నిరుపమ
నిరుపమ
నిరుపమ
ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్
అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది
తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది
పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది
ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు
ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు,
ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు
ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది.
ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు
కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే,
తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు
తన చావు తన తల్లిని పిచ్చిదానిగా చేసేస్తే,
తన తండ్రిని మాత్రం తాను చనిపోయింది అన్నదానికన్నా ఎందుకు చనిపోయింది అని ఎక్కువ బాధపడేలా చేసింది.
తన కూతురు ఎదో చిన్న విషయానికి సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాదని బలంగా నమ్మాడు ఆమె తండ్రి రంగనాథ్.
ఆ విషయం తెలుసుకుని అది నిరూపించడానికే డిటెక్టివ్ స్మరన్ ని ఎంగేజ్ చేసాడు
తన కూతురికి తానెందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియడం ఇష్టం లేదని తెలిసినా మొండిగా ఆ విషయం తెలుసుకోవాలనే నిర్ణయించుకున్నాడు.
డిటెక్టివ్ స్మరన్ ఇంకా అతని మేనకోడలు చేసిన పరిశోధన లో బయటపడ్డ ఆ
నిజం ఎంత తీవ్రమైందో, అది ఇంకో రెండు ప్రాణాలని బలిగొనే వరకూ తెలియలేదు
రచయిత గురించి
రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై ఏడు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా పేపర్ బాక్స్ గా అమెజాన్ లాంటి పాపులర్ ఆన్ లైన్ వెబ్సైట్లు లో లభ్యం అవుతూ వున్నాయి. ఈయన వ్రాసిన మొత్తం అన్ని ఇంగ్లీష్ పుస్తకాల లోని పదాల సంఖ్య నలభై లక్షల పైమాటే. ఈయన పుస్తకాలని ఇంగ్లీషులో వ్రాసినా, అవన్నీ తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు వాళ్ళకి సంభందించినవే. ఇంగ్లిష్ లో రాసిన నలభై ఏడు పుస్తకాలూ కాకుండా, ఈ రచయిత తెలుగు లో రాసిన పుస్తకాలు ఈ పుస్తకం తో కలిపి నాలుగు. తక్కిన మూడు తెలుగు పుస్తకాలు ‘వెన్నెల్లో సెలయేరు’, ‘అరె ఏమైందీ?’ ఇంకా 'నులివెచ్చని వెన్నెల' ఈ పుస్తకం లానే లవ్, సస్పెన్స్ అండ్ రొమాంటిక్ థ్రిలర్స్:
సెల్ నం: 9701937966 ఈమెయిల్ : sivaramakrishnakotra@gmail.com
డిస్క్లైమర్
ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం. ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు
Copyright @ 2025 కాపీరైట్ @ 2025
నిరుపమ
(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)
ప్రొలాగ్
మేడ మీద గదిలో బెడ్ మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ ని చూస్తూన్న నిరుపమలో మళ్ళీ అనీజీ ఫీలింగ్ మొదలైంది. ఎదో భరించ లేనంత గిల్టీ ఫీలింగ్ మళ్ళీ పూర్తిగా కమ్ముకుంది. ఈ సమస్య అంతా ఒక పదిహేను రోజుల కిందట, ఆ రోజు నుంచి మొదలైంది. ఏ తప్పు చేయకుండా తనెందుకంత గిల్టీ గా ఫీలవుతుందో ఎంత ఆలోచించినా బోధపడడం లేదు. కానీ ఈ గిల్టీ ఫీలింగ్ మాత్రం భరించలేనంత ఎక్కువగా వుంది.
తన పేరెంట్స్, నిరంజన్ అంకుల్, క్లోజ్ ఫ్రెండ్ సమీర, ఎవరితోనూ ఎందుకు తన బాధ షేర్ చేసుకో లేకపోతూంది? అందరూ తనని ప్రేమించే వారే, అభిమానించే వారే. కానీ వాళ్ళ ముందు తన నోరు పెగలడం లేదు, మాట బయటకి రావడం లేదు.
ఒకసారి తన వంటి వైపు చూసుకుంది. 'ఛీ పాపపు శరీరం, ఈ శరీరం తో వాళ్ళముందు ఇంక నేను తిరగలేను.' మనసులో అనుకుంది. ఈ పదిహేను రోజులుగా తను నరకం అనుభవిస్తోంది. ఎన్నో సార్లు ఈ శరీరం వదిలేయడం మంచిది అనిపించింది. కానీ ఆ ఆలోచనని బలవంతంగా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ ఈ సారి మళ్ళీ అలాగే అనిపిస్తూ వుంది. ఇప్పుడు ఇంక వాయిదా వేయగలను అనిపించడంలేదు.
'ఎస్, నేను చనిపోవాలి. అదొక్కటే నన్ను ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి సేవ్ చేస్తుంది.' మనసులో బలంగా అనుకుని బెడ్ మీద నిఠారుగా లేచి కూచుంది. 'కానీ ఎలా, ఎలా చనిపోవాలి?' తీవ్రంగా ఆలోచనలో పడింది.
ఈ పదిహేను రోజుల్లో తనకి చాలాసార్లు బలంగా చనిపోవాలని అనిపించినా, ఎలా చనిపోవాలని సీరియస్ గా ఆలోచించలేదు. కొంతమంది స్లీపింగ్ పిల్స్ తీసుకుని చనిపోతారు, కొంతమంది కత్తితో కోసుకుని చనిపోతారు, కొంతమంది నూతిలో దూకి, ఇంకా కొంతమంది కిరోసిన్ పోసుకుని, కొంతమంది ఉరేసుకుని చనిపోతారు. సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా మార్గాలు వున్నాయి.
స్లీపింగ్ పిల్స్ తో సూసైడ్ ఈజీగానే అనిపిస్తూ వున్నా తమ ఇంట్లో ఎవరికీ స్లీపింగ్ పిల్స్ వాడే అలవాటు లేదు. తక్కిన సూసైడ్ చేసుకునే మార్గాలు అన్నీ ఆలోచించడానికి భయంకరంగా వున్నయి. తను కొంచం ఈజీగా వుండే మార్గం వెతుక్కోవాలి.
ఆలోచిస్తూ ఉంటే ఉరేసుకుని చనిపోవడం తక్కిన వాటితో పోలిస్తే, స్లీపింగ్ పిల్స్ తరువాత కాస్త ఈజీ గా అనిపిస్తోంది. తన వంటిమీద వోణి వుంది. పైన సీలింగ్ ఫ్యాన్ వుంది. ఈ బెడ్ మీద కుర్చీ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ అందుతుంది. అప్పుడు ఈ వోణి తో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకోవడం తేలిక. ఆలా ఉరేసుకున్న కొద్ధిసేపట్లోనే తను ఈ భరించలేని గిల్టీ ఫీలింగ్ నుంచి బయట పడగలుగుతుంది. ఇలా చనిపోవడం కూడా కొంచం బాధగానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇదే అందుబాటులో వున్న మార్గం.
మరీ ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేక బెడ్ దిగి కిందనున్న కుర్చీ తీసి బెడ్ మీద వేసింది. తరువాత సీలింగ్ ఫ్యాన్ ని ఆఫ్ చేసింది. తన వంటిమీద నున్న వోణి తీసేసి, అది చేత్తో పట్టుకుని కుర్చీ మీద లేచి నిలబడి ఇంకా తిరుగుతూ వున్న సీలింగ్ ఫ్యాన్ నే చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడింది.
'ఇది మరీ అంతా తను సూసైడ్ చేసుకోవాల్సినంత విషయమా? ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎట్లీస్ట్ తన క్లోజ్ ఫ్రెండ్ సమీరతో. నిజానికి తనకి బతకాలని వుంది, చనిపోవాలని లేదు.’
కానీ సీలింగ్ ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయే సమయానికి ఆ ఆలోచనలు ఆగి పోయాయి. మళ్ళీ పాత ఆలోచనలు మొదలయ్యాయి. నో తను ఈ గిల్టీ ఫీలింగ్ ని భరించలేదు. ఎవరికీ చెప్పినా తనలో వున్న ఈ గిల్టీ ఫీలింగ్ ని మాత్రం ఎవరూ తీసేయలేరు. తను చనిపోవడం ఒక్కటి మాత్రమే తనని ఈ గిల్టీ ఫీలింగ్ నుండి రిలీవ్ చేస్తుంది.
సడన్ గా, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వోణి తాలూకు ఒక కొసని సీలింగ్ ఫ్యాన్ కి గట్టిగా ముడేసింది. తరువాత తను కుర్చీ తన్నేశాక, తన కాళ్ళకి బెడ్ కి కావలసినంత గ్యాప్ ఉండేలా అంచనా వేస్తూ తక్కిన రెండో కొస తన మెడ చుట్టూ బిగించుకుంది. ఇంపల్సివ్ గా చేస్తూనే వున్న చాలా జాగ్రత్తగానే చేస్తూ వుంది. వురేసుకునే సూసైడ్ అటెంప్ట్స్ కొన్ని ఫైలవుతూ ఉంటాయి. తన అటెంప్ట్ ఆలా ఫెయిలవ్వడానికి వీల్లేదు. అంతా బాగానే ఉందని కంఫర్మ్ అయ్యాక బెడ్ మీదనుంచి కుర్చీని కిందకి తన్నేసింది. శరీరం గాల్లో వేళ్ళాడుతూ ఉంటే తను మెడ చుట్టూ చుట్టుకున్న వోణి కొస బిగుసుకోవడం మొదలు పెట్టింది.
అప్పుడు మళ్ళీ ఆలోచన మొదలైంది నిరుపమలో. తను చనిపోవలసినంత విషయం లేదు. తను ఏ తప్పూ చెయ్యలేదు. ప్రయత్నిస్తే తను ఈ గిల్టీ ఫీలింగ్ నుంచి బయట పడగలదు. తను ఆ విషయాన్నీ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి. ఇలా చనిపోకూడదు. తను పెద్ద సైకాలాజిస్ట్ కావాలి. ఇలా చనిపోకూడదు.
'ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. నేను తొందర పడ్డాను. నాకు బ్రతకాలనుంది.' గట్టిగ అరుద్దామనుకుంది. కానీ అప్పటికే గొంతు చుట్టూ నిర్దయగా బిగుసుకు పోతూ వున్న వోణికుస ఆ అవకాశం ఇవ్వలేదు. చిన్న శబ్దం కూడా నోట్లోనుండి రాలేదు.
ఇంక ఎలాగూ తను చనిపోక తప్పదన్న విషయం కంఫర్మ్ అయిపోయాక నిరుపమ లో మిగిలిన కోరిక కేవలం ఒక్కటి మాత్రమే.
తనలో అంత గిల్టీ ఫీలింగ్ కి కారణమైన ఆ విషయం, తనని ఇంత సూసైడ్ చేసుకునే వరకు తీసుకు వచ్చిన ఆ విషయం, ఎప్పటికి ఎవరికీ తెలియకూడదు. అది రహస్యంగానే ఉండిపోవాలి.
'దేవుడా ఆ విషయం ఎప్పటికి ఎవరికీ తెలియనివ్వకు. అది రహస్యం గానే ఉండిపోవాలి. ఇదే నా ఆఖరి కోరిక.' ప్రాణం పోయి శరీరం నిర్జీవం అయిపోయే ముందు దేవుణ్ణి బలంగా ప్రార్ధించింది నిరుపమ.
చాప్టర్-1
ఆ వ్యక్తికి బహుశా అరవై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. కానీ సన్నటి శరీరంతో యాభై సంవత్సరాల వయస్సు అన్నట్టుగానే వున్నడు. "స్మరన్ అంటే మీరేనా?" అని అడిగి, స్మరన్ ముఖంలోకి ఇంకా అలాగే చూస్తూ నిలబడి వున్నాడు.
"మీరు స్మరన్ ప్రైవేట్ డిటెక్టివ్ గురించి వచ్చి ఉంటే అది నేనే." స్మరన్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఎందుకో ఆయన్ని చూస్తూ ఉంటే గౌరవం కలుగుతోంది. "దయచేసి కూర్చోండి" అన్నాడు.
ఆ పెద్దాయన తలూపి స్మరన్ కుర్చీకి అపోజిట్ గా వున్న రెండు కుర్చీల్లో కుడివైపు దాంట్లో కూర్చున్నాడు. అయన కూర్చున్నాక స్మరన్ కూడా మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీలకి మధ్యలో ఒక బల్ల వుంది. ఆ బల్ల మీద ఫ్లవర్ వేజ్, పేపర్ వెయిట్ ఇంకా కొన్ని ఫైల్స్ లాంటివి వున్నయి.
"మీరు ఏమైనా నా సర్వీసెస్ గురించి వచ్చి ఉంటే సందేహం ఏమి లేకుండా నాకు తెలియ పర్చండి. నా దగ్గరికి వచ్చే ముందు బహుశా నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ మీరు తెలుసుకునే వుంటారు." అయన ఏ రకమైన సర్వీస్ గురుంచి వచ్చారో గెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ అన్నాడు స్మరన్.
"డిటెక్షన్ మీ సర్వీసెస్ లో ఒకటి కదా?" ఆ పెద్దాయన అడిగాడు.
"ఇన్ ఫాక్ట్, అదే నా మెయిన్ సర్వీస్" నవ్వాడు స్మరన్
ఆ ముసలాయన దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. "మీరు నా గురించి ఒక డిటెక్షన్ చేయవలసి వుంటింది. అందుకు అవసరమైన ఫీజు నేను చెల్లించుకుంటాను."
"ఫీజు గురించి తరవాత ఆలోచించవచ్చు. కానీ ముందు నేను చెయ్యవలసిన డిటెక్షన్ గురించి నాకు తెలియపరచండి." మొదటినుండి ఒకరకమైన విచారం ఆ ముసలాయన మోహంలో స్మరన్ చూస్తూనే వున్నాడు. ఆ అరవై ఏళ్ళ వయసులో ఆ ముసలయ్యాన్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటో స్మరన్ కి అర్థం కావడం లేదు.
"నా పేరు రంగనాథ్. నేను ఒక హైస్కూల్ హెడ్మాస్టర్ని. నేను ఇదే టౌన్ లో నివసిస్తున్నాను." ఆ పెద్దాయన కాస్సేపు ఆగాడు.
స్మరన్ ఆయన్నే గమనిస్తూ కుర్చీలో జారగిలబడ్డాడు. అడగకపోయినా రంగనాథ్ మొత్తం అంతా చెప్తాడని స్మరన్ కి బోధపడింది.
అప్పుడా పెద్దాయన తన షర్ట్ ప్యాకెట్లో చెయ్యి పెట్టి ఒక కవరు బయటకి తీసాడు. స్మరన్ ఆలా చూస్తూ ఉండగానే అందులోంచి ఒక ఫొటోగ్రాఫ్ బయటికి తీసి స్మరన్ ముందు పెట్టాడు.
"బ్యూటిఫుల్!" ఎప్పుడైతే ఆ ఫోటోని తన చేతుల్లోకి తీసుకుని అబ్సర్వ్ చెయ్యడం మొదలుపెట్టాడో స్మరన్ అనకుండా ఉండలేక పోయాడు. ఆ ఫొటోలో ఉన్నది పంజాబీ డ్రెస్సులో ఉన్న ఒక ఇరవై సంవత్సరాల వయస్సు అమ్మాయి. అప్పటి వరకు స్మరన్ దృష్టిలో తన మేనకోడలు మేనక మాత్రమే ఎంతో అందమైన అమ్మాయి. కానీ ఈ అమ్మాయిని చూసాక తన అభిప్రాయం మార్చుకోక తప్పడం లేదు. "మీ అమ్మాయా?" ఆ ఫోటోని మళ్ళీ టేబుల్ మీద పెట్టి రంగనాథ్ ముఖంలోకి చూసాడు స్మరన్.
"అవును" రంగనాథ్ తలూపాడు. " "నా ఒక్కగానొక్క అమ్మాయి. పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టింది. తన పేరు నిరుపమ"
"ఏమిటి సమస్య?" ఆ వయస్సులో ఉన్న అమ్మాయిలతో వచ్చే సమస్యలు ఏమిటో స్మరన్ వూహించగలడు. బహుశా ఈ అమ్మాయి ఎవరో తెలియని అబ్బాయితో ప్రేమలో పడి వుంటుంది దాంతో ఈ పెద్దాయన ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉండిఉంటాడు
"ఆరు నెలల క్రితం తాను ఆత్మహత్య చేసుకుంది."
"ఏమిటి?" ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా అనిపించి కుర్చీలో తెలియకుండానే ముందుకు వంగాడు స్మరన్. " ఆత్మహత్య చేసుకుందా?" ఆ అమ్మాయిని చూసింది కేవలం కొన్ని నిమిషాల కిందట మాత్రమే. అయినా స్మరన్ మనస్సంతా విచారంతో ఇంకా షాక్ తో నిండి పోయింది. తనిది ఊహించలేదు. పాపం తండ్రి అయిన ఆ పెద్దాయన మనస్సెలా వుండి ఉంటుంది?
"అవును. తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది." ఆ పెద్దాయన తన మనసులో విచారం అంతా మోహంలో కనిపించకుండా వుండడానికి ప్రయత్నం చేస్తున్నాడని స్మరన్ కి అర్థం అయింది. "ఆరు నెలలు అవుతూంది."
"ఎందుకు, ఎందుకని అంత పని చేసింది?" మరొకసారి ఆ ఫొటోగ్రాఫ్ ని తన చేతుల్లోకి తీసుకుని చూడడం మొదలుపెట్టాడు స్మరన్. బహుశా తను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళికి ఈ పెద్దాయన ఒప్పుకుని ఉండడు. లేదా ఇంకేదైనా సమస్య అయివుంటుందా, తన ప్రమేయం లేకుండానే స్మరన్ మనస్సు రకరకాలుగా ఆలోచిస్తూ వుంది.
"ఆ విషయం తెలుసుకుంటారనే నేను మీ దగ్గరికి వచ్చింది." రంగనాథ్ మరొకసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు
"నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీకు తెలియదా?" ఆశ్చర్యంగా చూస్తూ స్మరన్ కూడా మరోసారి కుర్చీలో వెనక్కి జరగిలబడ్డాడు.
"కొంచం కూడా తెలియదు. నాకు గాని నా భార్యకి గాని తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఏ మాత్రం తెలియదు. తను మాకు ఎంతమాత్రం తెలియనివ్వలేదు. సరిగ్గా ఆరునెలల కిందట తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కి తను కట్టుకున్న వోణి తోనే ఉరేసుకుని కనిపించింది." రంగనాథ్ కళ్ళు తెరిచి స్మరన్ కళ్ళలోకి చూసాడు. "తనకి ఏ సమస్యలు లేవు. అన్ని రకాలుగానూ వాకబు చేసి చూసాం. తనని ఎవరు ఏ రకంగానూ ఇబ్బంది పెట్ట లేదు. తను అందరితోటి సరదాగా వుండే పిల్ల."
"ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా?"
"ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు వున్నా, నేను తన గురించి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలను. తను తప్ప మా కుటుంబానికి వేరే బాధ్యతలు ఏమి లేవు. హైస్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాను. స్వంత ఇల్లు మాత్రమే కాకుండా నాకు పొలాలు, వేరే ఆస్తులు కూడా వున్నయి."
"ఎంత దురదృష్టకరమైన విషయం! ఇంత అందమైన అమ్మాయి ఏ సమస్యలు లేకపోయినా ఆత్మహత్య చేసుకుంది." స్మరన్ దీర్ఘంగా నిట్టూర్చాడు.
"మా అంత దురదృష్టవంతులు ఎవరూ వుండరు. మా అమ్మాయి చనిపోయిన తరువాత మా ఆవిడ పిచ్చిది ఆయిపోయింది." రంగనాథ్ నిస్సహాయంగా తలూపాడు. " తను ఎవరిని ప్రేమించివున్నా, ఎవరిని పెళ్లి చెసుకుంటానన్నా లేదా ఇంకా ఏమి చేస్తానన్నాకూడా నేను కానీ నా భార్య కానీ అభ్యంతరం చెప్పేవాళ్ళం కాదు. ఆ విషయం తనకి కూడా బాగా తెలుసు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషం ఎక్కడా అంతుపట్టడం లేదు. తను ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం కన్నా కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తూంది."
"మీ బాధ నాకు అర్ధం అవుతూంది. కానీ ....." కాసేపాగాక మళ్ళీ అన్నాడు స్మరన్ "మీరు ఖచ్హితంగా చెప్పగలరా మీ అమ్మాయి ఆత్మహత్యే చేసుకుందని."
"ఆ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తను రాత్రి పడుకున్నాక తన గదిలోకి ఎవరూ వెళ్ళలేదు. అసలు మా ఇంట్లోకే ఆ రాత్రి ఎవరూ పై వాళ్ళు రాలేదు.తను ఖచ్హితంగా ఆత్మహత్యే చేసుకుంది." రంగనాథ్ స్మరన్ మొహంలోకే చూస్తూ వున్నాడు.
"సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?" కుర్చీలో ముందుకు వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్.
"ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది." ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు రంగనాథ్.
"ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా." రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు స్మరన్.
"నేను కచ్చితంగా తెలుసుకుని తీరాలి." సడన్గా రంగనాథ్ స్వరంలో దృఢత్వం స్మరన్ ని ఆశ్చర్యపరిచింది. "తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం నన్ను విపరీతంగా బాధిస్తూంది. ఆ విషయం తెలుసుకోకుండా నేను ఉండలేను."
స్మరన్ మరొకసారి కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు.
"మీ గొప్పతనం గురించి విన్నాను. మీ ఫీజు నేను చెల్లించుకుంటాను. దయచేసి తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీరు తెలుసుకుని తీరాలి."
"ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. కానీ నేను ఆ విషయం గురించి తెలుసుకునే ముందు నాకు ఒకటి చాల స్పష్టంగా అనిపిస్తూ వుంది." కళ్ళు తెరిచి రంగనాథ్ మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.
"చెప్పండి. నేను వినడానికి సిద్ధంగా వున్నాను." తన ఎక్స్ప్రెషన్ లో తేడా ఏమీ లేకుండా అన్నాడు రంగనాథ్.
"తను ఆత్మహత్య చేసుకున్న కారణం ఏదైనా కానివ్వండి కానీ అది మీ అమ్మాయి మీకు తెలియడానికి ఇష్టపడలేదు. ఆ విషయం మీకు తెలియడానికి తను ఇష్టపడలేదు అంటే అదేదో మిమ్మల్ని చాల బాధపెట్టే విషయం అయివుంటుంది. తెలుసుకున్న తరువాత ఆ విషయం మీకు ఎంతో కొంత రిలీఫ్ ని ఇవ్వడానికి బదులు ఇంకొంచం బాధపెట్టొచ్చు. నిజానికి..." తను చెప్పబోయేది ఇంకొంచం ముఖ్యమైందిఅని చెప్పడానికి అన్నట్లుగా స్మరన్ కొంచం ఆగాడు. "తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం మీకు తెలియడం మీ అమ్మాయికి ఎంతమాత్రం ఇష్టంలేదు అని నాకు అనిపిస్తూంది."
"మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం నాకు తెలిసే తీరాలి." మరొక్కసారి రంగనాథ్ స్వరంలో దృఢత్వం వచ్చింది.
"కొన్ని రహస్యాల్ని మనం రహస్యాలుగానే వదిలేయాలి. వాటిని మనం తెలుసుకోకపోవడమే మంచిది."
"నిరుపమ మాకు పదేళ్ల సుదీర్ఘ నీరక్షణ తరువాత పుట్టింది. తనకి మేము ఏ లోటు చేయలేదు. అడిగిందల్లా ఇచ్చాం. ఆ రోజు రాత్రివరకు కూడా మామూలుగానే వుంది. సడన్గా ఆ రోజు రాత్రి సీలింగ్ ఫ్యానుకి ఉరేసుకుని చనిపోయింది. మా అవిడ తన గదిలోకి వెళ్లి చూసేసరికి సీలింగ్ ఫ్యానుకి వోణి తో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఏ తల్లితండ్రులికి అయినా ఎలా ఉంటుంది? మా ఆవిడైతే పిచ్చిది అయిపోయింది. తను ఎందుకు అత్మహత్య చేసుకుందో తెలియాలని నేను ఆరాటపడడంలో ఏవైనా ఆశ్చర్యం వుందా?"
"లేదండి. నేను అంగీకరిస్తాను." స్మరన్ తలూపాడు.
"దయచేసి మీరు నాకు ఈ పని చేసిపెట్టండి. ఆ విషయం నేను తెలుసుకుని తీరాలి. అంతే."
"ఈ విషయంలో మీ భార్యగారి అభిప్రాయం ఏమిటి? తను కూడా మీలాగే మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవాలని ఆరాట పడుతూందా?"
"చెప్పానుకదా మా అమ్మాయి చనిపోయిన తరువాత తను పిచ్చిదానిలా అయిపోయింది. తన థృష్టిలో మా అమ్మాయి చనిపోలేదు, ఇంకా బతికే వుంది." నిట్టూర్చాడు రంగనాథ్.
"నిజంగానా? తను చనిపోయిన విషయం మీ భార్య అంగీకరించడంలేదా?" స్మరన్ భృకుటి ముడిపడింది
"అవును. తన దృష్టిలో మా అమ్మాయి అసలు చనిపోనేలేదు. ఇంక తనెందుకు మా అమ్మాయి చనిపోయిందో తెలుసుకోవాలనుకుంటుంది? ఈ విషయం గురించి ఆరాటపడేది నేను ఒక్కడినే."
"చాలా బాధాకరమయిన విషయం. తను లేకపోతే తన తల్లి ఏమవుతుందో కూడా ఆలోచించకుండా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అర్ధం కావడం లేదు." స్మరన్ మనసులో విచారం అతని మొహంలో బహిర్గతమవుతూంది.
"అందుకనే నేను ఆ విషయం తెలుసుకోవాలని చాలా మధన పడుతూ వున్నను. ఇంత బాధపడే తన తల్లితండ్రుల గురుంచి కూడా ఆలోచించకుండా మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలిసే తీరాలి." మరొకసారి ధృడంగా వుంది రంగనాథ్ స్వరం.
"నేను ఈ విషయం ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి అంగీకరిస్తున్నాను. కానీ నేను ఏ విషయం అయినా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటికీ మీరు అంగీకరించాల్సి ఉంటుంది."
"అవేమిటో తెలియపరచండి. నేను తప్పుకుండా అంగీకరిస్తాను." కుర్చీలో సర్దుకున్నాడు రంగనాథ్.
"నేను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎవర్నైనా ఏ ప్రశ్నలు అయినా అడుగుతాను. ఏ విషయం అయినా పరిశోధిస్తాను. ఏ మార్గం అయినా ఎంచుకుంటాను. ఎవరి సహాయం అయినా తీసుకుంటాను. అవేవి మీరు కాదనకూడదు. అడ్డు తగలకూడదు."
"అలాగే. నాకు అంగీకారమే." రంగనాథ్ తలూపాడు.
"సరే అయితే. నేను ఈ మేటర్ ఇన్వెస్టిగేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇంకొన్ని ప్రశ్నలు ఇప్పుడే అడుగుతాను. మీరు సమాధానం ఇవ్వాలి." కుర్చీలో వెనక్కి వాలి నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడు స్మరన్.
"తప్పకుండా అడగండి." రంగనాథ్ తలూపాడు.
"మీ అమ్మాయి బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?"
"జరిగింది. అంతా నార్మల్ గానే వుంది. ఏ అఘాయిత్యం తన మీద జరగలేదు. ఫిజికల్ గా ఎలాంటి డిస్టర్బన్స్ లేదు. ఎలాంటి పాయిజన్ కూడా తన శరీరం లో దొరక లేదు."
"తన లాస్ట్ ఫోన్ కాల్స్ సెర్చ్ చేశారా? ఎవరెవరితో మాట్లాడింది?"
"తన లాస్ట్ టు ఫోన్ కాల్స్ తన క్లోజ్ ఫ్రెండ్ సమీర కి. అదే రోజు సాయంత్రం. తనప్పుడు చాలా మామూలుగా ఉందని ఏవో సబ్జెక్ట్స్ ఇంకా ఎగ్జామ్స్ విషయమై ఫోన్ చేసిందని సమీర చెప్పింది. వాళ్లిద్దరూ ఒకే కాలేజీ లో ఒకే క్లాస్ లో వుంటారు. చిన్నప్పటినుండి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరే."
"తన స్మార్ట్ ఫోన్ పూర్తిగా చెక్ చేశారా? ఎలాంటి క్లూ అందులో ఇవ్వలేదా?"
" తన స్మార్ట్ ఫోన్, ఇంకా తన లాప్ టాప్ కూడా పూర్తిగా, థోరోగా చెక్ చేసాం. సమీర కి ఆ ఫోన్ పాస్ వర్డ్ ఇంక అన్నీ తెలుసు. తన ఫోన్ లో వన్ మంత్ క్రితం వరకు వున్న అన్నీ ఫోన్ నంబర్స్ ఫోన్ చేసి వాకబు చేసాం. ఫొటోస్, వీడియోస్ అన్నీ చెక్ చేసాం. మాకయితే ఎలాంటి క్లూయే దొరక లేదు." రంగనాథ్ చెప్పాడు. "ఆ ఫోన్, లాప్ టాప్ నా దగ్గరే వున్నాయి. మీకు ఎప్పుడు కావాలన్నా ఇస్తాను."
"తన సోషల్ ప్రొఫైల్స్ మాటేమిటి? పేస్ బుక్, ట్విట్టర్ లాంటివి? అవి చెక్ చేసారా?"
"తనకి పేస్ బుక్ లో ఒక అకౌంట్, ట్విట్టర్ లో ఒక అకౌంట్ వున్నయి. కానీ వాటిల్ని పెద్దగా వాడదు. తనకి అందులో ఫ్రెండ్స్ ఇంక ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ. సమీర కి వాటి పాస్ వర్డ్స్ కూడా తెలుసు. వాటిని థోరోగా చెక్ చేసి చూసాం. నో యూజ్. ఎలాంటి క్లూ వదల్లేదు." నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.
"తనకి డైరీ రాసే అలవాటు వుందా?"
"తనకి డైరీ రాసే అలవాటు లేదు. ఒకవేళ వున్నాతను అందులోకూడా ఎలాంటి క్లూ వదిలేదని నేను అనుకోను. తను కావాలనే మాకు ఏ విషయం తెలియనివ్వలేదు. తెలియడం తనకిష్టం లేదు."
స్మరన్ అవునన్నట్టుగా తలూపాడు. "ఈ సమీర కాకుండా ఇంకెవరైనా తనకి క్లోజ్ ఫ్రెండ్స్ వున్నరా?"
"ఈ సమీర ఒక్కతే తనకి క్లోజ్ ఫ్రెండ్. ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్స్ వున్నా వాళ్ళు సమీరంత క్లోజ్ కాదు. సమీరతోనే షేర్ చేసుకోని విషయం వాళ్ళతో కచ్చితంగా షేర్ చేసుకుని ఉండదు."
"ప్రస్తుతానికి ఇంతకన్నా అడగడానికి నాకు తోచడం లేదు. రేపు మీరు ఇదే సమయానికి రండి. నేను ఒక అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి వుంచుతాను. అందులో నేను చెప్పిన రూల్స్ అండ్ కండిషన్స్, ఇంకా మీరు చెల్లించావలిసిన మొత్తమ, నేను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే సమయం లాంటివి ఉంటాయి. మీరు అది చదివి సంతకం చేయవలసి ఉంటుంది. నేను సాధ్యమయినంతవరకు రేపటినుండే నా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను."
"ఆ ప్రకారంగానే చేస్తాను." రంగనాథ్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. "మరి ఈ రోజుకి నేను వెళ్లి రావచ్చా?"
"మీరు వెళ్లి రావచ్చు." స్మరన్ కూడా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. “మీరు ఈ ఫోటో ని నా దగ్గరే ఉంచండి." అప్పటికి ఇంకా టేబుల్ మీదనే వున్నఫోటోని ఆ టేబుల్ డ్రా లో పెట్టాడు స్మరన్.
"తప్పకుండా మీ దగ్గరే ఉంచండి." అని చెప్పాక రంగనాథ్ వెళ్లిపోతుంటే గుమ్మం వరకు వెళ్ళాడు. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్న తరువాత కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేక పోయాడు. ఫొటో లో చూస్తూ ఉంటే కేవలం చాలా అందంగా మాత్రేమే కాదు, ఇంటెలిజెంట్ లా కూడా కనిపిస్తూ వుంది. ఎందుకు తన పేరెంట్స్ ని అంత బాధపెడుతూ ఆత్మహత్య చేసుకుంది?
&&&
ఆ మరుసటి రోజు చెప్పిన టైంకే వచ్చాడు రంగనాథ్ స్మరన్ ఆఫీసుకి.
"నేను ఒక నెలలో ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీరు కావాలనుకున్నది చెప్పగలను. అలాగే మీరుకూడా నాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను." మరొకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి, అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా అయిపోయిన తరువాత స్మరన్ అన్నాడు.
"అందులో మీకు ఏ సందేహం అవసరం లేదు." రంగనాథ్ అన్నాడు.
"నేను మీతో ఇప్పుడు మీ ఇంటికి వస్తాను. నన్ను మీ క్లోజ్ ఫ్రెండ్గా మీ భార్యకి పరిచయం చెయ్యండి. నేను ఆవిడతో మాట్లాడిన తరువాత ఏం చేస్తే బావుంటుందో ఆలోచిస్తాను. ఇంతకీ ఆ మాత్రం మాట్లాడే పరిస్థితుల్లో వుందా మీ ఆవిడ?" స్మరన్ అడిగాడు.
"తాను అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది ఒక్క నిరుపమ చనిపోయింది అన్న విషయాన్ని అంగీకరించడం తప్ప. తన దృష్టిలో మా అమ్మాయి ఇంకా బ్రతికే వుంది.” నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.
“పదండి. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళదాం.” స్మరన్ లేచి నిలబడ్డాడు. తరువాత స్మరన్ తో పాటుగా రంగనాథ్ కూడా లేచాడు.
&&&
అరగంట కన్నా ఎక్కువ తీసుకోలేదు రంగనాథ్ ఇంటికి వెళ్ళడానికి స్మరన్ ఆఫీస్ నుంచి. యిద్దరూ రంగనాథ్ ఇంటిలోకి వెళ్లే సరికి అక్కడ ఒక అరవై ఏళ్ల పెద్ద మనిషి కుర్చీలో కూర్చుని వున్నాడు. బ్లాక్ స్పెక్ట్స్ తో ఇంకా నల్లటి గడ్డం తో వున్నాడు. మనిషి చాలా ఇంప్రెసివ్ గా వున్నా, ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ మాత్రం అయన మొహానికి ఆడ్ గా వున్నయి. ఈ ఇద్దరినీ చూడగానే అయన లేచి నిలబడ్డాడు.
"అరె, నిరంజన్ నువ్వెప్పుడు వచ్చావు? నిర్మల ఎక్కడ?" చిరునవ్వుతో నిరంజన్ మొహంలోకి చూస్తూ అడిగేడు రంగనాథ్.
" నేనొచ్చి అరగంట అవుతూంది. నన్నిక్కడ ఉంచి తను కిరానా షాపుకి వెళ్ళింది ఏవో సామానులు తేవాలని. ఇంతకీ ఈయన ఎవరు?" భృకుటి ముడిచి అడిగాడు నిరంజన్ స్మరన్ వైపు చూస్తూ.
"చెప్పానుగా నేను ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళుతున్నానని." రంగనాథ్ స్మరన్ గురించి చెప్పాడు నిరంజన్ కి.
"మీ గురించి కొంత విన్నాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా వుంది." చిరునవ్వుతో అన్నాడు నిరంజన్.
బదులుగా తాను కూడా నవ్వి రంగనాథ్ మొహంలోకి చూసాడు స్మరన్ ఆ వ్యక్తి ఎవరో చెప్పమన్నట్లుగా.
"మా ఆవిడకి కజిన్ అవుతాడు. కానీ మా ఆవిడకన్నా కూడా నాకే పెద్ద ఫ్రెండ్. ఒకప్పుడు మేమంతా పక్క పక్క ఇళ్లల్లోనే వుండేవాళ్ళము చాలా క్లోజ్ గా. తను సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాక నేను ప్రత్యేకంగా అడగడంతో ఈ వూళ్ళో ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాడు. తను పెళ్లి చేసుకోలేదు. మేం తప్ప చెప్పుకో దగ్గ బంధువులు ఎవరూ లేరు. ఈ వూళ్ళో ఆ ఇంట్లోనే వంటరిగా ఉంటూ ఉంటాడు. ఆ ఇల్లు మా ఇంటికి దగ్గర్లోనే వుంది. " అక్కడే వున్నకుర్చీలో కూర్చోమని సైగచేస్తూ స్మరన్ కి చెప్పాడు రంగనాథ్.
" చాలా మంచిపని చేసారు. మీ ఇల్లు నాకు కూడా దగ్గరే. సైకాలజీ అంటే నాకూ చాల ఇష్టం. నేనూ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను కావలసినప్పుడల్లా మిమ్మల్ని కలుసుకుని మాట్లాడొచ్చు." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.
"మీరు ఎప్పుడైనా నా దగ్గరికి మాట్లాడడానికి రావచ్చు. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. చెప్పానుగా నేను ఆల్రెడీ మీ గురించి విన్నాను." నిరంజన్ కూడా నవ్వాడు.
"నిరంజన్ చాలా ఆసక్తికరమయిన వ్యక్తి. అయన కంపెనీ చాలా బాగుంటుంది. అందుకనే నేను తనని మా ఇంటికి దగ్గర్లో సెటిల్ అవ్వాలని పట్టుపట్టాను." తను కూడా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాక అన్నాడు రంగనాథ్.
"నిజంగా నన్నెక్కువ అభిమానించింది, ఇష్టపడినిది నిరుపమ." మునుపు కూర్చున్న కుర్చీని రంగనాథ్ కి స్మరన్ కి దగ్గరగా లాక్కుని అందులో సెటిల్ అయ్యాక అన్నాడు నిరంజన్. " నన్ను చూసి ఇంప్రెస్ అయి, నా ఇన్స్పిరేషన్ తోనే నిరుపమ సైకాలజీలో జాయిన్ అయింది."
"అంతేనా? తన క్లోజ్ ఫ్రెండ్ సమీర సైకాలజీలో జాయిన్ అవ్వడానికి కూడా నువ్వే కారణం కదా." రంగనాథ్ నవ్వాడు.
"అది నిజమే. కానీ నిరుపమ అంతగా నన్ను అభిమానించి, ఇష్టపడిన వాళ్ళు లేరు." నిట్టూరుస్తూ అన్నాడు నిరంజన్.
"అయితే మీరు నిరుపమకి చాలా క్లోజ్ అన్నమాట. తాను మీతో అన్నీ విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేదా?" కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అడిగాడు స్మరన్.
"ఎస్. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేది. కానీ ఆ ఒక్క విషయం మాత్రం నాతో ఎందుకు షేర్ చేసుకోలేదో నాకు తెలియడం లేదు. ఇంత పెద్ద సైకాలజిస్ట్ ని అయివుండి, తనతో అంత క్లోజ్ అయివుండి కూడా తన మనసులో జరుగుతూన్న సంఘర్షణని అర్ధం చేసుకోలేకపోయాను. ఇంతమందిని బాధపెడుతూ తనెందుకు ఆత్మహత్య చేసుకుందో అసలు అంతుపట్టడం లేదు." కుర్చీలో వెనక్కివాలి కళ్ళుమూసుకుని నిట్టూర్చాడు నిరంజన్.
"ఆ విషయం తెలుసుకోవాలనే నేను స్మరన్ గారిని ఎంగేజ్ చేసింది. నాకు పూర్తి నమ్మకం వుంది, స్మరన్ గారు కచ్చితంగా ఆ విషయం తెలుసుకోగలరని." స్మరన్ ముఖంలోకి చూస్తూ అన్నాడు రంగనాథ్.
"కానీ ఏం ప్రయోజనం రంగనాథ్, నువ్వెందుకు ఆ విషయం తెలుసుకోవాలని అంతగా ఆరాట పడుతున్నావు?" కళ్ళు తెరిచి రంగనాథ్ ముఖంలోకి చూస్తూ అడిగాడు నిరంజన్. "మనం ఏం తెలుసుకున్నా తనింక తిరిగి రాదు. అంతే కాకుండా ఇంకొక విషయం కూడా స్పష్టంగా అర్ధం అవుతూంది. తనకి ఆ విషయం మనకి తెలియడం ఇష్టంలేదు. అటువంటప్పుడు, నువ్వా విషయం గురించి పూర్తిగా మర్చిపోయి నిర్మల ఆరోగ్యం మీద ధృష్టి ఎందుకు పెట్టకూడదు?"
"నేను అదే సజెస్ట్ చేసాను. కానీ రంగనాథ్ గారు ఆ విషయం తెలుసుకోవాలని చాలా పట్టుదలగా వున్నరు." తాను కూడా రంగనాథ్ ముఖంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.
"నేను నీలా ఆలోచించలేక పోతున్నాను నిరంజన్. తను ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం కన్నా కూడా తనెందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయమే నన్ను ఎక్కువ బాధిస్తూంది. తనెందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలిసి తీరాల్సిందే." పట్టుదలగా అన్నాడు రంగనాథ్.
"ఓకే అయితే. నీ కోరిక తీరాలనే నేను కోరుకుంటున్నాను." మరొకసారి కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ నిరంజన్ అన్నాడు.
"ఎనీహౌ, నేను నా ఇన్వెస్టిగేషన్ విషయంలో మీతో డీప్ గా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు మీ దగ్గరికి రావచ్చు?" స్మరన్ అడిగాడు.
"ఎప్పుడైనా సరే." నిరంజన్ నవ్వాడు. "నా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర. సైకాలజిస్ట్ నిరంజన్ ఇల్లు అంటే మీకు ఎవరైనా చూపిస్తారు."
"చాలా సంతోషం." స్మరన్ ఎదో చెప్పబోతూ ఉండగా ఒక యాభై ఏళ్ళ వయసు వున్న మహిళ అక్కడికి అడుగు పెట్టింది. ఆమె ఎవరో చెప్పకుండానే స్మరన్ అర్ధం చేసుకోగలిగాడు.
"నీ గురించే ఎదురుచూస్తూ వున్నాను. మాటిచ్చానుగా నువ్వు వచ్చేవరకు నీ ఇల్లు కాపలా కాస్తానని." నిరంజన్ లేచి నిలబడి నవ్వాడు. "మరింక నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను."
"థాంక్స్ నిరంజన్." అన్నాక స్మరన్ వైపు తిరిగింది నిర్మల. "కానీ ....." స్మరన్ మొహంలోకి ప్రస్నార్ధకంగా చూస్తూ అంది.
"తాను నా క్లోజ్ ఫ్రెండ్ స్మరన్. ఇప్పటివరకు విదేశాల్లో వుండి ఈ మధ్యే స్వదేశానికి వచ్చారు." రంగనాథ్ అన్నాడు.
తన గురించి ఆవిడకి ఎలా పరిచయం చెయ్యాలో ఆల్రెడీ రంగనాథ్ కి చెప్పి వుంచేడు స్మరన్
"నీ క్లోజ్ ఫ్రెండా? ఈ పేరుతో మీకు ఓ క్లోజ్ ఫ్రెండ్ వున్నట్లుగా మీరు నాకు ఎప్పుడూ చెప్పనేలేదు." నిర్మల భృకుటి ముడిపడింది.
"చెప్పే వుంటాను నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను ఒక వ్యక్తిని నా క్లోజ్ ఫ్రెండ్ అని నీకు పరిచయం చేసాక నువ్విలా మాట్లాడడం సభ్యతేనా?" చిరాగ్గా అన్నాడు రంగనాథ్.
"సారీ. నేనలా మాట్లాడకూడదు." విచారంగా అంది నిర్మల. " నా భర్త క్లోజ్ ఫ్రెండ్ మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా వుంది. మీరు కాస్సేపు ఆలా కూర్చోండి. నేను కాఫీ తీసుకు వస్తాను మీ అందరికి."
"నేను రాగానే నువ్వు నాకు కాఫీ ఇచ్చేసావు. ఇంకా నేను వచ్చి చాలాసేపు అయింది కూడా. నేను వెళ్ళొస్తాను. మీరు మీ మాటలు కొనసాగించండి." ఆలా చెప్పాక నిరంజన్ అక్కడినుండి వెళ్లి పోయాడు.
తరువాత నిర్మల వంటింట్లోకి వెళ్ళింది కాఫీ తీసుకురావడానికి.
"తనే నా భార్య అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. తన పేరు నిర్మల. చెప్పానుగా అన్ని విషయాలలోనూ బాగానే ఉంటుంది. కానీ మా అమ్మాయి నిరుపమ మాత్రం ఇంకా బ్రతికి ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటుంది. నేను మా అమ్మాయి చనిపోయిందని తనని ప్రత్యేకంగా నమ్మించాలని చూడలేదు. తను అలాగైనా ఆనందంగా ఉండడం నాకు ఆనందం గా వుంది."
స్మరన్ తలూపి మౌనంగా వుండిపోయాడు ఏమి మాట్లాడాలో తెలియక. ఈ లోగా ఆవిడ కాఫీ తీసుకుని వచ్చింది.
"నేనొక బిజినెస్ మాన్ని. విదేశాల్లో బాగానే సంపాదించుకున్నాక స్వదేశంలో స్థిరపడాలనిపించింది. అందుకనే వచ్చేసాను." నిర్మల ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అన్నాడు స్మరన్.
"మంచిపని చేసారు. పుట్టిన దేశం కన్నా గొప్ప దేశం మనకి ఏది ఉంటుంది చెప్పండి?" నిర్మల నిరంజన్ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుని అంది. "మీ కుటుంబం అంతా కూడా విదేశం నుంచి స్వదేశం వచ్చాసారనుకుంటాను."
"నా భార్య మూడవ నెల ప్రేగ్నన్ట్ గా వున్నపుడు ఆక్సిడెంట్ లో చనిపోయింది. తరువాత నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. నా పేరెంట్స్ కూడా ఎప్పుడో చనిపోయారు. నాకు ఒక అక్క, ఆమె కూతురు తప్ప వేరే చెప్పుకోదగ్గ బంధువులు ఎవరు లేరు." స్మరన్ దీర్ఘంగా నిట్టూర్చాడు.
"ఎంతటి బాధాకరమయిన విషయం!" నిర్మల మొహం అంతా విచారంతో నిండిపోయింది.
అదే ఫీలింగుతో రంగనాథ్ స్మరన్ మొహంలోకి చూసాడు. అది మాత్రం నిజమే అన్నట్లుగా తలూపాడు స్మరన్.
"నిజానికి ఆ బాధ నుండి తప్పించుకోవడానికే తాను విదేశానికి వెళ్లి పోయింది." రంగనాథ్ అని స్మరన్ మొహంలోకి చూసాడు. ఆమోదించినట్టుగా స్మరన్ తలూపాడు.
"విచారపడకండి. మీకు మీ అక్కయ్య, ఇంకా ఆమె కూతురుతో పాటుగా మేము కూడా వున్నాం అని భావించండి." నిర్మల అంది.
"తప్పకుండా అలాగే. మీరు కూడా నాకు ఎంతో ఆత్మీయులు లాగానే కనిపిస్తూ వున్నారు." చిరునవ్వుతో కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు స్మరన్.
"మా అమ్మాయి నిరుపమ ఇంటి దగ్గర ఉండివుంటే నేను మీకు పరిచయం చేసేదాన్ని. తాను అందరితోటి ఎంతో తేలిగ్గా కలిసిపోతుంది. కానీ తానిప్పుడు తన ఫ్రెండ్ సమీర దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిందంటే తనకి సమయం తెలియదు. ఎప్పుడు ఇంటికి వస్తుందో చెప్పలేం."
వెంటనే స్మరన్ రంగనాథ్ మొహంలోకి చూసాడు. 'ఇదీ పరిస్థితి' అన్నట్లుగా విచారవదనంతో తలూపాడు రంగనాథ్.
"నో ప్రాబ్లెమ్. నేను మరొకసారి వచ్చినప్పుడు తనని కలిసి మాట్లాడతాను. నేను కూడా మీకు దగ్గరలోనే ఉంటున్నాను" .కాస్త ఆగి మళ్ళీ అన్నాడు స్మరన్. "రంగనాథ్ తరచు నిరుపమ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తాను చాలా ఏక్టీవ్ ఇంకా ఇంటెలిజెంట్ ట కూడా కదా."
"అంతే కాదు. తను చాలా అందంగా ఉంటుందని కూడా అందరూ అంటూ వుంటారు. మీరు తనతో మాట్లాడిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి." నవ్వుతూ అంది నిర్మల. ఎంత నవ్వుతూ వున్నా ఎదో విచారం నిర్మలలో గూడు కట్టుకుని కనిపిస్తూ వుంది స్మరన్ కి. "మీరు ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి, ఇక్కడే ఉండాలి. ఆలా అయితే మీరు మా అమ్మాయిని చూసి మాట్లాడొచ్చు కూడా."
"ఈ సారికి మీరు నను క్షమించాలి. నేను మా అక్కకి తనింటికి వస్తానని మాటిచ్చాను. ఇప్పటికే లేటయింది, నేను ఇంక బయలుదేరాలి. చెప్పానుగా, నేను మీకు దగ్గరలోనే ఉంటున్నాను. త్వరలోనే మీ ఇంటికి మళ్ళీ వస్తాను." కుర్చీలోంచి లేచి నిలబడి అన్నాడు స్మరన్.
"మీరెప్పుడు వచ్చేది కొంచెం ముందుగా తెలియపరచండి. నేను మా అమ్మాయి కూడా ఇంటి దగ్గరే ఉండేలా చూస్తాను. తన నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ తనకి పరిచయం కావాలి కదా." నిర్మల కూడా కుర్చీలోంచి లేచి నిలబడింది. నిర్మలతో పాటుగా, రంగనాథ్ కూడా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.
"నేను ఆ సమీర తోటి మాట్లాడాలి. ఆమె ఎక్కడ ఉంటుంది? నేను ఎప్పుడు ఆమెని కలవొచ్చు?" ఇద్దరూ పూర్తిగా ఇంటిబయటకి వచ్చాక స్మరన్ రంగనాథ్ ని అడిగాడు.
"తన ఇల్లు ఇక్కడకి దగ్గరే. తను కూడా ఇప్పుడు సైకాలజీ ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీలో చదువుతూంది. మీరు ఆదివారాల్లో కానీ, ఏదైనా సెలవు దినాల్లోకాని ఆమెని కలవొచ్చు. నేను ఆమె ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. అలాగే తనకి కూడా ఫోన్ చేసి చెప్తాను. తనతో మాట్లాడి వెళ్లి కలవండి." రంగనాథ్ అన్నాడు.
"తను నిరుపమకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్. తన చావుతో మా కన్నా కూడా ఎక్కువగా అప్సెట్ అయిపోయింది. కొన్నిరోజులపాటు అసలు మనిషే కాలేక పోయింది." సమీర ఫోన్ నెంబర్ స్మరన్ కి ఇచ్చాక రంగనాథ్ అన్నాడు.
"ఈ ఇన్వెస్టిగేషన్లో నేను ఏ ఏ స్టెప్స్ తీసుకోబోతున్నానో మీకు త్వరలోనే చెప్తాను. నేను అన్న సమయానికే నా ఇన్వెస్టిగేషన్ పూర్తి చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను." ఆలా చెప్పిన తరువాత అక్కడనుంచి వెళ్ళిపోయాడు స్మరన్.
చాప్టర్-2
మేనక తన బెడ్ రూమ్ లో కూర్చుని తన చేతిలో ఉన్న థ్రిల్లర్ బుక్ ని ఎంత ఇంట్రెస్టింగా చదువుతూంది అంటే తన సెల్ ఫోన్ ఐదోసారి మోగినప్పుడు తప్ప తనకి వినిపించనేలేదు. అప్పటికీ చిరాగ్గా సెల్ ఫోన్ తన చేతిలోకి తీసుకుని స్క్రీన్ వైపు చూసింది. అయితే స్క్రీన్ మీద నెంబర్ చూడగానే తన చిరాకంతా మాయం అయిపోయి, పుస్తకం పక్కన పడసి, బెడ్ మీద స్ట్రెయిట్ గా కూచుంది.
"ఇంత సడన్ గా నేను నీకెందుకు గుర్తుకొచ్చాను అంకుల్?" కాల్ అటెండ్ అవగానే సంతోషంగా అడిగింది మేనక. తన అంకుల్ స్మరన్ తో మాట్లాడ్డం మేనక కి ఎంతో ఆనందం కలిగించే విషయం. స్మరన్ బయటవాళ్ళకే కాదు మేనకకి కూడా ఎంతో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్.
"నేను నిన్నెపుడైనా మర్చిపోయినా? తరచూ ఫోన్ చేస్తూనే ఉంటాను కదా. అయినా ఇలా అడుగుతున్నావు." స్మరన్ స్వరం కోపంగా వినిపించింది.
"సారీ అంకుల్. అది నిజమే. కానీ నువ్వు రెండురోజులు మాట్లాడక పోయినా నాకు నువ్వు ఎన్నో రోజులుగా మాట్లాడనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది." మేనక అంది.
"అదిసరే. కానీ ఇంతకీ ఏ థ్రిల్లర్ అంత ఇంట్రెస్టింగా చదువుతున్నావు? అంత సేపు ఫోన్ తియ్యలేదు."
"టెల్ మీ యువర్ డ్రీమ్స్. సిడ్నీ షెల్డన్ నవల. చాలా ఇంట్రెస్టింగా వుంది. నువ్వూ చదువుతానంటే ఇస్తాను." ఆ బుక్ ని చేతిలోకి తీసుకుని చూస్తూ అంది మేనక.
"నాకు బుక్స్ చదివేంత సమయం ఎక్కడ వుంది?" స్మరన్ నిట్టూర్చాడు. "కానీ అంతకన్నా ఇంటరెస్టింగ్ విషయం ఒకటి ఉంది చేస్తావా?"
"అంటే దానర్ధం నువ్వు మళ్లీ నన్ను ఎదో ఇన్వెస్టిగేషన్ లో ఇంవోల్వ్ చెయ్యబోతున్నావన్నమాట. అదేమిటో త్వరగా చెప్పు." బెడ్ మీదనుంచి ఉత్సాహంగా కిందకి దిగింది మేనక. అప్పుడప్పుడు స్మరన్ తాను చెయ్యబోయే ఇన్వెస్టిగేషన్స్ లో మేనక సహాయం కూడా తీసుకుంటూ ఉంటాడు.
"నీ ఊహ నిజమే. కానీ ఆ వివరాలేమీ ఫోన్లో చెప్పడం కుదరదు. నువ్వు నా ఆఫీసుకి వీలైనంత త్వరగా రా. నిన్ను ఈ అసైన్మెంట్లో సాధ్యమైనంత త్వరగా ఇంవోల్వ్ చెయ్యాలి."
"ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను. సరేనా. బై." ఫోన్ కట్ చేసి తలుపులు తెరుచుకుని వేగంగా బయటకి వచ్చింది మేనక. తాను తన మావయ్యతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్స్ తనకి ఎంతో థ్రిల్లింగా ఉండడమే కాదు, ఆలా హెల్ప్ చేసినందుకు తన మావయ్య తనకి ఎంతోకొంత ఇస్తూ ఉంటాడు కూడా. అందుకనే మేనక ఎప్పుడూ అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
"రాణిగారు మళ్లీ ఎక్కడకి బయటి బయలుదేరారు? ఏ ఫ్రెండ్నికలుసుకుని గంటలతరబడి అనవసరపు మాటలు మాట్లాడడానికి?" మేనక డ్రెస్ అప్ అయి బయటి రాబోతూ వుంటే ఆమె తల్లి ప్రతిమ అంది ఎదురుగా వచ్చి.
" ఏదో ఇన్వెస్టిగేషన్ లో సాయం చెయ్యాలిట. అంకుల్ రమ్మన్నాడు. వెళ్తున్నాను." పర్మిషన్ కోసం కాకుండా ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టుగా చెప్పింది మేనక. తన మావయ్య దగ్గరకి వెళ్లడం అంటే తన తల్లి ఎప్పుడూ కాదనదని మేనకకి తెలుసు.
"సరే అయితే. వెళ్ళు. కానీ సమయం అంతా అక్కడే కాలక్షేపం చెయ్యకు. ఒక్క సెలవు రోజుల్లోనే కదా నువ్వు నేను కలిసుండేది." ప్రతిమ అంది.
ఏమాత్రం ప్రమాదం, ఇబ్బంది లేని విషయాల్లో మాత్రమే మేనక సహాయం తీసుకుంటూ ఉంటాడు తన తమ్ముడు స్మరన్. అంతే కాకుండా మేనక గురించి తన కన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఎపుడైనా ఇటువంటి చిన్న, చిన్న సహాయాలు అడిగినప్పుడు ప్రతిమ అడ్డుపెట్టదు.
మేనక తన తల్లి దగ్గరికి వచ్చి, ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఆమె ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. "నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నేను వేగంగానే వచ్చేస్తాను. సాయంత్రం మనం సినిమాకి కూడా వెళదాం." అంది మేనక.
"నువ్వు వేగంగా రావాలి అంటే, వేగంగా అక్కడకి వెళ్ళాలి కదా." తన కూతురి చేతిని విడిపించుకుంటూ, నవ్వుతూ అంది ప్రతిమ. "మీ అంకుల్ ని అడిగానని చెప్పు. అలాగే నీకో మంచి కుర్రాడిని చూడమని కూడా చెప్పాను. అదెంతవరకు వచ్చిందో కూడా అడుగు."
"అలాగే అమ్మా. తప్పకుండా అడుగుతాను." మరొకసారి తన తల్లిని కౌగలించుకుని, అదే బుగ్గమీద ముద్దు పెట్టి బయట పడింది మేనక.
తన కూతురు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. తన భర్త చనిపోయిన తరువాత తన కూతురే తన లోకం అయిపోయింది ప్రతిమకు. తాను బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ ఉండడంవల్ల ఫైనాన్సియల్ గా ప్రాబ్లెమ్ ఏం లేదు. కానీ ఏ స్త్రీ కైనా భర్త లేని లోటు ఇంకా ఏ ఆడపిల్లకైనా తండ్రిలేని లోటు పూడ్చలేనిది.
తన తమ్ముడు స్మరన్ కి తను అన్నా, తన కూతురు అన్నా ఎంతో ఇష్టం. కానీ తన జీవితం కూడా అలాగే ఉంది. భార్య మూడోనెల గర్భిణిగా వున్నప్పుడు ఆక్సిడెంట్ లో చనిపోవడం ఎంత దురదృష్టకరమైన విషయం! తనెంత బలవంత పెట్టినా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించనే లేదు స్మరన్. నిట్టూరుస్తూ వంటింట్లోకి వెళ్లి పోయింది ప్రతిమ.
&&&
"నేను నీకు ఇప్పటి వరకు హెల్ప్ చేసిన అసైన్మెంట్లు అన్నిట్లోనూ ఎంతో థ్రిల్లింగా, ఉత్సాహంగా ఫీలయ్యాను. కానీ ఈ అసైన్మెంట్ విషయంలో ఆలా ఫీల్ అవ్వలేక పోతున్నాను." తన చేతిలో ఉన్న నిరుపమ ఫోటోని చూస్తూ అంది మేనక. ఒక్క అరగంటలో మొత్తం విషయాన్నీ, ఇంకా మేనక ఏం చెయ్యాల్సి ఉంటుందో కూడా చెప్పేసాడు స్మరన్. "తన తల్లి తండ్రులు ఎంతగా హర్ట్ అవుతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా సూసైడ్ చేసుకుంది? అంత హార్ట్-లెస్ గా ఎలా ఉండగలిగింది?" చూస్తూన్నది కేవలం ఫోటోలోనే అయినా ఆ అమ్మాయి ఆలా ఆత్మహత్య చేసుకుంది అంటే మేనక తట్టుకోలేకపోతూవుంది. నిరుపమ చాలా అందంగా ఇంటెలిజెంట్ లా కనిపిస్తూ వుంది మేనక కి.
"అదే ఆమె తండ్రి రంగనాథ్ ని కూడా దహించేస్తోంది. మనం ఆ కారణం తెలుసుకుని ఆయనికి తెలియ చెయ్యాలి. ఇంతకీ నేను చెప్పినట్టుగా చెయ్యడం నీకిష్టమేనా?" కుర్చీలో వెనక్కి జారగిలబడి అడిగాడు స్మరన్.
"నువ్వు చెప్పినపని నేనెప్పుడైనా కాదంటానా అంకుల్?" తను కూడా కుర్చీలో జారగిలబడి అంది మేనక. "అలాగే. నేను ఆ రంగనాథం ఇంట్లో ఉంటాను. ప్రతీ విషయం కీన్గా అబ్సర్వ్ చేసి నీకు తెలియపరుస్తాను."
"అంతే కాదు. నువ్వింకొంచం పనులు కూడా చెయ్యాల్సి ఉంటుంది. నేను వాటిని నీకు ఫోన్లో కాని, లేదా మనిద్దరం కలుసుకుని మాట్లాడుకున్నపుడుకానీ తెలియపరుస్తూ ఉంటాను."
"ఇది నేను ఊహించిందే. నా పని కేవలం అక్కడే స్టే చేసి నీకు రిపోర్ట్ ఇవ్వడంతో పూర్తవ్వదని నేను ముందే అనుకున్నాను." గల గలా నవ్వింది మేనక. "నువ్వేం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధంగానే ఉంటానని నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా."
"ఆల్రైట్. నేను నిన్ను రేపే రంగనాథం ఇంటికి తీసుకు వెళ్తాను. ఈ అసైన్మెంట్ విషయం నేను అమ్మతో మాట్లాడతాను. నాకు హెల్ప్ చెయ్యడానికి అంటే అమ్మనిన్ను ఎందులో ఇంవోల్వ్ చేసినా కాదనదని నాకు తెలుసు."
"అది నిజమే. మమ్మల్నిద్దరిని ఎంతో అభిమానించే మనిషివి నువ్వు. నువ్వు ఏం చెప్పినా మేమిద్దరం కాదనం." మేనక అంది. "ఇంకా మామ్ నిన్ను అడిగినట్లు చెప్పమంది."
"ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినా ఈ ఫార్మాలిటీలా?" నవ్వాడు స్మరన్. "ఎనీహౌ అమ్మ చూడమందని నీకొక మంచి కుర్రాడిని చూసాను. నువ్వొకసారి చూసి ఒకే అంటే అమ్మతో మాట్లాడతాను. మేము ఏ స్టెప్ తీసుకోవాలన్నాకూడా ముందు నీకు నచ్చాలి కదా."
"ఏమిటి అంకుల్ మామ్ లాగే నువ్వూ మాట్లాడుతున్నావు? నేనిప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. ఏం.ఏ. ఎకనామిక్స్ చెయ్యాలి, పి.హెచ్.డీ చెయ్యాలి, తరువాత లెక్చరర్ గా వుద్యోగం చేయాలన్నది నా కోరిక." మేనక కోపంగా అంది.
"నీ పై చదువులకి మాకిద్దరికి అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోవాల్సిన వయసులో చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. నీకు ఇప్పుడు ఇరవై ఒకటి. మర్చిపోకు."
"ఎలా మర్చిపోతాను? నువ్వూ అమ్మ కూడా అదేపనిగా గుర్తు చేస్తూ ఉంటే." ఇంకా కోపంగానే వుంది మేనక.
"నీ నాన్నగారు చనిపోయాక అమ్మ చాలా బాధ పడింది. నువ్వే తనకి లోకం అయిపోయావు. నీకొక మంచి భర్తని సంపాదించి పెట్టడం తన ధ్యేయం. ఇప్పటినుంచి చూస్తేనే కానీ మంచి కుర్రాడిని వెదికి పట్టుకోలేం. ఒకవేళ మంచి అబ్బాయి వేగంగా దొరికేస్తే కాదనకమ్మా." వేడుకోలుగా చూసాడు స్మరన్.
"సరే అంకుల్, ఆలోచిస్తాను." కుర్చీలోంచి లేచింది మేనక. "నేను వెళ్లి ఈ రోజంతా మామ్ తో గడపాలి. రేపటినుండి ఎంతకాలం ఆ ఇంట్లో ఉండాలో తెలియదు. నేను కూడా మామ్ కి విషయం చెప్పి ప్రిపేర్ చేస్తాను."
"రేపు మార్నింగ్ పదికల్లా ఇక్కడకి వచ్చేయి. ఇక్కడినుంచి మనిద్దరం రంగనాథం ఇంటికి వెళదాం." స్మరన్ కూడా కుర్చీలోంచి లేచాడు.
&&&
"చెప్పాను కదా నేను ఇక వస్తూనే ఉంటానని. అందుకనే మళ్ళీ వచ్చాను." స్మరన్ నవ్వుతూ అన్నాడు. తను, మేనక రంగనాథం ఇంటికి వెళ్లి ఒక్క ఐదు నిముషాలు అవుతూంది. అప్పటికి మేనకని తన అక్క కూతురిగా పరిచయం చేసేసాడు. "అంతేకాదు ఈ సారి మీరు నాకో సహాయం కూడా చేసిపెట్టాలి."
"మేము మీకు ఏ సహాయం అయినా చెయ్యడానికి సిద్ధంగానే ఉన్నాం. కాని మనం అదంతా మీరు కొంచం కాఫీ తాగిన తరువాత మాట్లాడుకుందాం." నిర్మల కూడా నవ్వుతూ అంది. రంగనాథం, స్మరన్ ఇంకా మేనక కుర్చీల్లో కూర్చుని ఉంటే తను మాత్రం వాళ్ళకి అపోజిట్ గా నిలబడి వుంది.
"ముందు మీరు నా మాట విని దానికి అవునంటే తప్ప నాకు మనసు శాంతిగా ఉండదు." అన్నాడు స్మరన్.
"అయితే సరే. అదేమిటో తెలియచేయండి." అక్కడున్న ఇంకో కుర్చీని వాళ్ళకి అపోజిట్ గా లాక్కొని అందులో కూర్చుంటూ అంది నిర్మల.
"మీకు ఆల్రెడీ పరిచయం చేసేసానుగా ఈ అమ్మాయి మా అక్క కూతురని." మేనక వైపు చూస్తూ మొదలుపెట్టాడు స్మరన్. " మా అక్క బ్యాంకు మేనేజర్. కొన్ని రోజులపాటు అర్జెంటు పనిమీద వేరే వూరు వెల్తూ వుంది. తనెప్పుడూ మేనకని ఒక్కర్తినీ ఇంట్లో వదలి వెళ్ళలేదు. నా దగ్గర వుంచుదామన్నానేను నా అసైన్మెంట్స్ మీద తిరుగుతూ వుంటాను. మీకు అభ్యంతరం లేక పోతే మా మేనకని మీ ఇంట్లో కొంచెం రోజులు ఉంచుదాం అనుకుంటాన్నాను. మీరు కాదనరనే ఉద్దేశంతో నేను మా అక్కకి చెప్పేసాను కూడా తన కూతుర్ని మీ ఇంట్లో వుంచుతానని. నా స్నేహితుడి ఇంట్లో తన కూతురిని ఉంచడానికి మా అక్కకి ఎటువంటి అభ్యంతరం లేదు."
"ఇది నిజంగా మీరు ఇలా అడగాల్సిన విషయమా? సింపుల్గా మేనక మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని ఎందుకు చెప్పరు?" నిర్మల కోపంగా అంది. "కొన్ని రోజులు కాదు. ఎప్పటికీ తను ఇక్కడే వుంటుందన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తనని చూస్తూ ఉంటే నాకు మా అమ్మాయిని చూస్తూన్నట్టే వుంది. తనూ ఎక్కువగా ఇలా పంజాబీ డ్రెస్ లోనే ఉండేది. రెండు జడలు వేసుకునేది." తన మొహంలోకే చూసి అంటూవుంటే మేనక కూడా నిర్మల మొహంలోకి చూసింది. ఏదోబాధ అంతర్లీనంగా కొట్టొచ్చినట్టుగా కనిపించింది నిర్మల మోహంలో మేనకకి.
"మా ఆవిడ చెప్పింది నిజం. స్మరన్, మేనక మా ఇంట్లో ఉండడం మా ఇద్దరికీ చాలా ఇష్టం అయిన విషయం. తను ఉండడానికి వీలుగా కిందని ఒక రూంని ఏర్పాటు చేస్తాను." రంగనాథ్ అన్నాడు.
"వేరే రూమ్ ఎందుకండీ? నిరుపమ తన మేనత్త ఇంటినుండి రావడానికి ఒక నెల రోజులు పడుతుంది కదా. తను వచ్చేవరకు ఈ అమ్మాయి తన రూంలోనే ఉంటుంది. తనొచ్చేసాక ఆలోచించొచ్చు. కావాలంటే యిద్దరూ అప్పుడు ఒక రూమ్ లోనే ఉంటారు." రంగనాథం మొహంలోకి చూస్తూ అంది నిర్మల.
ఇమ్మీడియేట్ గా మొహాల్లోకి చూసుకున్నారు రంగనాథ్, స్మరన్ ఇంకా మేనక. నిర్మల పరిస్థితి అంతా స్మరన్ వివరించి చెప్పడం వల్ల మేనక ఆశ్చర్యపడలేదు.
"ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? మీకెవరికైనా ఇందులో అభ్యంతరం వుందా?" ప్రస్నార్ధకంగా అడిగింది నిర్మల.
"తన రూంలో ఉండడానికి నాకెలాంటి అభ్యంతరంలేదు." మేనక వెంటనే అంది. అంతకన్నా ఇంకేం మాట్లాడాలో తనకి తెలియడం లేదు. ముందే తెలిసినా, నిర్మల తన కూతురు ఇంకా బ్రతికే ఉందని ఆలా నమ్మడం హృదయాన్ని పిండుతున్నట్టుగా ఉంది మేనకకి.
"మరింకేం? మీరు తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఆ రూమ్ చూపించండి. నేను ఈ లోపల కాఫీ తీసుకుని వస్తాను." కుర్చీలోంచి లేస్తూ అంది నిర్మల.
తలూపి రంగనాథ్ కుర్చీలోంచి లేచాడు. స్మరన్ ఇంకా మేనక కూడా వాళ్ళ కుర్చీలు ఖాళీ చేసారు.
"మా అమ్మాయి రూమ్ మేడ మీద వుంది. మీరు నాతో రండి." అక్కడినుంచి కదులుతూ అన్నాడు రంగనాథం. అప్పుడు రంగనాథం, స్మరన్ ఇంకా మేనక మేడ మీద రూంలోకి వెళుతూ ఉంటే నిర్మల వంటింటి వైపు నడిచింది.
&&&
"చూసారుగా. అదీ పరిస్థితి. తను చనిపోయినా మా అమ్మాయి ఇంకా బ్రతికే ఉందని నమ్ముతోంది మా ఆవిడ. తననెలా మా అమ్మాయి చనిపోయిందని నమ్మించాలో నాకు అర్ధంకావడం లేదు." మేడమీద రూమ్ లోకి వెళ్ళాక విచార వదనంతో అన్నాడు రంగనాథ్.
"నో మిస్టర్ రంగనాథ్. తన కూతురు చనిపోయిందన్న విషయం మీ ఆవిడకి తెలుసు. కానీ ఆ విషయం ఏక్సెప్ట్ చెయ్యడం తనకి ఇష్టంలేదు. అందుకనే తను బ్రతికి ఉందని బలవంతంగా తనని తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తూ వుంది." స్మరన్ అన్నాడు.
"మీరు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా రూమ్ మధ్యలో నిలబడిపోయి అన్నాడు రంగనాథ్.
"జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్ధం అవుతుంది." రంగనాథ్ మొహంలోకి అర్ధవంతంగా చూస్తూ అన్నాడు స్మరన్. "కొంచం గుర్తు చేసుకోండి. మొదటిసారి నేను వచ్చినప్పుడు నిరుపమ తన ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్లిందని చెప్పింది. ఎందుకంటే తనని నాకు పరిచేయం చెయ్యడం కుదరదని తనకి బాగా తెలుసు. ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికే ఆలా చెప్పింది. ఇప్పుడు నిరుపమ ఎప్పటికీ తన రూమ్ లోకి రానే రాదని ఆవిడకి తెలుసు. అందుకనే మేనక ఈ రూమ్ లో ఉండడానికి అంగీకరించింది. చూస్తూ వుండండి. నెల రోజులు గడిచాక తను ఇంటికి రాకపోవడానికి ఇంకొక కారణం చెప్తుంది."
"మై గాడ్! వాట్ ఈజ్ దిస్? నా గుండెలు పిండేస్తున్నట్టుగా వుంది అంకుల్. తన తల్లి ఇలా పిచ్చిదానిలా అయిపోతుందని ఊహించలేక పోయిందా అంతా హార్ట్ లెస్ గా సూసైడ్ చేసుకుంది ఆ రాస్కేల్!" కోపాన్ని తట్టుకోలేక పోతూ వుంది మేనక.
"కూల్, కూల్ యువర్ సెల్ఫ్ డియర్. అదీ తెలుసుకోవడానికే గదా మనం ప్రయత్నం చేస్తూంది." మేనక భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు స్మరన్.
"ఐ యామ్ సారీ అంకుల్. నేనలా అని ఉండకూడదు." బాధగా రంగనాథ్ మొహంలోకి చూస్తూ అంది మేనక.
"ఫర్వాలేదమ్మా. ఎన్నోసార్లు నేను అలాగే అనుకున్నాను. కనీసం ఇంతగా బాధపడే తన తల్లి గురించయినా ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.
"ఎనీహౌ, ఇదే నువ్వుండబోయే గది. మా అమ్మాయి చనిపోయాక తన గదిలోకి మేమొచ్చింది చాలా తక్కువసార్లు. ఈ గదినిండా మా అమ్మాయి జ్ఞాపకాలే వున్నయి." కాస్త ఆగి మళ్లీ అన్నాడు రంగనాథ్. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు తను.
"మా ఆవిడ ఆక్సిడెంట్లో చనిపోయినపుడు చాలా రోజులు మీలాగే బాధపడ్డాను నేను కూడా. కానీ మనం ఎం చేయగలం? కొన్ని విషయాలు మనం యాక్సప్ట్ చేసే తీరాలి." రంగనాథ్ కుడిచేతిని చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు స్మరన్. "దేవుడు చిన్నచూపు చూసినప్పుడు మనం ఇలాగే బాధపడాలి. కాలమే మీకు మనోశాంతి ఇవ్వగలదు."
"అది కాదు. మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిస్తే నాకు కొంత మనోశాంతి లభిస్తుందనుకుంటున్నాను. మీరు తెలుసుకోగలరు కదా ఆ విషయం? మీ మీదే ఆశతో ఉన్నాను." స్మరన్ మొహంలోకి చూస్తూ, తన కుడి చేతిని అతని చేతుల్లోనుంచి విడిపించుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రంగనాథ్.
" తప్పకుండా. ఒక నెలకి కొంచం అటూ ఇటూ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను." స్మరన్ స్వరం ధృడంగా ఉంది.
"ఆల్రైట్." తలూపి మేనక మొహంలోకి చూసాడు రంగనాథ్. "ఈ గదిలోనే ఇదిగో ఈ సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది మా అమ్మాయి. ఇదే రూంలో ఉండడానికి నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా."
అనుకోకుండానే సీలింగ్ ఫ్యాన్ వైపు చూసింది మేనక. ఎదో చెప్పలేని భయంతో నిండిపోయింది ఆమె హృదయం.
"నువ్వు ఈ రూంలో ఉండలేనంటే చెప్పు. నీకు కింద వేరే రూమ్ ఏర్పాటు చేస్తాను. మా ఆవిడకి ఎదో ఒక కారణం చెప్పొచ్చు." రంగనాథ్ మళ్ళీ అన్నాడు.
"అవును మనూ. నీకు ఇక్కడ వుంటే ఇబ్బందిగా ఉంటుందనిపిస్తే నువ్వు వేరే రూంలో ఉండొచ్చు. అది నీ అసైన్మెంట్ కి ఇబ్బంది ఏమీ కాదు." స్మరన్ కూడా అన్నాడు మేనక మొహంలోకి చూస్తూ.
"ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇదే రూంలో ఉంటాను." సడన్ గా ఒక రకమైన ధృడత్వంతో అంది మేనక.
"కానీ...." రంగనాథ్ ఎదో చెప్పబోయాడు.
"అంకుల్." మేనక మాట్లాడడం మొదలు పెట్టింది. "నిరుపమ నాలాంటి నా అంతా వయసే ఉన్న ఒక అమ్మాయి. ఎదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంది. అంతమాత్రం చేత నేను భయపడేలా? అంతేకాకుండా తనెందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి నేను నా అంకుల్ కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇదే రూంలో వుంటే నాకేమయినా హింట్స్ లభించొచ్చోమో కూడా. అందుకని నేను ఈ రూమ్ లోనే ఉంటాను."
"నువ్వలా అనుకుంటే ఇబ్బందేమీ లేదు." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.
రంగనాథ్ ఎదో అనబోతూ వుంటే కాఫీ కప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది నిర్మల. ముగ్గురు ఎలెర్ట్ అయిపోయారు.
"మీరు ఇంకా ఇక్కడే ఉండడంతో నేనే ఇక్కడికి వచ్చాను." ఆ ట్రేతో వాళ్ళ దగ్గరికి వచ్చింది నిర్మల.
"ఈ గది నాకు ఎంతగానో నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను." ఒక కాఫీ కప్పు ట్రే లోంచి తీసుకుంటూ అంది మేనక.
"నీకు నచ్చుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మా అమ్మాయి తన గదిని ఎంతో చక్కగా ఉంచుకుంటుంది." రంగనాథ్ అన్నాడు. స్మరన్, రంగనాథ్ కూడా కాఫీ కప్పులు తీసుకున్నారు ఆ ట్రే నుండి. "ఇంతకీ మా అమ్మాయి ఫోటోని చూసావా ఈ గోడ మీద." ఖాళీ ట్రే తో అక్కడికి కొంచం దూరంలో ఉన్న గోడ దగ్గరికి వెళుతూ అంది నిర్మల. స్మరన్, రంగనాథ్ ఇంకా మేనక కూడా ఆమె వెనకాలే నడిచారు.
రంగనాథ్ స్మరన్ కి ఇచ్చిన ఫోటో యే అదీ. బాగా ఎన్లార్జ్ చేసి గోడ మీద పెట్టారు. "తనని కలిసి మాట్లాడే ముందు తనెలా ఉంటుందో తెలుసుకోవడం నీకు బాగుంటుంది." ఆ ఫోటో వైపు చూస్తూ అంది నిర్మల.
"మీ అమ్మాయి నిజంగా బ్యూటిఫుల్! ఇంత అందమైన అమ్మాయిని ఇప్పటివరకు నేను చూడలేదు." ఆ పెద్ద ఫొటోలో ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది నిరుపమ.
"తనని కలుసుకుని మాట్లాడడానికి నువ్వు బాగా ఎదురు చూడాల్సిందే. తన మేనత్త ఇంటికి వెళ్లిందంటే ఒక పట్టాన రాదు. తన మేనత్త కూడా ఒక పట్టాన తనని పంపించదు." మేనక మొహంలోకి నవ్వుతూ చూస్తూ అంది నిర్మల.
కానీ ఆ నవ్వులో ఇంకా మోహంలో ఎదో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది మేనకకి. తన అంకుల్ చెప్పింది అక్షరాలా నిజం! ఈమెకి తన కూతురు చనిపోయిందన్న విషయం తెలుసు. తను బ్రతికే ఉందని బలవంతంగా తనని తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.
"అలాగే ఆంటీ. తనని కలుసుకోవాలని నాకూ చాలా ఆతృతగానే ఉంది. కానీ తనక్కడ ఆలా ఎంజాయ్ చేస్తూందంటే చెయ్యనివ్వండి. నేను ఎదురుచూస్తాను. ఫర్వాలేదు." తనూ చిరునవ్వుతో అంది మేనక.
"అయితే నువ్వింకిక్కడ సెటిల్ అవ్వు. నేను మళ్ళీ కలుస్తాను. నా పనులు నీకు తెలుసు కదా. అమ్మతో మాత్రం ఫోన్లో మాట్లాడుతూ ఉండడం మర్చిపోకు." మేనక మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.
"నేను మర్చిపోయినా తను నాకు ఫోన్ చెయ్యడం మర్చిపోదు. నువ్వేమి ఆందోళన పడకు. ఇంకా ఇక్కడ ఆంటీ నాకుండగా ఎవరూ నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." నిర్మల మొహంలోకి చూస్తూ అంది మేనక.
"చాలా కరెక్ట్ గా చెప్పావు!" మెచ్చుకోలుగా మేనక మొహంలోకి చూస్తూ అంది నిర్మల. "మీ అమ్మగారు నీకు ఫోన్ చేసినపుడు తనని ఇక్కడకి రమ్మని చెప్పు. తనతో నాకు మాట్లాడాలని ఉంది."
" తప్పకుండా అలాగే చేస్తాను." తలూపుతూ అని స్మరన్ మొహంలోకి చూసింది మేనక. "నా గురించి ఏమీ ఆలోచించకుండా మీరు వెళ్ళండి అంకుల్. మామ్ కి నా గురించి ఏ విచారం అవసరం లేదని చెప్పండి. నేను మాట్లాడినప్పుడు నేనూ చెప్తాను." అంది.
"సరే అయితే." అని ఆ గదిలోంచి బయటకి వచ్చాడు స్మరన్. స్మరన్ వెనకాతలే రంగనాథ్ కూడా వచ్చేసాడు నిర్మలని, మేనక అదే రూంలో విడిచిపెట్టి.
&&&
"నిరుపమ చనిపోయాక నేనే ఆ ఫోటోని అంతగా ఎన్లార్జ్ చేయించాను. అది కింద హాల్ లో పెట్టి పువ్వుల దండ వెయ్యాలని నా అభిప్రాయం. కానీ మా ఆవిడ ఒప్పుకోలేదు. ఎలాగో ఆ ఫోటో తన రూమ్ లో ఆలా పెట్టాను కానీ పువ్వుల దండ వెయ్యడానికి మాత్రం మా ఆవిడ ఒప్పుకోలేదు." యిద్దరూ ఇంటిబయటకి వచ్చాక నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.
"ఎలా ఒప్పుకుంటుంది తను మీ అమ్మాయి చనిపోయిందని అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు." ఆగి రంగనాథ్ మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్. "ఎనీహౌ నిరంజన్ సైకాలజిస్ట్ కదా. మీ ఆవిడగురించి అతను ఏమన్నాడు?"
"ఎదో ట్రీట్మెంట్ అవసరం అన్నాడు. కానీ మీరు చెప్పింది మాత్రం చెప్పలేదు." తనూ ఆగి అన్నాడు రంగనాథ్.
"ఈ రోజే నేను ఆయన్ని కలుసుకుని మాట్లాడతాను. తన దగ్గర నాకు ఎదో ఒక క్లూ దొరకొచ్చనిపిస్తూంది."
"నాకు అలా అనిపించడం లేదు. మా అమ్మాయి నాతోటి ఎంతో క్లోజ్. అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునేది. ఆ విషయం నాకే చెప్పనప్పడు నిరంజన్ కి మాత్రం చెప్పి ఉంటుందా?" భృకుటి ముడివేసి అన్నాడు రంగనాథ్.
"ఆ విషయం నాకు వదిలివేయండి. నేను మాట్లాడి తేల్చుకుంటాను. మరింక నేను వెళ్ళొస్తాను." ఆ తరువాత అక్కడినుంచి తను ఇంకా మేనక వచ్చిన మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు స్మరన్.
&&&
"నేను పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఐదు సంవత్సరాల సర్వీస్ అయింది. అప్పుడు మూడు నెలల గర్భిణీ గా వున్న నా భార్య ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తరువాత నాకెందుకో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చెయ్యాలని అనిపించలేదు. అందుకే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ డిటెక్షన్ పని మొదలు పెట్టాను. మరీ ప్రతీ అసైన్మెంట్ లోనూ సక్సెస్ ఫుల్ కాలేక పోయిన ఫర్వాలేదు. అలాగే నాకు ఇతర ఆస్తులు కూడా కొన్ని వున్నయి. దాంతో నాకు మైంటెనెన్సు కి ఇబ్బంది లేదు. అందులోనూ నాకు ఫామిలీ కూడా లేదు కదా. దాంతో పెద్ద ఖర్చులూ వుండవు." నిట్టూరుస్తూ అన్నాడు స్మరన్. "ఎనీహౌ ఈ డిటెక్షన్ అంటే నాకు మొదటినుండీ చాలా ఇష్టం. ఎదో ఒక పద్ధతిలో లైఫ్ సెటిల్ అవుతుందని పోలీస్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాను కానీ నాకు డిటెక్షనే చెయ్యాలని ఉండేది."
"మీ భార్య పోయిన నాటికీ మీ వయసు ఎంత?" నిరంజన్ అడిగాడు.
అప్పటికి ఒక్క అరగంట అయింది స్మరన్ నిరంజన్ దగ్గరికి వచ్చి. ఆ ఇద్దరూ నిరంజన్ గదిలో సెటిల్ అయ్యారు. ఎప్పటిలాగే నిరంజన్ ఆ నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని వున్నాడు.
"ముప్ఫయి. ఆ సంఘటన జరిగి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అయింది." స్మరన్ నవ్వుతూ అన్నాడు. "మీరు తరువాత అడగబోయే ప్రశ్న నేను చెప్పగలను. మళ్ళీ నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని, అవునా?"
"ఎగ్జాట్లీ. మీరు చాలా యంగ్ గా ఉండగానే మీ భార్య చనిపోయారు. మళ్ళీ మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేదా మళ్ళీ పెళ్లి చేసుకోమని?" భృకుటి ముడేసాడు నిరంజన్.
"నాకు ప్రేమలు లాంటివి పెద్దగా తెలియదు. అప్పటి మా అసోసియేషన్ కేవలం రెండు సంవత్సరాలే అయినా నేను నా భార్యా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం ఎంతో అభిమానించుకొనేవాళ్ళం. అందువల్లే అనుకుంటా తాను చనిపోయాక నేను ఇంకొక అమ్మాయి గురించి కూడా ఆలోచించ లేకపోయాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసంతా తనే నిండిపోయి ఉంది. అందుకనే ఇంకొక పెళ్ళికి అంగీకరించలేదు. మా అక్క నన్ను చాలా ప్రెజర్ పెట్టింది. కానీ నేను ఇంకొక అమ్మాయి గురించే ఆలోచించ లేనప్పుడు పెళ్లిచేసుకోవడం ఆ అమ్మాయికి ద్రోహం చెయ్యడమే కదా."
"మీకు ప్రేమలు లాంటివి పెద్దగా తెలియవన్నారు, కానీ దీనినే నిజమైన ప్రేమ అంటారు." కుర్చీలో వెనక్కివాలి అన్నాడు నిరంజన్. "నా జీవితంలో మీ జీవితంలో లాంటి విషాదకర సంఘటనలేమి లేవు. కానీ నాకు మొదటినుండీ వివాహం మీద, సంసారం జీవితం మీద ఆసక్తి లేదు. అందుకనే నేను పెళ్లిచేసుకోలేదు." నవ్వుతూ అన్నాడు నిరంజన్.
"ఒంటరి జీవితం కూడా ఒక రకంగా ఆనందకరమే. నాకూ అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది." స్మరన్ కూడా నవ్వాడు.
"నిర్మల నాకు ఫస్ట్ కజిన్ కాకపోయినా కజిన్. మా పెద్దవాళ్ళు తన పెద్దవాళ్ళు కూడా తనని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. తనకీ నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టమే. నాకూ తనంటే ఇష్టమే. నాకు ఒంటరి జీవితం ఆసక్తే అయినా తనని పెళ్లి చేసుకునే ఉండేవాడిని. కానీ కజిన్ మేరేజెస్ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. అందుకే తనని పెళ్లి చేసుకోలేదు."
"మన దేశంలో ఫస్ట్ కజిన్ మ్యారేజీలు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా జరుగుతాయి. నిజానికి చాలా ఫేమస్ పీపుల్ కూడా ఫస్ట్ కజిన్లని మ్యారేజీ చేసుకున్నారు. ఆలా ఆలోచించడం మీ మెచూరిటీకి నిదర్శనం." స్మరన్ అన్నాడు.
"ఎలాంటి రక్త సంబంధం భార్యా భర్తల మధ్య ఉండకపోవడం మంచిది మిస్టర్ స్మరన్. అప్పుడే అన్నిరకాలుగా బావున్న పిల్లలు పుట్టే అవకాశం వుంది."
"యు అర్ రైట్ సర్." తలూపుతూ అని ఆగడు స్మరన్ తను అడగాల్సినిది ఎలా అడగడమా అని ఆలోచిస్తూ.
"మీరు నిరుపమ ఆత్మహత్యకి సంభందించి ఏదైనా క్లూ దొరుకుతుందని నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ మిస్టర్ స్మరన్ ఆ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ కాలేనేమో అనిపిస్తూంది." మరోసారి నిట్టూర్చాడు నిరంజన్.
"నిరుపమ మీకు చాలా క్లోజ్ కదా. మీరంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేది." నిరంజన్ అన్నది తను విననట్టుగానే అన్నాడు స్మరన్.
"నేను అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నేను తనకీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో జాయిన్ అయింది." నవ్వుతూ అన్నాడు నిరంజన్.
"తను తన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేదా?"
"తన తండ్రి తరువాత ఏ అరమరికలు లేకుండా ఇంకెవరితోనైనా తన విషయాలు షేర్ చేసుకుందీ అంటే అది కేవలం నాతోనే. తనకీ సంభందించిన ప్రతి విషయం నాతో చెప్పేది. అలాంటిది ....." మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు నిరంజన్. "....అంతగా తనని ఆత్మహత్య చేసుకోడానికి కూడా ప్రేరేపించిన విషయన్నినాకెందుకు చెప్పలేదో నాకు బోధపడడం లేదు."
"తను అన్నిట్లోనూ అందరితో ఓపెన్గా ఉండేదా?"
"లేదు మిస్టర్ స్మరన్. తన పేరెంట్స్, నేను ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్ సమీర తో మాత్రం చాలా క్లోజ్ గా, ఓపెన్గా ఉండేది. అన్ని విషయాలు మాతో మాత్రం షేర్ చేసుకుంటూ ఉండేది."
"తనకీ బాయ్ ఫ్రెండ్స్ కానీ లేదా లవ్ అఫైర్స్ కానీ ......"
"తను చాలా పరిపక్వత వున్న పిల్ల మిస్టర్ స్మరన్. చాలా అలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది. తన గురించి ఎంతో ఆలోచించే తల్లితండ్రులు వున్నారని తెలిసి లవ్ లో పడే అమ్మాయి కాదు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్...." కాస్త ఆగి అన్నాడు నిరంజన్ "ఒక్క సమీర తప్ప గర్ల్స్ లోనే తనకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. బాయ్ ఫ్రెండ్స్ అవకాశమే లేదు."
"తను తన తల్లితండ్రులుని చాలా అభిమానించింది కదా. ఎలాంటి విభేదాలు లేవు వాళ్ళతోటి."
"అసలు ఏ అమ్మాయి అయినా తన పేరెంట్స్ ని అంతగా ప్రేమిస్తుందంటే నేను నమ్మలేను. ఇంకా ఆమె పేరెంట్స్ కూడా అంతే. చూసారుగా ఆమె తల్లి నిర్మల ఏకంగా పిచ్చిది అయిపొయింది ఆమె చనిపోయాక."
"నో మిస్టర్ నిరంజన్. ఆమె తల్లి పిచ్చిది కాలేదు. ఆమెకి తన కూతురు చనిపోయింది, ఇంక లేదు అన్న విషయం తెలుసు. కానీ ఆ విషయం అంగీకరించడానికి ఆమె సిద్ధంగా లేదు." నిరంజన్ మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు స్మరన్.
కుర్చీలోకి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిరంజన్. "యు అర్ రైట్ స్మరన్. నిర్మల తన కూతురు చనిపోయినందువల్ల పిచ్చిది అవలేదు. తనకి కేవలం ఆ విషయం యాక్సెప్ట్ చెయ్యడం ఇష్టం లేదు."
"మరి మీరు రంగనాథ్ కి ఆలా ఎందుకు చెప్పలేదు? తనకి ఎదో ట్రీట్మెంట్ అవసరం అన్నారట."
"తన భార్య తన కూతురు బ్రతికే ఉందని భావిస్తూ ఆనందంగా ఉందని రంగనాథ్ అనుకుంటున్నాడు. తనని అలాగా అనుకోనిద్దామని నేను అసలు విషయం చెప్పలేదు." కుర్చిలో ముందుకు వాలి తన రెండు మోచేతులు తమ రెండు కుర్చీలు మధ్య వున్న బల్ల మీద బాలన్స్ చేసుకున్నాడు నిరంజన్.
"తను చనిపోవడానికి కొద్ది రోజులు ముందు కూడా తన ప్రవర్తనలో మీరు ఎలాంటి మార్పు చూడలేదా? కొంచం అలోచించి చెప్పండి." స్మరన్ కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు. "ఆత్మహత్య చేసుకునేంత విషయంతో బాధపడుతూ కూడా తను మామూలు మనిషిగా ఎలా ఉండగలదు?"
నిరంజన్ మరొకసారి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. "ఇంచుమించులో తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పదిహేనురోజులుగా నిరుపమ నా దగ్గరికి రాలేదు. తనకి ఎగ్జామ్స్ ఏవో జరగబోతూ వున్నయి. ఆ ప్రిపరేషన్ లో బిజీ గా వుంది. సో అందులో ఆశ్చర్యం లేదు."
"మీరేమైనా ఆ పదిహేను రోజుల్లో తన ఇంటికి వెళ్ళారా? తనని చూసి తనతో మాట్లాడడానికి ప్రయత్నించారా?"
" ఒక్కసారి వెళ్ళాను. ఆ రోజు ఆ ఇంట్లోనే భోజనం కూడా చేశాను తనతో కూడా తెలిసి. కానీ తనలో ఎటువంటి మార్పు చూడలేదు. కానీ అందులో కూడా ఆశ్చర్యం లేదు. ఆ కాస్త సమయంలోను తనలో ఎటువంటి మార్పు లేకుండా తను ఉండగలదు."
"అది ఆమె చనిపోవడానికి ఎన్ని రోజులు ముందుగానో చెప్పగలరా?"
"ఫైవ్ డేస్ ముందనుకుంటా."
"ఆల్రైట్." కాస్త ఆగి అన్నాడు స్మరన్. "ఎనీహౌ ఈ విషయం చెప్పండి. చనిపోవడానికి మందు పదిహేను రోజులుగా తను మీ దగ్గరికి రాలేదు. కానీ ఆ పదిహేను రోజులు ముందు తనని మీరు కలిశారు కదా. అప్పుడు తను యూజువల్ గానే వుందా?"
"హండ్రెడ్ పర్సెంట్ తన యూజువల్ సెల్ఫ్. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా. తన ప్రెసెన్సు ఎలాంటిది అంటే డల్ గా వుండే మనుషుల్ని కూడా ఉత్సాహంగా మార్చేస్తుంది."
"ఐ సీ" స్మరన్ తలూపి లేచాడు. "మీరు చాలా కో ఆపరేట్ చేసారు. అవసరం అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక వెళ్ళొస్తాను."
" సారీ మిస్టర్ స్మరన్. నేను మీకు మరీ అంతగా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక పోయాను." తనూ కుర్చీలోంచి లేచి అన్నాడు నిరంజన్.
"ఆలా ఎందుకు అనుకుంటున్నారు? చాలా వేల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు నాకు." స్మరన్ నవ్వాడు.
"నాకు అర్ధం కావడం లేదు. నేను మీకు ఏ వేల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను?" అయోమయంగా చూసాడు నిరంజన్.
"తనని అంతగా అప్సెట్ చేసిన సంఘటన తను చని పోవడానికి ముందు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో జరిగింది మిస్టర్ నిరంజన్. తను పరీక్షలని మీ దగ్గరకి రాకపోవడం కాదు, తను మీ దగ్గర మాములు గా ఉండలేనని తెలిసే నిరుపమ మీ దగ్గరికి రాలేదు. మీ ఎవరి దగ్గర షేర్ చేసుకోక పోవడం మాత్రమే కాదు తనకి మీ ఎవరికీ ఆ విషయం ఏ మాత్రం తెలియడం కూడా తనకి ఇష్టం లేదు." తను చెప్పబోయే విషయం నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అన్నాడు స్మరన్. "అంతే కాదు తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎదో పై విషయం కారణం కాదు. ఇది తన ఫామిలీ మెంబెర్స్ ని ఇంక మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది. అందుకే అది తను మీ ఎవరి దగ్గర షేర్ చేసుకో లేకపోయింది."
"మై గాడ్! మీరు చెప్పే విషయం నన్ను షాక్ కి గురి చేస్తూంది మిస్టర్ స్మరన్. ఆ విషయం నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఏ విధంగా అన్నది నాకు బోధ పడడం లేదు." నిరంజన్ మొహం అంతా షాక్ తో నిండిపోయింది.
"నా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితేనే గాని ఆ విషయం గురించి ఏమీ చెప్పలేను. మిమ్మల్ని అప్సెట్ చేసినందుకు క్షమించండి." స్మరన్ అన్నాడు.
"నో మిస్టర్ స్మరన్. మీరు అలా అనుకోనవసరం లేదు. మీరు చెప్పిన విషయం నన్ను కొంచం షాక్ కి గురి చేసింది అంతే." తలూపుతూ నిట్టూర్చాడు నిరంజన్. "నేను తన తల్లికి కజిన్ నే అయినా, నాకు ఆ కుటుంబానికి చాలా ఇంటిమసీ వున్నా, నాకు నిరుపమ కి బాగా పరిచయం పెరిగింది కేవలం నేను ఇక్కడికి వచ్చిన తరువాతే. ఇక్కడకి చాలా దూరంగా వున్న యూనివర్సిటీ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఫోన్ తో కాంటాక్ట్ లో ఉండేవాడిని కానీ నిరుపమతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఒక సవంత్సరం కిందట రంగనాథ్ సజెస్ట్ చేసాడని ఇక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాను. అప్పటినుండి మాత్రమే నాకు నిరుపమ తో బాగా పరిచయం. తను అప్పుడు బి.ఎస్.సి మ్యాథ్స్ ఫైనల్ ఇయర్ చదువుతూ వుంది. తను ఎం.ఎస్.సి. మ్యాథ్స్ చదవాలనుకుంది. కానీ నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో చేరింది. తన క్లోజ్ ఫ్రెండ్ అలా చెయ్యడం వల్ల అనుకుంటా, ఆమె క్లోజ్ ఫ్రెండ్ సమీర కూడా అలాగే చేసింది.."
"రంగనాథ్ తో మీరు బాగా టచ్ లో వుండేవారా? అదెలా?" ఆశ్చర్యంగా చూసాడు స్మరన్.
"ఆ రోజు రంగనాథ్ చెప్పాడు, మీరు మర్చిపోయినట్టున్నారు." నవ్వుతూ అన్నాడు నిరంజన్. “రంగనాథ్ ఫామిలీ, మా ఫామిలీ ఇంకా నిర్మల ఫామిలీ కూడా ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం. ఇంకా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. రంగనాథ్ ఫామిలీ మాకు బంధువులు కాదంతే. రంగనాథ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా సెలెక్ట్ అయ్యాడు ఇంకా నిర్మలని ఇష్టపడ్డాడు. నేను కాదనడంతో నిర్మలని రంగనాథ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరం లేక పోయింది. నిర్మలకి కూడా తనని పెళ్లి చేసుకోక తప్పలేదు." నవ్వాడు నిరంజన్. "ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రంగనాథ్ మొదటినుంచి నాకు చాలా మంచి ఫ్రెండ్."
"ఐ సీ" నవ్వాడు స్మరన్.
"సమీర తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. నిరుపమ ఖచ్చితంగా తనతో ఏమి షేర్ చేసుకుని ఉండదు. కానీ మీరు నాతో మాట్లాడి ఇంత ఇన్ఫర్మేషన్ రాబట్ట గలిగారంటే, తనతో మాట్లాడితే ఇంకొంచం ఇన్ఫర్మేషన్ రాబట్టగలరు. నాకెందుకో మీరు రంగనాథ్ కోరికని కచ్చితంగా తీర్చగలరని అనిపిస్తూంది."
"థాంక్ యు ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. నేను ఇప్పుడు కలుసుకోవాలనుకుంటున్నది సమీరనే. తన ఫోన్ నెంబర్ ఇంకా అడ్రస్ ఆల్రెడీ రంగనాథ్ దగ్గరనుంచి తీసుకున్నాను." దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ అన్నాడు స్మరన్. "నేను తెలుసుకోబోయే ఈ విషయం రంగనాథ్ కి మరింత బాధ కలిగించవచ్చు అని నాకు అనిపిస్తూంది. నేను ఆ ఆలోచన మానేమని ఆయనకి చెప్పను. కానీ అయన తెలుసుకుని తీరాలనే చాలా పట్టుదలగా వున్నరు."
"అయన అలా ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా కొన్ని విషయాలు బాధ కలిగించేవే అయినా వాటిని తెలుసుకోవడమే మంచిది. మీరు సాధ్యమయినంత త్వరలో ఆ విషయం తెలుసుకుని నాకు కూడా చెప్పండి. మీరు ఎప్పుడైతే ఆ విషయం నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నారో నాకు చాలా ఆరాటం పెరిగింది."
"తప్పకుండ ఆ విషయం సాధ్యమయినంత త్వరలో తెలుసుకునే పరిచయం చేస్తాను." అలా అన్నాక నిరంజన్ రూమ్ లో నుండి బయటికి వచ్చేసాడు స్మరన్.
&&&
పగలు అనిపించినంత ధైర్యంగా, తన అంకుల్ ఇంకా రంగనాథ్ దగ్గర చెప్పినప్పుడు అనిపించినట్టుగా, రాత్రి భోజనం పూర్తి చేసి కాస్సేపు రంగనాథ్ ఇంకా నిర్మలతో కబుర్లు చెప్పి మేడ మీద రూమ్ లో బెడ్ మీద నడుము వాల్చాక అనిపించలేదు మేనకకి. ఎదో తెలియని భయం, ఇంకా అనీజీనెస్ తో మనసంతా నిండిపోయింది ఇదే రూమ్ లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఆలోచిస్తూంటే. అంతే కాకుండా ఇలా వెల్లకిలా పడుకుని చూస్తూవుంటే ఆ అమ్మాయి ఉరేసుకున్న ఫ్యాన్ తిరుగుతూ కనిపిస్తూంది.
కాస్సేపు తన శరీరం ఊపిరి ఆడకుండా తన మీద కొట్టుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే, కాస్సేపు నిర్జీవంగా వేలాడుతూ కనిపిస్తూ వుంది. అదంతా తన ఇమాజినేషన్ మాత్రమే అయినా మనసంతా భయంతో నింపేస్తూ వుంది. ఎంత ఇష్టం లేక పోయిన ఆ అమ్మయి చనిపోయినప్పటి విషయం గురించి తన మనసు ఆలోచించకుండా ఉండలేక పోతూంది. చనిపోయిన తరువాత ఆ అమ్మాయి శరీరం ఎంత భయంకరంగా అయిపోయి ఉంటుంది? తను చనిపోయిన తరువాత తన శరీరం ఎలా అయిపోతుందో ఊహించి వుంటే అసలు సూసైడ్ చేసుకుని ఉండేది కాదు.
ఈ ఆలోచనలు తను తట్టుకోలేక పోతూవుంది. ఈ ఆలోచనల వల్లో, లేకపోతే నిజంగానే ఈ రూమ్ లో ఏమైనా ఆ అమ్మాయి సంబంధించి వుందో తెలియదు కానీ తనతోటె తన పక్కనే ఎదో ఉందనిపిస్తూ వుంది. తన మనసంతా ఎదో తెలియని భయంతో నిండిపోతూ వుంది. కిందనున్న రూమ్ లోకి దేంట్లోకన్నా వెళ్ళిపోతే మంచిది, తన అబ్సర్వేషన్ కి ఈ ఇంట్లో ఎక్కడ వున్న ఫరవాలేదు అనిపించి చటుక్కున లేచి కూచుంది మేనక.
అంతలోనే మరో ఆలోచన వచ్చి సిగ్గుతో మొహం జేవురించింది. ఒక చిన్నపిల్లలా తనెందుకు ఇలా భయపడుతూంది? ఒకవేళ ఇప్పుడు కూడా నిరుపమ ఈ రూమ్ లోనే వున్నా తనెందుకు ఆ అమ్మాయికి భయపడాలి? చనిపోయే ముందువరకూ కూడా తనూ తనలాంటి అమ్మాయే కదా. తనీ భయాన్ని జయించాలి. మామూలు ఆడ పిల్లలా ప్రవర్తించ కూడదు. గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చి బెడ్ మీద మళ్ళీ పడుకుని కుడి వైపుకి వత్తిగిల్లింది. ఈ మాయదారి ఆలోచనలు కొంచం తగ్గితే బాగుండు, ఇంకా ప్రవాహంలో వస్తూన్న పనికిమాలిన ఆలోచనలని గమనించి అనుకుంటూండగా తన అంకుల్ స్మరన్ తరచూ చెప్పే విషయం గుర్తుకు వచ్చింది.
'ఆలోచనల్ని కానీ, ఫీలింగ్స్ ని కానీ పట్టించుకోకూడదు. వాటిని ఫోర్స్ గా బయటకి తోసేసే ప్రయత్నం అసలే చెయ్య కూడదు. వాటిని ప్రత్యేకంగా అబ్సర్వ్ చెయ్యాల్సిన అవసరం లేక పోయినా, వాటంతటవి నోటీసు లోకి వస్తే మాత్రం ఇరిటేట్ అవ్వకూడదు. వాటిని ప్రత్యేకంగా రిమూవ్ చేసేసే ప్రయత్నం కానీ, అబ్సర్వ్ చేసే ప్రయత్నం కానీ చెయ్యక పోతే కాస్సేపటికి అవే వానిష్ అయిపోతాయి.'
తను సాధారణంగా అనవసరమైన ఆలోచనలు, ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ సజెషనే అమలు లో పెడుతూంటుంది, కానీ ఈరోజు ఎందుకో ఇప్పటి వరకు గుర్తుకు రాలేదు. గుర్తుకు వచ్చిన తరువాత ఇంక అమలు లో పెట్టడానికి ఆలస్యం చెయ్యలేదు.
తరువాత ఎప్పుడు నిద్రపట్టిందో గుర్తు లేదు కానీ తెల్లవారి లేచాక మాత్రం చాలా రిలీఫ్ గా, రిలాక్స్డ్ గా అనిపించింది. రాత్రంతా ఆలా భయపడ్డందుకు చాలా సిగ్గుగా కూడా అనిపించింది.
చాప్టర్-3
"ఆమె పేరెంట్స్ పడే బాధ చూస్తూ ఉంటే నేను నా కోపం ఆపుకో లేకపోతున్నాను. స్కౌండ్రల్, ఏవీ ఆలోచించకుండా ఎంతపని చేసింది!" కోపంగా అంది మేనక. స్మరన్ ఆఫీసులో స్మరన్ కి ఎదురుగుండా కూర్చుని వుంది. "ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఫూల్స్. వాళ్లందరిలో ఇంకా పెద్ద ఫూల్ ఈ నిరుపమ." కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే వుంది మేనకకి.
"ఆలా మాట్లాడకు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఫూల్స్ కాదు. వాళ్ళల్లో కొంతమందికి కంపెల్లింగ్ రీజన్స్ ఉంటాయి." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు స్మరన్.
"అంటే ఆత్మహత్యల్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా?" చిరాగ్గా అంది మేనక.
"నేను సపోర్ట్ చెయ్యడం లేదు." కుర్చీలో ఇంకొంచం అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్. "కానీ కొన్ని సందర్భాల్లో చనిపోవడమే సొల్యూషన్ లా వాళ్ళకి అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళల్లో చాలా ఫేమస్ పీపుల్ కూడా వున్నరు."
"కానీ అలాంటి కంపెల్లింగ్ రీజన్ ఏది నిరుపమకి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను."
"ఈ విషయాన్నీ నేనూ ఒప్పుకుంటాను. సడన్గా తాను విపరీతమయిన ఎమోషన్ కి లోనయింది. మూమెంటరీగా తట్టుకోలేకపోయింది. ఇంపల్సివ్ గా ఉరేసుకుంది. తను ఆ సమయంలో కొంచెం ఆలోచించగలిగి ఉంటే, కొంచం డిస్ట్రాక్షన్ వచ్చి ఉంటే, ఐ యామ్ స్యూర్, తను సూసైడ్ చేసుకునేది కాదు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు స్మరన్.
"మై గాడ్! అంకుల్, నువ్వు చెప్పినట్టే అయివుంటుంది!" షాక్ తో నిండిపోయింది నిరుపమ మొహం.
"మనం సూసైడ్ చేసుకునే వాళ్ళని మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటి రకం, వీళ్ళకి చాలా కంపెల్లింగ్ రీజన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ తోటో, మరోరకంగానో కొంతకాలం పాటు వీళ్ళని ఆపగలిగినా ఏదోలా వీళ్ళు చనిపోడానికే చూస్తారు. టెర్మినల్ డీసీజెస్ తో బాధపడే వాళ్ళు, ఇంకా విపరీతమయిన అప్పుల్లో కూరుకు పోయిన వాళ్ళు వీళ్ళకి ఉదాహరణ. ఇక రెండో రకం. వీళ్ళకి మొదటి రకం వాళ్ళకి ఉన్నంత కంపెల్లింగ్ రీజన్స్ ఉండవు, కానీ ఏవో రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చినా, లేదా వాళ్లే కొంత ఆలోచించ గలిగినా సూసైడ్ జోలికి పోరు. బాగా ఇన్సల్ట్ చెయ్యబడ్డ వాళ్ళు, ఎగ్జామ్స్ లో తప్పిన వాళ్ళు, ఎంతో ఆశించింది మిస్సయిన వాళ్ళు, రేప్ లేదా గ్యాంగ్ రేప్ కి గురైన వాళ్ళు దీనికి ఉదాహరణ. ఇక మూడో రకం, జీవితంలో బోరుకొట్టి ఏం చేయాలో తెలియక, తీవ్రమయిన డిప్రెషన్ కి గురయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు. ఆశ్చర్యపడకు. ఇలాంటివాళ్ళు కూడా వున్నరు."
"నువ్వు చెప్పినదాన్ని బట్టిచూస్తే నిరుపమ ఖచ్చితంగా రెండవ రకానికి చెంది ఉండాలి." సాలోచనగా అంది మేనక.
"యు అర్ రైట్. నా అభిప్రాయం కూడా అదే." తలూపాడు స్మరన్.
"అయితే తన మీద" తన రెండు మోచేతులు మధ్యలో వున్నబల్ల మీద బాలన్స్ చేసుకుని, స్మరన్ మొహంలోకి చూసింది మేనక. "రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ జరిగి ఉండొచ్చా? అంతకన్నా పెద్ద కంపెల్లింగ్ రీజన్ ఈ అమ్మాయి విషయంలో నాకు కనిపించడం లేదు."
"లేదు. అది కారణం కాదని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూంది." తనెలా అంత ఫ్రీగా అడగ గలుగుతోందో స్మరన్ కి బోధపడలేదు కానీ ఆ విషయం గురించి తన మేనకోడలు తో మాట్లాడడానికి స్మరన్ కి ఇబ్బందిగానే వుంది.
"తన బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?" మరో ప్రశ్న వేసింది మేనక.
"జరిగింది. అటువంటిది ఏమీ లేదు." నవ్వాడు స్మరన్. "ఇక్కడ మరొక్క విషయం. ఎక్కువ రోజులు గడిస్తే రేప్ అయినా గ్యాంగ్ రేప్ అయినా బయటపడవు. ప్రూవ్ చెయ్యడం కష్టం. తను చనిపోవడానికి వారం పది రోజుల ముందు అటువంటి అట్రాసిటీ కి గురయి ఉంటే అది పోస్ట్ మోర్టమ్ లో తెలియదు."
"అయితే ఆలా జరిగి ఉండొచ్చు కదా. అది బయటికి చెప్పలేక బాధపడి, బాధపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అంది మేనక.
"నేనూ ఆమె తండ్రి దగ్గరనుంచి విన్నదాన్నిబట్టి, ఆ నిరంజన్ చెప్పింది విన్నదాన్ని బట్టి, ఇంకా ఆమెని ఫోటో లో చూసిన దాన్ని బట్టి, నిరుపమ చాలా ఆక్టివ్, ఇంటెలిజెంట్ మాత్రమే కాకుండా కరేజియస్ అండ్ బోల్డ్! తను బాగా ఆలోచిస్తుంది. ఒకవేళ తను రేప్ కి గాని గ్యాంగ్ రేప్ కి గాని గురయి వున్న, అలా సూసైడ్ చేసుకుని మాత్రం ఉండేది కాదు." కాస్త ఆగి మళ్లీ అన్నాడు. "ఎనీహౌ ఈ పాజిబిలిటీ కూడా వుంది. ఇదీ మనం మన దృష్టిలో ఉంచుకోవాలి."
"ఇంతకీ ఆ నిరంజన్ ఎవరు? ఎప్పుడు కలిసావు ఆయన్ని?" భృకుటి ముడేసింది మేనక.
" నిరుపమ తల్లి కి కజిన్. మొదటిసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడే కలిసాను. తను ఒక సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యాక ఈ ఊర్లోకి వచ్చి సెటిల్ అయ్యాడు. చాలా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్! ఆ ఇంట్లో కలిసినప్పుడే కాదు, అతని ఇంటికి వెళ్లి కూడా మాట్లాడాను అతనితో." స్మరన్ అన్నాడు.
"అయితే చాలా విషయాలు తెలిసే ఉండాలి." నవ్వింది మేనక.
"కొంత ఇన్ఫర్మేషన్ రాబట్ట గలిగాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిరుపమ నిరంజన్ కి చాలా ఇంప్రెస్ అయింది. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో చేరడానికి కూడా ఆయనే కారణం. ప్రతీ విషయం తన తండ్రితో, ఇంకా ఫ్రెండ్ సమీరతో షేర్ చేసుకున్నట్టుగానే ఆయనతోనూ షేర్ చేసుకునేది. బట్ ....." కాస్త ఆగి నిట్టూర్చాడు స్మరన్. "....తన సూసైడ్ కి సంబంధించి మాత్రం చిన్న క్లూ ఆయనకి కూడా ఇవ్వలేదు."
"ఆ విషయానికి సంబంధించి తన తండ్రికే ఏమీ తెలియనివ్వలేదు. అతనికి తెలియనివ్వక పోవడంలో ఆశ్చర్యం లేదు." మేనక కూడా నిట్టూర్చింది. "సో, ఆ నిరంజన్ తో చాలా క్లోజ్. తనకి బాగా ఇంప్రెస్ అయింది."
"అఫ్ కోర్స్, ఎస్. నిరంజన్ స్టేట్మెంటు ప్రకారం, తన తండ్రి తరువాత అంతగా అభిమానించి క్లోజ్ గా ఫీలయ్యింది నిరంజన్ తోటే."
"ఐ సీ." సాలోచనగా తలూపి కుర్చీలో ఇంకొంచెం అడ్జస్ట్ అయింది మేనక. " అంకుల్, ఒక పాజిబిలిటీ మీరిక్కడ ఆలోచించారా? ఆ నిరంజన్ తను ఎంతగానో అభిమానించే వ్యక్తి. ఒకవేళ ఆ నిరంజన్ నిరుపమతో చెడుగా బిహేవ్ చేసి ఉంటే తను ఎలా ఫీలయ్యి ఉండేది? ఐ మీన్ అతను రేప్ కానీ, రేప్ అటెంప్ట్ కానీ చేసివుంటే నిరుపమ చాలా బాధపడి సూసైడ్ చేసుకోవడానికి అవకాశం వుంది కదా."
"అందుకు అవకాశం వుంది. కానీ ఆ నిరంజన్ ని చూస్తే నాకు ఆలా అనిపించలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వూ అతన్ని చూసి ఒకసారి మాట్లాడితే నీ ఆలోచన మారొచ్చు."
"మనం ఎక్సటీరియర్ ని చూసి ఇంటీరియర్ అంచనా వెయ్యలేం అంకుల్. పైకి ఎంతో హుందాగా ఇంప్రెసివ్ గా కనిపిస్తూ కూడా పాడుపనులు చేసేవాళ్ళు వున్నారు కదా."
"నేను కాదనలేను. ఈ థియరీ కూడా ఫాలో అవుదాం." కుర్చీలో ఇంకోసారి అడ్జస్ట్ అయ్యాడు స్మరన్. "ఎనీహౌ నువ్వూ అతన్ని కలిసి ఒకసారి మాట్లాడి చూడు. నువ్వు నా మేనకోడలివని, నీకు తన గురించి నా ద్వారా తెలిసిందని, ఇంకా నీకూ సైకాలజీ అంటే ఇంటరెస్ట్ అని చెప్పు, సరిపోతుంది."
" ఓకే అంకుల్. అలాగే చేస్తాను." నవ్వింది మేనక.
"ఇప్పుడు నేను నిరుపమ ఫ్రెండ్ సమీర దగ్గరికి వెళుతున్నాను. అవసరమైతే ఇకపైన వీళ్ళతో మాట్లాడడం అదీ నువ్వే చెయ్యాలి. ఈ ఒక్క అసైన్మెంట్ మీదే కాన్సంట్రేషన్ చేస్తే తక్కిన అస్సైన్మెంట్లు నేను ఫాలో అవ్వలేను కదా."
"ఐ లవ్ ఇట్ అంకుల్. యు డోంట్ వర్రీ." నవ్వింది మేనక. "నీకు బాగా తెలుసు. ఇలా డిటెక్షన్ చెయ్యడం నాకు చాల ఇష్టమని. ఐ ఎంజాయ్ ఇట్."
"ఆల్రైట్ దెన్. అమ్మతో మాట్లాడుతున్నావు కదా." కుర్చీలోంచి లేస్తూ అడిగాడు స్మరన్.
"మాట్లాడుతున్నాను. జాగ్రత్తలతో చంపేస్తోంది. నేనేమన్నా ఫారిన్ వెళ్ళిపోయినా? ఇదే వూళ్ళో దగ్గర్లోనే ఇంకో ఇంట్లో వున్నను." కోపంగా అంటూ మేనక కూడా కుర్చీలోంచి లేచింది.
"మీ అమ్మ నీ గురించి ఎందుకలా ఫీల్ అవుతుందో నువ్వూ అమ్మవైతేనే కానీ నీకు తెలియదు." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.
"చుట్టూ తిప్పి అక్కడికి తెచ్చావా? నువ్వూ ఆ పెళ్ళికొడుకు ఊసు అదీ ఎత్తే లోపు నేనిక్కడనుంచి బయటపడడం మంచిది. బై అంకుల్." అక్కడినుంచి బయటికి వచ్చేసింది మేనక.
&&&
"చాలా అప్సెట్ అయ్యాక ఇప్పుడిప్పుడే నువ్వు యూజువల్ అవుతున్నావు. ఆ డిటెక్టివ్ తో నువ్వు మళ్లీ పాత విషయాలు తోడుకోవడం నాకు ఇష్టం లేదమ్మాయ్." సమీర తల్లి వనజ అంది.
అప్పుడు సమీర ఇంకా ఆమె తల్లి వనజ, తండ్రి ముకుందం హాలులో కూచుని వున్నరు. ముకుందం, వనజ అక్కడ వున్న సోఫాలో కూచుని ఉంటే సమీర వాళ్ళకి ఎదురుగుండా వున్న కుర్చీలో కూచుని వుంది.
" మామ్ చెప్పింది నిజమే. నువ్వు మళ్లీ ఆ విషయాలన్నిటి గురించి మాట్లాడాల్సొస్తుందంటే నాకూ ఇష్టం లేదు." ముకుందం అన్నాడు.
" డాడ్ నిరుపమ నా బెస్ట్ ఫ్రెండ్. నిజానికి మీ ఇద్దరికన్నా కూడా ఎక్కువ. తన గురించి ఆలోచించడమో, లేదా మాట్లాడడమో నన్నెప్పుడూ బాధ పెట్టదు. నాలో మార్పు తన గురించి ఆలోచించకపోవడం వల్ల రాలేదు. జస్ట్ కాజువల్ గా టైమే తెచ్చింది." కుర్చీలో జారగిలబడుతూ చిరాగ్గా అంది సమీర.
"ఒకే డియర్. నేను కాదనను." ముకుందం అన్నాడు. "కానీ ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా యూజ్లెస్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కారణం తెలుసుకుని ఆ రంగనాథ్ ఏం చెయ్యగలడు?"
"మీ డాడ్ చెప్పింది నిజం. ఆ అమ్మాయి చనిపోయాక మేమూ చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల ఏమి లాభం? ఇంతకన్నా ఆ రంగనాథ్ తన భార్య మానసిక పరిస్థితి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బావుండేది. తాను ఆల్మోస్ట్ పిచ్చిది అయిపొయింది." వనజ అంది.
"నేనేం చెప్పను మామ్? నిరుపమ పేరెంట్స్ గురించి ఆలోచిస్తేనే నాకూ చాలా గిల్టీ గా అనిపిస్తూ వుంది. నిరుపమ వున్నప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని చూసేదాన్ని. నన్ను ఎంతో అభిమానంగా చూసే వాళ్ళు. ఇప్పుడు ఆ ఇంటిగురించి ఆలోచిస్తేనే అదొకలా వుంది. వాళ్ళని చూడడం మాట అలా ఉంచి, అక్కడ జ్ఞాపకాల్ని తట్టుకోలేనని ఆ ఇంటికే వెళ్లడం మానేసాను. పాపం వాళ్లిద్దరూ ఎలా వున్నరో." సమీర మొహం బాధతో నిండిపోయి వుంది.
"ఇప్పుడే కదమ్మా అన్నావు నిరుపమ గురించి ఆలోచించడం, మాట్లాడడం నిన్ను బాధపెట్టవు అని. ఇంకా ఆమె జ్ఞాపకాలు మాత్రం నిన్ను ఎందుకు బాధించాలి?" ముకుందం అన్నాడు.
"ఎదో అంది, అయితే ఇప్పుడు మీ క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమా?" కోపంగా అంది వనజ. "తన గురించి ఆలోచించను, మాట్లాడాను అనడానికి గిల్టీగా అనిపించి అలా అంది."
" ఓకే మామ్. మీరు ఇద్దరు ఇలా గొడవ పడకండి. నేను మళ్లీ అప్సెట్ కాను, సరేనా?" చిరాగ్గా అంది సమీర.
ముగ్గురు సైలెంటుగా ఉండిపోయారు ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ. అంతలో కాలింగ్ బెల్ మోగింది.
"ఆ డిటెక్టీవ్వే అనుకుంటా. వెళ్లి చూడు." వనజ అంది సమీర మొహంలోకి చూస్తూ.
సమీర కుర్చీలోంచి లేచి వెళ్ళింది తలుపులు ఓపెన్ చెయ్యడానికి.
&&&
"నిరుపమ సూసైడ్ చేసుకున్నాక నువ్వు చాల అప్సెట్ అయ్యావని నేను విన్నాను. ఆ రంగనాథ్ మరీ అంత పట్టుదలగా లేకపోతే నేను నిన్నిలా ఇబ్బంది పెట్టి ఉండేవాడిని కాదు." స్మరన్ సమీర ఖాళీ చేసి ఇచ్చిన కుర్చీలో సెటిల్ అవుతూ అన్నాడు.
ఆ ముగ్గురూ ఊహించినట్టుగా ఆ వచ్చింది స్మరనే. స్మరన్ లోపలికి వచ్చాక మామూలు పలకరింపులు అయ్యాక ముకుందం ఎదో పనివుందని బయటికి వెళ్ళిపోతే కిచెన్ లో పని వుందని వనజ అక్కడినుంచి వెళ్ళిపోయింది. సమీర కుర్చీకి ఎదురుగా వున్న సోఫా లోకి మారింది.
"ఫరవాలేదు లెండి. తాను నాకు క్లోజ్ ఫ్రెండ్. తన గురించి ఆలోచించను, మాట్లాడను అంటేనే నాకు గిల్టీ గా వుంటుంది." సోఫాలో వెనక్కి జారగిలబడి నిట్టూర్చింది సమీర. "కానీ నేను మీకు ఈ విషయంలో పెద్దగా ఉపయోగ పడగలను అనుకోవడంలేదు. తన పేరెంట్స్ తో మాత్రమే కాదు నాతో కూడా ఆ విషయం గురించి ఏవీ షేర్ చేసుకోలేదు తను. తను సూసైడ్ చేసుకుందని తెలిసాక నేను విపరీతంగా షాక్ అయ్యాను."
"మీతో ఎదో షేర్ చేసుకుని ఉంటుందని నేనూ అనుకోలేదు. కానీ ఎదో ఒక క్లూ అయినా మీ ద్వారా దొరుకుతుందని ప్రయత్నం చేస్తున్నాను." స్మరన్ నవ్వాడు.
"సరే అయితే. మీరు ఏం అడగలనుకుంటున్నారో అడగండి." సమీర కూడా నవ్వుతూ అంది. ఇంకెవరైనా అయితే ఆ విషయం గురించి ఆలా మాట్లాడడానికి చిరాకు పడివుండేది. ఏజ్ అంచనా వెయ్యలేక పోతూంది కాని స్మరన్ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తూ వున్నాడు సమీరకి. ఎదో మాట్లాడాలనే అనిపిస్తూ వుంది. ఇంకా స్మరన్ కి అయితే సమీరని చూస్తూ ఉంటే అందంగా వున్న అమ్మాయిలకి అందంగా వున్న ఫ్రెండ్సే ఉంటారేమో అనిపించింది. పంజాబీ డ్రెస్సులో నిరుపమ ఆ ఫొటోలో ఎంత అందంగా వుందో, వోణీలో సమీర కూడా అంత అందంగానూ వుంది. బహుశా ఒక ఇరవై, ఇరవై ఒకటి సంవత్సరాలుకన్నా ఈ అమ్మాయికీ ఎక్కువ ఉండక పోవచ్చు.
"మీ ఇద్దరికీ ఎంతకాలంగా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరూ ఎంతకాలంగా ఫ్రెండ్స్?"
"నా సిక్స్త్ స్టాండర్డ్ నుంచి. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్. అప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాం. నాన్న ప్రాక్టీస్ వేరే చోట వుంది. నిరుపమ వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడే వున్నరు. నేను తానూ ఒకటే క్లాస్. అదే స్కూల్లో నేనూ జాయిన్ అవ్వడంతో నాకు పరిచయం అయింది. కొద్దీ రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం తరచూ వెళ్లడం మాకు చాలా యూజువల్."
"తను ఎంతో మంచి అమ్మాయి. అందంగానే కాదు ఎంతో ఆక్టివ్ గానూ ఉండేది. మా అమ్మాయినే కాదు, తను ఆలా సూసైడ్ చేసుకోవడం మమ్మల్నీ చాల అప్సెట్ చేసింది." వనజ తను తెచ్చిన కాఫీ కప్పు స్మరన్ కి అందిస్తూ అంది.
"రియల్లీ సాడ్." ఆ కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు స్మరన్. "ఏ పరిచయం లేకపోయినా ఆ అమ్మాయి ఆలా చనిపోయిందంటే నాకే ఎంతో బాధగా అనిపిస్తూ వుంది. మీకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు."
ఆ తరువాత వనజ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయింది.
"తను అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటూ ఉండేది." స్లో గా కాఫీ ని సిప్ చేస్తూ అన్నాడు స్మరన్.
"వైస్ వెర్సా." నవ్వింది సమీర. "నేనూ నా అన్ని విషయాలూ తనతో షేర్ చూసుకునేదాన్ని."
"నువ్వు కాకుండా తనకి ఇంకా వేరే ఎవరైనా ఫ్రెండ్స్ వున్నరా?"
"తను అందరితో చక్కగా మాట్లాడుతూ ఫ్రెండ్లాగే ఉండేది. కానీ తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ని మాత్రం నేనే. నాకు కూడా అంతే. తను తప్ప వేరే క్లోజ్ ఫ్రెండ్ ఎవరూ లేరు."
"అయితే నేను తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ వున్నరా అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదన్న మాటే."
"అస్సల్లేదు." కాదన్నట్టుగా తలూపింది సమీర. "మా ఇద్దరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు."
"తను చనిపోవడానికి ఎన్ని రోజుల ముందు మీ ఇద్దరూ కలిశారు?"
"కలుస్తూనే వున్నాం. మాట్లాడుకుంటూనే వున్నాం. తను సూసైడ్ చేసుకున్న రోజు కూడా మేమిద్దరం వాళ్ళింట్లో కలిసి మాట్లాడుకున్నాం. కాకపోతే మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూండడం వాళ్ళ నా కాన్సంట్రేషన్ అంతా వాటిమీద అయిపోయింది. తన మూడ్ ని ఇంకా బిహేవియర్ ని అంతగా అబ్సర్వ్ చెయ్యలేదనుకుంటా. కానీ..." కాస్త ఆగి అంది సమీర "నిజంగా తను ఏ విషయం గురించి అయినా బాగా మధన పడుతూ వుండివుంటే ఆ విషయం ఖచ్చితంగా నా నోటీసులోకి వచ్చి వుండేది."
"నీ దృష్టిలో తనని అంతగా సూసైడ్ కి ప్రేరేపించగల విషయం ఏదైనా వుందా?" కుర్చీలో వెనక్కి వాలాడు స్మరన్.
"లేదు. కనీసం ఊహకి కూడా ఏది రావడం లేదు." మళ్ళీ కాదనట్టుగా తలూపుతూ అంది సమీర. "ఒకవేళ అలాంటిది ఏమైనా వుండివుంటే హండ్రెడ్ పర్శంట్ నాకు చెప్పే వుండేది."
"అంటే తను చనిపోయే వరకు కూడా తను నీతో చాల యూజువల్ గా, క్యాజువల్ గానే వుంది."
"అలాగే వుంది. నాకు డిఫరెన్స్ ఏమి కనిపించలేదు." సోఫాలో అడ్జస్ట్ అవుతూ అంది సమీర.
"ఎనీహౌ ఏదైనా గుర్తుంచుకో గలిగిన సంఘటన, లేదా నోటీసు చేయదగ్గ విషయం తను సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు జరిగిందా?"
"ఆలా ఏం జరిగినట్టుగా అనిపించడం లేదు. నాకు తెలిసినంతవరకు ఏం జరగలేదు." భృకుటి మూడేసి ఆలోచిస్తూ అంది సమీర.
"కాస్త గుర్తు చేసుకో. బాగా ఆలోచించు. అది ఎంత చిన్న విషయం అయినా ఫర్వాలేదు."
"యు డిటెక్టివ్స్ ఆర్ ఇంపాజిబుల్." నవ్వుతూ అంది సమీర.
"తప్పదు మరి. మీకు ఎంతో సాధారణంగా కనిపించే విషయంలో ఎదో క్లూ దొరుకుతుంది మాకు. ప్లీజ్ ట్రై చెయ్యి."
"సరే అయితే." మరోసారి భృకుటి ముడేసి, కింద పెదవిని పళ్ళ మధ్య బిగబట్టి ఆలోచనలో పడింది సమీర.
ఆ పోశ్చర్ లో మరీ అందంగా కనిపిస్తూ వుంది సమీర స్మరన్ కి. తనని అలాగే చూస్తూ వున్నాడు స్మరన్.
"ఇది నిరుపమ సూసైడ్ చేసుకోవడానికి పదిహేను రోజుల కింద జరిగిందనుకుంటా. ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు ఒంట్లో బావులేక, కానీ తను వెళ్ళింది. నాన్న ప్రాక్టీసుకి వెళ్లిపోయారు. అమ్మ ఎవరో చుట్టాలింటికి వెళ్ళింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా వున్నను. అప్పుడు తను వచ్చింది."
"తను కాలేజీ కి వెళ్ళింది కదా." భృకుటి ముడేసాడు స్మరన్.
"ఎదో స్ట్రైక్ వల్లో దేనివల్లో కాలేజీ జరగలేదని చెప్పింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి తనని ఇంట్లోనే ఉండమని చెప్పి నేను వెళ్ళిపోయాను."
"ఇందులో నోటీసు చేయదగ్గ విషయం ఏం వుంది?"
"నేను ఆలా వేళ్ళ బోయేముందు జస్ట్ ఫ్యూ సెకండ్స్ తన మొహంలోకి చూసాను." సమీర ఆగింది.
"ప్లీజ్ కంటిన్యూ." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ ఆసక్తిగా అన్నాడు స్మరన్.
"అప్పుడు తన మోహంలో ఒక ఎక్స్ప్రెషన్ కనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటన్నది అర్ధం లేదు." నుదుటిమీద ముడతలు వచ్చాయి సమీరకి ఆమె ఎదో ఆలోచిస్తూందని తెలియచేస్తూ.
"ఎక్స్ప్రెషన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బాధ వాళ్ళ వచ్చే ఎక్స్ప్రెషన్స్, రెండవది సంతోషం వాళ్ళ వచ్చే ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్ ఏ రకానికి చెందిందో అయినా చెప్పగలవా?"
"ఆలా చెప్పవలసి వస్తే అది కచ్చితంగా బాధ వాళ్ళ వచ్చే ఎక్సప్రెషనే." సమీర సాలోచనగా అంది కానీ ఆమె నుదుటి మీద ముడతలు ఇంకా అలాగే వున్నయి.
"ఒకవేళ బాధ పడితే తను ఎందుకు బాధ పడి వుంటుంది? ఇంట్లో ఏదైనా జరిగి వుంటుందా?"
" అలా జరిగేందుకు అవకాశమే లేదు. నిరుపమ పేరెంట్స్ అంతగా తమ పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ ఉంటారని నేను అనుకోను. ఏ రకంగాను వాళ్ళు తనని హర్ట్ చెయ్యరు."
"ఒకవేళ కాలేజీ లో కానీ, వచ్చే దారిలో కానీ ఏమైనా జరిగి వుంటుందా?"
"ఆ రోజు కాలేజీ జరగనే లేదు. మా ఇళ్ళకి కాలేజీకి పెద్దగా దూరం ఏమి లేదు. వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మేము వెళ్లే రోడ్ అంతా కూడా జనాలతోటి, ట్రాఫిక్ తోటి వుంటుంది."
"మీ కాలేజీ ఎన్ని గంటలకి స్టార్ట్ అయి ఎన్ని గంటలకి పూర్తవుతుంది?"
" పధి గంటలకి ప్రారంభం అవుతుంది. ఐదు గంటలకల్లా అయిపోతుంది. మేము మార్నింగ్ నైన్ థర్టీ అలా ఇంటిదగ్గర స్టార్ట్ అవుతాము. ఈవెనింగ్ ఫైవ్ థర్టీ ఆలా ఇంట్లోనే ఉంటాము."
"ఐ సీ" తలూపాడు స్మరన్.
"తను కాలేజీ లేదని మీ ఇంటికి వచ్చినపుడు ఎన్ని గంటలకి వచ్చింది?"
"ట్వెల్వ్, ట్వెల్వ్ థర్టీ కి వచ్చి వుంటుంది."
"అయితే తను స్ట్రెయిట్ గా మీ ఇంటికి రాలేదు. తన ఇంటికి వెళ్లే ఇక్కడికి వచ్చింది."
"అఫ్ కోర్స్. ఒక రెండు మూడు గంటలు ఇంటి దగ్గర స్పెండ్ చేసే ఇక్కడికి వచ్చివుంటుంది." దీర్ఘంగా నిట్టూర్చింది సమీర. "కానీ నేను చెప్పానుగా. తన ఇంటిదగ్గర తనని హర్ట్ చేసేంతగా సంఘటనలు జరిగే అవకాశం లేదు."
"మిస్ సమీర." కుర్చీలో ముందుకు వంగాడు స్మరన్. "మీరు ఆ రోజు కాలేజీ కి వెళ్ళలేదు. ఆర్ యు స్యూర్ ఆ రోజు కాలేజీ లేదని?"
"హండ్రెడ్ పర్శంట్ ఆ రోజు కాలేజీ లేదు. నాకు ఆ మర్నాడు ఆ విషయం తక్కిన స్టూడెంట్స్ ద్వారా కూడా తెలిసింది."
"అయినా తను స్ట్రెయిట్ గా ఇంటికి వచ్చి ఉండక పోవచ్చు. లేకపోతే రాలేకపోయి ఉండొచ్చు. కాలేజీ లో కానీ లేదా వారే ఎక్కడైనా కానీ తను ఆగి ఉండొచ్చు లేకపోతే ఆపబడి ఉండొచ్చు."
"వాట్ డు యు మీన్?" సమీర నవ్వింది. ఆమె అంతా అందంగానూ వుంది ఆమె నవ్వు కూడా. "డిటెక్టివ్స్ డీప్ గా ప్రోబ్ చేస్తారని తెలుసు. కానీ మరీ ఇంత గానా?"
"ఇన్ ఫాక్ట్ ఇంకా ఎక్కువగా." స్మరన్ కూడా నవ్వాడు. "చెప్పు. అందుకు అవకాశం వుంది కదా."
"లేదని అయితే అనలేను." మరొకసారి సోఫాలో అడ్జస్ట్ అయింది సమీర. "ఇంతకీ మీరు ఏం డిడెక్టు చెయ్యబోతున్నారు?"
"కాలేజీలో కానీ లేదా వేరే చోట కానీ ఆమెకి ఏదైనా అయి ఉండొచ్చు కదా?"
"ఆలా ఏమైనా జరిగి ఉంటే తను కచ్చితంగా నాతో చెప్తుంది. చెప్పానుకదా మా మధ్య అరమరికలు ఏమీ లేవని."
"ఒకవేళ ఆలా జరిగిన విషయం మీతో చెప్పడం తనకి ఇష్టం లేనిది అయితే?"
"నేను అర్ధం చేసుకో లేకపోతున్నాను. ఏమి చెప్పాలో తెలియడం లేదు." అయోమయం గా అంది సమీర.
"మిస్ సమీర. మీరు ఎమోషన్ కాకుండా ఆలోచించండి. ఒక వేళా తన మీద ఆ రోజు కానీ లేదా వేరే ఏ రోజైనా కానీ రేప్ కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరిగి వుంటుందా? ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి అది కూడా ఒక బలమైన కారణమే కదా."
ఇమ్మీడియేట్ గా షాక్ తో నిండిపోయింది సమీర మొహం. "బట్ మిస్టర్ స్మరన్. తన బాడీ కి పోస్ట్ మార్టం జరిగింది. అలాంటిది ఏమి లేదని ప్రూవ్ అయింది." కొన్ని సెకండ్స్ తరువాత ఇబ్బందిగా అంది.
"రేప్ గాని గ్యాంగ్ రేప్ కానీ చాల రోజుల ముందు జరిగితే పోస్ట్ మార్టం లో బయట పడవు. నా అభిప్రాయంలో ఆ రోజు కాలేజీలో కానీ లేదా వేరే చోట కానీ ఆ అమ్మయి మీద అటువంటిది జరిగి ఉండొచ్చు కదా. దాంతో బాగా డిప్రెషన్కి గురయి ఇక భరించలేక పదిహేను రోజుల తరువాత సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. కాస్త ఆలోచించు."
దీర్ఘంగా నిట్టూర్చి, తలూపుతూ, సోఫాలో వెనక్కి జరగిలబడి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది సమీర. "లేదు మిస్టర్ స్మరన్. ఆలా జరగడానికి అవకాశం లేదు." కాసేపయ్యాక కళ్ళు తెరిచి ముందుకు వంగుతూ అంది. "ఒకవేళ అలాంటిదే జరిగితే తాను బాగా హర్ట్ అయ్యే తీరుతుంది. కానీ ఎవరకి చెప్పకుండా ఆలా సూసైడ్ మాత్రం చేసుకోదు. ఆ రాస్కేల్స్ ని ఉరికంబం ఎక్కించకుండా ఊరుకోదు. అంతేకాకుండా..." కాస్త ఆగి మళ్ళీ అంది సమీరా. "అలాంటి అట్రాసిటీ ఏదైనా తన మీద జరిగివుంటే తాను అంత ఏ ఫీలింగూ బయటపడకుండా ఎలా వుండగలదు?"
"కానీ నువ్వన్నావు కదా తన మోహంలో ఏదో డిఫెరెంట్ ఫీలింగ్ చూశానని." భృకుటి ముడేసాడు స్మరన్.
"సర్, అది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే." నవ్వింది సమీర. "నేను డాక్టర్ దగ్గరనుంచి తిరిగి వచ్చేసరికి తను మామూలుగానే వుంది. కాస్సేపు కూర్చుని మాట్లాడుకున్నాం కూడా. ఇంచుమించులో నా దగ్గర ఒక అరగంట స్పెండ్ చేసిన తరువాతే తను ఇంటికి వెళ్ళింది."
"ఐ సీ." తలూపి కుర్చీలో మళ్ళీ అడ్జస్ట్ అయ్యాడు స్మరన్. "నీకు డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చేసరికి ఎంత సేపు పట్టింది?"
"నేను వెళ్లేటప్పటికి అక్కడ డాక్టర్ లేడు. నాకు ఇంచుమించులో ఒక అరగంట వరకు అక్కడ వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. ఐ థింక్, నేను ఇంటి దగ్గర బయలుదేరి, డాక్టర్ పని చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక గంట కన్నా ఎక్కువ పట్టి ఉంటుంది." సాలోచనగా అంది సమీర.
"నువ్వు వచ్చేప్పటికి నిరుపమ ఏం చేస్తూ వుంది?"
"తనని నా బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళాను. నేను మళ్ళీ వచ్చేసరికి నా బెడ్ రూంలో నేను తెచ్చుకున్న ఇంగ్లీష్ నావెల్ చదువుతూ వుంది." మళ్ళీ దీర్ఘం గా నిట్టూర్చింది సమీర. "నన్ను మామూలుగానే పలకరించింది. మామూలుగానే మాట్లాడుకున్నాం. అంతా మామూలుగానే అనిపించింది."
"ఆల్రైట్." తలూపాడు స్మరన్ "మీ ఇద్దరికీ ఆ నిరంజన్, రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ చాలా క్లోజ్ కదా."
"ఎస్, యు అర్ రైట్ సర్." నవ్వింది సమీర. "తన వల్లే నాకు అయన పరిచయం అయ్యాడు. చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. మేమిద్దరం అయన వల్ల ఎంత ఇంప్రెస్ అయ్యాం అంటే, ఎమ్మెస్సీ మాథ్స్ తో చెయ్యాలన్న ఆలోచన మానుకుని ఎమ్మె సైకాలజీ లో జాయిన్ అయ్యాం."
"నీ కన్నా కూడా తనకి అయన చాలా క్లోజ్ కదా. తనతో చాలా ఇంటిమేట్ గా ఉండేదా?"
"అయన తనకి రెలెటివ్ కూడా. తన తల్లి వైపు చుట్టం. అంకుల్ వరస అవుతారు. సో, ఆయనతో చాలా క్లోజ్ గానే ఉండేది. తన ఫాదర్ ని ఎలా ట్రీట్ చేసేదో అలాగే ట్రీట్ చేసేది."
"ఒక్క విషయం. ఆ నిరంజన్ ఎలాంటి క్యారెక్టర్?"
"చెప్పానుగా. చాలా ఇంటరెస్టింగ్ పర్సన్ సర్. ఎవరైనా ఇట్టే ఇంప్రెస్స్ అవుతారు. ఆయనకి చాలా విషయాలు తెలుసు కూడా. మీరు ఆయనని కలిసి మాట్లాడితేనే మీకు నేను చెప్పింది అర్ధం అవుతుంది."
"నేను ఆల్రెడీ కలుసుకుని మాట్లాడాను. నీకు అనిపించినట్టుగానే నాకూ అనిపించింది." అప్పటి తన ఫీలింగుని గుర్తు చేసుకుంటూ నవ్వాడు స్మరన్. "కానీ ఎక్సటీరియర్ ని బట్టి ఇంటీరియర్ అంచనా వెయ్యకూడదు. నిజంగా ఆయన ఎలాంటి కారక్టరో మనకెలా తెలుస్తుంది?"
"మిస్టర్ స్మరన్ అసలు మీరేం చెప్పదలచుకున్నారు?" భృకుటి ముడేసింది సమీర.
"రేప్ కానీ లేదా ఆయన ఏమైనా తనతో మిస్ బిహేవ్ చేసి ఉండొచ్చా? ఒకవేళ అది ఎవరికీ చెప్పలేక సూసైడ్ చేసుకుని వుంటుందా?"
"సర్, మీరేం మాట్లాడుతున్నారు?" అనుకోకుండానే సోఫాలోనుంచి లేచి నిలబడింది సమీర. "పొరపాటున కూడా అటువంటి ఆలోచన రానివ్వకండి. నిరుపమ, తను ఎలా ఉండేవారో తెలిసి ఉంటే మీరు ఇలా మాట్లాడరు." ఆవేశంగా అంది.
"ప్లీజ్ సమీర. ఎమోషన్ కావద్దు. కూర్చుని సావధానంగా అలోచించి చూడండి." స్మరన్ ఆలా అన్న తరువాత కుర్చీలో కూర్చుంది కానీ సమీర మొహం ఇంకా కోపంగానే వుంది. తనేదో చెప్పబోతూవుంటే అంతకన్నా ముందుగానే అన్నాడు స్మరన్. "తనంతగా రెస్పెక్ట్ చేసేది కాబట్టే ఆయనేమైనా మిస్బిహేవ్ చేసివుంటే లేదా తన మీద పాడుపని చేసి ఉంటే తను అంతగా హర్ట్ అయి సూసైడ్ చేసుకునే అవకాశం వుంది."
"సర్ మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఎక్సటీరియర్ ని బట్టి ఇంటీరియర్ ని అంచనా వెయ్యలేం. కానీ ఆ నిరంజన్ అంకుల్ ఆలా చేసి వుంటారంటే మాత్రం నేను అంగీకరించలేను. ఇంపాజిబుల్! డిటెక్టివ్స్ ఎంత డీప్ గా వెళ్తారో నాకూ అర్ధం అయింది, కానీ ప్లీజ్ మీరు మాత్రం ఆ ఏంగిల్ లో ఆలోచించకండి." ఆవేశంగా అంది సమీర.
"ఆల్రైట్ సమీరా. అలాగే చేస్తాను." నవ్వాడు స్మరన్.
“మోరోవర్...." కాస్త ఆగి మళ్లీ అంది "ఒకవేళ ఆ నిరంజన్ అంకుల్ వల్ల అటుంవంటిది ఏమైనా జరిగివుంటే అంత మాములుగా తను వుండలేదు. జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్ తప్ప నేను తనలో ఇంకెలాంటి మార్పు చూడలేదు."
"ఆల్రైట్ సమీరా. ప్రస్తుతానికి అయన విషయం వదిలేద్దాం. ఇంకా ఏమైనా అడగడం మర్చిపోయానేమో ఒక్కసారి ఆలోచిస్తాను." కాస్సేపు కళ్ళు మూసుకుని అంతలోనే తెరిచాడు. "తన హాబీస్ ఏమిటి? ఇంటర్నెట్ సోషల్ నెట్వర్క్స్ లో తనెలా ఉండేది?"
"మా ఇద్దరి హాబీస్ కూడా ఒక్కటే. బుక్స్ చదవడం, చెస్ ఆడడం." సమీర నవ్వింది. "మా ఇద్దరికీ స్మార్ట్ ఫోన్స్ ఇంకా లాప్ టాప్స్ వున్నా మేము మాత్రం పేపర్ బ్యాక్స్ చదవడానికే ఎక్కువ ఇష్టపడేవాళ్ళం. ఇంకా సోషల్ నెట్వర్కింగ్ కి సంబంధించినంత వరకు నాకు తనకి కూడా పేస్ బుక్, ట్విట్టర్ ఇంకా లింక్డ్ ఇన్ లో అకౌంట్స్ వున్నాయి. కానీ వాటిని మేము ఫాలో అయ్యేది తక్కువ, మాకు ఫాలోవర్స్ చాల తక్కువ." అని కాస్త ఆగి అంతలోనే మళ్ళీ అంది. "ఇంకో ప్రశ్నకి మీరడక్కుండానే సమాధానం చెప్తాను. తన అన్ని సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ పాస్ వర్డ్స్ నాకు తెలుసు. తను సూసైడ్ చేసుకున్న తరువాత వాటిని థోరో గా సెర్చ్ చేసాం. లేదు, కనీసం చిన్న హింట్ కూడా వదల్లేదు తనెందులోనూ తన సూసైడ్ కి సంబంధించి."
"మరి తన స్మార్ట్ ఫోన్ లో కానీ, లాప్ టాప్ లో కానీ....." తనకి ఆ విషయమై రంగనాథ్ చెప్పింది గుర్తున్నా అడగబోయాడు స్మరన్.
"నో ఛాన్స్. వాటిల్లో కూడా ఎలాంటి హింట్ లేదు." నెగటివ్ గా తలూపింది సమీర.
"ఇవన్నీ ప్రూవ్ చేస్తున్నది కేవలం ఒకే ఒక్క విషయం. తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఆ విషయం గురించి ఎవరికీ తెలియడం ఆ అమ్మయికి ఇష్టం లేదు."
"యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సర్" తలూపింది సమీర.
"మరి తనెందుకు సూసైడ్ చేసుకుందో నీకు తెలుసుకోవాలనిపించడం లేదా?" భృకుటి ముడేసాడు స్మరన్.
"తను సూసైడ్ చేసుకుందని తెలియగానే నేను చాలా షాక్ అయిపోయాను. చాలా రోజులు మనిషిని కాలేక పోయాను. ఎందుకంటే తను నాకంత క్లోజ్ ఫ్రెండ్. కానీ....." ఒక హెల్ప్లెస్స్ ఎక్స్ప్రెషన్ తో తలూపింది సమీర. " ఆ విషయం ఎవరికీ తెలియడం తనకంత ఇష్టంలేనప్పుడు తెలుసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం."
"నేనూ ఇదే సజెస్ట్ చేసాను ఆమె డాడ్ కి. కానీ ఆయన మాత్రం ఆ విషయం తెలుసుకు తీరాలని చాలా పట్టుదలగా వున్నరు."
"నేను అది అర్ధం చేసుకోగలను. తన ఒక్కగానొక్క కూతురు ఎందుకు ఆలా సూసైడ్ చేసుకుని చనిపోయిందో తెలుసుకోవాలని అయన ఆరాట పడడంలో ఆశ్చర్యంలేదు."
"నేను ఒక నెల రోజుల్లో ఈ అసైన్మెంట్ పూర్తి చేస్తానని ఆయనకి మాట ఇచ్చాను. నువ్వు నాకు పూర్తిగా కో-ఆపరేట్ చేస్తావని ఆశిస్తాను." ఒక రిక్వెస్టింగ్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు స్మరన్.
"తప్పకుండా. నా పూర్తి కో-ఆపరేషన్ మీకుంటుంది." మరోసారి అందంగా నవ్వింది సమీర.
కుర్చీలోంచి లేచాడు స్మరన్. "చాలా కో-ఆపరేట్ చేసారు. థాంక్ యు వెరీ మచ్."
"ఇట్స్ ఏ ప్లెజర్." సమీర కూడా సోఫాలోంచి లేచి నిలబడి అంది. "మీతో మాట్లాడడం నాకు ఆనందంగా అనిపించింది." నిజంగా తను ఫీలయ్యిందే చెప్పింది.
"నీకు ఏది గుర్తుకు వచ్చి నాకు చెప్పాలనుకున్నా నాకు ఫోన్ చెయ్యి ప్లీజ్." తన విజిటింగ్ కార్డు ఇస్తూ అన్నాడు స్మరన్. "లేదూ నువ్వు నా ఆఫీస్ కి వచ్చిన సరే. నా ఆఫీస్ ఇక్కడికి పెద్ద దూరం ఏమీ కాదు."
"తప్పకుండా అలాగే చేస్తాను. చెప్పాను కదా. మీ ప్రెసెన్స్ నాకు చాలా ఎంజోయబుల్ గా వుంది." ఆ విజిటింగ్ కార్డు ని తీసుకుంటూ అంది సమీర.
ఆ తరువాత మరొకసారి థాంక్స్ చెప్పి అక్కడనుంచి వచ్చేసాడు స్మరన్.
&&&
"నువ్వు చెప్పింది విన్న తరువాత నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో విషాదం కూడా ఇంత పెద్ద విషయం గా అనిపించడం లేదు. పాతికేళ్ళు కూడా నిండని అమ్మాయి ఆలా సూసైడ్ చేసుకోవడమేమిటి?" తన కూతురు మేనక చెప్పింది అంతా విన్న తరువాత ప్రతిమ మనస్సు బాధతో నిండి పోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో తన తల్లితో గడపడానికి ఇంటికి వచ్చింది మేనక. ఇద్దరు బెడ్ రూమ్ లో వున్నబెడ్ మీద కూచుని వున్నరు.
"ముఖ్యంగా ఆమె తల్లిని చూస్తూ ఉంటే నాకు మనస్సు తరుక్కుపోతూ వుంది. ఇంకా తను బ్రతికి ఉన్నట్లుగానే మాట్లాడుతూ వుంది. ఆమె తండ్రి టోటల్ గా డిప్రెస్ అయిపోయాడు. నిజంగా వాళ్ళని ఆలా చూస్తూ ఉండలేక పోతున్నానమ్మా." గోడవరకు వెళ్లి గోడకు జారగిలబడుతూ అంది మేనక.
"ఈ అసైన్మెంట్ చేయలేనని చెప్పి వచ్చేస్తావా? నాక్కూడా ఇప్పుడా తండ్రి ఆమె సూసైడ్ కి కారణం తెలుసుకుని ఏం చేస్తాడు అనిపిస్తూంది." కూతురి దగ్గరగా వెళ్లి, ఆమె పక్కనే గోడకి జారగిలబడి, ఆమె కుడి భుజం మీద చెయ్యి వేస్తూ అంది ప్రతిమ.
"అసైన్మెంట్ గురించి కాకపోయినా నేనలా చెయ్యలేనమ్మా. ముఖ్యంగా ఆ పెద్దాయన నన్ను చూస్తూ ఉంటే తన కూతురిని చూస్తున్నట్టే ఉందని ఆనందపడుతూ వున్నడు. అంతేకాకుండా ఆవిడలో కూడా నాకు కొంత రిలీఫ్ కనిపిస్తూ వుంది. కొంతకాలం వాళ్ళనలా ఆనంద పడనిద్దాం. అంతకన్నా మనమేం చెయ్యగలం?" తల్లి మొహంలోకి చూస్తూ అంది మేనక.
"యు అర్ రైట్ డార్లింగ్. సర్లే, అలాగే కానీ." తన చేతిని తొలగించి తలూపుతూ అంది ప్రతిమ. "నేను కూడా ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కొంత స్వాంతన పరచాలని నాకూ అనిపిస్తూంది."
"బెస్ట్ డెసిషన్ మామ్. ప్లీజ్ అలాగ చెయ్యి. వాళ్ళ ఇల్లు మన ఇంటికి మరీ అంత దూరం కూడా కాదు." కాస్త ఆగి ఎదో గుర్తు వచ్చినట్టుగా అంది మేనక "కానీ అంకుల్ నువ్వు అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాడు ఆ పెద్దావిడకి నన్ను వాళ్ళ ఇంటిదగ్గర ఉంచడానికి."
"పర్లేదులే. నేనింటికి వచ్చేసాను కానీ మళ్లీ వెళ్లాల్సి ఉండొచ్చు అని చెప్దాము. నువ్వక్కడ వుండడానికి వాళ్ళిద్దరికీ అభ్యంతరం అయితే ఏమీ లేదు కదా.”
"అస్సల్లేదు. చాల చక్కగా ఆలోచించవమ్మా. నేనలా చెప్తాను, నువ్వక్కడికి రా" బెడ్ మీదనుంచి కిందకి దిగుతూ అంది మేనక. "నేనింక వెళ్తా అమ్మా."
"ఒక ముఖ్య విషయం మాట్లాడేది వుంది, అది చెప్పేవరకు వుండు." తానూ బెడ్ మీదనుంచి కిందకి దిగింది ప్రతిమ. "మీ అంకుల్ ఆ కుర్రాడి ఫోటో నాకు వాట్సాప్ చేసాడు. చాలా హ్యాండ్సమ్ గా వున్నడు. డాక్టర్ గా ఎదో హాస్పటిల్ లో జాబ్ చేస్తున్నాడు. నువ్వొక్కసారి చూసి ఎలా వున్నాడో చెప్పు." అక్కడే టేబుల్ మీద వున్న తన సెల్ ఫోన్ తీసుకుని మేనక దగ్గరికి వచ్చింది ప్రతిమ.
" మామ్ ప్లీజ్. ఇప్పుడొద్దు, తరువాత చూస్తాను." వేగంగా అక్కడినుంచి కదులుతూ అంది మేనక.
"నేను నీకు ఆ ఫోటో వాట్సాప్ చేస్తాను. నువ్వు చూసే తీరాలి. నాకు చాలా నచ్చాడు. నీకూ నచ్చుతాడు." వెనకాతల నుంచి అరిచింది ప్రతిమ.
ఏ సమాధానం చెప్పకుండానే అక్కడినుండి వెళ్ళిపోయింది మేనక.
&&&
"జస్ట్ ఆలా నా ఫ్రెండ్ ని కలుసుకుని మాట్లాడదామని వెళ్ళాను." మేనక మళ్లీ ఇంటికి వెళ్లేసరికి నిర్మల ఒక్కర్తీ మాత్రమే ఇంట్లో వుంది. "సారీ ఎక్కువ సమయం బయట గడిపేసినట్టుగా వున్నాను."
"ఏం పర్లేదులే. నిరుపమ కూడా ఇంతే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందంటే, ముఖ్యంగా ఆ సమీర ఇంటికి వెళ్లిందంటే సమయం తెలియదు. ఎంత సేపైనా అక్కడే ఉండిపోతుంది." కుర్చీలోనుంచి లేస్తూ అంది నిర్మల. "నువ్వు కాస్త నీ రూంలో రెస్ట్ తీసుకుంటూ వుండు, నేను వంటింట్లో పనిపూర్తి చేస్తాను."
"మీరు ఏమి అనుకోకపోతే ఆంటీ నేను మీకు వంటింట్లో సాయం చేస్తాను." ఆమె మొహంలోకి చూస్తూ అంది మేనక. "నాకు వంట ఏమీ రాదు. మామ్ నేర్చుకోమంటుంది. కానీ నాకే నేర్చుకోవాలనిపించదు. కానీ మామ్ కి మాత్రం వంటింట్లో సాయంగా వుంటూ వుంటాను."
"నీకు నిరుపమకి తేడా ఏమీ కనిపించడం లేదు. తనని వంట నేర్చుకోమని అలా చెప్తూనే వుంటాను. ఇక్కడ కాకపోయినా అత్తారింట్లో మీరు వంట చెయ్యాలి కదా. కానీ తను వినదు. తనకి మూడ్ కుదిరితే వంటింట్లో నాకు సాయం మాత్రం చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు." నవ్వి అంది నిర్మల. "కానీ నీకు చెయ్యాలనిపిస్తే నా అభ్యంతరం ఏమీ లేదు."
"ఓహ్, ఆంటీ. థాంక్ యు వెరీ మచ్." నిర్మలని కౌగలించుకుని తన కుడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది మేనక.
"నువ్వు ప్రతినిమిషం నిరుపమనే గుర్తు చేస్తున్నావు." నీలినీడలు అలుముకున్నాయి నిర్మల మోహంలో. "తానూ అంతే ఏ ఎమోషన్ దాచుకోలేదు. ఎక్ష్ప్రెస్స్ చేసేస్తుంది."
"ఐ యామ్ సారీ అంటీ." ఆమెని విడిచిపెట్టి మామూలు అవుతూ ఎందుకందో తెలీదు కానీ అంది మేనక. అప్పుడు ఆ మొహంలోకి చూస్తూ ఉంటే గుండెలు నులుముతున్నట్లుగా అనిపిస్తూంది మేనకకి. అంకుల్ చెప్పింది నిజం. ఈమె తన కూతురు బ్రతికి వున్నట్టుగా తనని తను ఫోర్స్ చేసుకుంటూంది కానీ తనకి తెలుసు తను ఇక లేదని.
"సారీ దేనికి? నేను తనకి చెప్తాను. అచ్చం అన్నిరకాలుగా తనలాగే వున్న అమ్మాయి తనకి ఫ్రెండ్ కాబోతోందని. ఈ సారీ తను ఫోన్ చేస్తే తనకి నీ గురించి చెప్తాను. నువ్వు మాట్లాడుదువు గని." ఇంకా మేనక మొహంలోకి చూస్తూ అంది నిర్మల. ఆ మోహంలో ఆ నీలినీడలూ అలాగే వున్నయి.
"ఒకే ఆంటీ అలాగే చేద్దాం. కానీ వంటింట్లోకి వెళ్దామా? వంట ప్రారంభించాలికదా. నాకు ఆకలి కూడా వేస్తూంది." తన కుడి చేతిని నిర్మల భుజాల చుట్టూ వేస్తూ అంది మేనక.
"మరి చెప్పవేం? వంటింట్లో నీకు ఇష్టమైనవి ఏంటో కూడా చెప్పు. అవే చేస్తాను." అక్కడినుంచి కదులుతూ అంది నిర్మల. ఆమె వెనకాతలే నడిచింది మేనక.
&&&
మేనకకి తన అసైన్మెంట్ గుర్తు వుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో జాగ్రత్తగా అబ్సర్వ్ చేసి తన అంకుల్ కి చెప్పాలి. కానీ తను ఇక్కడ వున్న ఈ రెండు రోజుల్లో ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. అంతా మామూలుగానే వుంది. ఇంక అంతా అలాగే ఉంటుందేమో ఈ నెలరోజులూ అనికూడా అనుమానంగా వుంది. ఇలా అయితే తన అంకుల్ ఆ నిజాన్ని ఎలా బయటికి తియ్యగలడు తనిచ్చిన నెలరోజుల సమయంలో?
"నీకంత సౌకర్యంగానే వుందికదా ఆ రూంలో? నీకేం కావాలన్నా కూడా అడగడానికి మొహమ్మాటపడకు." స్టవ్ మీద కుక్కర్ పెడుతూ అంది నిర్మల.
"చాల సౌకర్యంగానే ఉంది. నేను ఏం కావాలన్నా కూడా మిమ్మల్ని అడగడానికి ఎప్పుడూ మొహమ్మాట పడను. నేను మీ దగ్గర చాల ఇంటిమేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎంత ఇంటిమేట్ గా అంటే మా మామ్ వచ్చేసిన తరువాత కూడా నాకు ఇక్కడే ఉండాలని వుంది." ఆమె ఇచ్చిన వంకాయలని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని, డైనింగ్ టేబుల్ మీద ప్లేటులో పెట్టి చాకుతో తరుగుతూ అంది మేనక.
"నిజంగా, నిజంగా నువ్వు అలా చేస్తావా?" మేనక దగ్గరగా వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అడిగింది నిర్మల.
"ఎందుకు చెయ్యను ఆంటీ?" చాకుని వంకాయలని ప్లేటులో వదిలేసి, నిర్మల మొహంలోకి చూస్తూ అంది "చూస్తూ వుండండి. మీరు వెళ్ళమనేంతవరకూ నేను ఈ ఇంట్లోనే వుంటాను."
"నాకు చాలా సంతోషంగా వుంది నువ్వు చెప్పింది విన్నాక. నువ్విక్కడ ఉంటే నాకు నిరుపమ ఉన్నట్టుగానే వుంది." ఇంకా ఏదో అనబోతూ వుంది కానీ అంతలో రంగనాథ్ ప్రవేశించాడు ఆ గదిలోకి.
"హాయ్ అంకుల్. మీ గురించే చూస్తూ ఉన్నాను. ఈ రోజు వంట మేమిద్దరం కలిసి చేస్తున్నాం. ఎలా వుందో మీరు నాకు చెప్పాలి." మళ్లీ వకంకాయలు తరగడంలో నిమగ్నం అవుతూ అంది మేనక.
" చాలా బాగానే ఉంటుంది. రుచి చూడకుండానే నేను ఆ విషయం చెప్పగలను." రంగనాథ్ నవ్వాడు. "అయినా నువ్వు తననెందుకు ఇబ్బంది పెట్టావు?" చిరుకోపంతో నిర్మల మొహంలోకి చూసాడు రంగనాథ్.
"నేనిబ్బంది పెట్టనా? తననే అడగండి." నిర్మల కూడా కోపంగా అంది.
"అంకుల్, నేనే కావాలని వంట నేర్చుకుంటానంటే ఆంటీ ఎలొ చేసారు." అప్పటికి వంకాయలు తరగడం పూర్తి కావడంతో లేచి నిలబడింది మేనక. "అయినా ఇప్పటివరకు ఈ వంకాయలు తరగడం తప్ప నేను చేసిందేమి లేదు."
" ఇంక నువ్వు చేయ్యాల్సిందీ ఏమీ లేదు. ఈ వంకాయల కూర చేసేస్తే ఈ రాత్రికి ఇంకా ఏమీ అఖ్ఖర్లేదు. నువ్వెళ్ళి మీ అంకుల్ తో కబుర్లు చెప్తూ వుండు. నేను కాఫీ తీసుకొస్తాను మీ ఇద్దరికీ." ఆ వంకాయల ముక్కలున్న ప్లేట్ ని అక్కడనుండి తీస్తూ అంది నిర్మల.
"సరే ఆంటీ." అని అక్కడనుంచి కదిలింది మేనక. ఆమెతో పాటుగానే కదిలాడు రంగనాథ్ కూడా.
&&&
"నిన్ను చూస్తూ వుంటే నిరుపమని చూస్తున్నట్టుగానే ఉందమ్మా. మనసుకి కాస్త స్వాంతనగా వుంది." కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకుంటూ అన్నాడు రంగనాథ్.
తన కుర్చీని రంగనాథ్ కుర్చీకి దగ్గరగా లాక్కుని అయన కుడి భుజం మీద తన కుడిచేతిని వేసింది మేనక. అయన కళ్ళు తెరిచి, తల తిప్పి మేనక మొహంలోకి చూసాడు.
"మీకు కొంతైనా నావల్ల స్వాంతన కలిగినందుకు నాకు ఆనందంగా వుంది అంకుల్. మీ జీవితంలో అతి పెద్ద విషాద సంఘటన జరిగింది. కానీ అది మర్చిపోయి మీరు మాములు మనుషులు కాక తప్పదు. అందుకు నేను జీవితాంతం ఇక్కడే ఉండడం అవసరం అయినా నాకు అభ్యంతరం లేదు." మేనక అంది.
"నేను మీ అంకుల్ ని సంప్రదించడం వల్ల ఇంత మంచి అమ్మాయి తో నాకు పరిచయం కలుగుతుందని నేను ఊహించలేక పోయాను. ఎందుకు నా గురించి నీకు అంతగా ఫీలింగ్ కలుగుతూంది?" కళ్ళు చిట్లించి అడిగాడు రంగనాథ్.
"చెప్పలేను అంకుల్. నాకు తెలీదు." కాస్త ఆగి దీర్ఘంగా నిట్టూర్చింది. "కానీ తన ఫోటో చూసి, తను సూసైడ్ చేసుకుందని తెలియగానే నా హృదయం బరువెక్కి పోయింది. ఇంకా మిమ్మల్ని, ఆంటీని చూస్తూ ఉంటే...." కారుతూ వున్న కన్నీళ్ళని నిగ్రహించుకోవడం మేనక వశం కాలేదు. "……నేను నా బాధని తట్టుకోలేక పోతున్నాను."
"నన్ను మామూలు మనిషిని కమ్మని చెప్పి నువ్వు నాలా కాకు." తన భుజం మీద వున్నఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కాడు రంగనాథ్.
"సారీ అంకుల్" తన చేతిని అయన చేతుల్లోంచి విడిపించుకుని కన్నీళ్లు తుడుచుకుంది మేనక. "నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు ఏమనుకుంటారో అని భయంగా వుంది."
"నా అమ్మాయికి నా దగ్గర భయమా? చెప్పు అదేంటో?" కుర్చీలో అడ్జస్ట్ అయి, నిరుపమ మోహంలోకే ఆసక్తిగా చూస్తూ అడిగాడు రంగనాథ్.
" అంకుల్, నేను మీ గురించి అంతా చెప్పాము మామ్ కి. మామ్ కూడా చాలా బాధపడింది. వచ్చి మీతో మాట్లాడాలనుకుంటూంది. మీకేం అభ్యంతరం లేదు కదా?"
"అభ్యంతరమా? మా గురించి ఇలా ఆలోచించే వాళ్ళున్నారంటే నాకు సంతోషం గా వుంది. తనని ఖచ్చితంగా మా ఇంటికి రమ్మను. ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం." ఇంకా ఏదో అనబోతూ నిర్మల అక్కడికి రావడం చూసి ఆగి పోయాడు.
"వంకాయ కూర చేసి ఇంకా అన్ని సిద్ధం చేసేసరికి లేటయింది. ఇంకేం కాఫీ తాగుతారు? వచ్చి మీరిద్దరూ భోజనాలు చేసెయ్యండి." నిర్మల వాళ్ళిద్దరికీ దగ్గరగా వచ్చి అంది.
రంగనాథ్ ఇంకా మేనక ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.
&&&
భోజనం పూర్తి చేసి, రంగనాథ్ ఇంకా నిర్మలతోటి కొంతసేపు మాట్లాడాక మేడ మీద తన గదిలోకి వచ్చింది మేనక. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకోగానే మొదటి రెండు రోజులు ఎలా అనిపించిందో అలాగే ఏదో భయంగా అనిపించింది. ఇదే గదిలో, ఈ బెడ్ మీద వున్న సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది ఆ అమ్మాయి. ఎంత తనకి స్పిరిట్స్ మీద నమ్మకం లేక పోయినా ఎదోలాగే వుంది. తెల్లవారేక మాత్రం చాలా ధైర్యంగా రాత్రి ఫీలింగ్ కి సిగ్గుగా అనిపిస్తూంది. కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకుని చూసింది, తన అంకుల్ స్మరన్.
"ప్రత్యేకంగా రిపోర్ట్ చెయ్యడానికి ఏమీ లేదు అంకుల్. ఎవ్విరిథింగ్ ఈజ్ ఏజ్ యూజువల్. అందుకనే కాల్ చెయ్యలేదు నీకు." నిట్టూరుస్తూ అంది మేనక.
"ఇట్స్ ఆల్రైట్. నో ప్రాబ్లెమ్." స్మరన్ అన్నాడు. "ఈ అసైన్మెంట్ కి సంబంధించి రేపు నువ్వొక పని చేసిపెట్టాలి."
"ఏ బ్రేక్ టు ది రొటీన్. ఐ లవ్ ఇట్. అదేంటో చెప్పు." నవ్వుతూ అడిగింది.
"నేను నిరుపమ ఫ్రెండ్ సమీర తో మాట్లాడాను. తనకి ఏమైనా సడన్ గా గుర్తుకు వస్తే ఫోన్ చేసి చెప్పమని చెప్పాను."
"తనకి ఏమైనా గుర్తుకు వచ్చిందా?" ఆసక్తిగా అడిగింది మేనక.
"ఏమీ గుర్తుకు రావడం కాదు. షి ఫౌండ్ సంథింగ్ ఇంటరెస్టింగ్! ఫోన్లో చెప్పడానికి అవదు వచ్చి చూడాలంటూంది. నాకు రేపు వెరీ అర్జెంటు వర్క్ వుంది. నువ్వు రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి అదేంటో చూడు."
"ఓహ్, థాంక్ యు అంకుల్. నేను జస్ట్ ఇలాంటి బ్రేక్ గురించే చూస్తున్నాను. రేపు టెన్ కి అలా వెళ్ళనా?" ఉత్సాహంగా అంది.
"బెస్ట్ టైమింగ్. నేను అడ్రస్ చెప్తాను. నువ్వున్న ఇంటికి దగ్గరే. తేలికగా గుర్తు పట్టొచ్చు ఆ ఇల్లు. అలాగే ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వెళ్లేముందు ఒకసారి ఫోన్ చేసి నువ్వు నా నీస్ వి ఇంకా అసిస్టెంట్ వని అదేంటో చూడడానికి నేను పంపిస్తున్నాని చెప్పు."
"ఒకే అంకుల్. అలాగే చేస్తాలే."
"సరే అయితే. జాగ్రత్తగా విను." స్మరన్ అడ్రస్ చెప్తూ ఉంటే జాగ్రత్తగా వింది మేనక. "నేనిప్పుడే ఆమె ఫోన్ నెంబర్ కూడా నీకు షేర్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు స్మరన్.
స్మరన్ నుంచి వచ్చిన సమీర ఫోన్ నెంబర్ మెసేజ్ చూసాక మళ్లీ నిద్రకి ఉపక్రమించింది మేనక. ఈసారి పెద్దగా కష్టపడకుండానే నిద్రలోకి జారిపోయింది.
చాప్టర్-4
తెల్లవారి తెమిలి పదవుతూ ఉంటే సమీర నెంబర్ కి కాల్ చేసింది మేనక. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. కాస్త ఆగి ట్రై చేసినా అలాగే వచ్చింది. వెళ్లాలో లేదో తెలియక కాస్సేపు అయోమయంలో పడింది. తన అంకుల్ కి ఫోన్ చేసి చెప్దామా అనుకుని మళ్ళీ ఆగిపోయింది. తాను ఎవరితోనైనా ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉంటే అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. సమీర దగ్గరికి వెళ్లే పని పోస్టుపోన్ చేసుకుందామా అని కూడా ఆలోచించింది. కానీ ఇంట్లో చాలా బోర్ కొడుతూ వుంది. ఈ సమీర దగ్గరకన్నా వెళ్తే కాస్త కాలక్షేపం కావచ్చు. అంకుల్ చెప్పిన ప్రకారంగా ఇల్లు పెద్ద దూరం కూడా కాదు. తేలిగ్గానే వెళ్లొచ్చు. ఫోన్ చెయ్యకుండానే వెళ్లిచూద్దాం ఏమవుతుందిలే అన్న నిర్ణయానికి వచ్చింది. అప్పటికి నిర్మల, రంగనాథ్ ఇద్దరూ ఇంట్లోనే వున్నరు. చిన్న పనిమీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయట పడింది. సమీర ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు.
స్మరన్ చెప్పినట్టుగా ఆ ఇల్లు కనిపెట్టడం చాలా తేలికే అయింది. ఇంటిముందు పెద్ద లాన్ వుంది. చెట్లు వున్నయి. ఇంటిముందు ఒక బోర్డు కూడా వుంది ' ఎన్. ముకుందం, ఎఫ్.సి.ఏ.' అని. తలుపులు మాత్రం దగ్గరకి వేసి వున్నయి. ఇంట్లో ఎవరైనా వున్నరా లేదా అనుకుంటూ తలుపుల దగ్గరకి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కేప్పుడు మాత్రం ఎదో మొహమ్మాటంగా అనిపించింది. తను ఫోన్ చేసి రాలేదు, తానెవరో ఈ ఇంట్లో ఎవరకి తెలియదు. రెండవసారి కాలింగ్ బెల్ నొక్కాలా వద్ద అని ఆలోచిస్తూ వుంటే తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగుండా తనంత వయసే వున్న అమ్మాయి వోణీలో వుంది. కచ్చితంగా సమీరే అయిఉంటుంది. కానీ మేనక ఇమ్మీడియేట్ గా నోటీసు చేసిన విషయం ఏమిటంటే నిరుపమ ఎంత అందంగా వుందో ఈ అమ్మాయీ అంత అందంగానూ వుంది. నిరుపమ చనిపోయింది కాబట్టి తనకేమి అనిపించలేదు. కానీ ఈ అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటే కొంత జెలసీ గా అనిపించింది. ఇప్పటివరకు తనే ఎంతో అందంగా ఉంటుందన్న అభిప్రాయంలో వుంది.
"హాయ్, నేను..." తన మొహంలోకి షాక్ తో, ఇంకా ఆశ్చర్యంతో చూస్తూన్న సమీర మొహంలోకి చూస్తూ ఎదో చెప్పబోయింది మేనక. సమీర ఎందుకలా ఆశ్చర్య పోతూ వుందో మేనకకి అర్ధం కాలేదు.
"నువ్వు వచ్చేసావా... నా గురించి వచ్చేసావా!" వణుకుతూవున్న గొంతుతో అంది సమీర.
"మీరంటున్నది నాకు అర్ధం కావడం లేదు. నేను ఎవరు అనుకుంటున్నారు?" అయోమయంగా అడిగింది మేనక.
"నేనుండలేనని వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు నా గురించి వస్తావని." మేనక ఇంకా ఎదో చెప్పబోయే లోపల సమీర మేనకని గట్టిగ హత్తుకుంది.
"మై గాడ్, నేను మీరనుకుంటన్నట్టు నిరుపమని కాదు." అప్పటికి విషయం అర్ధం అయి, తను కూడా సమీర చుట్టూ చేతులు వేస్తూ, అంది మేనక. "నేను డిటెక్టివ్ స్మరన్ నీస్ ని. మీరేదో ఇంటరెస్టింగ్ థింగ్ నిరుపమకి సంబంధించి కనిపెట్టారట కదా. మా అంకుల్ ఎదో అర్జెంటు పనిమీద బయటకి వెళ్లారు. చూసి రమ్మని నన్ను పంపించారు."
"మై గాడ్!" సడన్ గా సమీర మోహంలో డీప్ డిజప్పోయింట్మెంట్ కనిపించింది. "ఐ యాం సారీ. రియల్లీ సారీ. మీరు లోపలికి రండి." గట్టిగా నిట్టూరుస్తూ, మేనకని వదలి, తన చుట్టూవున్న మేనక చేతుల్ని విడిపించుకుని లోపలి నడిచింది. "ఆ కుర్చీలో కూర్చోండి." లోపలి వెళ్ళాక అక్కడే వున్న సోఫాలో కూలబడుతూ ఎదురుగా వున్న కుర్చీని చూపించింది.
"ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు తన డెత్ వల్ల మీరెంత ఎఫెక్ట్ అయ్యారో చెప్పడానికి." ఆ కుర్చీలో కూర్చుంటూ అంది మేనక.
"రాత్రంతా తనే కలలో వుంది. తెల్లారేక కూడా తన గురించే ఆలోచిస్తూ వున్నాను. మీరు కూడా తనంత హెయిట్ తో, తనంత అందంగానూ, ఇంకా తానెక్కువగా వేసుకునే పంజాబీ డ్రెస్, రెండు జళ్లతో ఉండేసరికి, మూమెంటరిగా తనే అని భ్రమ పడిపోయాను. ఐ యాం సారీ." సోఫాలో వెనక్కి జారగిలబడుతూ అంది సమీర.
"యు నీడ్ నాట్. నిజానికి నేను కూడా తన గురించే ఆలోచిస్తూ వున్నాను. నేను ఆ ఇంట్లో, ఆమె గదిలోనే ఉంటూ వున్ననేమో నా మనసంతా కూడా నిరుపమతోనే నిండి పోయి వుంది." తానూ వెనక్కి కుర్చీలో వాలుతూ అంది మేనక.
"మీరు ఆ ఇంట్లో వుండడమేమిటి, నాకు అర్ధం కావడం లేదు." ఆశ్చర్యంగా అంది సమీర.
అప్పుడు మేనక, స్మరన్ తనకి అప్పచెప్పిన అసైన్మెంట్ గురించి చెప్పింది. "ఇప్పటివరకు నేను నోటీసు చేసింది ఏమీ లేదు. నాకు అక్కడ ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇంకా ఆ పెద్దవాళ్ళని ఇద్దరినీ ఆలా చూస్తూ ఉండలేక పోతున్నాను. ఆ నిర్మల తన కూతురు బ్రతికి ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తూంది." నిట్టూర్చింది మేనక.
"ఆ ఇంటికి వెళ్తే నిరుపమ జ్ఞాపకాల్ని నేను తట్టుకోలేను. అందుకనే ఆ పెద్దవాళ్ళిద్దరూ ఆలా సఫర్ అవుతున్నా నేను అక్కడికి వెళ్లడమే మానేసాను." సమీర కూడా నిట్టూర్చింది.
"మీ పరిస్థితి నాకు అర్ధం అయింది. మీరు అక్కడికి వెళ్తే ఆ జ్ఞాపకాలతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే నాకూ అనిపిస్తూంది. మీరు అవి తట్టుకోగలరనే కాన్ఫిడెన్స్ వచ్చేవరకు అక్కడికి వెళ్లొద్దు. అయినా ఆ పెద్దవాళ్ళ ఇద్దరిగురించి బాధపడొద్దు. నేను వాళ్ళకి వాళ్ల అమ్మాయి లాగే అనిపిస్తూ వున్నాను. నన్ను చూసి చాలా స్వాంతన పొందుతున్నారు. కొంతకాలంపాటు నేను వాళ్ళని చూసుకుంటాను."
"నిజంగానే? నువ్వు చెప్పేది వింటూవుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూంది." సడన్గా సమీర మొహం ఆనందంతో నిండిపోయింది.
"హండ్రెడ్ పర్శంట్ ట్రూ. జస్ట్ బి రిలాక్స్డ్. నిరుపమ బెస్ట్ ఫ్రెండ్ గా మీ ఫీలింగ్ వాళ్ళ గురించి ఎలా ఉంటుందో నేను అంచనా వెయ్యగలను. ఫర్ ది ప్రెసెంట్ ఐ యామ్ దేర్ ఫర్ దెమ్." కుర్చీని సోఫాకి దగ్గరికి లాక్కుని, సమీర కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అంది మేనక. ఇంత తక్కువ సమయంలో తనకి సమీరతో ఇంత క్లోజ్ గా ఫీలింగ్ రావడం మేనక కి ఆశ్చర్యం గా వుంది.
"యు నో వన్ థింగ్? ఈ మధ్య కాలంలో నన్నెంతో ఆనంద పరిచిన మనిషివి నువ్వే. నాకు నిన్ను చూస్తూ ఉంటే నిరుపమని చూస్తూన్న ఫీలింగే కలుగుతూ వుంది.” కాస్త ఆగి అంది "ఒక్క విషయం చెప్పు. నువ్వెప్పుడూ ఇలా పంజాబీ డ్రెస్ ఇంకా రెండు జడలు వేసుకుంటావా?"
"మోస్ట్ అఫ్ ది టైం" నవ్వింది మేనక. "పైకి వెళ్తే నా డ్రెస్ ఇదే. ఇంట్లో వుంటే మాత్రం రాత్రిపూట లంగా వోణి కట్టుకుంటాను. అప్పుడప్పుడు చీర కూడా. నాకు ఒక్క జడ వేసుకోవాలని వున్నా మా మామ్ ఒప్పుకోదు."
"మై గాడ్! కేవలం హైట్ అండ్ వెయిట్ మాత్రమే కాదు, తక్కిన విషయాల్లోనూ నీకు నిరుపమతో సిమిలారిటీస్ వున్నయి. ఆ పెద్దవాళ్లిద్దరూ నిన్ను చూసి ఆలా రిలీఫ్ కావడంలో ఆశ్చర్యం లేదు." నిట్టూరుస్తూ అంది సమీర.
"నాకీ విషయానికి ఆనంద పడాలో విచార పడాలో అర్ధంకావడంలేదు." ఒక కన్ఫ్యుజింగ్ ఎక్స్ప్రెషన్ తో అంది మేనక.
"సర్తైన్లీ దిస్ ఈజ్ సంథింగ్ వుయ్ కెన్ ఫీల్ హాపీ." సమీర అంది. "ఆమె పేరెంట్స్ కి మాత్రమే కాదు నిన్నిలా చూస్తూ వుంటే నాకు కూడా రిలాక్స్డ్ గా ఇంకా హాపీ గా వుంది. కెన్ వుయ్ బోత్ బి క్లోజ్ ఫ్రెండ్స్?" తన చేతిని మేనక చేతిలోంచి విడిపించుకుంటూ అడిగింది సమీర.
"వై నాట్? ఐ లవ్ టు బి ఏ ఫ్రెండ్ విత్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ లైక్ యు. నీకు తెలుసా? నాకు ఇప్పటివరకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." కుర్చీలోనుంచి సోఫాలో సమీర పక్కకి షిఫ్ట్ అవుతూ అంది మేనక.
"నిరుపమ తప్ప నాకూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." సమీర నవ్వింది "ఇప్ప్పుడు నువ్వొచ్చావు."
"మన క్లోజ్ ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ స్టెప్ గా ఒక పని చేద్దామా? మీరు, మీరు మానేసి నువ్వు, నువ్వు అనుకుందామా?" మేనక అడిగింది.
"మనం ఆల్రెడీ అదే చేస్తున్నాం. గమనించలేదా?" మళ్ళీ అందంగా నవ్వింది సమీర.
"యు అర్ రైట్." తలూపుతూ మేనక కూడా అంతే అందంగా నవ్వింది. "నౌ బిజినెస్. నువ్వేదో ఇంటరెస్టింగ్ థింగ్ నిరుపమకి సంబంధించి ఫైండ్ అవుట్ చేసావుట కదా. అదేమిటి?"
"అది చాలా రోజులుగా అక్కడే వుంది. ఇంకా చాలా రోజులుగా అక్కడే ఉంటుంది. నేను నీకది ఎలాగూ చూపిస్తాను. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ గా మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళం పూర్తిగా తెలుసుకోక పోతే ఎలా?" మేనక మొహంలోకి చూస్తూ అంది సమీర.
"యు అర్ రైట్." తలూపుతూ అంది మేనక. " డాడ్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసే వారు. నా చిన్నతనంలోనే పోయారు. మామ్ మొదటినుంచి ఓ నేషనలైజ్డ్ బ్యాంకు మేనేజర్. వేరే ఆస్తులు కూడా కొంచెం వున్నయి. కాబట్టి ఫైనాన్సియల్ గా ప్రొబ్లెమ్స్ ఏమీ లేవు. బి.ఏ. ఎకనామిక్స్ లో డిస్టింక్షన్ వచ్చింది. ఎం.ఏ. ఎకనామిక్స్ తో చేసి, పి.హెచ్.డీ చేసి, లెక్చరర్ గా చెయ్యాలని నా కోరిక. కానీ ఎలాగైనా నా పెళ్లి చేసేయాలని మా మామ్ కోరిక."
"జస్ట్ లైక్ మై మదర్. నేను ఎంతో ఇష్టంతో జాయిన్ అయిన ఎం.ఏ. సైకాలజీ పూర్తి చెయ్యనిచ్చేలా కనిపించడం లేదు. వారానికి రెండు సంబంధాలయినా తెస్తూ ఉంటుంది." నిట్టూరుస్తూ అంది సమీర.
"మనం ఎవరితోనైనా లవ్ లో పడి వాళ్లనే పెళ్లి చేసుకుంటాం అనేలోపు మన పెళ్లి చేసేయాలని వాళ్ళ ఆలోచన." మేనక అంది.
"యు అర్ రైట్. అందుకూ అవకాశం వుంది కదా. ఇప్పటి వరకు లవ్ లో పడలేదని మనం తక్కిన అమ్మాయిలకి ఎక్సెప్షన్ అనుకోలేం. మోరోవర్ మన ఛాయస్ చక్కగా ఉంటుందనీ చెప్పలేం. నా ఉద్దేశంలో పెద్దవాళ్ళు తెచ్చే సంబంధాలే మంచివి."
"ఎగ్జాట్ గా నా ఒపీనియన్ కూడా అదే." మేనక నవ్వింది. "నా గురించి ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఇక నీ సంగతేమిటి?"
"చెప్తా నా గురించి. కానీ మీ అంకుల్ సంగతేమిటి? అయన ఫామిలీ ఏం చేస్తున్నారు?" ఆసక్తిగా చూస్తూ అడిగింది సమీర.
"ఆయనది చాలా విషాద కరమైన లైఫ్. తన భార్య మూడోనెల ప్రేగ్నన్ట్ గా వున్నప్పుడు అనుకుంటా ఆమె ఒక ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఎవరు ఎంతగా చెప్పిన మా అంకుల్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. తను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేసే వారు. తన భార్య చనిపోయాక, ఆ జాబ్ కి రిజైన్ చేసి 'స్మరన్ డిటెక్టివ్ ఏజెన్సీ' స్టార్ట్ చేసారు. తనకి వేరే అసిస్టెంట్స్ ఎవరూ లేరు. నన్నే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా యూజ్ చేసుకుంటూ వుంటారు." చెప్పింది మేనక.
"నిజంగా వెరీ సాడ్. నేను ఇది అసలు ఊహించలేదు. అలాంటి ఒక హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఒక అందమైన భార్యతో, పిల్లలతో ఆనందంగా వుండివుంటారనుకున్నాను." షాకింగ్ గా అంది సమీర.
"తనని చూసి ఇలా ఇంప్రెస్ అయింది కేవలం నువ్వు మాత్రమే కాదు. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు కూడా. కానీ తను ఎంతమాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు." చిరునవ్వుతో సమీర మొహంలోకి చూస్తూ అంది మేనక.
తను ఏం మాట్లాడిందో గుర్తుకొచ్చి బుగ్గలు ఎరుపెక్కి పోయాయి సమీరకి. "మీ అత్తయ్య ఎలా ఉండేది? ఐ మీన్ అయన భార్య." వెంటనే మాట మార్చడానికి అన్నట్టుగా అంది.
"తను చనిపోయే సమయానికి నాకు నాలుగేళ్లొ, ఐదేళ్లో అనుకుంటా. నాకు తను పెద్దగా గుర్తు లేదు. బాగానే ఉండేదేమో. కానీ నిజమైన ప్రేమకి అందంతో పనేమిటి?"
"యు అర్ రైట్. స్వచ్ఛమైన ప్రేమకి మీ అంకుల్ జీవితమే ఒక ఉదాహరణ. భార్య పోయి నెల రోజులు కూడా కాకముందే ఇంకో పెళ్లి గురించి ఆలోచించే మగవాళ్ళున్న ఈ రోజుల్లో మీ అంకుల్ ఆలా ఉండడం నిజంగా గ్రేట్. తన గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు." మొహంలో అడ్మిరేషన్ తో అంది సమీర.
"మరేం. ఇంక మా అంకుల్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. మరి నీ గురించి మొదలు పెడతావా?" సోఫాలో అడ్జస్ట్ అవుతూ అడిగింది మేనక.
"మా నాన్న ఛార్టర్డ్ అకౌంటెంట్. వేరే చోట ప్రాక్టీస్ వుంది. రోజూ అక్కడికే వెళతారు, ఈ రోజూ అక్కడికే వెళ్లారు. అమ్మ హౌస్ వైఫ్. రోజూ ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజు మా నాన్నగారి చెల్లెలి ఇంటికి వెళ్ళింది, సాయంత్రానికి వచ్చేస్తుంది. నేను ఒక్కత్తినే కూతుర్ని మా పేరెంట్స్ కి. ఈ ఇల్లు కాకుండా ఇంకా ఏవో కొన్ని ఆస్తులు వున్నయి. నీలాగే నాకూ ఫైనాన్సియల్ గా ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు. చెప్పాగా ఆల్రెడీ. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నా పెళ్లి చేసేయడమే నా పేరెంట్స్, ముఖ్యంగా నా మామ్ ప్రెజంట్ మిస్సన్. టూ బి ఫ్రాంక్……" మళ్ళీ అందంగా నవ్వింది సమీర. "నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ తో పూర్తి చెయ్యాలని మరీ అంత సీరియస్ గా ఏమీ లేను. మామ్ బలవంత పెడుతూందని మాత్రమే కాకుండా మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసేసుకుందామనే ఆలోచనలోనే వున్నను."
"రియల్లీ? ఇక్కడ మనిద్దరికీ కొంచం డిఫరెన్స్ వచ్చినట్టుగా ఉంది. నాకెందుకో మరీ అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని లేదు."
"ఎవ్విరివన్ ఎంటైటిల్స్ టు హేవ్ హిజ్ ఆర్ హర్ ఓన్ టేస్ట్. క్లోజ్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన మన టేస్ట్ ఇంక ఓపీనియన్స్ అన్నీ ఒకటి కావాలని ఏమీ లేదు. నిరుపమకి నాకు కూడా కొన్ని అభిప్రాయాల్లో డిఫరెన్సెస్ ఉండేవి. తను నీలాగే త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో వుండేది కాదు." సమీర అంది.
"తను ఆలా సూసైడ్ చేసుకోవడం కన్నా కూడా, మీ ఎవ్వరికి ఏ మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఆలా చేయడం నాకు చాలా ఆశ్చర్యం గా వుంది. అందుకు కారణం ఏమై ఉంటుందో నీ ఊహకి కూడా అందడం లేదా?" నిరుపమ టాపిక్ రావడంతో అంది మేనక.
"కొంచెం కూడా లేదు. అసలు ఎందుకు అంత పని చేసి వుంటుందో కొంచెం కూడా ఊహించ లేకపోతున్నాను." నిట్టూరుస్తూ అంది సమీర.
"తనకి బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఏ లవ్ అఫైర్స్ లేవు, నువ్వు స్యూరా?"
"ఉంటే నేను మీ అంకుల్ కి చెప్పేదాన్ని. నేను, తను ఏమీ పురుష ద్వేషులం కాదు. కాకపోతే మాకు బాయ్స్ తో ప్రత్యేకంగా పరిచయాలు అయితే లేవు. నాకు తను, తనకి నేను తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." కాస్త ఆగి అంది మళ్ళీ "ఐ యాం స్యూర్. ఏ ప్రేమ విఫలమో లేక మోసగించబడ్డమో తన సూసైడ్ కి కారణం కాదు. అలాగే తన మీద జరిగిన ఏ అట్రాసిటీయో కూడా కారణం కాదు. మీ అంకుల్ ఈ ప్రశ్నలన్నీ అడిగారు. నేను సమాధానం చెప్పాను. మళ్ళీ నీకు కూడా చెప్పే ఓపిక నాకు లేదు." నీరసాన్ని అభినయిస్తూ అంది సమీర.
"ఆల్రైట్. నో మోర్ కొశ్చిన్స్. ఇప్పుడైనా నీకంత ఇంటరెస్ట్ కలిగించిన విషయం అదేమిటో చెప్తావా?" నవ్వుతూ అడిగింది మేనక.
"అదేమిటో చెప్పముందు నీకు ఒక విషయం చెప్పాలి." నిరుపమ ఒకరోజు తన ఇంటికి ఉదయం పదకొండున్నర సమయానికి రావడం, తను డాక్టర్ దగ్గరికి నిరుపమని తన ఇంట్లోనే వదలిపెట్టి వెళ్లడం మళ్ళీ తను ఇంటికి వచ్చాక తను వెళ్లి పోవడం వివరంగా చెప్పింది మేనక. "ఇదంతా నేను మీ అంకుల్ కి వివరంగా చెప్పాను. ఫ్యూ సెకండ్స్ మాత్రమే అయినా తన మోహంలో అప్పుడా ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటై ఉంటుంది అన్నది ఇప్పుడు కూడా నాకు అర్ధం కావడం లేదు. అంతే కాదు. నాకు వంట్లో బాగోలేదని తనకి తెలుసు. అయినా ఎలా ఉన్నావని కూడా అడగ లేదు. నేను ఒక్కర్తినే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా నాతో వస్తానని కూడా అనలేదు. నేను కొంచం హర్ట్ అయ్యాను కూడా."
"ఐ సీ" సాలోచనగా తలూపింది మేనక.
"ఆ రోజు నా పేరెంట్స్ ఇంట్లో లేరు. నేను తనని నా బెడ్ రూంలో ఉండమని చెప్పాను. నేను వచ్చేసరికి తను నా బెడ్ రూమ్ లో ఒక ఇంగ్లీష్ నవల చదువుతూ వుంది. వెళ్లిపోయేముందు ఒక అరగంట నాతో కూడా బాగానే మాట్లాడింది."
"ఇదంతా ఇప్పుడే నాకు చెప్పావు కదా. ఏముంది ఇందులో కొత్త విషయం?" కొంచం చిరాగ్గా అంది మేనక.
"మీ డిటెక్టివ్స్ కి కొంచం ఓపిక కూడా తక్కువగా ఉంటుందనుకుంటా." నవ్వుతూ సోఫా లోనుంచి లేచింది సమీర. "రా నాతోటి చూపిస్తాను." అంటూ అక్కడినుంచి నడిచింది. మేనక కూడా ఆమె వెనకాతలే నడిచింది. తిన్నగా ఆమెని తన బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది సమీర.
"ఇది నా బెడ్ రూమ్. నేనొచ్చేసరికి ఈ బెడ్ మీదే కూచుని తను బుక్ చదువుతూ వుంది. అంతకన్నా ముందు బెడ్ మీద అసహనంగా కదులుతూ ఉండి ఉంటుంది." బెడ్ కి దగ్గరగా వెళ్లి అంది సమీర.
" ఇప్పటికీ నువ్వు పాయింట్ కి రాలేదు." అసహనంగా అంది మేనక.
"డిటెక్టివ్స్ కి ఓపిక తక్కువగా ఉంటుందని మరోసారి రుజువు చేసావు." సమీర అంది.
"డిటెక్టివ్స్ ని అందరిని ఇందులోకి తీసుకురాకు. డిటెక్టివ్స్ కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం కొండంత సహనం. నా అంకుల్ ని కొంతకాలం అబ్సర్వ్ చేస్తే నీకా విషయం బోధపడుతుంది. నాకు డిటెక్షన్ అంటే ఇష్టమే కానీ ఇంకా అందులో ప్రొఫెషనల్ కాలేదు. అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. నా మెయిన్ ఛాయస్ ఫస్ట్ ఎం. ఏ. ఎకనామిక్స్ నెక్స్ట్ పి.హెచ్.డి. నెక్స్ట్ లెక్చరర్ గా పనిచేయడం."
"ఆల్రైట్ డియర్. మై అపాలజీ. ఎనీహౌ విషయానికి వచ్చేస్తున్నాను. ఇలా చూడు." అక్కడ వున్న గోడ దగ్గరికి వెళ్లి ఒకచోట చూపించింది. అది బెడ్ పిల్లోస్ వున్న చోటు. "నిన్న బెడ్ మీద దొర్లుతూ ఉంటే ఆక్సిడెంటల్గా కనిపించింది."
"ఏమిటది?" సమీర వేలుపెట్టి చూపిస్తూన్న చోటికి దగ్గరగా వెళ్లి తానూ చూసింది మేనక. అది బాల్ పాయింట్ పెన్ తో చిన్న అక్షరాలోతో వ్రాయబడి వున్నా స్పష్టంగానే వుంది.
"నేనీ ఫీలింగుని భరించలేను." అది బయటికి చదివింది సమీర.
"యు అర్ రైట్! అదే వ్రాయబడి వుంది." సమీర మొహంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అంది మేనక. "నీ అభిప్రాయంలో అది కచ్చితంగా నిరుపమే రాసిందా?"
"హండ్రెడ్ పర్శంట్ నిరుపమే రాసింది. ఆమె హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు. అంతే కాదు. ఇది ఆ రోజు తను నా బెడ్ రూమ్ లో టైం స్పెండ్ చేసినప్పుడు రాసిందే. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు." సమీర అంది. "కానీ తను ఏ ఫీలింగుని భరించలేక పోయిందో నాకు అంతు పట్టడం లేదు."
"ఖచ్చితంగా ఒక నెగటివ్ ఫీలింగ్. అంతే కాదు ఆ ఫీలింగ్ కి, నువ్వు తను రాగానే తన మొహంలో చూసిన ఎక్స్ప్రెషన్ కి కూడా ఎదో లింక్ వుంది." మేనక సాలోచనగా అంది.
"యు అర్ రైట్. కానీ ఏ నెగటివ్ ఫీలింగ్?"
"నాకు తెలిసినంతవరకు ఫీలింగ్స్ కేవలం రెండు రకాలు. పాజిటివ్ అండ్ నెగటివ్. సంతోషం వల్ల వచ్చేవి ఇంకా బాధ వాళ్ళ వచ్చేవి. ఇది ఖచ్చితంగా తను ఎదో బాధ పడుతూ ఉండడం వాళ్ళ వచ్చిన ఫీలింగ్. కానీ ఆ బాధ ఏమిటో ఇప్పుడే చెప్పగలగడం కష్టం. ఇన్వెస్టిగేషన్ ఇంకొంచం ముందుకు సాగాలి." మేనక అంది.
"ఎనీహౌ ఈ క్లూ ఏమైనా ఉపయోగ పడొచ్చా?" భృకుటి ముడిచి అడిగింది సమీర.
"తప్పకుండా ఉపయోగ పడుతుంది. థాంక్ యు వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఇట్ లైక్ దిస్. ఇకపై కూడా నువ్వు నాతో ఏది నీ దృష్టిలోకి వచ్చినా ఇలాగే షేర్ చేసుకుంటావు కదా." ఆ రూమ్ లోనుంచి బయటికి నడుస్తూ అంది మేనక. "నెల రోజులు లోపుగా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తానని మా అంకుల్ మాట ఇచ్చ్చారు ఆ రంగనాథ్ అంకుల్ కి. తను వేరే అసైన్మెంట్ లలో బిజీ గా వుంటారు. నేనే మాక్సిమం సాయం చెయ్యాలి."
"వై నాట్? తప్పకుండా. ఇప్పుడు నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వి కూడా కదా." సమీర నవ్వింది.
"సరే నేను మరి వెళ్ళొస్తాను. సాధ్యమైనంత త్వరలోనే నిన్ను మళ్ళీ కలుస్తాను." అని వీధి గుమ్మం వైపు నడవబోయింది మేనక.
"నా క్లోజ్ ఫ్రెండ్ని మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా పంపిస్తానా? కిచెన్ లోకి రా." అంటూ మేనక కుడిచేతిని పట్టుకుని వంటింట్లోకి తీసుకువెళ్ళింది సమీర.
అక్కడ సమీర కాఫీ కలుపుతూ ఉంటే మేనకకి సడన్గా నిరంజన్ గుర్తుకొచ్చాడు. "నీకు ఇంకా నిరుపమకి కూడా నిరంజన్ అనే అయన చాలా పరిచయం కదా. మా అంకుల్ చెప్పాడు." మేనక అడిగింది.
"ఎస్. అయన ఒక రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్. ఒక వన్ ఇయర్ కిందట ఇక్కడకి దగ్గరలోనే ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. నిరుపమకి రెలెటివ్ కూడా."
"ఐ సీ." సమీర ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అంది మేనక.
"అయన పెళ్లి చేసుకోలేదు. ఒక్కరే ఆ ఇంట్లో వుంటున్నారు. కానీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. ఎవరైనా ఆయన్ని చూస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. నేను, ఇంకా నిరుపమ అయన వల్ల ఎంతగా ఇంప్రెస్ అయ్యాము అంటే ఎం.ఎస్సి మాథ్స్ తో చదవాలనుకున్న వాళ్ళం ఎం.ఏ సైకాలజీ తీసుకున్నాం." తనూ కొంచం కాఫీ ఇంకో కప్పులో పోసుకుని సిప్ చెయ్యడం మొదలు పెట్టింది సమీర.
"నిజం చెప్పాలంటే నిరుపమ చనిపోయాక నేనూ అయన దగ్గరికి పెద్దగా వెళ్లడం మానేసాను. కానీ నువ్వు వస్తానంటే మనిద్దరం కలిసి వెళదాం. నువ్వూ చాలా ఇంప్రెస్ అవుతావు ఆయన్ని చూస్తే." సమీర మళ్ళీ అంది.
"కచ్చితంగా." నవ్వింది మేనక. "నేను సైకాలజీ నా స్టడీస్ లో సబ్జెక్టుగా ఎంచుకోక పోయినా అది నాక్కూడా చాలా ఇంటరెస్టింగ్ థింగ్. హిప్నోటిజం లాంటివి నాకూ బాగా తెలుసు. మా మామ్ ని, అంకుల్ ని నేను అప్పుడప్పుడు హిప్నోటైజ్ చేస్తూ వుంటాను."
"అయన హిప్నోటిజం లో ఎక్స్పర్ట్. నువ్వింకా చాలా మెళకువలు అయన దగ్గరనుంచి హిప్నోటిజం లో తెలుసుకోవచ్చు." సమీర అంది. " నాకు పెద్దగా అందులో ఇంటరెస్ట్ లేదు. కానీ నిరుపమ హిప్నోటిజం చేసేది. చాలా విషయాలు తను అయన దగ్గర నుంచి తెలుసుకుంది."
"నాట్ సర్ప్రైజింగ్. సైకాలజిస్టులకి ఇంకా సైకియాట్రిస్టులకి హిప్నోటిజం తో బాగా టచ్ ఇంకా దానిమీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా." ఖాళీ చేసిన కప్పుని అక్కడ వున్న డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అంది మేనక. “ఇంక మరి నేను వెళ్ళొస్తాను."
"నెక్స్ట్ టైం నువ్విక్కడ లంచ్ చెయ్యడానికి ప్రిపేర్ అయి రావాలి." మేనక వెనకాతలే బయటికి నడుస్తూ అంది సమీర.
"తప్పకుండా. అలాగే నువ్వూ కూడా మా ఇంటికి రావాలి. నిన్ను మా మామ్ కి పరిచయం చేస్తాను. అలాగే నువ్వూ అప్పుడు లంచ్, డిన్నర్ అన్ని చెయ్యాలి. ఆ ఆరోజు అక్కడే ఉండి పోవాలి."
"ఐ లవ్ ఇట్. తప్పకుండా అలాగే." నవ్వుతూ అంది సమీర.
ఆ తరువాత మేనకతో పాటుగా రోడ్ మీదకి వెళ్లి తనని ఒక ఆటోలో ఎక్కించాక, వెనక్కి ఇంట్లోకి వచ్చింది సమీర.
&&&
"దట్స్ ఇట్ అంకుల్. ఇప్పుడు ఇదేమైనా యూజ్ ఫుల్ అవుతోందో లేదో నువ్వే చెప్పాలి." సమీర ఇంట్లో తను చూసింది స్మరన్ కి వివరంగా చెప్పి అంది మేనక. సమీర ఇంటినుంచి డైరెక్ట్ గా స్మరన్ దగ్గరకే వెళ్ళింది మేనక. స్మరన్ ఆఫీస్ లో ఇద్దరూ ఎదురు ఎదురుగా కుర్చీల్లో కూర్చుని వున్నారు.
"ఇలాంటి వాటిని ఐసొలేట్ చేసి చూస్తే కాదు. తక్కిన అన్ని ఈవెంట్స్ తోటి క్లబ్ చేసి చూడాలి." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్.
"సరే తక్కిన వాటిన్నటితోటి క్లబ్ చేసి చెప్పు. ఇది యూజ్ఫుల్లేనా?" ముందుకు వంగి తన మోచేతులు ఆ రెండు కుర్చీల మధ్య వున్న టేబుల్ మీద బాలన్స్ చేసుకుంటూ అడిగింది మేనక.
"ఆలా తొందరపడితే ఎలా? ఇంకొన్ని క్లూలు కూడా కావాలి. అప్పుడు కానీ ఏవి చెప్పడానికి అవుతుందనుకోను." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.
"నాకేం తొందర లేదు. నెల రోజుల గడువు ఇచ్చింది నువ్వు. ఒక్క ఈ బ్రేకౌట్ తప్ప అప్పుడే నాలుగు రోజులు పెద్దగా ఏమి డెవలప్మెంట్ లేకుండానే గడిచి పోయాయి." నిట్టూరుస్తూ అంది మేనక.
"ఆ విషయం గురించయితే నువ్వేమి టెన్షన్ పడకు. ఈ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్ గా ఈ నెల రోజుల్లోనే నేను పూర్తి చేస్తాను." కాన్ఫిడెంట్గా అన్నాడు స్మరన్.
"నువ్వలా అన్నావంటే కచ్చితంగా చేస్తావు." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ నవ్వింది మేనక. "కానీ నేనక్కడ అలా ఉండడం వల్ల అంతగా బాధపడుతూన్న ఆ ముసలివాళ్ళనిద్దరిని అలా గమనిస్తూండడం తప్ప వేరే ప్రయోజనం కనిపించడం లేదు." మరోసారి నిట్టూరుస్తూ అంది మేనక.
"డిటెక్టివ్స్ కి సహనం కావాలి. నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే నీకు కచ్చితంగా ఎదో ఒక క్లూ దొరికే తీరుతుంది."
" అంకుల్, నాకు డిటెక్షన్ ఇష్టమే. నీకు సహాయం చెయ్యడం అంతకన్నా ఇష్టం. కానీ నాకు డిటెక్టివ్ కావాలని లేదు. నా మెయిన్ ఎయిమ్ ఎకనామిక్స్ లెక్చరర్ కావడం." స్పష్టంగా అంది మేనక.
"ఆల్రైట్. అయినంత మాత్రాన నీ మైండ్ కొంచం అప్లై చెయ్యడంలో నష్టం అయితే లేదు కదా. నీకు కనిపిస్తూన్న విషయాలనే జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నిస్తూండు. నీ లైఫ్ లో కూడా అది నీకు చాల ఉపయోగ పడుతుంది."
"ఒకే అంకుల్. అలాగే చేస్తాను. మరి నే వెళ్లి రానా? ఆ ఇల్లు వదలిపెట్టి చాలాసేపయింది. ముఖ్యంగా ఆ పెద్దావిడ నా గురించి చూస్తూ ఉంటుంది." కుర్చీలోనుంచి లేచి నిలబడింది మేనక.
"ఒక్క విషయం. నీకు అక్కడ ఇబ్బందిగా అనిపిస్తే నువ్వక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్లిపోవచ్చు. నీ అబ్సర్వేషన్ అక్కడ లేక పోయినా నేనీ అసైన్మెంట్ కంప్లీట్ చేసేగలను." మేనక వైపే చూస్తూ కుర్చీలో ముందుకు వంగి స్మరన్ అన్నాడు.
"నో అంకుల్." మళ్ళీ కుర్చీలో కూచుంది మేనక. "వాళ్ళు వెళ్ళమనేంత వరకూ కూడా వాళ్లింట్లోనే ఉంటానని నేను ఆంటీకి మాట ఇచ్చాను. నన్ను చూస్తూవుంటే వాళ్ళకి వాళ్ళ అమ్మాయినే చూస్తున్నట్టుగా అనిపించి రిలీఫ్ ఫీలవుతున్నారు. వాళ్ళని ఆ ఆనందానికి కూడా దూరం చేసి వెళ్లిపోలేను." స్మరన్ మొహంలోకి చూస్తూ అంది మేనక.
"అలాని ఎంతకాలం వాళ్ళ ఇంట్లో ఉండిపోగలవు? అమ్మ ఊరుకుంటుందా?" నవ్వాడు స్మరన్.
"చూద్దాం అంకుల్. ఎంతకాలం వీలయితే అంతకాలం." మేనక కూడా నవ్వి కుర్చీలో వెనక్కి జరగిలబడింది. "ఎనీహౌ మామ్ తో ప్రాబ్లెమ్ లేదు. తను కూడా వాళ్ళ గురించి విన్నాక చాలా ఫీలవుతూంది. వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అనికూడా అంది."
" ఓకే అయితే." స్మరన్ కుర్చీలో మరోసారి అడ్జస్ట్ అయ్యాడు. "ఇంతకీ నువ్వు ఆ డాక్టరబ్బాయి ఫోటో చూసావా? నాకు మీ అమ్మకి కూడా తను బాగా నచ్చాడు. నువ్వు ఒకే అంటే...."
"రెండో ఆలోచన ఏది లేకుండా ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా నా పెళ్లి చేసేయాలని మీ ఇద్దరి ఆలోచన." కుర్చీలోనుంచి లేచి కోపంగా అంది మేనక. "ఒక్క విషయం స్పష్టంగా చెప్పు మామ్ కి. నన్ను చదువుకోడం కూడా చదువుకోనివ్వకుండా నాకు పెళ్లి చేసెయ్యాలనే చూస్తే నేను ఆ విషయం గురించి కూడా ఆలోచించను. కొంచం నా ఒపీనియన్స్ ని టేస్ట్ ని పట్టించుకుంటే అప్పడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. బై." వెనక్కి తిరిగింది.
"కాస్త ఆగు. అలా వెళ్ళిపోతావేంటి? అదేదో నువ్వే అమ్మకి స్ట్రెయిట్ గా చెప్పు." తనూ కుర్చీలోనుంచి లేచి మేనక దగ్గరగా వచ్చి అన్నాడు స్మరన్.
"ఎన్ని సార్లు చెప్పానో, ఎక్కడ వింటోంది? కానీ ఎదో నన్ను బలవంతపెట్టి నాకు పెళ్లి చేసేద్దామనుకుంటే మాత్రం అది జరగని పని." కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటూ అంది. "ఏదైనా రిపోర్ట్ చేసే విషయం ఉంటే కలుస్తాను. మరోసారి బై." అక్కడినుంచి బయట పడుతూ అంది మేనక.
&&&
"నేనెప్పుడైనా నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటే, నిరుపమ నన్ను హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చుతూ ఉంటుంది." ఆరోజు భోజనం చేసాక మంచం మీద నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ అంది నిర్మల.
"అయ్యో ఆంటీ. నాకూ హిప్నోటిజమ్ తెలుసు. మిమ్మల్ని హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చానా?" పక్కనే కుర్చీలో కూచుని సెల్ ఫోన్లో ఎదో ఈ బుక్ చదువుతూన్న మేనక అడిగింది.
"అదెలా? నువ్వూ సైకాలజీ ఏ చదువుతున్నావా ఏంటి?" ఆశ్చర్యంగా మేనకవైపు చూస్తూ అడిగింది నిర్మల.
"హిప్నోటిజమ్ గురించి తెలియడానికి సైకాలజీ ఏ చదవాలని ఏమీ లేదు. నాకు ఆ హిప్నోటిజం అంటే చాలా ఇంటరెస్ట్. అందుకనే నేర్చుకున్నాను. అప్పుడప్పుడు మా మామ్ ని, ఇంకా అంకుల్ని కూడా హిప్నోటైజ్ చేస్తూ వుంటాను." మేనక నవ్వుతూ అంది.
"ఒకే అయితే. ట్రై చేసి చూడు." కళ్ళు మూసుకుంటూ అంది నిర్మల.
"ఇప్పుడే ట్రై చేస్తాను. ఇది వర్క్ అవుట్ అయితే ప్రతీ రోజూ మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా హిప్నోటిజం ద్వారా మిమ్మల్ని నిద్రపుచ్చుతాను." కుర్చీలోంచి లేచి నిర్మల దగ్గరికి వచ్చింది మేనక. "మిమ్మల్ని నిరుపమ ఆల్రెడీ హిప్నోటైజ్ చేస్తూవుంది కాబట్టి హిప్నోటైజ్ కావాలంటే మీరేం చెయ్యాలో నేను చెప్పక్కర్లేదు." అంది.
"నువ్వు చెప్పింది నిజమే." నిర్మల అంది. "నాకు బాగా అర్ధం అయ్యేలా చెప్పేది నన్ను హిప్నోటైజ్ చెయ్యడానికి ముందు. నేనేం ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. నా మనసులో వచ్చే ఆలోచనల్ని వేటిని కూడా నేను పట్టించుకోక్కర్లేదు. నా శరీరాన్ని కదపకుండా నా చెవుల్ని నీకు వదిలేస్తే చాలు."
"వండర్ఫుల్! అయితే మిమ్మల్ని హిప్నోటైజ్ చెయ్యడం నాకు చాలా తేలిక. మీరు జస్ట్ కళ్ళు మూసుకుని కదలకుండా వుండండి చాలు. ఇక మొదలు పెడుతున్నా." గొంతు సవరించుకుంది మేనక కళ్ళు మూసుకుని కదలకుండా వున్న నిర్మలని చూస్తూ.. "మీకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా వుంది....చాలా హాయిగా వుంది....మీ మనసు పూర్తిగా నేను చెప్పే మాటల మీద కేంద్రీకృతం అయివుంది......మీ మనసు ఇంకా శరీరం పూర్తిగా నేను ఇచ్చే డైరెక్షన్స్ ఫాలో అవుతాయి." మధ్యలో కొంచం, కొంచం ఆగుతూ ప్రారంభించింది మేనక నిర్మలని పరిశీలిస్తూ. బహుశా అంతకు ముందే హిప్నోటిజమ్ కి అలవాటు పడి ఉండడం వల్ల కాబోసు, ఇన్స్టంట్ రిజల్ట్ కనిపిస్తూ వుంది నిర్మలలో మేనకని ఎంకరేజ్ చేస్తూ. అప్పటికే ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నట్టుగా వుంది నిర్మల.
"ఇప్పుడు మీ కనురెప్పలు బరువెక్కుతున్నాయి. మీ శరీరం అంతా బరువెక్కుతూ వుంది. మీకు నిద్ర ముంచుకు వస్తూ వుంది. మీరు నెమ్మదిగా, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ వున్నరు." అదే మంద్ర స్వరంతో అంది మేనక.
నిర్మల ఇంకా ప్రశాంతంగా మారి పోయింది. తన బ్రీతింగ్ ఈవెన్ గా వుండి, తను నిద్రపోతున్నట్టుగానే వుంది.
"ఇప్పుడు మీరు పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు. పూర్తిగా నిద్రపోతున్నారు." ఇంకా నిర్మలనే పరిశీలనగా చూస్తూ అంది మేనక.
ఇంకా ప్రశాంతంగా బయట ప్రపంచంతో సంబంధంలేనట్టుగా మారిపోయింది నిర్మల. ఆమె పూర్తిగా నిద్రపోతున్నట్టుగా అర్ధం అయింది మేనకకి. నిట్టూర్చి గదిలోంచి బయటకి వచ్చింది. హాలులో వున్న రంగనాథ్ ని నవ్వి పలకరించి మేడ మీద వున్న తన గదిలోకి వెళ్ళింది. అలా తన గదిలోకి వెళ్లిందో లేదా అక్కడ టేబుల్ మీద వున్న తన సెల్ ఫోన్ మోగడం మొదలు పెట్టింది. తీసి చూసేసరికి సమీర.
"హలో. క్లోజ్ ఫ్రెండ్ ఏమిటి విషయం?" నవ్వుతూ పలకరించింది మేనక.
"ఏం. ఎదో విషయం ఉంటే తప్ప నీకు నేను ఫోన్ చేయకూడదా?" చిరుకోపంతో అంది సమీర.
"ఐ యామ్ సారీ. ఏమైనా నీతో మాట్లాడ్డం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడు." గొంతు సవరించుకుని సీరియస్ గా అయింది.
"నిన్ను కలుసుకుని మాట్లాడాలని వుంది. దయచేసి ఒకసారి వస్తావా?" సడన్గా సమీర గొంతు విచారంగా మారింది. "తన పేరెంట్స్ కి మాత్రమే కాదు, నాకు కూడా నిన్ను చూస్తూ ఉంటే నిరుపమని చూస్తూన్నట్టే వుంది. ఆల్రెడీ చెప్పాను కదా. ఎందుకో నాకు మార్నింగ్ నుంచి తనే గుర్తుకువస్తూ వుంది. నీతో మాట్లాడితే నాకు తనతో మాట్లాడినట్టే ఉంటుంది."
" ఒక హాఫ్ యాన్ అవర్ లో అక్కడ వుంటాను. జస్ట్ వెయిట్." ఆ కాల్ కట్ చేసి కిందకి వచ్చింది. అక్కడ వున్న రంగనాథ్ కి పనుంది పైకి వెళ్తున్నాని వచ్చేసరికి ఈవెనింగ్ అవుతుందని చెప్పి బయటికి వచ్చేసింది.
&&&
"రాత్రంతా తనే కలలో వుంది, తనే గుర్తుకు వస్తూంది అని చెప్పి ఈ రోజు కాలేజీ కి కూడా వెళ్ళలేదు. ఇలా అయితే ఎలా? నువ్వైనా తనకి కొంచెం చెప్పు."
మేనక వెళ్లేసరికి సమీర తల్లి వనజ ఇంట్లోనే వుంది. సమీర మేనక ఎవరో చెప్పాక, వనజ అంది మేనకతో.
"అవును సమీ. తన డెత్ తో నువ్వెంతగా ఎఫెక్ట్ అయ్యావో నేను అర్ధం చేసుకోగలను. కానీ నువ్వు ఇలా అయిపోతే ఎలాగ? మన రెగ్యులర్ లైఫ్ మనం జీవించాలి కదా. ఆమె పేరెంట్స్ కూడా ఎదో కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది మేనక. సోఫాలో వనజ, సమీర పక్క పక్కన కూర్చుంటే వాళ్ళకి ఎదురుగుండా సోఫాలో కూచుంది మేనక.
"వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? నా మొహంలోకి చూసి చెప్పు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? జీవచ్ఛవాల కన్నా హీనంగా వుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉంటేనే నాకు ఏడుపు వస్తూంది." అంది సమీర.
"అలాగని చెప్పి నువ్వూ ఇలా బాధపడుతూ వుంటావా? ఏమైనా మతి వుండే మాట్లాడుతున్నావా?" చిరాగ్గా అంది వనజ. "నువ్వేమి వాళ్ళలా అరవైఏళ్ల ముసలిదానివి కాదు. చాలా ఫ్యూచర్ వుంది నీకు. నువ్విలా అయిపోతే మాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు."
" మామ్..." సమీర కోపంగా ఎదో అనబోయింది.
"ఆంటీ చెప్పిందాంట్లో హండ్రెడ్ పర్శంట్ న్యాయం వుంది. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ నాకు బాగా అర్ధం అయింది. నువ్విలా అప్పుడప్పుడు అప్సెట్ అవడం కూడా అన్రీజనబుల్ కాకపోవచ్చు. కానీ ఇది పధ్ధతి కాదు. నువ్వు కేవలం నీ లైఫ్ గురించి మాత్రమే కాదు, నువ్విలా అయిపోతే నీ పేరెంట్స్ ఎలా అవతారన్నది కూడా ఆలోచించాలి కదా."
"బాగా చెప్పావు. కొంచం తనకి అర్ధం అయ్యేలా చూడు." మెచ్చుకోలుగా మేనక మొహంలోకి చూస్తూ అంది వనజ.
"నేను తనకి బ్రెయిన్ వాష్ చేసి దారిలో పెడతాను. మీరు ఈ విషయం గురించి ఏమీ దిగులు పడకండి." వనజ మొహంలోకి చూస్తూ చిరునవ్వుతో అంది మేనక.
"సరే అయితే. మీరు మాట్లాడుకుంటూ వుండండి. నేను వంటింట్లోకి వెళ్లి మీకు కాఫీ, స్నాక్స్ తీసుకుని వస్తాను." తరువాత మేనక అభ్యంతరాల్ని వినకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది వనజ.
వనజ అక్కడనుండి వెళ్ళిపోగానే కుర్చీలోంచి సోఫాలో సమీర పక్కకి షిఫ్ట్ అయింది మేనక. "ఏం కల వచ్చింది? ఎందుకు మళ్ళీ అంతగా అప్సెట్ అయ్యావు?" తన భుజాల చుట్టూ కుడి చెయ్యి వేస్తూ అడిగింది.
"నిజం చెప్పాలి. నిన్ను చూస్తూ ఉంటే, నాకెందుకో తెలీదు. అచ్చం నిరుపమని చూస్తూన్నట్టుగానే వుంది." మేనక భుజం మీద తలపెట్టుకుంది సమీర. "నువ్వొచ్చాక నాకు నిజంగా స్వాంతన గా వుంది."
"నీ క్లోజ్ ఫ్రెండ్ గా నీకు ఈ మాత్రం ఉపయోగ పెడుతున్నందుకు నాకు ఆనందం గా వుంది." సమీరని ఇంకా దగ్గరగా తీసుకుంది మేనక. "నిన్నో ప్రశ్న వేసాను. నీకొచ్చిన కల ఏమిటి? నువ్వెందుకింతలా మళ్ళీ అప్సెట్ అయ్యావు?"
తన చుట్టూ వున్నమేనక పట్టు విడిపించుకుని, ఆమె భుజం మీదనుంచి తల తీసి, సోఫా మీద అడ్జస్ట్ అయింది సమీర. "ఆమె నేను కలిసి చేసినవన్నీ కలల్లా వచ్చాయి. తెల్లారేక కూడా అవి మర్చిపోలేక పోయాను. నువ్వేచ్చేవరకు కూడా ఆమె జ్ఞాపకాలు బాధపెడుతూనే వున్నయి." మేనక మొహంలోకి చూస్తూ అంది.
"నువ్వొక సైకాలజీ స్టూడెంట్ వి. నీకు నేను చెప్పాలా? నువ్వు నీ ఆలోచనలకి, ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తే అవి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. వాటిని పట్టించుకోకుండా మనపనిలో మనం పడితే అవి మాయం అయిపోతాయి." అంది.
"ఆ నిరంజన్ అంకుల్ చెప్పినట్టుగానే చెప్పావు." నవ్వి అంది సమీర. "కాకపోతే ఇలాంటివి చెప్పడానికి చాలా ఈజీ గానూ చెయ్యటానికి చాలా కష్టంగానూ ఉంటాయి."
"ఏమిటి నిరంజన్ గురించి మాట్లాడుకుంటున్నారు?" అక్కడికి ట్రేలో కాఫీలతో వచ్చిన వనజ అడిగింది.
"ఈ మేనక అచ్చం ఆ నిరంజన్ తరుచూ ఇచ్చే సలహాయే ఇచ్చింది." సమీర ట్రే లోనుండి కాఫీ కప్పు తీసుకుంటూ అదేమిటో చెప్పి నవ్వింది.
"చాలా చక్కగా చెప్పింది. తరచూ ఆ నిరంజన్ దగ్గరికి వెళ్లేదానివి. ఇప్పుడు అయన దగ్గరికి కూడా వెళ్లడం మానేసావు. నువ్వు ఒక్కసారి అయన దగ్గరికి వెళ్తే నీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది." ట్రే లో ఇంకో కాఫీ కప్పు మేనక కి కూడా ఇస్తూ అంది వనజ.
"ఆయన మీకూ బాగా తెలుసా ఆంటీ?" కాఫీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ అడిగింది మేనక.
"ఒకటి రెండు సార్లు మా అమ్మాయి తో పాటుగా వెళ్లి కలిసాను. చాలా చక్కటి మనిషి. అయన మాటల వింటూవుంటే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా అయన ఇచ్చే సలహాలు అన్ని కూడా ఎంతో ప్రాక్టీకల్ ఇంకా ఎఫెక్టివ్."
"మోనోపాజ్ టైం లో తనకి చాలా చికాగ్గా అనిపించేది. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. మనసు స్థిమితం చేసుకోవడానికి ఆయనేవో ఒకటిరెండు సలహాలు ఇచ్చారు. అవి మా అమ్మకి బాగా పనిచేసాయి. అప్పటినుండి అయన చాలా గొప్ప అంటుంది." నవ్వింది సమీర.
"నువ్వు వెళ్లి ఒకసారి ఆయన్ని చూసావంటే నువ్వూ అలాగే అంటావు. నేను నిజంగా ఆయనవల్ల అంత ఇంప్రెస్ అయి ఉండకపోతే, సమీర పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ తో చదవడానికి ఒప్పుకునే దాన్నే కాదు." వనజ అంది.
"దెన్ హౌ ఇట్ ఈజ్ దట్ వుయ్ బోత్ గో టు హిం ఆన్ దిస్ డే?" మేనక అడిగింది. "ఎలాగూ ఆయనదగ్గరికి వెళ్లాలని మన ప్లాన్ లో వుంది కదా."
"కానీ నాకు నిరుపమ తో కలిసి అయన దగ్గరికి వెళ్లిన విషయమే గుర్తుకువస్తుంది. నేను ఒక్కర్తినీ అయన దగ్గరికి వెళ్ళింది చాలా తక్కువ. ఆ జ్ఞాపకాల్ని నేను తట్టుకోలేను." సోఫాలో జారగిలబడి బాధగా కళ్ళు మూసుకుంది సమీర.
"అలాని ఆ జ్ఞాపకాలనుంచి ఎంతకాలం పారిపోతావు? నువ్వు పారిపోతున్నంత కాలం అవినిన్ను వెంట తరుముతూనే ఉంటాయి. వుయ్ బోత్ ఆర్ గోయింగ్ టు హిం ఆన్ దిస్ డే ఇట్సెల్ఫ్, దట్స్ ఇట్." ధృడంగా అంది మేనక.
"నా క్లోజ్ ఫ్రెండ్ అల్టిమేటం జారీ చేసాక తప్పుతుందా?" కళ్ళు తెరిచి మేనక మొహంలోకి నవ్వుతూ చూస్తూ అంది సమీర.
"గుడ్ డెసిషన్." అక్కడే సోఫాకి అపోజిట్ లో వున్నకుర్చీలో కూలబడుతూ అంది వనజ. "నిజంగా కేవలం సమీర మాత్రమే కాదు, మేము కూడా నిరుపమ చనిపోవడంతో ఎంతో షాక్ అయ్యాం. మొదటినుంచి మా ఇంట్లో తిరిగింది. మాకు మా సమీర లానే అనిపించేది. అంత సడన్గా అలా చనిపోవడం, జస్ట్ మేమెవరం తట్టుకోలేక పోయాం."
" మామ్, నన్ను మర్చిపోయి మామూలు మనిషిని కమ్మంటూ మళ్ళీ ఆ విషయాలన్నిటి గురించి ఎందుకు మాట్లాడతావు?" చిరాగ్గా అంది సమీర.
"లెట్ మీ ఓపెన్ మై హార్ట్ ఫర్ ఏ మూమెంట్. నీకు మాత్రమే కాదు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకూ నిరుపమని చూస్తూన్నట్టే వుంది." దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో ముందుకు వంగింది వనజ. "నిరుపమతో ఎంతో ఇంటిమేట్ గా ఫీలయ్యాను. నువ్వెలాగా అనిపించేదానివో, తనూ నాకలాగే అనిపించేది. తనూ నాతో ఎంతో హ్యాపీగా కలివిడిగా నువ్వెలా ఉండేదానివో అలాగే ఉండేది. అలాంటిది తనని మన ఆలోచనల నుంచి కూడా తరిమేసి అసలు తనెప్పుడూ లేనే లేదన్నుట్టుగా ఉండడానికి చాలా గిల్టీగా వుంది."
"ఎగ్జాట్లీ, ఎగ్జాట్లీ నా ఫీలింగ్ కూడా అదే మామ్ " సమీర ఎక్సయిటింగ్ గా అంది. "నువ్వు చాలా వండర్ఫుల్ గా ఎక్ష్ప్రెస్స్ చేసావు."
"అఫ్ కోర్స్, యు అర్ రైట్. మీ మామ్ తన ప్లేసులో వుండే ఒక కామన్ పర్సన్ ఫీలింగ్ నే వండర్ఫుల్ గా ఎక్ష్ప్రెస్స్ చేశారు." మేనక తలూపి అంది. "కానీ వుయ్ హేవ్ టు యాక్సప్ట్ ది ట్రూత్ అండ్ అడ్జస్ట్ అవర్సెల్వ్స్ టు ఇట్. ఒక సైకాలిజిస్టుకి నేనిదంతా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా."
"కానీ నేనింకా సైకాలాజిస్టుని కాలేదు. చదువుతున్నానంతే." నవ్వింది సమీర.
"అందుకే నువ్వింకా పూర్తిగా మెచూర్ కాలేదు. విషయాల్ని అర్ధం చేసుకోలేకపోతున్నావు. ఐ థింక్ మనకి ఈ రోజు ఈవెనింగ్ నిరంజన్ అంకుల్ దగ్గర ఒక సమాధానం దొరకొచ్చు." ఆలా అన్నాక మేనక వనజ మొహంలోకి చూస్తూ అంది "ఆంటీ నా ఉద్దేశంలో మీరూ మాతో ఈ ఈవెనింగ్ అయన దగ్గరికి వస్తే బావుంటుంది. మీ గిల్టీ ఫీలింగ్ కి కూడా ఒక సమాధానం దొరుకుతుంది."
"ఈరోజయితే రాలేను. మీరిద్దరూ వెళ్లి ఆయనేంచెప్పారో నాకు చెప్పండి." కుర్చీలోనుంచి లేచింది వనజ. "నాకు వంటిట్లో పనివుంది. మీరిద్దరూ మాట్లాడుకుంటూ వుండండి." అనిచెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది వనజ.
సాయంత్రం ఐదు గంటల సమయం అయ్యే వరకు అదే పని చేస్తూ వున్నారు సమీర, మేనక. తరువాత బయలు దేరి నిరంజన్ ఇంటికి వెళ్లారు.
చాప్టర్-5
"నా దగ్గరికి రావడమే మానేసేవు. అంత తరుచుగా నా దగ్గరికి మీరిద్దరూ వచ్చేవారు." పలకరింపులు, మేనక తో పరిచయం అయ్యాక అన్నాడు నిరంజన్.
నిరంజన్ ఇంట్లో, అయన రూమ్ లో నిరంజన్ కుర్చీకి అపోజిట్ గా వున్న కుర్చీల్లో వెనక్కి వాలి కూర్చుని వున్నారు సమీర, మేనక. నిరంజన్ అయన కుర్చీలో కూర్చుని, మోచేతులు రెండూ మధ్యలో వున్న టేబుల్ మీద బాలన్స్ చేసుకుని వున్నాడు.
నిరంజన్ ని చూసాక, ఆయనతో మాట్లాడాకా సమీర చెప్పిందాంట్లో ఎగ్జాజిరేషన్ ఏమి లేదనిపించింది మేనకకి. అయన చాలా ఇంప్రెసివ్ గా వున్నారు. ఆ బ్లాక్ బెర్డ్ కూడా ఆయనకి బాగానే నప్పింది. కానీ అయన పెట్టుకున్న బ్లాక్ స్పెక్ట్స్ మాత్రమే ఆడ్ గా వున్నయి. ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ అయన ఎందుకు పెట్టుకున్నారో మేనక కి అర్ధం కాలేదు.
"అందుకనే రాలేకపోతున్నాను అంకుల్. నాకు తనతో కలిసి రావడం, తనతో కలిసి మాట్లాడడమే గుర్తుకు వస్తూంది. తట్టుకో లేకపోతున్నాను." సమీర బాధ అంతా ఆమె మోహంలో ఎక్స్ప్రెస్ అవుతుండగా అంది.
"నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. నిరుపమ నీకు మాత్రమే కాదు. మా అందరితో కూడా చాలా ఇంటిమేట్ గా ఉండేది. నువ్వెంత హర్ట్ అయ్యావో మేమందరం కూడా అంతే హర్ట్ అయ్యాం ఆమె సూసైడ్ తో. కానీ ఆమె జ్ఞాపకాలకు భయపడడం, వాటినుండి పారిపోవాలనుకోవడం సమస్యకి పరిష్కారం కాదు." నిరంజన్ అన్నాడు.
"సరిగ్గా నేను ఇదే చెప్పాను అంకుల్. నిరుపమ జ్ఞాపకాలతో సఫరవుతూ ఈ రోజు తను కాలేజీ కి కూడా వెళ్ళ లేదు." మేనక అంది.
"వెరీ బాడ్. ఇది నిరుపమకి ఎంతమాత్రం నచ్చి తాను ఆనందపడే విషయం కాదు. తనెక్కడ వున్నా నువ్విలా బాధపడుతున్నావంటే చాలా హర్ట్ అవుతుంది." నిరంజన్ అన్నాడు.
"ఏం తనేమైనా నాకు నచ్చే పని చేసిందా? మనమంతా ఎంత బాధపడతామో తెలిసి కూడా అంత పని చేసింది." కోపంగా అంది సమీర.
"అయినా సరే తను నీ క్లోజ్ ఫ్రెండే కదా. తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏదైనా సరే నువ్వు బాధపడుతూ ఉంటే, అప్సెట్ అయిపోతే తను బాధపడుతుంది. తనంటే నీకెంత కోపం వున్నా తను బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? అందుగురుంచయినా నువ్వు నీ రొటీన్ లోకి రావాలి."
"అంకుల్, చాలా తమాషాగా చెప్పారు మీరు." మేనక నవ్వింది.
" ఇక్కడ ఒక ముఖ్య విషయం." ఇంకా సమీర ముఖంలోకి చూస్తూ అన్నాడు నిరంజన్. " చనిపోయిన అమ్మాయి ఇంక ఎలాగూ బ్రతికి రాదు. మనం బ్రతికి వున్నవాళ్ళ గురించి ఆలోచించాలి. నువ్వే ఇంత అప్సెట్ అయిపోతే ఆమె పేరెంట్స్ కి ఎలా ఉంటుందో ఆలోచించావా? మనం వాళ్ళని మామూలు మనుషుల్ని చెయ్యడానికి పూర్తి ప్రయత్నం చెయ్యాలి."
"అక్కడ నిరూ జ్ఞాపకాల్ని తట్టుకోలేనని ఆమె చనిపోయాక ఆ ఇంటికే వెళ్లడం మానేసాను." నొచ్చుకుంటూ అంది సమీర.
"చాలా పొరపాటు పని చేసావు. నిన్నూ తమ కూతురిలాగే భావించేవారు వాళ్లిద్దరూ. అలాంటిది వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలిగావ్? అందరూ అలాగే అనుకుంటే వాళ్ళ గతేమిటి? అయినా జ్ఞాపకాలకు భయపడి నువ్వు పారిపోయినంత కలం అవి నిన్ను వెంట తరుముతూనే ఉంటాయి."
మేనక, సమీర ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు.
"అయితే నేను వాళ్ళ ఇంటికి వెళతాను అంకుల్. వాళ్ళతో మాట్లాడతాను." ఒక నిర్ణయానికి వచ్చింది సమీర.
"అంతే కాదు వెళ్లి వాళ్ళతో మాట్లాడ్డం వల్ల నీ మనసుకు స్వాంతన కలుగుతుంది. మనమెంతో భయపడే పని చెయ్యడం వాళ్ళ ఆ భయంనుండి విముక్తి కలుగుతుంది. వెళ్లి చూడు నీకే అర్ధం అవుతుంది."
"నేను ఈ రోజే తనని నాతో ఆ ఇంటికి తీసుకు వెళతాను అంకుల్. తను వాళ్ళతో మాట్లాడుతుంది." ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మేనక అంది.
"గుడ్ డెసిషన్." నవ్వాడు నిరంజన్. "ఎనీహౌ మీరిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారు." అంతలోనే అయన మొహం సీరియస్ గా మారింది. "నిజం చెప్పాలంటే మిమ్మల్నిద్దరిని చూస్తూ ఉంటే నాకు నిరుపమ ఇంకా నువ్వు నాతో మాట్లాడ్డమే గుర్తుకు వస్తూ వుంది. ఎందుకో ఈ అమ్మాయి నాకు నిరుపమని గుర్తుకు చేస్తూ వుంది."
"అదే హయిట్ అండ్ వెయిట్. అలాగే అందంగా కూడా వుందికదా. తనలాగే రెండు జడలు వేసుకుంటూంది. పూర్తిగా పోలికలు లేకపోయినా చటుక్కున ఎవరికైనా నిరుపమ గుర్తుకు వస్తుంది." తను మేనకని చూడగానే ఎలాగా నిరుపమ క్రింద భ్రమించిందో గుర్తుచేసుకుంటూ అంది సమీర.
"యు అర్ రైట్. అది నిజమే." తలూపాడు నిరంజన్.
"నాకు దీనికి ఆనందించాలో, విచారపడాలో అర్ధం కావడం లేదు. నిరుపమ పేరెంట్స్ ఇద్దరూ కూడా నన్ను వాళ్ళ అమ్మాయిననుకుని ఆనంద పడుతూ వున్నరు. కొంత రిలీఫ్ దొరికింది వాళ్ళకి." నిట్టూరుస్తూ అంది మేనక.
"ఇది కచ్చితంగా చాలా ఆనందించాల్సిన విషయం. కానీ నువ్వెంతకాలం వాళ్ళదగ్గర అలా ఉండగలవు? నువ్వక్కడనుంచి వెళ్లిపోయిన తరువాత పరిస్థితి ఏమిటి?" కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు నిరంజన్.
"తరువాత విషయం తరువాత ఆలోచిద్దాం అంకుల్. నేను మాత్రం ఆ పెద్దావిడకి ఆవిడ దగ్గరే ఉంటానని మాట ఇచ్చాను. ఆవిడ పూర్తిగా మామూలుగా అయ్యేవరకు ఆవిడ దగ్గరే వుంటాను." మేనక అంది.
"అదెలాగూ సాధ్యం అయ్యే విషయం కాదు. ఆవిడే కాదు, రంగనాథ్ అంకుల్ జీవితం కూడా నిరుపమ లేకుండా పూర్తిగా మామూలు ఎప్పటికీ కాదు." సమీర అందుకుంది. "నువ్వు ఒక అసైన్మెంట్ గురించి అక్కడ ఉంటున్నావు. అది పూర్తవగానే అక్కడనుండి వెళ్ళిపోతావ్. అలాగే ఆ ఇంట్లోనే ఆవిడ దగ్గరే ఉండిపోతానంటే మీ మామ్ ఊరుకుంటారా? వాళ్ళ సిట్యుయేషన్ చూసి నువ్వు అంతగా మూవ్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. కానీ అలా మాట ఇచ్చేముందు ఆలోచించాల్సింది."
"ఓహ్, చిన్న విషయాన్నీ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నావు?" మేనక నవ్వింది. "ఈ మేటర్ నువ్వనుకున్నంత సీరియస్ కాదు. ఇక్కడ, మా ఇంటిదగ్గర ఉంటూ కూడా నేను మేనేజ్ చెయ్యగలను. నీకో విషయం తెలుసా? నిరుపమ విషయం విన్నాక మా మామ్ ఎంతో ఎమోషన్ అయింది. తానొచ్చి నిరుపమ పేరెంట్స్ తో మాట్లాడతానని అంది."
"వెరీ నైస్ థింగ్! ఇలాంటి విషాద సంఘటనలతో బాధపడేవాళ్ళకి సాధ్యమైనంత ఎక్కువ మంది సపోర్టింగ్ గా ఉండాలి. వాళ్ళని సాధ్యమైనంత త్వరగా మామూలు మనుషుల్ని చెయ్యాలి." నిరంజన్ అన్నాడు.
"కానీ ఆ రంగనాథ్ అంకుల్ నిరుపమ ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలని చాలా అబ్సెసివ్ గా వున్నాడు. తనెందుకు చనిపోయిందో మనకందరికీ కూడా చాలా పెద్ద మిస్టరీయే. కానీ ఆ కారణం తెలుసుకుని మనం ఇప్పుడు ఏమి చెయ్యగలం?" సమీర అంది.
"మన అందరి విషయం వేరు, ఆయన విషయం వేరు. అయన కన్న తండ్రి. తన కూతురు ఎందుకలా సూసైడ్ చేసుకుందో తెలుసుకోవాలని అయన మధన పడడం లో ఆశ్చర్యం ఏమి వుంది?" నిరంజన్ అన్నాడు.
"నా అంకుల్ అభిప్రాయంలో, ఇంకా నా అభిప్రాయంలో కూడా ఆ విషయం ఏమిటో నిరంజన్ కి తెలియడం నిరుపమకి ససేమిరా ఇష్టం లేదు. ఆ విషయం తెలుసుకోవడానికి అయన ప్రయత్నం చేస్తున్నారంటే అయన నిరుపమకి ఇష్టం లేని పని చేస్తున్నారు. నా అంకుల్ ఆయన్ని డిస్కరేజ్ చెయ్యడానికి ప్రయత్నించారు. కానీ అయన వినలేదు." మేనక అంది.
"నా ఉద్దేశంలో కూడా అదే అనిపిస్తూంది. నిజానికి నేను అలాంటి ప్రయత్నం మానుకోమనే చెప్పాను. కానీ రంగనాథ్ ఆ విషయాన్నీ అంతగా తెలుసుకోవాలనుకుంటూంటే, తెలుసుకోనివ్వడమే మంచిది." మేనక మొహంలోకి చూస్తూ కాస్త ఆగాడు నిరంజన్. "మీ అంకుల్ కచ్చితంగా ఆ విషయాన్నీ తెలుసుకోగలరనే నాకు అనిపిస్తూంది. ఆయన్ని చూస్తే చాలా కాపబుల్ పర్సన్లలాగే కనిపించారు."
"ఏవో ఒకట్రెండు తప్ప, తను టేకప్ చేసిన అన్ని అసైన్మెంట్లలోనూ అయన హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ సాధించారు." పేస్ లో ఒకరకమైన ప్రౌడ్ ఎక్స్ప్రెషన్ తో అంది మేనక.
"కానీ రంగనాథ్ తెలుసుకోబోయే విషయం ఆయనకి రిలీఫ్ కన్నా మరింత ఎక్కువ బాధనే కలిగించొచ్చని నాకు అనిపిస్తూ వుంది." విచారంగా నిట్టూరుస్తూ అన్నాడు నిరంజన్.
"మీరెందుకలా భావిస్తున్నారు అంకుల్?" అనడిగింది సమీర.
"మనందరికీ నిరుపమ గురించి తెలుసు. తానెంతో ఇంటెలిజెంట్! తను సూసైడ్ చేసుకోవడం చాలా తెలివి తక్కువ పనే అయినా, ఎదో ఒక చిన్న విషయానికి తను అలా చేసుకుని ఉండదు. అది తను తన పేరెంట్స్ కి కూడా ఏమాత్రం తెలియనివ్వలేదంటే అది వాళ్ళని బాధపెట్టే విషయమే అయి ఉంటుంది. ఆ విషయం ఎదో రంగనాథ్ ని మరీ హర్ట్ చేసే విషయమే అయి ఉంటుంది."
"మీరావిషయాన్ని కొంచమైనా ఊహించగలరా?" సమీరే మళ్ళీ అడిగింది.
"చాలా ప్రయత్నించాను. అదేమిటో అంతుపట్టడం లేదు. నిజానికి అదేమిటో నేను వూహించగలిగేలా ఉంటే....." కాస్త ఆగడు నిరంజన్. "....రంగనాథే ఆ విషయం గురించి ఊహించి ఉండేవాడు. ఆ స్మరన్ గారి దగ్గరికి వెళ్లి ఉండేవాడు కాదు. నేను తనతో ఎంత ఇంటిమేట్ గా వున్న తన డాడీ కన్నా కాదుకదా."
"యు అర్ అబ్సల్యూట్లీ రైట్ అంకుల్." సమీర అంది. "ఎనీహౌ ఆలస్యంగా నైనా మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మంచి పని చేశాను. నాలో వున్న కన్ఫ్యూజన్ పోగొట్టారు. నిరుపమ జ్ఞాపకాలకు భయపడుతూ ఆ ఇంటికి వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తూ వున్నాను. మీ సజెషన్ విన్నాక వెళ్లాలని నిర్ణయానికి వచ్చేసాను."
"ఒక సైకాలజీ స్టూడెంట్ గా నీ మైండ్ తో ఎలా డీల్ చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. నా దగ్గరే ఎన్నో సార్లు విన్నావు కూడా అయినా అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యావు?" నుదురు చిట్లించాడు నిరంజన్.
"ఏమో అంకుల్. నిరుపమ నా క్లోజ్ ఫ్రెండ్. తన సూసైడ్ నన్ను చాలా షాక్ చేసింది. టు బి ఫ్రాంక్..." మేనక వైపు చూసింది "...ఈ మేనకిని చూస్తే నాకు కొంత రిలీఫ్ లభించింది. తను నిరుపమ ప్లేస్ ని కొంత సబ్స్టిట్యూట్ చేసింది."
"ఐ యాం ఫీలింగ్ వెరీ హ్యాపీ హియరింగ్ దిస్." సమీర భుజాల చుట్టూ చెయ్యి వేస్తూ అంది మేనక. "అక్కడ ఆమె పేరెంట్స్, ఇక్కడ నువ్వు. మీ అందరికి నావల్ల ఇంత ఉపకారం అవుతుందనుకోలేదు. ఐ యాం ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఐ కెన్ గివ్ లిటిల్ రిలీఫ్ టు ది టార్చర్డ్ సోల్స్."
"కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, నిన్ను చూస్తూవుంటే నాకు కూడా నిరుపమని చూసినట్టే అనిపించి కాస్త రిలీఫ్ గా వుంది. కాస్త అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా." మేనక కళ్ళల్లోకి రిక్వెస్టింగా చూస్తూ అన్నాడు నిరంజన్.
" తప్పకుండా వస్తూవుంటాను." సమీర భుజాల చుట్టూ వేసిన తన చేతిని తీస్తూ అంది మేనక. "మీ గురించి సమీర ఇంకా ఆమె మామ్ చాలా చెప్పారు. మీరు సైకాలజీ లో ఇంకా హిప్నోటిజం లో చాలా ఎక్స్పర్ట్ అట కదా. నేను సైకాలజీ స్టూడెంట్ ని కాకపోయినా ఆ విషయాల గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి. నేను వచ్చినప్పుడల్లా మీరు నాకు వాటి గురించి చెప్పాల్సి ఉంటుంది."
"ఇట్స్ మై ప్లెజర్." నవ్వాడు నిరంజన్. "వాటి గురించి మాట్లాడుతూ ఉండడం నాకెంత హ్యాపీగా ఉంటుంది. సమీర, మేనక ఇంకా నేను వాటిగురించి ఎంతసేపైనా డిస్కస్ చేసుకునే వాళ్ళం."
"సరే అంకుల్. ఇంక మేం వెళతాము." అని లేచింది మేనక. "ఇక్కడినుంచి ఇలాగే మేనకతో నిరుపమ ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడే బయలుదేరకపోతే మళ్ళీ అక్కడినుండి మా ఇంటికి వెళ్లేసరికి లేటయిపోతుంది."
"ఆల్రైట్. ఆల్రైట్. కానీ వెరీ సూన్ మళ్ళీ మీరిద్దరూ నా దగ్గరికి రావాలి." కుర్చీలో కూర్చూనే అన్నాడు నిరంజన్.
"తప్పకుండా అంకుల్." అని అక్కడినుండి బయటికి నడిచింది సమీర. అప్పటికే లేచి వున్న మేనక ఆమెని అనుసరించింది.
&&&
"ఒక్క విషయం నీకేమి ఆడ్ గా అనిపించలేదా?" నిరుపమ ఇంటికి ఆటోలో వెళుతూ ఉంటే తోవలో సమీర మొహంలోకి చూస్తూ అడిగింది మేనక.
"ఆ విషయం ఏంటో చెప్పకుండా నువ్విలా అడగడం ఏమి బాగాలేదు."
"ఆ నిరంజన్ ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నాడు? అదర్ దేన్ దట్ హి ఈజ్ ఇంప్రెసివ్."
"అఫ్ కోర్స్, ఎస్." నవ్వుతూ తలూపింది సమీర. "ఒకేసారి నిరుపమ అడిగేసింది కూడా. తన ఐస్ కి ఎదో పెక్యూలియార్ ప్రాబ్లెమ్ ఉందంట. తన ఐస్ ఏమాత్రం లైట్ కి, పొల్లూటెడ్ ఎయిర్ కి ఎక్సపోజ్ అవ్వకూడదట. అందుకని డాక్టర్స్ సజెస్ట్ చేశారట. నిజానికి తనకి కూడా ఆ బ్లాక్ స్పెక్ట్స్ అలా పెట్టుకోవడం ఇష్టంలేదని అన్నాడు."
"ఆల్రైట్. మనకి ఇష్టం లేనివి కూడా తప్పక కొన్నిసార్లు చెయ్యాల్సివస్తూ ఉంటుంది కదా." మేనక అంది.
"ఎదో దారిగా బయలు దేరాను. కానీ ఆ ఇల్లు దగ్గరే పడుతూ ఉంటే నాకు చాలా అనీజీ గా వుంది. అక్కడ నిరుపమ జ్ఞాపకాల్ని తట్టుకోగలనా అనిపిస్తూవుంది." మేనక కళ్ళల్లోకి చూస్తూ భయంగా అంది సమీర.
"నేనున్నాగా. జస్ట్ బి బ్రేవ్." సమీర భుజాలచుట్టూ చెయ్యి వేసి దగ్గరకి తీసుకుంటూ అంది మేనక. "నిరంజన్ అంకుల్ చెప్పింది అక్షరాలా నిజం. నువ్వు భయపడేది చేస్తే నీకదంటే భయంపోతుంది. నువ్వొక్కసారి వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడితే తరచూ నువ్వక్కడికి రాగలవు. నిన్నూ చూస్తూవుంటే వాళ్ళకి మరింత స్వాంతనగా ఉంటుంది."
ఇంకొంచం మాట్లాడుకునేవారే కానీ అప్పటికే ఆటో నిరుపమ ఇంటివరకు వచ్చేసింది. వద్దన్నా వినిపించుకోకుండా ఆటో ఫేర్ సమీరే చెల్లించింది. తరువాత ఇద్దరూ నిరుపమ ఇంట్లోకి నడిచారు.
&&&
"నిరుపమ లేకపోతే నువ్వూ రావు కదా. నీకు నీ క్లోజ్ ఫ్రెండే తప్ప మేమక్కర్లేదు." మేనక, సమీర ఇంట్లో అడుగు పెట్టేసరికి నిర్మల మాత్రం వుంది. సమీరని చూస్తూ తను అంది.
ఒక్కసారిగా గుండెలని పిండేసినట్టుగా అయింది సమీరకి. ఏం చెప్పాలో తోచక మేనక మొహంలోకి చూసింది.
"మరేం పర్లేదులే. మీరిద్దరూ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని తను చెప్పింది. ఈసారి మాట్లాడినప్పుడు తనకి చెప్పు. అలా చుట్టాల ఇంట్లోనే ఉండిపోతే బాగా ఉండదని. నేను ఇంటికి వచ్చేమని ఎన్నోసార్లు చెప్తున్నాను. తను వింటంలేదు."
అయోమయంగా సమీర మొహంలోకి మరోసారి చూసింది మేనక. తను తరువాత ఎక్సప్లయిన్ చేస్తానన్నట్టుగా తలూపింది మేనక.
"నేను తను నా రూంలోకి వెళతాం ఆంటీ." మేనక అంది.
"కాస్త ఆగండి. కాఫీ తాగి వెలుదురుగాని. ఆ మేడమెట్లన్నీ ఎక్కి నేను రాలేను." అక్కడినుంచి కదులుతూ అంది నిర్మల.
"నిరుపమ చనిపోయినా తను బ్రతికి ఉన్నట్టుగానే భావిస్తూవుంటుంది. నిర్మలాంటీ దృష్టిలో ఇప్పుడు నిరుపమ తన మేనత్త ఇంటిదగ్గర వుంది." నిర్మల అక్కడినుంచి వెళ్ళిపోగానే మేనక అంది.
"మై గాడ్! నాకిది ఎలా అర్ధం చేసుకోవాలో బోధపడడం లేదు." ఇంక ఏదో అనబోతూ ఉంటే రంగనాథ్ వచ్చాడక్కడికి. "సమీ ఎలా వున్నవు? చాలా రోజులు అయింది నిన్నూ చూసి."
"ఏదో బాగానే వున్ననంకుల్. కొంచెం ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉండిపోయాను. అందుకే రాలేక పోయాను." అతికష్టంమీద పొంగుకొచ్చే ఏడుపు ఆపుకుంటూ వుంది సమీర.
"నువ్వూ, నిరుపమ ఎంతో ఇష్టంతో జాయిన్ అయ్యారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీలో. నువ్వైనా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలివైతే నాకు ఆనందంగా ఉంటుంది." అక్కడే వున్న కుర్చీలో కూచుంటూ అన్నాడు రంగనాథ్.
"ట్రై చేస్తున్నానంకుల్. మంచి మార్కులే తెచ్చుకోవాలనుకుంటున్నాను." వచ్చే ఏడుపుని ఆపుకుని ఎలా మాట్లాడుతుందో సమీరకే అర్ధంకావడం లేదు.
అప్పుడు మేనక ఏదో చెప్పబోతూ ఉంటే నిర్మల ట్రే లో కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. రంగనాథ్ కూడా అక్కడికి వచ్చాడని తెలిసినట్టుగా వుంది, మూడు కప్పులతో వచ్చింది.
"మధ్యాన్నం అంతా నువ్వెక్కడికి వెళ్లవు? ఆశ్చర్యంగా నువ్వు సమీర కలిసివచ్చారు. మీరిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు?" మేనక మొహంలోకి చూస్తూ అడిగింది నిర్మల. రంగనాథ్ కి కూడా అప్పటివరకూ వాళ్ళిద్దరిమధ్య ఫ్రెండ్షిప్ అయినా విషయం తెలియదు. అయన కూడా వాళ్ళ మొహాల్లోకి ఆశ్చర్యంగా చూసాడు. అలాంటి ప్రశ్న నిర్మలనుండి వూహించక పోవడంవల్ల ఆ ఇద్దరూ గతుక్కుమని ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు.
"సమీర గురించి అంకుల్ చెప్పారు ఆంటీ. నాకు మధ్యాన్నం నిద్రపట్టలేదు, ఏమీ తోచలేదు. ఒకవేళ తనింటి దగ్గరే ఉంటే కాస్త మాట్లాడొచ్చు కదాని వాళ్ళింటికి వెళ్ళాను. లక్కీగా ఈ రోజు తనింటిదగ్గరే వుంది." రంగనాథ్ మొహంలోకి రిక్వెస్టింగ్ గా, తను చెప్పింది ఒప్పుకోమన్నట్టుగా చూస్తూ అంది మేనక.
"నేనే మేనకకి సమీర గురించి చెప్పాను. అంతే కాదు తను కాలక్షేపం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే తనింటికి వెళ్ళమని నేనే సజెస్ట్ చేశాను." రంగనాథ్ చెప్పాడు విషయం అర్ధం అయినట్టుగా.
"మంచిపనిచేసారు. నిరుపమ వచ్చేవరకు తనకి కాలక్షేపానికి కొంచం ఇబ్బందిగానే ఉంటుంది." నిర్మల అంది.
"తనకి ఆ ఇబ్బంది రానివ్వను ఆంటీ. మంచి కాలక్షేపం అయ్యేలా చూస్తాను." బలవంతంగా చిరునవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ అంది సమీర. "నిరూ ఎప్పుడోగానీ ఎక్కడికీ వెళ్ళదు కదా. తను తన మేనత్త దగ్గరే ఎంజాయ్ చేస్తూ ఉండివుంటే ఉండనివ్వండి."
"అలాని కాలేజీ కూడా ఎగ్గొట్టి ఎన్నిరోజులు అక్కడ ఉండిపోతుంది? తమాషాకి తను కాలేజీలో జాయిన్ అవ్వలేదుకదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీకి. ఈయన్ని తనతో గట్టిగా చెప్పమంటే చెప్పరు." నిష్టూరంగా రంగనాథ్ వైపు చూస్తూ అంది నిర్మల.
"ఈసారి చెప్తాలే." కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రంగనాథ్. ఆ మోహంలో బాధ స్పష్టంగా వ్యక్తం అవుతూ వుంది.
"మేమిద్దరం నిరూ గదిలోకి వెళతాం." ఇంక అక్కడ వుండలేననిపించి లేచి మేనక మొహంలోకి చూసింది సమీర. మేనక కూడా తలూపి లేచి నిలబడింది. ఆ వృద్ధ దంపతులిద్దరిని అక్కడ అలాగే వదిలి మేనక, సమీర నిరుపమ గది వైపు నడిచారు.
&&&
నిరుపమ గదిలోకి వెళ్ళేవరకూ ఎలాగో ఉగ్గబట్టుకుని వుంది సమీర. కానీ ఆ గదిలోకి వెళ్ళాక ఇంక ఆగలేక మొహాన్నిచేతుల్లో మూసుకుని, వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడున్న బెడ్ మీద కూలబడిపోయింది.
"రిలాక్స్. రిలాక్స్ యువర్ సెల్ఫ్." మేనక ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తూనే వుంది. తనూ సమీర పక్కనే బెడ్ మీద కూచుని, తన భుజాల చుట్టూ కుడి చెయ్యివేసి దగ్గరకి తీసుకుంటూ అంది.
"ఆ పెద్దవాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ వుంది. స్కౌండ్రల్, కనీసం వాళ్ళ గురించయినా ఎందుకు ఆలోచించ లేక పోయింది?" చేతుల్లో మొహం దాచుకుని ఇంకా అలా ఏడుస్తూనే అంది సమీర.
"అదే నాకూ అంతు పట్టటం లేదు. అది ఎంత పెద్ద విషయం అయినా కావచ్చు. తను అలా సూసైడ్ చేసుకుంటే తన పేరెంట్స్ ఎంత ఎఫెక్ట్ అవుతారో తను ఊహించలేని విషయమా?" మేనక అంది.
"ఇదే రూంలో, ఇదే బెడ్ మీద మేం ఎన్నో గంటలు మాట్లాడుకున్నాం. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం." తన ముఖం మీద చేతులు తొలగించుకుంటూ అంది సమీర. "ఎప్పుడూ తన మోహంలో కాస్త కూడా విచారం చూడలేదు. కొంచంగా కూడా తనెప్పుడూ ఏ విషయానికి బాధపడుతున్నట్టుగా చెప్పలేదు. అలాంటిది తను సూసైడ్ చేసుకునేంతగా ఏ విషయం వచ్చింది?" నొసలు చిట్లించి కొశ్చనింగ్ ఎక్స్ప్రెషన్ తో మేనక మొహంలోకి చూసింది సమీర.
"ఇన్ ఫాక్ట్, ఆ విషయం తెలుసుకోవడానికే మా అంకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూన్నది. నేను ఇక్కడ ఉండడం వెనక మెయిన్ పర్పస్ కూడా అదే." సమీర చుట్టూ వున్న చేతులు తొలగించి బెడ్ మధ్యలో బాసిపట్టు వేసుకుని కూచుంటూ అంది మేనక. "వెరీ స్యూర్ ఐ యామ్. ఈ నెల రోజుల వ్యవధిలో ఆ విషయం ఏమిటో మా అంకుల్ కనిపెట్టి తీరతారు."
"కానీ ఏమిటి ప్రయోజనం? చనిపోయిన తను తిరిగిరాదు. అంతే కాకుండా తను ఏ కారణంతో సూసైడ్ చేసుకుందో అదెవరికి తెలియడం కూడా తనకి ఇష్టంలేనట్టుగా వుంది. అందుకే ఏ క్లూ ఆ విషయమై మనకి దొరకనివ్వ లేదు. ఆ కారణం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించకుండా ఉండడమే మంచిదేమో అని నాకు అనిపిస్తూ వుంది." సమీర అంది.
మేనక ఇంకా ఎదో చెప్పబోతూ ఉంటే రంగనాథ్ అక్కడకి వచ్చాడు. ఆయనని చూస్తూనే మేనక, సమీర బెడ్ మీదనుంచి లేచి నిలబడ్డారు.
"ఫరవాలేదు కూచోండి. నేను మీ ఇద్దరి ఫ్రెండ్స్ సంభాషణలకు ఏమీ అంతరాయం కలిగించలేదు కదా?" బెడ్ కి అపోజిట్ లో వున్నకుర్చీలో సెటిల్ అవుతూ అన్నాడు రంగనాథ్.
"అటువంటిది ఏమి లేదు." నవ్వుతూ బెడ్ మీద మళ్ళీ కూచుంది మేనక సమీరని చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూచోపెట్టుకుంటూ. "నిజానికి ఇప్పుడు మేము మీరు చేయించే ఇన్వెస్టిగేషన్ గురించి మాటాడుకుంటున్నాం. సమీర ఏమంటూంది అంటే ఆ కారణం ఇప్పుడు తెలిసి ఏమి ప్రయోజనం తనెలాగూ తిరిగి రాదు కదా అంటూంది. అంతేకాదు ఆ విషయం మనమెవరికి తెలియకపోవడం ఇష్టం లేకపోవడం వల్లే తనలా చనిపోయింది, తనకిష్టం లేని పని మనం చెయ్యడం ఎందుకు అని అభిప్రాయపడుతూంది." అంది మేనక.
"ఎగ్జాట్లీ నా ఒపీనియన్ అదే అంకుల్. తనెందుకు చనిపోయిందో మనకి తెలియడం నిరుపమకి ఇష్టం లేదు. తనకిష్టం లేని పని మనమెందుకు చెయ్యాలి?" సమీర అంది.
"నేనలా ఆలోచించ లేకపోతున్నాను సమీ. నిరుపమ చాల ఇంటెలిజెంట్! విల్ పవర్ వున్న అమ్మాయి. అలాంటి తను ఎదో అతి చిన్న కారణంతోనో లేదా అసలు ఏ కారణం లేకుండానే సూసైడ్ చేసుకుందని ప్రపంచం అనుకోవడం నాకిష్టం లేదు. తన సూసైడ్ వెనక చాలా బలమైన కారణమే ఉంటుందని నాకనిపిస్తూంది. అది నాకు, ఇంకా ప్రపంచానికి కూడా తెలియాలి."
"కానీ అంకుల్....." సమీర ఎదో చెప్పబోయింది.
"ఎస్, సమీరా. ఆ కారణం ఖచ్చితంగా తెలిసి తీరాలి. అది తెలిస్తేనే నా మనసుకు కొంతన్నా స్వాంతన కలుగుతుంది. నన్ను నిరంజన్ ఇంకా స్మరన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ వద్దని కన్విన్స్ చేయబోయారు. కానీ ఆ విషయం తెలిస్తేనే కానీ నేను ఉండలేను."
ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు మేనక, సమీర.
“ఈ ఇన్వెస్టిగేషన్ లో నువ్వు సాయం చేస్తానని చెప్పమ్మా." రిక్వెస్టింగ్ గా సమీర కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రంగనాథ్.
ఏం చెప్పాలో తెలియక అయోమయంగా మేనక కళ్ళల్లోకి చూసింది సమీర.
"మా అంకుల్ ఎలాగూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేనూ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇది ఆగే ప్రసక్తే లేదు. నువ్వూ చేతనైనంత హెల్ప్ చేస్తేనే బావుంటుంది." మేనక అంది.
"ఆల్రైట్ అంకుల్." సడన్ గా ఎదో నిర్ణయానికి వచ్చినట్టుగా అంది సమీర రంగనాథ్ మొహంలోకి చూస్తూ. "మీకా విషయం తెలిస్తే కొంత రిలీఫ్ కలుగుతుందని మీకు అనిపిస్తే, నేను కచ్చితంగా అందుకు చేయగలిగినంత సాయం చేస్తాను. ఈ ఇన్వెస్టిగేషన్కి పూర్తి సహకారం అందిస్తాను."
"అంతే కాదు అప్పుడప్పుడు వస్తూ కూడా వుండమ్మా. నిన్ను చూస్తూ ఉంటే కూడా నాకు నిరుపమని చూసినట్టుగా అనిపించి కొంచం స్వాంతనగా ఉంటుంది." అదే రిక్వెస్టింగ్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు రంగనాథ్.
"తప్పకుండా వస్తానంకుల్. ఇప్పటివరకు తన జ్ఞాపకాల్ని ఇక్కడ తట్టుకోలేనేమోనని రావడం మానేసాను. నిరంజన్ అంకుల్ సజెస్ట్ చెయ్యడంతో డేరింగ్ చేసి వచ్చాను. ఇప్పుడు కొంచం కరేజ్ వచ్చింది. వస్తూ వుంటాను." నవ్వతూ అని లేచింది సమీర. "ఇక వెళతానంకుల్. ఇల్లు వదలిపెట్టి చాలా సేపయింది. మామ్ చూస్తూ ఉంటుంది." అని చెప్పి, మేనక కళ్ళల్లోకి ఒకసారి చూసి అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.
"థాంక్స్ అంకుల్. ఆంటీ దగ్గర నేను ఎంబరాస్ అవ్వకుండా సేవ్ చేసారు. సమీర దగ్గరికి వెళ్తున్నానని మీకు చెప్పకుండానే వెళ్ళాను." రంగనాథ్ ముఖంలోకి గ్రేట్ఫుల్ గా చూస్తూ అంది మేనక.
"దానికేం పర్లేదు. అదేం పొరపాటు పని కాదుకదా." కుర్చీలో వెనక్కి వాలి నవ్వాడు రంగనాథ్. "ఎనీహౌ మీరిద్దరూ ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు?" అని అడిగాడు.
"మా స్మరన్ అంకుల్ అడిగారు తనని వెళ్లి కలవమని, తానేదో క్లూ దొరికిందని చెప్పిందని. అంకుల్ ఆల్రెడీ తనని ఒకసారి కలిసి మాట్లాడారు. అందుకే నేను ఈ రోజు వెళ్ళడానికి ముందే ఒకసారి తనని కలిసి మాట్లాడాను. మేం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం." చివర్లో నవ్వింది మేనక.
"ఏమిటి, తానేదో క్లూ దొరికిందని చెప్పిందా? అదేమిటో నీకు చెప్పిందా అయితే?" ఆసక్తిగా అడిగాడు రంగనాథ్.
"ఎస్, అంకుల్. దేర్ ఈజ్ ఏ లిటిల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ మాటర్. కాకపోతే మిమ్మల్ని అనవసరంగా ఎక్సయిట్ చెయ్యడం ఇష్టం లేక చెప్పలేదు." తాను సమీర ఇంట్లో చూసిందేమిటో వివరంగా చెప్పింది మేనక.
" తను ఆ ఫీలింగుని తట్టుకోలేక పోయిందా? ఏమైవుంటుంది ఆ ఫీలింగ్?" ఎగ్జైటింగ్ గా అన్నాడు రంగనాథ్.
"సర్టేన్లీ సమ్ నెగటివ్ ఫీలింగ్. ఆల్రెడీ అంకుల్ తో డిస్కస్ చేశాను. పూర్తి విషయం తెలియాలంటే ఇంకొన్ని క్లూస్ కావాలన్నారు అంకుల్. మీరా విషయం గురించి ఎక్కువగా అలోచించి ఎగ్జైట్ కాకండి. ఎనీహౌ…...." కాస్త ఆగి అంది. "నేను పూర్తిగా కాన్ఫిడెంట్. మీకిచ్చిన నెల రోజుల గడువులో మా అంకుల్ ఆ విషయం కనిపెట్టి తీరతారు."
కష్టంగానే అనిపించినా మేనక అలా చెప్పిన తరువాత అడ్జస్ట్ అయ్యాడు రంగనాథ్. "ఆ తరువాత నువ్విక్కడ నుండి వెళ్ళిపోతావనుకుంటాను." కుర్చీలో మరోసారి వెనక్కి వాలి అన్నాడు రంగనాథ్ విచారంగా.
"నో అంకుల్." బెడ్ మీద నుండి కిందకి దిగి, రంగనాథ్ కుర్చీ వెనక్కి వచ్చి, అయన మెడ చుట్టూ చేతులు వేసి అంది. "నేను ఆల్రెడీ ఆంటీ కి మాట ఇచ్చాను. మీకు కూడా ఇస్తున్నాను. మీరు వెళ్ళమనేంత వరకు ఇక్కడే వుంటాను. ఫీల్ రిలాక్స్డ్."
"చాలా మంచి విషయం అమ్మా." ఆమె చేతుల్ని విడిపించుకుని, కుర్చీలోనుంచి పైకి లేచి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు రంగనాథ్. "ఇక కిందకి వెళదాం. ఆంటీ ఒక్కర్తీ వుంది కిందన."
తరువాత ఆ ఇద్దరూ కిందకి వచ్చేసారు.
&&&
"మామ్, చెప్పు." సప్పర్ పూర్తి చేసి, మేడ మీద గదిలోకి ఇలా వచ్చి బెడ్ మీద ఆలా నడుం వాల్చిందో లేదో ప్రతిమ నుంచి ఫోన్ వచ్చింది మెనకకి. అసలే చికాగ్గా ఉండడంతో ముక్తసరిగా అంది.
"నువ్వు ఫోన్ చెయ్యవు. నేనే చెయ్యాలి. ఇలాగే వుండే విషయం అయితే వెంటనే బయలుదేరి ఇంటికిరా. నువ్వే హెల్ప్ చెయ్యక్కరలేదు, మీ అంకుల్ పాట్లేవో తనే పడతాడు." ప్రతిమ అంది కోపంగా.
"నేనేదో అంకుల్ కి హెల్ప్ చేసేస్తానని కాదు ఈ ఓల్డ్ ప్యూపిల్ ఇద్దరూ నేనిక్కడ ఉండడం వల్ల కొంత రిలీఫ్ ఫీలవుతున్నారు. అందుకనే వున్నాను." చిరాకు మేనకలో ఇంకా ఎక్కువైంది.
"అలాని ఎంతకాలం అక్కడ ఆలా ఉండిపోగలవు? పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళవలసినదానివి. ఆ విషయం మర్చిపోకు."
"చుట్టుతిప్పి విషయం అక్కడికే తెస్తావు కదా." మంచం మీద లేచి, బాసిపట్టు వేసుకు కూచుంది మేనక. "ఇప్పట్లో నా పెళ్లి ఎలాగూ జరగదు. అంత పని పడితే అప్పుడు ఆలోచిద్దాంలే." ఆలా అంటే తన తల్లికి ఎంత మండుతుందో తెలిసి డేరింగా అంది మేనక. నిరుపమ గురించే ఆలోచిస్తూ తనకెందుకో చాలా అనీజీగా, అప్సెట్ గా వుంది. కొంత మైండ్ డైవర్సన్ కావలి.
"అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? నువ్వలా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే నాకు నచ్చిన వాడితో నెల రోజుల్లో నీ పెళ్లి చేసి పారేస్తాను." ఫోన్లో అరచినంత పనిచేసింది ప్రతిమ.
"మామ్……" వస్తూన్న నవ్వుని బలవంతంగా అణచిపెట్టుకుని సీరియస్ గా అంది మేనక. "నువ్వు నన్ను చదువుకోడం కూడా చదువుకోనివ్వకుండా పెళ్లి చేసెయ్యాలనే చూస్తే నేను ఆ విషయం గురించి కూడా ఆలోచించను. చూస్తాను నువ్వు నెల రోజుల్లో నా పెళ్లి ఎలా చేసేస్తావో."
"నువ్వు ఏం.ఏ ఇక్కడ జాయిన్ అయ్యావు అనుకో. పెళ్లయ్యాక ఇంకో చోటికి వెళ్లాల్సి వస్తే ట్రాన్స్ఫర్ కష్టం కదా. పెళ్లయ్యాక మీ అయన వున్న చోటే వున్న కాలేజీ లో జాయిన్ అయ్యావు అనుకో, ఆ ఇబ్బంది ఉండదు కదా. అందుకని నిన్నాపాను కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు." ఇమ్మీడియేట్ గా ప్రతిమ లో చేంజ్ కనిపించింది. తన కూతురిలో మొండితనం ఆమెకి బాగా తెలుసు.
"అప్పుడు కూడా మా ఆయనకి వేరే వూరు ట్రాన్స్ఫర్ అయితే, నా కాలేజీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వక తప్పదు కదా. ఈ మాటలు వద్దమ్మా. ఆలా కాలేజీ ట్రాన్స్ఫర్ ఇబ్బందులు వస్తే ఆ బాధలు నేను పడతాను. నేను కాలేజీ లో జాయిన్ అవ్వడానికి నువ్వు అంగీకరిస్తేనే పెళ్లి గురించి ఆలోచిస్తాను." మొండిగా అంది మేనక.
"ఒకే అయితే." ఇలా కాంప్రమైజ్ అవ్వక తప్పదని చాలా రోజులుగా అనుకుంటూంది వనజ. " నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వు. కానీ మంచి సంబంధం కుదిరితే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి."
"ప్రొవైడింగ్, నాకు నచ్చిన కుర్రాడు అయితేనే."
"నీకు నచ్చకుండా ఎవరో ఒకరిని ఇచ్చి చేసేడానికి నేనేం రాక్షసిని కాదు." నవ్వింది ప్రతిమ. "కానీ నీకు నీ కలల రాజ కుమారుడే కావాలంటే నేను తేలేను."
"నాకు కలల రాజ కుమారులెవరూ లేరు. నాకు కొంచం అగ్రీయబుల్ గా ఉంటే చాలు." మేనక అంది.
"ఆల్రైట్ డియర్. ఇంతకీ అక్కడ విషయాలేమిటి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇప్పుడెలా వున్నరు?"
"ఇన్వెస్టిగేషన్ లో పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేదు కానీ అంకుల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు ఈ నెలరోజుల్లోనూ సాల్వ్ చేసేగలనని."
"మీ అంకుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు అంటే ఖచ్చితంగా అలాగే చెయ్యగలడు." ప్రతిమ స్వరం కూడా కాన్ఫిడెంట్ గానే వుంది. "ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇంతకీ ఆ పెద్దవాళ్ళిద్దరి విషయం?"
"ఈ విషయానికి నాకు ఆనందపడాలో లేక విచార పడాలో తెలియడంలేదు మామ్. నన్ను చూస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని చూస్తూన్నట్టే ఉందట. కొంత రిలీఫ్ గా ఫీలవుతూ వున్నారు. అందుకనే నేను వాళ్ళకి వాళ్ళ దగ్గరే ఉంటానని మాట కూడా ఇచ్చాను."
"ఓహ్, మై గాడ్! అలాని ఎంతకాలం వాళ్ళ దగ్గర ఉండిపోగలవు, అలాంటి మాట ఇచ్చ్చావ్?" కంగారుగా అంది వనజ.
"ఏదోఒకటి ఆలోచించొచ్చు మామ్. ఏదేమైనా అది అంత పెద్ద విషయమా? నా వల్ల, నేనిచ్చిన మాట వల్ల వాళ్ళు ప్రస్తుతం కొంత స్వాంతన పొందుతున్నారు. వాళ్ళకి కొంచమైనా హప్పినెస్స్ ఇచ్చినందుకు నాకూ హ్యాపీగా వుంది మామ్."
"నువ్వు చెప్పింది నిజమేనమ్మా. సరే కొంతకాలం అలాగే కానీ." నిట్టూర్చింది ప్రతిమ.
"నువ్విక్కడకొచ్చి మాట్లాడతానన్నావు కదా మామ్, మళ్ళీ ఆ విషయమే మర్చిపోయావు. ఎవరైనా వచ్చి పలకరించి మాట్లాడుతూ ఉంటే ఈ పెద్దవాళ్ళకి ఇంకొంచం రిలీఫ్ గా ఉంటుంది."
"ఆ విషయం మర్చిపోయింది నువ్వు, నేను కాదు. ఆ రోజు ఆలా అన్నాక మళ్ళీ ఏమైనా అన్నావా?" చిరాగ్గా అంది ప్రతిమ. "ఎనీహౌ రేపు సండే మార్నింగ్ అక్కడికి వస్తాను. ఆ విషయం ఆ పెద్దవాళ్ళకి చెప్పు."
"ఒకే మామ్, డన్." నవ్వింది మేనక.
"అలాగే నీ కోరిక ప్రకారం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతావు. అలాగే నా కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటావు. ఇట్స్ ఏ డీల్."
"ప్రొవైడింగ్, నాకు నచ్చిన కుర్రాడు దొరికితే."
"కాస్త బాగున్నకుర్రాడిని నీకు నచ్చేలా చేసుకోవాలి. పెద్ద హీరోలా వున్నవాడు కావాలంటే దొరక్కపోవచ్చు."
"మామ్, నేనింకా చిన్న పిల్లనే కావచ్చు. కానీ మరీ అంత మెచూరిటీ లేకుండా మాత్రం లేను. కాస్త రీజనబుల్ గా ఉంటే చాలు, నేను పెళ్లి చేసుకుంటాను." స్వరంలో స్పష్టతతో అంది మేనక.
"దెన్ ఇట్స్ మోర్ దెన్ ఏ డీల్." సడన్గా సంతోషం కనిపించింది ప్రతిమ గొంతులో.
"అఫ్ కోర్స్ మామ్, ఇట్స్ మోర్ దెన్ ఏ డీల్ నౌ." మేనక నవ్వింది.
"ఆల్రైట్ దెన్. గుడ్నైట్ డార్లింగ్." ఆలా చెప్పాక ఫోన్ పెట్టేసింది వనజ మేనక కూడా గుడ్ నైట్ చెప్పేలోగానే.
కాల్ ఎండెడ్ అని వచ్చేక దీర్ఘంగా నిట్టూర్చి ఫోన్ తన పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకుంది మేనక పడుకోవడానికి.
నిజానికి తన తల్లి బలవంతం వల్ల మాత్రమే పెళ్ళికి అంగీకరించలేదు మేనక. ఎందుకో రీసెంట్ గా సెక్సువల్ లైఫ్ అంటే ఇంటరెస్ట్ మొదలైంది తనలో. తన మనసు ఆమెకి తెలియాకుండానే తనకి నచ్చిన మగాళ్లతో సెక్స్ లో పాల్గొన్నట్టుగా ఇమాజిన్ చేస్తూ ఎదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలుగుతూంది. కొన్ని సందర్భాలలో ఎవరితో ఒకరితో సెక్స్ చెయ్యాలని విపరీతమైన కోరిక కలుగుతూంది. మారిటల్ లైఫ్ ని అవాయిడ్ చేస్తూ ఎంతో ఆనందాన్ని దూరం చేసుకుంటున్నానా అనికూడా అనిపిస్తూ వుంది. అందుకనే సడన్గా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి వచ్చేసింది.
తనేం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యాలని సీరియస్ గా లేనని, మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచిస్తున్నానని సమీర చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మేనకకి. తను కూడా సెక్స్ గురించే ఆలోచిస్తూ అలాంటి నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది.
తను కష్టపడి తెచ్చుకున్న మైండ్ డైవర్షన్ ఎంతో సేపు నిలవలేదు. సమీర గుర్తుకు రావడంతో మళ్ళీ నిరుపమ గుర్తుకు వచ్చింది. ఆమె మనస్సు మొత్తం మరొకసారి ఆమె పేరెంట్స్ ఇంకా వాళ్ళు ఎలా సఫర్ అవుతూంది తోటి నిండి పోయింది. పోయిందన్న చికాకు మళ్ళీ ఆమెని పూర్తిగా ఆవరించుకుంది.
'మై గాడ్!' లేచి మరొకసారి బెడ్ మీద నిఠారుగా బాసిపట్టు వేసుకుని కూచుంది. ముఖ్యంగా నిర్మలని చూస్తూ ఉంటే తమాయించుకోలేక పోతూ వుంది. తన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు. కానీ తన తండ్రి గురించి కాకా పోయిన, తన గురించి ఆల్మోస్ట్ పిచ్చిదానిలా మారిపోవడానికి అవకాశం వున్న తన తల్లి గురించయినా నిరుపమ ఆలోచించ కుండా సూసైడ్ చేసుకుందంటే మేనకకి చాలా కోపంగా వుంది. తను నిజంగా ఎంత మందిని బాధ పెట్టింది? తన పేరెంట్స్ ని మాత్రమే కాదు, క్లోజ్ ఫ్రెండ్ సమీర కూడా ఎంతో అప్సెట్ అయిపోయింది.
ఎందుకో సడన్గా దాహంగా అనిపించి బెడ్ దిగిపోయింది. కిచెన్లో మాత్రమే కాకుండా మేడ మీద ఈ రూంలో కూడా చిన్న ఫ్రిజ్ వుంది. నిరుపమ చనిపోయాక దాన్ని ఆఫ్ చేసేసారు కానీ తనే మళ్ళీ ఆన్ చేసి ఒక రెండు కూల్ డ్రింక్ బాటిల్స్ ఇంక వాటర్ బాటిల్స్ పెట్టుకుంది. ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని ఫ్రిడ్జ్ దగ్గరకి వెళుతూ చటుక్కున ఆగి పోయింది. ఫ్రిజ్ వున్న గోడ మీద నిరుపమ ఫోటో వుంది. ఆ ఫోటో చూస్తూ ఉంటే క్షణాల కింద ఫీలైన కోపం అంత మళ్లీ వచ్చేసింది మేనకకి. తిన్నగా వెళ్లి ఆ ఫోటోకి ఎదురుగుండా నిలబడింది స్ట్రెయిట్ గా నిరుపమ మొహంలోకి చూస్తూ.
"నీ ఫ్రెండ్ గురించి ఆలోచించకపోయినా, చివరకి నీ తండ్రి గురించి ఆలోచించక పోయినా, నీవల్ల పిచ్చిదానిలా అయిపోయే నీ తల్లి గురించి కూడా ఆలోచించలేక సూసైడ్ చేసుకుంటావా? అంత హృదయం లేకుండా ఎలా బిహేవ్ చెయ్యగలిగావు? నువ్వసలు మనిషివేనా?" మనిషితో మాట్లాడినట్టుగానే మాట్లాడుతోంది.
చల్లగా గాలి వీచి ఏదోలా అనిపించింది మేనకకి. కానీ ఆ ఫీలింగుని పట్టించుకోకుండా ఆ ఫోటోని అలాగే చూస్తూ కాస్త ఆగి మళ్లీ మొదలుపెట్టింది.
"నిన్నంతగా ఇబ్బంది పెట్టి సూసైడ్ కి ప్రేరేపించినా ఆ విషయం ఏమిటి? ఎందుకది అంత సీక్రెట్ గా ఉంచేసావు? ఇప్పుడు చూస్తున్నావుగా నీ డాడీ ఎంత బాధ పడుతూ వున్నారో? అది తెలుసుకోవడానికి ఎంతో తాపత్రయ పడుతూ వున్నారు. నువ్వేదో ఏ కారణం లేకుండా సూసైడ్ చేసుకోలేదని లోకానికి ప్రూవ్ చేసి నీ పరువు కాపాడాలనుకుంటున్నారు. ఐ పీటీ యు. నువ్వు ఇంపల్సివ్ గా చేసే ఒక పనివల్ల కలిగే కన్సిక్వెన్సెస్ గురించి కూడా ఆలోచించలేని స్టుపిడ్ వి నువ్వు. అందుకనే ఆలా సూసైడ్ చేసుకున్నావు."
తనతో పాటుగా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ మొట్టమొదటి రోజు ఆ రూంలో ఎలాగైతే కలిగిందో, అలాంటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది మేనకకీ. కానీ సడన్గా తనలో పెల్లుబుకుతోన్న కోపం ఆ ఫీలింగిని పట్టించుకోనివ్వడం లేదు.
"నీ మీద కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకెలా వుందో కాని నీ పేరెంట్స్ ని చూస్తూ ఉంటే నాకు గుండె తరుక్కు పోతూంది. ఇప్పుడు నీకొక ప్రామిస్ చేస్తున్నాను విను." గోడ మీద వున్నది కేవలం ఒక ఫోటో మాత్రమే అన్న విషయం మరిచిపోయి అని కాస్త ఆగి మళ్లీ అంది మేనక.
"నువ్వెంతో రహస్యంగా వుంచాలనుకున్న ఆ విషయం మేము తెలుసుకుని తీరతాం. కేవలం మీ డాడీకి మాత్రమే కాదు, ఆ విషయం లోకమంతా చాటి చెప్తాము. జస్ట్ బిలీవ్ మీ. ఇది నీకు నా ప్రామిస్."
"ఆలా ఎప్పటికీ జరగ నివ్వను." సడన్గా వినిపించింది మేనకకీ. ఎంతో క్లియర్ గా వుంది ఆ స్వరం ఆ నిశబ్ద వాతావరణంలో. తన వెనకాతలే ఎవేరో నిలబడినట్టుగా మెడకి వెచ్చగా ఊపిరి తగులుతూంది.
ఒక్కసారిగా మ్రాన్పడిపోయింది మేనక. ఒళ్ళంతా చలి జ్వరం వచ్చినట్టుగా అనిపించి గుండె అంతా భయంతో నిండిపోయింది. అంత వేగంగా తన గుండె కొట్టుకున్నట్టు ఎప్పుడు గుర్తు లేదు మేనకకీ. ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయింది.
ఎన్ని సెకన్లు గడిచాయో తెలీదు నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ ధైర్యం తెచ్చుకుంది మేనక. తన మెడ మీద వెచ్చటి ఊపిరి, ఇంక తన వెనకాతలే ఎవరో నిలబడి ఉన్నారన్న ఫీలింగ్ అలాగే వున్నా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది.
ఎవరూ లేరు.
వేగంగా ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి, ఓపెన్ చేసి, అందులో వాటర్ బాటిల్ తీసుకుని క్షణాల్లో హాఫ్ కంప్లీట్ చేసి హెవీగా ఊపిరి పీల్చుకుంది మేనక. తరువాత వచ్చి బెడ్ మీద పడుకున్నాక కూడా ఆ రూంలో ఇంకా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ మాత్రం అలాగే వుండి పోయింది. ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తనకి గుర్తులేదు, కానీ నిద్ర పట్టేటంత వరకూ మాత్రం భయపడుతూనే వుంది.
&&&
"నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీ గా వుందో తెలుసా? నా దగ్గరికి రాకుండా ఇన్ని రోజులు ఎక్కడకి వెళ్ళిపోయావు?" నిరుపమని చూస్తూ అడిగింది సమీర.
"నేను ఎక్కడకి వెళ్ళిపోతే ఏం లే. కొత్త ఫ్రెండ్స్ దొరికారుగా." నిష్టూరంగా చూస్తూ అంది నిరుపమ.
"ఆ మేనక గురించేనా నువ్వు మాట్లాడుతున్నది? అఫ్ కోర్స్, తాను నాకు మంచి ఫ్రెండే. కానీ నీ ఆంత ఎప్పటికీ కాదు." సమీర నవ్వుతూ అని సడన్గా సీరియస్ గా మారిపోయింది. "నీ ఆంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఎవరూ ఉండరని నీకు తెలియదా? మనది సోల్ రేలషన్శిప్."
"నేను ఒప్పుకుంటాను." నిరుపమ తలూపుతూ అంది. "నీతో చాలా మాట్లాడాలని వుంది."
"నాక్కూడా. నువ్వులేక నేను పిచ్చిదానిలా అయిపోయాను. ఇంకా నీ పేరెంట్స్....." సమీర ఎదో చెప్పబోయింది.
"ఇక్కడ కాదు. వేరే చోట మాట్లాడుకుందాం."
"మనం ఎప్పుడు వెళ్లే పార్కుకి వెళదామా? ఏ డిస్టర్బన్స్ లేకుండా కావలిసినంత సేపు మాట్లాడుకోవచ్చు."
"కాదు. ఒక న్యూ ఇంటరెస్టింగ్ ప్లేస్ కి. నా చేతిని పట్టుకో నేను తీసుకుని వెళతాను." కుడి చేతిని ముందుకు జాపుతూ అంది.
"స్యూర్. తప్పకుండ అలాగే." ఆ కుడిచేతిని తన కుడిచేతిలోకి తీసుకుంటూ అంది సమీర. క్షణాల్లో గాల్లోకి ఎగిరింది నిరుపమతో పాటుగా.
"మై గాడ్! మనం ....మనం....ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాం!" ఎగ్జైటింగా అంది సమీర.
"చనిపోయాక నాకు కొత్త శక్తులు వచ్చాయి. నేను ఇలాటివి చాలా చెయ్యగలను." నవ్వుతూ అంది నిరుపమ. "నీతో కూడా చేయించగలను."
"ఏం కొత్త శక్తులు వచ్చాయో ఏమో. మేమందరం చాలా అప్సెట్ అయిపోయాం తెలుసా? ఎందుకు చనిపోయావు నువ్వసలు?" కోపంగా అడిగింది సమీర.
"ఆ విషయం గురించి తరువాత మాట్లాడతాను. ముందిక్కడ ల్యాండ్ అవుదాం." కిందకి దిగుతూ అంది నిరుపమ. నిరుపమతో పాటుగా సమీర కూడా కిందకి దిగింది.
"మై గాడ్! మనం ఒక బీచ్ లోకి వచ్చాం. మన టౌన్ లో అసలు సముద్రం లేదు. మనం ఎక్కడ బీచ్ లోకి వచ్చాం? ఎంత దూరం వచ్చేసాం?" నిరుపమ మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సమీర.
"ఆ విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు ఈ రాతిమీద సెటిల్ అవుదాం." అక్కడే వున్న పెద్ద రాయి దగ్గరకి తీసుకు వెళుతూ అంది నిరుపమ.
"ఇప్పుడు చెప్పు. అసలు నువ్వెందుకు చనిపోయావు? ఏ విషయం మా కెవ్వరికి ఎందుకు తెలియనివ్వలేదు?" మరొకసారి నిరుపమ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది సమీర, ఇద్దరూ ఆ రాయిమీద కంఫోర్టబుల్ గా సెటిల్ అయ్యాక.
"అది నేను చెప్పదలుచుకుంటే నేను చనిపోక ముందే చెప్పేదాన్ని. ఇప్పుడెలా చెప్తాననుకున్నావు?" సడన్గా కోపంతో నిండిపోయింది నిరుపమ మొహం.
"నేను నీకు క్లోజ్ ఫ్రెండ్ని. నీ క్లోజ్ ఫ్రెండ్ కి కూడా చెప్పకూడని విషయమా?" హర్ట్ ఫీలవుతూ, ఆశ్చర్యంగా అడిగింది సమీర.
"షటప్. నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ వి కాదు. నా ఎనిమీవి. నేను ఎవరకి చెప్పకుండా అలా చనిపోయానంటే నాకు ఆ విషయం ఎవరికీ తెలియడం ఇష్టం లేదని నువ్వు తెలుసుకోలేవా? ఆ రహస్యాన్ని బట్టబయలు చెయ్యడానికి ప్రత్నిస్తూన్న డిటెక్టివ్స్ కి సాయం చేస్తావా?" కోపం ఇంకా ఎక్కువ అయిపోయింది నిరుపమ లో.
"నిజానికి మేమెవరం ఆ విషయం తెలుసుకోవాలని ఆంత పట్టుదలగా లేం. మీ డాడీ యే చాలా పట్టుదలగా వున్నారు. ఎదో సింపుల్ రీజన్ కి నువ్వు ఫ్యూలిష్గా సూసైడ్ చేసుకోలేదని లోకానికి ప్రూవ్ చెయ్యాలని ఆయన ఉద్దేశం." డీప్ గా హర్ట్ ఫీలవుతూ అంది సమీర. నిరుపమని ఆంత కోపంగా తానెప్పుడూ చూడలేదు.
"తనకి అది తనని ఎంత హర్ట్ చేస్తుందో తెలియక తెలుసుకోవాలనుకుంటూంటే, నువ్వు నా ఉద్దేశం కనిపెట్టగలిగి కూడా అది తెలుసుకోవడానికి సాయం చేస్తావా? నాకు క్లోజ్ ఫ్రెండ్ వే అయితే ఇలా చేస్తావా? నువ్వు నాకు థిక్ ఎనిమీవి. క్లోజ్ ఫ్రెండ్ వి కాదు." నిరుపమ కళ్ళు చింతనిప్పుల్లా వున్నయి. మొహం ఎంత కోపంగా వుందో మాటలు ఆంత కోపంగానూ వున్నాయి.
"నీరూ దయచేసి అర్ధం చేసుకో. నేను నీకు కోపం తెప్పించాలని ఎందుకనుకుంటాను చెప్పు? కేవలం మీ డాడీ అంతగా తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పే......" ఎదో చెప్పబోయింది సమీర.
"నీ మాటలు నేను వినదలుచుకోలేదు. నువ్వు నాకు ఎనిమీవి. నిన్ను నేను బతకనిస్తే కచ్చితంగా ఆ విషయం వాళ్ళు తెలుసుకోవడానికి నువ్వు సాయం చేస్తావు. నిన్ను నేను చంపేస్తాను." సమీర మెడ చుట్టూ చేతులు వేసి బిగిస్తూ అంది నిరుపమ.
"మై గాడ్! నిరూ...... ఏమిటిది? నేను....నీ... క్లోజ్ ఫ్రెండ్ని......" నిరుపమ చేతులు తన మెడ చుట్టూ బిగుసుకు పోతూ ఉంటే మాట్లాడలేకపోతూ వుంది సమీర.
"నువ్వు చచ్చిపోవాలి. నేను నిన్ను బతకనివ్వను." నిరుపమ చేతులు ఇంకా బిగుసుకు పోయాయి సమీర మెడ చుట్టూ.
"ప్లీజ్...ప్లీజ్...నన్ను చంపకు.....ప్లీజ్......" సమీర అతికష్టం మీద చెప్పడానికి ప్రయత్నిస్తూ వుంది.
"రోజంతా నన్ను చంపుకు తింటూ ఉంటావు. నిన్ను చంపడానికి డేర్ చేసేదెవరు?" వనజ తనని గట్టిగ కుదుపి, సమీర కళ్ళు తెరిచి చూడగానే అంది. "మార్నింగ్ సెవెన్. కాలేజీ కి వెళ్ళాలి. లేచి తెములు."
"మై గాడ్! మామ్, యు రియల్లీ సేవ్డ్ మై లైఫ్." లేచి బెడ్ మీద కూచుని మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ అంది సమీర.
"అంటే నిన్ను పీక పిసికి చంపబోయారా? కలలోనే అయితే మాత్రం నీకంత పెద్ద శత్రువులు ఎవరున్నారు?" చిరునవ్వుతో అడిగింది వనజ.
"నిరుపమ." తల్లి కళ్ళల్లోకి చూస్తూ అంది సమీర.
"నిరుపమా?" వనజ నొసలు చిట్లించింది. "కలలోనే అయినా తనని నిన్ను చంపాలనుకుంది అంటే నాకు చాలా ఆశ్చర్యం గానే వుంది."
"ఎస్, మామ్. నాకూ ఆశ్చర్యం గానే ఉంది. ఎనీహౌ సాయంత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కాలేజీ కి వెళ్ళాలి కదా." బెడ్ దిగుతూ అంది సమీర.
వనజ ఇంక ఏమీ మాట్లాడకుండా వంటింటి వైపు నడిస్తే, సమీర బాత్రూం వైపు నడిచింది.
చాప్టర్-6
"మీరిద్దరూ మళ్లీ ఇలా రావడం నాకు చాలా ఆనందంగా వుంది." తనెదురుగుండా కూచునివున్న సమీర యింకా మేనక మొహాల్లోకి చూస్తూ అన్నాడు నిరంజన్. "బట్ ఎందుకో మీ ఇద్దరూ కూడా అప్సెట్ యింకా అనీజీ గా కనిపిస్తున్నారు."
సమీర, మేనక మొహాల్లోకి చూసుకున్నారు. "ఎస్టర్డే నైట్ ఇద్దరం కూడా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం" మేనక అంది. "నిజానికి ఆ విషయాలు మీతో డిస్కస్ చెయ్యడానికే ఇక్కడకి వచ్చాము."
"మై ప్లెజర్." నిరంజన్ నవ్వాడు. "బట్ హూ స్టార్ట్ ఫస్ట్ బిట్వీన్ యు బోత్?"
"ఐ స్టార్ట్ ఫస్ట్." మేనక నవ్వి అంది. తరువాత తనకి కలిగిన ఎక్స్పీరియన్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. "ప్లీజ్. డోంట్ సే ఇట్స్ మై హల్యుసినేషన్. నేనెంతో రియల్ గా ఫీలయ్యాను. నాకు మొదటినుండి ఆ రూంలో నాతో పాటుగా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ వుంది. కానీ నాకప్పుడు ఆ ఫీలింగ్ యింకా ఎంతో గట్టిగా కలిగింది. నా మెడ మీద ఎవరిదో ఊపిరి కూడా ఫీల్ అయ్యాను."
"ఇది హల్యుసినేషన్ కాకపోతే మరింకేమనాలి? ఇది మరోరకంగా అన్వయించి చెప్పడానికి నేను సైకాజిస్ట్ నే కానీ పారా సైకాజిస్ట్ ని కాదు." నవ్వి అన్నాడు నిరంజన్. "నువ్వే కొంచం అనలైజ్ చేసి చూడు. అదేగదిలో ఆ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. నువ్వు పడుకునే ఆ బెడ్ మీద సీలింగ్ ఫ్యాన్ కే ఉరేసుకుంది. సబ్ కాంషస్ గా నీలో చాలా ఫియర్ వుంది. అదే నీలో ఆ అమ్మాయే నీతో ఉందన్న ఫీలింగ్ కలిగిస్తూ వుంది."
"నాతో ఇంకా ఎవరో వున్నఫీలింగ్ వుంది. అది నిరుపమే అని అనిపించలేదు." మేనక అంది.
"అది నిరుపమే అని నీకనిపించక పోయినా నీలో వున్న ఫీలింగ్ కి ఆ భయమే కారణం. అంతే కాకుండా మనందరి ఒపీనియన్ లో నిరుపమకి తను సూసైడ్ చేసుకున్న కారణం మనెవరకి తెలియడం ఇష్టం లేదు. సో నీ వెనకాతలే తను నీతో ఆలా అన్నట్టుగా నీకనిపించింది."
"మీరిలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఎక్స్పెట్ చేశాను. అలాగే చేశారు." డిజప్పోయింటింగా అంది మేనక. "కానీ నా మెడ మీద ఎవరో ఊపిరి విడుస్తున్నట్టుగా అనిపించడం. దానికి కారణం ఏమిటి?"
"టాక్టయిల్ హల్యుసినేషన్. నీలో బలంగా ఆ రూంలో ఇంకా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తూండడమే ఆ ఫీలింగ్ కి కారణం." నిరంజన్ ముందుకు వంగి తన మోచేతులుని బల్లమీద బాలన్స్ చేసుకున్నాడు. "మీకు నచ్చేలా పారానార్మల్ గానో సుపర్నేచురల్ గానో లేని విషయాల్ని కల్పించి చెప్పలేను. నీ ఎక్స్పీరియన్స్ కి కారణం నీలో సబ్ కాంషస్ గా వున్న ఫియర్ ఇంకా ఎమోషన్. అంతకన్నా మరేం కాదు."
"మరైతే ఇంక నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కూడా అనవసరమేమో." సమీర నీరసంగా అంది. "నిజానికి అది ఒక ఎక్స్పీరియన్స్ కూడా కాదు. ఒక డ్రీం."
"ఏ డ్రీం అల్సొ ఏన్ ఎక్స్పీరియన్స్." నిరంజన్ నవ్వి మళ్ళీ కుర్చీలో జారగిలబడ్డాడు. "అఫ్ కోర్స్, ఒక పారానార్మల్ మీనింగ్ నేను డ్రీమ్స్ కి కూడా ఎప్పుడు ఇవ్వలేను. బట్..." కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. "నీలో సబ్ కాంషస్ గా జరుగుతూన్న సంఘర్షణకి ఆ డ్రీం ఒక మిర్రర్ కావచ్చు. నేనైతే వినడానికి ఇంటరెస్టింగ్ గానే వున్నను."
"ఒకే అంకుల్, చెప్తాను వినండి." తనకొచ్చిన డ్రీం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది సమీర. "కలలోనైనా సరే తను నన్ను చంపాలనుకోవడం నన్ను చాలా హర్ట్ చేసింది. నిరుపమ నన్ను చంపాలనుకోవడం నా మీద అంత కోపం తెచ్చుకోవడం నేనసలు నమ్మలేకపోతున్నాను." విస్మయంగా అంది సమీర.
"జస్ట్ ఏ మూమెంట్. ఆ డ్రీం లో నీ మీద కోపం వ్యక్తం చేసింది, ఇంకా నిన్ను చంపాలనుకున్నది ఏ పార్ట్ అఫ్ యువర్ మైండ్. నిరుపమ కాదు. దట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్. డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్ సబ్ కాంషస్ ఇమాజినేషన్స్. ఒక సైకాలజీ స్టూడెంట్ కి నేనీ విషయం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా?" రంగనాథ్ అన్నాడు.
"బట్ అంకుల్" సమీర అంది. "నిరుపమ కి ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతమాత్రం ఇష్టం లేదని, అది ఆపడానికి తను ఇంటరాక్షన్ అవుతేనే మాకు అలంటి ఎక్స్పీరియన్సెస్ కలిగేయని ఎందుకనుకోకూడదు?"
"వాట్ ఈజ్ దిస్ అబ్సర్డ్ టాకింగ్ సమీరా? నువ్వొక ఎడ్యుకేటెడ్ అని, సైకాలజీ స్టూడెంట్ వని మర్చిపోయావా? నిరుపమ చనిపోయిందని తనింక ఇప్పుడు లేదని నీకు తెలియదా?" చిరుకోపంగా అన్నాడు రంగనాథ్.
"తను ఫీజికల్ గా చనిపోయినా, తన సోల్ కి ఎగ్జిస్టెన్సు ఉంటుంది కదా అంకుల్. తనకి ఇష్టం లేని పనులు జరుగుతూ ఉంటే ఆ సోల్ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కదా." నొసలు చిట్లించి మళ్ళీ అడిగింది సమీర.
సమీర తో అంగీకరిస్తున్నట్టుగా సమీర మొహంలోకి చూసి తలూపి మళ్ళీ నిరంజన్ మొహంలోకి చూసింది మేనక.
"దేర్ ఈజ్ నో సోల్ లైక్ థింగ్ సమీ. అది కేవలం ఫిలసాఫికల్ గా భావుకత్వం తో చెప్పే మాట. బాడీ లో ప్రత్యేకంగా సోల్ అని ఏమి ఉండదు. సో, చనిపోయిన తరువాత కూడా సోల్ అనేది ఏమీ ఉండడానికి అవకాశం లేదు."
మేనక, సమీర ఇద్దరూ షాక్ తిన్నట్టుగా ఒకరి మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు.
"మై గాడ్! అంకుల్. ఇట్ ఈజ్ షాకింగ్ టు మి. బాడీ లో సోల్ లేకపోతే ఇంకేం బేస్ చేసుకుని బాడీ మూవ్ అవుతుంది? ఆలోచనలు ఎలా వస్తున్నాయి? నేను అనే భావం ఎలా వస్తూంది?" మేనక అడిగింది.
"దీనికి ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచం జాగ్రత్తగా వినండి." గొంతు సవరించుకుని మళ్ళీ ముందుకు వంగి మోచేతులు రెండూ మరోసారి టేబుల్ మీద బాలన్స్ చేసుకున్నాడు నిరంజన్. "నువ్వొక ఎలక్ట్రిక్ బల్బ్ కొని ఇంట్లో హోల్డర్ కి పెట్టి స్విచ్ ఆన్ చేసావనుకో బల్బ్ వెలుగుతుంది. బల్బ్ ఎలా వెలిగింది?" మేనక మొహంలోకి చూస్తూ అడిగాడు నిరంజన్.
"అప్పటికే ఆ ఇంట్లోకి ఫ్లో అవుతూన్న ఎలక్ట్రిసిటీ బల్బ్ లోకి కూడా ఫ్లో అయి వెలిగింది." మేనక చెప్పింది కూచున్న కుర్చీలో అడ్జస్ట్ అవుతూ.
"అంతేకాని బల్బ్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ స్పెషల్ గా, పర్టిక్యులర్ గా లేదు కదా."
"అబ్సొల్యూట్ గా లేదు." తలూపి అని సమీర మొహంలోకి చూసింది మేనక. మేనక కూడా అఫర్మేటివ్ గా తలూపింది.
"ఆ సేమ్ ఎలక్ట్రిసిటీ ఆ ఇంట్లో ఫ్రిజ్, కూలర్, టీవీ, కంప్యూటర్ లాంటివి కూడా పనిచేసేందుకు ఉపయోగ పడుతోందికదా."
"ఐ యాం ఇంక్లైన్డ్ టు అగ్రీ." నిరంజన్ ఎక్కడికి లీడ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మేనక.
"కానీ ఆయా ఇన్స్ట్రుమెంట్స్ తయారయిన విధానం పట్టి అవి పనిచేసే విధానం వుంది. ఫ్రిజ్ ఇంక కూలర్ చల్లదనం ఇస్తున్నాయి. టీవీ మనం సినిమాలు, సీరియల్స్ లాటివి చూడడానికి ఉపయోగ పడుతోంది. ఇక కంప్యూటర్, తన యూసేజ్ ఏమిటో మీకు నేను చెప్పక్కర్లేదు."
"అఫ్ కోర్స్ అంకుల్. యు ఆర్ రైట్." ఈ సారి సమీర అంది. నిరంజన్ ఏం చెప్పదలుచుకున్నాడో సమీరకి కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంది.
"ఆ ఇంట్లోకి వస్తూన్న ఎలక్ట్రిసిటీ పైనున్న తీగల ద్వారా వస్తూంది. ఆ తీగల లోనున్న ఎలక్ట్రిసిటీ ఆ టౌన్ లో ఒక చోట వున్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా వస్తూంది. ఆ ట్రాన్స్ఫార్మర్ లోకి ఇంకో చోట వున్న ఇంకో పెద్ద ట్రాన్స్ఫార్మర్ ద్వారా తీగల ద్వారా వస్తూంది. ఆ ఇంకో పెద్ద ట్రాన్స్ఫార్మర్ లోకి....."
"ఆ ఇంకో పెద్ద ట్రాన్స్ఫార్మర్ లోకి ఇంకో చోట ఎక్కడో టర్బైన్స్ ద్వారా లేదో మరోరకం గా క్రియేట్ చేసిన ఎలక్ట్రిసిటీ అఫ్ కోర్స్ తీగల ద్వారా వస్తూంది." నవ్వుతూ అంది సమీర. "అంకుల్ మీరేం చెప్పదలుచుకున్నారో బోధపడడం లేదు."
"పూర్తిగా వింటే కానీ బోధపడే అవకాశం లేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అడ్జస్ట్ అవుతూ అన్నాడు నిరంజన్. "ఇక్కడ ఎలక్ట్రిసిటీ క్రియేట్ చెయ్యబడడం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో వున్న ఎలక్ట్రిసిటీ నే మనం రకరకాల ప్రక్రియల ద్వారా యూసేజ్ లోకి తెచ్చుకుంటున్నాం. అంతే కాదు, ఎలక్ట్రిసిటీ కేవలం ఆ ఎలక్ట్రిసిటీ వైర్లలోనూ, మన ఇంట్లో వున్న ఇన్స్ట్రుమెంట్స్ లోనూ మాత్రమే కాదు, విశ్వం అంతటా వుంది. కాకపోతే మనకి వాటిల్లో మాత్రమే వ్యక్తం అవుతూ వుంది." కాస్త ఆగాడు నిరంజన్.
మేనక ఇంకా సమీర నిశబ్దంగానే వున్నరు. తాము అడక్క పోయినా నిరంజన్ చెప్పే ఉద్దేశంతోనే వున్నాడని వాళ్ళకి బోధపడింది.
"అలాగే ఒక పవర్ మొత్తం విశ్వం అంత వ్యాపించి వుంది. అన్ని జీవరాశుల్లోనూ అదే మూవ్మెంట్ కి కారణం అవుతూంది. మానవుల్లో అయితే ధాట్స్ కి, ఫీలింగ్స్ కి, ఇంకా నేను అన్న అతి ముఖ్యమైన ఫీలింగ్ కి కూడా ఆ పవరే కారణం. ఆయా ఇన్స్ట్రుమెంట్స్ పనిచేసే విధానం అవి తయారు చేయబడ్డ తీరు మీద ఆధారపడి వున్నట్టుగా ఆయా జీవ రాసులు అన్ని కూడా వాటి శరీరం తయారు చేయబడ్డ విధానం బట్టి ఆ పవర్ వాటిల్లో ప్రవేశించగానే పనిచేస్తాయి. ఒక కేటర్ పిల్లర్, ఈగిల్, ఫిష్ ఇవన్నీ కూడా వాటి శరీరం బట్టి ఆ పవర్ వల్ల బిహేవ్ చేస్తాయి. ఇంకా ఆ పవర్ వల్ల మానవుల్లో అయితే మరి ధాట్స్, ఫీలింగ్స్ అండ్ నేను అనే ఫీలింగ్ కూడా వస్తాయి. ఆ పవర్ బాడీ నుండి విత్ డ్రా అయిపోతే బాడీ ఇంమొబైల్ అయిపోతుంది. దీనినే డెత్ అంటున్నాము. సో దీనిని బట్టి సోల్ అని ఎప్పుడూ లేదు. ఉన్నది కేవలం ఒకే ఒక యూనివర్సల్ పవర్. నిజానికి బాడీ ఫర్మేషన్ ప్రారంభం అవుతూనే అది బాడీ లో ఉంటుంది. అది బాడీ లో కంటిన్యూ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి. ఎప్పుడైతే తేడా వచ్చి అది బాడీ నుండి విత్ డ్రా అయిపోతుందో, దట్ ఈజ్ డెత్."
"ఓహ్, మై గాడ్! అంకుల్, మీరు చెప్పదలుచుకున్నది చాలా బాగా అర్ధం అయింది. కానీ...." కుర్చీలో వెనక్కి జారగిలబడి దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ అంది సమీర. "సోల్ థియరీ ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వున్నారు. మీరు చెప్పినంత తేలిగ్గా సోల్ లేనే లేదన్న నిర్ణయానికి మేం వచ్చేయలేం."
"బట్ ఫాక్ట్స్ అర్ ఫాక్ట్స్. మన ఫాన్సీ ప్రకారం వాటిని మార్చలేం." స్పష్టమైన స్వరంతో అన్నాడు నిరంజన్. "ఉన్నది కేవలం ఒకే ఒక యూనివర్సల్ పవర్. అదే అన్నిట్లో కాన్షస్ గా వున్నప్పుడు 'నేను' అన్న ఫీలింగ్ గా వస్తూంది. మరి నిజంగానే 'నేను' అని ప్రత్యేకంగా ఏమైనా వున్నప్పుడు, డీప్ స్లీప్ లో అది ఎందుకు తెలియడం లేదు? అప్పుడు అది ఏమైపోతూంది?"
"మరి ప్రీయర్ లైవ్స్ కి ఎన్నో ప్రూవ్స్ వున్నయి కదా. వాటి గురించి మీరేమంటారు?" మేనక అడిగింది. నిరంజన్ చెప్పింది డైజెస్ట్ చేసుకోవడం మేనకకి కూడా కష్టం గానే వుంది.
"నేను దాని గురించి ఏమీ మాట్లాడలేను. నా దృష్టిలో సోల్ అనే ప్రత్యేకమైన ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ లేదు. ఓన్లీ వన్ యూనివర్సల్ పవర్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ దట్ ఈజ్ వాట్ కాజింగ్ ధాట్స్, ఫీలింగ్స్ ఇంక్లూడింగ్ ది 'ఐ' ఫీలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్." ఫర్మ్ నెస్ తో అన్నాడు నిరంజన్.
"మై గాడ్! నాకేమి మాట్లాడాలో తెలియడం లేదు. ఇదంతా చాలా కన్ఫ్యుజింగ్ గా వుంది." హెల్ప్- లెస్ గా తలూపుతూ అంది మేనక.
"బట్ అంకుల్, కొంచెం గుర్తు చేసుకోండి. నేను నిరుపమ గురించి బాధపడుతూ ఉంటే మీరు అన్నారు. నేను సంతోషంగా ఉంటేనే ఎక్కడ వున్నా నిరుపమ సంతోషంగా ఉంటుందని. అసలు సోల్ అని ప్రత్యేకంగా ఏది ఎగ్జిస్టెన్సు లో లేకపోతే మీరలా ఎందుకు అన్నారు?" సమీర అడిగింది.
"ఫిలసాఫికల్ గా ఎదో భావుకత్వంలో నిన్ను ఊరడించడానికి అని వుంటాను. ఐ యాం సారీ. నా అభిప్రాయంలో జీవుడు అని ఐ మీన్ సోల్ అని ప్రత్యేకంగా ఏదీ ఎప్పుడూ ఎగ్జిస్టెన్స్ లో లేదు. ఐదర్ వెన్ ది బాడీ ఈజ్ విత్ లైఫ్ ఆర్ బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ దట్."
"ఇట్స్ ఆల్రైట్ అంకుల్. మీరు చెప్పిన విషయం అర్ధం చేసుకోవడానికి మా మెచూరిటీ సరిపోదనుకుంటా. ఎనీహౌ ఇలాంటి విషయాలు డైజెస్ట్ కావడానికి సమయం పడుతుంది." మేనక అంది.
"లెట్ ఇట్ టేక్ టైం. నో ప్రోబ్లం ఎటాల్." నవ్వాడు నిరంజన్. "కానీ ఇది పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకుంటే ఏ పర్సన్ కూడా చనిపోయి బాధపడుతున్నాడని మనం బాధపడనవసరం లేదు. చనిపోయిన తరువాత ప్రత్యేకంగా ఎగ్జిస్టెన్స్ ఉంటే కదా బాధపడాల్సి వచ్చేది."
"బట్ అంకుల్......" సడన్గా చేంజెడ్ వాయిస్ తో మొదలుపెట్టి తన మోచేతులు రెండూ టేబుల్ మీద బాలన్స్ చేసుకుంది సమీర. "ఫర్ ది ప్రెజెంట్, నిరుపమ సోల్ గా ఎగ్జిస్టెన్సు లో ఉందని నాకు స్పష్టంగా అనిపిస్తూంది. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ తనకి ఏ మాత్రం ఇష్టం లేదని కూడా నాకనిపిస్తూంది. ప్లీజ్. మీ థియరీ ని నేను అంగీకరించలేదని భావించకండి. చెప్పానుగా దానికి నాకు సమయం పడుతుంది."
"ఐ యాం ఆల్సో హేవింగ్ ద ఎగ్జాట్ ఫీలింగ్ ఐ మస్ట్ సే." సమీర ఆగగానే మేనక అంది. "నా ఒపీనియన్ లో కూడా నిరుపమే నాతో ఆలా స్పష్టంగా ఎక్ష్ప్రెస్స్ చేసింది. నన్ను కూడా మీరు ఎక్స్క్యూజ్ చెయ్యాలి, మీ థియరీ నేను కూడా అంగీకారంచలేకపోతున్నందుకు."
"సో వాట్?" ఇద్దరి మొహాల్లోకి చూసాడు నిరంజన్. "ఇంతకీ మీరేం చెప్పదలచుకున్నారు?"
"మీరు రంగనాథ్ అంకుల్ తో మాట్లాడి ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆపించకూడదు? నిరుపమకి ఎంతమాత్రం ఇష్టం లేని పని మనమెందుకు చెయ్యాలి?" సమీర అడిగింది.
"నేను రెండు మూడు సార్లు సజెస్ట్ చేసాను. ఇది అనవసరమైన పని అని. కానీ ఆ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని తను చాలా అబ్సెసివ్ గా వున్నడు. ఇంతకు ముందు నా మాట వినలేదు. ఇప్పుడు కూడా వినడు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు నిరంజన్.
"వన్ లాస్ట్ అటెంప్ట్ చెయ్యండి అంకుల్. ఈసారి ఇంకొంచం గట్టిగా చెప్పండి. ఈ ఇన్వెస్టిగేషన్ ఆగి పోవడమే అన్నివిధాలుగాను మంచిది." సమీర అంది.
"ఆల్రైట్. నేను మరోసారి చెప్పి చూస్తాను నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి. బట్ ఐ యాం స్యూర్ హి విల్ నాట్ లిజన్." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు నిరంజన్.
"థాంక్ యూ అంకుల్." గ్రేట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది సమీర. "నిరుపమ నేను తనకి ద్రోహం చేస్తున్నానని అనుకోకూడదు. అందుకనే ఇలా చెప్పాను."
"ఒకే డియర్. నా ప్రయత్నం నేను చేస్తాను." తలూపాడు నిరంజన్. "కానీ మీకు నేనొక్క సజెషన్ ఇవ్వ దలిచాను. వెదర్ దేర్ ఆర్ సోల్స్ ఆర్ నాట్, మీ ఎక్స్పీరియన్స్ కి డ్రీమ్స్ కి మీ సబ్ కాంషస్ మాత్రమే కారణం. నిరుపమ కాదు."
"ఒకే అంకుల్. వుయ్ ట్రై టు బిలీవ్ ఇట్." మేనక నవ్వి సమీర కళ్ళల్లోకి చూసింది. సమీర కూడా నవ్వుతూ తలూపింది.
"ఎనీహౌ నువ్వక్కడ వుండలేకపోతే నువ్వెళ్ళిపోవచ్చు. నీ అసిస్టెన్స్ లేకపోయినా మీ అంకుల్ ఈ అస్సైన్మెంట్ పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది." మేనక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నిరంజన్.
"నన్ను చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయినే చూస్తున్నట్టుగా ఫీలవుతూ కొంత రిలీఫ్ గా వున్నరు ఆ ముసలివాళ్ళిద్దరూ. ఈ అస్సైన్మెంట్ గురించి కాకపోయినా వాళ్ళకి ఆ కొంత ఆనందం కోసమైనా నేను ఆ ఇంట్లో ఇంకొంత కాలం వుండదలిచాను. ఇన్ ఫాక్ట్, నేను ఆ ముసలివాళ్ళిద్దరికి ఆలా ఉంటానని మాట కూడా ఇచ్చాను." మేనక అంది.
"కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగాక అదే రూంలో నువ్వుండగలవా? కావాలంటే నువ్వు కింద రూంలోకి మారిపోవచ్చు." మేనక కళ్ళల్లోకి చూస్తూ అంది సమీర.
"అఫ్ కోర్స్, ఇమ్మీడియేట్ గా నేను కొంత భయపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నాకు అలాంటి భయం లేదు." దీర్ఘంగా నిట్టూర్చి అంది మేనక. "చనిపోకముందు తనూ నా అంత వయసే వున్న ఒక అమ్మాయి. తను సోల్ గా మారినంత మాత్రాన, ఇన్ ఫాక్ట్ ఒక వేళ సోల్స్ అనేవే ఉంటే, నేను తనకి భయపడాలా? తను నాతొ ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తే నేనూ తనతో ఇంటరాక్ట్ అయి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను."
"డిడ్ యు గెట్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫ్రామ్ యువర్ ఫ్రెండ్?" సమీర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నిరంజన్.
"అఫ్ కోర్స్, ఐ గాట్." నవ్వింది సమీర. "తన డ్రీమ్స్ కి నేనూ కూడా భయపడను. ఒకవేళ ఆ డ్రీమ్స్ తను నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి చేసే ప్రయత్నమే అయితే నేనూ ఇంటరాక్ట్ అవుతాను.
"వండర్ఫుల్ ఇండీడ్." తలూపి అన్నాడు నిరంజన్.
మరికాసేపు నిరంజన్ తో మాట్లాడక అక్కడినుండి వెళ్లిపోయారు సమీర, మేనక.
&&&
"నేను లేని నాలుగు రోజులు మా అమ్మాయిని ఇలా ఇక్కడ ఉండనిచ్చినందుకు చాలా థాంక్స్." ప్రతిమ అంది. "తనకి ఇన్నేళ్లు వచ్చినా నేనెప్పుడూ తనని వంటరిగా ఇంట్లో వదలిపెట్టి వెళ్ళలేదు. అందుకనే తనని మీ ఇంట్లో ఉంచాల్సి వచ్చింది."
చెప్పినట్టుగానే ఆ ఆదివారం ఉదయం ఆ ఇంటికి వచ్చింది ప్రతిమ. మేనక ముందే చెప్పి ఉండడం వాళ్ళ ప్రతిమ గురించి ఎదురు చూస్తూనే వున్నరు రంగనాథ్ ఇంకా నిర్మల. నిర్మల గురించి చెప్పిన విషయం గుర్తుండి ఆలా చెప్పింది ప్రతిమ.
"నిజంగా మేమే మీకు థాంక్స్ చెప్పాలి. తనుండడం వాళ్ళ మాకు చాల ఆనందం కలిగింది. ఇప్పుడే కాదు ఎప్పుడు మీరెక్కడికి వెళ్లాల్సివచ్చినా తనని మా ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచి వెళ్ళండి." నిర్మల అంది.
"మా ఆవిడ చెప్పింది నిజం. మీరు మీ అమ్మాయిని మా ఇంట్లో ఉంచడానికి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. తను మాకు అచ్చం మా అమ్మాయిలాగే అనిపిస్తూ వుంది." రంగనాథ్ అన్నాడు.
"మా అమ్మాయి నిరుపమ ఇంటికి వచ్చిందంటే వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. మా అమ్మాయికి ఆల్రెడీ మేనక గురించి చెప్పాను. తను మేనకని కలుసుకుని మాట్లాడాలని చాలా ఉత్సాహంగా వుంది. కానీ వాళ్ళ మేనత్త ఒకసారి తను వాళ్ళింటికి వెళ్లిందంటే అంత తేలిగ్గా పంపించే రకం కాదు." నిర్మల అంది.
అనుకోకుండానే మేనక మొహంలోకి చూసింది ప్రతిమ. మేనక కళ్ళతోనే సౌంజ్ఞ చేసింది తను ఆల్రెడీ ఆ విషయం చెప్పేనన్నట్టుగా. గుండెలు పిండేసినట్టు అయింది ప్రతిమకి. ఎప్పుడో చనిపోయిన కూతురిని ఆవిడ ఇంకా ఆలా బతికుందన్నట్టుగా ఊహించుకోవడం ఊహకే చాల బాధాకరంగా వుంది. చాలా ఎమోషనల్ గా వుంది ప్రతిమకి.
"మామ్, నువ్వు నా రూంలోకి ఒకసారి వస్తావా? ఎంత బాగా వుందో. నిజంగా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ వున్నాను." కుర్చీలోంచి లేచి అంది మేనక తన తల్లి చాలా ఎమోషనల్ అయిపోతుండడం చూసి. ఇంకా నిర్మల ఏం మాట్లాడుతుందో కూడా బోధపడడం లేదు.
"సరే పద వెళదాం." తనూ కుర్చీలోనుంచి లేచింది ప్రతిమ.
"సరే మీరిద్దరూ ఆ రూంలోకి వెళ్లి వుండండి. నేను మధ్యాహ్నం భోజనాలకి ఏర్పాటు చేస్తాను. ఈరోజు మీరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాల్సిందే." తనూ కుర్చీలోంచి లేస్తూ అంది నిర్మల.
రంగనాథ్ ని అక్కడే కుర్చీలో అట్టేపెట్టి ముగ్గురూ అక్కడినుండి కదిలారు.
&&&
"నేను ఆల్రెడీ చెప్పాను కాదమ్మా ఆవిడ పరిస్థితి. అయినా ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు?" ఇద్దరూ ఆ గదిలో వున్న బెడ్ మీద సెటిల్ అవ్వగానే మేనక ప్రతిమ ని అడిగింది.
"నేను తట్టుకోలేక పోతున్నానే తను చనిపోయిన కూతురిని ఆలా ఊహించుకుంటూ వుంటే. ఎంత దురదృష్టకరమైన విషయం! పగవాళ్ళకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు." ప్రతిమ మొహం ఇంకా విచారంగా మారి పోయింది.
"మామ్, నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అని నేను అనుకోలేదు." తన కుడి చేతిని ప్రతిమ భుజాల చుట్టూ వేసి దగ్గరికి తీసుకుంటూ అంది మేనక. "అయినా ఇప్పుడు వీళ్ళకి కావలసింది మనం బాధపడడం కాదు. మన సపోర్ట్. కుదిరితే అప్పుడపుడు వచ్చి ఇలా పలకరిస్తూ వుండు. నిజంగా చాలా రిలీఫ్ గా ఫీలవుతారు."
"యు అర్ అబ్సోల్యూట్లీ రైట్. అంతకన్నా మనం చెయ్యగలిగింది కూడా ఏమి లేదు." ఒకసారి ఆ గదినంతా పరికించి చూస్తూ అంది ప్రతిమ. "నువ్వు చెప్పినట్టుగా ఈ రూమ్ చాలా బావుంది. ఇందులోనేనా ఆ అమ్మాయి ఉంటూ ఉండేది?"
"ఎస్, మామ్." తలూపింది మేనక. "అంతేకాదు. తను సూసైడ్ చేసుకున్నది కూడా ఈ రూంలోనే." అనాలా వద్దా అనుకుంటూనే అంది మేనక.
షాక్ కొట్టినట్టుగా మేనక మొహంలోకి చూసింది ప్రతిమ. "నిజమా?" భయంతో నిండి పోయి వుంది ప్రతిమ స్వరం.
"ఇదిగో ఈ బెడ్ మీద వున్న సీలింగ్ ఫ్యాన్ కె తన వోణితో ఉరేసుకుంది." తల్లి భయం చాలా అనీజీగా అనిపిస్తూవున్నా, అంతవరకూ వచ్చాక ఆ విషయం చెప్పక పోవడమేమిటని చెప్పేసింది మేనక.
"మై గాడ్!" సీలింగ్ ఫ్యాన్ వైపుకే చూస్తూ బెడ్ మీద నుండి కిందకి దిగి పోయింది ప్రతిమ. "ఎలా వుంటున్నవే ఈ రూంలో నువ్వు? నీకు భయం అనిపించడం లేదా?" చిన్నగా వణుకుతూన్నగొంతుతో అడిగింది.
"రిలాక్స్ మామ్" తను కూడా బెడ్ దిగి, ప్రతిమ దగ్గరగా వెళ్లి, ఆమె భుజాల చుట్టూ మరోసారి చేతులు వేసింది మేనక. "ఇందులో భయపడడానికి ఏముందసలు? చనిపోడానికి ముందు తను కూడా నాలాంటి అమ్మాయే కదా."
"డోంట్ టాక్ లైక్ దట్." మేనక చేతుల్ని తన కుడిచేతితో తీసేసి ఆమె మొహంలోకి కోపంగా చూసింది ప్రతిమ. "నువ్వీ గదిలో ఉండడం నాకు ఇష్టం లేదు. అంతకి కావాలంటే ఇదే ఇంట్లో ఇంకో గది లో వుండు." అంది.
"మామ్, ప్లీజ్. రిలాక్స్ యువర్ సెల్ఫ్." నవ్వుతూ అంది మేనక. "ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ పైన అయింది. నేను వచ్చిన దగ్గరనుండి ఇదే గదిలో ఉంటున్నాను. ఐ మస్ట్ సే, ఫస్ట్ డే నేను చాలా అనీజీ గా ఫీలయ్యాను ఇక్కడ ఉండడానికి. బట్ ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉండగలుగుతున్నాను. ఈ ఇంట్లో ఇంత మంచి రూమ్ ఇన్ని సదుపాయాలతో ఇంకోటి మరి లేదు." తన రియాక్షన్ చూసాక తనకి ఆ రూంలో కలిగిన ఎక్స్పీరియన్స్ చెప్దాము అనుకున్నదే మళ్ళీ వద్దనుకుని డిసైడ్ చేసుకుంది మేనక.
ఏం అనాలో తెలియక మళ్ళీ ఆ రూంని పరికించి చూస్తూ వుంటే, ఫ్రిజ్ పక్కన గోడకి వున్ననిరుపమ ఫోటో కనిపించింది ప్రతిమకి. అనుకోకుండానే ఆ ఫోటోకి దగ్గరగా నడిచింది ప్రతిమ.
"ఈ అమ్మాయేనా ఆ అమ్మాయి?" ఆ ఫోటో వైపే చూస్తూ అడిగింది ప్రతిమ.
"అఫ్ కోర్స్, మామ్. ఈ అమ్మాయే ఆ అమ్మాయి. నిరుపమ." మేనక అంది.
"ఎంత అందంగా వుంది! మోహంలో ఇంటలిజెన్స్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ వుంది. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కూతురిగా ఉందంటే గర్వపడతారు. ఫోటోలోనే అయినా తనని చూస్తూ వుంటే ఎదో ఒక సిల్లీ రీజన్ కి సూసైడ్ చేసుకుందంటే నమ్మలేక పోతున్నాను. దానికి ఎదో బలమైన కారణం వుండే తీరాలి." ఆ ఫోటోనే తదేకంగా చూస్తూ అంది ప్రతిమ.
"నా అభిప్రాయం కూడా అదే. అది తెలుసుకుని తీరాలనే నా పట్టుదల కూడా."
ఆ స్వరం వింటూనే గతుక్కుమని వెనక్కి తిరిగి చూసారు మేనక, ప్రతిమ. అడుగుల శబ్దం కూడా వినిపించలేదు. రంగనాథ్ ఎప్పుడొచ్చి తమ వెనకాల నిలబడ్డాడో వాళ్ళకి తెలియ లేదు.
"మీరా అంకుల్" గట్టిగ ఊపిరి పీల్చుకుంటూ అంది మేనక.
"ఐ యాం సారీ అమ్మా. మీకు చెప్పకుండా నేను ఈ రూమ్ లోకి ఇలా వచ్చేసాను." గిల్టీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు రంగనాథ్.
"ఇది మీ ఇల్లు. ఇది మీ అమ్మాయి గది. ఇందులోకి రావడానికి మీకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు." నవ్వింది ప్రతిమ.
"థాంక్ యు." నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్. "మీరు ఎలా ఫీలవుతారో తెలియదు. కానీ నాకు మీ అమ్మాయి మేనకని చూస్తూ వుంటే నాకు మా అమ్మాయినే చూస్తున్నట్టుగా అనిపించి స్వాంతన గా ఉంటుంది."
"ఆ విషయం నాకు మా అమ్మాయి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీలయ్యాను. మీ అమ్మాయిని ఆలా కోల్పోయి ఎంత బాధపడుతూ వున్నారో నేను అర్ధం చేసుకోగలను. మీకు ఏ రకంగానైనా కొంత రిలీఫ్ కలిగితే అది నాకు చాలా ఆనందం కలిగించే విషయం."
"నేను స్మరన్ గారిని కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే వరకు నాకు మేనక ఎవరో తెలియదు. ఈ రోజు వరకు మీతో కూడా పరిచయం లేదు. నేను ఏ రోజూ మీకు ఎటువంటి ఉపకారం చేసింది లేదు. కానీ మేనక, మీరు కూడా మాకు ఎంతో కొంత రిలీఫ్ కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీవి చాలా గొప్ప మనసులు." ఒక గ్రేట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు రంగనాథ్.
"మనమంతా మానవులం, ఒకళ్ళనొకళ్ళం అర్ధం చేసుకోగలిగే వాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళం సాయంగా ఉండకపోతే ఎలా? అయినా ఇక్కడ మేము కష్టపడుతున్నది కూడా ఏమి లేదు. అంతేకాకుండా..."మేనక కళ్ళల్లోకి చూస్తూ అంది ప్రతిమ. "...తను మీ కూతురులా ఇక్కడ ఉండడం ఎంజాయ్ చేస్తూంది కూడా."
"మామ్ ఈజ్ అబ్సల్యూటెలీ రైట్." నవ్వుతూ అంది మేనక. "నేనిక్కడ నిజంగానే ఎంజాయ్ చేస్తూ వున్నాను."
"చాలా సంతోషం." రంగనాథ్ కూడా నవ్వుతూ అన్నాడు. "మీకో విషయం తెలుసా? తానిక్కడే ఉండిపోతానని మాకు మాట కూడా ఇచ్చింది."
"నాకు ఎలాంటి అభ్యంతరం లేదు దానికి." దృఢస్వరం తో అంది ప్రతిమ. "కానీ నాకు ఒక్కటే కోరిక. మీరిద్దరూ మీ బాధని మర్చి పోవాలి. మామూలు మనుషులుగా మారాలి."
"ఇంక మా జీవితాలు మామూలుగా అయ్యే అవకాశం ఎప్పటికి లేదు. నిరుపమ వున్నప్పుడు వున్నట్టుగా మా ఇద్దరి జీవితాలు ఎప్పటికి వుండవు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.
"అంకుల్" మేనక అంది. "నేనెప్పుడూ నిరుపమ స్థానాన్ని కంప్లీట్ గా సబ్స్టిట్యూట్ చెయ్యలేను. కానీ ఆమె ఉన్నట్టుగానే నేను వుంటాను. మీరు ఎంత బాధపడ్డా తనింక రాదన్న విషయం మీకు తెలుసు. మీరు మామూలుగా అవ్వడానికి ప్రయత్నించండి ప్లీజ్."
రంగనాథ్ మేనక దగ్గరగా వచ్చి, ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. "నేను నీకు ఏమీ కాకపోయినా, నీకు చేసిందేమీ లేక పోయిన నువ్వు నా గురించి పడే బాధ చూస్తూ వుంటే నాకు ఆనందంగానూ ఇంక ఆశ్చర్యంగానూ కూడా వుంది. కానీ..." తన చేతిని తీసేసి, దూరంగా జరిగి, సీలింగ్ ఫ్యాన్ వైపు చూసాడు రంగనాథ్. "మామూలుగా తను ఒక ఆక్సిడెంట్ లోనో లేక డిసీజ్ తోనో చనిపోతే నేనింత ఎఫెక్ట్ అయ్యేవాడిని కాదు. కానీ తను సూసైడ్ చేసుకుంది. మాకు ఎవరికీ ఏ విషయం తెలియనివ్వకుండా తను సూసైడ్ చేసుకుంది. ఎదో పెద్ద కారణం లేకుండా తనంత పని చెయ్యదు. ఆ కారణం తెలిస్తే నాకు కొంత రిలీఫ్ గా ఉంటుంది." అన్నాడు.
"ఒకే అంకుల్. అందుకే కదా మేం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నది." ఇంక ఏం చెప్పాలో తెలియక చిన్న గొంతుతో అంది మేనక.
"ఇంక మీరంతా కిందకి వస్తారా లేక ఇక్కడే వుంటారా? వంటింట్లో భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేశాను." నిర్మల అక్కడికి వచ్చి నవ్వుతూ అంది.
ఆ తర్వాత వంటింట్లో భోజనాలు చేస్తూన్నంతసేపూ కూడా నిర్మల నిరుపమ బ్రతికి ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటే గుండెలు పిండుతున్నట్టుగానే అనిపించింది ప్రతిమకి. భోజనం అయ్యాక మరో అరగంట అక్కడే వుండి ఇంటికి వెళ్లిపోయింది ప్రతిమ. వెళ్లే ముందు తను మళ్ళీ అవుట్ అఫ్ స్టేషన్ వెళ్లాల్సిన పని పడిందని అందుకని మరికొన్ని రోజులు మేనక వాళ్లింట్లోనే వుంటుందని నిర్మలతో చెప్పింది. అప్పుడు నిర్మల మోహంలో సంతోషం నిజంగా ఆశ్చర్య పరిచింది ప్రతిమని.
&&&
"మీరంతా కూడా ఇక్కడే ఉండడం ఆశ్చర్యంగా వుంది."
స్మరన్ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ నిరంజన్, సమీర ఇంకా మేనక కూడా ఉండడం చూసి ఆశ్చర్యపడుతూ అన్నాడు రంగనాథ్.
"సమీర అంకుల్ ఆఫీస్ చూడాలని చాల రోజులుగా ఇంటరెస్ట్ చూపిస్తూంది. అందుకనే తనని ఈరోజు ఇక్కడకి తీసుకు వచ్చాను." మేనక నవ్వుతూ అంది.
"అవునంకుల్. స్మరన్ చాల గ్రేట్ డిటెక్టివ్! చాలా ఇంప్రెసివ్ గా వుంటారు. అయన ఆఫీస్ ఎలా ఉంటుందో కూడా చూడాలనిపించింది. అందుకనే వచ్చాను." సమీర అంది.
"వెరీ నైస్ థింగ్ యు డిడ్." తలూపుతూ అన్నాడు రంగనాథ్ చిరునవ్వుతో.
రంగనాథ్ రావడానికి ముందుగానే అక్కడే ఫోల్డ్ చేసివున్న మరో కుర్చీని రంగనాథ్ కోసం సెట్ చేసాడు స్మరన్ - మేనక, సమీర ఇంకా నిరంజన్ ల కుర్చీల పక్కన. ఎక్స్ట్రా చైర్స్ ఎప్పుడూ స్మరన్ రూంలో సిద్ధంగానే ఉంటాయి.
"ఈ రోజు ఈ టైంకి వస్తానని స్మరన్ గారికి ముందుగానే చెప్పాను." అక్కడ ఖాళీగా వున్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రంగనాథ్.
"అఫ్ కోర్స్, నేను మిమ్మల్ని ఎక్ష్పెక్త్ చేస్తున్నాను. మీరొస్తారని ఈ ముగ్గురికి చెప్పాను కూడా." తన కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్.
"స్మరన్ గారి ఆఫీస్ చూడాలని నాకు కూడా చాలా రోజులుగా అనిపిస్తూ వుంది. అందుకనే ఈరోజు వచ్చేసాను." నిరంజన్ అన్నాడు. "అంతే కాదు రంగా, నీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. నువ్వూ ఇక్కడకి రావడం నాకు అందంగా వుంది. ఆ మాట్లాడ దలుచుకున్నది ఇప్పుడు మాట్లాడతాను."
"నువ్వేం మాట్లాడాలనుకున్నాఇంటికొచ్చి మాట్లాడు. మన మధ్య విషయాలు ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదుకదా." చిరాగ్గా అన్నాడు రంగనాథ్.
"అవుననుకో, కానీ ఈ విషయం నేను సమీర ఇంకా మేనక రిక్వెస్ట్ మీద మాట్లాడదలుచుకున్నాను. అంతేకాకుండా ఇది స్మరన్ గారి ముందు మాట్లాడడం బాగుంటుంది." నిరంజన్ అన్నాడు.
"నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా చూస్తూ అన్నాడు రంగనాథ్.
మేనక తనకి ఇంకా సమీర కి కలిగిన ఎక్స్పీరియన్స్ స్మరన్ కి చెప్పి, తాము ఇద్దరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఆపేయడమే మంచిది అనుకుంటున్నట్టుగా చెప్పింది. అంతేకాకుండా నిరంజన్ ని అందుగురించి రంగనాథ్ తో మాట్లాడమని రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పింది. స్మరన్ కూడా మేనక చెప్పింది విన్నాక నిరంజన్ లాగే చెప్పాడు కానీ రంగనాథ్ అంగీకరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ఆపేయడానికి తనకి అభ్యంతరం లేదన్నాడు. రంగనాథ్ ఆ సమయంలో అక్కడికి వస్తున్నట్టుగా చెప్పడం వల్లే నిరంజన్, మేనక ఇంకా సమీర ఆ సమయంలో అక్కడికి వచ్చారు. స్మరన్ ఆఫీస్ ఆ విషయం డిస్కస్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని వాళ్ళకి అనిపించింది. అంతేకాకుండా సమీర, మేనక ఆ సమయంలో అక్కడ ఉండడం మంచిదని నిరంజన్ అనడంతో వాళ్లిద్దరూ కూడా అక్కడకి వచ్చారు.
"నేనేదైనా మాట్లాడడానికి ముందు మేనక ఇంకా సమీర వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఒపీనియన్ ని నీకు చెప్పడం మంచిది." వాళ్ళిద్దరి వైపు చూస్తూ అన్నాడు నిరంజన్. "మేనక వై డోంట్ యు స్పీక్ ఫస్ట్?"
"ఆల్రైట్ అంకుల్" మేనక గొంతు సవరించుకుని తనకి నిరుపమ రూంలో కలిగిన ఎక్స్పీరియన్స్ ని పూస గుచ్చినట్టుగా చెప్పింది. "నా దృష్టిలో నిరుపమే ఆలా చెప్పింది. నా హండ్రెడ్ పర్శంట్ అభిప్రాయం నిరుపమకి ఈ ఇన్వెస్టిగేషన్ ఇష్టం లేదు. సో నా ఒపీనియన్ లో ఈ ఇన్వెస్టిగేషన్ ఆపేయడం మంచిది. నౌ యువర్ టర్న్ సమీ." సమీర వైపు చూస్తూ అంది మేనక.
"నిజానికి నాదొక డ్రీం. నిరంజన్ అంకుల్ ఒపీనియన్ లో ఏ డ్రీం ఆల్సో ఈజ్ ఆన్ ఎక్సపీరియన్స్. ఎనీహౌ అది నేను మీకు పూర్తిగా చెప్తాను." అంటూ తనకి వచ్చిన డ్రీమ్ ని నిరంజన్ కి ఎంత క్లియర్ గా చెప్పిందో అంత క్లియర్ గా చెప్పింది రంగనాథ్ కి. "దీన్నిబట్టి నాకు పూర్తిగా అర్ధం అయిందేమిటంటే నిరుపమకి మనం ఆ విషయం తెలుసుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. తనకి క్లోజ్ ఫ్రెండ్గా తనకి ఇష్టం లేని విషయాన్నీ ఎలా సపోర్ట్ చేస్తాను? ప్లీజ్ అంకుల్, ఈ ఇన్వెస్టిగేషన్ ఆపేద్దాం." రిక్వెస్టింగా రంగనాథ్ మొహంలోకి చూస్తూ అంది సమీర.
"సరే ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు?" నిరంజన్ మొహంలోకి చూస్తూ అన్నాడు రంగనాథ్.
"ఈ ఇద్దరి ఎక్స్పీరియన్స్ తో చాలా క్లియర్ అయ్యింది కదా నిరుపమ కి మనం ఎంత మాత్రం ఆ విషయం తెలుసుకోవడం ఇష్టం లేదని. తనకి అంత ఇష్టం లేని పని మనం ఎందుకు చెయ్యాలి? మనం ఈ ఇన్వెస్టిగేషన్ ఆపేద్దాం." నిరంజన్ అన్నాడు.
"ఎస్ సర్. వెరీ ఫస్ట్ డే నే మీకు నేను చెప్పాను. ఈ రోజూ చెప్తున్నాను. ఆ విషయం మనం తెలుసుకోకుండా ఉండడమే మంచిది. మోరోవర్ ...." కాస్త ఆగి స్మరన్ అన్నాడు. "...ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్ కి మీరు నాకేం పే చెయ్యాల్సిన అవసరం లేదు. మేనక కూడా మీకు కావాల్సినంతకాలం ఆ ఇంట్లోనే ఉంటుంది. మై పర్టికులర్ ఒపీనియన్ ఆల్సో ఈజ్ వుయ్ మే బెటర్ స్టాప్ దిస్ ఇన్వెస్టిగేషన్."
"మై గాడ్! మేనక, స్మరన్ ఇంకా సమీర ఆలా అంటే నాకు ఆశ్చర్యం లేదు. కానీ నిరంజన్, నేనిది ఎప్పుడూ నీనుండి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నీ దృష్టిలో మేనక ఎక్స్పీరియన్స్ జస్ట్ ఏ హల్యూసీనేషన్. ఇంక సమీరది. జస్ట్ ఏ డ్రీం అండ్ ఏ డ్రీం ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ థింకింగ్. నిరుపమ ఇప్పుడు ఎగ్జిస్టెన్సు లో లేదని, నీకు సోల్ థియరీ మీద నమ్మకం లేదని నాకు బాగా తెలుసు. మరెందుకు నువ్వు కూడా ఆలా ఆలోచిస్తున్నావు?" నిరంజన్ మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు నిరంజన్.
"మన నమ్మకాలన్నీ నిజం కావాలని లేదు. ఇప్పుడు నిజంగానే నిరుపమ సోల్ గా వుండివుంటే? మనం తనకి అసలు ఇష్టం లేని పని చేస్తున్నందుకు బాధ పడుతుంది కదా." నిరంజన్ అన్నాడు.
"తనేమి నాకంత ఇష్టమైన పని చెయ్యలేదు తను బాధపడుతుంది అని నేను ఆలోచించడానికి." రంగనాథ్ అన్నాడు. "తనకెంత పెద్ద సమస్య వున్నా నేను తీర్చేవాణ్ణి. తనేం చేసి వున్నా నేను అర్ధం చేసుకునేవాణ్ణి. అలాంటిది నేను ఎంత బాధ పడతానో తెలిసికూడా, తన తల్లి ఎలా అయిపోతుందో అర్ధంచేసుకోగలిగి కూడా తనెందుకు సూసైడ్ చేసుకుంది?"
ఏం చెప్పాలో తెలియక మొహమొహాలు చూసుకున్నారు స్మరన్, సమీర, మేనక యింకా నిరంజన్.
"యింకా ఇక్కడ మీకు షాక్ కలిగించే విషయం. నిరుపమ ఇప్పుడు ఎగ్జిస్టెన్సు లో లేదని నాకూ తెలుసు. సోల్ థియరీ మీద నాకూ నమ్మకం లేదు. నా తాపత్రయం అల్లా నా కూతురు ఒక చిన్న విషయానికి సూసైడ్ చేసుకోలేదని లోకానికి ప్రూవ్ చెయ్యాలి. తన డెత్ తో నా జీవితంలో అంతా ముగిసి పోయింది. నాకు యింకా మిగిలింది ఏమి లేదు. తాను అనవసరంగా, ఒక చిన్న అల్పమైన విషయానికి సూసైడ్ చేసుకోలేదని నాకు, ప్రపంచానికి తెలిస్తే చాలు. నా మనస్సుకి కొంత తృప్తిగా ఉంటుంది." రంగనాథ్ అన్నాడు.
"తన సూసైడ్ కి అంత పెద్ద బలమైన కారణం ఉంటుందని నువ్వు అంతగా నమ్ముతున్నావా?" నిరంజన్ అడిగాడు.
"అఫ్ కోర్స్, ఎస్." తలూపుతూ అన్నాడు రంగనాథ్. "తను మేమెంత బాధపడతామో పట్టించుకోకుండా సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఐ యాం డెడ్ స్యూర్. ఒక చిన్న విషయానికి తను సూసైడ్ చేసుకునే పిల్ల మాత్రం కాదు. మస్ట్ బి దేర్ వజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్. కేవలం అది తెలుసుకోవడం మాత్రమే నా రిమైనింగ్ లైఫ్ ఎయిమ్. అది కూడా కేవలం నా మనోశాంతి కోసం మాత్రమే కాదు. నా కూతురు మరీ అంత వీక్ పర్సన్ కాదని లోకానికి ప్రూఫ్ చెయ్యాలి."
అక్కడ వున్న వాళ్లంతా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
"ప్లీజ్, మీరంతా ఈ విషయంలో చేయగలిగినంత సాయం చెయ్యండి. మరొక్కసారి ఈ ఇన్వెస్టిగేషన్ వద్దని మాత్రం చెప్పకండి." రిక్వెస్టింగ్ గా అన్నాడు రంగనాథ్.
"ఐ ప్రామిస్ యు అంకుల్." రంగనాథ్ చెప్పినది విన్న తరువాత సడన్గా ఒక డెసిషన్ కి వచ్చింది సమీర. "ఈ క్షణం నుండి నేను చేయగలిగినంత హెల్ప్ ఈ ఇన్విస్టిగేషన్ కంప్లీట్ చెయ్యడానికి చేస్తాను. ఒక వేళ నిరుపమ డ్రీం ద్వారా కానీ , మరొకరకంగా గని నన్ను కమ్యూనికేట్ చేస్తే మిమ్మల్ని కమ్యూనికేట్ చెయ్యమని చెప్తాను." ధృడంగా అంది సమీర.
"ఐ ప్రామిస్ యు ఆల్సో ది సేమ్ థింగ్ అంకుల్, జస్ట్ బి రిలాక్స్డ్." మేనక అంది. తన స్వరం కూడా తానొక నిర్ణయానికి వచ్చినట్టుగానే వుంది.
"నేను ఇచ్చిన మాట ప్రకారం నెల పూర్తయ్యేలోపల మీకా విషయం తెలిసేలా చూస్తాను. నేను కాన్ఫిడెంట్ గా వున్నను." స్మరన్ వాయిస్ లోను పేస్ లోను కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వుంది.
"చాలా సంతోషం." తరువాత ఇంకొంచెం సేపు మాట్లాడాక మొదట రంగనాథ్ వెళ్ళిపోయాడు. తరువాత నిరంజన్ వెళ్ళిపోయాడు. సమీర కూడా వెళ్ళిపోయాక స్మరన్ తో ఇంకొంచం సేపు కబుర్లు చెప్పి మేనక రంగనాథ్ ఇంటికి వచ్చేసింది.
చాప్టర్-7
ఆ రోజు సన్డే. మేనక దగ్గరికి వెళదామా అని ఆలోచిస్తూ హాల్ లో వున్నకుర్చీలో కూచుని, సెల్ ఫోన్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ వుంది సమీర. అంతలోనే ఫోన్ మ్రోగింది. మురళి అంకుల్!
ఆ మురళి అంకుల్ ఇల్లు ఆ వీధి చివరనే వుంది. ఎంతోకాలంగా అయన ఫామిలీతో ఆ యింట్లోనే వుంటున్నారు. సమీర ఫామిలీకి అయన ఫామిలీతో చాల పరిచయం వుంది. సమీరకి ఆయనతో ఇంకా బాగా అటాచ్మెంట్ వుంది. ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ ఫిక్షన్ చదవడం చాలా ఇష్టం. మంచి మంచి రైటర్స్ వి కొత్త కొత్త పుస్తకాలన్నీ కొంటూ వుంటారు. అలాగే వాటిని సమీరతో షేర్ చేసుకుంటూ వుంటారు. సమీరకి మంచి ఫ్రెండ్ కావడం వల్ల, తనకి కూడా ఫిక్షన్ చదవడం చాలా ఇష్టం కావడం వల్ల నిరుపమకి కూడా ఆయనతో మంచి పరిచయం ఏర్పడింది.
"ఏంటంకుల్, మళ్ళీ కొత్త పుస్తకం ఏదైనా కొన్నారా? లేక ఇప్పటికే చదివిన పుస్తకాల గురించి ఏవైనా డిస్కస్ చేద్దామా?" నవ్వుతూ అడిగింది సమీర.
ఆయనకి పుస్తకాలూ చదవడమే కాదు, చదివిన వాటిని డిస్కస్ చెయ్యడం కూడా చాలా ఇష్టం. అందుకు సమీరని, నిరుపమని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉండేవారు. ఆ డిస్కషన్ లో సమయం కూడా మర్చిపోయేవారు ముగ్గురూ.
"అంతకన్నా కూడా ముఖ్యమైన విషయం. ఒక్కసారి రాగలవా?" కొంచెం తేడాగా అనిపించింది అయన గొంతు.
"ఏంటంకుల్, ఏ విషయం గురించి?" కుర్చీలో నిఠారుగా అయిపొయింది సమీర.
"నువ్వు నిరుపమ సూసైడ్ చేసుకున్న విషయం గురించి ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పావు కదా, ఆ విషయం గురించి."
"ఆ విషయం గురించి ఏదైనా మీరెలా చెప్పగలరు అంకుల్, నాకు అర్ధం కావడం లేదు." కుర్చీలోనుంచి లేచి నిలబడింది సమీర. "కొంచెం వివరంగా చెప్తారా?"
"చాలా వివరంగా చెప్తాను. కానీ ఫోన్ లో కాదు. నువ్విక్కడకి రావాల్సిందే." అయన స్వరం ఏ కాంప్రమైజ్ లేకుండా వుంది.
"ఐ షల్ బి దేర్ జస్ట్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంకుల్." ఫోన్ కట్ చేసింది సమీర. ఆ తరువాత ఆ ఇంట్లోనుండి బయటపడి మురళి ఇంటికి చేరుకోవడానికి ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్ట లేదు.
&&&
"యు ఆర్ అప్ టు యువర్ వర్డ్ సమీ. జస్ట్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో వచ్చేసావు." నవ్వుతూ అన్నాడు మురళి.
సమీర వెళ్ళేటప్పటికి అయన ఒక్కడే ఇంట్లో వున్నడు. తక్కిన ఫామిలీ అంతా ఎదో పనిమీద బయటికి వెళ్లారు.
"విషయం అలాంటిది కదా." హాలులో ఆయనకి దగ్గరగా ఇంకో కుర్చీ ఈడ్చుకుని అందులో కూలబడుతూ అంది సమీర. "నిరుపమ సూసైడ్ కి సంబంధించిన ఏ విషయం అయినా సరే నన్ను చాలా ఎగ్జైట్ చేస్తుంది."
"నీ ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ కానివ్వను. ఈ బుక్ లో నేను ఫోల్డ్ చేసిన పేపర్ ఓపెన్ చేసి చూడు." అప్పటికే తన చేతిలో వున్న బుక్ సమీర చేతిలో పెడుతూ అన్నాడు మురళి.
"సిడ్నీ షెల్డన్ ‘టెల్ మీ యువర్ డ్రీమ్స్’" ఆ బుక్ తీసుకుంటూ అంది సమీర. "నాకు నిరూకి కూడా ఫేవరెట్ బుక్ ఇది. చాలా సార్లు మీ దగ్గర తీసుకుని చదివాం. మీరు మమ్మల్నే ఉంచేసుకోమని సజెస్ట్ చేసారు. కానీ ఎప్పటికప్పుడు మీకు తిరిగి ఇచ్చేశాం." సమీర నవ్వుతూ అంది కానీ ఆమె గుండెల్లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగింది. బుక్ లో పేపర్ ఫోల్డ్ చేసి ఉన్న చోట ఓపెన్ చేసి తెరవడం పెద్దగా కష్టం కాలేదు.
"అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో ఏమి రాసి వుందో ఒకసారి చూడు."
ఎప్పుడైతే అయన ఆలా అన్నాడో ఇమ్మీడియేట్ గా అక్కడ చూసింది సమీర. చిన్న అక్షరాలతోటే అయినా బ్లాక్ ఇన్క్ తో ఇంగ్లిష్ లో చాలా స్పష్టంగా రాసి వుంది అక్కడ.
"ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్."
అనుకోకుండానే అక్కడ రాసివున్నది బయటకి చదివింది సమీర.
"ఈ బుక్ చదివింది కేవలం మనం ముగ్గురం మాత్రమే. నేనది రాయలేదు. ఒకవేళ ఆ రాసింది నువ్వు కూడా కాకపోతే, ఖచ్చితంగా అది నిరుపమే."
"నో అంకుల్. ఇది రాసింది నేను కాదు. ఇలాగ రాయాల్సిన అవసరమేమీ నాకు లేదు. అంతేకాకుండా నా కళ్ళు పీకేసుకోవాలని నేనెందుకు కోరుకుంటాను?" చిన్నగా వణుకుతూ వున్న గొంతుతో అంది సమీర. "కానీ నిరుపమ కి మాత్రం అటువంటి అవసరం ఏముంది?"
"ఆమె మోహంలో మెయిన్ అట్రాక్షన్ ఆమె కళ్ళు. ఆమె మొత్తం ఇంటలిజెన్స్ అంతా ఆ కళ్ళల్లోనే కనిపిస్తూ ఉండేది. అలాంటిది తన కళ్ళు ఎందుకు పీకేసుకోవాలనిపించింది తనకి?" కుర్చీలో వెనక్కి జారగిలబడి ముడిపడిన నొసలుతో అడిగాడు మురళి.
"ఏమో అంకుల్, నాకూ అదే అంతుపట్టడం లేదు. తను తన కళ్ళు పీకేసుకోవాలనుకోవడం ఏమిటి? అసలు అర్ధం కావడం లేదు." అయోమయంగా అంది సమీర.
"తనకేమైనా ఐ డిసీజ్ వుందా? బాధని భరించలేక ఆలా ఎక్ష్ప్రెస్స్ చేసిందా?"
"తన లైఫ్ లో తనకి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. స్పెక్ట్స్ కూడా లేకుండా ఎంతో స్పష్టంగా చూడ గలిగేది, చదవగలిగేది. నో అంకుల్ ఏదో డిసీజ్ వల్ల ఆలా ఎక్ష్ప్రెస్స్ చెయ్య లేదు. ఒకవేళ తనేమైనా డిసీజ్ తో సఫర్ అవుతూ వుండివుంటే కచ్చితంగా నాకు చెప్పి ఉండేది."
"యు ఆర్ అబ్సల్యూటెలీ రైట్. నేను ఒప్పుకుంటాను." తలూపుతూ అన్నాడు మురళి. "ఇందులో మనం అర్ధం చేసుకోలేని విషయం ఏదో వుంది."
"యు ఆర్ రైట్ అంకుల్." కుర్చీలోనుంచి లేచి నిలబడింది సమీర. "ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ బుక్ నేను తీసుకెళ్లొచ్చా?"
"బై అల్ మీన్స్. నేనెప్పుడో చెప్పాను. ఈ పుస్తకం మీరే వుంచుకోండని." మురళి కూడా కుర్చీలోనుంచి లేచాడు.
"ఎనీహౌ థాంక్ యు వెరీ మచ్ అంకుల్, నాకు ఈ విషయం గురించి చెప్పినందుకు." గ్రేట్ఫుల్ గా చూసింది సమీర అయన మొహంలోకి.
"మీకులాగే ఆ బుక్ అంటే నాకూ చాలా ఇంటరెస్ట్. ఎందుకో మళ్ళీ చదవాలనిపించి తీసాను ఈ రోజు. ఆలా పేజెస్ ఫ్లిప్ చేస్తుంటే సడన్గా కనిపించింది. నువ్వు చెప్పిన విషయం గుర్తు వచ్చింది, వెంటనే నీకు ఇన్ఫర్మ్ చేశాను."
మరోసారి థాంక్స్ చెప్పడానికి నోరు తెరవబోయింది సమీర.
"నువ్వని సార్లు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను కొత్త బుక్స్ తెచ్చినప్పుడల్లా నీకు చెప్తాను, నువ్వొచ్చి పట్టుకెళ్లి చదువు. అలాగే కుదిరినప్పుడల్లా నా దగ్గరకి వచ్చి డిస్కస్ చెయ్యి చాలు. నాతో డిస్కస్ చేసే వాళ్ళు ఎవరూ లేక నాకు చాలా బోర్ గా వుంది."
"ఒకే అంకుల్. బై." ఆలా చెప్పి అక్కడనుండి బయట పడింది సమీర.
ఆ ఇంటి నుండి బయటకి రాగానే స్మరన్ కి ఫోన్ చేసి చూసింది సమీర. అయన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. మేనక కి ఫోన్ చేసింది వెంటనే.
"మీ అంకుల్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. అయన ఇప్పుడు ఆఫీసులో అవైలబుల్ అవుతారా?" మేనక ఫోన్ తియ్యగానే పలకరింపులు అయ్యాక అడిగింది సమీర.
"వేరే చోట ఏదో అర్జెంటు మీటింగ్లో వున్నరు. ఈరోజంతా అవైలబుల్ కాననే చెప్పారు. ఏమిటి విషయం?" మేనక అడిగింది.
కొంచం డిజప్పోయింటెడ్ గా అనిపించింది సమీర కి. ఎందుకో అలాగైనా స్మరన్ ని కలుసుకుని మాట్లాడాలని అనిపించింది. తనకి ఈ మధ్య ఎందుకో తరచూ ఆయన్ని కలవాలనిపిస్తూంది.
"నిరుపమ సూసైడ్ విషయంలో ఫ్రెష్ డెవలప్మెంట్. డిస్కస్ చెయ్యాలి."
"తిన్నగా నా దగ్గరికి వచ్చేసెయ్. మనం డిస్కస్ చేసి అనలైజ్ చేద్దాం. డిటెక్షన్ విషయంలో మా అంకుల్ అంత కాకపోయినా నేను కూడా కాపబుల్." మేనక నవ్వుతూ అంది.
&&&
రంగనాథ్ ఇంటికి వెళ్ళగానే, హాలులో కూర్చుని వున్న నిర్మలని, రంగనాథ్ ని పలకరించి స్ట్రెయిట్ గా మేనక రూంలోకి వచ్చేసింది సమీర. ఆ రూంలోకి వెళ్ళగానే తన చేతిలో వున్న ‘టెల్ మీ యువర్ డ్రీమ్స్’ బుక్ ని మేనక చేతిలో పెట్టి "ఈ పుస్తకం నాకు ఇంకా నిరుపమకి కూడా చాలా ఇంటరెస్టింగ్ అయిన బుక్." అంది. తరువాత మేనక పక్కనే బెడ్ మీద బాసిపట్టు వేసుకుని సెటిల్ అయింది.
"టెల్ మీ యువర్ డ్రీమ్స్. ఇది నాకు కూడా చాలా ఇంటరెస్టింగ్ బుక్. ఇందులో ముల్టీపుల్ పర్సనాలిటీ డిసార్డర్ గురించి ఉంటుంది. ఏజ్ సైకాలజీ స్టూడెండ్స్ నువ్వూ, నిరుపమ ఈ బుక్ మీద ఇంటరెస్ట్ చూపించడం లో ఆశ్చర్యం లేదు." తన చేతిలో వున్న ఆ బుక్ ని చూస్తూ అంది మేనక. "ఎనీహౌ నిరుపమ ఏమైనా ముల్టీపుల్ పర్సనాలిటీ డిసార్డర్ తో గాని, స్ప్లిట్ పర్సనాలిటీ తో గని సఫర్ అవుతూ ఉండేదా? వేరే పెర్సనాలిటీగా మారినప్పుడు ఆలా సూసైడ్ చేసుకుందా?"
"నీ ఇమాజినేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఆ బుక్ లో ఒక పేజీ ఫోల్డ్ చేసివుంది. ఆ పేజీ టాప్ లో చూడు." సమీర అంది.
సమీర చెప్పినట్టుగా చేసింది మేనక "ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్." అది చదవగానే నిఠారుగా అయిపోయింది. "వాట్'స్ ద బ్లడీ హెల్ ఈజ్ దిస్? తను తన కళ్ళు పీకేసుకోవాలని కోరికపడడమేమిటి?" భృకుటి ముడతలు పడిపోయింది మేనకకి.
"అదే నాకూ అర్ధం కావడం లేదు. ఎవరైనా అసలు ఎందుకు వాళ్ళ కళ్ళు పీకేసుకోవాలనుకుంటారు?" సమీర కూడా ఆశ్చర్యపడుతూ అంది.
"ఈ నిరుపమ మనకి క్లూస్ కాదు పజిల్స్ ఇస్తూంది." బెడ్ మీద నుంచి కిందకి దిగింది మేనక. " 'ఈ ఫీలింగ్ ని నేను భరించలేక పోతున్నాను' తరువాత ఇది. ఏమిటిది? మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ మానేస్తామని తన అభిప్రాయమా?"
"ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి చాలా రోజుల ముందు తనిలా ఎక్ష్ప్రెస్స్ చేసింది. అప్పటికి తను సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో కూడా వుండివుండదు. తను సూసైడ్ చేసుకుంటానని, ఇంకా ఇలా ఒక ఇన్వెస్టిగేషన్ తన సూసైడ్ సంబంధించి స్టార్ట్ అవుతుందని కూడా తను ఊహించి ఉండదు." సమీర కూడా బెడ్ మీద నుంచి కిందకి దిగింది. "నో మేనకా. తన ఇంటర్నల్ స్ట్రగుల్ ని ఎంతో కొంత ఇలా ఎక్ష్ప్రెస్స్ చెయ్యకుండా తను ఉండలేకపోయింది. నా అభిప్రాయంలో 'నేను ఈ ఫీలింగ్ ని భరించలేకపోతున్నాను' ఇంకా ఇప్పుడు ఇది 'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' తనలో జరిగిన ఎక్స్ట్రీమ్ సంఘర్షణకి క్లూస్. రెండిటికి ఇంటర్ కనెక్షన్ వుంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి."
"యు ఆర్ రైట్. నువ్విప్పుడు నిజంగా నాకన్నా బెటర్ గా ఆలోచించావు." నవ్వుతూ అంది మేనక. "కానీ నాకు మనిద్దరి బుర్రలు సరిపోవనుకుంటా. ఈ విషయం మా అంకుల్ కి చెప్తే ఆయనేం అంటాడో చూద్దాం."
"నువ్వు చెప్పింది నిజమే. రెండు స్పష్టమైన క్లూస్ దొరికినా అవి నిరుపమ సూసైడ్ కి ఎలా రిలేట్ అవుతాయో అర్ధం కావడం లేదు. మన బుర్రలు బాగా హీట్ ఎక్కించుకోవడంకన్నా ఈ విషయం మీ అంకుల్ తో డిస్కస్ చెయ్యడమే మంచిది. కానీ అయన రేపు మార్నింగ్ వరకూ అవైలబుల్ కాడు అంటున్నావుగా." నిరుత్సాహంగా అంది సమీర.
"వెయిట్ చేద్దాం. ఈలోగా సబ్ కాంషస్ గా మనకేమైనా తట్టొచ్చు కూడా." మేనక ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె సెల్ ఫోన్ మోగింది. "మామ్ ఫోన్ చేస్తూంది." ఆ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని అటెండ్ చేసింది మేనక.
"ఏమిటి, నువ్వు ఇంటికి వచ్చేసావా? నువ్వు నైట్ టెన్ వరకు రావడం అవ్వదన్నావని నేను రాలేదు." మేనక అంది బెడ్ కి దగ్గరలో గోడకి జరగిలా బడి. మేనక మాట్లాడుతూ ఉంటే సమీర నవ్వుతూ చూస్తూంది.
"మామ్, ఐ మీన్ ఇట్. పెళ్లి చేసుకోవడానికి నాకు ఇప్పుడు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ డాక్టర్ సంబంధం వద్దు. వాడెంత గొప్ప డాక్టర్ అయినా నాకు భుజాల వరకే వస్తాడనిపిస్తూంది. ఇంజనీర్, టీచర్, ఎవరన్నా పర్లేదు. నా అంత హైట్ వుండి, కాస్త హ్యాండ్సమ్ గా ఉంటే చాలు. ఐ యాం రెడీ టు మేరీ."
సమీర మొహంలోకి నవ్వుతూ చూస్తూ తల్లి చెప్పింది వింటోంది మేనక. "చెప్పాగా. నాకు గొంతెమ్మ కోరికలేమి లేవు. పెద్ద ఆఫీసర్ అయి ఉండాలని, బోలెడంత ఆస్థి ఉండాలని కూడా నాకేమి లేదు. కాస్త బాగా వుండి, నన్ను కొంచెం చక్కగా చూసుకోగలిగితే చాలు. ఐ మీన్ ఇట్. ఒక్క సంబంధం అలాంటిది చూడు. నేను వేరే ఏమి మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను. బట్ యు హేవ్ టు రిమెంబర్ యువర్ ప్రామిస్ ఆల్సో." ఆమె తల్లి చెప్పింది విన్నాక మళ్ళీ అంది మేనక.
"ఒకే మామ్. ఇక్కడంతా బాగానే వుంది. ఐ యాం హ్యాపీ హియర్. అంకుల్ తో రెగ్యులర్ టచ్ లో వున్నను. నీతోనూ అలాగే వుంటాను. బాగా ఈవెనింగ్ అయిపొయింది కాబట్టి ఈరోజుకి ఇంక నన్ను ఎక్స్పెక్ట్ చెయ్యకు. బై." ఫోన్ పెట్టిసి, సమీర మొహంలోకి చూసి గల గలా నవ్వింది మేనక. "మామ్ ఈజ్ వెరీ మచ్ పెర్సిస్టెంట్ టు పెరఫార్మ్ మై మారెజ్."
"ఆఖరికి అమ్మప్రేమ జయించిందన్న మాట. నువ్వూ ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయాన్ని మార్చుకున్నావు కదా." సమీర నవ్వి అంది.
సమీరకి దగ్గరగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది మేనక. "నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వి కదా. నేను నా హార్ట్ నీ ముందు ఓపెన్ చేస్తే నువ్వేం అనుకోవు కదా."
"క్లోజ్ ఫ్రెండ్స్ వాట్ ఫర్?" సమీర అంది ఆశ్చర్యంగా చూస్తూ. "ఐ ఫీల్ ఇట్ లైక్ ఏ ప్రివిలేజ్. ప్లీజ్ డు దట్."
"ఒకే" సమీర భుజం మీదనుంచి చెయ్యి తీసేసి బెడ్ మీద సమీరకి అపోజిట్ గా వచ్చింది మేనక. "నా పెళ్లి చేసుకోవాల్సిన నిర్ణయానికి మా మామ్ కారణం కాదు."
"మరి...." ఆశ్చర్యంగా అడిగింది సమీర.
"నాలో సెక్సువల్ ధాట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వళ్ళంతా తహ తహ లాడుతూంది. నిజానికి ఎవరైనా ఫరవాలేదనిపిస్తూంది." మేనక దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ అంది "అందుకే ఎవర్నో ఒకర్ని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పెళ్లి చేసేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసాను."
"నువ్వు చెప్పదలుచుకున్నది ఇంతేనా?" చిరునవ్వుతో అడిగింది సమీర.
"నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వి కాబట్టి ఇలా ఓపెన్ అయ్యాను. ఈజ్ దేర్ ఎనీ థింగ్ రాంగ్ విత్ మీ? యామ్ ఐ టర్నింగ్ టు బి ఏ నింఫోమేనియాక్?" నొసలు చిట్లించి విచారంగా అడిగింది సమీర.
"నో ఛాన్స్ ఎటాల్." అందంగా నవ్వింది సమీర. "ఈ వయస్సులో సెక్సువల్ ధాట్స్, ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ కోసం తహ తహ లాడడం చాలా నాచురల్ కదా. ఒకవేళ ఆలా కాకపోతేనే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు."
"రియల్లీ యు డు మీన్ ఇట్? నిజంగా అంతేనంటావా?" ఇంకా సమీర మొహంలోకే సూటిగా చూస్తూ అడిగింది మేనక.
"నువ్వొకసారి అడిగితే నేను చెప్పాను. నేను నా స్టడీస్ విషయంలో సీరియస్ గా లేనని, మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసేసుకుంటానని. ఎందుకలా అన్నననుకున్నావు?" తను చెప్పబోయేది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి మళ్ళీ అంది సమీర. "నీలాగే నేనూ ఫీల్ అవుతున్నాను. నీలాగే నాకూ ఆ ఎక్స్పీరియన్స్ కోసం తహ తహ గానే వుంది. అందుకనే అలంటి నిర్ణయానికి వచ్చాను."
"ఓహ్, ఐ యామ్ హ్యాపీ నౌ." సమీర భుజం చుట్టూ చెయ్యి వేసి, ఆమె కుడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూ అంది మేనక. "నువ్వు మరోసారి ఇలా చేశావంటే మనిద్దరం లెస్బియన్స్ అయిపోతామేమోనని భయంగా వుంది. కొంచెం దూరంగా వుండు." మేనకని దూరంగా నెడుతూ అంది సమీర. "ఈ వయసులో మనం పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ కాకపోతే ఆ అర్జ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే మనం ఇమ్మొరల్ వేస్ ఫాలో అవ్వడానికి కూడా కంపెల్ చేస్తుంది."
"నేనప్పుడప్పుడు పడుతూన్న టార్చర్ తల్చుకుంటూంటే నువ్వు చెప్పింది హండ్రడ్ పెర్సన్ట్ నిజమే అనిపిస్తూంది" మేనక అంది.
"ఎనీ హౌ మనం ఇద్దరం ఎలాగూ పెళ్ళికి ప్రిపేర్ అయి వున్నాం కాబట్టి ఎలాంటి ఇమ్మొరల్ వేస్ ఫాలో అవ్వొద్దు మన తహ తహ తీర్చుకోవడానికి." సమీర అంది.
"డబల్ స్యూర్. యు నో వన్ థింగ్, నాకు ఒక్కళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్ లేరు, వుండరు కూడా. నాకు కిస్ చేస్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు." మేనక అంది.
"అదంతా తెలుసుకునే అవకాశం నీకు త్వరలోనే రావాలని నా కోరిక." నవ్వింది సమీర "ఎనీహౌ నిరుపమ, నేనూ కూడా అచ్చం అంతే. మాకిద్దరికి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మనిద్దరిలాగే ఇలాంటి విషయాలు ఎన్నో షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం."
"ఐ సీ." తలూపింది మేనక. నిరుపమ ప్రస్తావన రావడంతోనే అక్కడ వాతావరణం మళ్ళీ బరువెక్కింది.
"ఎనీ హౌ, మీ అంకుల్ విషయం ఏమిటి? తనింక మరి పెళ్లి చేసుకోడా?" వాతావరణం తేలిక పర్చడానికి అన్నట్టుగా అడిగింది సమీర.
"తనకిప్పుడు నలభై ఎనిమిది, ఈ వయసులో తనకి మళ్ళీ పెళ్లి ఏమిటి?" నవ్వింది మేనక.
"యాభై దాటిన తరువాత కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు వున్నారు కదా."
"నో ఛాన్స్. పెళ్లి చేసుకునే మాటే అయితే ఎప్పుడో చేసుకుని ఉండేవాడు. ఎప్పుడూ అయన ఆ వూహ కూడా రానివ్వలేదు." సడన్గా ముడిపడిపోయింది మేనక భృకుటి. "ఈ విషయం నేను ఇంతకు ముందే నీకు చెప్పాను. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు?" అనుమానంగా అడిగింది.
"మే ఐ ఆల్సో ఓపెన్ మై హార్ట్ ఏజ్ మచ్ ఓపెన్లీ ఏజ్ యు డిడ్?"
"ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఐ యామ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, జస్ట్ డు సో."
"మొదటిసారి ఆయన్ని చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యాను. తరవాత తరవాత కేవలం ఆలోచనలు, ఊహలతోటే బాగా అట్ట్రాక్ట్ అయ్యాను కూడా. ఇది లవ్ అని నేనూ అనను, కానీ అయన లైఫ్ పార్టనర్ ని అయితే బావుంటుందనిపిస్తూంది." అంది సమీర.
"మై గాడ్!" బెడ్ మీదనుంచి కిందకి దిగేసింది మేనక. "మా అంకుల్ ఒప్పుకోవడం మాట ఆలా వుంచు. అసలు మీ ఇద్దరికీ వున్న ఏజ్ డిఫరెన్స్ గురించి ఏమైనా ఆలోచించావా? మోర్ దెన్ డబల్! నీకు ట్వంటీ వన్ అయితే ఆయనకి ఫార్టీ ఎయిట్!"
"అంతకన్నా పెద్ద ఏజ్ డిఫరెన్స్ తోటే భార్య భర్తలు అయిన వాళ్ళు వున్నారు కదా."
"డోంట్ లాస్ యువర్ మైండ్. ఒక సైకాలజీ స్టూడెంట్ గా ఇన్ఫాట్యుయేషన్ గురించి నీకు నేను చెప్పక్కర్లేదు. దిసీజ్ జస్ట్ దట్." ధృడంగా అంది మేనక.
"బట్ ....." ఇంకా ఏదో చెప్పబోయింది సమీర.
"దిస్ ఈజ్ సంథింగ్ ఇంపాజిబుల్ టు హేపెన్" మరొకసారి సమీరకి అపోజిట్ లో కూచుని ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి అంది మేనక. "ఫస్ట్ థింగ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎప్పటికి ఆయనతో నీ మ్యారేజ్ కి ఒప్పుకోరు. నెక్స్ట్ థింగ్ నువ్వు మీ వాళ్ళని ఒకవేళ ఒప్పించ గలిగిన మా అంకుల్ ఒప్పుకునే అవకాశమే లేదు. నీ మైండ్లో ఇమ్మీడియేట్ గా చేంజ్ తెచ్చుకో."
"అంతేనంటావా?" మేనక మొహంలోకి విచారంగా చూస్తూ అంది సమీర
"హౌ ఐరానికాల్! ఒక సైకాలజీ స్టూడెంట్ కి నేనిలా ఎక్ష్ప్లైన్ చెయ్యాల్సి వస్తూంది. అది లవ్వు కాదని నువ్వే చెప్పావు. లవ్వు కాకపోతే మరేమిటి? ఇన్ఫాట్యుయేషన్ ఎంత కాలం ఉంటుంది? యూజ్ యువర్ మైండ్ అండ్ బి రీజనబుల్."
"యు ఆర్ రైట్. ఇట్ సీమ్స్ ఐ రియలైజెడ్ మై మిస్టేక్." సడన్గా ఏదో రియలైజేషన్ వచ్చినట్టుగా అంది సమీర.
మేనక చెప్పిన మాటలు నిజం అనిపించినా, స్మరన్ మీద అట్రాక్షన్ తొలగించుకోవడం కష్టంగానే వుంది సమీరకి. కష్టంగానే వున్నా అలా చెయ్యక తప్పదన్న నిర్ణయానికి వచ్చేసింది.
&&&
"ఇది తన హ్యాండ్ రైటింగ్ అని నువ్వు స్యూరా?" ఆ సెంటెన్స్ ని బుక్ లో చూస్తూ అడిగాడు స్మరన్ ఆ బుక్ లో అది చూపించి, సమీర మొత్తం అంతా ఆయనకి క్లియర్ గా ఎక్ష్ప్లైన్ చేసాక.
"అఫ్ కోర్స్, హండ్రెడ్ పర్శంట్" సమీర అంది. "అంతే కాదు సర్. నేనారోజు డాక్టర్ దగ్గరినుంచి ఇంటికి వచ్చి బెడ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు, తను ఈ బుక్కే చదువుతూ వుంది. హండ్రెడ్ పర్శంట్ ఆరోజే ఈ సెంటెన్స్ అక్కడ రాసింది. నేను మామూలుగా ఈ బుక్ ఆ మురళి గారికి ఇచ్చేసాను."
ముందు అనుకున్న ప్రకారంగానే ఆ మర్నాడు ఉదయం పదిగంటలకు మేనక ఇంకా సమీర కలిసి స్మరన్ దగ్గరికి వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ అయన ముందే కూచుని మాట్లాడుతూ వున్నారు.
"తను ఆ గోడ మీద ఆ సెంటెన్స్, ఇంకా ఈ బుక్ లో ఈ సెంటెన్స్ రెండూ వ్రాయడం ఆ రోజే అప్పుడు తను మీ ఇంట్లో వున్నప్పుడే జరిగినవి." సాలోచనగా అన్నాడు స్మరన్.
"ఖచ్చితంగా. ఆ తరువాత సూసైడ్ చేసుకునే లోపు మళ్ళీ తను మా ఇంటికి వచ్చిందే లేదు." సమీర అంది.
"నా అభిప్రాయంలో...." కుర్చీలో వెనక్కి వాలి అన్నాడు స్మరన్. "ఆమెని అంతగా కలత పరిచిన సంఘటన ఏదయితో వుందో అది అదే రోజు జరిగింది."
"నాక్కూడా అదే అనిపిస్తూంది. ఆ తరువాత పెదిహేను రోజులకి సూసైడ్ చేసుకుంది. అది అంత కలత పరిచే సంఘటనే అయితే వెంటనే ఎందుకు సూసైడ్ చేసుకోలేదు."
"ఆ సంఘటన ఏదయితో వుందో అది ఆ అమ్మాయికి సంబంధించినంత వరకూ చాలా ముఖ్యమైనది. తనని చాలా అప్సెట్ చేసింది. కానీ ......" ముందుకు వంగి తన రెండు చేతులు మధ్యలో వున్న బల్ల మీద బాలన్స్ చేసుకున్నాడు స్మరన్. ".....సూసైడ్ చేసుకోవాలన్నంతగా తనని ప్రేరేపించింది కేవలం తరువాత మాత్రమే. అదీ ఒక సడన్ మూమెంట్లో, ఇంపల్సివ్ గా."
"మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్ధం కాలేదు." అయోమయం గా అంది సమీర.
"ఆ సంఘటన లేదా ఆ కొత్తగా తెలిసిన విషయమో ఆమెని చాలా బాధ పెట్టింది. చాలా రోజులు భరించలేక పోయింది. పరిష్కారం గురించి ఆలోచిస్తే సూసైడ్ మాత్రమే పరిష్కారం అనిపించింది. తను సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నది మాత్రం ఇంపల్సివ్ అండ్ సడన్. నిజానికి ఆమె ఆ సమస్య ఎవరితోనైనా షేర్ చేసుకుని వుండివుంటే, కొంచెం కౌన్సిలింగ్ జరిగి ఉంటే తను సూసైడ్ చేసుకుని ఉండేదే కాదు." స్మరన్ అన్నాడు.
"మై గాడ్! మీరు చెప్పింది వింటూవుంటే నాకూ ఇంకా బాధగా వుంది. కానీ ....." స్మరన్ మొహంలోకి సూటిగా చూసింది సమీర. "అదెంతో ఇంపార్టెంట్ విషయం అయివుంటుందంటున్నారు. తన జీవితాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటున్నారు. మళ్ళీ అది తానెవరితోనైనా షేర్ చేసుకుని కౌన్సిలింగ్ జరిగివుంటే తను సూసైడ్ చేసుకుని ఉండేది కాదంటున్నారు. ఇదెలా సాధ్యం?"
"ప్రస్తుతానికి నేనలా ఫీలవుతున్నా. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ విషయం తెలుసుకుంటే తప్ప నేనూ ఏమీ చెప్పలేను." మరొకసారి కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు స్మరన్
సమీర, మేనక మొహామొహాలు చూసుకున్నారు కానీ ఏమి మాట్లాడలేదు.
"నేను రెగ్యులర్ గా చేసే ఇన్వెస్టిగేషన్స్ తో పోలిస్తే ఇది చాలా చిన్న ఇన్వెస్టిగేషన్. నేనిచ్చిన గడువు పూర్తి కావడానికి ఇంకా పది రోజులు టైం వుంది. ఐ థింక్ వుయ్ కెన్ గెట్ సమ్ మోర్ క్లూస్ ఇన్ బిట్వీన్ అండ్ సాల్వ్ ది మిస్టరీ బై దెన్." స్మరన్ అన్నాడు.
"ఎనీ పర్టికులర్ డైరెక్షన్స్ ఫర్ మీ?" మేనక అడిగింది.
"ఓపెన్ యువర్ అయిస్ అండ్ యూజ్ యువర్ మైండ్. రిపోర్ట్ టు మీ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్." స్మరన్ అన్నాడు.
"ఆల్రైట్ అంకుల్." మేనక నవ్వింది. "ఇంకా మెం వెళ్లి రావచ్చా?"
"అలాగే వెళ్లి రండి." స్మరన్ తలూపాడు.
మేనక సమీర మొహంలోకి చూసాక ఇంక తప్పదన్నట్టుగా "వస్తాం సర్" అని లేచింది సమీర.
"నీ వ్యవహారం చూస్తూ ఉంటే నీకక్కడే ఉండిపోవాలనిపిస్తూన్నట్టుగా వుంది." బయటికి వచ్చాక సమీర మొహంలోకి చూస్తూ అంది మేనక.
"ఐ వాంట్ టు బి ఫ్రాంక్ విత్ యు మనూ." సడన్గా ఆగింది సమీర. "నేను నా మనసుకి చెప్తున్నాను. ఇది చాల అబ్సర్డ్ అని. కానీ వినటం లేదు." విచారంగా అంది.
"అదే ఇన్ఫాట్యుయేషన్ అంటే. భయంలేదులే, బయటకి వచ్చేస్తావు." నవ్వుతూ అని నడవడం మొదలుపెట్టింది మేనక.
"ఇన్ఫాట్యుయేషన్ ఫీల్ అవ్వడానికి నేనేమన్నా టీనేజర్నా? నువ్వు నా విషయం సీరియస్ గా తీసుకోవడం లేదు." కోపంగా అంది సమీర.
"సీరియస్ గా ఆలోచించాల్సింది నువ్వు. నేను కాదు." మేనక ఆగి సమీర మొహంలోకి చూసింది. "యు ఆర్ గోయింగ్ టు బి ఏ సైకాలాజిస్ట్ సూన్. ఒక ఆర్డినరీ ఆడపిల్లలా ఆలోచించకు. బాగా ఆలోచించిన తరువాత కూడా నీది లవ్ అని నీకనిపిస్తే అది నా అంకుల్ కి ఎక్ష్ప్రెస్స్ చెయ్యి. ఆ తర్వాత అది మీ ఇద్దరి హెడేక్." తర్వాత అక్కడినుండి వేగంగా నడిచింది మేనక.
&&&
"రేయ్. నువ్వు ఇలా రా రా." తన ఎదురింటి ముందు నిలబడి తనవైపే తదేకంగా చూస్తూన్న కుర్రాడిని చూస్తూ కోపంగా పిలిచింది మేనక. సాయంత్రం ఐదు అవుతూంది. ఇంట్లోనే వుండి, వుండి బోర్ కొట్టి ఇంటిముందు హాల్లో కుర్చీ వేసుకుని కూచుంది మేనక. తను కూచున్న దగ్గరనుండి ఇంటిముందు నిలబడి తనని అలాగే చూస్తూ వున్నాడు వాడు.
"ఏంట్రా, నువ్వు నాకు బీట్ కొడుతున్నావా? నీ వయసేమిటి, నా వయసేమిటి, రాస్కేల్." పిలవగానే ఏ జంకు లేకుండా దగ్గరికి వచ్చిన వాడిని చూస్తూ అంది.
"నువ్వు నిరుపమక్కకి ఎమన్నా రెలాటివా?" మేనక అన్నది విననట్టుగానే అన్నాడు వాడు.
"కాదురా, రెలెటివ్ ని కాదు." కాదన్నట్టుగా తలూపింది మేనక. "వేరే కారణం వల్ల ఇక్కడ ఉంటున్నాను." వాడేమి భయపడకుండా అడగడం ఆశ్చర్యంగా వుంది మేనకకి.
"నిన్ను చూస్తూ ఉంటే నాకు నిరుపమ అక్కని చూసినట్టుగానే అనిపిస్తూంది. అందుకనే చూసాను. వేరే ఉద్దేశం లేదు." వాడు అన్నాడు.
"సారీ రా. ఎక్ష్ట్రీమ్లీ సారీ." కుర్చీలోనుంచి లేచి వాడి కుడి భుజం మీద చెయ్యి వేసి కళ్ళల్లోకి చూస్తూ అంది మేనక. "పూర్తిగా అపార్ధం చేసుకున్నాను."
"పర్లేదక్కా. నేను వెళ్ళొస్తాను." అక్కడి నుంచి వెళ్ళబోయాడు వాడు.
"వన్ మినిట్ రా." మేనక అనగానే వాడు ఆగి ఆమె మొహంలోకి చూసాడు. "నిరుపమ నీకు బాగా తెలుసా?"
"ఆలా అడుగుతావేమిటక్కా?" వాడు దగ్గరగా వచ్చి అన్నాడు. "మా రెండు కుటుంబాలు ఎదురు ఎదురు గా చాలా సంవత్సరాలుగా వున్నయి. నా చిన్నప్పటి నుండి తను నాకు తెలుసు. నాకు స్వంత అక్క కన్నా ఎక్కువ."
"ఆలా అయితే నేనిక్కడ ఎందుకున్నానో నీకు చెప్పడం చాలా అవసరం." అంటూ అక్కడ తనెందుకుండాల్సివచ్చిందో అంతా వివరంగా చెప్పింది మేనక. "నా ఇన్వెస్టిగేషన్ కి పనికొచ్చే విషయం నీ దగ్గర ఏదన్నాఉంటే నాకు చెప్పారా." అంది చివర్లో.
"నేను బాగా ఆలోచిస్తే కానీ ఏమి చెప్పలేను." సాలోచనగా అన్నాడు వాడు. "ఎనీహౌ మా ఇంట్లోకి వస్తావా, అక్కడ కూచుని మాట్లాడుకుందాం. ప్రస్తుతం మా ఇంట్లో ఎవరూ లేరు. నేను ఇల్లు వదిలేసి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నానంటే మా మామ్ కి కోపం వస్తుంది."
"సరే లేరా అయితే. పద." అంది మేనక.
&&&
"నా పేరు ఆనంద్ . టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మా డాడీ లేరు. మా అమ్మ నేను చదివే స్కూల్ లోనే సైన్స్ టీచర్ గా చేస్తున్నారు. మేం నెల రోజులు కిందట వూరెళ్ళాం. నా గ్రాండ్ పా కి, అదే మా మామ్ డాడ్ కి బాగా సీరియస్ చేసింది. అందుకని వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడాయన బాగానే వున్నారు. ఈరోజు మార్నింగ్ వచ్చాం."
ఇద్దరూ ఆ ఇంటి వరండాలో వున్న రెండు కుర్చీల్లో కూర్చున్నాక చెప్పాడు ఆనంద్. ఆ కుర్చీలకి దగ్గరలో ఒక చిన్న టేబుల్, దాని మీద ఆనంద్ చదువుకునే పుస్తకాలూ వున్నయి.
"ఐ సీ" సాలోచనగా తలూపింది మేనక.
"నాకు ఇక్కడ కూచుని చదువుకోవడమే అలవాటు. ఏ రోజూ నిరుపమ నన్ను పలకరించకుండా కాలేజీ కి వెళ్ళింది లేదు. నేనెప్పుడు ఇక్కడ కూచున్నా తాను వచ్చి నన్ను పలకరిస్తున్నట్టుగానే ఉంటుంది." సడన్గా కారుతున్న కన్నీళ్ళని ఆపుకో లేక పోయాడు ఆనంద్ . "నేనెప్పటికీ తనని మర్చిపోలేను."
"నాకర్ధం అవుతూందిరా." వాడికి కుర్చీ దగ్గరగా లాక్కుని మరోసారి వాడి కుడి భుజం మీద చెయ్యి వేసి అంది మేనక. "కానీ మనం ఫాక్ట్స్ యాక్సప్ట్ చేసే తీరాలి. వేరే దారి లేదు."
"ఐ నో ఇట్ అక్కా." కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆనంద్ . " తనెందుకు సైకాలజీ చదవాలనుకుందో నాకు తెలియదు. కానీ తను మాథ్స్ లో జీనియస్. నాకు మాథ్స్ లో వచ్చే డౌట్స్ అన్ని యిట్టె సాల్వ్ చేసిపెట్టేది. నాకెలా చదువుకోవాలో, ఎలా జ్ఞాపకం వుంచుకోవాలో ఎన్నో ట్రిక్స్ చెప్పేది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూనే ఉండేది. ఏరోజూ తను ఏ విషయం గురించి బాధపడుతున్నట్టుగా అనిపించలేదు. నేను తను సూసైడ్ చేసుకుందని తెలిసిన రోజు షాక్ తో స్పృహ తప్పిపోయాను. చాలా రోజులు మామూలు మనిషిని కాలేక పోయాను."
"అంతగా ఎఫెక్ట్ అయ్యావా?" తన చేతిని వాడి భుజం మీద నుంచి తీసేస్తూ అడిగింది మేనక ఆశ్చర్యంగా.
"చెప్పానుగా నాకు తను స్వంత అక్క కన్నా ఎక్కువ." ఆనంద్ అన్నాడు. "మా మామ్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. తనతో కూడా ఎంతో చనువుగా ఉండేది నిరుపమక్క. కానీ తను సూసైడ్ ఎందుకు చేసుకుంది అన్నది మాకు అంతుపట్టని విషయం."
"అది ఎవరికీ అంతుపట్టని విషయం రా. నేను ఇక్కడ వున్నది అది తెలుసుకోవడానికి సాయం చెయ్యడానికే." మేనక అంది."బాగా ఆలోచించు. నీకే చిన్న విషయం గుర్తుకొచ్చినా చెప్పు. అదెంత చిన్న విషయం అయినా పర్లేదు. ఇన్వెస్టిగేషన్ కి పనికి రావొచ్చు."
కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు ఆనంద్ . "బహుశా తను సూసైడ్ చేసుకోవడానికి పదిహేను, ఇరవై రోజుల ముందనుకుంటా ఒకరోజు మార్నింగ్ పది పదిన్నర టైం లో కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది నిరుపమక్క."
"వాట్?" కుర్చీలో ఎలెర్ట్ అయిపోయింది మేనక. "నీకెలా తెలుసు ఆ విషయం?"
"నాకు కొంచం ఫీవర్ గా ఉందని స్కూల్ కి సెలవు పెట్టాను ఆ రోజు. ఇదిగో ఇక్కడే, ఈ కుర్చీలోనే కూచుని చదువుకుంటున్నాను. పుస్తకాలు లోపల దాచేసుకుంటాను కానీ, ఈ బల్ల కుర్చీలు వరండాలో ఇక్కడే వదిలేస్తాం. తాను వచ్చి నన్ను పలకరించింది. కాలేజీ కి ఎదో స్ట్రైక్ వాళ్ళ ఆ రోజు సెలవు అంది."
"తను ఎలా వుంది అప్పుడు?" వాడు కాస్త ఆగగానే ఎగ్జైటీన్గా అడిగింది మేనక.
"నిజం చెప్పాలంటే రోజూ కన్నా ఎక్కువ ఉత్సాహంగా, ఆనందంగా. తన ఫ్రెండ్ సమీర తో మాట్నీ కి వెళ్లాలని ఆలోచిస్తూంది. తనకి అప్పుడు కొచం ఫీవర్ గానే ఉందని, అయినా తనతో వచ్చి మాట్నీ మూవీ చూసిందంటే ఆ ఫీవర్ కాస్త ఎగిరిపోతుందని అంది. అప్పట్లో ఇక్కడ కొంతమందికి ఫీవర్లు వచ్చాయి. వైరల్ ఫీవర్లు అనుకుంటా."
"తను నిజంగా అంత ఉత్సాహంగా, ఆనందంగా కనిపించిందా?" ఆశ్చర్యంగా అడిగింది మేనక. సమీర చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మేనకకి. కచ్చితంగా ఆ రోజే తను సమీర ఇంటికి వెళ్లి ఉంటుంది.
"నిజం అక్కా. నాతో అరగంట కన్నా ఎక్కువే స్పెండ్ చేసింది ఇంట్లోకి వెళ్లబోయే ముందు. నా మాథ్స్ లో డౌట్స్ అన్ని క్లియర్ చేసింది. ఒకే ఒక చిన్న డౌట్ మిగిలి పోయింది. అది అడిగే లోపు ఇంట్లోకి వెళ్ళిపోయింది."
"ఐ సీ" సాలోచనగా తలూపింది మేనక. "ఇంకేమైనా నోటీసబుల్ థింగ్ వుందా?" అడిగింది.
"నేనిక్కడే కూచుని స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా. బహుశా ఒక అరగంట పైనే గడిచిందనుకుంటా. మళ్ళీ తను ఇంట్లోనుంచి బయటకి వచ్చింది."
"వాట్? తను మళ్ళీ బయటకి వచ్చిందా?" కుర్చీలో మరోసారి నిఠారుగా అయిపోయింది మేనక.
"ఎస్, అక్కా. కానీ ఈ సారి ఎందుకో డిఫరెంట్ గా అనిపించింది. తన మొహం సీరియస్ గా వుంది. నేను నా మాథ్స్ లో డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం తనని పిలిచాను. కొచం గట్టిగానే పిలిచాను. కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది."
"దటీజ్ రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజింగ్!" ఆనంద్ కాస్త ఆగగానే అంది మేనక.
వాడు ఇంకా ఎదో చెప్పబోతూ ఉండగా అక్కడికి ఒకావిడ వచ్చింది. "మా మామ్." ఆనంద్ అని వాళ్ళ అమ్మ మొహంలోకి చూసాడు . "యు ఆర్ లేట్ మామ్." అన్నాడు.
"గ్రోసరీ అంత కొనేసరికి టైం పట్టిందిరా." తన చేతుల్లో వున్న బాగ్స్ ని కిందపెట్టి మేనక మొహంలోకి చూసింది. "నువ్వు ఎదురింట్లోకి వచ్చిన అమ్మాయివి కదా. నిన్ను వాళ్ళింట్లో చూసాను."
"అవునండీ" తలూపి చెప్పింది మేనక
"నువ్వు వాళ్ళ రెలాటివా?" ఆనంద్ కి వచ్చిన సందేహమే వచ్చింది ఆవిడకి కూడా. "కానీ వాళ్ళ రెలెటివ్స్ అందరూ నాకు తెలుసు. నీలాంటి అమ్మాయి ఒకరు రెలెటివ్ గా ఉన్నట్టు వాళ్ళెపుడూ నాకు చెప్పలేదు."
మేనక ఆనంద్ వైపు ఇబ్బందిగా చూసింది. అప్పుడు తనెవరో, ఎందుకు అక్కడ వుందో వివరించాలంటే ఎంబరాసింగా అనిపించింది.
"నో మామ్. ఈ అక్క వాళ్ళ రెలెటివ్ కాదు." అంటూ విషయం వివరించాడు ఆనంద్ .
"ఓహ్, గాడ్! ఆ ముసలావిడకే కాదు, ఆయనకి కూడా మతి పోయింది. ఇప్పుడు తనెందుకు చనిపోయిందో ఆ విషయం తెలుసుకుని ఏమి చేస్తాడు?" ఆవిడ అంది.
"తన ఒక్క గా నొక్క కూతురు ఆలా సూసైడ్ చేసుకుని చనిపోతే తను ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలనే ఆత్రుత తనకి ఉండదా?" మేనక కోపంగా అంది.
"ఐ యాం సారీ. నా ఉద్దేశం అది కాదు." వెంటనే తన తప్పుని గ్రహించినట్టుగా అంది ఆవిడ. "ఒకపక్క ఆ ముసలావిడ కూతురు చనిపోడంతో పిచ్చిది అయిపొయింది. ఇప్పుడు ఏమి తెలుసుకున్నా ఆ చనిపోయిన కూతురు తిరిగిరాదు. అంతకన్నా ఆ ముసలావిడ ఆరోగ్యం మీదే దృష్టి పెట్టడం మంచిది కదా."
ఏమి మాట్లాడాలో మేనకకి తెలియక వెళ్లిపోదామన్న నిర్ణయానికి వచ్చి కుర్చీలోనుంచి లేచి నిలబడింది. "వస్తా ఆనంద్ . నీకేమన్నా గుర్తుకొస్తే నాకు చెప్పు. మోస్ట్ అఫ్ ది టైం నేను ఇంట్లోనే వుంటాను." తరువాత ఆవిడ మొహంలోకి చూసే "వస్తానండి" అని చెప్పి అక్కడనుండి కదల బోయింది.
"చిన్నమాట అమ్మాయ్." అని ఆవిడ మేనకకి దగ్గరగా వచ్చింది. "ఎన్నో ఏళ్ళు గా ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నాం. ఆ పెద్దవాళ్ళిద్దరితో నాకెంతో పరిచయం వుంది. నిరుపమ నాతోనూ ఎంతో చనువుగా ఉండేది. ఏమిటో ఆలా చనిపోయింది. ఆ పెద్ద వాళ్ళిద్దరిని ఆలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను."
"నేనర్ధం చేసుకోగలను ఆంటీ." అదంతా తనకెందుకు చెపుతూందో అర్ధం కాక అంది మేనక.
"నాకు వాళ్ళ దగ్గరకి వచ్చి పలకరించి మాట్లాడాలంటేనే ఎదో గిల్టీ గా అనిపిస్తూంది. నిరుపమ లేని ఆ ఇంట్లోకి రాలేకపోతున్నాను. వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ పెద్దవాళ్ళిద్దరికి ఎదురింటి పంకజం వాళ్ళ గురించి అడిగిందని, వాళ్ళ గురించి బాధపడుతోందని చెప్పమ్మా."
"వాట్ ఈజ్ దిస్ ఆంటీ?" మేనక కోపంగా అంది. "వాళ్ళతో పరిచయం వున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరికి రావడానికే గిల్టీగా ఫీలయితే వాళ్ళెప్పుడు మామూలు మనుషులవుతారు? వాళ్ళతో మీకంత పరిచయం వున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం మీ బాధ్యత కాదా? నేనేం మీరడిగారని, మీ ఫీలింగ్ గురించి వాళ్ళకి చెప్పను. మీరే వచ్చి వాళ్ళతో మాట్లాడండి." అని చెప్పి అక్కడనుండి వచ్చేసింది.
చాప్టర్-8
"ఆనంద్ నిరుపమ కాలేజీ నుంచి ఉదయమే ఇంటికి వచ్చేసిందని చెప్పిన రోజు, సమీర తన ఇంటికి మేనక ఇంచుమించులో పదకొండున్నర టైములో వచ్చిందని చెప్పిన రోజు ఒక్కటే. ఆ కంక్లూజన్ కి మనం సేఫ్ గా రావొచ్చు." మేనక చెప్పిందంతా విన్నాక సాలోచనగా అన్నాడు స్మరన్.
"నాట్ జస్ట్ దట్ అంకుల్. మేనక ఇంట్లోకి వెళ్లే ముందు, ఇంట్లోనించి బయటకి వచ్చాక ఆ డిఫరెన్స్ చూడండి. ఆనంద్ చెప్పిన ప్రకారం లోపలి వెళ్లే ముందు చాల ఉత్సాహంగా, ఆనందంగా సంతోషంగా వుంది. కానీ మళ్ళీ పైకి వచ్చినప్పుడు చాలా అప్సెట్ గా వుంది. ఆనంద్ చాలా గట్టిగా పిల్చినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. దానర్ధం లోపల ఎదో జరిగింది." మేనక కూడా డీప్ గా ఆలోచిస్తూంది.
"యు ఆర్ రైట్. లోపల ఏదో జరిగి ఉంటుంది." స్మరన్ తలూపాడు.
"తన తల్లితండ్రులతో ఆర్గ్యుమెంట్? మనకి తెలియని విషయాలు ఏమైనా వాళ్ళ మధ్య వుండివుండొచ్చు కదా." మేనక అంది.
"నాకు ఆలా అనిపించడం లేదు. ఒకవేళ అలాంటి సీరియస్ ఆర్గ్యుమెంట్ ఏమైనా వాళ్ళ మధ్య జరిగి ఉంటే అది ఆమె సూసైడ్ కి కారణమవొచ్చని రంగనాథ్ కి తడుతుంది కదా."
"యు ఆర్ రైట్ అంకుల్." మళ్ళీ ఆలోచనలో పడింది మేనక. "బహుశా ఆ ఆర్గుమెంట్ తన తల్లితో మాత్రమే అయి ఉండొచ్చు. అప్పుడు రంగనాథ్ అసలు ఇంట్లో వుండి ఉండకపోవచ్చు. ఆ విషయం తన తండ్రికి చెప్పడానికే కష్టమయి తను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు."
"విషయానికి కొచం దగ్గరకి వచ్చామేమో. రిమోట్ పాజిబిలిటీ వుంది." నవ్వుతూ అన్నాడు స్మరన్.
"కానీ నాకిదింకా పెద్ద పజిల్ లాగే వుంది అసలు ఇది మనం సాల్వ్ చెయ్య గలమా అనిపిస్తూంది." విచారంగా అంది మేనక.
"డోంట్ వర్రీ. ఇంకా వన్ వీక్ టైం వుంది నేనిచ్చిన గడువు పూర్తి కావడానికి. ఆ గడువు పూర్తి అయ్యేలోపు నేను ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేస్తాను." కాన్ఫిడెంట్గా అన్నాడు స్మరన్.
"అంకుల్" మోచేతులు రెండూ బల్లమీద ఆనించి స్మరన్ మొహంలోకి సూటిగా చూసింది మేనక. “మీకు ఈ విషయం లో ఆల్రెడీ ఒక స్పష్టత వుంది. మీరు అది నాకు చెప్పడం లేదు." కోపంగా అంది.
"నీకు డిటెక్టివ్ కావాలని లేదు. అందుకనే నువ్వు పూర్తిగా ఇంటరెస్ట్ పెట్టలేదు. లేకపోతే ఇప్పటికే నువ్వు కూడా ఒక స్పష్టత కి వచ్చేదానివి." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు స్మరన్.
"చూడండంకుల్." ఇంకా తన మోచేతుల్ని అలాగే ఉంచి సీరియస్ గా అంది మేనక. "ఐ అగ్రీ. నా గోల్ డిటెక్టివ్ కావడం కాదు. బట్, నేను మీకు మనస్ఫూర్తిగా సాయం చేస్తున్నాను. నా మైండ్ ని పూర్తిగా యూజ్ చేస్తున్నాను."
"మరైతే తేలికగా తట్టే విషయాలు కూడా నీకెందుకు తట్టడం లేదు?" కుర్చీలోనుంచి పైకి లేచాడు స్మరన్. "నేను బయటకి వెళ్ళాలి. తరువాత మాట్లాడుకుందాం."
"నాకు తేలిక విషయాలు కూడా తట్టడం లేదా? యాం ఐ దట్ మచ్ డంబ్?" తను కూడా కుర్చీలోనుంచి లేచి స్మరన్ కి ఎదురుగుండా వచ్చింది మేనక. "అవేమిటో మీరు నాకు చెప్పే తీరాలి." స్మరన్ వే ని బ్లాక్ చేస్తూ అంది.
"నేన్నీకు చెప్పను. యూజ్ యువర్ మైండ్ అండ్ బ్రేక్ యువర్ హెడ్. అప్పటికీ తట్టక పోతే నేను బయటపెట్టే వరకు వెయిట్ చెయ్యి. నువ్వూ బయటకి నడిస్తే నేనీ ఆఫీస్ లాక్ చెయ్యాలి."
&&&
ఇంటికి వచ్చిన తరువాత కూడా చాల ఫ్రెస్ట్రేటింగ్ గా అనిపించింది మేనకకి. తన కంటిముందే ఉండి కూడా తను తెలుసుకోలేకపోతున్న విషయాలు ఏమిటో బోధపడలేదు. నిర్మల భోజనం చేసాక రోజూ చేసినట్టుగానే ఆమెని హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చాక మెడమీద తన గదిలోకి వచ్చింది. బెడ్ మీద పడుకున్నాక సీరియస్ గా ఆలోచించడం మొదలు పెట్టింది.
నిరుపమ ఆమె పేరెంట్స్ కి ఒక్కగానొక్క కూతురు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టింది. ఎలాంటి సమస్యలు లేవు. పేరెంట్స్ ఇద్దరూ ఎంతో ముద్దుగా చూసుకుంటూ వున్నారు. అలాంటిది ఒకరోజు సడన్గా సూసైడ్ చేసుకుంది ఎలాంటి కారణం లేకుండానే.
అసహనంగా కుడి వైపునుండి ఎడమవైపుకు దొర్లింది మేనక. ఆలోచిస్తూంటే బుర్ర వేడెక్కుతూంది కానీ విషయం ఏమి తట్టడం లేదు.
కారణం లేకపోవడం కాదు. తను ఆ కారణం ఎవరికీ తెలియనివ్వలేదు. ఆ కారణం ఎవరికీ తెలియడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. గోడ మీద క్లూ, బుక్ లో క్లూ కేవలం తను అనుకోకుండా ఒక డెస్పరేట్ మూమెంట్లో ఇచ్చినవి. కావాలని ఇచ్చినవి కాదు.
మళ్ళీ ఎడమ వైపునుండి కుడి వైపుకి దొర్లింది చిరాగ్గా.
ఆ క్లూస్ కూడా తను అప్సెట్ అయిన మొట్ట మొదటి రోజే ఇచ్చినవి. విషయం ఏదైనా అది చాల ఎక్స్ట్రీమ్ గా అప్సెట్ చేసింది తనని. ఇమ్మీడియేట్ గా తను తట్టుకోలేక పోయింది. ఇంటికి ఆ రోజు తను పది ఆ సమయం లో వచ్చింది. ఇంట్లో ఇంచుమించులో హాఫ్ ఏన్ అవర్ ఆలా స్పెండ్ చేసింది. ఆ స్పెండ్ చేసిన టైం లోనే తనంతగా అప్సెట్ చేసిన విషయం జరిగింది. తరువాత తిన్నగా తన క్లోజ్ ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్ళింది. బహుశా మైండ్ డైవర్సన్ కోసమే వెళ్లి ఉంటుంది. సమీర ఇంట్లోనే వుండివుంటే ఏమై ఉండేదో, కానీ తనని ఇంట్లోనే అట్టేపెట్టి సమీర డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. ఆ సమయంలో సమీర ఇంట్లో బెడ్ రూంలో నిరుపమ రెస్ట్ తీసుకుంది. బహుశా తనని అంతగా అప్సెట్ చేసిన ఆ సంఘటన జరిగాక ఒక రెండు గంటలు గడిచి ఉంటాయి. నిరుపమ కొంత సర్దుకుని ఉంటుంది. కానీ తనలో ఇంకా తట్టుకోలేని సంఘర్షణ కొనసాగుతూనే ఉండి ఉంటుంది. బెడ్ మీద నిద్ర పోవడానికి ట్రై చేసింది. కానీ నిద్ర పోలేక పోయింది. అక్కడే వున్న పెన్ తీసుకుని గోడ మీద ఆలా ఎక్ష్ప్రెస్స్ చేస్తే కానీ వుండలేకపోయింది. తరువాత బుక్ తీసుకుని చదవడానికి ట్రై చేసింది. చదవలేక పోయింది. తను ఆ మూమెంట్లో ఏదైతే విపరీతం గా ఫీలయ్యిందో అది ఆ బుక్ లో పేపర్ మీద ఆలా ఎక్ష్ప్రెస్స్ చేసింది.
ఈ సారి స్ట్రెయిట్ గా పడుకుని ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచించడం మొదలు పెట్టింది.
తరువాత తను కొంతలో కొంత అడ్జస్ట్ అవ్వగలిగింది. పదిహేను రోజుల వరకూ తనలో ఫీలింగ్స్ ఎవ్వరికీ తెలియనివ్వకుండా మేనేజ్ చెయ్యగలిగింది. కానీ ఒక వీక్ మూమెంట్లో, ఇక తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఆ పదిహేను రోజులు తను మాక్సిమం సఫర్ అవుతూనే వుంది.
దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఒళ్ళు విరుచుకుంది మేనక. ఆలోచనలు వాటంతట అవి సాగుతూనే వున్నయి.
ఆమె అలా చనిపోవడం ఆమె తండ్రిని చాలా అప్సెట్ చేసింది ఆయన షాక్ అయిపోయాడు. తన కూతురు సూసైడ్ చేసుకుందన్న విషయం కన్నా కూడా తనెందుకు సూసైడ్ చేసుకుందో తెలియక ఆయనెక్కువ మధన పడుతున్నాడు.
మరోసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుంది మేనక ప్రవాహం లా వస్తూన్న ఆలోచనల్ని ఆహ్వానిస్తూ.
తన కూతురు అలా సూసైడ్ చేసుకోవడం ఆమె తల్లిని పిచ్చిదాన్ని చేసేసింది. నో, ఆవిడ పిచ్చిది కాలేదు. తన అంకుల్ చెప్పింది నిజం. తన కూతురు బ్రతికే వుందన్నట్టుగా ఆవిడ కావాలనే ఇమాజిన్ చేసుకుంటూంది. లోపల్లోపల ఆవిడకి తన కూతురు ఇక లేదని చాలా స్పష్టంగా తెలుసు. ఆవిడ బిహేవియర్ అబ్సర్వ్ చేస్తే ఆ విషయం ఎవరికైనా ఈజీ గా అర్ధం అయిపోతుంది.
ఇంకో ఆలోచన మనసులోకి వచ్చేలోగా సడన్గా తట్టింది మేనక కి. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించి బెడ్ మీద లేచి కూచుంది. తన అంకుల్ చెప్పినది నిజం! తన ముక్కు ముందే వున్న విషయం కూడా తను చూడ లేకపోతూంది.
నిర్మల పిచ్చిది కాదు. కేవలం తన కూతురు లేదన్న విషయం తట్టుకోలేక ఆవిడ అలా వూహించుకుంటూంది. తన కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిందని, ఇక లేదని ఆవిడకి బాగా తెలుసు. కానీ.....ఇక బెడ్ మీద కూచోలేక కిందకి దిగిపోయింది మేనక.
రంగనాథ్ ఆరాట పడుతున్నట్టుగా తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసుకోవడానికి తనెందుకు ఆరాట పడడం లేదు. అంత సడన్ గా నిరుపమ అలా సూసైడ్ చేసుకోవడం తననెందుకు ఆశ్చర్యపరచలేదు? నిజానికి ఆ విషయం గురించి తెలుసుకోవడానికి తనే ఎక్కువ తపన పడాలి కదా.
దీనికి అర్ధం ఒక్కటే. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా అనిపించింది మేనకకి ఆలోచిస్తూంటే.
తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో నిర్మలకి తెలుసు.
&&&
మేనక చెప్పింది విన్నాక గట్టిగా నవ్వాడు స్మరన్. "ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి నీకు ఇంత కాలం పట్టిందా?" అన్నాడు మేనక మొహంలోకి చూస్తూ.
"అంటే నిర్మలకి ఆ విషయం తెలిసివుంటుందని మీకు ముందునుంచి తెలుసా?" ఆశ్చర్యంగా అడిగింది మేనక.
"అఫ్ కోర్స్, ఎస్." తలూపాడు స్మరన్. "నిర్మల కి పిచ్చి లేదని కావాలనే నిరుపమ బ్రతికి వున్నట్టుగా తను వూహించుకుంటూందని తెలియగానే నేనది సస్పెక్ట్ చేసాను. ఎస్, యు ఆర్ రైట్. తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో నిర్మలకి తెలుసు."
"అయితే ఆ కారణం కూడా మీకు తెలిసే ఉంటుంది. నిజం చెప్పండి, ప్లీజ్." వేడుకోలుగా చూస్తూ అంది మేనక.
"ఒక థియరీ వుంది. చాలా వరకు అదే నిజం అనిపిస్తూంది. కానీ ఇప్పుడే బయటపెట్టను. ఎనీహౌ ఇంకా టైం వుంది కదా." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్.
"నేను మిమ్మల్ని చెప్పమని అడగను. ఎందుకంటే మీరు చెప్పరని నాకు బాగా తెలుసు. మీరనేదల్లా ఏంటంటే, యూజ్ యువర్ మైండ్ అండ్ బ్రేక్ యువర్ హెడ్." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ గలగలా నవ్వింది మేనక.
"ఎనీహౌ నిన్ను బాగా షాక్ చేసే ఇంకొక విషయం కావాలంటే చెప్తాను." మేనక మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.
"చెప్పండంకుల్. ఐ యాం క్యూరియస్." కుర్చీల్లోనుంచి ముందుకి వాలి, బల్ల మీద మోచేతులు బాలన్స్ చేసుకుని, స్మరన్ మొహంలోకి ఆసక్తిగా చూస్తూ అడిగింది మేనక.
"తను తన కూతురి సూసైడ్ ని జస్టిఫై చేస్తూంది. అదలా జరగడం ఒకరకంగా న్యాయమేనని తన అభిప్రాయం."
"వాట్?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా కుర్చీలోనుంచి లేచి నిలబడింది మేనక. "వాట్ డు యు మీన్?" తన మొహం అంతా షాక్ తో నిండి పోయింది.
"నువ్వు నన్ను సరిగ్గానే విన్నావు." కుర్చీలో మరోసారి అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్. "నిరుపమ చనిపోవడం ఒకరకంగా జరగాల్సిందేనని ఆమె అభిప్రాయం."
"ప్లీజ్ అంకుల్, అంత నిర్దయ గా మాట్లాడకండి." సత్తువంతా ఉడిగిపోయినట్టుగా కుర్చీలో కూలబడిపోయింది మేనక. "అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏ తల్లయినా తన కూతురు చనిపోవడం మంచిదే అని అనుకుంటుందా?"
"నాకావిడతో శత్రుత్వమేమి లేదు. ఐ యాం జస్ట్ సేయింగ్ యు ఏ ఫాక్ట్." ప్రత్యేకంగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు స్మరన్.
"ఎనీహౌ ఎందుకలాంటి అభిప్రాయానికి వచ్చారు?" దీర్ఘంగా నిట్టూరుస్తూ అడిగింది మేనక.
"నేను అది నీకు చెప్పను." కుర్చీలో వెనక్కి జరగిలబడి నవ్వాడు స్మరన్. "యూజ్ యువర్ మైండ్ అండ్ బ్రేక్ యువర్ హెడ్."
"సారీ. ఈ విషయంలో నేనది చెయ్యలేను." హెల్ప్ లెస్ ఎక్స్ప్రెషన్ తో తలూపింది మేనక. "అలా ఆలోచించడానికి కూడా నాకు మనస్కరించడం లేదు."
"నీకు ఇష్టంలేని పని ఏది నువ్వు చెయ్యాల్సిన అవసరం లేదు."
"కానీ మీకు నాది ఒకటే రిక్వెస్ట్." సడన్గా స్మరన్ ఫేస్ లోకి చూస్తూ అంది మేనక.
"ఫీల్ ఫ్రీ టు మేక్ ఇట్."
"దయచేసి మీరలా అనుకుంటున్న విషయం రంగనాథ్ అంకుల్ కి చెప్పకండి. ఆయన తట్టుకోలేడు."
"ఆ మాత్రం కామన్ సెన్స్ నాకుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు." చిరుకోపంతో అన్నాడు స్మరన్.
"ఒకే అంకుల్. నేను ఇక వస్తాను." చాలా అనీజీగా అనిపించి ఎందుకో ఇంక ఇక్కడ వుండాలనిపించక బయటికి వచ్చేసింది మేనక.
&&&
సమీర తో మాట్లాడి ఇంటికొచ్చే సమయానికి ఆనంద్ ఇంకా అతని అమ్మ పంకజం ఇంట్లో రంగనాథ్, నిర్మలతో మాట్లాడుతూ వున్నారు. తన మాటలు పంకజం మీద బాగానే పనిచేసినందుకు సంతోషించింది మేనక. వాళ్ళని పలకరించేక తిన్నగా మేడ మీదకి వెళ్ళబోతూ ఉంటే వెనకాతలనుంచి ఆనంద్ అన్నాడు.
"నీతో కొంచెం మాట్లాడాలక్కా."
"ఏం మాట్లాడాల్రోయ్." వాడి వైపు చూస్తూ చిరునవ్వుతో అడిగింది.
"మాథ్స్ లో కొంచెం డౌట్స్." ఆనంద్ అన్నాడు. "నిన్న నువ్వు నా డౌట్స్ చాలా చక్కగా క్లియర్ చేసావు కదా. అందుకనే మాథ్స్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకొచ్చాను."
"ఇది చాల చక్కగా వుంది. నిరుపమ కూడా మా అబ్బాయి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండేది." పంకజం అంది.
"మా అమ్మాయి జీనియస్. ఇంకొన్ని రోజుల్లో తను వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు మేనక దగ్గరనుంచి మా అమ్మాయి దగ్గరనుంచి కూడా నీ డౌట్స్ తీర్చుకోవచ్చు." నిర్మల అంది.
"తప్పకుండ అలాగే. ఇప్పుడు నేను మేడ మీద గదిలో అక్క దగ్గరికి వెళ్ళొచ్చా? ఏ డిస్టర్బన్స్ లేకపోతే నా డౌట్స్ అక్క చాలా చక్కగా క్లియర్ చెయ్యగలదు." ఆనంద్ అన్నాడు నిర్మల మొహంలోకి చూస్తూ.
"ఇదేమైనా అంత అడగాల్సిన విషయమా? తప్పకుండా వెళ్ళు." నిర్మల అంది.
తరువాత మేనక వెనకతలే మేడ మీదకి వెళ్ళాడు ఆనంద్.
&&&
"ఏంట్రా ఈ మాథ్స్ లో డౌట్స్ నాకర్ధం కావడం లేదు. నాది బి.ఏ. ఎకనామిక్స్. మాథ్స్ కాదు." వాడెందుకలా అన్నాడో అర్ధం అవుతూన్నా, చిరునవ్వుతో అంది మేనక అక్కడ బెడ్ మీద ఎడ్జ్ లో కూలబడుతూ. "నువ్వూ కూర్చోరా." బెడ్ కి అపోజిట్ లో వున్న కుర్చీ చూపించింది.
"నిర్మలాంటీ ఇంకా నిరుపమ బ్రతికే ఉందనుకుంటోందని నాకు తెలుసక్కా. నిరుపమకి సంబంధించిన ఏ విషయం ఆవిడ ముందు మాట్లాడలేను." ఆ కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఆనంద్. వాడి చేతిలో మాథ్స్ టెక్స్ట్ బుక్ కూడా వుంది. ‘వీడు నిజంగా చాలా కామన్ సెన్స్ వున్నవాడు’ అనుకుంది మేనక
"సో, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు నిరుపమ." ఇంటరెస్టింగ్ గా అంది మేనక. "చెప్పు అదేమిటో."
"నేనొక విషయం ఆ రోజు చెప్పడం మరిచిపోయానక్కా." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు ఆనంద్. "కానీ ఇదేమంత ముఖ్యమైన విషయం కాకపోవచ్చు. కానీ ఎంత చిన్న విషయం అయినా చెప్పమన్నావు కదా. అందుకే చెప్దామని వచ్చాను."
"అవున్రా. ఒక్కక్కప్పుడు చాల చిన్న విషయం కూడా ఇన్వెస్టిగేషన్ కి ఎంతో ఉపయోగ పడుతుంది. అదేమిటో చెప్పు." మేనక మోహంలో ఇంటరెస్ట్ అలాగే వుంది.
"నిరుపమక్క నేను పిలుస్తూన్నా వినిపించుకోకుండా ఆలా వెళ్లిపోయిన తరువాత నేను మళ్ళీ నా స్టడీస్ లో పడిపోయాను. నువ్వు అడిగిన తరువాత ఆలోచించాను తప్ప ఆ విషయం గురించి మరిచేపోయాను."
"విషయానికి రా రా బాబూ." చిరాగ్గా అంది మేనక.
"ఆ తరువాత ఒక అరగంట గడిచి వుంటుందక్కా. ఎంత సమయం గడిచిందో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు." కొంచెం ఆగాడు ఆనంద్. "నేను అయన ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళింది చూడలేదు. బహుశా నేను స్టడీస్ బిగిన్ చెయ్యడానికి ముందే వెళ్ళుంటాడు. కానీ ఆ ఇంట్లోనుంచి ఇంచుమించులో నిరుపమక్క ఆలా వెళ్లిపోయిన అరగంట తరువాత తిరిగొచ్చాడు."
"ఎవడ్రా అది? నీకు తెలిసిన మనీషా లేక కొత్త వ్యక్తా?" ఎగ్జైటింగ్ గా అడిగింది మేనక.
"నిరంజన్ అంకుల్. నిరుపమక్క రెలెటివ్."
"వాట్? నువ్వు చెప్పింది నిజామా?" ఉద్విగ్నత తట్టుకోలేక బెడ్ మీదనుంచి కిందకి దిగిపోయింది నిరుపమ. "ఆ రోజు నిరుపమ అలా వెళ్ళిపోయాక నిరంజన్ బయటికి వచ్చాడా?"
"ఎస్, అక్కా. నిరంజన్ అంకుల్ బయటకి వచ్చాడు."తనూ కుర్చీలోనుంచి లేచి నిరుపమ మొహంలోకి ఆశ్చర్యంగా చూసాడు ఆనంద్. "ఇందులో అంత ఆశ్చర్య పడాల్సిన విషయం ఏముంది? నిరంజన్ తరచూ ఆ ఇంటికి వస్తూనే ఉంటాడు. నిరుపమ కి అంకుల్ అవుతారు. తనే నాతో చెప్పింది."
"బట్ నువ్వు స్యూర్ గా చెప్పగలవా అది నిరంజనేనని?" ఇంకా సందేహంగానే అడిగింది మేనక.
"నాకు అయన తెలియక పోవడం ఏమిటక్కా? అయన ఇక్కడకి వచ్చి సంవత్సరం అలా అయిందేమో కానీ నాకు ఆయనతో బాగా పరిచయం వుంది. నాతో చాలా బాగా మాట్లాడతారు. నన్ను ఎప్పుడు చూసినా పలకరించి మాట్లాడుతూ వుంటారు."
"ఆ రోజు నీతో మాట్లాడారా?"
"లేదక్కా. ఆ రోజు ఆ ఇంట్లోనుంచి బయటకి వస్తూనే అలా వెళ్లి పోయారు. బహుశా నన్ను చూడనే లేదనుకుంటా." ఆనంద్ అన్నాడు. "నేనసలు ఆ విషయం పట్టించుకోనే లేదు. అలా జరగడం చాలా నాచురల్ కదా."
"అఫ్ కోర్స్, యు ఆర్ రైట్." తనలో ఎగ్జైట్మెంట్ ఇంకా బయటపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అంది మేనక.
"అక్క. ఈజ్ దిస్ సంథింగ్ ఇంపార్టెంట్? నీ ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా ఉపయోగపడుతుందా?" ముడిపడిన నొసలుతో మేనక మొహంలోకి ఇంటరెస్టింగ్ గా చూస్తూ అడిగాడు ఆనంద్.
"అంత ఉపయోగ పడే విషయం కాదనుకుంటానురా." ఎంతో ఉపయోగ పడుతుంది అని చెప్పడానికి బదులుగా అంది. "ఎనీహౌ థాంక్ యు వెరీ మచ్ ఫర్ టెల్లింగ్ మీ దిస్. ఇలాగే నీకే విషయం గుర్తుకొచ్చినా వెంటనే నాకు ఇన్ఫర్మ్ చెయ్యి."
"మరి నేను వెళ్లి రానా అక్కా?" మేనక మొహంలోకి చూస్తూ అడిగాడు ఆనంద్.
"ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, హాపీ గా వెళ్ళిరా." వాడి భుజాల చుట్టూ చెయ్యివేసి, వాడి కుడి బుగ్గమీద స్మూత్ గా ముద్దుపెట్టుకుంటూ అంది మేనక. "బాగా చదువుకో" ఆ చేతిని తీసేసాక అంది.
"ఒకే అక్కా." అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు ఆనంద్.
&&&
"సో, ఆ రోజు మార్నింగ్ నిరుపమ అలా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో నిరంజన్ కూడా వున్నాడు. ఆ సమయంలో రంగనాథ్ వున్నాడో లేదో తెలియదు." సాలోచనగా అన్నాడు స్మరన్.
"నిర్మలాంటీ ఉందని మాత్రం మనం ఏం చెప్పగలం? ఆవిడ కూడా ఏదైనా పనిమీద బయటకి వెళ్లి ఉండొచ్చు కదా ఆయన్ని ఇంట్లో అట్టేపెట్టి." మేనక అంది.
ఆ సమయంలో మేనక, స్మరన్, స్మరన్ ఆఫీసులో ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చుని వున్నరు.
" హండ్రెడ్ పెర్సెంట్ అందుకు ఛాన్స్ వుంది. నిజానికి మొదటి రోజు నేను, రంగనాథ్ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నిరంజన్ ఒక్కడే ఆ ఇంట్లో వున్నాడు. నిర్మల ఆయన్ని ఇంట్లో అట్టేపెట్టి షాపింగ్ కి వెళ్ళింది." తలూపి అన్నాడు స్మరన్.
" అప్పుడు ఆ సమయం లో రంగనాథ్, నిర్మల ఇద్దరూ ఇంట్లో వుండివుండక పోవచ్చు. నిరంజన్ ఇంటికి వచ్చాక అతనికి ఇల్లు అప్పచెప్పి ఇద్దరూ బయటికి వెళ్లి ఉండొచ్చు." మేనక అంది
"అఫ్ కోర్స్ దేర్ ఈజ్ సచ్ ఏ స్ట్రాంగ్ పాజిబిలిటీ." స్మరన్ అన్నాడు.
"సో, నిరంజన్ ఒక్కడూ ఇంట్లో వున్న సమయంలో నిరుపమ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతను తన మీద రేప్ కానీ, రేప్ అటెంప్ట్ కానీ చేసి ఉండొచ్చు కదా." నొసలు ముడివేసి కుర్చీలో వెనక్కి జారగిలబడి అంది మేనక.
"నీకు అతన్ని చూస్తే అలా చేసే మనిషిలా కనిపించాడా?" తనూ కుర్చీలో వెనక్కి జారగిలబడి అడిగాడు స్మరన్. "నువ్వూ అతనితో మాట్లాడానని చెప్పావు కదా."
"అఫ్ కోర్స్, రైట్." తలూపింది మేనక. "నేనూ అతన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. రెస్పెక్ట్ కూడా కలిగింది. చాలా అట్రాక్టివ్ క్యారక్టర్. బట్....." తన రెండు మోచేతులూ బల్లమీద బాలన్స్ చేసుకుంటూ అంది మేనక. "కానీ బయట మనిషిని చూసి లోపల మనిషిని అంచనా వెయ్యలేం. నిరుపమ చాలా అందమైన పిల్ల. అలా చూసి, చూసి కోరిక పడ్డాడేమో. కేవలం అలాంటి దాని వల్లే ఎవరికీ చెప్పలేక నిరుపమ సూసైడ్ చేసుకుని ఉంటుంది. తనెంతో గౌరవించి, అభిమానించి నాన్నలా భావించే మనిషి తన మీద రేప్ అటెంప్టో లేక రేపో చేస్తే ఏ అమ్మాయి అయినా ఎలా ఫీల్ అవుతుంది? మీరు ఆల్రెడీ ఎదో థియరీ ఈ విషయమై ఉందని చెప్పారు. అది ఇది కాదా?"
"మనకి ఈ అనుమానం చాలా ముందుగానే వచ్చింది. నువ్వు చెప్పినదానికి కూడా పాజిబిలిటీ వుంది." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్. "కానీ నా థియరీ ఇది కాదు."
"నేను అదేమిటని అడగను. అడిగినా మీరు చెప్పరు." నవ్వుతూ అంది మేనక. "బట్ నాకిప్పుడు ఆ విషయమై నా మైండ్ యూజ్ చెయ్యడానికి, హెడ్ బ్రేక్ చేసుకోవడానికి ఓపిక లేదు."
"కానీ ఆ విషయం రంగనాథ్ కి తెలియ పరిచే సమయం వచ్చేసింది మేనకా." స్మరన్ కుర్చీలోనుంచి ముందుకు వంగి బల్లమీద తన మోచేతులు బాలన్స్ చేసుకుంటూ అన్నాడు.
" నిజంగానా అంకుల్." ఎగ్జైటింగ్ గా అడిగింది మేనక కుర్చీలో ముందుకు వంగి. "మీరు ఎలా ఆ విషయం రంగనాథ్ కి తెలియ పరచబోతూ వున్నారు?"
"నా ప్లాన్ ఇది." అంటూ అంతా క్లియర్ గా వివరించాడు స్మరన్. "ఐ థింక్ ఇట్ డెఫినిట్లీ వర్క్స్."
అది వివరించేటప్పుడు తన థియరీ ఏమిటో కూడా చెప్పక తప్పలేదు స్మరన్ కి. అంతా ఆశ్చర్యంగా, నమ్మలేనట్టుగా అనిపించింది మేనకకి "ఒకే అంకుల్. మీరు చెప్పినట్టుగానే చేద్దాం." అంతా విన్నాక తలూపింది మేనక.
&&&
"ఎస్, మిస్టర్ రంగనాథ్. మీరు ఎంతో అతృతతో ఎదురు చూస్తూన్న ఆ విషయం మీకు తెలియ పరిచే సమయం వచ్చేసింది. కాకపోతే ముందుగా మీకు ఒకటి రెండు ప్రశ్నలు అడగలనుకుంటున్నా." అన్నాడు స్మరన్.
"తప్పకుండ అడగండి" ఉద్వేగంగా అన్నాడు రంగనాథ్.
"తాను సూసైడ్ చేసుకోవడానికి ఒక పదిహేను, ఇరవై రోజల ముందు, మీ అమ్మాయి ఒకరోజు కాలేజీ కి స్ట్రైక్ అని ఉదయమే ఇంటికి వచ్చేసింది. ఆ రోజు, అప్పుడు మీరు ఇంటి దగ్గరే వున్నరా?"
బాగా ఆలోచనలో పడ్డాడు రంగనాథ్. "నాకు తెలిసి, నాకు గుర్తుండి మా అమ్మాయి ఎప్పుడూ అలా ఇంటికి రాలేదు."
"ఒకే దెన్." తలూపాడు స్మరన్. "మీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి పదిహేను, ఇరవై రోజుల ముందు మీరేదయినా వూరికిగాని లేదా వేరే చోటికిగాని వెళ్ళారా?"
మళ్ళీ ఆలోచనలో పడి ఒక పధి పదిహేను సెకన్లలో తరువాత అన్నాడు రంగనాథ్. "ఎస్, నా చెల్లెలు కనకవల్లి ఇంటికి వెళ్ళాను. తన భర్తకి ఎందుకో సీరియస్ చేస్తే చూడడానికి వెళ్ళాను. ఇప్పుడంతా బాగానే వుంది. ఆ సమయంలో నిరుపమ అలా ఇంటికి వస్తే వచ్చి వుండొచ్చు. " కాస్త ఆగి మళ్ళీ అన్నాడు రంగనాథ్. "ఇప్పుడు నా భార్య నిరుపమని తన ఇంటి దగ్గర ఉన్నట్టుగానే భావిస్తూ వుంది."
స్మరన్ మేనక కళ్ళల్లోకి మీనింగ్ఫుల్ గా చూసి తలూపాడు. మేనక వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ వుంది.
"కానీ మీరిదంతా ఎందుకు అడుగుతున్నారు? నేనింటి దగ్గర ఉండడం, ఉండకపోవడం తో నిరుపమ సూసైడ్ కి ఏమిటి సంబంధం?" రంగనాథ్ ఇంకా ఎగ్జైట్ అయ్యాడు.
"రేపే మీకు అన్ని విషయాలు బోధపడతాయి. ఇప్పుడు నేను మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను." స్మరన్ అన్నాడు.
"మీరిచ్చిన గడువుకు ఇంకా రెండు రోజుల గడువు వుంది." రంగనాథ్ ఆశ్చర్యం గా అన్నాడు. "అది పూర్తి కాకుండానే మీరు సాల్వ్ చెయ్యగలరా?"
"అఫ్ కోర్స్, ఎస్." తలూపాడు స్మరన్. "కానీ మీరు ఇంకొన్ని ప్రశ్నలు ఆన్సర్ చెయ్యాల్సి ఉంటుంది."
"ఐ యాం రెడీ టు ఆన్సర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వెశ్చన్స్. దయచేసి వేగంగా అడగండి." తనలో ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోవడం రంగనాథ్ కి కష్టంగా వుంది.
"తాను సూసైడ్ చేసుకోడానికి, ఇంచు మించులో ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి, మీరు ఎలాంటి మార్పు నిరుపమలో కనిపెట్టలేదా?"
"కనిపెట్టలేదు. ఒకవేళ అలాంటి మార్పేమైన నాకు కనిపించి ఉంటే మీకు నేను చెప్తాను కదా. మీరీ ప్రశ్న నన్ను ఆల్రెడీ అడిగారు." చిరాగ్గా అన్నాడు రంగనాథ్.
"బాగా అలోచించి చెప్పండి మిస్టర్ రంగనాథ్, ఈ ప్రశ్న చాలా క్రూసల్." బల్లమీద మోచేతులు ఆనించి రంగనాథ్ మొహంలోకి చూసాడు స్మరన్. "ఆ పదిహేను, ఇరవై రోజుల్లో ఎప్పుడైనా తన మొహంలోకి చూసారా? తన మోహంలో ఏమైనా డిఫెరెంట్ ఎక్స్ప్రెషన్ కనిపించిందా?"
మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు రంగనాథ్. "లేదు. అలా చూసిన గుర్తు లేదు." కాస్సేపటి తరువాత అన్నాడు రంగనాథ్.
"మీరు చూసి వుంటారు రంగనాథ్. జాగ్రత్తగా అలోచించి చెప్పండి. అప్పుడు తన మోహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ మీకు కనిపించింది?"
"ఇప్పుడు నాకు కొంచం గా గుర్తుకు వస్తూంది." సడన్గా అన్నాడు రంగనాథ్. " తను నాకు తన మొహంలోకి చూసే అవకాశం ఇవ్వలేదు. ఒకవిధంగా చెప్పాలంటే నన్ను తప్పించుకుంటున్నట్టు అనిపించింది."
"మై గాడ్! ఇంత క్రూసల్ పాయింట్ బిగినింగ్ లోనే ఎందుకు చెప్పలేదు అంకుల్?" మేనక ఆశ్చర్యంగా అడిగింది.
"అది నేనసలు సీరియస్ గా తీసుకోలేదు. అసలు పట్టించుకోనే లేదు." రంగనాథ్ ముడిపడిన నొసలు తో విస్మయంగా అన్నాడు. "మీరింతగా అడిగారు కాబట్టి ఇప్పుడు ఆలోచించాను."
"ఇట్స్ ఆల్రైట్. నో ప్రాబ్లెమ్." తలూపి కుర్చీలో వెనక్కి వాలాడు స్మరన్. "ఆ పదిహేను, ఇరవై రోజుల్లో ఒక్కసారైనా తన మొహంలోకి చూసి వుంటారు. తన ఎక్స్ప్రెషన్ గమనించి వుంటారు. జాగ్రత్తగా ఆలోచించండి."
మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు రంగనాథ్. "ఎస్, ఇది ఎగ్జాక్ట్ గా తను సూసైడ్ చేసుకున్న రోజు జరిగింది. తను మాతో రాత్రి భోజనం చేసాక, డైనింగ్ టేబుల్ దగ్గరనుండి వెళ్లిపోయే ముందు నా మొహంలోకి చూసింది. జస్ట్ ఫ్యూ సెకండ్స్. మా ఇద్దరి కళ్ళు కలిసాయి. తరువాత తనక్కడినుండి వెళ్ళిపోయింది."
"ఆ సమయంలో తన మోహంలో ఏం ఎక్స్ప్రెషన్ చూసారు? ఏ ఫీలింగ్ డిటెక్ట్ చేశారు? ఎదో ఫీలింగ్, ఎక్సప్రెషన్ లేకుండా కచ్చితంగా వుండివుండదు." స్మరన్ అడిగాడు సూటిగా ఇంకా రంగనాథ్ మొహంలోకి చూస్తూ.
రంగనాథ్ మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడిపోయాడు.
"గుర్తు చేసుకోండి. జాగ్రత్తగా అలోచించి చెప్పండి. ఇది చాలా క్రూసల్."
"ఎస్, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్ నేను డిటెక్ట్ చేసినట్టుగా అనిపించింది." సడన్గా కళ్ళు తెరిచి అన్నాడు రంగనాథ్.
"ఏమిటది? ఆ ఫీలింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ ఏమై ఉండొచ్చు?"
"గిల్టీ....గిల్టీ....ఫీలింగ్.....తనేదో తప్పుచేసి బాధపడుతున్నటుగా నాకనిపించింది." ఇంకా ఎలాంటి ప్రామ్ప్టింగ్ లేకుండా అన్నాడు రంగనాథ్. "అది ఇంకే ఫీలింగ్ కానీ అయివుంటుందని నాకు అనిపించడం లేదు."
"దట్స్ ఇట్ మిస్టర్ రంగనాథ్. నా థియరీ మరింత స్ట్రాంగ్ అయింది. రేపే మీరు అంతగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం మీకు తెలిసేలా చేస్తాను." కాస్త ఆగి అన్నాడు మళ్ళీ. "కానీ మీరొక విషయానికి అంగీకరించాలి."
"చెప్పండి అదేమిటో?" రంగనాథ్ మళ్ళీ ఎగ్జైటింగ్ గా అన్నాడు. "ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను."
"మీ భార్యని హిప్నోటైజ్ చెయ్యడానికి మీరు అంగీకరించాలి. ఎందుకంటే ఆ విషయం ఆవిడ ద్వారానే మీకు తెలియాలి." స్మరన్ చెప్పాడు.
"మీకు మతి పోయివుంటుంది మిస్టర్ స్మరన్ లేదా మీకు నాతో పరిహాసం ఆడాలని ఉండి ఉంటుంది." కోపంగా కుర్చీలోనుంచి లేచి అన్నాడు రంగనాథ్. "లేకపోతే ఆ విషయం నా భార్య ద్వారా నాకు తెలియడమేమిటి?"
"ఎస్, మిస్టర్ రంగనాథ్. నేను పర్ఫెక్ట్ సెన్స్ తో వున్నను. మీతోనే కాదు ఎవరితోనూ నాకు పరిహాసం ఆడే మూడ్ లేదు. మీకు మీ భార్య ద్వారా ఆ విషయం తెలియడమే అన్నివిధాలుగాను మంచిది. ఎందుకంటే తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో మీ భార్యకి తెలుసు."
"తన కూతురు ఆలా చనిపోయాక నా భార్య పిచ్చిది అయిపోయింది. తన కూతురు ఇంకా బ్రతికే ఉందన్న భ్రమలో ఆనందంగా వుంది. అలాంటిది నా భార్యకి నా కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎలా తెలుస్తుంది?" రంగనాథ్ అలాగే నిలబడి ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
"నేను మళ్ళీ చెప్తున్నాను రంగనాథ్ గారూ." స్మరన్ కూడా కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు. వాళ్లిద్దరూ ఆలా అర్గ్యూ చేసుకుంటూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక మేనక విస్మయంగా తానూ లేచి నిలబడి చూస్తూ వుంది.
"మీ భార్య పిచ్చిది కాలేదు. తనకి తన కూతురు బ్రతికి లేదని బాగా తెలుసు. దటీజ్ ఫోర్స్డ్ ఇమాజినేషన్. ఆలా వూహించుకోవడంలో తనకి ఒకరకమైన అనడం వుండి వూహించుకుంటూంది." స్మరన్ చెప్పాడు.
"అది కేవలం నా భార్య ఇమాజినేషన్ అంటే నేను ఒప్పుకోను. తను నిజంగానే పిచ్చిది అయిపోయింది." ఇంకా తీవ్రంగానే వుంది రంగనాథ్ స్వరం.
"ఒకవేళ నేను మీ భార్య పిచ్చిది కాదని, అది కేవలం తన ఫోర్స్డ్ ఇమాజినేషన్ అని ప్రూవ్ చేస్తే, తనని హైప్నోటైజ్ చెయ్యడానికి మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే కేవలం ఆ ప్రకారంగా మాత్రమే మీరు కన్విన్స్ అయ్యేలా ఆ విషయం మీకు తెలియచెయ్యగలను."
"మిస్టర్ స్మరన్." కుర్చీలో కూలబడి అన్నాడు రంగనాథ్. "మీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసిపోయిందని నాకు తెలిసిపోయింది. ఈ హిప్నోటైజింగులు అవీ ఎందుకు? డైరెక్ట్ గా ఆ విషయం నాకు చెప్పేయండి. నేను మిమ్మల్ని నమ్ముతాను."
"నో మిస్టర్ రంగనాథ్" స్మరన్ కూడా మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. "ఆ విషయం మీ ఆవిడ ద్వారానే మీకు తెలియాలి. అదే బెస్ట్ వే." స్మరన్ వాయిస్ ఫర్మ్ గా వుంది.
"ఆల్రైట్. కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా నా భార్యకి తన కూతురు చనిపోయిందని తెలుసనీ, తను పిచ్చిది కాదని నాకు ప్రూవ్ చెయ్యాలి." రంగనాథ్ పట్టుదలగా అన్నాడు.
" తప్పకుండా అలాగే చేస్తాను." అని మేనక కళ్ళల్లోకి చూసాడు స్మరన్. "ఈ రోజే రంగనాథ్ అంకుల్ కూడా ఉండగా నువ్విలా చెయ్యి." అంటూ తనేం చెయ్యాలో మేనకకి చెప్పాడు స్మరన్.
"ఒకే అంకుల్. మీరు చెప్పినట్టే చేస్తాను." చిరునవ్వుతో తలూపింది మేనక.
"ఈ రోజే మిమ్మల్ని ఆ విషయం లో మేనక కన్విన్స్ చేస్తుంది."
"ఆల్రైట్. తరువాత..." క్వెస్చనింగ్ ఎక్స్ప్రెషన్ తో అడిగాడు రంగనాథ్.
"ప్రతిరోజూ భోజనం అయ్యాక మీ ఆవిడని హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చుతూ వుంది మేనక."
"అవును ఆ విషయం నాకు తెలుసును. నిరుపమ కూడా వాళ్ళ అమ్మని మధ్యాన్నంపూట ఆలా నిద్రపుచ్చేది." రంగనాథ్ అన్నాడు.
"కానీ రేపు మధ్యాన్నం మాత్రం తనని నిద్రపుచ్చడానికి హిప్నోటైజ్ చెయ్యదు. తననుంచి నిజాన్ని రాబట్టడానికి హిప్నోటైజ్ చేస్తుంది. ఐ థింక్ దిస్ షల్ బి హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ఫుల్. బి ప్రెపేర్డ్ టు పేస్ ది ట్రూత్ మిస్టర్ రంగనాథ్."
"మీరెందుకు నా భార్యకి ఆ విషయం తెలిసి ఉంటుందనుకుంటున్నారో నాకర్ధం కావడం లేదు." ఒక హెల్ప్ లెస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు రంగనాథ్. "కానీ దీనికి నేను అంగీకరిస్తున్నాను."
"జస్ట్ ఏ మూమెంట్ అంకుల్." స్మరన్ మొహంలోకి చూస్తూ అంది మేనక. "సబ్జెక్టు కి ఇష్టం లేకపోతే, చెప్పదలుచుకోకపోతే డీప్ హిప్నోసిస్ లో కూడా విషయాల్ని రాబట్టలేం. నిర్మలాంటీకి ఇష్టం లేకపొతే డీప్ హిప్నోసిస్ లో కూడా ఆవిడనుంచి ఏ విషయం రాబట్టలేం."
"నా ఉద్దేశంలో పార్ట్ అఫ్ హర్ మైండ్ ఆ విషయాన్నీ బయటపెట్టాలని తహ తహ లాడుతూంది. నేను అనుకోవడం రేపు హిప్నోసిస్ లో హండ్రెడ్ పర్శంట్ ఆవిడ ఆ విషయాల్ని బయటపెడుతుంది. ఒకవేళ ఆలా జరగక పోతే ఆ విషయం రంగనాథ్ గారికి కన్వీన్సిన్గా తెలిసేలా చెయ్యడానికి వేరే ఉపాయం ఆలోచిస్తాను." స్మరన్ అన్నాడు.
"ఒకే అంకుల్." తలూపింది మేనక.
"ఏవైనా క్లూస్ దొరికాయా? మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా వున్నారు?" స్మరన్ మొహంలోకి చూస్తూ అడిగాడు రంగనాథ్.
"ఏవో కొన్ని క్లూస్ దొరికాయి. కానీ రేపే మీకు నేను ఆ నిజాన్నే తెలిసేలా చెయ్యబోతూ వున్నాను కాబట్టి ఆ క్లూస్ గురించి ఇంక మీకు అనవసరం."
"ఆ సమయంలో నేను నిరంజన్ ని అక్కడ ఉండమని అడగొచ్చా? తను నాకు, నా భార్యకి కూడా చాలా ఆప్తుడు. అంతే కాకుండా ఫేమస్ సైకాలజిస్ట్ కూడా." రంగనాథ్ అన్నాడు.
"నాకేమి అభ్యంతరం లేదు. కానీ నిర్మలగారు డీప్ హిప్నోసిస్ లోకి వెళ్లేవరకూ ఆ రూంలో కేవలం ఆమె, ఇంక మేనక మాత్రమే వుంటారు. తరువాత మాత్రమే మనం అక్కడకి వెళ్ళాలి."
"నేను అంగీకరిస్తున్నాను." రంగనాథ్ తలూపాడు.
"తను డీప్ హిప్నోసిస్ లోకి వెళ్ళగానే మేనక నాకు మిస్డ్ కాల్ ఇస్తుంది. అప్పుడు మనం అక్కడికి వెళదాం. ఎనీహౌ ఆ సమయంలో మీ భార్య దగ్గర మీరు, నేను, మేనక ఇంక వస్తే నిరంజన్ తప్ప మరెవరూ వుండకూడదు."
"ఇది కూడా నాకు అంగీకారమే." మరొకసారి తలూపాడు రంగనాథ్.
"ఇంక మీరు వెళ్లొచ్చు మిస్టర్ రంగనాథ్." కుర్చీలో వెనకెక్కి జరగిలబడి అన్నాడు స్మరన్.
రంగనాథ్ తలూపి లేచాడు. అయన తలుపు తెరిచి బయటకి వెళ్ళబోతూ ఉంటే స్మరన్ అన్నాడు "జస్ట్ ఏ మినిట్ సర్."
రంగనాథ్ వెనక్కి తిరిగి స్మరన్ మొహంలోకి చూసాడు.
"ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. మీరు కావాలంటే ఇది ఆపేద్దాం. మీరు నాకు ఏమీ పే చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. మీరు పే చేసింది కూడా తిరిగి ఇచ్చేస్తాను." కాస్త ఆగాడు స్మరన్. "ఎందుకంటే మీరు తెలుసుకోబోయే ఆ విషయం మిమ్మల్ని మరింత బాధ పెట్టేదే తప్ప రిలీఫ్ ని ఇచ్చేది కాదు."
"పర్లేదు మిస్టర్ స్మరన్. నేను మరింత బాధపడ్డానికే సిద్ధంగా వున్నను." తరువాత తలుపు తెరిచి మరింక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు రంగనాథ్.
ఆ తరువాత ఆ రోజు, ఇంక ఆ మర్నాడు ఏం చెయ్యాలో బాగా బ్రీఫ్ ఇచ్చాడు స్మరన్ మేనకకి. అంతా జాగ్రత్తగా విన్నాక రంగనాథ్ ఇంటికి వచ్చేసింది మేనక.
&&&
"నిరుపమ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటిదగ్గరే ఎన్ని రోజులు ఉండిపోతుంది? తనని వెంటనే బయలుదేరి రమ్మనండి ఆంటీ." ఆ రాత్రి భోజనాలు చేస్తూ ఉంటే మేనక అంది నిర్మలతో.
"తను వచ్చేస్తానన్నా తన మేనత్త పంపించదు. తనంటే చాల ఇష్టం వాళ్ళ మేనత్తకి."
"అయితే మాత్రం? తనకి ఎగ్జామ్స్ కూడా కదా. సమీర ఎంతో శ్రద్ధగా కాలేజీ కి వెళుతూ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతూంది. తను మాత్రం కాలేజీ ఊసు, ఎగ్జామ్స్ ఊసు లేకుండా అక్కడే ఉండిపోయింది." అని రంగనాథ్ మొహంలోకి చూసింది మేనక. "అంకుల్ మీరు రేపే తనకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మనమని చెప్పండి."
"అవును నిర్మలా. తనూ కాలేజీ కి వెళ్లి ఎగ్జామ్స్ అవీ రాయాలి కదా. రేపే ఫోన్ చేసి వెంటనే ఇంటికి వచ్చేయమని చెప్తాను."
"తన కాలేజీ, తన ఎగ్జామ్స్ గురించి తనకి తెలియదా? మీరు ఫోన్ చేసి చెప్పాలా? తనేదో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరెందుకు తన ఆనందాన్ని పాడు చెయ్యాలని చూస్తారు?" అరిచినట్టుగా అంది నిర్మల.
"ఒకే, ఒకే. నేనేం తనకి ఫోన్ చేసి రమ్మనమని చెప్పనులే. నువ్వు ఎగ్జైట్ అవ్వకు." ఆ సమయంలో తన భార్య మొహం లో ఎక్స్ప్రెషన్ ఎదో తనకి తెలిసిపోతుందని భయపడుతున్నట్టుగా వుంది.
"ఎనీహౌ ఆంటీ తన ఫోన్ నెంబర్ నాకొక సారి ఇస్తారా? తనకి వీడియో కాల్ చేసి మాట్లాడతాను. తనెలా ఉంటుందో చూడాలని కోరికగా వుంది. మీ ఇంట్లో వుండి ఇన్నిరోజులైంది కానీ ఒక్కసారీ నేను తనతో మాట్లాడలేదు." మేనక అంది పరీక్షగా నిర్మలనే చూస్తూ.
"మేమెవరం ఇంకా నీ గురించి తనకి చెప్పలేదు. నువ్వెలా మాట్లాడతావు?" చిరాగ్గా చూస్తూ అంది నిర్మల.
"ఓహ్, ఆంటీ. ఇదేమన్నా పెద్ద ఇష్యూ నా? ఇప్పుడే మీరు ఫోన్ చేసి తనకి నన్ను ఇంట్రడ్యూస్ చెయ్యండి. నేను మాట్లాడతాను."
"అలాగ ఏమీ అవసరం లేదు. తను ఇక్కడకి వచ్చేకే నువ్వు మాట్లాడొచ్చు." ప్లేటులో చెయ్యి కడిగేసుకుని లేచిపోయింది నిర్మల. "నాకింక తినాలనిపించట్లేదు." అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది.
"మా స్మరన్ అంకుల్ చెప్పినదానితో మీరిప్పుడు కన్విన్స్ అయ్యారా అంకుల్?" రంగనాథ్ మొహంలోకి చూస్తూ అడిగింది మేనక.
ఏమీ మాట్లాడకుండా తనూ ప్లేటులో చెయ్యి కడుక్కుని లేచి అక్కడనుండి వెళ్ళిపోయాడు రంగనాథ్.
ఆ తరువాత మేనకకి కూడా భోజనం చెయ్యాలని అనిపించలేదు. కష్టం మీద తన ప్లేటులో వున్నది తిన్న తరువాత తను కూడా అక్కడినుండి మేడ మీద రూంలోకి వెళ్ళిపోయింది.
&&&
"మీకు చాలా ప్రశాంతం గా, హాయిగా వుంది. మీ మనసులో ఇప్పుడు ఎటువంటి దిగులు లేదు. మీ మనస్సు ఇప్పుడు కేవలం నేను చెప్పే మాటల మీద మాత్రమే కేంద్రీకృతం అయివుంది. మీ మనస్సు, శరీరం నా సజెషన్స్ పూర్తిగా ఫాలో చేస్తాయి."
ప్రశాంతంగా వున్న నిర్మల మొహాన్ని చూస్తూ అంటోంది మేనక. కేవలం ఫైవ్ మినిట్స్ కింద తనని హిప్నోటైజ్ చెయ్యడం మొదలు పెట్టింది.
"మీ కనురెప్పలు బరువెక్కుతున్నాయి. మీ శరీరం అంతా బరువెక్కుతూంది. మీకు నిద్ర ముంచుకొస్తున్నట్టుగా వుంది. మీరు బాహ్య ప్రపంచం నుంచి చాలా దూరంగా వున్నారు. కానీ మీకు నా వాయిస్ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తూంది. నేనడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి మీరు సిద్ధంగా వున్నారు."
నిర్మల మొహం ఆలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే వుంది.
"మీ మనస్సు ఇప్పుడు పూర్తిగా నా కంట్రోల్ లో వుంది. నేనడిగే ప్రశ్నలన్నిటికీ మీరు వెంటనే సమాధానం ఇస్తారు."
ఆ బెడ్ పక్కనే నిలబడి అంటూ వుంది మేనక నిర్మల మొహం వైపునుండి దృష్టి మళ్లించకుండా. నిర్మలలో ఏ మార్పు లేదు.
"ఇప్పుడు మీకు ఎలా వుంది?" వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఎగ్జైటీన్గా అడిగింది మేనక. తను తన ప్రశ్నలకి రెస్పాండ్ అవుతుందా లేదా అన్నదాని మీద ఈ మిషన్ హోల్ సక్సెస్ ఆధారపడి వుంది.
వెంటనే ఏ రెస్పాన్స్ లేకపోవడంతో అదే ప్రశ్న మళ్ళీ అడిగింది మేనక. తన హిప్నోటిజమ్ ఫెయిల్ అవుతుందా? ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఇంకో ఇంత మంచి మార్గం అంటూ ఏమిలేదు రంగనాథ్ అంకుల్ కి నిజం తెలియ పరచడానికి. సడన్గా డిజప్పోయింటెడ్ గా ఫీలవ్వడం మొదలుపెట్టింది మేనక.
"చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా వుంది." తను ఎప్పుడైతే మరోసారి అడగ్గానే నిర్మల ఆలా చెప్పిందో ఆనందంతో ఎగిరి గెంతాలన్నకోరికని బలవంతంగా అణుచుకుంది మేనక.
"మీకు నా ప్రశ్నలన్నిటికి సమాధానం ఇవ్వాలని వుంది, అవునా?" తనలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూ ఉంటే నిర్మల మొహంలోకి చూస్తూ మళ్ళీ అంది మేనక
"అవును" ఈ సారి సమాధానం వెంటనే వచ్చింది. ఆ వెంటనే స్మరన్ సెల్ ఫోన్ కి మిస్డ్ కాల్ ఇచ్చింది మేనక.
&&&
బయటే వెయిట్ చేస్తూ ఉన్నారేమో జస్ట్ కొన్ని సెకండ్స్ లోనే నిర్మల రూంలోకి వెళ్లిపోయారు స్మరన్, రంగనాథ్. నిరంజన్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు రంగనాథ్. ఆ సమయానికి తప్పకుండా వస్తానని ప్రామిస్ చేసాడు నిరంజన్, కానీ ఇంకా రాలేదు. కాస్త చిరాగ్గా వున్నా, నిరంజన్ గురించి ఎదురుచూసే ఉద్దేశం లేదు రంగనాథ్ కి.
"షీ ఈజ్ రెస్పాండింగ్ పాజిటివ్లీ." చిన్న స్వరంతో స్మరన్ మొహంలోకి అదే ఎగ్జైట్మెంట్ తో చూస్తూ అంది మేనక.
"జస్ట్ కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్." అంతే చిన్న స్వరంతో స్మరన్ కూడా అని రంగనాథ్ మొహంలోకి చూసాడు. రంగనాథ్ కూడా చాలా ఎగ్జైట్ అవుతూన్నట్టే కనిపించాడు.
మేనక తలూపి మళ్ళీ నిర్మల మొహంలోకి చూసింది. "మీకు మీ అమ్మాయి నిరుపమ అంటే చాలా ఇష్టం కదా. తనని మీరు చాలా అభిమానిస్తారు కదా." మేనక అడిగింది.
"అవును" వెంటనే వచ్చింది సమాధానం.
"మీ భర్తకి కూడా తనంటే చాలా ఇష్టం కదా."
"అవును."
"నిరుపమ ఒకరోజు కాలేజీ నుండి ఉదయమే ఇంటికి వచ్చేసింది ఈ రోజుకి సరిగ్గా ఆరేడు నెలలు క్రితం. అవునా?"
"అవును"
వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఆ ప్రశ్నలతో ఏమీ రాబట్టదలుచుకున్నారో తెలియక పోయినా రంగనాథ్ లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగింది. మేనకకి కూడా చాలా ఎగ్జైటింగ్ గానే వున్నా స్మరన్ మాత్రం మామూలుగా చూస్తూ వున్నాడు.
"ఆ రోజు మీరింట్లోనే వున్నారా?"
"ఇంట్లోనే వున్నాను."
"నిరుపమ ఇంట్లోకి అడుగు పెట్టగానే మీరు చూసారా?"
"లేదు. ఆఖరివరకూ తనని మేము చూడలేక పోయాం."
మేనక స్మరన్ మొహంలోకి చూసింది. అతని మొహం ఏ ఎక్సప్రషన్ లేకుండానే వుంది.
'నాకేమి అర్ధం కావడం లేదు.' రంగనాథ్ చిన్న గొంతు తో గొణిగాడు.
"మేము అంటున్నారు. అంటే మీరు కాకుండా ఇంకెవరైనా వున్నారా ఆరోజు ఇంట్లో?"
"అవును."
"ఎవరు?"
"నిరంజన్"
అక్కడ గాలి స్తంభించినట్టుగా అయింది. కొన్ని సెకండ్ల తరువాత మళ్ళీ అడిగింది మేనక. "ఆ సమయంలో మీరిద్దరూ ఏం చేస్తున్నారు?"
"వంటింట్లో మాట్లాడుకుంటున్నాం."
"నిరుపమ వచ్చి మిమ్మల్ని పలకరించిందా?"
"లేదు"
"మరి తనేమి చేసింది?"
"తలుపు దగ్గర చాటుగా నిలబడి మా మాటలు అన్నీ వింది."
"తరువాత ఏం చేసింది?"
"మేము తనని గమనించామని తెలియగానే వేగంగా అక్కడినుండి వెళ్ళిపోయింది."
"మై గాడ్! ఏం జరిగి ఉంటుంది?" తనకి తెలియకుండానే అని గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు రంగనాథ్
"వండర్ఫుల్! బాగుంది. జస్ట్ కంటిన్యూ." ఎంకరేజ్ చేసాడు స్మరన్
"ఆ రోజు నిరుపమ వింటూండగా వంటింట్లో మీరు నిరంజన్ ఏం మాట్లాడుకున్నారు?"
నిర్మల దగ్గరినుంచి సమాధానం లేదు.
"మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్తారు. చెప్పకుండా......"
"తను ఈ వూరు వచ్చి సెటిల్ అయినందుకు తనని నేను తిట్టేను."
"తను ఇక్కడ సెటిల్ అవ్వడం మీకు ఇష్టం లేదా?"
"లేదు."
"ఎందుకని?"
నిర్మల దగ్గరినుంచి సమాధానం లేదు.
"మీరు నాకు సమాధానం చెప్తారు, చెప్తారు."
నిర్మల నొసలు మీద ముడతలు వచ్చాయి కానీ సమాధానం రాలేదు.
"ఇంకో ప్రశ్న అడుగు. బాగా స్ట్రగుల్ అయితే హిప్నోసిస్ నుంచి బయటికి వచ్చేవచ్చు." స్మరన్ సజెస్ట్ చేసాడు.
"ఆల్రైట్" తలూపింది మేనక. "నిరంజన్ ఇక్కడ సెటిల్ అవడం మీ ఆయనగారికి ఇష్టమేనా?" మళ్ళీ అదే మంద్ర స్వరంతో నిర్మల మొహంలోకి చూస్తూ అడిగింది.
"అవును"
"మీరింకేమి మాట్లాడుకున్నారు?"
"తనని ఈ ఊళ్ళోంచి వెళ్లిపొమ్మని చాలా గట్టిగా చెప్పాను." నిర్మల చెప్పింది మామూలు గొంతుతో.
'ఎందుకలా చెప్పారు' అని అడగబోయి ఆగిపోయింది మేనక. ఆలా స్ట్రెయిట్ గా అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం రాకపోచ్చనిపించింది.
"దానికి నిరంజన్ గారు ఏమన్నారు?"
"నేనెందుకు వెళ్ళాలి? రంగనాథ్ కూడా ఈ వూళ్ళో సెటిల్ అవ్వమంటేనే నేనిక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాను’. అన్నాడు."
"దానికి మీరేమన్నారు?"
"రంగనాథ్ కి ఏమి తెలియదు కాబట్టి రమ్మన్నాడు. రంగనాథ్ కి, నిరుపమ కి విషయం తెలిసిపోతే’. అన్నాను."
అక్కడ వాతావరణం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపొయింది. రంగనాథ్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు.
"దానికి ఆయనేమన్నాడు?"
"ఎలా తెలుస్తుంది? నేను ఈ బ్లాక్ స్పెక్ట్స్ ఎప్పుడూ తియ్యను. వీటిని తీస్తే తప్ప ఎటువంటి ప్రమాదం లేదు’. అన్నాడు."
"దానికి మీరేమన్నారు?"
"ఒక్కసారి నీ మొహంలోకి నీ స్పెక్ట్స్ లేకుండా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అనుమానం వచ్చే అవకాశం వుంది. అసలు మీ కళ్ళల్లో ఎక్కడైనా తేడా వుందా? అవే కళ్ళు కదా’. అన్నాను."
వాతావరణం బాగా వేడెక్కి పోయింది. తరువాత క్రూసల్ క్వెస్చన్ అడగనా, వద్దా అన్నట్టుగా స్మరన్ మొహంలోకి చూసింది. అడుగు అన్నట్టుగా తలూపాడు స్మరన్.
"తనకి స్పెక్ట్స్ లేనప్పుడు తెలిసిన వాళ్ళు చూస్తే ఏ అనుమానం వస్తుంది?"
నిర్మల నుంచి సమాధానం లేదు. నుదుటి మీద ముడతలు ఇంకొంచం ఎక్కువ అయిపోయాయి. ఏం చెయ్యాలన్నట్టుగా స్మరన్ మొహంలోకి చూసింది మేనక.
"అదే ప్రశ్న మరోసారి అడుగు. సమాధానం రాకపోతే ప్రశ్న మార్చు." చిన్న గొంతుతో అన్నాడు స్మరన్.
"ఆంటీ, మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్తారు. చెప్పకుండా ఉండలేరు." అంటూ అదే ప్రశ్నని మళ్ళీ అడిగింది మంద్ర స్వరంతో. "తనకి స్పెక్ట్స్ లేనప్పుడు తెలిసిన వాళ్ళు చూస్తే ఏ అనుమానం వస్తుంది?"
"తన కళ్ళు అచ్చం నిరుపమ కళ్ళల్లాగే ఉంటాయి. నిరుపమ నిరంజన్ కూతురని అనుమానం వస్తుంది. అదే నిజం కూడా."
&&&
"నేను హిప్నోటైజ్ అయి ఇదంతా చెప్పలేదు. ఇప్పటికయినా ఇందంతా నీకు తెలియాల్సిన అవసరం వుంది. అందుకనే చెప్పాను." బెడ్ మీద లేచి కూచుని రంగనాథ్ మొహంలోకి చూస్తూ అంది నిర్మల. "పదేళ్లయినా మనకి పిల్లల్లేరు. డాక్టర్లు మనలో ఏ లోపం లేదు ఎప్పుడైనా పిల్లలు పుట్టొచ్చని చెప్పినా నాకు నీ ద్వారా పిల్లలు పుడతారని ఆశ చనిపోయింది. అమ్మని కావాలన్న కోరికని చంపుకోలేకపోయాను. ఇందులో నిరంజన్ తప్పేమి లేదు రంగా. తనని నేనే బలవంత పెట్టాను." కాస్త ఆగింది నిర్మల.
మ్రాన్పడి పోయాడు రంగనాథ్. మెదడంతా షాక్ తో నిండి పోయింది. అలాగే నిర్మలవైపు చూస్తూ వుండిపోయాడు.
"నిరంజన్ తో ఒక్కసారి కమిట్ అవగానే నాకు ప్రెగ్నన్సీ వచ్చింది. నేను ఆనందం తట్టుకోలేకపోయాను. నిరుపమ పుట్టాక నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. కానీ ఒక్కటే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. నిరుపమ కళ్ళు అచ్చం నిరంజన్ కళ్ళే. పెద్దయ్యాక ఆ పోలిక మరింత ఎక్కువ అవుతుందని నాకు అనిపించింది. అందుకనే నిరంజన్ ని సేతపోరి దూరంగా వెళ్లిపోయేలా చేశాను." మళ్ళీ ఆగింది నిర్మల.
రంగనాథ్ లో షాక్ తగ్గింది. నిర్మల మాట్లాడుతున్నది బుర్రలోకి వెళుతూంది.
"నిరంజన్ కి ఫామిలీ లైఫ్ ఇష్టం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోలేదు. కానీ తన ద్వారా పుట్టిన నిరుపమ మీద మమకారం పెంచుకోకుండా ఉండలేకపోయాడు. రిటైర్ అయ్యాక రంగనాథే ఈ వూరు వచ్చి సెటిల్ అవ్వమనడంతో నిరంజన్ ఆగ లేకపోయాడు. తను ఎప్పుడూ స్పెక్ట్స్ పెట్టుకుంటూనే వున్నా ఎదో రోజు విషయం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉండేది. అంతే కాకుండా నిరుపమ నిరంజన్ తో చాల ఇంటిమేట్ గా ఉండడం ప్రారంభించింది. నాలో భయం మాత్రమే కాకుండా అప్పటికే వున్న గిల్టీనెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది."
నిర్మలలో చిన్న తేడా ప్రారంభం అయ్యింది. ఎగశ్వాస తీసుకోవడం ప్రారంభించింది. రంగనాథ్ ఆదుర్దాగా బెడ్ మీద కూచుని తనని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.
"అవును రంగా. నిరుపమ నీ కూతురు కాదు అక్రమ సంతానం అన్న గిల్టీనెస్ నాలో ఎప్పుడూ వుంది. ఆ నిరంజన్ ఇక్కడికే వచ్చే సెటిల్ అవ్వడం తో ఆ గిల్టీ ఫీలింగ్ తో పాటుగా, ఎప్పటికైనా నీకు, నిరుపమకి నిజం తెలిసిపోతుందేమోని భయం కూడా పెరిగింది. ఆఖరికి అనుకున్నంత పని అయింది. నేను నిరంజన్ ఆ రోజు చాలా సేపు వంటిట్లో అర్గ్యూ చేసుకున్నాం. మా మాటల ద్వారా నిరూపమకి తను నీ కూతురు కాదు, నిరంజన్ కూతురునని తెలిసిపోయింది. అంతే కాకుండా నిరంజన్ కళ్ళు అచ్చం తన కళ్ళల్లాగే వుంటాయని, ఆ పోలిక బయటపడకూడదనే ఎప్పుడూ బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుంటాడని కూడా అర్ధం అయిపోయింది. " నిర్మలలో ఎగశ్వాస ఇంకా పెరిగింది. "నిన్ను మోసం చేసాను. నిరుపమ చావుకి కారణం అయ్యాను. నన్ను క్షమించు రంగా." అంది.
'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' అని బుక్ లో నిరుపమ ఎందుకు రాసిందో ఒక్కసారిగా అర్ధం అయిపోయింది మేనక ఇంకా సమీర కి.
"నువ్వు నన్ను మోసం చెయ్యలేదు. నువ్వు నన్ను మోసం చేసావనికాని, తప్పు చేసావని కానీ నేను ఎంతమాత్రం అనుకోవడం లేదు." నిర్మలని గట్టిగా గుండెలకి హత్తుకుంటూ అన్నాడు రంగనాథ్. "స్త్రీలలో మాతృత్వ వాంఛ ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. నేను నిన్ను తల్లిని చేయలేనని తెలిసాక నువ్వలా చేసావు. ఇందులో నీ పొరపాటు ఏమి లేదు."
"రంగా...నువ్వు....నువ్వు చాలా మంచి వాడివి....." నిర్మల కళ్ళు మూతబడిపోతున్నాయి
"నిరుపమ....తనెందుకు ఎదో తప్పు చేసినట్టుగా బాధపడింది? అసలు తండ్రినే కాలేని నాకు కూతురుగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎంత పిచ్చిపని చేసింది?" కళ్ళవెంట కారుతున్న నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యడం లేదు రంగనాథ్.
"ఇందులో నిరంజన్ తప్పేమి లేదు రంగా. నేను బలవంతపెడితేనే....." కష్టం మీద మాట్లాడుతోంది నిర్మల.
"నిరంజన్ అప్పటికి ఇప్పటికి నాకు మంచి స్నేహితుడే. అతని మీద కోపం కావాలన్నా తెచ్చుకోలేను. అయ్యో, ఈ విషయం నాకు ఎప్పుడో తెలిస్తే ఎంత బాగుండేది? నిరుపమ ఆత్మహత్య చేసుకోకుండా చూసుకునే వాడిని." భోరున ఏడుస్తూ అన్నాడు రంగనాథ్.
"నన్ను క్షమించు రంగా. ఏ తప్పు చెయ్యకుండానే నిన్నింత బాధ పెట్టిన నాకింక బ్రతికే అధికారం లేదు. నాకు సెలవు ఇప్పించు. వెళ్ళొస్తాను."
అప్పటికిగాని అక్కడవున్న వాళ్లంతా నిర్మలలో భారీగా చోటు చేసుకుంటూన్నమార్పు గమనించలేదు.
"ఏం జరిగింది? ఎందుకిలా అయిపోతున్నావు?" నిర్మల మొహంలోకి చూస్తూ అడిగాడు రంగనాథ్.
"భోజనం అయ్యాక, ......... పడుకోబోయేముందు .........ఎలుకల మందు తీసుకున్నాను రంగా............... కొంచం ఆలస్యంగానే అయినా ..............అది తన పని తను చేస్తూంది." బెడ్ మీదకి పూర్తిగా వాలిపోయింది నిర్మల.
&&&
"ఈ పాటికి వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుంది." కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిరంజన్. తనని రంగనాథ్ విషయం అంత చెప్పి రమ్మని పిలవగానే తాను నిర్మలకి అంతా ఫోన్ చేసి చెప్పేసాడు.
"తనే లేకపోయాక ఇంక ఆ విషయం ఎందుకు దాచాలి? రంగాకి ఇప్పటికైనా నిజం తెలియాల్సిన అవసరం వుంది." నిర్మల అంది.
అదే నిరంజన్ కీ అనిపించింది. ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా తను ఈ వూరు వచ్చి సెటిల్ అయ్యాడు. నిరుపమ మృత్యువుకి కారణం అయ్యాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ అంత మానసిక క్షోభ అనుభవించడానికి కూడా తనే కారణం.
'ఇండివిడ్యువల్ సోల్ మీద నాకు నమ్మకం లేదు. కానీ నువ్వక్కడైనా వుండి ఉంటే నన్ను క్షమించు తల్లీ. నీ పుట్టుకకి, చావుకి రెండింటికి నేనే కారణం అయ్యాను.'
తరువాత బలవంతంగా ఊపిరి తీసుకోవడం మానేసాడు నిరంజన్ తన ప్రాణం పొయ్యేవరకు కూడా.
ఎపిలాగ్
"నాకు బుక్ లో నిరుపమ రాసిన 'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' చదవగానే, అవుట్ అఫ్ ఫాషన్ అయినా బ్లాక్ స్పెక్ట్స్ ఎప్పుడూ పెట్టుకునే నిరంజన్ గుర్తుకు వచ్చాడు. ఆ రెండిటికి కచ్చితంగా కనెక్షన్ వుండి ఉంటుందనిపించింది. తరువాత అంతకన్నా ముందే తను గోడ మీద వ్రాసిన 'ఈ ఫీలింగ్ ని నేను భరించలేక పోతున్నాను' ని ఎనలైజ్ చెయ్యడానికి ప్రయత్నించాను. తప్పుచేసింది నిరంజన్, నిర్మల అయినా ఆ తప్పుకి ప్రతిరూపం అయిన నిరుపమ గిల్టీ గా ఫీలవ్వడం చాలా నాచురల్. అదే తను ఆలా ఎక్ష్ప్రెస్స్ చేసింది. అందులోనూ మీరు తననెంతో ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో మిమ్మల్ని మోసంచేస్తున్నానన్న భావన తనలో ఎక్కువైపోయింది. తరువాత తను నిరంజన్ గారి దగ్గరికి పూర్తిగా వెళ్లడం మానెయ్యడం, తన తండ్రి మొహంలోకి చూడలేకపోవడం నాకు ఆ విషయాన్నే స్పష్టం చేసాయి. వీటన్నింటికన్నా ముందు రంగనాథ్ ఇంకా నిర్మలకి పదేళ్ళపాటు పిల్లలు లేకపోవడం నా మనసులో మెదిలింది. వీటన్నిటిని లింక్ చేసి చూస్తే నా థియరీ స్ట్రాంగ్ అయింది. అంతే కాకుండా నిర్మల, నిరంజన్ భార్యాభర్తలు కావలసినంత క్లోజ్. ఒకవేళ తనకి రంగనాథ్ గారి వల్ల పిల్లలు పుట్టే అవకాశమే లేకపోతే, నిర్మల నిరంజన్ తో కమిట్ అవ్వడానికి చాలా అవకాశం ఉందని నాకు అనిపించింది. ఎలాగో నిరుపమకి తను రంగనాథ్ కూతురు కాదు, నిరంజన్ కూతురునని తెలిసిపోయింది, అదే తట్టుకో లేకపోయింది. "
ఆ సమయంలో రంగనాథ్ ఇంట్లో రంగనాథ్, స్మరన్, సమీర, మేనక ఇంకా ప్రతిమ వున్నారు. అది నిర్మల చనిపోయిన తరువాత పదిహేనవ రోజు. రంగనాథ్ ప్రతిమ ని కూడా ప్రత్యేకంగా రమ్మనమని చెప్పడంతో ఆ సమయానికి ఆవిడ కూడా అక్కడికి వచ్చింది. తక్కిన నలుగురూ అట్టెంటివ్ గా వింటూ ఉంటే స్మరన్ చెప్తూ వున్నడు.
"సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన తనకి సడన్ గా, ఇంపల్సివ్ గా వచ్చింది. ఆ రోజు మేడ మీదకి వెళ్లేప్పుడు కూడా తను చనిపోవాలన్న ఆలోచనతో లేదు. కానీ ఒక్కసారిగా ఆ గిల్టీ ఫీలింగ్ తనని ముప్పిరిగొంది. ఇంక భరించడం తనవల్ల కాలేదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసింది. ఐ యాం వెరీ సారీ. ఇది మిమ్మల్ని చాలా బాధ పెడుతుందని నాకు తెలుసు. కానీ తన ఫీలింగుని, తన స్ట్రగుల్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకునివుంటే అంతపని జరిగివుండేది కాదు. తనలా ఇంపల్సివ్ గా సూసైడ్ చేసుకునేది కాదు."
కుర్చీలో వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకున్నాడు రంగనాథ్.
"తన కళ్ళు అచ్చం నిరంజన్ అంకుల్ కళ్ళల్లాగే ఉండడం తను భరించలేక పోయింది. 'ఐ వాంట్ టు ప్లక్ మై అయిస్ అవుట్' అని బుక్ లో ఎందుకు రాసిందో ఇప్పుడు నాకు అర్ధం అయింది." సమీర అంది.
"మీరు చెప్పింది నిజం. నేను మా అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా వుండవలిసింది. అందువల్ల నేను నా భార్యని ఇంకా ప్రాణ ప్రదమైన నా మిత్రుడిని కూడా కోల్పోవలసి వచ్చింది." కళ్ళు తెరిచి స్మరన్ మొహంలోకి విచారంగా చూస్తూ అన్నాడు రంగనాథ్.
"అంకుల్, మీకు నిర్మల ఆంటీ మీద కానీ, నిరంజన్ అంకుల్ మీద కానీ అసలు కోపం లేదా?" మేనక అడిగింది.
"కోపం దేనికమ్మా, కోపం దేనికసలు? అమ్మకావాలని ఏ స్త్రీ కయినా ఎంతగానో ఉంటుంది. నావల్ల అది సాధ్యపడదని తెలిసాకే తనలా చేసింది. ఇంక నిరంజన్. నిర్మల తనని బలవంత పెట్టింది కాబట్టే తన మాతృత్వానికి కారణం అయ్యాడు. నిజానికి ఆ ఇద్దరూ నిరుపమ అన్న ఒక మంచి అమ్మాయి పుట్టుకకి కారణం అయ్యారు." కాస్త ఆగాడు రంగనాథ్.
తక్కిన ముగ్గురూ రంగనాథ్ చెప్పేది శ్రద్ధగా వింటూ వున్నారు.
"నిరుపమ ఎప్పుడూ నా కూతురే. తన మీద నాకెప్పుడూ కోపం వచ్చి ఉండేది కాదు. తను నా వల్ల పుట్టలేదన్న బాధ నాకు పొరపాటున కూడా కలిగి ఉండేది కాదు. అన్ని నాతొ షేర్ చేసుకునే తను, ఒక్కసారి ఈ విషయం కూడా షేర్ చేసుకుని ఉంటే ఎంత బావుండేది?" కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మరోసారి మూసుకుంటూ అన్నాడు రంగనాథ్. "తనలో సూసైడ్ ఆలోచనే రాకుండా నేను ఆపేవాడిని."
"మీరు నిజంగా గ్రేట్ అంకుల్." రంగనాథ్ మొహంలోకే చూస్తూ అంది మేనక.
"తనలో అంత మధనం జరుగుతూ వున్నా, అది బయటకి తెలియకుండా నిరుపమ ఆఖరికి అంతకి ఒడిగట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను చేసిన అసైన్మెంట్ లన్ని ఆనందంతో చేశాను. ఫీజ్ ఆనందంగా తీసుకోగలిగాను. కానీ ఈ అసైన్మెంట్ మాత్రం నేను కచ్చితంగా సక్సెస్ కాగలనని అనిపించినా ఆనందంతో చెయ్యలేకపోయాను. మీ దగ్గర నాకు ఫీజు తీసుకోబుద్ది కావడంలేదు. దయచేసి మీరు మామూలు మనిషి కాగలిగితే చాలు." స్మరన్ అన్నాడు.
"డబ్బు ఇప్పుడు నాకు సమస్య కాదు మిస్టర్ స్మరన్. అవసరానికి మించి చాలా వుంది. అదంతా ఏమి చెయ్యాలో కూడా తెలియడంలేదు. నిరంజన్ కూడా తన ఆస్థి మొత్తం నిరుపమ పేరు మీద వ్రాసేసాడు. నిరుపమ లేకపోవడం వల్ల అదంతా కూడా నాకే వచ్చింది.”
అక్కడ సడన్గా నిశబ్దం అలుముకుంది. ఎవరికీ ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.
"ఈ సమయంలో నా మనసుకి కాస్త ప్రశాంతత నిచ్చే విషయం ఒకటే. ఎందుకనో తెలియదు. మేనకని మా ఇంట్లో అచ్చం నిరుపమ లాగే ఫీలయ్యాను. నిరుపమ ఇకలేదు అన్న బాధనుంచి కొంత రిలీఫ్ ని ఇచ్చింది మేనక. ఐ యాం స్యూర్. నిర్మల కూడా అలాగే ఫీలవుతూ వచ్చింది." ఆ నిశబ్దాన్ని బేధిస్తూ అన్నాక కాస్త ఆగాడు రంగనాథ్.
తక్కిన అందరూ మొహామొహాలు చూసుకున్నారు. కానీ ఏమి మాట్లాడ లేదు. నిజానికి ఏమి మాట్లాడాలో తెలియలేదు.
"ఇకపై కూడా మేనక నాకు అలాగే కూతుర్లాగే వుండగలదా? ప్రతిమ గారికి తన మీద వున్న హక్కులేమి నేను తీసుకోను. కానీ తను మా ఇంట్లోకి వచ్చాక ఇప్పటివరకూ వున్నట్టుగా ఉండగలిగితే చాలు. నేను ప్రతిమ గారిని ఇప్పుడు ఇక్కడకి రమ్మనడానికి కూడా వేరే కారణం ఏమీ లేదు. ఈ విషయం చెప్పడానికి తప్ప."
"తప్పకుండ అలాగే అంకుల్. నేను మీకు మాటిచ్చాను కూడా కదా. ఆ మాట నేనేదో పొల్లుమాటలా ఇవ్వలేదు. కచ్చితంగా పాటించడానికి ఇచ్చాను. నేను నిరుపమలా మీతో వుండడం కాదు. నిరుపమగానే మీతో వుంటాను. ఇందులో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు." దృఢస్వరంతో అంది మేనక.
"ఒక్కసారి అమ్మ అభిప్రాయం కూడా అడుగమ్మా." రంగనాథ్ చిన్నస్వరం తో అన్నాడు
"నాకూ ఇందులో ఎటువంటి అభ్యంతరంలేదు. ఇంత బాధపడుతూన్నమీ మనసుకి మా మేనక మీ కూతురుగా వుండడం వల్ల మీకు సంతోషం కలుగుతుందంటే అంతకన్నా నాకు ఇంకేమి కావాలి?" ప్రతిమ అంది.
"నా మనసుకి ఇప్పుడు చాలా సంతోషంగా వుంది." మనసులో ఆనందం అంతా మోహంలో ఎక్ష్ప్రెస్స్ అవుతూ ఉంటే రంగనాథ్ అన్నాడు.
సమీర తన కూర్చున్న కుర్చీలోనుంచి లేచి మేనక వున్న కుర్చీ వెనక్కి వచ్చి తన రెండు చేతులు మేనక భుజాల మీద వేసింది. "నువ్వు నిరుపమ గా రంగనాథ్ అంకుల్ తో ఎలా వుంటావో నాతోనూ నిరుపమ గా అలాగే వుండాలి. నిన్ను కలసిన తరువాత నేను నిరుపమ లేదన్న ఫీలింగ్ నుంచి చాలా వరకు బయట పడ్డాను. మళ్ళీ అలాంటి క్లోజ్ ఫ్రెండ్ దొరుకుతుందా అనుకున్నాను. కానీ నువ్వు దొరికావు."
మేనక లేచి సమీర భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంది. "నిరుపమ స్థానాన్ని నేనెప్పటికీ పూర్తిగా భర్తీ చేయలేనని నాకూ తెలుసు. కానీ కొంతలో కొంతైనా నువ్వూ, రంగనాథ్ అంకుల్ నా వల్ల రిలీఫ్ పొందగలిగితే అది నిరుపమకి కూడా చాలా సంతోషం కలిగించే విషయం” అంది.
ఆ తరువాత సమీర, మేనక వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో కూర్చున్నాక వాళ్లంతా మరికొంత సేపు మాట్లాడుకున్నారు.
శుభం
