gowthami ch

Drama

3.7  

gowthami ch

Drama

తెలియని దారి

తెలియని దారి

3 mins
324"సుదీర్ ఈరోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను." అన్నాడు శ్రీను.


"ఏంటి రా అది?అడిగాడు సుదీర్."


"ఇంత కాలం ఎంత మంది ఎన్ని సార్లు ఎందుకూ పనికి రాని వాడిని అని తిడుతున్నా భరించాను , సహించాను ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా మా ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటే చాలు అనుకొనే వాడిని.


అటువంటిది ఈరోజు మా నాన్నే నన్ను ఎందుకూ పనికి రానివాడిని అని తిట్టారు. "


"ఎందుకు రా అలా తిట్టారు.?"


"ఈరోజు ఉదయం మా మామయ్య ఇంటికి వచ్చారు. ఆయన నాన్నతో నేను రోజూ క్రికెట్ కి వెళ్లడం అక్కడ బెట్టింగులు కట్టడం చూశారని చెప్పారు.


"రోజూ మీ ఇంటికి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు ఏవో దరఖాస్తులు పంపాలనో లేక ఏవో ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వాలనో చెప్పి బయటకి వస్తున్నాను.


"ఇప్పుడు అది నిజం కాదని తెలిసి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్లిపోయారు. అందుకే ఎలాగైనా నేను పనికిమాలిన వాడిని కాదు అని నిరూపించుకోవాలి అందుకే ఈనిర్ణయం." అంటూ తన నిర్ణయాన్ని తెలిపాడు శ్రీను.


" అయినా! అంకుల్ చేసిన దాంట్లో తప్పేముంది చెప్పు. రోజూ ఉదయం నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా నీ చదువుకోసం ఖర్చుపెట్టారు.


"అదికూడా నువ్వేదో ప్రయోజకుడివి అయ్యి వాళ్ళని ఉద్దరిస్తావని కాదు, కనీసం నీకైనా ఆయన లాంటి గతి పట్టకుండా మంచిగా నీ కాళ్ళమీద నువ్వు నిలబడతావు అన్న ఉద్దేశ్యంతో. కానీ నువ్వేమో ఇలా ఏం పట్టని వాడిలా గాలి తిరుగుళ్లు తిరిగితే ఏ తండ్రికి మాత్రం కోపం రాకుండా ఉంటుంది చెప్పు." అన్నాడు సుదీర్ మందలింపుగా.


"నువ్వు చెప్పేది నిజమే. అయినా, మా నాన్న మీద కోపంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు నా మీద ఉన్న అపనమ్మకాన్ని తుడిచేయాలన్నదే నా ఉద్దేశ్యం అంతేగాని మా నాన్న తిట్టాడన్న కోపంలేదు." అన్నాడు శ్రీను.


"అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకున్న అంత మాత్రాన ఇలా నీకు తెలియని, అనుభవం లేని దారిలో వెళ్లాల్సిన పనిలేదు. నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది." అన్నాడు సుదీర్.


"అలా చేసినా కూడా మీ నాన్న కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకురాబట్టే ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నావు అనే అంటారు. అందుకే నాకు నేనుగా మా నాన్న తో సంబంధం లేకుండా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో ఒకటి సాధించి చూపించాలి."


"అది సరే కానీ నువ్వు అనుకున్న ఈ దారిలో వెళ్ళడానికి నీకు కొంత పెట్టుబడి కావాలి కదా మరి అది ఎలా తెస్తావు?"


"దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మొదట నాకు నేనుగా కొంత డబ్బు సంపాదించిన తరువాత నా వ్యాపారం మొదలుపెడతాను అందుకు గాను మొదట ట్యూషన్లు చెప్తాను."


"ట్యూషన్ లు చెప్తే ఎంత వస్తుంది రా..." అడిగాడు సుదీర్.


"ఎంత వచ్చినా పర్వాలేదు. ఇంక ఎక్కువ రోజులు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడలేను. మొదట ఆ తక్కువ మొత్తంతోనే వ్యాపారం ప్రారంభిస్తాను తరువాత ఆదాయానికి తగ్గట్టు పెంచుకోవచ్చు."


"అయితే మా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు ఒకసారి కనుక్కుని చెప్తాను. "


"అలాగే రా ..చాలా థాంక్స్."


"ఇందులో ఏముందిరా ఒక స్నేహితుడిగా నువ్వు ఎదిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు."


ఇలా కొంత కాలం ట్యూషన్స్ చెప్తు , బయట ఇంకా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బంతా కూడబెట్టుకొని దానితో పాటు తన స్నేహితుల దగ్గర అప్పు చేసి మరికొంత డబ్బు జమ చేసి

మొదట ఒక పాత బస్ ఒకటి కొని దానిని పట్నాలకి ప్రైవేట్ గా తిప్పడం మొదలుపెట్టాడు.


డ్రైవర్ తనే అయ్యి ఆ బస్ ని నడిపాడు. ఇలా అన్నీ మంచి సౌకర్యాలతో తక్కువ ఖర్చుతో , ఎక్కువ లాభాలు ఆశించకుండా ఉండడంతో బస్ ఎప్పుడు జనాలతో నిండిపోయేది. కొద్దీ కాలంలోనే లోన్ తీర్చేసి బస్ తన సొంతం చేసుకున్నాడు.


తనకు తెలియని కొత్త దారిలో అడుగు పెట్టి ఎన్నో రాత్రులు కష్టపడి బస్ నడిపి, సాధించాలని పట్టుదల ఉండి దానికి తగ్గ శ్రమ ఉంటే విజయం మన సొంతం అవుతుంది అని నిరూపించుకున్నాడు శ్రీను.


పండగలు , సెలవు రోజులు అని తేడా లేకుండా అన్ని రోజుల్లో ఒకే ధర అవ్వడంతో తన బస్ ఏరోజూ కాళీగా ఉండేది కాదు. ఇలానే కొంత కాలానికి ఒక 10 బస్ లు నడిపే స్థాయికి ఎదిగాడు.


అయినప్పటికీ తన బస్ టికెట్ ధర ఏమాత్రం పెంచకుండా అలానే కొనసాగిస్తూ ఒక ట్రావెల్ ఏజెన్సీ కి ఓనర్ అయ్యాడు.


ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే ఎంతో ప్రయోజకుడు అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడడమే కాకుండా తనలాంటి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగాడు.


తన కొడుకు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు శీను వాళ్ళ తల్లి తండ్రులు కూడా ఎంతో ఆనందించారు. తెలియని దారిలో అడుగుపెట్టి కష్టపడి ఒక ఉన్నతస్థాయికి ఎదిగిన శ్రీను ని చూసి ఆ ఊరి వాళ్లంతా ఎంతో అభినందించారు. 


Rate this content
Log in

Similar telugu story from Drama