babuji andaluri

Others

4.3  

babuji andaluri

Others

ప్రధమ విదేశీ విమానయానం

ప్రధమ విదేశీ విమానయానం

1 min
474


        నేను విశాఖపట్నం ఉండగా, 2008లో పాసుపోర్టు పొందుటకై నిరభ్యంతర పత్రము జారీ చేయుటకు జిల్లా అధికారికి దరఖాస్తు చేసితిని. అపుడు సహచరులు కొంచెం వ్యంగధోరణీ, నిరుత్సాహతా వెలిబుచ్చినారు. ఐనా వెనుక అడుగు వేయక నిరభ్యంతర పత్రము మరియూ పాసుపోర్టు సాధించాను.

     డిశెంబరు 2016లో, మా అమ్మాయి, అల్లుడు ఉద్యోగరీత్యా కుటుంబముతో సహా అమెరికా వెళ్ళి పోయారు. మా పెద్ద మనుమరాలు మనుశ్రీ జనవరి 2018 లో ఒకరోజు నాకు ఫోను చేసి, తనకు జూన్ 10 నుండి స్కూలుకు శెలవలు ఇస్తారు. శెలవల్లో వాళ్ళతో గడపటానికి అమెరికా రావాలని, వాళ్ళ నాన్నతో చెప్పి ఏర్పాట్లు చేయిస్తానని పలుమార్లు చెప్పింది. మనుమరాలు మాటలకు మాకు కూడా అమెరికా వెళ్ళాలను ఉత్సాహం కలిగింది.ఉత్సుకతను అమ్మాయికి చెప్పిందే తడవుగా, మా అల్లుడు చకా చకా ఏర్పాట్లు చేయడం, మా అబ్బాయి మంచి ఫ్లైటుకు టికట్లు రిజర్వు చేయడం జరిగి పోయాయి.

      ఈ విషయం మా తమ్ముళ్ళకు చెప్పగానే, మా కుటుంబాలలో మేము మెుదటిసారిగా అమెరికా వెళుతున్నందుకు వాళ్శు చాలా సంతోషించారు. సాంఘిక మాధ్యమాలలో కూడా పోస్టు చేసారు.

       ఆ విధంగా మా పెద్ద మనుమరాలు మనుశ్రీ యెుక్క ప్రోత్సాహంతో, మేము మెుదటి సారి “విదేశీ విమాన యానం” చేసి అమెరికా వెళ్ళినందుకు చాలా సంతోషంగా వుంది.

              ———-



Rate this content
Log in