STORYMIRROR

PRINCE Prem kumar

Classics Inspirational Others

5  

PRINCE Prem kumar

Classics Inspirational Others

సనాతన సత్యం

సనాతన సత్యం

1 min
5

హైందవం ఒక మతం కాదు.

అది జీవనశైలి.మతం అంటే అభిప్రాయం

అని అర్థం.

మతాలు వేరైనా దైవం ఒక్కటే అని సనాతన ధర్మం చెబుతోంది

సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం అని అర్థం

పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ

 సనాతన ధర్మ మార్గాలు.

ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు... అందరూ వేర్వేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు.

 కానీ ఉన్నది ఒకటే.. దైవం  . 'ఏకం సత్ విప్రా బహుధా వదంతి' అన్నారు ప్రాజ్ఞులు.

సహనం సనాతన ధర్మమార్గం. దాంట్లో విద్వేషానికి తావు లేదు.

 ఆచారాలు, సంప్రదాయాలు వేరు. అవి కాలానుగుణంగా మారతాయి.

బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, స్త్రీలను బాధించడం... ఇలాంటివన్నీ దురాచారాలు. సాంఘిక సమ స్యలు. ఈ దురాచారాలను సనాతన ధర్మం ఆమోదించదు.

 ప్రతి యుగంలోనూ కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ ప్రపంచానికి

 ఈ సనాతన ధర్మం ఒక నీతిసూత్రంగా

నిలిచింది


మహర్షుల తపఃఫలంగా, వారి దార్శనిక దృక్పథానికి నిదర్శ నంగా మానవజాతికి లభించిన వరం సనాతన ధర్మం.

సత్యం వద, ధర్మం చర మాతృ దేవోభవ,

పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ.... ఇటువంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం.

 ఇవన్నీ శాశ్వత సత్యాలు, కాలానుగుణంగా సంప్రదాయాలు ఆచారాలు మారవచ్చు.

కానీ ధర్మం మారదు.

తల్లిని తండ్రిని గురువును పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా ఆచరించాల్సిందే.

సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి.

 సత్యమే అయినప్ప టికీ కటువుగా చెప్పకూడదు. ప్రియమైన ప్పటికి అసత్యాన్ని పలకకూడదు.

 అదే సనాతన ధర్మం


మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి.

 అలాగే బలహీనులను పీడన నుంచి రక్షించాలి.


భారతీయ సంస్కృతికి హైందవ ధర్మానికి

మూల స్తంభాలుగా నిలబడిన

రామాయణ భారత భాగవతాలు,

 వాటికన్నా పూర్వమే ఉన్న వేదాలు,

వేదాంత సారమైన ఉపనిషత్తులు

పలు సందర్భాల్లో అనేక ధర్మసూక్ష్మాలను ప్రబోధించాయి.


 హైందవ ధర్మాన్ని అనుసరించేవారు

'ఆత్మ వత్సర్వ భూతాని' అనుకుంటూ

 ప్రపంచానికి గొప్ప తేజోమయమైన

 విలువలు అందివ్వాలి.


 మనుషులంతా పాటించాల్సిన సాంఘిక జీవనధర్మంగా, ఇతరు లకు మార్గదర్శకంగా నిలిచింది. మంచిని పెంచాలి.

మానవత్వంతో ఉండాలి.

 ఇదే సనాతన ధర్మం.. ఇదే ఏష ధర్మః సనాతనః



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Classics