శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక


ఎప్పుడూ చూడాలనుకునే ప్రదేశానికి అనుకోకుండా వెళ్ళే అవకాశం వచ్చింది.
అహ్మదాబాద్ నుండి కారులో ద్వారకాధీశుడి మందిరం చేరాము. ఆ వెనుక గోమతీ నది.
దర్శనం సులువుగానే దొరికింది.
లైట్ పింక్ బట్టలు చేతిలో వేణువు తలపైన కిరీటం.ఆ రూపం వర్ణించ అనితర సాధ్యం.
బయట భక్తులు రాధే రాధే అని గట్టిగా పిలుస్తున్నారు.
తన పేరుతో కాకుండా రాధ పేరుతో కలిపి తనను పిలిచేవాళ్ళకు వశుడవుతాదట ఈ అల్లరి కృష్ణుడు.
ఎప్పటినుంచో ద్వారకకు వెళ్లి కృష్ణుడిని దర్శించాలన్న కోరిక తీరింది.
రాధే రాధే అనే జపంతో నా మనసులోని భారం తగ్గి అది తేలికపడింది.