STORYMIRROR

Supreme Prem

Romance Classics Inspirational

3  

Supreme Prem

Romance Classics Inspirational

అందమైన బంధం

అందమైన బంధం

2 mins
2

వివాహం ఒక పవిత్రమైన బంధం 
ఆ బంధంలో నిజాయితీ నిబద్ధత ప్రేమ అభిమానాలు చాలా ముఖ్యం
ఆడ, మగ ఇద్దరూ తమ బంధంలో నిజాయితీగా ఉండటమే కాకుండా.. ఓ చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి జీవితం స్వర్గతుల్యం అవుతుంది 
 కొందరు పురుషులు వివాహం చేసుకున్నా.. 
మరొక మహిళతో సహవాసం కావాలనుకుంటారు. 

ఇది వివాహిత జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. 
ఈ సమయంలో స్త్రీ మేల్కొని తన భర్తను సరైన మార్గంలోకి తీసుకురాకపోతే కుటుంబం నాశనం అయినట్టే...
ప్రతిసారి భార్యని అర్థం చేసుకోవాలా అని అడిగితే ఒకింత ఆవిడే అర్థం చేసుకోవాలి
 ఎందుకంటే స్త్రీకి ఉన్న ఓపిక పురుషులకి ఉండదు
అసలు ఎందుకు ఈ పక్క చూపులు...

పాతికేళ్లకే పెళ్లవుతుంది 15 ఏళ్లు మహా అయితే 20 ఏళ్లు కాపురం చేశాక భార్య పైన ఇష్టం తగ్గుతుంది లేదా తగ్గినట్టుగా అనిపిస్తుంది
ఇదే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. 
చిన్న వయస్సులో కెరీర్‌పై దృష్టి సారించే వ్యక్తి 
తన వ్యక్తిగత కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడు. వృత్తిలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. 
ఆ వ్యక్తి తన భార్యపై ఆసక్తి చూపించకపోవచ్చు. వాస్తవానికి పురుషులు తమ కోరికలను బట్టి
స్త్రీల పట్ల ఆకర్షితులవుతారూ 

శృంగారం విషయంలో మీడియా చూపిస్తుంది 
సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఒకటి 
కానీ నాలుగు గోడల మధ్య జరుగుతుంది మరొకటి భారతీయ స్త్రీలు శృంగారం విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరు అనేది చాలామంది వాదన 
ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు సున్నితమైన మనస్తత్వం కావచ్చు 
వాళ్లకి ఏం కావాలో నోరు తెరిచి అడగలేరు 
అలాగని భర్త ఇష్టానికి వ్యతిరేకం చెప్పలేరు
కానీ సోషల్ మీడియా మాత్రం 
ఆడవాళ్లు విచ్చలవిడి శృంగార తత్వాన్ని
కలిగి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది
అది పూర్తిగా అబద్ధం
వైవాహిక సంబంధంలో మానసిక సంబంధంతో పాటు శారీరక సంబంధం కూడా చాలా ముఖ్యం. 
కానీ
 కొన్నిసార్లు శారీరక సంతృప్తి లేనప్పుడు పురుషుడు సహజంగానే మరో స్త్రీ సాంగత్యంలో పడిపోతాడు 
. వైవాహిక బంధంలో శారీరక సంబంధం బాగాలేకపోతే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోవాలి. 
లేదంటే అది అనైతిక సంబంధాలకు
 దారి తీస్తుంది.

భార్యాభర్తల మధ్య ఏర్పడే నమ్మకం..
వారి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది. 
ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే బంధం నిజాయితీగా ఉంటుంది.
భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం ఉంటే,
 అలాగే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం కలిగిస్తే.. వారిరువురి అనైతిక సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. 
ఓ బిడ్డ పుట్టాక అది కనిపించకపోవచ్చు. 
ఆ సమయంలో భార్య తన భర్తపై తక్కువ శ్రద్ధ చూపించవచ్చు. 
భర్త కంటే భార్య బిడ్డకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. అతడు వేరే స్త్రీని ఇష్టపడే అవకాశం ఉంది

భార్యాభర్తలు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతారు. 
కొంతమంది పురుషులైతే తమ భాగస్వామిలో తప్పునే ఎత్తిపొడుస్తుంటారు తప్పితే..
ఆమెలోని మంచిని గ్రహించరు.

అందంగా ఉన్న...
అర్థం చేసుకునే మనసున్న...
అన్ని సమకూర్చి పెడుతున్న కూడా
కొత్తదనం కోసం పరాయి చూపులు చూసే మగలు కూడా ఈ సమాజంలో ఉన్నారు



Rate this content
Log in

Similar telugu story from Romance