STORYMIRROR

Supreme Prem

Drama Inspirational Children

4  

Supreme Prem

Drama Inspirational Children

అంగట్లో అమ్మతనం

అంగట్లో అమ్మతనం

1 min
3

సరోగెట్ తల్లి అవడం అంత సులభం కాదు
మానసికంగా శారీరకంగా ఎంత కష్టపడాలి తెలుసా ఎందుకంటే..
నవ మాసాలు ఒక బిడ్డను మోసి
తనతో ఎన్నో అనుభవాలు అనుభూతులు పంచుకొని
కంటికి రెప్పలా కాపాడీ జాగ్రత్తగా చూసుకుని
9 నెలలు గడిచిన తర్వాత ఆ బిడ్డను
వేరొకరి చేతిలో పెట్టి వెళ్లిపోవడం అంటే...
ఒక తల్లి పడే మానసిక క్షోభ ఎంతగా ఉంటుంది

అది మాత్రమే కాకుండా... తను జాగ్రత్తగా మోసే ఆ బిడ్డ
తన బిడ్డ కాదు అని తెలిసినా కూడా 
ఒక తల్లి కాబట్టి ఆ బిడ్డని సంరక్షించడం
బహుశా
ఒక ఆడవారికి మాత్రమే సాధ్యం అనుకుంటా...
నిజానికి సరోగసి విధానం అనగానే అందరూ ఆడవాళ్లు
డబ్బు కోసమే చేస్తున్నారు అని భ్రమపడతారు
నిజమే డబ్బు కోసమే సరోగసి తల్లులుగా మారుతున్నారు
కావచ్చు కానీ
ఒక్క క్షణం ఆలోచిద్దాం 
మన సొంతం కాదని తెలిసి 
మనది కాదు అని తెలిసి కూడా అనుబంధం పెంచుకొని
ఆప్యాయత పంచి జాగ్రత్తగా చూసుకుంటూ 
ఎన్నో జ్ఞాపకాలు మిగులుచుకొని
ఆఖరికి 
ఆ పేగు బంధాన్ని తెంచుకోవడం అంటే 
ఒక తల్లి పడే నరకయాతన మాటల్లో చెప్పగలమా??

పిండంగా కడుపులో పడింది మొదలుకొని
తొమ్మిది నెలలు ఎన్నో బాధలు అనుభవిస్తూ
ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం
ఒక తల్లి బాధ్యత అంటారు నిజమే 
తన బిడ్డ కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది అనే
ఆలోచనకి..... తన బిడ్డ కాదని తెలిసినా కూడా
తన సొంతం ఎప్పటికీ కాదని తెలిసినా కూడా
తను ఒక అద్దె తల్లి
తనది ఒక అద్దె గర్భం తెలిసి కూడా
బాధలు  అనుభవించి ...
కడుపులో ఆ బిడ్డ కదులుతూ ఉంటే మురిసిపోతూ
వాడి భయాన్ని బాధని ఆకలిని గ్రహిస్తూ
ఆ బిడ్డ తో అనుబంధాన్ని పెంచుకొని 
ఆప్యాయత పంచి తొమ్మిది నెలలు గడిచేసరికి
ఆ బిడ్డని వేరొకరి చేతిలో పెట్టి ఆ బంధాన్ని ప్రేమని తెంచుకోవడం అంటే నరకయాతన కాదంటామా???



ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu story from Drama