gowthami ch

Drama

4.5  

gowthami ch

Drama

మన పండగ

మన పండగ

3 mins
424


 అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురెళ్లి చేతిలోని బ్యాగ్ అందుకుంటూ "ఏంటండి ఈ రోజైనా కాస్త ముందుగా రావచ్చుగా? ఇప్పటివరకు పిల్లలు మీ గురించే కలవరించారు తెలుసా?" అంది సరోజ.


"నన్నేం చేయమంటావు చెప్పు సరోజ. నేను కూడా ఈరోజు ముందే వచ్చేద్దాం అనుకోని బయలుదేరాను ఇంతలో మా ఫ్రెండ్ ఒకడు ప్రాజెక్ట్ లో చిన్న డౌట్ ఉంది క్లియర్ చేయమనడంతో కాదనలేక ఉండిపోయాను." అంటూ వచ్చి సోఫాలో వాలిపోయాడు.


"ఇలాగే రోజు ఏదో ఒకటి చెప్తూ ఉండండి ఏదో ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని అడగడం కూడా మనేస్తారు." అంటూ వంటింట్లో నుంచి మంచినీళ్లు తెచ్చి భర్త చేతికి అందించింది సరోజ.


నీళ్లు తాగేసి గ్లాస్ పక్కన పెడుతూ "నేనూ అదే ఆలోచిస్తున్నాను సరోజ. నాకు మాత్రం పిల్లలతో గడపాలని ఉండదా ఏంటి? ఇంకొక్క 10 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అప్పుడు ఏకంగా ఒక వారం సెలవు పెట్టేసి పిల్లలతోనే గడుపుదాం అనుకుంటున్నాను. నువ్వేమంటావ్?" అంటూ కళ్ళు ఎగరేశాడు అభిరామ్.


"మీరు చెప్పింది బాగానే ఉంది కానీ 10 రోజులు అని కాదు, ఎలాగో ఈ నెల గడిస్తే పిల్లలకి కూడా పండగ సెలవులు ఉన్నాయి కదా, అప్పుడు ఎలాగో మీకు 1 లేక 2 రోజులు సెలవులు ఇస్తారు, ఆ మిగతా రోజులు మీరు సెలవులు పెట్టారనుకోండి అప్పుడు ఆ పండగ 4 రోజులు అయినా పిల్లలతో ప్రశాంతంగా గడపొచ్చు." అంది నవ్వుతూ.


"అవును సరోజ, ఇదే మంచిది, ఇలానే చేస్తాను. అప్పుడైతే అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి రోజంతా పిల్లలతో గడపొచ్చు. వీలైతే బయటకి కూడా వెళదాం." అంటూ సోఫా లో నుండి పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళాడు.


"అమ్మా ఈరోజు మాకు స్కూల్ లేదా?" గారంగా అడిగింది కూతురు ఆధ్యా.


"లేదమ్మా ఈరోజు నుండి మీకు పండగ సెలవులు బుజ్జి" అంటూ ప్రేమగా పాపని దగ్గరకి తీసుకుంది సరోజ.


"మరి రేపు?" అంటూ అమాయకంగా అడుగుతూ వచ్చాడు చందు.


"రేపు కూడా లేదు నాన్న" అంటూ బాబుని కూడా దగ్గరకు తీసుకుంది సరోజ.


"హై... ఈరోజు స్కూల్ లేదు" అంటూ ఇద్దరూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉండడం చూసి అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన అభిరామ్ పిల్లళ్ళిద్దర్నీ దగ్గరకి రమ్మని చేతులు చాపి "దా...దా..దా.."అంటూ పిలిచాడు.


పిల్లలిద్దరూ "నాన్నా...!!" అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నని హత్తుకున్నారు.


"నాన్నా , ఈరోజు నుండి మాకు సెలవలు అంట స్కూల్ లేదంట" అంది ఆధ్యా అమాయకంగా.


"అవునా!! చిట్టితల్లి?"


"అవును నాన్న..నీకు కూడా ఆఫీస్ కి సెలవులు ఇచ్చారా?" అంటూ అడిగాడు చందు.


"అవును నాన్న , నాన్న కి కూడా సెలవులు ఈరోజు నుండి. అందరం కలిసి బయటకి వెళదాం త్వరగా వెళ్లి తయారవ్వండి" అంటూ పిల్లళ్ళిద్దర్నీ సరోజ కి అప్పగించాడు.


పిల్లలకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తయారు చేసి తను కూడా తయారయ్యి బయటకి వచ్చే సరికి అభిరామ్ కూడా తయారయ్యి ఉండడంతో అందరూ కలిసి గుడికి బయల్దేరారు.


"అమ్మా ఈరోజు దసరా నా? " అడిగింది ఆధ్యా.


"అవును నాన్న. "


"దసరా అంటే ? "


"అంటే అది మన పండగ నాన్న." అంది సరోజ.


"అంటే?" అని నవ్వుతూ అడిగాడు చందు.


"అంటే నేను చెప్తాను రా నాన్న" అంటూ చందు ని తన ఒడిలో కూర్చొబెట్టుకొన్నాడు అభిరామ్.


"ఒక ఊర్లో కొందరు బూచోళ్లు ఉండేవారంట వాళ్ళు దేవుడి కోసం తపస్సు చేసి వాళ్ళకి మరణం లేకుండా వరం కోరుకున్నారంట అప్పుడు దేవుడు మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు అనడంతో అయితే మా మరణం ఒక ఆడదాని చేతిలోనే ఉండేలా వరం ఆడిగారంట.


"అలా ఎందుకు అడిగారు నాన్న" అని అడిగింది ఆధ్యా.


"ఆడవాళ్లు అంటే వాళ్ళు ఏమి చేయలేరు అన్న నమ్మకం వాళ్ళకి అందుకే కావాలనే అలా అడిగారు. అప్పుడు దేవుడు తథాస్తు అని వెళ్లిపోయారు."ఆ తరువాత వాళ్ళకి ఇచ్చిన వరం మూలంగా వాళ్ళకి చావు ఉండదు అన్న అపనమ్మకంతో ఇంక వాళ్ళు ఏమి చేసినా ఎవరూ ఏమి చేయలేరు అనే గర్వంతో ఆ ఊర్లో ఉండే ప్రజలందరినీ భయపెడుతూ , చంపేస్తు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లు పెట్టే ఇబ్బందిని తట్టుకోలేకపోయిన అక్కడి ప్రజలు అందరూ భయపడి , వెళ్లి దేవుడిని మొరపెట్టుకున్నారు.


"అప్పుడు దేవుడు వారిని కాపాడడానికి ఆ రాక్షసులని చంపాలని ప్రయత్నించి విఫలం అవ్వడంతో, అందరూ వెళ్లి అసలు ఈ సృష్టికి మూలం అయిన ఆ అమ్మవారిని వేడుకున్నారంట అప్పుడు ఆ అమ్మవారు ఆ బూచోళ్ల మీద కోపంతో , ఆడవాళ్లు ఏమి చేయలేరు అన్న వాళ్ళ అభిప్రాయాన్ని తప్పు అని తెలిసే విధముగా వాళ్ళందర్ని చంపేసింది.


"వాళ్లు చనిపోయారు కదా ఇంక మనకు ఏమీ కాదు అన్న ఆనందంలో పండగ చేసుకుంటాము. అలాగే మనల్ని వాళ్ళ భారి నుండి కాపాడినందుకు ఆ అమ్మవారిని ఈ 9 రోజులు భక్తితో పూజించి కృతజ్ఞత తెలుపుకుంటాము."


ఇలా వివరంగా పిల్లలకి అంతా చెప్తున్న అభిరామ్ ని చూసి "ఇలా మీరు పిల్లలతో సరదాగా గడిపి ఎన్ని రోజులు అయిందండి. ఆ దేవుళ్ళు ఆ రాక్షసులని చంపడం వల్ల ఆ యుగంలో ఎంత మందికి మంచి జరిగిందో తెలియదు కానీ ఈ కాలంలో ఉండే ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో కనీసం ఆ పండగ మూలంగా కనీసం ఒక 4 రోజులైనా ఇంట్లోని కుటుంభసభ్యులంతా కలిసి ఆనందంగా గడిపే అవకాశం లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. "అని ఆ తండ్రి, పిల్లల్ని చూసి ఆనందపడింది.

Rate this content
Log in

Similar telugu story from Drama