babuji andaluri

Others

4.2  

babuji andaluri

Others

నిజమైన కల

నిజమైన కల

1 min
251


    వాళ్ళ నాన్నగారి ఇంటికి స్నేహితులు వచ్చారు. మాటల సందర్భంలో వాళ్లు పుణ్యక్షేత్రములు చూశామని, అందులో వారణాసి కూడా వెళ్ళామని, ఆ విశ్వనాధుని అనుమతి లేనిదే వారణాసి వెళ్లలేమని చెప్తూ ఉండగా బాలాజీ విన్నాడు. ఆశక్తిగా నున్న ఆ మాటలకి అతనికి వెంటనే వారణాసి వెళ్లాలని పించింది. వాడి తల్లిదండ్రులతో చెప్పగా, స్కూలు శెలవలలో వెల్దామని వాయిదా వేశారు. 

అతను వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతూ ఉండడం,వాళ్లు ఏదో కారణాలు చెప్పి వాయిదా వేయడం జరుగుతూ ఉండేది. ఈలోపున, అతని చదువు పూర్తి అయి ప్రభుత్వ ఉద్యోగములో జాయిన్ అవ్వడం, పని వత్తిడి ఎక్కువైంది. వాళ్ళ తల్లితండ్రులకు అవకాశము వచ్చి వాళ్ళు వారణాసి వెళ్ళ్ళి రావడమైనది. ఈతను ప్రభుత్వం వారు కల్పించిన ఎల్టి.టి.సి సదుపాయము మీద రాష్ట్రంలోనే చిన్నచిన్న వినోద ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవాడు.

వారణాసి వెళ్లాలని కోరిక అలాగే మిగిలిపోయింది. అలాగే అతని ప్రభుత్వ సర్వీసు కూడా ముగిసిపోయింది. తదనంతరం అతనికి అనారోగ్య కారణాల వలన శస్త్ర చికిత్సలు జరగడంతో , తాను ఎక్కడకు వెళ్ళలేనను నిరాశకు గురైనాడు. 

      2015 సంవత్సరం డిసెంబర్ మాసంలో అతని దూరపు బంధువు ఒకతను ఫోన్ చేసి వారణాసి మరియు తదితర ప్రాంతములకు వారందరూ వెళుతున్నామని చెప్పి, ఇతనిని కూడా రమ్మని చెప్పడం జరిగినది. ఇతనికి అంతకుముందే శస్త్ర చికిత్స అయినందున మొదట వెనక అడుగు వేసాడు. కానీ ఈ పిలిపే ఆ విశ్వనాథుని అనుమతి భావించి సతీసమేతంగా బయలుదేరి వారణాసి వెళ్లి అక్కడ 11 దినములు ఉండి, అచ్చట నుండి అయోధ్య, నైమిశారణ్యం తదితర ప్రాంతములు కూడా తిరిగి వచ్చాడు. ఆ విధంగా అతని చిరకాల కోరిక తీరింది.ఎంతో తృప్తిగాను, ఆనందంగానూ ఉందనుకున్నాడు.

      ఏదైనాసరే, పెద్దలు నానుడి ప్రకారం, వారణాసి సందర్శన ఆ సర్వేశ్వరుని అనుమతి మేరకే అనునది అక్షర సత్యం.

        ————————


Rate this content
Log in