Ambica Lakshmi

Drama Horror Tragedy

4.6  

Ambica Lakshmi

Drama Horror Tragedy

రూం నంబర్ 301

రూం నంబర్ 301

3 mins
656


రాత్రి పదకొండు అయింది 


అది మూడో ఫ్లోర్


రూం నంబర్ మూడువందల ఒకటి


వంశీ ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడు చాలా ఆరాటంతో.. ఈ లెవెల్ అసలు అవ్వడం లేదు ఎలా అయిన అవ్వగొట్టాలి 


బాబోయ్ ఈ లెవల్ ఈరోజు అయ్యేలా లేదు ఎంటీ


పొద్దున్న నుంచి ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది దానికి తోడు టీవీ కూడా రావడం లేదు నేను మాత్రం ఎంత సేపు అని క్యాండీ క్రష్ ఆడతాను బాగా బోర్ కొడుతుంది అని అనుకుంటూ హల్ లోనుంచి కిటికీ తెరిచి చూసాడు


నాకు తెలిసినంత వరకు ఈ వర్షం ఇప్పుడప్పుడే ఆగదు అనుకుంటా.


కరెంట్ పోయింది అదేమిటి??అవును పొద్దున్నుంచి కురుస్తున్న వర్షానికి కరెంట్ తీసేసాడు అనుకుంటా అంతే కాకుండా జెనరేటర్ లో పవర్ కూడా అయిపోయినట్లు ఉంది.


కనీసం నా దగ్గర కవ్వోతు కూడా లేదు 


ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నచప్పుడు వినిపించింది 


ఈ సమయంలో ఎవరబ్బా అందులోను కరెంట్ లేదు తెలిసిన వారు కూడా దగ్గరలో లేరు ఎవరోచ్చారు ఇప్పుడు అనుకుంటూ తలుపు తెరిచాడు.


బయట ఒక అమ్మాయి వొళ్ళంతా తడిచిపోయి చేతిలో కవ్వొతు పట్టుకొని వచ్చింది .


మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు


సర్ బయట బాగా వర్షం పడుతుంది నేను లోపలికి రావచ్చా?


వచ్చి ఇలా కూర్చోండి నేను మీకోసం టవల్ తీసుకొని వస్తాను.


అక్కడే సోఫాలో కూర్చుంది


అయిన ఇది అపార్ట్మెంట్ మిమల్ని వాచ్ మెన్ లోనికి రానిచాడా??


అది!! నా రూం నంబర్ మూడువందల ఒకటి నేను ఇక్కడే ఉండేదానిని కాబట్టి నన్ను గుర్తుపట్టి ఉంటాడు..


ఇంత వర్షంలో మీరు ఈ కవ్వోతు ఎలా తెచ్చారు.


నాకు బాగా దాహంగా ఉంది నేను కాస్త నీళ్ళు తాగి వస్తాను అని లేచి నేరుగా వంటగదిలోకి వెళ్లి నీళ్ళు తాగుతుంది.


ఆమె అంతలా తడిసిపోయిన సరే ఆమె కూర్చొని ఉన్న స్థలం మాత్రం చాలా పొడిగా ఉంది.


ఇదేమిటి సోఫా కొద్దిగా కూడా తడిగా లేదు.


ఏవండీ ఇంతకీ మీ పేరు?


నా పేరు వినూత్న.


ఏమిటి పేరు విని సంవత్సరం అయిందా


అంత త్వరగా ఎలా మర్చిపోయారు నన్ను ఈ సమయం కోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా అంటూ మొఖం నిండా రక్తంతో దనదన అడుగులు వేస్తూ అతని వైపుకు వచ్చింది


ఒకసారి ఒక్కే ఒక్కసారి నా మాట వినండి అని ఎంత బ్రతిమిలాడినా దయ దాక్షణ్యాలు లేకుండా కడుపుతో ఉన్న నన్ను చంపేశారు కదా నా బిడ్డ పెట్టే వేదన నాకు ఇంకా వినిపిస్తూనే ఉంది.


వారి పక్కన ఉన్న టీవీలో అసలు జరిగిన సంఘటనలు వేసింది.


ఏవండీ నేను వెళ్లి కూరగాయలు పట్టుకొని వస్తాను.


జాగర్తగా వెళ్లి రా.


వెళ్తున్న దారిలో ఒక పోకిరి వెదవ నేను నిన్ను ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతున్నాను నన్ను ఎందుకని నువ్వు పట్టించుకోవడం లేదు.


తన కాలికి ఉన్న చెప్పును తీసి దవడ పగిలిపోయేలా కొట్టి నీకు నేను ముందుగానే చెప్పా నాకు పెళ్ళి అయిపోయింది అని ఎందుకు నన్ను విసుగిస్తున్నావు అని చెప్పి నాలుగు చివాటులు పెట్టీ అక్కడినుంచి వెళ్ళిపోయింది.


ఈ విషయం ఆయనకి చెప్పితే కంగారు పడతారు లేదా గొడవ పడతారు ఎందుకు లే...


మరుసటి రోజు ఏవండీ నేను మీకు ఒక శుభవార్త చెప్పాలి అని అనుకుంటున్నాను 


ఆగు నేను ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్లాడు ఈలోగా ఆ పోకిరి గాడు వాళ్ళ లాండ్ లైన్ కి ఫోన్ చేసి నేను కింద ఉన్నాను నువ్వు నీ భర్త వెళ్ళిన వెంటనే బ్యాగ్ తీసుకోని వచ్చే ముంబైకి మనకి టికెట్స్ తేసేసాను త్వరగా వచ్చే అని చెప్పి కాల్ కట్ చేసేశాడు.


ఇంకెవరి కోసం చూస్తున్నారు మీకు రాత్రి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను ఇప్పుడు త్వరగా ఆఫీసుకు వెళ్ళండి.


(ఈయనకి రాత్రి రూం మొత్తం బాగా డెకరేట్ చేసిన తరవాత చెప్తాను నేను ప్రిగ్నంట్ అని)


ఎంటి అంత ఆనంద పడుతున్నావు. ఏం లేదు మామూలుగానే.


అయితే నిజం గానే ఇది వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధ పడినట్టు ఉంది నిన్న కూడా చూసా వీళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం చెప్తా దీని పని అని అనుకొని నువ్వు ఎవడితోనో వెళ్ళిపోవడానికి ప్లాన్లో ఉన్నాను అని చెప్పు అంతే కానీ ఏమీ లేదు అని అంటున్నావు ఎందుకు.


నోటికి వచ్చినట్టు వాగకండి 


నిజం తెలిసిపోయే సరికి బాగా నటిస్తున్నావు.


లేదండి నా మాట ఒకసారి వినండి అని ఎంత బ్రతిమిలాడినా వినకుండా పైనుంచి నన్ను తోసేశారు కదా. అంత ముర్కత్వంగా వ్యవహరించిన మీకు ఈ భూమి మీద జీవించే హక్కు లేదు.


అదే కాకుండా నా భర్తకు నేను చేసిన తప్పు గురించి తెలిసిపోతుంది అని భయపడి చచ్చిపోతున్నాను అని లెటర్ రాసి నా సంతకాన్ని మీరే పెట్టేశారు.


అది అంతకన్నా దారుణమైన విషయం కనీసం మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఇంత తప్పు ఎలా చేస్తాను అని ఒక్కసారి కనక మీరు ఆలోచించి ఉంటే మీరు నేను మనకి ఒక పాప మనది మంచి కుటుంబం కింద ఉండేది జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్న నాకు జీవితాన్నే లేకుండా చేసేశారు.


నేను చేసిన పనిని మీకు ముందే చెప్పి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు.


మీకు నా మీద అపారమైన నమ్మకం ఉండి ఉంటాది అని అనుకున్నా గాని ఇంతటి అనుమానం మన మధ్యకి రాదు అనే అనుకున్నా.


ఏది ఏమైనా నన్ను చంపినందుకు కాదు నా బిడ్డని నా మనాభిమనాం మీద దెబ్బ కొట్టినందుకు మీకు నేను కచ్చితంగా శిక్ష వేసి తిరుతాను.


అదేమిటి వినూత్న నువ్వు ఇలా చెయ్యకూడదు నేను నీ భర్తను కదా నన్ను వదిలే నదే తప్పు నన్ను క్షమించవా.


మీరు మర్చిపోయినట్టు ఉన్నారు నన్ను ఇక్కడినుంచి తోసేసినప్పుడు నేను మీ భార్యని అన్న విషయం.


భర్తకు భార్య అంటే అభిమానం ప్రేమ ఉండాలి తప్ప అనుమానం ఉండకూడదు ఆలంటివి ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి అంతే కానీ ఇలా చంపేస్తారా అని తన భర్తను పై నుంచి తోసేసింది.


తొందరపాటుతో చేసినా తెలిసి చేసినా తప్పుకు శిక్ష కచ్చితంగా పడాలి పడి తీరాలి కూడా.


అది మనిషి అయిన దెయ్యం అయిన తనకు జరిగిన నష్టానికి ప్రతీకారం తీసుకోవాలి అలా తీసుకోవడంలో తప్పు లేదు.

అని నా అభిప్రాయం.....



Rate this content
Log in

Similar telugu story from Drama