Meegada Veera bhadra swamy

Drama

3  

Meegada Veera bhadra swamy

Drama

రంగులన్నింటిలోనూ...ఏ రంగు గొప్ప

రంగులన్నింటిలోనూ...ఏ రంగు గొప్ప

2 mins
444


     రంగులన్నింటిలో...ఏ రంగు గొప్ప (నీతికథ)


 ఒకసారి ఏడు రంగుల ఇంద్రధనుస్సులో... రంగుల్లో ఏ రంగు గొప్ప అనే అంశంపై చర్చ వచ్చింది.ఏడు రంగులూ తమ తమ వాదనలు వినిపించి ఏడు రంగుల్లోనేను గొప్ప అంటే నేనే గొప్ప అని గట్టిగా తమ తమ వాదనలు సమర్ధించుకోవడం మొదలు పెట్టాయి. చర్చ వాదనగా మారింది,వాదన వివాదం అయ్యింది,వివాదం గొడవకు దారితీసింది. గొడవ తీవ్రమైన పంతాలు, పట్టింపులకు పోయి ఏడు రంగులూ విడిపోయాయి.


ప్రకృతికి గౌరవాన్ని తెచ్చే హరివిల్లు విడిపోవడం మంచిది కాదు అని హరివిల్లులోని ఏడు రంగుల్ని కలపడానికి పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, నిప్ప, వాయువు సమాలోచనలు చేసి తిరిగి ఏడు రంగుల్ని కలపడానికి ప్రయత్నం చేశాయి.ఏడు రంగులూ రాజీపడటానికి ససేమిరా అంటూ కలిసి వుండటానికి ఇష్టపడలేదు. ఏడురంగుల వివాదం సూర్యదేవుడుకి తెలిసింది, అతను వానదేవుడుకి కబురుచేసి రంగుల మద్య సయోధ్య కుదర్చడానికి ముందు వాటికి గుణపాఠం నేర్పాలని ఆలోచన చేసాడు. ఒక అందాల నెమలిని పిలిచి "రంగులకు గుణపాఠం నేర్పే భాద్యత నీదే " అని ఆదేశించారు ఇద్దరు దేవుళ్ళూ. నెమలి ఏడు రంగుల్నే కాదు అన్ని రంగుల్ని పిలిచి" నాకు ఆనందం కలిగించే రంగుకి 'అందమైన రంగు' బిరుదు ఇస్తాను అని చెప్పింది.

ఏడు రంగులూ విడివిడిగా వచ్చి ఎడమొహం పెడ మొహం అన్నట్లు దూరం దూరంగా వున్నాయి, ఏడు రంగులూ వేరు వేరుగా ముస్తాబయ్యాయి, విడివిడిగానే నాట్యనెమలిముందు వయ్యారాలు ఒలకబోసాయి, నెమలి పెదవి విరిచింది , ఏడు రంగుల్ని కలిసి చెట్ట పట్టాలేసుకొని ఐక్యంగా రమ్మని హితవు పలికింది లేకుంటే అసలు ఏ రంగూ నాకు నచ్చదు అని చెప్పింది. నెమలి మాట కాదనలేక మొక్కుబడిగా ఏడు రంగులూ కలిసాయి అయినా ఎక్కడా సౌందర్యం లేదు.ప్రకృతిని పిలిచి రంగులు అందంగా కనిపించక పోవడానికి కారణం అడిగింది నెమలి , ఎండ వాన కలిసే చోట ఏడు రంగుల ఇంద్రధనుస్సు పుడితే ఆరంగుల అందం చూడ ముచ్చటగా వుంటుంది, దానికి తోడు చల్లని గాలి నీలినీలి మేఘాలు, సందడి చేస్తుండగా ఆకుపచ్చని బంగారం ధరించి ప్రకృతి కన్య హరివిల్లుని శిఖలో ముడుచుకుంటే అప్పుడు అందం అద్బుతం అత్యద్భుతంగా వుంటుంది"అని చెప్పి, ఎండ వాన మబ్బులు ప్రకృతి సౌందర్యం తోడు లేకుంటే, ఈ ఏడురంగులు కాదు ఎనబై రంగులు ఒంటరిగా వయలు ఒలకబోసినా వృధా ప్రయాసే అని అంది ప్రకృతి.

హరివిల్లు పుట్టుక, హరివిల్లు అందం పెంచడానికి పంచభూతాలు మరియు ప్రకృతి పాత్ర తెలుసుకోని ఏడు రంగులూ సిగ్గు పడ్డాయి, చేసిన తప్పుకి లెంపలేసుకున్నాయి, అప్పటినుండి కలిసి ఐకమత్యంగా వుంటూ గొప్ప తక్కువ అన్న తేడాలు చూసుకోకుండా, ఎండ వానలు కలిసేసమయాన ప్రకృతి ఒడిలో తమ ఆకృతికి మెరుగులు దిద్దుకొని ఐక్యతకు అందానికి 'ఐకాన్'గా మారిపోయాయి. అప్పుడు నెమలి మాత్రమే కాదు సృష్టి మొత్తం హరివిల్లుఅందాలను చూసి 'ఫిదా' అయిపోయింది.



Rate this content
Log in

Similar telugu story from Drama