STORYMIRROR

Supreme Prem

Drama Action Classics Inspirational

3  

Supreme Prem

Drama Action Classics Inspirational

మహిళా నీకు వందనం

మహిళా నీకు వందనం

2 mins
3

సృష్టికి మూలం స్త్రీ 
సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే.
కానీ స్త్రీ లేని అతడి జీవితం అర్థరహితం. 
మగవారి జీవితంలో మగువ తన ఊపిరి...
మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి
వెలుగునిస్తుంది. 
మగాడికి జన్మ ఇచ్చి
అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి
విజయపథంలో నడిపిస్తుంది.
ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును 
ఇంపుగా సరిదిద్దుతుంది.

ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని
సమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది. 
ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు... ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం
కేవలం మనదేశంలోనే ఉంది. 
గంగానదిని గంగామాత అని,
దేశాన్ని దేశమాత అని, 
భూమిని భూమాత అంటూ... తల్లిగా, స్త్రీ మూర్తిగా
గౌరవించే సంస్కారం భారతీయసంస్కృతికి ప్రత్యేకం.

వేద కాలంనాటి నుంచి మహిళలు అన్నిటిలో
అగ్రస్థానంలో ఉన్నారు.
ఇంటి పెత్తనం నుంచి ఇంటిల్లపాదికీ ఆధారం ఆమే. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం.
ఆనాడు వారూ ఆడవారే.
శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఆడవారే. 

వేదవేత్తలు మంత్రదర్శినులు అయిన మహిళలు చాలామంది ఉన్నారు. 
గార్గి, గోధఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ్, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి మొదలైన వారెందరో... 
ఎందరో వీరనారీమణులు స్వాతంత్య్ర్య ఉద్యమంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. 

అయితే ...
అదంతా గతం
ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఒంటిపైన సక్రమంగా బట్టలు కూడా కట్టుకోలేని స్థితికి ఎదిగారు అనుకుందామా లేక  దిగజారారు అనుకుందామా.. ఎందరో గొప్ప వీరవనితల గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము
ఎందరో గొప్ప మహారాణుల గురించి గర్వంగా చదువుకున్నాము
ఆడదాన్ని ఆదిశక్తి గా పూజించిన 
ఈ పుణ్యభూమిలో ఆడదాన్ని ఒక శృంగార వస్తువుగా చిత్రీకరించి...
అర్ధ నగ్న ప్రదక్షిణలు ఇచ్చే స్థాయికి దిగజారారు అనుకుందామా లేదా ఎదిగారు అనుకుందామా

ప్రపంచ దేశాలు భారతీయ స్త్రీకి గౌరవాన్ని ఇస్తాయి అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు 
కారణం ఈ పుణ్యభూమి గొప్పతనం
ఈ సాంప్రదాయాల గొప్పతనం 
ఈ కట్టు బొట్టు గొప్పదనం 
ఇవి ఎప్పటికీ కూడా ఆడదానికి సంకెళ్లు కాదు
బానిస కాదు 
ఈ సత్యాన్ని గ్రహించిన నాడు
ప్రతి స్త్రీ ఒక దేవత మూర్తినే 

పరిచయం లేని మహిళ ఎదురై ఆమెతో మాట్లాడవలసిన సందర్భం వస్తే 'అమ్మా' అంటూ సంబోధించే ఉత్తమగుణం కేవలం మనదేశంలోనే ఉంది

ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మిక సేవా భావం, త్యాగం, ధీరత్వం వంటి సద్గుణాలు కలిగిన వనితామణులకు కొదవ లేదు. 
అవనిలోనే కాదు-అంతరిక్షంలోనూ వనితామణులు విజయం సాధించారు. 
అందుకే విశ్వమంతా ముక్తకంఠంతో
పలికే ఒకే ఒక్క మాట మగువా నీకు వందనం' అని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



Rate this content
Log in

Similar telugu story from Drama