Babuji Andaluri

Others

3  

Babuji Andaluri

Others

మరువలేని అనుభవము భాగము-1

మరువలేని అనుభవము భాగము-1

1 min
193


నేను, నాభార్య పర్యాటక ప్రాంతముులు 

సందర్శించుటకు గానూ మే 2018 లో, అమెరికాదేశంలో “హ్యూస్టన్” నందుగల మా అమ్మాయి వాళ్ళింట్లో బసచేసితిమి. అక్కడ ఇళ్ళన్నియుూ వేర్పాటుగా నున్నవి. ప్రతి ఇంటికి నిర్దిష్టమైన నిడివి, ప్రాంగణములో మెుక్కలు పెంపుదల, ఆ కోలనీలో రహదారుల నిర్వహణ,ప్రతి కూడలిలో గృహముల వివరములు తెలియచేయు బోర్డులు ప్రదర్శన బాగుంది. మేము అక్కడేయున్న “నాసా అంతరిక్ష” కేంద్రము, స్వామి నారాయణ క్షేత్రము సందర్శించితిమి. అప్పుడే మా అల్లుడుకు ఉద్యోగరీత్యా మిన్నోసోటా బదిలీ అయినందున మేము బస్సులో వెళ్ళి , మార్గ మధ్యలో “డెల్లాస్” లో మా తమ్ముని ఇింటి నందు బస చేసి, అక్కడ బాలాజీ క్షేత్రము చూసి, అక్కడ నుండి “మిన్నొసోటా” వెళ్లాము. ఈ నగరమునకు 10,000 లేక్సుగా ప్రసిద్ధి గాంచినది. అత్యంత శీతలీకరణ వాతావరణము అక్టోబరు నుండి ఏప్రియల్ వరకు నుండును. మిన్నొసోటా నందు మేము వాటర్ ఫాల్సు, థోమస్ బీచ్,బాలాజీ మందిర్ తదితర ప్రదేశములు చూచితిమి. వాతావరణ మార్పిడి వల్ల, సోడియం సాంద్రత తగ్గడం వలన నేను అస్వస్థతకు గురై, హాస్పిటలు నందు చేరవలసి వచ్చినది. ఆరోగ్యముగా కుదుటపడి డిశ్చార్జి అయిన వెంటనే అనతి కాలములోనే తిరుగు ప్రయాణమై వచ్చితిమి. 

         …. 2.వ భాగము త్వరలో



Rate this content
Log in