babuji andaluri

Inspirational

4.3  

babuji andaluri

Inspirational

నమ్మకం

నమ్మకం

1 min
255


అరుణాచల గిరి ప్రదక్షిణ మరియు అరుణాచలేశ్వరుని దర్శనము చాలామంచిదని అక్కడకు వెళ్లి వచ్చినవారు అంటూ ఉంటే నాకు కూడ అరుణాచలం వెళ్ళాలనిపించింది. నా కుటుంబముతో సహా అరుణాచలం వెళ్లాను. అక్కడకు చేరిన తరువాత నేను,నా భార్య మాత్రమే గిరిప్రదక్షిణము చేయుటకు సంకల్పించితిమి.మరుసటి రోజు పొద్దున్నే నడక ప్రారంభించాము .మార్గమధ్యంలో మాకు సాంప్రదాయ దుస్తుల్లో నడివయసు కలిగిన ఒక విదేశీయురాలు కూడా గిరిప్రదక్షిణ చేయడం కనిపించింది. ఆమెను చూడగానే మాకు కొంచెం ఆశ్చర్యం అనిపించి, ఆవిడను మీరు విదేశము నుండి ఇంత దూరం వచ్చారు.ఎవరైనా ప్రోద్బంలంతో వచ్చారా!అనగానే,ఆమె ఎవరో వెళ్లమని చెప్తే రాలేదని, తనకు ఈ ప్రదేశము మరియు శివుడి మీద నమ్మకముతో వచ్చానని చెబుతూ ,ఆ శివుడు మీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఉన్నాడని, అంతా శివ మయమని చెప్పింది. అందులకు మేము కొంచెం విస్మయం చెంది,శివుని మీద నమ్మకంతో అరుణాచలం వచ్చినట్టే మీరు మిగిలిన దేవుళ్ళని కూడా నమ్మి ఇతర పుణ్యక్షేత్రములకు ఎందుకు వెళ్లలేదు? ఆ దేవుళ్ళని కూడా తెలుసుకొన ప్రయత్నము చేయలేదా! అని అడగగా అంతా శివమయం అయినప్పుడు దేవుళ్ళలో తేడా ఉండదని, అందరి దేవుళ్ళుకు మూలము ఆ శివుడేనని,చెబుతూ ఏదైనా చూసి నమ్మితే నిజం అంటారు అని,చూడకపోయినా అనుభవం ద్వారా తెలుసుకుంటే అది సత్యం అంటారు అని చెప్పింది. అందుచేత నమ్మిన శివుడు జ్ఞానం ప్రసాదిస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆమె నమ్మకానికి మనస్సులో వందనాలు చేయాలని అనిపించింది. మేము గిరి ప్రదిక్షణ తరువాత అరుణాచలేశ్వరుని దర్శనము చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము.

             


Rate this content
Log in

Similar telugu story from Inspirational