Babuji Andaluri

Tragedy

3  

Babuji Andaluri

Tragedy

మరువలేని సంఘటన

మరువలేని సంఘటన

1 min
185


ఒక పట్టణ ప్రాంతమునందు నివసించుచున్న మా పిన్ని గారూ, ఆమె భర్త వారి ఇంట ప్రతి దినము వంట చేయుటకు వంట మనిషిని నియమించు కొనిరి. కరోనా మహమ్మారి విజుృంభణ ప్రారంభమైనది. ఇతర రాష్ట్రములో నున్న వారిరువురి కుమారులు వీరితో కొన్ని రోజులు నివసించుటకు గానూ వచ్చిరి. కుటుంబ సభ్యులందరూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాఠించేవారు.రెండు, మూడు పర్యాయములు కుటుంబములోని వారందరూ కరోనా మహమ్మారి ఉనికిని నిర్ధారణ పరీక్షను చేయించు కొని, సదరు ఉనికి లేదని తెలిసి కొని, సంతోషించిరి. కరోనా మహమ్మారి అంతమగుతున్న దశలో, మరలా కుటుంబములో నున్న వారందరూ కరోనా ఉనికి నిర్ధారణ పరీక్షలు చేయించు కొనగా, మా పిన్నిగారు మినహా మిగిలిన వారందరికి కరోనా లేదని నిర్ధారణ అయినది. విస్మయము చెందిన కుటుంబ సభ్యులు, వారి ఇంట వంటామెకు కూడ నిర్ధారణ పరీక్ష చేయించగా, ఆమెకు కూడ కరోనా ఉన్నదని నిర్ధారణ అయినది. వెంటనే ఆమెకు వంట చేయుటకు రావద్దని చెప్పరి. వంటామె వలవనే నా స్నేహితుని పిన్ని గారికి కరోనా వచ్చిందని కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చిరి. వెను వెంటనే మా పిన్ని గారిని హస్పిటల్లో చేర్చుటకు ఒకటి,రెండు దినములు విశ్వ ప్రయత్నాలుచేసి పట్టణ సరిహద్దులో గల కార్పొరేట్ హాస్పిటలు నందు జాయిన్ చేసిరి. నిష్ణాతులైన వైద్యులు రాత్రి, పగలు చేసిన ఆధునిక వైద్యము వ్యర్థమైనది. కుటుంబ సభ్యుల బాధ వర్ణానాతీతము. ఆ ఆకస్మిక ఘటన కుటుంబ సభ్యులకు మరువరాని విషాద ఘటనగా మిగిలి పోయినది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy