STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

4  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

సమత మమత

సమత మమత

2 mins
393

జోరు గాలి హోరుగా వర్షం. అప్పుడే బడి నుండి పిల్లలు తడుస్తూ సంతోషం తో ఇళ్లకు వెళుతున్నారు. సమత మమత కవలపిల్లలు. ఇద్దరు +2చదువుతున్నారు. స్కూల్లో వీళ్లిద్దరు చెసే అల్లరి ఇంత అంతా కాదు. ఇద్దరు ఒకే ల ఉండటం వలన అందరిని బలేగా ఆట పట్టించి నేను కాదు అని వాదిస్తారు ఇంటిలో తల్లితండ్రులకు రోజుకొక తలకాయనొప్పిని ఇంటికి తెప్పిస్తారు. ఇలా కాలం గడిచిపోయింది. ఇద్దరు ఒకేకాలేజీ లో చేరితే మనకి రోజు పిర్యాదులే వస్తాయి అని ఒకరిని ఇంజనీరింగు మెకానికల్, ఇంకొకరిని ఇంజనీరింగ్ ఆర్కిటేక్చర్ వేరే వేరే కాలేజీ ల్లో చేర్చారు. ఇద్దరు చాలా బాగా చదువుకుంటున్నారు. అందరికి వచ్చే సమస్యే వీళ్లకి వచ్చింది. అదే ప్రేమ. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఒకే ఇంటి అబ్బాయిలను ప్రేమించారు.ఏంజెనీరింగ్ ముగించుకొని ఇంట్లో తల్లితో ఇద్దరు ఒకేసారి ప్రేమ విషయం చెప్పేసరికి తల్లికి భయం వేసింది. అబ్బాయిలు గురించి విన్న తండ్రి ఒకవేళ ఇద్దరు ఒకరినే ప్రేమించారా అనే సందేహం కల్గింది. వెంటనే తండ్రి మహేష్, రమేష్ లను కలవటానికి వాళ్ళింటికి వెళ్లారు. అక్కడ ఇంకో పెద్ద ఆశ్చర్యం అతనికి ఆ ఇంటిలో వున్నది అతని బాల్య స్నేహితుడు. అంతే ఇద్దరు కలిసి మాట్లాడుతూ వచ్చిన విషయం మరచిపోయారు రామయ్య గారు. సీతయ్య ఎన్నేళ్లకు కలిసామురా దగ్గర దగ్గర 30ఏళ్ళు అయ్యింది. అంటూ ఇంతకీ వచ్చిన విషయం ఏమిటోయ్ అని అడిగారు సీతయ్య. వెంటనే మహేష్ రమేష్ లు ఎవరు అని అడిగారు. మా పిల్లలే నీ లాగే నాకు కవలలు. రా మరచిపోయావా అని అడిగారు. ఇంతలో మహేష్ వచ్చి తన తండ్రితో నాన్న వీరు సమత నాన్నగారు అని చెప్పాడు. శభాష్ రా మా స్నేహం ఇప్పుడు మీ వల్ల వియ్యంకుల బంధం గా మారబోతుంది అంటూ ఒరేయ్ బడవ నాకు సమత మమతలు తెలుసురా కానీ నీ పిల్లలని తెలియదు, వచ్చే వారం లో ఇంటికీబతాంబూలలతో వద్దాం అని అనుకుంటున్నాం ఈ లోపు నువ్వే వచ్చేసావు. చాలా సంతోషం. అంటుఇద్దరు బాల్యం గురించి చర్చిస్తూ కూర్చున్నారు. ఆ పై వారం నిశ్చితార్థం చేసారు, ఆరు నెలల తరువాత పెళ్లి చేసారు అందరు సంతోషంగా వున్నారు 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Fantasy