gowthami ch

Drama

3  

gowthami ch

Drama

థాంక్యూ నాన్న

థాంక్యూ నాన్న

3 mins
423


ఆదిత్య మరియు ప్రేమ ఒకరినొకరు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గా ఇష్టపడ్డారు. రోజు కాలేజీ కి వెళ్ళేటప్పుడు వీధి చివరి లో అతనితో కలిసి బైక్ మీద వెళ్లి మరలా కాలేజీకి కొంచెం దూరంలో దిగిపోయి ఏమీ తెలియనట్లుగా కాలేజీ లోకి వెళ్లిపోయేది. మొహానికి స్కార్ఫ్ కట్టుకోవడంవల్ల ఎవరూ గుర్తుపట్టేవారు కూడా కాదు. ఇలా కాలేజీ కి వెళ్ళేటప్పుడు , తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అలానే చేస్థూ వచ్చారు. 

అన్ని రోజులూ ఒకలానే ఉండవు కదా! కొంతకాలం గడిచిన తరువాత , ఒకరోజు ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తుండగా ప్రేమ వాళ్ళ నాన్న చూసాడు. స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల ఫేస్ కనిపెట్టలేకపోయాడు కానీ బట్టలు , చెప్పులు చూసి వాళ్ళ అమ్మాయే అని అనుమానం వచ్చి కొంచెం దూరం ఫాలో అయ్యాడు. 

కొంతసేపటికి బైక్ పక్కన పెట్టి ఇద్దరూ పార్క్ లోకి వెళ్తుండగా అమ్మాయి స్కార్ఫ్ జారిపోవడంతో ,తీసి మరలా సరిచేసుకొనే సమయంలో వాళ్ళ నాన్న చూసేసాడు. 

ఎక్కడ ఉన్నాము అనే ఆలోచన కూడా లేకుండా చెంప చెల్లు మనిపించి ఆ అబ్బాయి వైపు కోపంగా చూసి కూతురి చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయాడు.

ఇంటికి వచ్చిన వెంటనే భార్యని పిలిచి జరిగినదంతా వివరించి "దీనిని రేపటి నుండి ఇంట్లో నుండి బయటకి పంపకు. కాలేజీ కి కూడా , ఇంత వరకు చదివి ఉద్ధరించింది చాలు అని," ప్రేమ సమాధానం కూడా వినకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు.

"ఎంత పని చేసావే! ఎంత ప్రేమగా చూసుకున్నామే నిన్ను. మమ్మల్నే మోసం చేస్తావా! అని అరిచి లోపలికి వెళ్లిపోయింది" ప్రేమ వాళ్ళ అమ్మ. 

ఎన్ని రోజులైనా కూడా వాళ్ళ నాన్న ప్రేమతో మాట్లాడలేదు. అసలు జరిగింది ఏంటో కూడా తెలుసుకోవాలి అనుకోలేదు.

ఆదిత్య ని తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ప్రేమ. ఇల్లంతా నిశ్శబ్దం తాండవించింది. ఇలా అయితే కష్టం అని ఒకరోజు ప్రేమ వాళ్ళ అమ్మ , ప్రేమ వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి ఎన్ని రోజులని మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. మౌనం అన్ని ప్రశ్నలకి పరిష్కారం కాదు. కొన్ని సమస్యలు పరిష్కారించాలంటే చర్చించుకోవడం ఉత్తమం . అసలు ఏం జరిగిందో తెలుసుకోండి ముందు. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి ఒప్పించింది.

తరువాతి రోజు ప్రేమ వాళ్ళ నాన్న ప్రేమ దగ్గరకి వెళ్ళి అసలు "విషయం ఏంటి" అని అడిగాడు. అప్పుడు మనసులోని బాధనంత ఒక్కసారిగా బయటపెడుతూ వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చింది.


" అతని పేరు ఆదిత్య నా క్లాస్మెట్ మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఆదిత్య కి నేనంటే ప్రాణం. మా చదువు పూర్తి అయ్యిన తరువాత మంచి ఉద్యోగాలలో సెటిల్ అయిన తరువాత ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకున్న తరువాతే పెళ్లి అని నిర్ణయించుకున్నాం. అందుకే మీతో ఇప్పుడే ఏమి చెప్పలేదు.

"మా ప్రేమ విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు.    మొదట మీకే తెలియాలి అనుకున్నాం. అందుకే ఎవ్వరికీ తెలియకుండా జాగర్త పడ్డాం. మీ పరువు తీసే పనులు నేను ఎప్పుడు చేయను నాన్న. మీ తరువాత మీ అంత ప్రేమ ని తన దగ్గర చూసాను. తనతో ఉంటే మీతో ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అలానే అనిపిస్తుంది. 

"మీరు సరే అంటే ఒకసారి అతనిని ఇంటికి పిలిచి మాట్లాడండి. లేదంటే లేదు ఇంక మీ ఇష్టం." అంది ప్రేమ.

ఇదంతా విన్న ప్రేమ వాళ్ళ నాన్న మనసు చలించిపోయింది. "నా కూతురిని ఎంత అపార్ధం చేసుకున్నాను. నా కూతురికి ఉన్న ముందుచూపుకి ఎంతో గర్వంగా ఉంది. నా పరువు గురించి కూడా ఎంతగా ఆలోచించిందో అలాంటి నా కూతుర్ని నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఇంక ప్రేమ అంటావా ఈరోజుల్లో అది మాములే కానీ ఏంతో మందిలాగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకోకుండా మన అనుమతి తీసుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారంటేనే తెలుస్తుంది. వాళ్ళకి   మనమంటే ఎంత ప్రేమో. ఇంకా నా కూతుర్ని నమ్మకపోతే నా పెంపకం మీదే నాకు నమ్మకం లేనట్లు అని భార్యతో చెప్పి బాధపడ్డాడు."

"అందుకే ముందుగానే చెప్పాను ,ఒక్కసారి అమ్మాయితో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది అని. ఇప్పుడు చూడండి చర్చించడం వల్ల సమస్య ఎంత త్వరగా పరిష్కారమైందో!" అని నవ్వుతూ భర్తని చూసింది.

"అవును , నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు ఇలా చర్చించకుండా ఉంటే ఈ సమస్య ఎప్పటికి తీరేది కాదు. "అని కూతురి వైపు చూసి "సరే ప్రేమ నువ్వు చెప్పిందంతా విన్న తరువాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముందు మీ చదువులు పూర్తి చేయండి. అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిన తరువాత అప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అంత వరకు నీ జగర్తల్లో నువ్వు ఉంటే మంచిది. "

"అది నాకు తెలుసు నాన్న. నేను నీ కూతుర్ని ఎప్పటికి తప్పు చేయను. మీరు చెప్పినట్లే ముందు నా చదువు మీద దృష్టి పెడతాను. థాంక్యూ సో మచ్ నాన్న" అని వాళ్ళ నాన్న ని గట్టిగా హత్తుకుంది. 


Rate this content
Log in

Similar telugu story from Drama