నేను, హనీషా & మా మామా ......
నేను, హనీషా & మా మామా ......
నా కథ వినే ముందు నా గురించి కొంచెం తెలుసుకుందామా?
నా పేరు కార్తీక్. ఊరు కరీంనగర్.. మా అమ్మ, నాన్న ఇద్దరు ఆంధ్రాబ్యాంకులో పనిచేస్తున్నారు. ఇద్దరిది ప్రేమ వివాహం. నేను ఒక్కడినే కొడుకుని.
నేను కొంచెం మొండివాడిని అని నాన్న ఎప్పుడు అంటాడు, అయన వలనే నేను ఆలా అయ్యాను అని అమ్మ అంటుంది. కానీ అమ్మ ఇంకా నేను చిన్న పిల్లవాడినే అంటుంది. ఇద్దరికి నేను అంటే చాలా ఇష్టం.
అమ్మ నాకు మంచితనంగా, నిజాయతీగా ఉండడం నేర్పిస్తే .. నాన్న ఒక ధైర్యవంతుడు లాగా తీర్చిదిద్దాడు.
"మనం విన్న మొదటి పాఠాలు ఎంత విలువైనవి అయితే, జీవితంలో మన ప్రయాణం అంతే విలువైనదిగా, గొప్పగా ఉంటుంది.
అందుకే వాళ్లే మన మొదటి గురువులు కూడా.. వాళ్ళు నేర్పే పాఠాలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి"..
నా గురించి అంటారా…..నచ్చిన పని కోసం ఎంత కష్టం అయినా, దాని కోసం ఎంతా దూరం అయినా వెళ్తా అది నా స్వభావం .
మనం చేయవల్సిన పని, సమయం బాగా తెలిసినప్పుడు అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ రెండు తెలియనప్పుడు ఎన్ని తెలిసిన వృధానే.
ఇప్పుడు నా స్నేహితుల గురించి..
నా చిన్నప్పటి స్నేహితుడు శివ. ఇద్దరు కలిసే చదువుకున్నాం, ఒకే దగ్గర పెరిగాం. చాలా అల్లరివాడు, అందరిని నవ్విస్తూఉంటాడు ఎప్పుడు. మా నాన్నకి కూడా మంచి స్నేహితుడు, ఎందుకంటే అమ్మకి తెలియకుండా ఇద్దరు కలిసి సిగరెట్ తాగేవారు. ఎప్పుడో ఒకరోజు దొరుకుతారు, అప్పుడు చూడాలి.
ఇంకా అసలు కథ గురించి చెప్తా. అదే నా ప్రేమ గురించి.
ఆమెను మొట్టమొదటి సారి... కాలేజీ నుంచి వచ్చేటప్పుడు చూసాను, తను ఏమి చదువుతుందో అప్పటికి నాకు తెలియదు. కానీ ఎందుకో చూడగానే లోపల ఏదో తెలియని,ఎప్పుడు కలగని అనుభూతి. .
ఆమె వెనుక ఫాలో చేద్దామా అనిపించింది కానీ మనకి అలాంటివి మనకి సెట్ అవ్వవు అనుకోని వెళ్ళలేదు. రెండు రోజుల తరువాత నేను, శివ మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ దగ్గర మాట్లాడుకుంటున్నాం అప్పుడు మళ్ళి తనని చూసా ఈ సారి కాలేజీ కి వెళ్తుంది. అలానే చూస్తూ ఉండిపోయా.
మొదటి రెండు సార్లు అనుకోకుండానే తనని చూసాను. కానీ మూడో తనని చూడాలి అని నేనే నిర్ణయించుకున్న, అదే రోజు సాయంత్రం తను కాలేజీ నుంచి వచ్చే సమయంలో మళ్ళి చూసాను, లేదు చూడాలి అని నేను వెళ్ళాను.
కానీ ఈసారి తన వెనుకే ఆలా నడుస్తూ, నడుస్తూ వెళ్ళాను.. ఎక్కడిదాకా అంటే తన అడుగులు నాకు ఎక్కడైతే కనిపించడం ఆగిపోయాయి అక్కడి వరకు, వాళ్ళ ఇంటివరకు.
విశేషం ఏమిటంటే తను కూడా చూసి నవ్వింది, "ఆ నవ్వు ఒక్కటి చాలు మిగితా జీవితాంతం ఆలా తనతో నడుస్తూ,ఆ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది".
ఇన్ని సంవత్సరాలు ఒకే ఇలాకా/ఏరియా లో ఉన్న ఎప్పుడు తనని చూడలేదు…. "కాలమే మన శత్రువు, కాలమే మన మిత్రుడు.. ఇన్ని రోజులు చూపించకుండా శత్రువు అయ్యాడు, కానీ తనని చూపించి ఒక్క క్షణంలో నా మిత్రుడు అయ్యాడు".
తరువాతి రోజు శివకి జరిగిన విషయం అంతా వివరించా, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు అమ్మాయిని చూసావు అని కొంచెం ఆశ్చర్యపోయాడు. మామూలుగానే ఆగం, ఆగం చేస్తాడు. ఈ విషయం తెలిసిన తరువాత ఇంకా ఎంత చేస్తాడు.
అమ్మాయి గురించి నాకు ఏమైనా తెలుసా అని అడిగాడు, తెలియదు అని చెప్పా. ఆ మాట చెప్పగానే అందరూ స్నేహితులు ఏమి చేస్తారు.. వాడు కూడా అదే చేసాడు.
తరువాత తనని వాళ్ళ స్నేహితుడికి చూపించి తన గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే నేను కూడా అడగలేదు. దానికి చాలా చేయాలి ఒక్కోసారి ఒక బీరుతో పని ఐపోతుంది, ఒక్కోసారి పార్టీ కూడా ఇవ్వాల్సివస్తుంది.
ఆ అమ్మాయి పేరు హనీషా, పేరు చాలాకొత్తగా ఉంది కదా, ఆ పేరు వినే దాకా అలాంటి పేరు ఒకటి ఉందని కూడా నాకు తెలియదు, కానీ అది తన పేరు అని తెలియగానే ఎందుకో పేరు కూడా చాలా బాగా నచ్చేసింది.
వాళ్ళ నాన్నకి ఒక హోటల్ ఉంది. ఇద్దరు తమ్ములు. ప్రస్తుతం అమ్మాయి ఎం.టెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బొయ్ఫ్రెండ్స్(Boyfriend) ఎవరు లేరు అని కనుక్కున్నాడు.
అందులో ఒక విషయం మాత్రం నాకు బాగా నచ్చింది.. తనకి బాయ్ఫ్రెండ్(Boyfriend) లేడు అనే విషయం.
ఆలా కొన్ని రోజులు(5 రోజులు) తనని చూస్తూ ఉన్నాను. నాకు అలా తనని చూస్తూ ఉండడం చాలా నచ్చింది, చూడడం తప్ప ఇంకేమి చేయటం లేదు అని శివ గాడి బాధ..
ఇలా ఎన్ని రోజులు చూస్తూ ఉంటావు, వెళ్లి తనతో మాట్లాడు, ఫ్రెండ్షిప్ చెయ్, క్లోజ్ అవ్వు అని శివ చెప్పాడు.
ఒకవైపు అమ్మాయి అంటే ఇష్టం పెట్టుకొని, స్నేహం చేస్తావా అని ఎలా అడగగాలను?
అయినా ఈ విషయం ఎక్కువ రోజులు సాగదీయడం నాకు కూడా ఇష్టం లేదు, మనం ఆ రకము కాదు. అందుకే నేను మనసులో ఏమనుకుంటున్నానో అది తనకి చెప్పాలి అనుకున్నా.
శివకి మాత్రం నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పా. ఒక 5 నిమిషాలు అయినా సంతోషంగా ఉంటాడు అని. నా వాళ్ళ చిన్నప్పటినుంచి షాక్ లు తినడం అలవాటు అయిపోయింది వాడికి.
సాయంత్రం 5 దాటింది, సూర్యుడు ఆరోజుకి డ్యూటీ దిగుతున్న సమయం. తనకోసం ఎదురుచూస్తున్న సమయం…
"ఎప్పుడు జింక వెనుకపడే పులిలాగా చాలా వేగంగా పరిగెత్తే సమయం, అప్పుడెందుకో నత్త నడక నడుస్తుంది అనిపించింది".
అంతలో తను రానే వచ్చింది, అప్పుడే తనని పిలిచాను "హనీషా అని... ఆగింది... నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగా".
కొంచెం భయంగానే ఆగింది, ఎవరైనా చూస్తారు అనో?, లేదా నేను ఏమి మాట్లాడుతాను అనో?, తన ముఖంలో ఒక ప్రశ్న. తను ఉండేది అక్కడే కాబ్బటి ఎవరైనా చూస్తారు అని అనుకుంటుంది.
ఎక్కువ సమయం లేదు అనుకుంటా అందుకే పాయింట్ కి వస్తా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లిచేసుకుంటా అని చెప్పేసా.
అది విన్నా తను ఏమనుకుంటుందో తెలియదు కానీ, వేరొకరి మెదడు మాత్రం గట్టిగానే తిరిగింది... శివది .. నేను చేయమన్నది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అని ముఖం పెట్టాడు?.
క్షమించండి, నాకు అలంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పింది.
"నీ మాటలు నా చెవులు వినకముందే, నీ కళ్ళు నాకు సమాధానము చెప్పేసాయి. నీకో విషయం తెలుసా మన మాట అనేది మెదుడు అధీనంలో ఉంటుంది, మన కళ్ళు, అందులోని భావాలు మనసు అధీనంలో ఉంటాయి” అని అన్నాను.
Seems.. I fall in love with Your Heart, Eyes.. Not with your Intelligence, Thoughts…
అమ్మాయితో కూడా నీ లాజిక్స్ ఏంటిరా? నువ్వు మారావురా అని శివగాడు అనుకుంటున్నాడు...
అది విన్న హనీషా ఒక్కమాట కూడా మాట్లాడకుండా కొన్ని అడుగులు ముందుకి వేస్తూ వెళ్ళింది, కొంచెం దూరం వెళ్లిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది, కళ్ళతో సమాధానము చెప్పింది.
ఈ సారి నాకు బాగా నచ్చిన తన నవ్వు, తరువాత తన కళ్ళు రెండింటి సమాధానం ఒక్కటే.. "నేనంటే ఇష్టం అని చెబుతున్నాయి.
కొన్ని రోజులు ఆలా గడిచిపోయాయి. ప్రొద్దునే శివతో కలిసి క్రీడా మైదనాంకి వెళ్లడం, ప్రాక్టీస్ చేయడం, కాలి దొరికినప్పుడల్లా తనని కలవడం ఇదే నా పని.
అమ్మ, నాన్నకి నాలో కొంచెం మార్పు గమనించారు, ఎంతైనా ఇద్దరిది కూడా ప్రేమ వివాహమే కదా. నాలో కొత్త హుషారుకి కారణం ఏంటో తెలుసుకోవడం మొదలు పెట్టారు, అది చెప్పడానికి వాళ్ళకి ఒకడు ఉండనే ఉన్నాడు. నేను చెప్పకముందే మా శివగాడు అంతా చెప్పేసాడు.
నాన్న ఒక అమ్మాయితో ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి అని తనకున్న అనుభవం చెప్పాడు.
అమ్మ ఒక అమ్మాయితో ఎలా ఉండకూడదో చెప్పింది. ఇద్దరు కలిసి నాకు కొత్త పాఠాలు నేర్పించారు.
కానీ చివరికి నాలాగా, నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన అమ్మాయి దగ్గర ఉండడమే ముఖ్యం. అది మాత్రమే నాకు తెలుసు.
ఒక రోజు నన్ను కలవాలని హనీషా పిలిచింది, పిలవగానే దగ్గరలోఉన్న ఒక కాఫీ షాపులో కలిసాం..
ఆరోజు తనతో పాటు కొన్ని అనుమానాలను, భయాలను కూడా తీసుకువచ్చింది.
మన పెళ్లి జరుగుతుందో, లేదో అని సందేహం, భయం వ్యక్తం చేసింది.
ఎందుకు అని అడిగాను.
నేను ముస్లిం, నువ్వు హిందూ ఇద్దరి ఇళ్లలో ఒప్పుకుంటారో లేదు అని అంది, మా ఇంట్లో అయితే కష్టమే, నాన్న ఒప్పోకోడు, నాకు భయంవేస్తుంది అని చెప్పింది.
"పప్రపంచంలో మనకి శత్రువులు ఉండచ్చు, ఉండకపోవచ్చు.. కానీ ప్రతి మనిషికి కచ్చితంగా ఉండే ఏకైక శత్రువు “భయం". మనతోఉంటూ, మనలోనేఉంటూ ఎప్పుడు మనల్ని గెలవాలి అని చూసేది మనలోని భయమే. దానితో పోరాడడం నేర్చుకుంటే.. బ్రతకడం నేర్చుకున్నట్టే".
తనకి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించా.
ఇన్ని కోట్ల మంద
ి హిందూ, ముస్లింలు అన్నదమ్ములుగా కలిసినప్పుడు, మన ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉంటె ఎవరు విడదీస్తారు అన్నాను.
అంతా మొండి నమ్మకం ఏంటి నీకు అని అడిగింది. .
నాకు కాదు మీ వాళ్ళకి కావాల్సింది ఒక నమ్మకం, మన ఇద్దరమూ కలిసి ఎప్పటికి సంతోషంగా ఉండగలము, ఎన్ని కష్టాలు వచ్చిన ఒకరి చెయ్యి మరొకరు వదలరు అనే నమ్మకం.
నాకు బాగా నచ్చిన వ్యక్తి ఏమన్నారో తెలుసా? Under the Sky,Heaven We are All One Family.. Only People are Different..
సరే నువ్వు ఏమని అనుకుంటావు అని అడిగా దానికి తను
అమ్మ, నాన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించే చేసుకుందాం, దానికి ఎన్ని రోజులు అయినా పర్వాలేదు. అని చెప్పింది. .
నేను అనుకున్నదే తను కూడా అనుకున్నది.
సరే అని అన్నాను
నేను ఇంత కంగారు పడుతుంటే, ఎప్పుడు ఇంత కూల్ గా ఎలా ఉంటావు అని అడిగింది?.
నిజానికి దానికి సమాధానము నా దగ్గర కూడా లేదు, మనకి నచ్చింది చేయటమే దానికి సమాధానం అని అనిపించింది.
మీ నాన్న ఏమనుకుంటున్నాడో తెలియకుండా మనం ఆలోచించడం సరి కాదు అని చెప్పాను.
అయినా మీ వాళ్ళు ఒప్పుకోరు అని నేను అనుకోవడంలేదు అని చెప్పా. ఎందుకంటే ఒప్పించడానికి నేను ఉన్నాను కదా.
ఒకవేళ మతమే కారణం అయితే.. మనల్ని విడదీయడానికి ప్రయత్నించే మతం కన్నా, మనల్ని కలిపే ఈ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది.
అక్కడితో మా మేడం కొంచెం శాంతించారు, కానీ వెళ్ళేటప్పుడు నాకు అగ్గి రాజేసి వెళ్ళింది.
రేపు ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడు అని వెళ్ళిపోయింది.
నాకు కూడా మా మామతో మాట్లాడాలి అనిపించింది, అందుకే వెళ్లుదాం అనుకున్నా.
హనీషా వాళ్ళ ఇంటికి వెళ్లేముందు, ఒకసారి అమ్మానాన్నకి అంతా చెప్పా, వాళ్ళ నిర్ణయం తెలుసుకుందాం అని? వాళ్ళు ఒక్కటే చెప్పారు
"ఆ అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉంటావు అని నువ్వు నమ్మితే, నీకు నచ్చింది చెయ్యి , మాకు ఎటువంటి అభ్యంతరం లేదు”. అని చెప్పారు
ఆలా చెప్పినపుడు మా అమ్మ, నాన్న నన్ను ఎంతగా నమ్ముతున్నారో, నా నిర్ణయం మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అర్ధం అవుతుంది.
తరువాత రోజు శివ ఇంటికి వచ్చాడు. మా నాన్న వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్లిరమన్నాడు అనిచెప్పి శివని నాతో పాటు తీసుకొని వెళ్ళాను. నేను తీసుకువెళ్ళింది హనీషా వాళ్ళ ఇంటికి, అది వాడికి తెలియదు.
అంకుల్ తో సమావేశం:
అది రంజాన్ మాసం.... మనందరికీ నచ్చిన హలీమ్ తినే సమయం...
అంకుల్ కి నేను తెలియదు కానీ మా నాన్న పరిచయం, అంకుల్ తో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లోపలికి వెళ్ళాను, శివ ఆ సమయంలో బండి పార్క్ చేస్తున్నాడు.
ఇద్దరం కలిసి లోపలి వెళ్ళాం. చెప్పండి బాబు ఎం మాట్లాడాలి అని అడిగారు అంకుల్.
అసలు విషయం తెలియని శివ అంకుల్ తో సరదాగా మాట్లాడం మొదలు పెట్టాడు.
రంజాన్ మాసం కదా మిమ్మల్ని ఒకసారి కలిసి వెల్లుదాం అని వచ్చాం, రోజా/ఉపవాసాలు ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు శివ.
అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పండి బాబు అని అడిగారు అంకుల్.
అంకుల్ ఇంతకీ హలీమ్ చేసారా? మీరు చేసే హలీమ్ చాలా బాగుంటుంది అని అందరూ అంటారు కొంచెం మాకు కూడా రుచి చూపించవచ్చు కదా అని అన్నాడు శివ.
అప్పుడే హనీషా వచ్చింది, తనని చూడగానే శివకి కథ మొత్తం అర్ధం అయింది.
ముందే చెప్పవచ్చు కదా రా, నోటి దూల. హలీమ్ తినిపిస్తావు అనుకోని వచ్చా, నన్నే హలీమ్ చేయడానికి తీసుకువస్తావు అనుకోలేదు అన్నాడు శివ.
ముందే చెప్తే నువ్వు రావు కదా అందుకే చెప్పలే అని చెప్పా.
ఇంతకీ అసలు కథ తెలిస్తే మనల్ని వదులుతారు అని అడిగాడు శివ.
ఇక మీద నువ్వు ఏమైనా మాట్లాడితే అస్సలు వదలరు, ఇక్కడనుంచి నేను మాట్లాడుతా నువ్వు చూస్తూ ఉండు చాలు అనిచెప్పి నేను మాట్లాడడం మొదలుపెట్టాను.
అంకుల్ నా పేరు కార్తీక్, ముక్కుసూటిగా చెప్పేస్తా.
నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాం అని చెప్పా.
అది వినగానే అంకుల్ కొంచెం కోపం వచ్చింది, అది సర్వసాధారణం...
ఎవరో తెలియని ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చి అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుందో అందరికి బాగా తెలుసు. అదే కోపం తనలో చూసాను,
అందులో "న్యాయం ఉందొ లేదో నాకు తెలియదు కానీ నాన్న ప్రేమ మాత్రం చాలా ఉంది". .
తను కూడా ప్రేమించింది కాబట్టి ప్రశాంతంగా మాట్లాడటం మొదలు పెట్టారు.
తనకి, నాకు పెళ్ళి చేయడం ఇష్టం లేదు అని అంకుల్ చెప్పలేదు. తనకి ఎప్పడు పెళ్లి చేయాలో నాకు తెలుసు, ఇప్పుడే పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. .
ప్రేమించిన అమ్మాయి ఇంటికి వచ్చి ఇలా అడిగే సమర్ధత నీకు ఉందేమో కానీ, ప్రేమించాను అనగానే ఎవరికీ పడితే వారికీ ఇచ్చి పెళ్లి చేసే ధైర్యం, పరిణితి, ఆలోచన నాకు లేదు అన్నారు.
దానికి అర్ధం నాకు అర్ధం అయింది.
మీ అమ్మాయి నన్ను ప్రేమించడం మీకు ఇష్టం లేదా? లేదా మా ఇద్దరి మతాలు వేరు అని ఆలా చెప్తున్నారా అని అడిగా ?
మతం కారణం అయితే నువ్వు ప్రేమించాను అని చెప్పగానే బయటకి పంపించే వాడిని. ఆడపిల్ల తండ్రిని బాబు మాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఇలా ఒకరు వచ్చి అమ్మాయిని అడిగితే ఎవరు మాత్రం సరే అంటారు.
* (నేను ఆ ప్రశ్న కావాలనే అడిగాను, ఆ సమాధానంతో అంకుల్ కి మతంతో పెద్ద ఇబ్బంది లేదు, తన కూతురి సంతోషమే ముఖ్యం అని నాకు తెలిసింది. మిగిలింది రెండోది.. అది నమ్మకం..)
మీకు ఒక విషయం చెప్పాలి అంకుల్. మీ అమ్మాయిని ఒక విషయం అడిగా. ఏంటంటే
ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే ఎం చేద్దాం అని? దానికి మీ అమ్మాయి ఏమి ఆందో తెలుసా??
మా నాన్న ఒప్పుకుంటూనే మన పెళ్లి, ఒప్పుకునే దాకా వెయిట్ చేద్దాం అంది. మీ అమ్మాయి మీ మాటకి అంత విలువ ఇస్తుంది, దానికి కారణం మీరు తనని ఎలా పెంచారు, చూసుకున్నారు అనేది తెలుస్తుంది, మీరు తన ఇష్టాలకి ఎంతో విలువ ఇస్తారు అని తెలుస్తుంది అని చెప్పాను
సరే సార్ ఒకవేళ మీకు నచ్చినవాడే, మీ బంధువునే ఇచ్చి పెళ్ళిచేసారు.. చేసిన తరువాత వాడు మంచివాడు కాకపోతే, మంచిగా చేసుకోకపోతే, ముఖ్యంగా మీ అమ్మాయిని అర్ధం చేసుకోకపోతే.. ఆ తప్పుని మీరు సరిద్దిదుకోగలరా?? లేరు.
అంకుల్ మీరైనా మీ కూతురి కోసం ఏంచేస్తారు ? మంచి భర్త రావాలి, తనని బాగా చూసుకోవాలి, తను సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు, మంచి ఉద్యోగం చేస్తుండాలి అనేకదా ఆలోచించేది.
ఆ మాటలకి అంకుల్ కొంచెం Convince అయ్యారు.
మీ అమ్మాయి నాతో సంతోషంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను, తను కూడా నమ్ముతుంది.
మేము కూడా నమ్మాలి కదా, నువ్వు మంచివాడివి అని నేను ఎలా నమ్మాలి అని అడిగారు అంకుల్ ?
మీరు చెప్పింది కూడా కరెక్టే.. నా గురించి తెలుసుకోండి... మీకు నచ్చినతరువాతే, మిమ్మల్ని ఒప్పించాకే మేము పెళ్లి చేసుకుంటాము.. లేకపోతే లేదు.
నేను మంచివాడిని కాదు. మీ అమ్మాయి నాతో సంతోషంగా ఉండలేదు అని చెప్పండి ఇంకోసారి మీ అమ్మాయి దగ్గరికి కూడా రాను.
కానీ నా గురించి తెలుసుకోవడం గురించి మీరు ఎక్కువ కష్టపడకండి..
"నేను నచ్చిన వారు నా గురించి మంచిగా చెపుతారు, నచ్చని వారు చెడుగా చెప్తారు.. నేను ఎలాంటి వాడిని అని తెలుసుకునే ప్రశ్నకి సమాధానం మాత్రం మీ లోపలే, మీ దగ్గరే ఉంది... దాన్ని అడగండి... అది తప్పుగా చెప్పదు.. “ ఆ నమ్మకం నాకు ఉంది
అంకుల్ కొంచెం ఇంప్రెస్స్(Impress) అయ్యారు..
సరే ఇంతకీ నువ్వు ఏమి చేస్తుంటావు అని అడిగారు??
ఇంతకీ నేను ఏమి చేస్తుంటానో చెప్పలేదు కదా మీకు కూడా …నేను ఇండియన్ ఆర్మీ కి సెలెక్ట్ అయ్యాను, మరి కొన్ని రోజుల్లోనే జాయినింగ్ ఉంది.
Part 2 is Coming….
మతాన్ని పక్కకి పెట్టి పిల్లల సంతోషాన్ని కోరుకునే పెద్దలు చాలా మంది ఉన్నారు, వారినే మనమే అర్ధం చేసుకోవాలి. వారికీ కావలసింది కేవలం ఒక నమ్మకం.
Under the Sky,Heaven We are All One Family.. Only People are Different.. _Bruce Lee