నెవెర్ జడ్జ్ ఎ ఉమెన్_6
నెవెర్ జడ్జ్ ఎ ఉమెన్_6
రష్యాన్స్ లోపలి రావడం గమనిస్తాడు సుభాష్. మానస, మౌనికని పైకి వెళ్ళమని చెప్తాడు. ఒకవేళ ఇక్కడ ఏమైనా జరిగితే క్షణం కూడా ఆలోచించకుండా మీడియాకి Proofs పంపు, లేదంటే అంతా వృధా అవుతుంది అని చెప్తాడు సుభాష్ మౌనికకి.
లోపలికి రావడం రావడమే సుభాష్, హేమంతల మీద కాల్పులు జరిపారు. సుభాష్ కూడా వాళ్ళ మీద కాల్పులు జరిపారు.
వాళ్ళు నలుగురు, వీళ్ళు ఇద్దరు అయినా ఆధిపత్యం సుభాష్ వైపే ఉంది. ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోతున్నాయి. కానీ ఎవరు చనిపోలేదు.
అందులో ఒకడు మ్యాగజిన్ లోడ్ చేసేది గమనించి వాడిని చాలా చాకచక్యంతో కాళ్ళ దగ్గర కాల్చి, తరువాత చంపేస్తాడు సుభాష్. అక్కడితో అందరి దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. కానీ ఇప్పుడే లోడ్ చేసిన గన్ మాత్రం అందరూ మర్చిపోతారు.
వాళ్ళు ముగ్గురు ఇంకా చేతులతోనే చంపేస్తాం అన్న నమ్మకంతో సుభాష్, హేమంత్ వైపు పరిగెత్తి వచ్చారు. వాళ్ళ ముఠా నాయకుడు Andrew కూడా చాలా మంచి యుద్ధ నైపుణ్యుడు.
సాక్ష్యాల కోసం పైకి వెళ్తున్న మిగితా ఇద్దరిని గమనించి వాళ్ళని సుభాష్ చంపేస్తాడు. అప్పటికే హేమంత్ కి దెబ్బలు గట్టిగా తగిలాయి.
మిగిలిన ఇద్దరు బాగా కొట్టుకున్నారు. అప్పుడే గన్ వైపు చూస్తారు ఇద్దరు సుభాష్ ని గట్టిగా కొట్టి గన్ వైపు వెళ్తాడు, గన్ తీసుకొని సుభాష్ వైపు గురిపెడుతూ ఉండగా !!!
అతని ముఖం మీద గట్టిగా ఒకరు కాలితో కొట్టారు, తరువాత ఇంకో దెబ్బకి వాడు కింద పడిపోయాడు. అది ఎవరో కాదు మౌనిక. తను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది ఆత్మ రక్షణ కోసం ముంబయి లో ఉన్నప్పుడు.
వెంటనే గన్ తీసి వాడిని కాల్చబోయింది మౌనిక. వెంటనే సుభాష్ ఆపాడు. వాడితో మనకి ఒక చిన్న పని మిగిలి ఉంది అని చెప్తాడు.
వాడితో వాళ్ళ బాస్ దిమిత్రి కి ఫోన్ చూపిస్తాడు, చేపించి వాళ్ళని చంపేసాను, సాక్ష్యాలు నాశనం చేశాను అని చెప్పిపిస్తాడు. అది చెప్పగానే వాడిని కాల్చేస్తాడు.
శత్రువుని కూడా క్షమించడం క్షమాగుణం, గొప్పతనం అవతుందేమో, కానీ అదే శత్రువు వల్ల భవిష్యత్తులో కొన్ని ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా వదిలేస్తే మన ఆత్మ సాక్షిని చంపుకోవడమే అవుతుంది. అందుకే వాడిని చంపేసాడు
వీళ్ళు చనిపోయారు అని రేపు 11 వరకు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే దిమిత్రి జాగ్రత్త పడుతాడు అని సుభాష్ కి తెలుసు. దానికి కూడా సుభాష్ ఒక ఐడియా చెప్పాడు. తెలిసిన పోలీస్ వారి సహాయం తీసుకున్నాడు హేమంత్
నర్సింగ్ శవం చూసి మానస కళ్ళలో ఒక తెలియని ఆనందం, ఏదో జయించాను అని తన కళ్ళలో కనిపిస్తుంది, ఆ కళ్ళని అలా చూడాలనే ఇలా చేసాడు, అలాంటి వాడికి అలానే జరగాలని అనుకుంటాడు.
హేమంత్, మానసని అక్కడే వదిలి మౌనిక, సుభాష్ ఇద్దరు ఢిల్లీకి బయలుదేరారు.
హెలికాప్టర్ లో ఉండగా సుభాష్ దిమిత్రి గురించి తెలుసుకోవాలి అని అతని గురించి వెతుకుతూ ఉన్నాడు.
ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే డార్కువెబ్ సరియైనది అనుకుంటాడు. . డార్క్ వెబ్ లో అప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఒకటి తెలుసుకుంటాడు సుభాష్. కానీ ఎవరితో చెప్పాడు. .
ఢిల్లీ చేరుకున్న తర్వాత, డైరెక్టుగా PMO ఆఫీసుకి వెళ్లారు. అక్కడే అభిరామ్ సార్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ సార్ తో పాటు జయరామ్ కూడా ఉన్నాడు.
జయరామ్ ని చూసిన సుభాష్ ఒకవైపు కోపం, మరోవైపు కొంత ఆశ్చర్యం, వీడు ఏంటి ఇక్కడ అని? (సుభాష్ కి జయరామ్ ఎవరో ముందే తెలుసు, కానీ హేమంత్, జయరామ్ మధ్య జరిగిన సంఘటన మాత్రమే అభిరామ్ చెప్తే తెలుసు అంతే )
అభిరామ్: మనకి ఈ సమయంలో జయరామ్ మాత్రమే సహాయం చేయగలడు లేదుఅంటే రెండు రోజులు అయినా పడుతుంది అప్పోయింట్మెంట్ కావాలి అంటే.
సుభాష్ కొంచెం కోపంగానే ఉంటాడు, అది జయరామ్ గమనిస్తాడు.
జయరామ్: నాకు హేమంత్ కి మధ్య చిన్న చిన్న తగువులు జరిగాయి, ఎప్పుడో తనే గెలిచాడు అనుకో..
అతను సైన్యంలో పొందే గౌరవమే నేను కూడా పొందాలి అనుకున్న, అందుకే ఎప్పుడు అతణ్ణి ఓడించాలి అనుకున్న.
"అతని మీద గెలవాలి అనే కోరిక తప్ప, అతణ్ణి చంపాలి అనుకునే అంత పగ ఐతే మా ఇద్దరి మధ్య లేదు, ఇద్దరి సైనికుల మధ్య అది ఎప్పటికి రాదు”.
అభిరామ్: జయరామ్ నన్ను కలిసాడు, మేము హైదరాబాద్ వచ్చే ముందురోజు హేమంత్, జయరామ్ కలిశారు. వాళ్ళ మధ్య ఏమి జరిగిందో తెలుసా?
హేమంత్, జయరాంతో అన్ని గొడవలకి ఒక ముగింపు ఇవ్వాలి అనుకోని అతని దగ్గరికి వెళ్ళాడు. జయరామ్ అతన్ని చూసినా చూడనట్టు ఉన్నాడు.
హేమంత్: "దేశం ఇద్దరం కలిసి ఎన్నో మిస్సిన్స్(missions) కలిసి చేసాం, ఎంతో మంది శత్రువులని చంపాం. మన మధ్యలో ఉన్న ఈ విబేధాలని చంపలేమా"?
మన ఇద్దరి మధ్య వైరం వల్ల మన పక్కనే ఉండే సైనికులకి ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఇప్పటి వరకు జరిగిన వాటికీ నన్ను క్షమించు !!
ఆ మాట వినగానే జయరామ్ అన్నిపక్కకు పెట్టాడు.
జయరాం: ఇన్ని రోజులు నేను చేసింది పక్కకి పెట్టి, నన్ను స్నేహితుడిలా అంగీకరించావు
"నీ లాంటి ఒక గొప్ప సైనికుడిపై ఇన్ని రోజులు పైచేయి సాధించాలని చూసా, కానీ నీలాంటి సైనికుడిలా నేను ఎప్పటికి కాలేను అని నాకు ఇప్పుడే అర్ధమవుతుంది, కనీసం నీకు ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉండిపోతే . ". నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను
హేమంత్: గెలుపు, ఓటమి అవి రెండు శత్రువులు, ప్రత్యర్థుల మధ్య ఉంటాయి, దేశం కోసం ప్రాణమిచ్చే ఇద్దరు సైనికుల మధ్య కాదు మిత్రమా !!!
అక్కడితో ఇద్దరి మధ్య ఉన్న వైరానికి హేమంత్ ఒక ముగింపు చెప్పాడు.
అది విన్న సుభాష్, మౌనిక కొంచెం బాధపడతాడు.
మెల్లగా జయరామ్ దగ్గరికి వెళ్లి
సుభాష్: మీకో విషయం చెప్పాలి, మీరు చాలా అదృష్టవంతులు.
జయరామ్:దేనికి ?
సుభాష్: హేమంత్ సార్ చావుకి కారణం నువ్వు కాదు అని నాకు తెలుసు, కానీ హేమంత్ సార్ ని ఇబ్బంది పెట్టినందుకు నీకు మంచి గుణపాఠం చెప్పాలి అనుకున్న , మీరు ఇది చెప్పకపోతే కదా ఇంకోలా ఉండేది .
జయరాం: వీడు హేమంత్ కన్నా చాలా ప్రమాదకరంగా ఉన్నాడు.
సుభాష్ కళ్ళలో జయరాంకి.. హేమంత్ కళ్ళలో కనిపించే అదే పొగరు,దేశభక్తి కనిపించింది.
అక్కడికి "అబ్దుల్ వాళ్ళ అమ్మ,నాన్న కూడా వస్తారు”.
అబ్దుల్ మద్యం మత్తులో ఆక్సిడెంట్ చేసి చనిపోయాడు అని తెలిసినప్పట్టి నుంచి వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తున్నారో సుభాష్ తెలుసుకుంటాడు.
అందుకే వాళ్ళని పిలిపించి, వాళ్ళకి జరిగింది అంతా చెప్పి వాళ్ళ ముందే సాక్ష్యాలు ఇవ్వాలి అనుకున్నారు.
వాళ్ళు అడిగింది ఒక్కటే
"నా కొడుకు ఈ దేశం కోసం మరణించాడు, దానికి వాళ్ళు విలువ లేకుండా చేసారు, వాడి చావుకి ఒక అర్ధం ఇవ్వండి, వాడిని ఒక మంచి సైనికుడు అని ఈ దేశం గుర్తిస్తే అది చాలు. ఒక తల్లిగా నేను కోరుకునేది అది ఒక్కటే"
తను ప్రతీకారం కోరుకుంటుంది అనుకున్నాను, అబ్దుల్ మరణం దేశానికి అంకితం కావాలి అని వాళ్ళు అనుకున్నారు.
అబ్దుల్ మరణించిన తరువాత వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చే ఏ సహకారాన్ని స్వీకరించలేదు. అందుకే వారికి సహాయం చేద్దాం అని వారికీ ఒక చెక్ ఇచ్చాడు సుభాష్. కానీ దాన్ని వాళ్ళు తిరస్కరించారు.
ఎందుకంటే వాళ్ళు కోరుకునేది మా సహాయం కాదు.. సమాధానం,న్యాయం .. ఆ సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది.
అభిరామ్: మీ కొడుకు ఆర్మీ కి జరిగే అతి ప్రమాదాన్ని గుర్తు పట్టిన మొదటి వ్యక్తి. అతని వల్లనే ఈ రోజు చాలా పెద్ద స్కాం బయటకి వచ్చింది.
మీ కొడుకు ఆర్మీ కి చాలా గర్వకారం. అతనికి దక్కవలసిన గౌరవం కచ్చితంగా దక్కేలా చూస్తాం.
మీ కొడుకు మరణం వెనుకున్న అందరిని మేము కనుక్కున్నాం. వారిని శిక్షించే బాధ్యత మాది, మీకు న్యాయం జరిగేలా చూస్తాను అమ్మ.
అబ్దుల్ అమ్మ: నేను ఎప్పుడు నమ్మకం వొదులుకోలేదు.. నా కొడుకు మరణించిన తరువాత హేమంత్ సార్ మా దగ్గరికి వచ్చి మాట్లాడాడు, అప్పుడే మాకు నమ్మకం ఏర్పడింది కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది.
అభిరామ్(బాధతో): మీకు న్యాయం చేస్తా అన్న సార్ కూడా ఇప్పుడు లేరు అమ్మ. కానీ న్యాయం జరిగేలా మాత్రం తను చేసాడు.
బాధపడిన, చేయవల్సిన అతి ముఖ్యమైన కార్యం కోసం ముందడుగు వేశారు.
అక్కడితో అభిరామ్, మౌనిక, సుభాష్ ముగ్గురు కలిసి ప్రధాన మంత్రికి స్వయంగా సాక్ష్యాలు ఇస్తారు.
ఒప్పందం సంతకం పెట్టడానికి వెళ్ళవలసిన సార్, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వారెంట్ మీద సంతకం చేసారు. .
అప్పటికే ఆర్మీ అధికారులు, ప్రధాన మంత్రి కోసం ఎదురు చూస్తున్న దిమిత్రి, మంత్రి దివాకర్ మీటింగ్ హాల్లో ఉంటారు.
సుభాష్ ఒక్కడే వాళ్ళని వెళ్లి కలుస్తాడు. సుభాష్ ని చూసి దివాకర్, దిమిత్రి కి ఇతనే సుభాష్ అని చెప్తాడు.
సుభాష్ అతని చేతిని గమనిస్తాడు అందులో ఏదో మాములుగా లేదు అని అర్ధం అవుతుంది. కరచాలనం(Shake Hands) ఇస్తాడు. అప్పుడే ఒక విషయం అర్ధం అవుతుంది.
దిమిత్రి: హేమంత్ మరణవార్త ఇప్పుడే చెప్తే వింటున్నాను, నన్ను క్షమించు, చాలా మంచి ఆఫీసర్. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
సుభాష్: కచ్చితంగా శాంతి కలుగుతుంది. మన గురించి ఎవరికీ తెలియని విషయం, మనం ఎవరికైతే అస్సలు తెలియద్దు అనుకుంటామో వారికే తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?
దిమిత్రికి ఏమి అర్ధం కాలేదు
సుభాష్: దిమిత్రి, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇండియా జైల్లో ఉన్నావా?
దిమిత్రి: లేదు, అయినా నేను ఎందుకు వెళ్తాను జైలోలోకి ?
అప్పుడే న్యూస్ ప్లే చేస్తాడు. అతని మనుషులు చనిపోయిన న్యూస్ వస్తుంది. అప్పటివరకు ఆ న్యూస్ బయటకి రాకుండా చేసాడు సుభాష్. ఎమ్మెల్యే వీరోచిత పోరాటం అని చెప్తారు.
సుభాష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులని కాపాడే ప్రయత్నంలో మరణించాడు అని వార్తలు చెప్తారు. సుభాష్ చేపిస్తాడు ఆలా !!
సుభాష్: ఎందుకంటే నువ్వు వెళ్ళేది ఇప్పుడే అక్కడికే.
చుట్టూ పోలీస్ వారు, ఆర్మీ వారు. ఇద్దరిని అరెస్ట్ చేసారు. అక్కడ ఏమి చేయలేము అని అర్ధం అవుతుంది దిమిత్రికి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళకి సహకరిస్తారు. ఒక స్పెషల్ ఆర్మీ Van లో తీసుకువెళ్లారు.
ప్రధాన మంత్రి వారందరిని మెచ్చుకుంటాడు. మౌనిక చేసిన సాహసాన్ని చాలా గొప్పది అని చెప్పారు. అలాగే హేమంత్ సార్ చేసిన త్యాగం ఎప్పటికి మరువలేనిది అని చెప్తాడు .
అక్కడి నుంచి బయటకి వచ్చిన సుభాష్ మదిలో వేరే ఒక ఆలోచన ఉంటుంది. అది గమించిన అభిరామ్ ఏమైంది అని అడుగుతాడు.
సుభాష్: ఇప్పుడు కచ్చితంగా దిమిత్రి మనుషులు వెళ్లే దారిలో వాడిని విడిపించడానికి ప్రయత్నాo చేస్తారు.
దానికి వేరే ప్లాన్ వేస్తాడు సుభాష్.
అభిరామ్: నిన్ను చూస్తుంటే నువ్వు కూడా హేమంత్ లాగానే తయారు అవుతున్నావ్ అనిపిస్తుంది నాకు??.
సుభాష్: హేమంత్ సార్ లాగా ఎవరు ఉండలేరు, ఎవరు కాలేరు. నేను ఎప్పుడు సార్ కి ఒక భక్తుడినే.
అనుకున్నట్టుగానే దిమిత్రి వెళ్లే దారిలో ఎటాక్ ప్లాన్ చేశారు. దాని వల్ల ప్రజలకి ప్రమాదం అని, వేరే దారి లో నుంచి తీసుకొని వెళ్తారు.
అంతా అడవి మార్గం. చుట్టూ చిన్న, చిన్న, కొండలు కూడా. అప్పటికే ఆ దారిని ఎవరికీ తెలియకుండా ఒక టీంని పరీక్షించమని సుభాష్ పంపిస్తాడు. ఒక దగ్గర పది మంది గన్స్ తో, ఒకడు Sniper Rifle తో ఉన్నారు అని తెలుస్తుంది సుభాష్ కి.
Sniper ఉన్నాడు అని వినగానే హేమంత్ సార్ ని షూట్ చేసిన వాళ్ళ మనిషి వీడే అయ్యి ఉంటాడు అనిపిస్తుంది సుభాష్ కి. వాడిని కచ్చితంగా ప్రాణాలతో పట్టుకోవాలి అనుకుంటాడు.
"మన అనుకున్న వాళ్ళ చావుకి కారణం అయినా వాళ్ళు దొరికిన, శిక్షింపబడిన వాళ్ళని చంపినవాడు మాత్రం ఇంకా బయటే ఉన్నాడు అనే మాట ఎవరికీ మాత్రం వినాలి అనిపిస్తుంది".
వాళ్ళకి కొంచెం దూరంలో VAN ఆపేస్తాడు సుభాష్. వాళ్ళకి అనుమానము వచ్చి వాన్ ఉన్న వైపు వస్తూ ఉంటారు. Sniper కూడా కొండా మీద ఉంటాడు.
వెనుక ఉన్న వాన్ డోర్ ఓపెన్ చేసి ఒకడిని తీసుకొని వస్తాడు. వాడిని చూసి మంత్రి కొంచెం కంగారు పడుతాడు.
వాడే(భూపేష్) ఆర్మీ లో జరిగే విషయాలు అన్ని మంత్రికి చేరవేస్తూ ఉన్నాడు. అబ్దుల్, హేమంత్ గురించి చెప్పింది వాడే. అబ్దుల్ టెస్ట్ చేసే దగ్గర ఉన్నవాడే ఇతనే.
సుభాష్: వీడు ఎవడో మీకు బాగా తెలిసి ఉంటుంది? మీ మనిషే.
చేతిలో నుంచి గన్ తీసి కాల్చబోయాడు.
భూపేష్: చంపకండి దయచేసి నన్ను వదిలేయండి సార్.
సుభాష్: "శత్రువు సరిహద్దుల్లో ఉంటేనే వదలం, అలాంటింది మాతోనే, మాలోనే కలిసి ఉంటె ఎలా వదిలేస్తాం “
* హేమంత్ సార్ రూమ్ లో బోర్డు మీద ఉన్న No. 13596. అది భూపేష్ ట్రైనింగ్ బ్యాచ్ ID.
అక్కడే అతన్ని చంపేస్తాడు.
కానీ సుభాష్ వాడిని చంపడానికి కారణం ఇంకోటి వుంది. దిమిత్రి దగ్గర నుంచి హేమంత్ సార్ ని చంపినా షూటర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు. వాళ్ళ దగ్గరకి వెళ్తాడు.
న్యాయంగా ఐతే మిమల్ని జైలకో, కోర్టుకో తీసుకువెళ్లే వాడిని, కానీ మీరు చేసిన అతి పెద్ద తప్పు హేమంత్ సార్ ని చంపడం అందుకే మిమ్మల్ని కూడా నేను చంపేస్తున్నాను.
కచ్చితంగా హేమంత్ సార్ ని చంపినా Sniper ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా ?
దిమిత్రి (చాలా పొగరుగా) : అవును, వాడు నిన్ను కూడా చంపేస్తాడు. (సుభాష్ కి కావాల్సిన సమాచారం వచ్చింది ఇంకా వాళ్లతో పనిలేదు అనుకుంటాడు)
సుభాష్: అది పక్కకి పెట్టు ఇంతకీ మీరు ఎలా చనిపోతారు తెలియదు కధ, టెర్రరిస్ట్ బాంబు వల్ల .
దిమిత్రి: నన్ను చంపితే నువ్వు బతుకుతావు అని అనుకుంటున్నావా? మా వాళ్ళు నిన్ను వదలరు.
సుభాష్: నువ్వే లేకపోతే మీ వాళ్ళు ఏమి చేస్తారు రా?
మంత్రి కాళ్ళ మీద కాలుస్తాడు సుభాష్ మొదట.
దిమిత్రి కి అర్ధం అవుతుంది అంతా!! సుభాష్ కచ్చితంగా చంపేస్తాడు అని. బయపడుతాడు.
దిమిత్రి: అసలు హేమంత్ ని మేము చంపలేదు, మేము చంపడానికి మా Sniperని మాత్రమే పంపాము. కానీ మా వాడు వెళ్లే సరికే ఇంకో sniper Position లో ఉండి కాల్చేశాడు.
సుభాష్ ఒక్కసారిగా గందరగోళానికి గురిఅవుతాడు. వీళ్ళు కాకపోతే ఇంకెవరు? అంతా పెద్ద శత్రువు ఎవరు ?
డోర్ లాక్ చేసి ఏదో ఆలోచిస్తూ బయటకి వచ్చాడు హేమంత్ , అప్పుడే దిమిత్రి మనుషులు ఎటాక్ చేసారు.
బయటకు వచ్చిన సుభాష్, ఆ Sniper సార్ ని కాల్చకపోయిన, కాల్చిన వాడిని చూసి ఉంటాడు కాబట్టి వాడిని పట్టుకోవాలి అనుకుంటాడు, బయటకి వచ్చి అతను ఉన్న కొండ వైపు చూస్తూ ఉన్నాడు.
Sniper సుభాష్ గుండెల మీద కాలుస్తాడు, కింద పడిపోతాడు కానీ బులెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడం వలన చిన్న గాయం మాత్రం అవుతుంది.
ఇలా జరుగుతుంది అని ముందే గమనించి ఒక టీంని అక్కడే ఫారెస్టులో ఉంచాడు. జయరామ్ కూడా ఉన్నాడు Sniper Position.
ఆ గాయం పెద్దగా నొప్పి అనిపించలేదు సుభాష్ కి, వెంటనే తేరుకున్నాడు
సుభాష్: జయరామ్ సార్, నాకు ఆ Sniper ప్రాణాలతో కావాలి, వాడి భుజాల మీద లేదా కాళ్ళ మీద షూట్ చేయండి, ప్రాణాలు మాత్రం పోకూడదు.
కానీ అనుకోకుండా జయరాం కాల్చిన బుల్లెట్ గుండెకి తగిలి వాడు చనిపోతాడు.
అక్కడ ఉన్నవారిని అందరిని చంపేస్తారు, సుభాష్ మరియు అతని టీం కలిసి, టీంలో ఒక్కరికి కూడా ఏమి కాలేదు.
సుభాష్ దిమిత్రి దగ్గరికి వెళ్లి: Sniper చనిపోయాడు…. అయినా నువ్వు చెప్పేది నిజం అని నేను ఎలా నమ్మాలి??
దిమిత్రి: మా Sniper ఉపయోగించిన Rifle .12.7×108mm (.50 Russian) . రేంజ్ 1500-2500m.
కానీ మీ సార్ కి తగిలింది .300 Winchester Magnum, Range 800-1200m . బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉంటె బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి.
నీ జాకెట్ నాసిరకం కాదు, మంచి నాణ్యత కలిగింది. మాములు జాకెట్ ఐతే కచ్చితంగా ఆపలేదు, లేకపోతే ఆ Rifle కాలిబర్ కి కచ్చితంగా చనిపోయివుండే వాడివి నువ్వు!!
కావాలంటే ఇంకా నీ దగ్గర హేమంత్ కి తగిలిన బుల్లెట్ కి సంబంధించిన వివరాలు ఉండే ఉంటాయి వెళ్లి చూసుకో.
సుభాష్ : మీ Shooter Position నుంచి కాల్చాడు అంటే ఆ Shooter, Sniper Rifle Maximum రేంజ్ కన్నా వెనుక ఉండి కాల్చాడు, జాకెట్ ఉంటె కచ్చితంగా ఏమి అయుండేది కాదు. ఎందుకు చేసాడు?
దిమిత్రి: ఒకటి వాడి మీద వాడికి నమ్మకం ఎక్కువుగా ఉండాలి, లేదా వాడికి దాని గురించి పెద్దగా తెలియకపోయి ఉండవచ్చు.
సుభాష్: లేదు హేమంత్ సార్ ని చంపి, ఎవరికైనా అనుమానం వస్తే మీరు ఇరుక్కోవాలి అని చేసి ఉండవచ్చు.. ఇంకోటి హేమంత్ sir జాకెట్ వేసుకోడు అని వాడికి బాగా తెలిసి ఉండాలి . బుల్లెట్ తగిలితే సరిపోతుంది అనుకున్నాడు.
సుభాష్ దిమిత్రి చెప్పింది నమ్ముతాడు.
సుభాష్: నాకు నువ్వు చాలా నిజాలు చెప్పావ్ నేను కూడా నీకు ఒక నిజం చెప్తా అని ఒక విషయం చెప్తాడు.
అది విన్న దిమిత్రి ఏదో జరగరానిది జరిగిపోయింది అని మొఖం పెట్టాడు. తన భయానికి అవధులు లేవు ఆ సమయంలో.
తను ఆ షాక్ నుంచి కోలుకునే లోపే సుభాష్ బయటకి రావడం. బాంబు ఆన్ చేయడం, పేల్చడం సమయానికి జరిగిపోయాయి.
ఇంతకీ హేమంత్ సార్ ని ఎవరు చంపారు అని ఆలోచిస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. దిమిత్రి గురించి ఎవరికీ తెలియని నిజం ఏమిటి??
Lot More Coming……
Moral: "చీకటికి ఉన్న గొప్ప గుణం నువ్వు భయపడితే నీ భయాలని చూపిస్తుంది, నువ్వు నిలబడితే నీ బలం అవుతుంది"
"శత్రువు సరిహద్దుల్లో ఉంటేనే వదలం, అలాంటింది మాతోనే, మాలోనే కలిసి ఉంటె ఎలా వదిలేస్తాం “
" గెలుపు, ఓటమి అవి రెండు శత్రువులు, ప్రత్యర్థుల మధ్య ఉంటాయి, దేశం కోసం ప్రాణమిచ్చే ఇద్దరు సైనికుల మధ్య కాదు మిత్రమా" !!!