బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Abstract Drama Inspirational


3  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Abstract Drama Inspirational


నేటి తరనా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ topic 3

నేటి తరనా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ topic 3

2 mins 188 2 mins 188

పూర్ణమ్మ కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి కానీ అత్యాచారాలు ఇప్పటికన్న తక్కువ. ఆ నాడు పూర్ణమ్మ అప్పటి దురాచారం కి బలి అయ్యింది.నేటి తరం పూర్ణమ్మ ఇలా 

బాల్య వివాహాలు మరియు అత్యాచారానికి రెండిటింకి బలి కావాల్సి ఉంటుంది కావచ్చు.


చిన్ని నీ చూస్తూ వుంటే ఎంత సంతోషంగా వుంది తెలుసా అక్క...ఇంత మంచి సంబంధం దొరకడం దాని అదృష్టం అక్క...


ఊరు అంత అదే అంటున్నారు సుభద్ర...నా చిట్టి తల్లి నిజం గా ఎంత అదృష్ట వంతురాలో అని వొడిలో వున్న జావళి నీ గట్టిగా హత్తుకొని అంటుంది మీనాక్షి...


అరె మీరు ఇంకా ఇలానే కూర్చొని వున్నారా...త్వరగా పదండి పెళ్లి వాళ్ళు వచ్చేశారు...బ్యాండ్ వినపడట్టం లేదా...


అయ్యో....వచ్చేసరా...పదండి అని మీనాక్షి జావళి నీ సుభద్ర కి ఇచ్చి వెళ్ళింది....


అమ్మ జావళి....పెళ్లి అయ్యాక అత్తగారు ఇంట్లో ఎలా వుండాలి అని అమ్మ అన్ని చెప్పిందా...


లేదు పిన్ని...నేను నిన్న స్కూల్ నుంచి రాగానే రాత్రి పసుపు పెట్టారు..చేతికి గోరింటాకు కూడా పెట్టారు చూడు అని ఎర్రగా పండిన తన చేతులని చూపిస్తూ మురిసి పోతుంది...


ఎం చేయను తల్లి...బాల్య వివాహం ఎంత బాధ కరమైన జీవితాలను యిస్తాయో తెలిసి కూడా మీ జీవితాలను కపాడలేక పోతున్న ...అని మనసులో అనుకుంటూ...జావళి నీ హత్తుకొని నుదిటి పైన ముద్దు పెట్టుకుంటోంది..


పెళ్లి తంతు అంత బొమ్మా రింట్లో పెళ్లి ల అడుతు పాడుతూ ముగించిన .

వీడ్కోలు మాత్రం....నువ్వు నాతో రావా అమ్మ...రేపటి నుంచి నన్ను స్కూల్ కి ఎవరు రెడీ చేస్తారు...అన్నం ఎవరు పెడతారు...జడ ఎవరు వేస్తారు....నాన్న నువ్వు కూడా రావా అంటూ మొదటి రోజు స్కూల్ కి వెళ్ళే పిల్ల లా ఎక్కి వెక్కి ఏడ్చింది...


అత్తారింట్లో అడుగు పెట్టే క్షణం తను కాలు మోపగనే కాలు అడుగు తో పాటు వచ్చిన ఎర్రటి మరక తనను ఇంటి నుండి మూడు రోజులు వెలివేసి వురి చివర ఇంట్లో ఒంటరిగా వండుకొని పడుకో అని చెపితే ఏడుస్తూ తను పడిన మొదటి కష్టం...వర్షం కారణంగా రోడ్డు మీద పోయె తాగుబోతులు తన చెంతకు వస్తె జాలి పడి సహాయం చేస్తే ఆ కిరాతకులు జాలి కరుణ అనేవి లేకుండా అత్యాచారం చేసి చంపేశారు....


కోటి నవ్వులతో సాగవలసిన తన జీవితం మొగ్గ గ వుండగానే ముగిసీ పోయింది....
Rate this content
Log in

More telugu story from బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Similar telugu story from Abstract