STORYMIRROR

Babuji Andaluri

Others

4  

Babuji Andaluri

Others

స్వయంకృతాపరాధం

స్వయంకృతాపరాధం

1 min
285

స్వయంకృతాపరాధము

              ———

   శేఖరు తన ఇద్దరి స్నేహితులతో ఒకేగదిలో నివసిస్తున్నాడు. ఒకరోజు వారు చుట్టుప్రక్కల ప్రదేశములు చూచుటకు మరియూ ‘ట్రెక్కింగు’ చేయుటకు సుదూర ప్రాంతము వెళ్ళిరి. ఒకచోట వారికి ఒక సొరంగం, అందులోనికి ఎవరూ వెళ్లరాదను నిషేధమును తెలియచేయు ప్రకటన కనపడినది. వారిలో, శేఖరు మాత్రము అత్యుత్సాహంతో సొరంగంలోనికి పోయి వచ్చిన్నాడు. టూరు ముగించుకొని, వారు వారి గమ్యస్ధానములకు తిరిగి వచ్చిరి. తర్వాత, అతి తక్కువ వ్యవధిలోనే శేఖరుకు వంట్లోబాగాలేదని, ఏవో శక్తులు తనను ఆవహించి, ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపించిందని వాని స్నేహితులతో చెప్పి, వారి సలహా మేరకు, వైద్యుని దగ్గరకు పోయి పరీక్ష చేయించగా, వైద్యుడు శేఖరుకు ‘మూత్ర పిండముల’ వ్యాధి ఉన్నదని నిర్ధారించి, వైద్యము చేసి, తగు జాగ్రత్తలు తీసుకొనవలసినదిగా సూచనలు ఇచ్చిరి. ఈ విషయము శేఖరు తల్లి దండ్రులకు తెలుసుకొని చాల బాధపడిరి. వారుకూడా శేఖరుని చూచుటకు వచ్చినపుడు, ఏవో శక్తులు శేఖరును బాధ పెట్టుటకు యత్నించున్నట్లు వారికి కూడా మౌఖిఖముగా కానవచ్చినదని నిర్థారించుకున్నారు. మరియూ వాటి ప్రభావమువలననే తమ కుమారునికి అనారోగ్యము చేసినదని భావించి నాటు వైద్యము చేయించుటకు యత్నించిరి. అలేగే ఇంగ్లీషువైద్యము, హుమయెూ వైద్యము కూడ చేయించిరి. హుమయెూ వైద్యము కొంచెము మంచిగానున్నదని శేఖరు వ్యక్తము చేసి, కొనసాగించాలను అభిప్రాయము వ్యక్తపరచినాడు. గానీ వ్యాధి మితిమీరినందున, వైద్యుని సలహా మేరకు హస్పటలునందు వానిని జాయిన్ చేయుట జరిగినది. ఎంతఖర్చైనాసరే ఉత్తమమైన చికిత్స చేయించి, తనను బ్రతికించమని శేఖరు చేసిన ఆర్తనాదములు వ్యర్ధములైనవి. జరుగకూడనిది జరిగి పోయినది.

    మూత్రపిండముల వ్యాధి విషయములో ఎన్నెన్నో అధునాతన వైద్యము ఉండికూడా శేఖరు యెుక్క ఆర్తనాదములు పరిగణలోనికి తీసుకు పోవడము స్వయంకృతాపరాధం కాదా!!!

             **********


Rate this content
Log in