Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Hitesh Kollipara

Drama Romance

4  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 9

లవ్ ఇన్ అమెరికా – 9

7 mins
615


#ఎ-మచ్-అవైటెడ్-డేట్


కొన్ని అనుభవాలు జీవితంలో చివరంకా గుర్తుండిపోతాయి. అలాంటి అనుభవమే ఈరోజు నాకు ఎదువరుబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గుండెల నిండుగా గాలి పీల్చి కాలింగ్ బెల్ నోక్కాను. క్షణంకన్నా తక్కువ సమయంలోపే తలుపు తెరిచాడు ఆల్బర్ట్.

“హేయ్ మగ్..., యు…, యు లుక్ మ్యాగ్నిఫిషియంట్ మగ్...” నన్ను నిలువెల్లా చూస్తూ అన్నాడు.

ఆల్బర్ట్ కళ్ళలో మళ్ళీ ఆ సాయంత్రపు మెరుపు. నేను స్పందించకుండా లోపలికి అడుగుపెట్టాను. కింద కార్పెట్ పరిచి ఉంది.

“చాలా ప్రిపరేషన్స్ చేసినట్టు ఉన్నావు?...”                 

“బియాండ్ యువర్ ఇమాజినేషన్!”

తలుపుతూ ముందుకి నడిచాను.

“నువ్వు నా కాంప్లిమెంట్ కి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు?”

“ఏం కాంప్లిమెంట్?”

“అదే..., ఇందాక యు లుక్ మ్యాగ్నిఫిషియంట్ అన్నాను కదా?...”

“హో యెస్. థాంక్ యు!...” అని అతడి నిలువెల్లా గమనిస్తూ, “నువ్వు కూడా బానే ఉన్నావ్..., నిన్న చూస్తే పేషెంట్ లా అనిపించావు. ఒక్కరాత్రిలోనే మునుపటిలా కనిపిస్తున్నావు” అన్నాను.

“యా మగ్..., జనాలు ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించినది అనుకుంటారు గాని నిజానికి అది మన మనసుకి సంబంధించినది. నిన్న నీతో మాట్లాడాను అండ్ సీ నవ్, ఐ బికేం ఫుల్లి హైల్ అండ్ హెల్తి!...” అదేదో జిమ్ కి సంబంధించిన యాడ్ లో యాక్టర్ లా ఎగురుతూ అన్నాడు.

అసందర్భ ప్రేలాపన ఏంటన్నట్టు చూశాను.

“హో సారీ…, అన్నేససరి టాక్. ఓకే కం విత్ మి. ఐ విల్ షో యు సంథింగ్” అంటూ నా చేయిని అందుకుని మెట్లవైపు పరిగెత్తాడు.

అతడి చేష్ట విస్తుగొల్పినా చేసేదిలేక అతడితోపాటే నేనూ పరిగెత్తాను. వేగంగా మెట్లెక్కుతుంటే చీర కుచ్చిళ్ళు కాళ్ళకు బంధాలు పడుతున్నాయి. అతడికి చెప్పే పరిస్తితి లేదు. చెప్పినా వినే స్థితిలో అతడు లేడు. నేరుగా నన్ను మేడ మీది అతడి రూమ్ లోకి తీసుకెళ్లి సెంటర్ లో నిలబెట్టాడు.

ఆ వెంటనే చప్పట్లు చరిచాడు. లైట్లు వెలిగాయి.

చూస్తే గది మొత్తం అలంకరించి ఉంది. లైట్స్ వెలుగుతూ, ఆరుతూ రొమాంటిక్ ఫీలింగ్ కలుగజేస్తున్నాయి. రూమ్ లోనే కొంచెం పక్కకి టేబుల్ వేసి ఉంది. దాని మధ్యలో క్యాండిల్ స్టాండ్స్, డిషెస్ పెట్టి ఉన్నాయి. ‘’ఛూ...’’ అంటూ క్యాండిల్ స్టాండ్స్ కేసి చూపుడు వేళ్ళు పాయింట్ చేశాడు. మరుక్షణం మంత్రం వేసినట్టు వెలిగాయి అవి.

“సిట్ డౌన్ మగ్...” అంటూ హాలీవుడ్ పిరియాడిక్ సినిమాల్లో సేవకుడు రాకుమారి అరచేయి పుచ్చుకుని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు.

అక్కడ స్టాండ్స్ మీద పెట్టిన బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అందుకుని నాకు ఇస్తూ, “వెల్కమ్ టు మై రూమ్ ప్రిన్సెస్ మేఘన్.. నా...” మొదటిసారి అతికష్టం మీద నా పూర్తి పేరు పలకటానికి ట్రై చేశాడు.

“నేను చాలాసార్లు నీ రూమ్ కి వచ్చా ఆల్బర్ట్?”

“యెస్... కానీ శారీలో రావటం ఇదే ఫస్ట్ టైమ్ కదా..., లెట్ మి అడ్మిట్ ఇట్ మగ్..., నువ్వు శారీలో చాలా బాగున్నావు. ఐ కుడింట్ట్ సే దిస్ బిఫోర్..., బట్ నిన్ను శారీలో చూస్తుంటే ఆకాశంలో వెళ్తున్న దేవకన్య దారితప్పి భూమి మీదకి వచ్చినదానిలా ఉన్నావు. అద్భుతానికి నిర్వచనమా?... కాదుకాదు..., అద్భుతానికి భహువచనానివి... ఆర్ మేబీ మోర్?... ఇన్ఫినిటీ!?... అవును అద్భుతానికి ఇన్ఫినిటీవి నువ్వు”

అతడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అతడి కళ్ళలో తేజస్సు. మాటల్లో మాద్రవం. అతడి మాటలకి ఆ క్షణం నా హృదయం కరగలేదు అని నేను అంటే నేను అబద్దం ఆడినట్టే లెక్క.

“థాంక్ యు ఆల్బర్ట్.. థాంక్ యు వెరీ మచ్...” కరిగిన హృదయం కన్నీళ్ళ రూపంలో జారుతుంటే అతికష్టం మీద అన్నాను.

“ఐ బిలీవ్ దోస్ ఆర్ హ్యాపీ టియర్స్ మగ్?”

“యెస్ ఇండీడ్!”

“ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండనిపిస్తుంది మగ్..., నీతో నేను..., మనం ఈ క్షణంలో..., ఇలాగే స్తంభించిపోవాలి. కానీ అది జరగదు. ఎందుకంటే ఇది కాలం. అది సాగుతూనే ఉంటుంది గాని ఎవరి కోసమూ ఆగదు” గాల్లోకి ఎటో చూస్తూ అన్నాడు.

“ఇది నేను చాలాసార్లు అనుకున్నాను ఆల్బర్ట్...”

నవ్వాడు.

మా బుజ్జి!... ఎంతబాగా నవ్వాడో!!... అప్పటికప్పుడు మనస్సులోనే దిష్టి తీసేశా.

“ఓపెన్ ద లిడ్ మగ్. నీకోసం నేనే స్వయంగా కుక్ చేద్దామని అంట్ మేరీని రావద్దని నిన్నే చెప్పేశా. ఓపెన్ అండ్ సీ వాట్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ యు” తను కూడా ఎదురు కుర్చీలో కూర్చుంటూ డిషెస్ కేసి చూపిస్తూ అన్నాడు.

పక్కనే ఉన్న రిమోట్ అందుకుని మ్యూజిక్ ఆన్ చేశాడు. ఇంకో రిమోట్ తో ఏ‌సిలో ఇంకాస్త డిగ్రీలు తగ్గించాడు.

“ఎందుకు టెంపరేచర్ తగ్గిస్తున్నావ్? ఇప్పటికే చాలా చలిగా ఉంది...”

“రూమ్ లో ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటే అంత ఎక్కువ రొమాన్స్ పండుద్ది..., నీకు తెలీదా?”

“హుమ్మ్..., ఇప్పుడిప్పుడే తెలుస్తుంది” అంటూ డిషెస్ మూతలు తెరిచాను.

“ఏంటిది?” తెరిచాక నోరు తెరిచాను.

“ఐ యామ్ మగ్..., నాకు ఆమ్లెట్ వేయటం తప్ప ఇంకేం రాదు. సో అందుకు...” ఆపాలజిటిక్ గా అన్నాడు.

“నీకు ఆమ్లెట్ తప్ప ఇంకేం వండటం రాదని నాకు తెలుసు. నేనడుగుతుంది ఆమ్లెట్ చుట్టూతా ఆపల్ ముక్కలు పెట్టావేంటీ అని?”

“గార్నిషింగ్ కోసం మగ్..., ఏం బాల్లేదా?”

“హుమ్మ్... ఐ థింక్ యు ఆర్ సిన్సియర్లీ అస్కింగ్ మి ఏ క్వశ్చన్?”

“పోనీ మార్చేద్దాం మగ్..., ఫ్రీడ్జ్ లో ఆరెంజస్ కూడా ఉన్నాయి. ఆ ముక్కలు పెడదాం” అంటూ లేవబోయాడు.

“వద్దు...” అతడ్ని ఆపేస్తూ, “ప్రస్తుతానికి ఇలా కానిచ్చేద్దామ్ లే...” అన్నాను.

అతడు వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

మా మాటలు మొదలయ్యాయి. అతడు మాట్లాడాడు. నేనూ మాట్లాడాను. ఆ ఊసులకి అర్ధాలు లేవు. ఐతే వాటివిలువ ఇంతని చెప్పే స్థోమత కూడా లేదు. మా ఇద్దరి భావాలు అలలై పొంగాయి. ఆశలు నిజాలై నిలిచాయి. నేను కోరుకున్న జీవితం సాక్షాత్కరించింది. ఐతే చిత్రంగా ఒక్క ఆమ్లెట్ ని రెండు గంటలు కూడా తినచ్చని నాకు ఇప్పుడే తెలిసింది!!

“షల్ వి డాన్స్ మగ్?...” నా చేతిని అడుగుతూ చేయి చాపాడు ఆల్బర్ట్.

ఇందాక అతడి మంత్రానికి క్యాండిల్స్ వెలిగినట్టు నేను మంత్రముగ్దినై లేచి నించున్నాను.

సౌండ్ సిస్టమ్ లో మ్యూజిక్ తగ్గట్టు కదలసాగాం. చీరకట్టు కారణంగా లోకాన్ని చూడగలుగుతున్న నా వెచ్చని నడుము మీద అతడి చల్లని చేతి స్పర్శ..., అది రేపిన ప్రకంపన..., బహుశా దాన్ని వర్ణించటానికి నా పదాల శక్తి సరిపోదేమో?!... మేము డాన్స్ చేశాం. నేను తడబడ్డాను. కానీ ఆల్బర్ట్ మాత్రం చాలా ప్రొఫెషనల్ గా డాన్స్ చేశాడు. అలా ఎంతసేపో తెలీదు. క్షణాలు... నిమిషాలు... గంటలు... సమయం గడిచిన విషయం ప్రపంచానికి తప్ప మాకు తెలీలేదు. కానీ సౌండ్ సిస్టమ్ కి తెలిసింది. అందులో మ్యూజిక్ ఆగిపోయింది. అప్పటికే అతడి గుండెలపై నా తలని వాల్చేశాను.

“మగ్?...” నా చెవిలో అతడి ఊపిరి శంఖపు హోరుని తలపించింది.

తలెత్తి మగతగా కళ్ళు తెరిచాను.

“ఐ వాంట్ టు టేక్ యు టు సంవర్ మగ్...” అన్నాడు.

ఎక్కడికన్నట్టు కళ్ళర్పాను.

“పైన రూమ్ కి”

“??”

“పదా...” అంటూ పైకి మెట్లెక్కించి తీసుకెళ్ళాడు.

నేను ఆల్బర్ట్ ఇంటికి చాలాసార్లు వచ్చాను. కానీ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫ్లోర్ లోని అతని రూమ్ వరకే వచ్చాను తప్ప ఎప్పుడూ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లాలనే ఆలోచనే రాలేదు.

సెకండ్ ఫ్లోర్ లోని మొదటి గది ముందు ఆగాడు. గది తలుపుకి ‘ఫ్యామిలి హైరార్కి’ అని నేమ్ బోర్డు ఉంది. డోర్ లాక్ తెరిచి అందులోకి తీసుకెళ్ళాడు.

అది అన్నిటిలా మామూలు గదే. కానీ దాని ప్రత్యేకత లోపలికి వెళ్ళిన మరుక్షణమే అర్ధమైంది. తలుపుకెదురుంగా గోడకి ఫోటోలతో ఫ్యామిలి ట్రీ లాంటిది ఏర్పాటు చేశారు. గోడ పైన మధ్యకి ఎవరిదో పెయింటింగ్ పెట్టి దానికి కిందకి వెళ్తూ కొన్ని గీతలు. మళ్ళీ ఆ గీతలకి చివర ఫోటోలు. కొన్ని పైంటింగ్స్ లో ఉంటే మరికొన్ని బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. మళ్ళీ వాటినుంచి కిందకి గీతలు. మళ్ళీ వాటి చివర ఫోటోలు. అలా ఆల్బర్ట్ వంశవృక్షాన్నే ట్రీ-చార్ట్ రూపంలో గోడకి ఏర్పాటు చేశారు.

“పైన కనిపిస్తుందే..., ఆయనే మా వంశ మూలవ్యక్తి. అంటే అంతకు ముందు లేదని కాదు. కానీ ఆధారాలు లేవు. ఆయన పేరు ఎడ్వర్డ్ సోల్మన్. అప్పట్లో ఇంగ్లాండ్ లో ఓడరేవులకి అధిపతి. తరువాత 1800 ల్లో మేము అమెరికా వచ్చేశాం అంట. ఎడ్వర్డ్ సోల్మన్ కాలం 1500 AD...” పైన ఫోటో కేసి చూపిస్తూ అన్నాడు.

పైన ఫోటో కింద ఎగ్జాట్ గా 1527 అని ఉంది. ఆల్బర్ట్ చెప్పుకుపోతున్నాడు.

“ఇలా కిందకి నాదాకా ఫోటోలు ఉన్నాయి. మా అమ్మకి సెకండ్ మ్యారేజ్ కదా?..., అదిగో ఆయనే మా అమ్మ ఫస్ట్ హస్బండ్. వాళ్ళకి పుట్టిన కూతురు ఆమె. అంటే నా అక్క. మా అక్క హస్బండ్ అతను....” రెండు ఫోటోల కేసి చూపిస్తూ అన్నాడు.

నేను చూస్తుంటే అతడు కొనసాగించాడు.

“మా నాన్న ఆయనే. వాళ్ళిద్దరి నుంచి ఉన్న గీతకి నేను. రేపు నాకు మ్యారేజ్ ఐతే అక్కడ ఉన్న నా సోలో ఫోటో పోయి మా కపుల్ ఫోటో వస్తుంది” ఆగాడు.

నేను అతడికేసి చూశాను. అతడు నావైపు చూశాడు. ఆ వెంటనే, “నువ్వు శారీలో ఉండగా మనం ఎప్పుడూ ఫోటో దిగలేదు కదూ?...” అంటూ జేబులోంచి సెల్ తీసి అక్కడిక్కడే సెల్ఫీ తీశాడు.

తీసిన సెల్ఫిని చూపిస్తూ, “ఇది ఫ్రేమ్ కట్టించి అక్కడ పెడితే బానే ఉంటుందిగా... ఉమ్?...” చాలా మామూలుగా అన్నాడు.

ఏమన్నాడు?..., వాట్ డిడ్ హి జస్ట్ సే?!... ఐతే నేను స్పందించేలోపే మాట మార్చేశాడు.

“అక్కడ కనిపిస్తుందే..., ఆమె పేరు స్టెల్లా. మా పూర్వీకురాలు. ఆమెకి తలలో ఏదో జబ్బు అంట. పేరేదో ఉందిలే టంగ్ ట్విస్టర్ లా. దాని కారణంగా చిన్న వయసులోనే ఆమె చనిపోయింది. అప్పుడు దానికి మందు లేదు. ఇంట్రస్టింగ్లీ ఇప్పుడు కూడా దానికి ట్రీట్మెంట్ లేదంట. వియర్డ్ కదా?... సో..., అందుకే ఆమె నుంచి ఫ్యామిలి ట్రీ లేదు. అలా కొన్ని లేవు. కొన్ని మరణాల కారణంగా, కొన్ని ఆధారాలు లేక. బట్ మోస్ట్లీ అన్నీ ఉన్నాయిలే...” అన్నాడు.

అతడు చెప్పుకుపోతున్నాడు. కానీ నాకేమీ వినిపించట్లేదు. నేనింక ఆగే స్థితిలో లేను. అతడి నోటి నుండి ‘ఐ లవ్ యు’ అని వినాలని ఉంది.

“నాకు వినాలని ఉంది ఆల్బర్ట్...” అతడి వాక్ప్రవాహాన్ని ఆపుతూ అన్నాను.

అతడు మాటలు ఆపి నాకేసి చూశాడు. చిన్నగా నవ్వాడు, “నాకూ చెప్పాలని ఉంది మగ్...” నవ్వి అన్నాడు.

నేను చెవులు రిక్కించాను. నా కళ్ళు అతడి పెదాలకేసి చూస్తున్నాయి. ఎందుకంటే శబ్దంకన్నా దృశ్యం ముందు కనిపిస్తుంది కదా..!!

“కానీ...” ఆగిపోయాడు.

“కానీ?...” నేను పైకైతే అనలేదు.

“నాకు కొంచెం సమయం కావాలి మగ్..., ఎంతోకాదులే 24 నాలుగు గంటలు. రేపు ఇదే సమయానికి ఇక్కడే నువ్వు వినాలనుకుందీ, నేను చెప్పాలనుకుందీ చెప్తాను. సరేనా?..”

“ముందు మీ పేరెంట్స్ కి చెప్పాలా?”

“హ... హ...” నవ్వాడు. “మా పేరెంట్స్ తో ఈ విషయం పంచుకునేంత గట్టి రిలేషన్ షిప్ నాకు లేదు మగ్. అది నీక్కూడా తెలుసు” నవ్వాక అన్నాడు.

“అదే తప్పు ఆల్బర్ట్. నీకు ఎప్పటినుంచో చెప్తున్నాను..., వాళ్ళు చొరవ తీసుకోకపోతే నువ్వే కలువు. ఏ అమ్మా కొడుకు ప్రేమ కోసం వస్తే కాదనదు. లుక్ ఎట్ మై మదర్!?...”

“హొ షటప్ మగ్!...” అరిచాడు. “ప్రపంచంలో అందరి పేరెంట్స్ మీ పేరెంట్స్ లా ఉంటారని అనుకోకు. ముందు నీ చుట్టూ ఉన్న రియాలిటీని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు. రియాలిటీ చేదుగా ఉన్నా కూడా అంగీకరించాలి. ఎందుకంటే అదే వాస్తవం కనుక!” అన్నాడు.

“అదికాదు ఆల్బర్ట్...” నామాటని పట్టించుకోకుండా కొనసాగించాడు.

“నువ్వేం చేశావ్?... నేను నీతో గేమ్ ఆడానని అనుకుని నాతో మాట్లాడటం మానేశావ్. రిలేషన్స్ అంటే అంతే మగ్... అవి నమ్మకం మీదే ఏర్పడుతాయి. అది లేని చోట ప్రేమ ఉండదు. కానీ ఈవారం రోజులూ నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా ఉందో తెలుసా?... హా?.., నేను బ్రతికే ఉన్నాను మగ్... ఐతే బ్రతికి మాత్రమే ఉన్నాను”

చటుక్కున తలెత్తి చూశాను. నా భావాలే అతడికి కూడా?! నేను మాట్లాడలేదు. అతడు కొనసాగించాడు.

“ప్లీజ్ మగ్... డోంట్ లీవ్ మీ..., డోంట్ లీవ్ మీ ఎట్ ఎనీ కాస్ట్. టిల్ మై లాస్ట్ బ్రెత్. ఐ కాంట్ టేక్ ఇట్ మగ్... ప్లీజ్...” వచ్చి నన్ను వాటేసుకున్నాడు.

ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధంకాలేదు.

“నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు మ. నా ప్రతి చిన్న విషయాన్నీ నీతోనే షేర్ చేసుకుంటాను. అలాంటిది నువ్వే నన్ను పక్కన పెట్టేస్తే తట్టుకోలేను. చచ్చిపోతాను. ప్రామిస్ మీ మగ్..., ప్రామిస్ మీ దట్ యు డోంట్ లీవ్ మీ..”

అతడు ఏడుస్తున్నాడు. అతడి కన్నీళ్లు నా వీపున జారుతున్నాయి.

“నేను నిన్ను వదలను ఆల్బర్ట్... ఎందుకు వదులుతాను?.. ఐ ప్రామిస్ యు దట్ ఐ డోంట్ లీవ్ యు” అతడి వీపు నిమురుతూ అన్నాను.

“ఎప్పటికీ కూడా... ఏ స్థితిలో ఐనా?...” నన్ను వదులుతూ అన్నాడు.

“ఎప్పటికీ కూడా... ఏ స్థితిలో ఐనా!..”

“పింకీ ప్రామిస్?” చిన్నపిల్లాడి స్వరం అతడిలో.

నవ్వొచ్చింది. “పింకీ ప్రామిస్” అన్నాను.

రెండు క్షణాలు ఇద్దరం మౌనం. అతడు స్థిమిత పడ్డాడు.

“సారీ మగ్..., కొంచెం ఎమోషనల్ అయ్యాను...”

నేను మాట్లాడలేదు.

“సరే మగ్..., జస్ట్ 24 హవర్స్. రేపు ఇదే టైమ్ కి నువ్వు వినాలనుకున్నది ఇక్కడే చెప్తాను. ఓకే నా?”

ఓకే ఆల్బర్ట్..., ఇన్నాళ్ళు ఆగింది ఇరవైనాలుగు గంటలు ఆగలేనా?... ఆగుతాను. సరే అన్నట్టు తలూపాను.

కానీ నాలోపల ఎందుకో భయం!

ఎందుకో తెలీదు... ఏమిటో తెలీదు...Rate this content
Log in

More telugu story from Hitesh Kollipara

Similar telugu story from Drama