Parimala Pari

Drama

2  

Parimala Pari

Drama

పూవు వెంటే ముళ్ళు

పూవు వెంటే ముళ్ళు

4 mins
294పువ్వు వెంటే ముళ్ళు


నా పేరు రామ్, పరశురామ్, ఎస్.ఐ. గా పదవీ స్వీకారం చేసి, హైదరాబాద్ కి వచ్చిన తొలి రోజులు.. ఎస్. ఆర్. నగర్ స్టేషన్ లో డ్యూటీ వేశారు. అక్కడికి దగ్గరలోనే రూమ్ తీసుకొని ఉంటున్నాను.


ఉదయాన్నే లేచి జాగింగ్ పూర్తి చేసుకొని నాకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగుతూ ఉండగా డోర్ బెల్ మోగేసరికి ఎవరా ఇంత పొద్దునే అని బయటకి వచ్చి చూసాను. ఎవరూ కనపడలేదు.

డోర్ బయట ఒక లెటర్ దానిపైన ఎర్ర గులాబీ పెట్టీ ఉంది. అది తీసుకొని లోపలకి వచ్చి లెటర్ తెరచి చూసాను.


హేయ్,


నిన్ను చూసిన మరు క్షణమే నీతో ప్రేమలో పడిపోయా,


నీతో మాట్లాడాలని ప్రతిక్షణం పరితపిస్తున్నా,


నువ్వే నా మిస్టర్ పర్ఫెక్ట్ వి.


నువ్వే నా సోల్ మేట్ వి.

............


అని రాసి ఉంది. చుట్టు చూసాను ఎవ్వరూ కనిపించలేదు, ఆ లెటర్ నీ అలాగే షెల్ఫ్ లో పెట్టీ, రోజా పువ్వు ఫ్లవర్ వేస్ లో పెట్టీ, రెడీ అయ్యి డ్యూటీ కి వెళ్ళాను.


మరుసటి రోజు ఉదయం కూడా అలాగే కాఫీ తాగుతున్న టైమ్ కి మళ్లీ డోర్ బెల్ మోగింది. వెంటనే వెళ్ళి తలుపు తెరిచి చూసాను ఎవ్వరూ కనిపించలేదు. ఈసారి బయట చుట్టు పక్కల అంతా వెతికాను. కానీ లాభం లేదు అనిపించింది. మళ్లీ ఒక లెటర్, రెడ్ రోజ్ పెట్టీ ఉన్నాయి.


తీసుకొని చదివాను


హల్లో సర్,


మీరు యూనిఫాం లో సూపర్ గా ఉన్నారు. చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది.


కానీ అస్ బ్లాక్ గ్లాసెస్ అసలు మీకు సూట్ అవ్వలేదు, ఎందుకంటే అందమైన మీ కళ్ళు నాకు కనిపించటం లేదు. దయచేసి ఆ గ్లాసెస్ తీసేయండి.

..........


లెటర్ చదివిన వెంటనే ఆ గ్లాసెస్ పెట్టుకుని నన్ను నేను చూసుకున్నాను, గ్లాస్ తీసేసి అద్దం లో చూసుకుంటే ఆ లెటర్ లో ఉన్నది నిజమే అనిపించింది.


నాకు తెలియకుండానే నా ముఖంపై చిన్న చిరునవ్వు వెలిసింది.


@@@@@@


ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఇంకొక లెటర్


హేయ్ మిస్టర్,


ఈసారి మొదటి సారి మీలో దాగి ఉన్న పిల్లాడిని చూసాను. రోడ్ పక్కన ఫండ్ కలెక్ట్ చేయటానికి వచ్చిన చిన్న పిల్లలతో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళకి చాక్లెట్స్ పంచుతూ ఉంటే...


తెగ నచ్చే సావోయ్ సారు

.........


ఎవరు ఈ లెటర్ రాసేది తెలుసుకోవాలి అన్న కుతూహలం ఎక్కువ అయ్యింది నాకు. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాను. నాతో పాటు కానిస్టేబుల్ నీ తీసుకొని రోడ్లన్నీ వెతికాను. కానీ ఎవ్వరూ దొరకలేదు.


ఎలా నిన్ను కలవాలి, ఎలా తెలుసుకోవాలి, అసలు ఎవరు నువ్వు?? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నా.


అలా ఒక వారం పాటు రోజుకొక లెటర్ తో నాకు తెలియకుండా నాతో తన భావాలు పంచుకుంటున్నారు. అది ఎవరో తెలియక బుర్ర వేడెక్కి పోతోంది నాకు.


ఒక రోజు లెటర్ లో


సర్, ఆ రెడ్ కలర్ షర్ట్ మీకు అస్సలు సూట్ కాలేదు, పైగా ఆ హైర్ స్టైల్ ఏంటి సర్ చూడండి ఎలా ఉందో.. ఏమైందీ, ఏదైనా కేస్ విషయంగా టెన్షన్ పడుతున్నారా??


ఇట్లు,

మౌనంగా నిన్ను ప్రేమించే

నీ ప్రేమిక...


...


ఆ లెటర్ తో పాటు నా ఫోటో కూడా జత చేసి ఉంది. ఫోటో వెనుక చూసి వెంటనే ఆ స్టూడియో కి వెళ్ళాను. స్టూడియో వాడు ఎవరో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు సర్, అంతకన్నా నాకేమీ తెలియదు అన్నాడు.


ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావు, ఎప్పుడు నా ముందుకి వస్తువు అని గట్టిగా అరిచాను.

మర్నాడు ఆదివారం.. ఆరోజు ఉదయాన్నే లెటర్ రాలేదు. మూడ్ ఆఫ్ అయ్యింది. లెటర్ చూస్తూ రోజు ఎంతో ఉత్సాహంగా డ్యూటీ కి వెళ్ళేవాడిని. హాలిడే కదా అని అలా పడుకున్నాను..


ఆరోజు మధ్యాహ్నం మూడింటికి బెల్ మోగింది. కానిస్టేబుల్ అనుకోని "ఎంటయ్య ఇప్పుడు, మళ్ళీ కొత్త కేసా ఏదైనా" అని అడుగుతూ బయటకి వచ్చాను. ఎవ్వరూ లేరు. చూస్తే మళ్లీ ఇంకొక లెటర్ ఉంది.


వెంటనే ఆత్రంగా లెటర్ ఓపెన్ చేసి చూసాను.


ఏంటి సర్,


నాకోసం తెగ వెతుకుతున్నట్టు ఉన్నారు. మరి తెలిసిందా నేను ఎవరో??


సరే నేనే చెప్తాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకి కృష్ణ కాంత్ పార్క్ కి రండి, బ్లూ జీన్స్ వేసుకొని రండి. నేను మీకు కనిపిస్తాను..


.......


తను ఇచ్చిన ప్రతి రోజా పువ్వు నీ ఫ్లవర్ వాజ్ లో పెట్టీ, రోజు నీళ్ళు పోస్తూ వాడిపోకుండ చూసుకుంటున్నాను.


సాయంత్రం తను చెప్పినట్టే బ్లూ డెనిమ్ జీన్స్ వేసుకొని కృష్ణ కాంత్ పార్క్ కి వెళ్ళాను. 5 అవ్వటానికి ఇంక అరగంట ఉంది. టైమ్ చాలా భారంగా గడుస్తున్నట్టు అనిపించింది. 15 నిముషాలు పార్క్ అంతా తిరిగాను.


ఒక చోట బెంచ్ మీద రిజర్వెడ్ అని ఉంది. ఒక రోజా పెట్టీ ఉంది. అక్కడ కూర్చుని చూస్తున్నాను అది ఎవరా అని,,,


ఒక అమ్మాయి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది.

హల్లో సర్ అంది.


హాయ్ చెప్పాను నేను.


నేనే సర్ మీకు లెటర్స్ పంపింది అని, నా పేరు రోజీ అని తనని తను పరిచయం చేసుకుంది.


"మిమ్మల్ని చూడగానే ఇష్ట పడ్డాను, మీ డ్యూటీ, మీ సిన్సియారిటి చూసి మీ మీద గౌరవం మరింత పెరిగింది.


మీకు దగ్గర అవ్వాలి అనిపించేది. మీరు ఒక్కరే ఉండటం చూసి మీకు సహాయ పడాలి అనిపించేది.

మీ గుమ్మంలో రోజు ముగ్గు వేసేది నేనే,రోజు వంట చేసి పెట్టేది నేనే (రాజయ్య కాదు),నా ప్రేమని మీకు చెప్పాలి అనిపించేది.కానీ నాకు ఆ అర్హత లేదు అని తెలుసు కాబట్టి దూరం నుంచే మిమ్మల్ని ఆరాధించే దానిని.


ఇప్పుడు అయిన మా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక్కసారి కలవమంటే వచ్చాను." అంది


మరి ఇన్ని చేసి నాకు దూరంగా ఎందుకు ఉన్నావు అని అడిగాను.


తన మొఖానికి ఉన్న స్కార్ఫ్ తీసింది...

పాల మీగడ లాంటి తన అందమైన ముఖంపై ఆ మచ్చ... చందమామ కి మచ్చ ఉన్నట్టు ఉంది..

అది చూసి ఒక్క క్షణం నా నోట మాట రాలేదు.. తర్వాత అడిగాను ఎంటి అని, ఎవడో తన పై ఆసిడ్ దాడి చేస్తే తప్పించుకుంది అంట. కానీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది అట.


"ఇదుగో ఇందుకే నేను ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్నది. ఇలా చూసిన నన్ను మీరు ఒప్పుకోగలరా" అని అడిగింది..


ఒక్కక్షణం ఏం చెప్పాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.


"చూడు, నేను నీ రూపం చూడలేదు, కానీ నీ ప్రేమని చూసాను. నాకు నీ రూపంతో పని లేదు. నీ మనసు తోనే పని, అది నా దగ్గరే ఉంది.. ఇంకా మన మధ్యన ఈ దాగుడు మూతలు ఎందుకు" అన్నాను


అర్థం కాలేదు తనకి.


సరే, రేపు వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అన్నాను.


నాకు ఇల్లంటు లేదు, నా వాళ్లంటూ ఎవరు లేరు అంది.


వెంటనే మా అమ్మకి చెప్పి, ఒప్పించాను. అలా మా పెళ్ళి జరిగిపోయింది.


నా పెళ్ళి అయ్యి ఇప్పటికీ అయిదేళ్ళు.. నేను ఇప్పుడు ఏసిపి అయ్యాను, తను నాకు దూరం అయ్యి సరిగ్గా ఈరోజుకి ఏడాది అవుతుంది. తన మంచితనాన్ని చూసి దేవుడు తనని ఆయన దగ్గరకి ముందే తీసుకుని వెళ్ళిపోయాడు.


మా ప్రేమకి గుర్తుగా, తను నాకొక అపూరూపమైన కానుక ఇచ్చి వెళ్ళింది. అదే నా కూతురు ప్రియ. ప్రియ తో పాటు పది మందికి చదువు చెప్పిస్తున్నా..

అయినా తను లేని లోటు ఇప్పటికీ నాలో అలానే ఉంది.


తను ఒంటరిగా ఉన్న నా జీవితం లోకి వచ్చి పూలబాటని వేసి, వెంటనే ఆ పువ్వు తో పాటే ముళ్ళు కూడా ఉంటాయి అని చెప్తూ నన్ను వదిలి వెళ్ళిపోయింది.


కానీ తను ఇచ్చిన జ్ఞాపకాలు నా ఈ జీవితానికి చాలు. ఉంటాను...


Rate this content
Log in

Similar telugu story from Drama