Ambica Lakshmi

Drama Fantasy Thriller

3.4  

Ambica Lakshmi

Drama Fantasy Thriller

మంత్రగత్తె పెళ్ళాం

మంత్రగత్తె పెళ్ళాం

7 mins
538


ఆ రోజు రాత్రి సురేష్ కి అసలు నిద్ర రావడం లేదు పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే నిద్ర దరిచేరను అని మారం చేస్తుంది

ఇక ఏం చెయ్యాలో తెలియక పైకి లేచి తన స్టడీ చైర్ లో కూర్చుని చేతిలో పెన్ పెట్టుకొని ఎదురుగా ఉన్న స్టడీ లైట్

ఆన్ చేసుకొని కాళ్ళు రెండు పైకి పెట్టుకొని పెన్ అటూ ఇటూ తిప్పుతూ

" ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి ఒక్క నా జీవితంలో తప్ప అని అనుకుంటూ "

సంతోషంగా గడపాలి అని అనుకున్న ప్రతి సారి ఏదో బాధ ఆందోళన తలెత్తుతూనే ఉన్నాయి

స్టడీ లైట్ పక్కనే ఉన్న దేవుడిని చూస్తూ ఎంటి దేవుడా ఇన్ని బాధలు పడిన తరవాత కూడ నీకు నా మీద కరుణ కలగడం లేదా ఇంక ఎన్ని బాధలు ఇంకెన్ని కష్టాలు రాశావు నాకోసం 

చాలు ప్లీజ్ ఇంక ఆపే నేను తట్టుకోలేకపోతున్నాను

ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవుడా నా కథ ఎవరికైనా వినిపించేలా చేయి ఇన్ని సంవత్సాలుగా ఎదురుచూస్తూనే ఉన్నాను కానీ ఒక్కరూ కూడా నా కథ వినడానికి కూడా ముందుకు రావడం లేదు

ఇంకెంత కాలం ఎదురుచూడాలి అనేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు

సరేలే నిన్ను అని మాత్రం ఏం ఉపయోగం రాసి ఉండాలి దేనికైనా , అనుకుంటూ అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు 


గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు

ఈలోగా అక్కడికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది 

ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ పైకి లేచాడు 

ఎదురుగా ఎవరు లేరు అంతా నా బ్రమ అనుకుంటూ మళ్ళీ పడుకున్నాడు


మళ్ళీ కొద్ది సేపటికి చల్ల గాలి వెయ్యడం మొదలు అయింది ఎంటి ఉన్నపళంగా ఇంత చల్లగా మారిపోయింది గది అంతా అని దుప్పటి తీసుకుందాం అని పైకి లేచాడు

తెరిచి తెరవలేని కన్నులను తెరుస్తూ నించున్నాడు

ఎదురుగా ఒక తెల్లని చాయ చుట్టూ చూశాడు ఎక్కడ టార్చ్ లైట్ ఆన్ చేసి లేదు మరీ ఈ వెలుగు ఎంటి అని కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తున్నాడు


అప్పుడు ఒక మాట వినిపించింది

" బలకా చెప్పు నీకు ఏం వరం కావాలో అడుగు ? " అని


సురేష్ :

హా వరం ఎంటి వరం ఎవరు మాట్లాడేది చెప్పండి అని అంటున్నాడు


" రాజు కోరికల చిట్టతో నన్ను అసలు ప్రశాంతంగా బ్రతనిస్తావా నువ్వు అందుకనే నీ మీద జాలి కలిగి ఒక వరం ఇవ్వాలి అని నిష్యాయించుకొని వచ్చాను చెప్పు నీకు ఏం వరం కావాలి " అడుగు 


సురేష్ :

నాకు తెలుసు మీరు ఎవరో కావాలనే నాతో ఇలా మాట్లాడి నా చేత కోరికలను వినిపించుకుని తరవాత నా వీడియో తీసుకొని వీళ్ళు ప్రాంక్ అని యూ ట్యూబ్ లో పెట్టేద్దాం అని ప్లాన్ వేస్తున్నారు కదా ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు మీ మాటలకి పడిపోవడానికి అని వాదిస్తున్నాడు


" ఓరి పాపిస్టోడా అక్కడ నా పనులు అన్నీ ఆపుకొని ఇక్కడికి వచ్చి నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటే నువ్వు ఏమి రా నాకు పరీక్షలు పెడుతున్నావు నా బాబు కాదు ఒక్క మంచి వరం కోరుకో నాయన లేదంటే నా పరువు పోతుంది శపద్దం చేసి మరీ వచ్చాను " 


సురేష్ :

నేను ఎలా నమ్మాలి మీరు దేవుడని నాకు ఎందుకో నమ్మాలి అని లేదు


" చూడు సినిమాలోలా నువ్వు అది చేసి నిరూపించండి ఇది చేసి నిరూపించండి అని గొంతమ్మ కోరికలు అడగకు నన్ను నమ్ము నీ గుండెల మీద చెయ్యి వేసుకొని నీకు ఏం కావాలో అడుగు అడిగితే పోయింది ఏం ఉంది చెప్పు అంతే కదా " అని దేవత సురేష్ కు అర్థం అయ్యేలా వివరంగా చెప్తున్నారు


సురేష్ :

సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు ఒక మంత్రగెత్తే పెళ్ళంగా కావాలి అని అడిగాడు 


" అయ్యో ! బాగా ఆలోచించుకొని అడుగు ఒక్కసారి నేను తథాస్తు అన్నాను అంటే మళ్ళీ వేరొక వరం నీకు దక్కదు ఆ వరం నుంచి నువ్వు బయట పడలేవు ముందే చెప్తున్నాను తరవాత నన్ను అని లాభం ఉండదు " అని సమాధానం ఇచ్చింది


సురేష్ బాగా ఆలోచించి సరే అయితే

అందమైన మంత్రగత్తె భార్యగా కావాలి అని అడిగాడు


" నీ కర్మ బాగుపడేవాడిని ఎలా అయితే ఆపలేమో నీలాంటి వాళ్ళని బాగుచేయలేము అంటూ సరే నీ అమాయకత్వానికి లాభాన్ని ఇస్తుంది లే ఈ వరం అంటూ తదాస్తూ అని చెప్పి " వెళ్లిపోయింది


సురేష్ :

హా దొరికిందా మీకు కావల్సిన వీడియో దొరికినట్టు ఉంది సంతోషమా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా నేను చాలా ఇంటెలిజెంట్ని నన్ను అంత సులువుగా బుట్టలో వేసుకుందాం అని చూస్తారా అహ ఆహా అంటూ పడుకుంటాడు

చాలా గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు 


ఉదయం ఆరు అయింది 

చాలా మత్తుగా మెల్లగా కళ్లు తెరుస్తు బద్దకంగా విరుచుకుంటూ కళ్ళు తెరిస్తాడు 

ఎదురుగా చూసేసరికి ఒక అందమైన అమ్మాయి చేతిలో టీ పెట్టుకొని ప్రత్యక్షమైంది 


కళ్ళు నలుపుకొని మళ్ళీ నిదానంగా గమనిస్తాడు 

ఆ అమ్మయి అక్కడే ఉంది 

ఆ ! అని గట్టిగా అరిచి ఏ ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు ఎంటి చెప్పు ఎవరు నువ్వు అని అరుస్తాడు


" ఎంటండీ అలా అంటున్నారు నేను మీ భార్య విక్టోరియా ఏం అయింది మీకు ? " అని అడిగింది 


సురేష్ :

మళ్ళీ ఇది కొత్త డ్రామా నా 

నాటకాలు ఆడకు నాకు పెళ్ళి అవ్వలేదు పెళ్ళాం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడినుంచి వెళ్ళిపో నువ్వు లేదంటే పోలీసులను పిలుస్తాను అని అంటాడు 


విక్టోరియా :

ఏవండీ నాకు కోపం తెప్పించకండి 


సురేష్ :

నువ్వు నన్ను ఏవండీ అని పిలవకు

అయినా నీకు నాకు పెళ్ళి అయింది అని రుజువు ఎంటి మన ఇద్దరికీ కలిపి ఒక ఫోటో కూడా లేదు అని అడిగాడు


అలా అడిగిన వెంటనే ఆమె ఒక చిటిక వేసింది ఆ గదిలో వాళ్ళు ఇద్దరి పెళ్లి ఫోటోలు వచ్చేశాయి 


ఇది అంత ఎంటి నువ్వు ఏం చేస్తున్నావు అని కంగారు పడుతూ అడిగాడు సురేష్ 


అప్పుడే ఆమె గట్టిగా నవ్వుతూ చేతులు రెండు దురంగా చాచి ఒక చిటిక వేసింది

అలా వేసిన వెంటనే ఆమె తన నిజస్వరూపాన్ని వచ్చేసింది 

నల్లటి బట్టలు పెద్ద పెద్ద గోర్లు పెద్ద పెద్ద కళ్ళు ఏడడుగుల పొడవు సన్నటి నడుము తెల్లటి శరీరంతో అందమైన గ్రాఫిక్స్ ఉపయోగించి ఫోటో ఎడిట్ చేసినట్టుగా ఉంది ఆమెను చూస్తుంటే అలానే ఆమెను చూస్తూ ఉన్నాడు అంటే రాత్రి జరిగింది అంతా అయ్యో అని తల మీద చెయ్యి వేసుకొని కర్మ కర్మ అన్నిటిలో ఇదే తొందరపాటు అనవసర నిర్ణయాలు బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు అనుకొని ఏం ఉపయోగం అని నెత్తి మిద చేయి వేసుకొని అంటే ఇప్పుడు నువ్వు నాకు పెళ్ళాం అంతే కదా నేను నీ మొగుడిని సరే వద్దు అని చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది 


సరే గానీ దయచేసి నువ్వు కాస్త మామూలుగా మరతావా ముందు పద్ధతిగా టీ తీసుకొని వచ్చావు కదా అలా అని అడిగాడు


విక్టోరియా :

సరే మీ ఇష్టం అని మామూలుగా మారిపోయింది 


సురేష్ మనసులో అమ్మో ఇప్పుడు ఈ మంత్రగత్తె తో ఎలా వేగాలో ఎంటో నాకు అయితే భయం ఐతుంది 

చూడు విక్టోరియా నేను ఒక మాట చెప్పనా ? అని మెల్లగా ఆమెను అడుగుతున్నాడు


విక్టోరియా :

హా అడగండి ఏం కావాలి 


సురేష్ :

అది నువ్వు ఇక్కడకి ఎలా వచ్చావు నేను నీకు నచ్చనా మరీ ఇబ్బందిగా ఏమి నాతో ఉండనవసరం లేదు నీకు నచ్చకపోతే ఇక్కడినుంచి నువ్వు వెళ్ళిపో నేను ఏం అడ్డుకొను


విక్టోరియా :

మీరు నా భర్త నేను మిమల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను చావైనా బ్రతుకైన ఇక మీతోనే సరే మీరు ఏం తింటారు సమయం అయింది టిఫిన్ చెయ్యడానికి అని అడుగుతుంటే 

సురేష్ మనసులో అయిపోయింది అంతా అయిపోయింది ఇక నుంచి ఈ ఏడడుగుల ఆజానుభవురాలితో నేను బ్రతకాలా 


విక్టోరియా ఒక చిటిక వేసింది వెంటనే ఆమె ఐదు అడుగులు అయిపోయింది

" చూడండి మీరు మనసులో అనుకునే మాటలు కూడా నాకు వినపడతాయి కాబట్టి ఏం కావాలి అని అనిపించిన బయటకే అడగండి లేదంటే నాకు కోపం వస్తుంది " 


సురేష్ :

వద్దమా వద్దు నీకు కోపం వస్తే మళ్ళీ నువ్వు ఆ నల్ల బట్టలు వేసుకొని హల్లోవీన్ కి రెడీ అయినట్లు ఐపోతావు నాకు ఎందుకు వచ్చింది చెప్పు ఏం కావాలి అన్నా బయటకే చెప్తాను సరే నా ! 


కొన్ని రోజులు అలా సాగిపోయాయి 

విక్టోరియా సురేష్ ను చాలా బాగా చూసుకుంటుంది సురేష్ అనాధ చిన్నప్పటినుంచి ఎవరి ప్రేమకు నోచుకోని అతను ఆమె ప్రేమకు బానిసైపోయాడు 


విక్టోరియా కూడా కొత్త ప్రదేశం అయినా చాలా చక్కగానే అలవాటు చేసుకుంది

ఆమె మంత్రాలను ఉపయోగించి సురేష్ కు అన్ని సమకూరుస్తుంది సురేష్ అత్యసవాది కాదు తనని అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ అడిగే వాడు కాదు కష్టపడి ఉద్యోగం చేసుకునే వాడు సంపాదించేవాడు కానీ ఒక విషయంలో మాత్రం బాధ పడుతూ బయట పడకుండా ఉండే వాడు తనకు రైటర్ అవ్వాలి అనే కల కోసం 


రాజు ఆరు గంటలకే ఇంటికి వచ్చేశాడు ఆ రోజు ఏడు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు 

విక్టోరియా మనసులో అనుకుంటుంది ఈయన ఎక్కడ ఉన్నారు ? కనీసం మనసులో కూడా ఏమి అనుకోవడం లేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది అని బయటకి చూస్తూ ఉంటుంది


గట్టిగా వర్షం కూడా పడుతుంది 

సురేష్ రోజు లానే ఇంటికి బయలుదేరాడు వర్షం పడుతుంది అని మెల్లగా నడుపుతూ వస్తున్నాడు అయితే ఈలోగా వెనక నుంచి ఒక పెద్ద లారీ సురేష్ ను గుద్ది కనీసం ఎలా ఉన్నాడు అనేది కూడా చూడకుండా వెళ్ళిపోయాడు


స్పృహ తప్పి పడిపోయాడు సురేష్ రక్తం వస్తుంది వర్షం కాలం అవ్వడం వల్ల తొందరగా చీకటి పడిపోయింది అది కాకుండా గట్టిగా వర్షం పడుతుంది ఎవరు అటుగా వెళ్ళేవారు కూడా లేరు 


విక్టోరియా తన శక్తులతో ఎక్కడ ఉన్నాడు అనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ఆచూకీ తెలియడం లేదు 

ఊరు మొత్తం పిచ్చిదానిలా వెతుకుతుంది 


అప్పుడే సురేష్ ఉన్న ప్రదేశంలో కాస్త దూరంగా ఒక పెద్ద పిడుగు పడింది 

ఆ పిడుగు అదురుకి మెలుకువ వచ్చిన సురేష్ అటు ఇటు చూసుకుంటూ అమ్మ అని బాధతో విలవిలాడుతు 

దేవుడా నేను ఇంకెంతో సేపు బ్రతకను అనుకుంటా మా విక్టోరియాను జాగర్తగా చూసుకో అని అనుకుంటూ

మనసులో విక్టోరియా నువ్వు జాగర్త అని అనుకుంటాడు


వెంటనే ఆ మాట విక్టోరియాకు వినిపించేస్తుంది 

నిమిషాల్లో ఆమె సురేష్ దగ్గరకి చేరుకుంది

తుది శ్వాసలో ఉన్న అతనికి తన శక్తులలో సగం శక్తులను ఉపయోగించి అతన్ని నయం చేస్తుంది ఇంకాస్త దూరంలో వేరొక వ్యక్తి సహాయం కోసం ఎదురుచూడడం ఆమెకు తెలిసింది వెంటనే ఆ వ్యక్తి దగ్గరకి కూడా వెళ్ళి అతన్ని కాపాడి మామూలు వ్యక్తిని చేస్తుంది అలా వారి ఇద్దరినీ కాపాడడంతో ఆమె పూర్తి శక్తులను కోల్పోయింది

మనుషులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడితే ఆమె శక్తులను పోగొట్టుకుంది అని తెలిసి కూడా ఆమె వారిని కాపాడుతుంది అలా అయినా తన భర్త తనకు దక్కుతాడు అని శక్తుల కన్నా మనిషి ప్రాణం ముఖ్యం అనే ఉద్దేశ్యంతో ఆమె అలా చేస్తుంది 


సురేష్ కూడా చాలా సంతోషిస్తాడు నాకు నోటికి వచ్చిన వరాన్ని కోరుకున్నాను అని చాలా బాధ పడ్డాను నా మీద నేను చిరాకు పడ్డాను విక్టోరియను కూడా ముందు సరిగ్గా చూసుకోలేదు కానీ తనే ఇప్పుడు నన్ను కాపాడింది తన శక్తులు పోయిన పరవలెదు అనుకుని మరొక మనిషి ప్రాణాలను కూడా కాపాడింది నాకు తన మీద చాలా గర్వంగా ఉంది అనుకుంటూ ఆమెను దగ్గరకి తీసుకుంటాడు 


రెండు రోజుల తరవాత 

సురేష్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు 

ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించి విక్టోరియా తీసుకొని వచ్చి సురేష్ చేతిలో పెడుతుంది 


ఫోన్లో వ్యక్తి " హాల్లో సురేష్ గారు నేను ఒక మూవీ తియ్యాలి అనుకుంటున్నాను దానికోసం మీరు నాకోసం ఒక కథ సిద్ధం చేస్తారా , రేపు నేను మిమల్ని కలవాలి అనుకుంటున్నాను మీరు ఫ్రీ అంటే నేను మీ ఇంటికి వస్తాను అంటాడు " 


సురేష్ :

తప్పకుండా సర్ నేను కలుస్తాను మిమల్ని రేపు మా ఇంటికి రండి మా అడ్రస్ నేను మీకు పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు


పైకి లేచి పరుగున విక్టోరియా దగ్గరకి వెళ్లి ఆమెను గట్టిగా హగ్ చేసుకొని నువ్వు నా అదృష్ట దేవతవి నువ్వు వచ్చిన తరవాత ఒక మెరుపు వేగంతో నా జీవితం మొత్తం మారిపోయింది అని 

ఆ మాటలకి విక్టోరియా నవ్వుకుంటుంది


మరుసటి రోజు 

ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు


సురేష్ చాలా సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని వెళ్ళాడు

లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి విక్టోరియా ను ఎప్పటినుంచో తెలిసినట్టు యోగ క్షేమాలను అడుగుతున్నాడు

విక్టోరియా కూడా అతనికి అలానే సమాధానం ఇస్తు అతను ఎలా ఉన్నాడు అని అడుగుతుంది 


సురేష్ :

మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని అడిగాడు


ఆ వ్యక్తి " తెలియడం ఎంటి ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానిలో కేవలం మీ భార్యనే కారణం రెండు రోజుల క్రితం నేను ఒక చిన్న ఏక్సిడెంట్ అవ్వడంతో స్పృహ తప్పి పడి ఉంటే ఆమెనే నాకు వైద్యం చేసి నాకు సహాయం చేశారు అలా మాటల్లో మీ గురించి నేను తెలుసుకున్నాను మీరు నాకు సినిమా తియ్యడంలో కథకు సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను " అని చెప్తారు


దానికి సురేష్ విక్టోరియా వైపు చూసి నవ్వుతూ తప్పకుండా అలానే చేస్తాను అండి అని సమాధానం ఇస్తాడు


" ఇంతకీ మీ కథ గురించి మాకు చిన్నగా వివరిస్తారా " అని అడుగుతాడు ఆ వ్యక్తి


సురేష్ :

ఇది ఒక ఫాంటసీ కథ

అసలు ఒక మంత్రగత్తెతో పెళ్లంగా వస్తె జీవితం ఎలా మారుతుంది అనేది కథ అని వివరిస్తాడు


" నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇదే ఫీక్స్ చెయ్యండి కొన్ని రోజుల్లో మీ కథను పూర్తి చేసుకోండి నేను ఈలోగా అన్ని సిద్దం చేసుకుంటాను " అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతాడు 


విక్టోరియా :

ఇంతకీ మీరు ఏం కథ చెప్పబొదాం అనుకుంటున్నారు అని అడిగింది


సురేష్ :

ఇంకెవరి కథ మన కథే చెప్తాను అని కథను సిద్దం చెసే పనిలో పడతాడు 


కొన్ని నెలల తరవాత 

అనుకున్న ప్రకారమే ఆ కథను సినిమా రూపంలో చేస్తారు సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది 

వారి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది సురేష్ అనుకున్న కోరిక నెరవేరుతుంది

విక్టోరియా తో జీవితం ఆనందంగా బాధలు లేకుండా సాగుతుంది.....

వారి కథ సుఖాంతం


మంచి మాట :

కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న పనులు పూర్తి అవ్వడానికి సమయం పట్టవచ్చు కానీ నమ్మకం ఉంచితే ఏదైనా సాధ్యమే 

మనిషి ప్రాణం కన్నా ఏది విలువైనది కాదు 

పొరపాటున చేసిన పనులు కూడా కొన్ని సార్లు ఆశ్చర్యపరిచే ఫలితాన్ని ఇస్తాయి...



Rate this content
Log in

Similar telugu story from Drama