా దగ్గర.


మానస: ఇది అంత నా వల్లే జరిగింది, కచ్చితంగా ఇది ఆ ఎమ్మెల్యే చేపించి ఉంటాడు.


అప్పుడు ఎమ్మెల్యే గురించి చెప్తుంది మానస, వాడి వల్ల మానస వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో !!!


సుభాష్: నాకు అంతా తెలుసు నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు!!!


నువ్వు నా దగ్గర ఉన్నావు అని ఇంకా వాడికి తెలియదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, లేదా ఇంతకు ముందు మేము చంపినా వారు

ఎవరైనా అయి ఉండవచ్చు, అయినా అది నేను చూసుకుంటా, మీరు కంగారు పడకండి. 


హేమంత్: ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామా ?


మానస: సరే వెళదాం 


ఆర్మీకి కూడా inform చేస్తారు leave కోసం. leave extend చేస్తారు 


హేమంత్, సుభాష్ మాట్లాడుకుంటారు in home :


 సుభాష్: వచ్చిన వాళ్ళు కచ్చితంగా ఎమ్మెల్యే మనుషులు కాదు అని తెలుసు 


అందరూ చాలా professionals లాగా ఉన్నారు, Guns కూడా చాలా హైటెక్నాలాజీవి. వాళ్ళ కాళ్ళ కదలికలు కూడా చాలా professionals లాగా ఉన్నాయ్. కాబ్బటి వాళ్ళు కచ్చితంగా ఇక్కడి వారు కాదు. 


హేమంత్: వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఇంకోసారి నేను లేకుండా నువ్వు బయటకి వెళ్ళేది లేదు అది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో 


సుభాష్ నవ్వుతాడు 


హేమంత్: లోకల్ పోలీస్ ఫోన్ చేసాడు, అక్కడ శవం ఏమి దొరకలేదు అంట & దెబ్బలు తగిలి వారు కూడా ఎవరు జాయిన్ కాలేదు అంటా హాస్పిటల్లో!!


సుభాష్: నాకు తెలిసి ఎమ్మెల్యే మన జోలికి రాడు  


హేమంత్: వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే ఐతే మన దగ్గరికి కూడా రాడు 


సుభాష్ కను బొమ్మలు పైకి ఎగిరేస్తూ. 


సుభాష్: ఏంచేసావ్ ? అది నాకు తెలియకుండా ?


హేమంత్: ఇన్ని స0వత్సరాల నుండి నీతో ఉన్న, నేను కూడా కొంచెం నేర్చుకున్న . 


ఎమ్మెల్యే వీడియో ఒకటి మనకి దొరికింది జనార్దన్ సహాయంతో, రెండు రోజుల క్రితం ఒక అమ్మాయితో ఉన్నాడు బెడ్ రూంలో ఆ వీడియో మన దగ్గర ఉంది 


వాడికి ఫోన్ చేసి మాట్లాడా, ఇంకోసారి వాడు మన జోలికి రాడు,లేదు అంటే మీడియాకి leak చేయచ్చు 


సుభాష్: ఇంకోసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు, ముందు నువ్వు నాకు చెప్పు !!


నాకు జనార్దన్ ఫోన్ నెంబర్ కావాలి. ఇప్పటికి ఐతే వాడిని వదిలి వేద్దాం .  


హేమంత్: అంటే వాడిని ఏమి చెయ్యద్దా ?


సుభాష్: కేవలం ఇప్పటికి మాత్రమే. ఇంత చేసిన వాడిని అంతా సులబంగా ఎలా వదిలేస్తాం ?


హేమంత్: మానస తన చెల్లీ ఫోన్ కి చాలా రోజుల నుంచి Try చేస్తుంది కానీ కలవటం లేదు అంటా .


మానస ని పిలుస్తాడు సుభాష్ 


సుభాష్: తను ఒక క్రైమ్ రిపోర్ట్ కోసం చాలా కష్టపడుతుంది అంటా, నేను వాళ్ళ ఎడిటర్ కి కాల్ చేశా. కొన్ని రోజులు time పడుతుంది అంటా, తను బాగానే ఉంది.


అప్పుడు మానస చాలా సంతోష పడుతుంది 


మానస: ఒకసారి ఫోన్ చేసి చెప్తే ఏమవుతుంది తనకి 


సుభాష్: నీకు బాగా తెలుసు తను పనిలో ఉంటె ఫోన్ వాడదు అని 


మానస: అవును. కానీ మనం ఇంత కంగారులో ఉన్నాం కదా. అందుకే ఏమి ఆలోచించలేకపోతున్న . 


మీకు పాలు తీసుకొని వస్తా అని తను వెళ్ళిపోతుంది 


హేమంత్: నిజంగా తను Safe గానే ఉందా ?


సుభాష్: తను ఎక్కడ ఉందొ వాళ్ళకి కూడా తెలియదు అంటా, ఏదో ఒక మిషన్ మీద పనిచేస్తుంది, ఒక మిషన్ లో ఉంటె తను ఎవరికీ దొరకదు. నాకు తెలిసి తన గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తాను చూసుకో గలదు 


అసలు ఎమ్మెల్యే ఎటాక్ చేయకపోతే మానస చెల్లి గురించి కంగారు ఎందుకు పడాలి మనం ఇప్పుడు?


హేమంత్: అది కూడా లాజికె.


సుభాష్: ఎమ్మెల్యేనే ఎటాక్ చేసాడు అని తను నమ్ముతుంది, అది అలానే ఉండనివ్వు అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలిసే వరకు అలాగే అనుకోని మానసని కొన్నిరోజులు, అదే అందరికి మంచిది, తన చెల్లా కూడా Safeగానే ఉండచ్చు. తెలియదు అని చెప్తే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది అని భయపడుతుంది.


అప్పుడే మానస వచ్చి అడుగుతుంది: ఇంతకీ నీకు తగిలిన దెబ్బ, ఎలా తగిలింది


హేమంత్ : మర్చిపోయాం అనుకున్నావా ? ఏమి జరిగిందో చెప్పు? 


సుభాష్ అప్పుడే అక్కడ ఉన్న ఒక photo album తీస్తాడు, అందులో చాలా తక్కువ ఫొటోస్, చాలా దగ్గరి వాళ్ళవి మాత్రమే ఉంటాయి.


సుభాష్: "కొన్ని గాయాలు శరీరానికి చాలా బాధని ఇస్తాయి , కానీ మరికొన్ని గాయాలు కొంతమంది జ్ఞాపకాలుగా అలానే  గుర్తుండిపోతాయి", అలాంటి గాయమే ఇదీ 


మానస, హేమంత్ చాలా Interestingగా వింటారు . 


సుభాష్: నీ రోల్ మోడల్ ఎవరు రా ?


హేమంత్: పవన్ కళ్యాణ్ & మహేష్ బాబు 


మానస: కిరణ్ బేడీ 


సుభాష్: "మనకి ఎంతో మంది రోల్ మోడల్స్ ఉన్న, ఒక సైనికుడికి మాత్రం దేశం కోసం పోరాడే మరో సైనికుడే రోల్ మోడల్" . 


అలాంటి ఒక వ్యక్తి "మేజర్ హేమంత్ సార్"


మేజర్ k.హేమంత్. మా Combat Trainer, & bomb defuse team head.


Armyలో ఒక medal కూడా గెలవలేదు. ఎందుకంటే చాలా కోపం అని అంటారు చాలామంది, కానీ ఆ కోపం వెనుక ఉన్న దేశ భక్తి మాత్రం ఎవరు చూడలేకపోయారు, ముక్కుసూటి మనిషి, రూల్స్ పెద్దగా పట్టించుకోడు, అతనికి ఏది సరైనది అనిపిస్తే అదే నమ్మేవాడు, అదే చేసేవాడు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో అతనిమీద Complaints వచ్చేవి. 


ఆర్మీ కి అతను చేసిన సేవల వల్లే చాలా మంది అతనికి గౌరవం ఇస్తారు. ఎప్పుడు మెడల్స్ కోసం అయన పని చేయలేదు, ఆర్మీ అంటే ఇష్టంతోనే పని చేసారు. 


"కొంతమంది అతని క్రింద ఎప్పటికి పని చేయకూడదు అనుకుంటారు. కొంతమంది పని చేస్తే అలాంటి వారి క్రిందనే పనిచేయాలని అనుకుంటారు". 


అందరూ అనుకునే లాగానే Training చాలా కష్టంగా ఉండేది. హేమంత్ సార్ అనగానే అందరూ చాలా భయపడేవారు. కానీ నాకు మాత్రం ఎప్పుడు ఆలా అనిపించలేదు. 


సార్ మాటల వల్ల మాలోకి ఏదో నమ్మకం, మొండితనం, ధైర్యం మాలోకి వచ్చేసేది. 


మమ్మల్ని చాలా బాగా Train చేసారు . నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చాలా Activeగా ఉండేవాడిని, ట్రైనింగ్ లో ఒకరోజు మాకు పోటీ పెట్టారు, అందులో ఒకరు పడిపోయారు, కానీ అందరూ విజయం కోసం పరిగెత్తారు,

కానీ నేను మాత్రం ఆగి అతనికి సహాయం చేశాను. అక్కడ నుంచి సార్ కి నేను అంటే కొంత ఇష్టం ఏర్పడింది  పక్కవాడికి హెల్ప్ చేయడం  సార్ కి బాగా నచ్చింది. కానీ ఎప్పుడు చెప్పలేదు నాతో.  


ఒకరోజు trainingలో మాతో ఇలా మాట్లాడారు:


హేమంత్ : మీరు ఆర్మీ కి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, మీ ఇంట్లో పరిస్థుతుల కారణంగా వచ్చారో? దేశం అంటే భక్తి మీద వచ్చారో నాకు తెలియదు?


" నాకు మాత్రం ఆర్మీ అంటే నా కుటుంబం, ఎవరు ఏ తప్పు చేసిన సరిద్దిదే బాధ్యత నా మీద ఉంది "


ఒక విషయం చెప్పండి మనకి, మాములు పౌరుడికి తేడా ఏమిటి ?

సైనికుడు 1: దేశం కోసం మనం యుద్ధం చేస్తాం సార్ & మనం అందరిని కాపాడుతాం సార్ .


హేమంత్: "ప్రతి వ్యక్తి యుద్ధం చేస్తాడు , ఉద్యోగం కోసం ఒకరు, ప్రేమ కోసం ఒకరు, న్యాయం కోసం మరొకరు . హక్కుల కోసం మరొకరు" 


మనకి వాళ్లకి తేడా ఏమిటి?


సుభాష్: కానీ ఒక సైనికుడు మాత్రమే దేశం కోసం ప్రాణం ఇవ్వవల్సివస్తుంది, అని తెలిసి కూడా సైన్యం లోకి వస్తాడు.


హేమంత్: గుడ్. సైనికుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వారిలో ముందు వరసలో ఉంటాడు. ఇంకా? 


"సరిహద్దులో శత్రువుని గెలవడంలోనే కాదు, దేశం లోపల ఆపద సమయంలో ముందు ఉండేవాడు ఒక్క సైనికుడు మాత్రమే


నిజమైన సైనికుడు ఎవరు మీ దృష్టిలో? 


సుభాష్: "దేశాన్ని కాపాడాలి అనుకునే ప్రతి సైనికుడిని కాపాడటమే ఒక సైనికుడి ముఖ్య బాధ్యత ", వాడు నా దృష్టిలో నిజమైన సైనికుడు.


హేమంత్: Good సుభాష్ . Remember one thing, " దేశాన్ని కాపాడాలి అనుకొనే ప్రతి ఒక్కరు ఒక సైనికుడే, & వాడే నిజమైన సైనికుడు" . 



Remember one more thing:


who is your best friend in army: Your Weapon,

what is your strength: training, brain, Self confidence & 

who is your first enemy: Your fear


ఒకరోజు మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మా క్యాంపుకి దగ్గరలో ఒక ఎటాక్ జరిగింది, టెర్రరిస్టులు అందరూ పక్కనే ఉన్న అడవిలో ఉన్నారు అని

తెలిసింది.

అప్పుడు హేమంత్ సార్ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్లారు, మాలో చాలా మంది భయపడ్డారు, కానీ సార్ కి బాగా తెలుసు దానివల్ల మాలోఉన్న భయాలు పోతాయి అని, అందుకే తీసుకువెళ్లారు.


అప్పుడే మాకు అర్ధమైంది "యుద్ధం, శత్రువు ఆ రెండంటే అందరికి భయం ఉండదు అని, కొంతమందికి యుద్ధం, శత్రువు వారి మీద ఎప్పటికి గెలవలేనటువంటి ఒక కట్టు బానిస, ఎప్పటికైనా వారిమీద గెలవాలి అనుకునే ఒక నెరవేరని కల"


హేమంత్ సార్ అక్కడ గాలితో పోటీపడుతూ కదులుతూ, శత్రువులను చంపుతు వుంటే, అది చూడడానికే మేము వెళ్ళం అనిపించింది. అతని వేగం, తెలివి, తెగింపు ముందు వాళ్ళు ఎంతసేపు నిలబడలేదు. కొంతసేపుకే అందరి కథ ముగించేసి మేము క్యాంపుకి వెళ్లిపోయాం.

 

అక్కడ సార్ ని చూసి మేము చాలా నేర్చుకున్నాం, ఎలా పోరాడాలి, ఎలా శత్రువు కదలికలను గమనించాలి అని, ఎంత వేగంగా ఉండాలి అని. 


కానీ ట్రైనింగులో ఉన్న మమల్ని తీసుకువెళ్ళినందుకు సార్ మీద Disciplinary action తీసుకున్నారు. 


ఆరోజే తెలిసింది సార్ కి ఇవ్వన్నీ కొత్తెమికాదు అని. మమ్మల్ని మంచి సైనికుల్లా తయారు చేయాలి అంటే ఇవి అని పట్టించుకోవద్దు అని . 


ట్రైనింగ్ Results వచ్చాయి:


 హేమంత్ సుభాష్ యొక్క Training results, ఆర్మీ అంటే అతనికి ఉన్న నిబద్ధత వల్ల హేమంత్ సార్ కి చాలా బాగా నచ్చుతాడు


ట్రైనింగ్ అయిపోయిన తరువాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు.


హేమంత్: నేను ఇంతా వరకు చాలా మందిని Train చేశాను. కానీ నువ్వు మాత్రం Something Different, నువ్వు చాలా ఎత్తు ఎదుగుతావు.


ఒక విషయం చెపుతా గుర్తుపెట్టుకో సుభాష్


నీ బలం ఎప్పడు నీ చేతిలో ఉండే ఆయుధంలో ఉండకూడదు, నువ్వే నీ బలం అయ్యి ఉండాలి, శత్రువు యొక్క బలహీనత గమనించే నీ బుద్ధికుశలతలో నీ బలం ఉండాలి "


"నీ గెలుపు ఎప్పుడు ఈ దేశపు గెలుపు అవుతుంది. కానీ నీ ఓటమి ఎప్పటికి మన దేశపు ఓటమిగా మారకూడదు"


సుభాష్: ఆర్మీ నాకు ఒక ఉద్యోగం ఐతే కాదు సార్, కష్టం అనిపిస్తే వదిలి వెళ్ళడానికి , ఇది నా ఇల్లు సార్, ఇక్కడే ఉంటా. గెలుపు అయినా ఓటమి అయినా చివరివరకు ఇక్కడే ఉంటా 



"ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసిన రాని గర్వం, పొగరు, సంతృప్తి ఒక్క సైనికుడిగా చేసే ఉద్యోగంలో మాత్రమే ఉంటుంది sir."


హేమంత్: రేపు మీరు మీకు ఇచ్చిన క్యాంపు లకి వెళ్ళాలి, వెళ్లి Rest తీసుకో.


సుభాష్: గుడ్ నైట్ సార్.



తరువాత ఇద్దరం కలిసి ఒకటి రెండు ఆపరేషన్స్ చేసాము కూడా. 


కొంత కాలం తరువాత:


నేను హైదరాబాద్ క్యాంపు కి వచ్చిన తరువాత ఒక రోజు పని మీద బయటకు కొన్ని రోజులు వెళ్ళాను గుర్తుందా ? 


ఒక మిషన్ మీద నన్ను పిలిపించారు, ఆ మిషన్ ని లీడ్ చేస్తుంది హేమంత్ సార్. అక్కడికి వెళ్లాకే తెలిసింది అక్కడ కొంత మంది టెర్రరిస్ట్ లు ఉన్నారు అని, వాళ్ళు అక్కడ అక్కడ బాంబ్స్ పెట్టారు. 


సుభాష్ అండ్ హేమంత్ అక్కడ ఉన్న టెర్రరిస్టులు అందరిని చంపేశారు . కానీ బాంబ్స్ ఇంకా నిర్వీర్యం చేయలేదు . 


హేమంత్ సార్, ఆరోజు అంతా ఉత్సాహంగా లేరు, అది పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ సుభాష్ గమనిస్తాడు .

హేమంత్ బులెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకోడు . 


బాంబు నిర్వీర్యం చేయడానికి ఇద్దరు వెళ్తారు. హేమంత్ బాంబు మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు, సుభాష్ కూడా, కానీ మధ్యలో సుభాష్ కి వేరొక "టిక్ టిక్" శబ్దం వస్తుంది అది ఎవరు గమనించారు. 


10 మీటర్స్ దూరంలో ఇంకో బాంబు ఉంటుంది . అది 5 నిమిషాలకి సమయం పెట్టి ఉంటుంది . హేమంత్ దగ్గర ఉన్న బాంబు 10 నిముషాలు ఉంటుంది, అప్పటికే 4 నిముషాలు వృధా చేస్తారు.

30 సెకండ్లు కన్నా తక్కువ వస్తుంది . సుభాష్ దాన్ని నిర్వీర్యం చేయలేము అని తెలిసి అందరిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు . 


ఆ బాంబు కి దూరంగా వెళ్లే సమయంలో మొదటి బాంబు పేలుతుంది. దగ్గర లో ఉన్న ఒక వస్తువు హేమంత్ సార్ కి చాలా దగ్గరగా వస్తుంది, అది గమనించిన సుభాష్ , హేమంత్ సార్ ని కాపాడుతాడు కానీ అది సుభాష్ కి తగులుతుంది ,


రెండో బాంబు హేమంత్ చేతిలో ఉంటుంది, కింద పడకుండా అలాగే పట్టుకుంటాడు, హేమంత్ ఆ బాంబుని దూరంగా వెళ్లి పక్కనే ఉన్న చెరువులో పడేస్తాడు . 


సుభాష్ కి పెద్ద దెబ్బలు ఏమి తగలలేదు , కానీ ఒక వారం రోజులు Rest తీసుకోవాలి అని చెప్తారు, కానీ తను వెళ్ళిపోతాను అని చెప్తాడు డాక్టర్ కి , Discharge చేయమని అడుగుతాడు, కానీ డాక్టర్ మాత్రం చేయను అని చెప్తాడు. 


అప్పుడే హేమంత్ సార్ వస్తాడు. 


హేమంత్: ఎలా ఉన్నావ్ సుభాష్, everything fine? డాక్టర్ తో ఏదో Discuss చేస్తున్నట్టు ఉన్నావ్?


సుభాష్: ఏమి లేదు సార్, చిన్న దెబ్బలే కదా, డిశ్చార్జ్ చేయమని అడుగుతున్న !!


హేమంత్: డాక్టర్ చెప్పింది నువ్వు వినాలి , ఇక్కడ . (కొంచెం కఠినంగానే )


సుభాష్: అలాగే సార్. 


హేమంత్: డాక్టర్ నేను తనతో మాట్లాడాలి మీరు కొంచెం బయటకి వెళ్తారా?


డాక్టర్ అక్కడనుంచి బయటకి వెళ్తాడు 


హేమంత్: నిన్న నువ్వు అంతా Risk తీసుకొని నన్ను కాపాడాల్సిన అవసరం లేదు.  


నన్ను కాపాడే క్రమంలో నువ్వు ప్రాణాలమీదకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.


సుభాష్: "దేశం కోసం పోరాడే మరో సైనికుడిని కాపాడడం కూడా సైనికుడి బాధ్యతే . అందులో మీలాంటి ఆఫీసర్ దేశానికి చాలా అవసరం , అలాంటిది నా కళ్ళ ముందు మీకు ఏమైనా అవ్వనిస్తానా" 


హేమంత్: " దేశం ముఖ్యం, తరువాతే సైనికుడు". నా టీంలో ఉన్న ప్రతి సైనికుడి ప్రాణం కాపాడటం నా బాధ్యత 


సుభాష్: ఎస్ సార్ 


హేమంత్: సరే నీకోసం, colonel అభిరామ్ గారు ఎదురు చూస్తున్నారు . 


రేపు సాయంత్రం నిన్ను discharge చేస్తారు, రేపు ఉదయం వచ్చి కలువు. 


సుభాష్: ఎస్ సార్. 


మరుసటి రోజు ఉదయం:


సుభాష్ అభిరామ్ సార్ కలవడానికి వెళ్తాడు కానీ అక్కడ ఉండదు సార్,


అక్కడ పని చేసే ఒక వ్యక్తి చెప్తాడు, సార్ ఈ timeలో గ్రౌండ్ లో ఉంటారు అని.


సుభాష్ అక్కడనుంచి గ్రౌండ్ కి వెళ్తాడు, అభిరామ్ సార్ అక్కడ చెట్టు క్రింద కూర్చొని ఉంటారు, అప్పటి దాకా వ్యాయామం చేసి కూర్చుంటాడు 


అప్పుడే సుభాష్ వెళ్లి మాట్లాడుతాడు


సుభాష్: గుడ్ మార్నింగ్ సార్ !!


అభిరామ్ : యంగ్ బాయ్, వచ్చి కూర్చో.


సుభాష్: No thanks sir, i am okay


అభిరామ్: ఇది ఆఫీస్ కాదు సుభాష్ 


సుభాష్: పరవాలేదు సార్.


అభిరామ్: ఓకే నీ ఇష్టం, అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు ఈ క్యాంపులో.


సుభాష్: దేని గురించి సార్ ?


అభిరామ్: ఒకటి కాదు రెండు విషయాలలో నీగురించి మాట్లాడుకుంటున్నారు . 


1. ఈ మధ్య నువ్వు ఎవరో అమ్మాయి వెనుక పడుతున్నావ్ అనుకుంటా ? ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటావ్ అంటా?


సుభాష్: ఎస్ సార్.


అభిరామ్ : తన గురించి చాలా మంది చెప్తున్నారు, తను చేసే పని గురించి, తనని ప్రేమించడం వల్ల అందరూ నీ గురించి కూడా తప్పుగా అనుకుంటారు, అది నీకు అంత మంచిది కాదు. 


సుభాష్: with your permission.. 


ఎవరో ఏదో అనుకుంటారు అని ఆలోచించే వాడిని అయితే ,


"చాలా మంది ఆర్మీ లో ఉద్యోగం అంటే ప్రాణాలు పోతాయి అన్నారు, కానీ నాకు మాత్రం ఆర్మీ లో ఆర్మీ అంటే ప్రాణం


అలాగే అమ్మాయి కూడా , "తను అంటే నాకు ప్రాణం, ఎవరో ఏమో అనుకుంటారు అని, నాకు బాగా నచ్చింది వదులుకోను, నేను చేయాలి అనుకున్నది ఆపాను".


అభిరామ్ : అయినా తను తను, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటంలేదు . 


సుభాష్: నాకు అర్ధమైంది సార్. 


తను ఎంతమందితో గడిపింది అలాంటి అమ్మాయితో ఎలా జీవితాంతం గడుపుతావు అని అడగాలి అనుకుంటున్నారు?


అభిరామ్ కొంచెం సంకోచిస్తాడు, అది అది అంటాడు 


సుభాష్: "ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒకరితో గడపనంతా వరకు తను స్వచ్ఛంగా, కన్యగా ఉన్నట్టే . 


తనకి ఇష్టం లేకుండా, తన మనసుకి నచ్చనివాడితో గడిపినప్పుడు ఆమెను తప్పుడు కోణంలో చూడాల్సిన అవసరం లేదు అని నా గట్టి అభిప్రాయం"


అప్పుడే అక్కడికే హేమంత్ సర్ వస్తాడు.


హేమం త్: well said subash.. నేను చెప్పాను కదా సార్ He is a GEM అని. 


అభిరామ్ : నన్ను క్షమించు సుభాష్, నిన్న నీ గురించే మాట్లాడుకున్నాం, నీలో చాలా పరిణితి (maturity) ఉంది అని, ఒక అమ్మాయి గురించి నీకు ఉన్న ఆలోచన,& నీ భావాలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పాడు , అందుకే నీకు ఒక పరీక్ష పెడుదాం అనుకోని ఆలా మాట్లాడా. 


& హేమంత్ ఒకరి గురించి ఇంతా బాగా చెప్పడం ఇదే తొలిసారి అందుకే నేను కూడా కొంచెం నిన్ను అర్ధం చేసుకోవడాని, ఆలా అడిగా . 


అభిరామ్ : హేమంత్ సమయం ఎంత అవుతుంది చూసావా ?, వెళ్లి జాగింగ్ చెయ్ . 


హేమంత్ క్రమం తప్పకుండా, జాగింగ్ చేస్తాడు, అలానే దగ్గరలో ఉన్న Pet షాప్ కి వెళ్తాడు, అతనికి Dogs అంటే చాలా ఇష్టం 


హేమంత్ పక్కనే జాగింగ్ చేస్తూ ఉంటాడు. 



అభిరామ్ , సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు.


ఇంకా రెండో విషయం :


2. నువ్వు నిన్న హేమంత్ ని కాపాడావు , & చాలా మందిని కాపాడారు, హేమంత్ ని కాపాడడం ఇక్కడ కొంత మందికి ఇష్టం లేకపోవచ్చు కూడా. 


సుభాష్: అదేంటి సార్ , హేమంత్ Sir వాళ్ళ ఎవరికీ అంతా ప్రాబ్లెమ్ 


అభిరామ్ : "మనం ముక్కు సూటిగా ఉంటె కొంత మందికి నచ్చదు, తప్పుని తప్పు అని చెప్తే అసలు నచ్చదు , ఆలా చెప్పే వాళ్లలో హేమంత్ ముందు ఉంటాడు "


అందుకే కొంత మంది వాడు చనిపోతే బాగుండు అనుకుంటారు. 


వాడు అంటే నచ్చని వారు ఇక్కడ కొంత మంది ఉన్నారు. అందులో ఒకడు "జయరామ్"

.

అతను కూడా హేమంత్ తో పాటే ఆర్మీ లోకి వచ్చాడు. కానీ చాలా మంది సైనికుల నుంచి హేమంత్ కి దక్కిన గౌరవం చూసి ఈర్ష్యపడ్డాడు.


వాళ్ళ ఇద్దరి మధ్య చాలానే విషయాలు జరిగాయి, కొన్ని రోజులకి హేమంత్ అవి ఏమి పట్టించుకోలేదు, కానీ జయరామ్ మాత్రం కొంతకాలంగా హేమంత్ మీద పైచెయ్యి సాధించాలని చూస్తున్నాడు. 


ఎప్పటికైనా అతని స్థానాన్ని దక్కించుకోవాలి అనుకునేవాడు, హేమంత్ కి ఆర్మీ లో ఉన్నగౌరవం తను పొందాలి అని అనుకునేవాడు. 

అందులో అతని తండ్రి ఒక ఎంపీ. ఇతనికి ఆర్మీ లో చాలా పలుకుబడి ఉంది, అతని నాన్న లాగానే. అతను తలుచుకుంటే PM Appointment ఇప్పించగలడు .


సైన్యంలో Hemanth విలువ పెరగడానికి కారణం ట్రైనర్ అని, చాలా సార్లు అతని స్థానంలోకి వెళ్తా అని బలవంతం చేసేవాడు, కానీ ఆ స్థానానికి హేమంత్ సరైనవాడు అని అతనికి ఆ స్థానం ఇవ్వలేదు పైవారు. 


మిమల్ని ట్రైనింగులో ఉండగా ఆర్మీ ఆపరేషన్ కి తీసుకువెళ్లాడు గుర్తుందా? అప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకున్నాడు. ఆర్మీ మీటింగ్ లో ఆ విషయాన్ని తీశారు. 


కల్నల్ 1: ట్రైనింగులో ఉన్నవారిని నువ్వు తీసుకువెళ్లడం తప్పు. 


హేమంత్: వాళ్ళు ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నారు, Holiday Tourకి ఏమి రాలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకుంటేనే వాళ్ళు మంచి సైనికులు అవుతారు.

కల్నల్: వారికీ ఏమైనా ఐతే ? 


కల్నల్ 1: నీ Sincerity మీద మాకు నమ్మకం ఉంది, కానీ ప్రతిసారి నువ్వు ఇలా చేస్తూ ఉంటె మాత్రం ఉరుకోము, అందుకే ట్రైనర్ గా నీ స్థానంలో జయరామ్ కి ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాము. 


2 batchesకి అతను ట్రైనింగ్ ఇస్తాడు, ఆ తరువాత Results చూసి నువ్వా? అతనా ? అను మేము చెప్తాము ??

 

ఆ తర్వాతహేమంత్ పెద్దగా ట్రైనింగ్ ఇవ్వడం లేదు, కానీ కొత్త సైనికులకి దూరంగా ఉండి కూడా, వారికీ కావాల్సిన సూచనలు మాత్రం ఇవ్వడం ఎప్పుడు మానుకోలేదు. 

కొన్నాళ్ల తరువాత హేమంత్ టీం తనకి కావాలని జయరామ్ ఒక మీటింగ్ పెట్టాడు. దానికి హేమంత్ ఒప్పుకోలేదు. కానీ పెద్దవాళ్ళు అంతా జయరామ్ కి ఇవ్వడానికి సిద్ధపడ్డారు.


హేమంత్: నా టీం అతనికి ఇవ్వడానికి గల ఒక Reasonచెప్పండి నేను వదిలేస్తా?.


కల్నల్: ఇది ఆర్మీ నీకు నచ్చినట్టు ఇక్కడ జరగదు, మేము ఇచ్చిన టీంతోనే నువ్వు పనిచేయాలి. 


అది విన్న హేమంత్ ఒక్కసారిగా కోపానికి గురి అయ్యాడు, హేమంత్ గంబీర్యం, కోపం చూసి వారికీ భయం వేసింది. అలాగే అతని ప్రవర్తన చూసి చాలా కోపం వచ్చింది.


అభిరామ్ కల్నల్: హేమంత్ లాగా ఇంకెవరు ఆ టీంని లీడ్ చేయలేరు, అతను 100% జస్టిస్ చేయగలడు ఆ స్థానానికి. 


కల్నల్ 1: ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్స్. కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. 


హేమంత్ ని దారిలో పెడుదాం అని అలా చేసారు. కానీ హేమంత్ ని ఏమి చేయలేము అని వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే అతనికి ఉన్న ట్రాక్ రికార్డు ఆర్మీ లోనే Best. 


హేమంత్ ని ఏమి చేయలేము అని అందరికీ తెలుసు,


అభిరామ్ హేమంత్ కి సపోర్ట్ గా చాలా ట్రై చేసాడు, చివరికి ఒకడిని మాత్రం ఆ టీం నుంచి జయరామ్ టీంకి పంపించారు


 అతనే అబ్దుల్, అతని స్థానంములోనే నువ్వు మొన్న వచ్చావు. కానీ కొన్ని రోజుల క్రితం అతను చనిపోయాడు. అందుకే కొంచెం బాధలో ఉన్నాడు.


తన టీంని ఎప్పుడు చాలా బాగా లీడ్ చేసేవాడు హేమంత్. కానీ కొంతమంది వల్ల తన టీంలోని ఒకరు మరణించారు అని బాధ.


వాడి కోపం వల్ల చాలా సార్లు కష్టపడ్డాడు, కానీ ఎప్పుడు తప్పు చేయలేదు, ఆ కోపం వెనుక ఒక బాధ్యత, దేశభక్తి ఉంటుంది,


 జీతం కోసం, మెడల్స్ కోసం, ఎన్నడూ వాడు ఇక్కడ పని చేయలేదు. కేవలం ఈ దేశం కోసం మాత్రమే ఇక్కడే ఉన్నాడు. 


నీ కోసం విషయం తెలుసా, వాడు విజయనగరం రాజు వంశస్థుడు , 100లా కోట్ల ఆస్థి ఉంది, ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉంది. కానీ అన్ని వదిలేసి ఆర్మీ కోసమే తన జీవితం అంకితం చేసాడు , 


ఇలాంటి వాడు నాతో పనిచేయడం నా అదృష్టం.


Subash: మీరు చెప్తే వింటాడు అని కొంతమంది చెప్పారు. 


అభిరామ్: వింటాడు, వాడికి వినాలి అని అనిపిస్తే!!


సుభాష్ సంకోచిస్తూనే ఒక ప్రశ్న అడుగుతాడు అభిరామ్ సార్ ని!!


సుభాష్: మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా ?


అభిరామ్ : అడుగు సుభాష్ 


సుభాష్: మొన్న బాంబు blast జరిగినప్పుడు హేమంత్ సార్ ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు. కొంత నిరాశ, కోపం సార్ కళ్ళలో చూసా , అసలు ఏమైంది? . 


అభిరామ్ : అది ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు సుభాష్.


సుభాష్: ఐతే సార్ నే అడుగుతా !!


అభిరామ్: వద్దు నేనే చెప్తా, కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి, మన దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ నకిలీవి అని చెప్పాడు . 


నేను ఆశ్చర్యపోయా, ఆలా ఎలా అవుతుంది అని . 


కానీ హేమంత్ మాత్రం నా మాట వినలేదు, తగినంత proofs లేకుండా ఎలా చెప్తాము, ఎలా నిరూపిస్తాం అని?


హేమంత్ : సాక్ష్యాలు లేవు కానీ నేను బలంగా నమ్ముతున్న, అందులో ఇక్కడజరుగుతుందో అని 


అభిరామ్ : తన మాట ఎందుకు కాదు అనాలి అని, వాటిని తన ముందే చెక్ చేసాం, క్వాలిటీ బాగుంది, అన్ని నాణ్యత ప్రమాణాలు పాటించారు. 


కానీ హేమంత్ ఎవరి మాట వినలేదు, ఒక విషయాన్ని తను నమ్మితే చాలా గట్టిగా నమ్ముతాడు 


సుభాష్: మరి మీరు నమ్మటం లేదా హేమంత్ సార్ ని ?


అభిరామ్ : హేమంత్ నా కొడుకు లాంటి వాడు, నేను బాగా నమ్మే మనుషులలో మొదటి వ్యక్తి వాడే, కానీ ఆధారాలు లేకుండా ఏమి చేయాలి? 


అప్పుడే హేమంత్ జాగింగ్ ముగించుకొని వస్తాడు 


హేమంత్: ఎక్కడ దాకా వచ్చింది సుభాష్ మరి నీ లవ్ స్టోరీ, OKచేస్తుందా లేదా ?


సుభాష్: ఏమో సార్, ప్రేమ కూడా ఒక యుద్ధం లాగానే అనిపిస్తుంది నాకు


హేమంత్: ప్రేమ కూడా ఒక యుద్ధమే సుభాష్, ఈ ఒక్క యుద్ధంలో మాత్రమే ఇద్దరు గెలుస్తారు.


అభిరామ్ సార్ (నవ్వుతూ ): "ఆ యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని జయించడం , ఈ యుద్ధంలో గెలవడం అంటే ప్రేమకి, అమ్మాయికి నువ్వు బానిస అవ్వడమే"


all the best మళ్ళి కలుద్దాం సుభాష్. 


అక్కడ నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు, కానీ సుభాష్ మనసులో హేమంత్ సార్ & ఆ జాకెట్స్ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. 


సుభాష్ వెంటనే అక్కడ ఉన్న ఒక బులెట్ ప్రూఫ్ జాకెట్ ని తీసుకొని ల్యాబ్ లో టెస్ట్ చేస్తాడు, బుల్లెట్ కాలుస్తాడు, అంత సరిగ్గానే ఉంటాయి. 


అంతా సరిగ్గానే ఉంటె సార్ ఎందుకు ఇంతా ఇబ్బందిపడుతున్నారు, దీని వెనుక ఇంకా ఏదో ఉంది, సార్ నాకు ఏదో చెప్పటం లేదు అనుకుంటాడు 


అప్పుడే హేమంత్ అతని వెనుక నుంచి వచ్చి 


హేమంత్: "అనుమానం ఉంటె సరిపోదు సుభాష్, ఇక్కడ సాక్ష్యాలు కూడా కావాలి, అవి నా దగ్గర ఇప్పుడే లేవు, కానీ కొన్ని రోజుల్లో కచ్చితంగా సంపాదిస్తా.


"దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడి వేసుకొనే జాకెట్స్ లోకూడా ఇంత అన్యాయం" . 


సుభాష్: నాకు తెలుసు సార్ మీరు కచ్చితంగా దీన్ని చేధిస్తారు అని, మీకు ఈ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం

 

హేమంత్: కచ్చితంగా, ఒక్కసారి సాక్ష్యాలు రాని, అప్పుడు కచ్చితంగా నీ సహాయం తీసుకుంటా!!


కానీ హేమంత్ కి మొదటి నుంచి ఇలాంటివి చాలా, సీక్రెట్ గా చేయడం అలవాటు . 


ఆరోజు రాత్రి హేమంత్ సార్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తనకి ఎవరు ఈ కుంభకోణం గురించి తెలిపారో అని?.


ఒకరోజు రాత్రి హేమంత్ సార్ కి కాల్ వస్తుంది అది అతని టీంలో పని చేసే "అబ్దుల్" నుంచి. 


అత్యవసరంగా కలవాలి అని, ఫోన్లో మాట్లాడలేను, సైన్యం లో జరిగే ఒక కుంభకోణం గురించి మాట్లాడాడాలి అని చెప్పాడు. 


వెంటనే హేమంత్ సార్ అతన్ని కలుద్దాం అని వెళ్తాడు, కానీ అతడు చెప్పిన చోటుకి రాలేదు. చాలాసేపు ఎదురు చుసిన హేమంత్ సార్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 


మరుసటి రోజు ఉదయం తెలుస్తుంది అతడు కారు ప్రమాదంలో చనిపోయాడు అని . 


హేమంత్ కి అనుమానం వస్తుంది, అందుకే అతను చివరగా క్యాంపులో వెళ్లిన ప్రదేశానికి వెళ్తాడు. అతని రికార్డు గమనిస్తాడు అప్పుడే తెలుసుతుంది అతను బులెట్ ప్రూఫ్ జాకెట్స్ గురించి ఏదో అతనికి చెప్పాలి అనుకున్నాడు అని. 


హేమంత్ కి ఇంకా అనుమానం బలమైంది ఎప్పుడంటే? అబ్దుల్ తాగి కారు నడిపాడు అని రిపోర్ట్స్ లో రావడం, అలాగే అతను బయటకి తీసుకువచ్చిన జాకెట్ అక్కడ లేకపోవడం.


అబ్దుల్ కి మద్యం సేవించే అలవాటు లేదు, అంటే ఎవరో కావాలని అతనికి మద్యం తాగించారు. ఇవన్నీ హేమంత్ దగ్గర కొన్ని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.


తరువాతి రోజు:


హేమంత్ బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు అని క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. కొన్ని రోజులు మళ్ళి సస్పెండ్ చేస్తారు 


అభిరామ్ : నీకు ఇది ఏమైనా కొత్తనా ఎన్ని సార్లు ఇలాంటి చర్య తీసుకోలే, ఎవరి మాట వినవు . 


ఇప్పుడు అయినా కొన్ని రోజులు సంతోషంగా ఎక్కడికి అయినా వెళ్ళిరా . 


సరే అని చెప్పి, వెళ్లిపోయేముందు, 


హేమంత్: సెలవు తీసుకోవాల్సింది నేను కాదు సార్, మీరు ఇంకా ఎన్ని రోజులు పని చేస్తారు సంతోషంగా విహారయాత్రలు ఏమైనా వెళ్ళచ్చు కదా?


అభిరామ్: ప్రతి మిషన్ నాకు ఒక విహారయాత్రే . 


నువ్వు సెలవు నుంచి తిరిగి వచ్చాక నిన్ను హైదరాబాద్ తీసుకెళుతున్న, సుభాష్ కూడా ఉంటాడు 


హేమంత్: అక్కడికి దేనికి 


అభిరామ్: అక్కడ టెర్రరిస్ట్ లు ఏదో ప్లాన్ చేసారు అంటా intelligence bureau నుండి రిపోర్ట్ వచ్చింది, మనం వెళ్ళాలి.


హేమంత్: ఇంకా ఎవరు లేదా మనం ఎందుకు సార్?


అభిరామ్ : అక్కడ నీలాంటి తలతిక్క వాడు ఎవడు లేడు అంటా అందుకే, అక్కడ అయినా కొంచెం చెప్పిన మాట విను!


హేమంత్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు .


అక్కడితో సుభాష్ వాళ్ళ గురించి మానస కి, హేమంత్ కి చెప్పడం అయిపోయితుంది.




Questions:


నర్సింగ్ ని ఎందుకు సుభాష్ వదిలివేసాడు. ? అసలు ఈ కుంభకోణం వెనుక ఉన్నదీ ఎవరు ?


 హేమంత్ సార్ కి తరువాత ఏమి జరిగింది ?? మౌనిక ఎక్కడ ఉంది? క్షేమంగానే ఉందా?


Part-3 Coming Very soon.. All the suspense is going to be revealed.


 






Motto:

మనకి ఎంత మంది రోల్ మోడల్స్ ఉన్న,ఒక సైనికుడికి మాత్రం దేశం కోసం పోరాడే మరో సైనికుడి రోల్ మోడల్


దేశాన్ని కాపాడాలి అనుకొనే ప్రతి ఒక్కరు ఒక సైనికుడే, & వాడే నిజమైన సైనికుడు


ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒకరితో గడపనంతా వరకు తను స్వచ్ఛంగా, కన్యగా ఉన్నట్టే!!!


Rate this content
Log in

Similar telugu story from Drama