STORYMIRROR

Narra Pandu

Classics Fantasy Others

4  

Narra Pandu

Classics Fantasy Others

లోకులు కాకులే

లోకులు కాకులే

1 min
386

ప్రేమ కవితలు రాసాను,

ప్రేమలో విఫలం అయ్యవా అన్నారు...


సమాజంలో జరిగే సంఘటనలపై రాసాను,

నువ్వొక్కడివి సమాజాన్ని మార్చలేవు అన్నారు...


కామెడీ కవితలు రాసాను,

కమెడియన్ల ఏంటి ఆ కవితలు అన్నారు...


భార్య భర్తలపై రాసాను,

నీకు పెళ్లి కాలేదు కదా నీకెలా తెలుసు అన్నారు...


మగువలపై రాసాను,

మనస్సులో ఎప్పుడు అదే ధ్యాసా అన్నారు...


ప్రేమికుల పై రాసాను,

నువ్వు ఎవరిని ప్రేమించలేదు కదా అన్నారు...


నా మీద నేనే రాసుకున్నాను,

నలుగురిలో నవ్వులాపాలు అవుతావు అన్నారు...


సమాజంలో ఎవరిని ఎవరు కూడా ప్రొత్సహించరు........

లోకులు కాకులు అనడానికి ఈ కారణాలు సరిపోవా..?


అందుకే నాకు నచ్చినట్లు నేను రాస్తున్నా

నా కవిత్వాలు


నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Classics