ప్రియమైన నీకు
ప్రియమైన నీకు


ముందు మాట
అమ్మాయి ప్రేమ గురించి అందరూ చెప్తారు....మోసపోతే అందరూ ఒదరుస్తరు...
అదే అబ్బాయి ప్రేమ లో మోసపోతే... వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తారు...అబ్బాయి ప్రేమ లో మోసపోతే పడే ఆవేదన నాకు తెలియదు కానీ...నా హృదయం తో ఆలోచించి ఇలా నే ఆలోచిస్తారు అని భావించి రాస్తున్న...తప్పుగా వుండి ఎవరినయినా బాదిస్తే మన్నించండి.... ఆత్మహత్య మహా నేరం...నేను అస్సలు ప్రోత్సహించను...
అమ్మాయి మోసపోయిన మళ్లీ పెళ్ళి చేసుకుంటుంది కానీ అబ్బాయి అల కాదు అని నా స్నేహితులను చూసాక అర్థం అయింది....అందుకే ఈ కథ....
💌💌💌💌💌❣❣❣❣💌💌💌💌💌💌❣❣💌
మాయ💝ఎలా వున్నావు....బాగున్నావా..బాగానే వుండి వుంటావు లే...ఎందుకు అంటే నిన్ను ప్రేమించిన వాడిని కాక..నువ్వు ప్రేమించిన వాడిని చేసుకున్నావు గా....
నీతో గడిపిన ఒక సంవత్సరం .💔💔💔💔..
ఒక క్షణం లో గడిచిపోయింది..కానీ దాని గాయం మాత్రం జీవితాంతం నాకు గుర్తే అవుతుంది కావచ్చు...
గొంగళి పురుగు లాంటి నా జీవితం లో కి వచ్చి నీ జీవితం రంగుల సీతాకోక చిలుక అని చూపించావు.💔💔💔..
మరుక్షణమే..అమావాస్య చీకటిలో వదిలి వెళ్లిపోయి💔💔💔
నన్ను దిక్కు తోచని స్థితిలో వదిలేసవు💔💔💔
నన్ను ప్రేమించమని నిన్ను అడిగానా💔💔💔
నా వెంట పడమని చెప్పనా....
లివింగ్ రీలేషన్....అన్నావు...
నచ్ఛక పోతే పోనీ అని వదిలేయడం నాకు రాదు గా...అమ్మాయి అంటే అంగట్లో బొమ్మ కాదు...అమ్మాయి అంటే ప్రాణం పోసే బంగారు అమ్మ్మ అనుకున్న....కానీ ప్రాణం తీసే కసాయి వి అవుతావు అనుకోలేదు...
నువ్వు నా నుంచీ కోరుకున్నది ప్రేమ అయితే...ప్రాణం ఇచ్చి అయిన నా ప్రేమ ను నిలబెట్టుకునే వాడిని...
కానీ నువ్వు అడిగింది ... జీవం లేని డబ్బు నీ...
జీవం లేని డబ్బు కోసం...నీ జీవితము బలి కావద్దు అని ఆశిస్తున్న...
ఏనాటికైనా నువ్వు నా ప్రేమ నిజం అని గుర్తిస్తే ...తప్పకుండా నా ఆత్మ శాంతి స్తుంది...
ఏదయినా దూరం అయితే కానీ విలువ తెలియదు...అందుకే చెపుతున్న..నేను దూరం అయితే కానీ న విలువ నీకు తెలియదు....
నన్ను ఎలానో మోసం చేశావు...కనీసం మీ భర్త ను అయిన మోసం చేయక... బాగా చూసుకో... అయ్యో...నువ్వు తనను పెళ్లి చేసుకోవడమే మోసం తో చేసుకున్నావు కథ మరిచిపోయాను...
కానీ ఎప్పటి కయిన గుర్తు వుంచుకో....నిజంగా ప్రేమిస్తే....అమ్మాయి ప్రేమిస్తే పెళ్లి చేసుకున్నాక మర్చిపోయి కొత్త జీవితం ప్రారభించ గలదు కానీ...అబ్బాయి పెళ్లి చేసుకోడు...చేసుకున్న అమ్మాయి నీ మర్చిపొడు....
కానీ మనం చేసిన నేరానికి మనలని పెళ్లి చేసుకున్నా వారిని బాధ పెట్టడం తప్పే అవుతుంది...చేసుకున్నందుకు వారిని బాగా చూసుకోవాలి...
నువ్వు నాతో ఒక వైపు చాటింగ్ చేస్తూ..హెడ్ సెట్ పెట్టుకొని మరొకరితో మాట్లాడుతున్నావు అని తెలిసిన మళ్లీ నువ్వే మారుతావు అని అనుకున్న...కానీ ఒక్కరి తో కాక నాలాంటి వాళ్ళు ఎందరో అని తెలిసాక నా మనసు కొన్ని వందల ముక్కలు అయింది...వాటిని అతికించి నన్ను బ్రతికించలి అంటే కేవలం నీ ప్రేమ అనే ఫెవికల్ తో నే కానీ అది అందని ద్రాక్ష అని అర్థం అయింది...
మీ అమ్మాయిలకు ముందు చూపు ఎక్కువ కదా.
అందుకే...మేము మీ పేరు పచ్చబొట్టు వేయించుకుంటం కానీ మీరు వేయించుకొరు...మళ్లీ వేరే వాడిని పెళ్లి చేసుకున్న క వాడికి జవాబు చెప్పాలి గా...సూపర్...👏👏👏👏
ఆత్మహత్య చేసుకొనే అంత పిరికి వాడిని నేను కాదు ...
కానీ నువ్వు చేసిన గాయం మనాలంటే నాకు ఎం చేయాలి తోచడం లేదు...
తెల్లవారి లేచిన వెంటనే ఫోన్ చేసి...
బంగారం...గుడ్ మార్నింగ్...రా...
తిన్నావా...కాలేజి కు వెళ్ళవా...
ఎటు వెళదాం...ఎం చేద్దాం...బుజ్జి ..ఎం తింటావ్ కన్న...గుడ్ నైట్ రా....స్వీట్ డ్రీమ్స్ రా...అని గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతూ కాలం గడిపి....
ఫోన్ వంక చూస్తూ ఒక్క సారి అయిన నువ్వు ఫోన్ చేస్తావని ఎదురుచూస్తూ... నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోయాక...ఫోన్ లో నీతో చేసిన చాటింగ్ లు చూసుకుంటూ....ఫోటో లు చూస్తూ...అన్నం తినలని అనిపించక...ఫ్రెండ్స్ తో గడపాలి అనిపించక...సిగరెట్లు తాగుతూ...సాయంత్రం అయితే బిరు షాపు ల చుట్టూ తిరుగుతూ ఉంటే...అది మా అమ్మ నాన్న చూసి బాధ పడుతూ వుంటే...ఎందుకు నా యి జీవితం అని అనిపిస్తుంది...
కానీ నాతో వున్న లేకున్నా నువ్వు సంతోషం గా వుంటే చాలు నాకు ....చచ్చిన నేను కోరుకునేది నీ మంచినే...ఇంకో పది నిమిషాల్లో నేను చనిపోతూ కూడా నాకు నన్ను కన్న వాళ్ళు కాక నువే గుర్తు వస్తున్నవే....పిచ్చి వయసు....నువ్వు నా మెయిల్ చదివే లోపు నేను వుండను కావచ్చు....
చివరి మెసేజ్ నాకే పెడుతున్నాడు...పోలీస్ వాళ్లకు నా పై అనుమానం వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే ఎలా అని ఆలోచిస్తున్న వా...బయ పడకు...నేను నికు మెసేజ్ పెట్టేది ఫేక్ సిమ్ కార్డ్...సిమ్ కూడా విరగ గొట్టేస్త ...బయపడకు....
చివరిగా ఒక్క మాట....కాదు నా చివరి మాట..
ఐ లవ్ యూ మాయ.... లవ్ యు ఫరెవర్...