gowthami ch

Drama

4.1  

gowthami ch

Drama

నా సంతోషం

నా సంతోషం

3 mins
418


పార్వతి , కేశవ్ లకు లేక లేక కలిగిన సంతానం ప్రగతి చిన్నప్పటి నుండి అన్నింట్లో ఎంతో హుషారుగా , చురుగ్గా ఉండేది , తనని చూసిన ప్రతి ఒక్కరూ కుంధనపు బొమ్మలాగా ఉంది పాప అంటుండేవారు. స్కూల్ లో కూడా అన్నింట్లో ముందుండేది. చదువులోనూ , ఆటల్లోనూ , క్రమశిక్షణ లోనూ అన్నింట్లో ముందుండేది. ప్రగతిని చూసుకొని ఎంతో మురిసిపోతుండేవారు తల్లిదండ్రులు .


చూస్తుండగానే ప్రగతి పెద్దదైపోయింది. అప్పుడే 9 వ తరగతికి వచ్చేసింది , ప్రతి ఏడాది తన స్కూల్ లో నిర్వహించే ఆటల పోటీలలో పరుగు పందెంలో మొదటి బహుమతి తనకే వచ్చేది , అలానే ఈ ఏడాది కూడా అందర్నీ ఓడించి మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో , వాళ్ళ ఉపాధ్యాయుడు "తరువాత సంవత్సరం జిల్లా స్థాయిలో పరుగు పందాలు నిర్వహిస్తారు అందులో మన పాఠశాల తరపున నిన్ను పంపుదాం అనుకుంటున్నాము అందుకు నువ్వు సిద్ధంగా ఉండు" , అని చెప్పి అల్ ది బెస్ట్ చెప్పారు . తరువాత ఎంతో ఆనందం తో ఆ విషయం ఇంట్లో చెప్పింది. దానికి వాళ్ళ అమ్మ , నాన్న ఎంతో సంతోషించారు.


అప్పటినుండి తనకి పరుగులో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. తనలో స్ఫూర్తిని నింపే ఎన్నో కథలు , ఎందరివో జీవిత అనుభవాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పటితో ప్రగతి 9 వ తరగతి పూర్తి అయింది. 10 వ తరగతిలోకి మొదలు పెట్టే సమయంలో ఒకరోజు ప్రగతి వాళ్ళ అమ్మ- నాన్న లతో కార్ లో తిరుమల కి వెళ్లి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకొని తిరిగి వస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది వెంటనే అక్కడి వాళ్లంతా ముగ్గుర్ని హాస్పిటల్ కి తెలుకెళ్లారు , కానీ వచ్చే దారిలోనే కేశవ్ చనిపోయాడని చెప్పారు , పార్వతికి మాత్రం అంత పెద్దగా ఏమి తగలలేదు కానీ ప్రగతి కి మాత్రం తన రెండు కాళ్ళు తీసేసారు , అది తెలిసి పార్వతి కుప్పకూలిపోయింది.


తన కూతురు కన్న కళలన్ని ఇంక కల్లలు గానే మిగిలిపోవలసిందేనా అని ఎంతో విలపించింది. ఇంతలో కూతురుకి స్పృహ వచ్చిందని చెప్పడంతో గదిలోకివెళ్లి కూతుర్ని చూసింది , అప్పటికే విషయం తెలుసుకున్న కూతురు తల్లిని చూసి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ నా కాళ్ళు తీసేసారమ్మ ఇంక నేను నడవలేనా అమ్మ , ఇది వరకటిలాగా పరిగెత్తలేనా అమ్మ అని కూతురు అడిగిన మాటలకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక "తనలో తాను ఎంతో కుమిలిపోయింది" పార్వతి.


ఇంతకీ నాన్న ఎక్కడ ఉన్నాడు అమ్మ నాన్న కి బాగానే ఉంది కదా అని అడిగింది ప్రగతి. "మీ నాన్న మనకు ఇంక లేరు తల్లి అని కూతుర్ని పట్టుకొని ఏడవసాగింది" పార్వతి. భర్త లేక , కూతురి ఇలాంటి పరిస్థితి ని చూసి పార్వతి గుండె భరువెక్కింది , అయినా తన బాధని దిగమింగుకొని కూతురిని ఓదార్చింది. అలా కొన్ని రోజులకి ఇంటికి వచ్చారు . ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న సందడి లేదు అంతా నిశ్శబ్దం , చీకటి అలుముకుంది ఇలా కొంత కాలం గడిచింది. "ఇలానే ఉంటే తన కూతురు జీవితం నాశనం చేసిన దాన్ని అవుతాను అనుకోని తనని తాను ఓదార్చుకొని , గుండెని దిటవు చేసుకొని కూతురిలో ఆత్మ స్థైర్యాన్ని నింపడం మొదలుపెట్టింది" పార్వతి .


"పరుగు ఒక్కటే నీ జీవితం కాదు ఇక్కడితో నీ జీవితం ఆగిపోలేదు , ఇప్పుడే కొత్తగా మొదలైంది. ఇంతకు ముందుకన్నా రెట్టింపు ఆత్మవిస్వాసంతో ముందుకు వెళ్ళాలి అని ఎంతో స్ఫూర్తి నింపింది" . తన కాళ్ళని కూతురి కాళ్ళగా చేసి తనని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకు రావాలని ఎంతో కష్టపడింది , చివరకు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ లో మంచి కంపెనీ లో ఉద్యోగం సంపాదించింది ప్రగతి. 


ఈ ప్రయాణంలో ఎంతో మంది తన అవిటి తనాన్ని చూసి జాలి పడేవారు , చులకన చేసేవాళ్ళు ఇలా ఎంతో మందిని చూసి విసుగు చెందిన ప్రగతి అవిటి తనం నా శరీరానికి మాత్రమే కానీ నా మనసుకు , నాలోని ఆలోచనలకు , నా ఆత్మస్థైర్యానికి కాదు అని నిరూపించుకోవాలి అనుకుంది. కొద్ది కాలంలోనే కంపెనీ లోని ఉన్నత స్థాయికి చేరుకుంది , అయినా తనకి సంతోషం కలగలేదు , అక్కడ కూడా తనని చూసి జాలి పడే కళ్ళే కనపడుతున్నాయి తనకి , అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయింది IAS లో మంచి ర్యాంక్ సాధించి తన జిల్లాకే కలెక్టర్ గా వచ్చింది.


తను కలెక్టర్ అయ్యి తిరిగి వస్తుంటే తన తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషం నాతోనే మొదలవుతుంది అనుకుని నవ్వుకుంది ప్రగతి. తరువాత ఊరు ఊరంతా తనకి ఆనందంగా స్వాగతం పలికారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళలో తనపట్ల జాలి లేదు , ఒక అవిటి అయి కూడా ఇంత గొప్ప స్థానాన్ని సాధించింది అన్న ఆశ్చర్యం ఒకవైపు , అన్ని అవయవాలు బాగుండి కూడా మనం ఏమి సాధించలేక పోయాము అన్న బాధ ఒకవైపు కనపడుతున్నాయి ప్రగతి కి , తను సాధించాలి అనుకున్న లక్ష్యం అదే. సంతోషం నాతోనే మొదలవ్వాలి నాలాంటి ఎంతో మంది కి నేను ఆదర్శం కావాలి అందరిలో కూడా నేను ఎందుకు సాధించలేను అనే ఆలోచన రావాలి , నేను కూడా అందరిలాగే ఉండివుంటే ఇంత సాధించేదాన్ని కాదేమో నా అవిటితనమే నా గెలుపుకి కారణం. అంతే కాకుండా నాలాంటి ఎంతో మందికి నన్ను మార్గదర్శనం అయ్యేలా చేసింది. ఇప్పుడు అందరి సంతోషం నాతోనే మొదలవుతుంది.Rate this content
Log in

Similar telugu story from Drama