M.V. SWAMY

Drama

2.5  

M.V. SWAMY

Drama

కులం కాదు గుణం ముఖ్యం

కులం కాదు గుణం ముఖ్యం

4 mins
433



    

రాంప్రసాద్ బి.టెక్ చదువుకున్నాడు,టీ సి ఎస్ లో మంచి ఉద్యోగం వచ్చింది,సంవత్సరానికి పదిహేను లక్షల ప్యాకేజ్,తండ్రి టీచర్ అతనికి ఇంకా సర్వీస్ ఉంది,రాం ప్రసాద్ అక్క రమణీ డిగ్రీ పూర్తిచేసింది,ఆమెకు పెళ్లి అయిపోయింది,ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి,ఏ బాధరా బందీ లేని జీవితం,"ఉద్యోగం ఉంది మంచి సంపాదన ఉంది,ఇక ఆలస్యం దేనికి నువ్వు పెళ్లి చేసుకో "అని రాం ప్రసాద్ తలిదండ్రులు అతనికి ఒత్తిడి తెస్తున్నారు,రాం ప్రసాద్ ఆరడుగుల అందగాడు,ఒడ్డూ పొడవులోనే కాదు,విద్య బుద్ధుల్లో కూడా రాం ప్రసాద్ కి మంచి గ్రాఫ్ ఉంది,రాం ప్రసాద్ పెళ్లికి సిద్ధం అని తెలియగానే వాళ్ల బంధువులు బీరకాయ పీచు చుట్టరికం కలుపుకొని మరీ రాంప్రసాద్ చుట్టూ చేరారు,కులం కాకపోయినా స్నేహబందం ఉంది సంబంధాలు కలుపుకుందామని రాంప్రసాద్ తలిదండ్రులు చుట్టూ తిరిగారు వాళ్ళ స్నేహితులు,రాంప్రసాద్ మిత్రులు వాళ్ల అక్కచెల్లిల్లను అతనికి ఇచ్చి పెళ్లి జరిపించడానికి మాటలు కలిపారు, ఇక అతడు పనిచేసే కంపెనీలో పనిచేస్తున్న పెళ్లికాని అమ్మాయలు అతనితో పెళ్లి ప్రస్తావన ఎన్నోసార్లు తెచ్చారు,రాంప్రసాద్ తలిదండ్రులు మద్య తరగతి భారతీయులు కాబట్టి కొడుకు ద్వారా పెళ్ళి రూపంలో భారీ మొత్తంలో డబ్బు వస్తాదని ఆశలు పల్లకిలో ఊరేగారు.రాంప్రసాద్ మాత్రం ఆతని పెళ్లి ప్రస్తావన రాగానే మౌనంగా చిరునవ్వులు చిందించేవాడు తప్ప సమాధానం ఇచ్చేవాడు కాదు,ఒకసారి రాంప్రసాద్ తలిదండ్రులను కూర్చోబెట్టి తన ఇంటిముందు ఇంటి అమ్మాయి సుబ్బలక్ష్మి ని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు,తాను చిన్నప్పుడు నుండి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని,కలలు కన్నానని చెప్పాడు,అతని తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు,కులంకాని కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నువ్వు పట్టుబడితే మన పెరడులో ఉన్న నూతిలో పడి చస్తాం అని బెదిరించారు,దాన్ని ఎలా చేసుకుంటావు,నీ అందం ముందు అదెంత అది బోడి డిగ్రీ చేసి ఇప్పుడు ఏ ఉద్యోగం దొరక్క టైలర్ పని చేసుకుంటుంటుంది,దాన్ని చేసుకుంటే నీకూ నాకూ బంధం ఉండదు అని హెచ్చిరించింది రాంప్రసాద్ సిస్టర్,పరిస్థితి గమనించి రాంప్రసాద్ తన పెళ్లి తంతుని కొన్నాళ్లకు వాయిదావేశాడు,ఒకసారి రాంప్రసాద్ కుటుంభం మొత్తం షిరిడీ తీర్థయాత్రలుకు కారులో వెళ్లారు, తిరుగుప్రయణంలో వాళ్ల కారుకి ప్రమాదం జరిగి అందరికి తీవ్రంగా గాయాలయ్యాయి రాంప్రసాద్ తల్లి కోమాలోకి వెళ్ళిపోయింది,తండ్రికి రెందుకాళ్ళూ తీసేయవలసి వచ్చింది,రాంప్రసాద్ తలికి గాయమై సుమారు మూడు సంవత్సరాలు కంప్యూటర్ పనికి దూరంగా ఉండాలని అన్నారు డాక్టర్లు,రాంప్రసాద్ సిస్టర్ కుటుంబం కోలుకోలేని గాయాలతో మంచం పట్టారు, రాంప్రసాద్ ఉద్యోగం పోయింది,తండ్రి స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చెయ్యాల్సి వచ్చింది,బంధుమిత్రులు అంటీముట్టనట్లు ఉండిపోయారు,రాంప్రసాద్ కుటుంబం వంటరిది అయిపోయింది,రాంప్రసాద్ ని పెళ్లి చేసుకోడానికి పరుగులు పెట్టినవారందరూ ముఖం చాటేశారు, సుబ్బలక్ష్మి సహాయం తీడుకోడానిక్కి ఇష్టపడని రాంప్రసాద్ కుటుంబం,చివరకు సుబ్బలక్ష్మి కుటుంబం రాంప్రసాద్ ఇంటికి వచ్చి,మా పిల్లని మీ కోడలిగా చేసుకోనవసరంలేదు కానీ ఇరుగు పొరుగువాళ్లము,ఒకే వీధి,ఒకే ఊరు వాళ్లం,మీరు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోతున్నాం,మీకు అవకాశం ఉన్నప్పుడు మాకు సాయం చెయ్యండి,మాస్టరి రిటైర్మెంట్ మీ ఇంట్లో వారికి మందులు,వైద్యం ఖర్చులకే సరిపోవడం లేదనిపిస్తుంది, ఇక డబ్బులు విషయం పక్కన పెడదాం, మాస్టారుకుటుంబానికి వైద్య ఖర్చులు నిమిత్తం కొంతమొత్తం ప్రభుత్వం నుండి రావచ్చు,అయినా మీకు ఇప్పుడు మానసిక ప్రశాంతత కావాలి,మీకు అభ్యంతరం లేకపోతే మీ భోజనాలు,ఇతరసేవలు మా నుండి పొందండి,దయచేసి మాటకాదునకండి"అని రాంప్రసాద్ కుటుంబాన్ని బ్రతిమిలాడారు,"సుబ్బలక్ష్మి.తండ్రి ఆటోడ్రైవర్,తల్లి బీడీలు చుట్టే పరిశ్రమలో దినసరి కూలీ, సుబ్బలక్ష్మి లేడీస్ టైలర్,అప్పులేని కుటుంబం,ఆస్తి కూడా లేదు వాళ్లకు,ఇల్లు,ఆటో,టైలరింగ్ షాప్ తప్ప, రాంప్రసాద్ తలిదండ్రులు అఇష్టంగానే... సుబ్బలక్ష్మి ఇంటి సహాయం తీసుకునేవారు,సుబ్బలక్ష్మి తనకు చిన్నప్పటినుండి స్నేహితుడైన రాంప్రసాద్ ఇంటి బాగోగులు చూసుకోవడమంటే...చాలాశ్రద్దగా మనసు పెట్టి చేసేది, అయితే ఆ కుటుంబం ఇబ్బందుల వచ్చిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఏనాడూ ప్రయత్నం చెయ్యలేదు,"ఇప్పటికే మీ కుటుంబం మానసిక వేదనతో ఉంది ఇలాంటి సమయంలో మీరు మీ ఇంట్లోవాళ్లకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు,నేను మీకు కేవలము స్నేహితురాలుగా మాత్రమే సాయపడుతున్నాను"అని రాంప్రసాద్ తో తరుచూ అంటూ ఉండేది,చాలా కాలం గడిచింది,రాంప్రసాద్ తల్లి కోమానుండి బయటకు వచ్చింది,రాంప్రసాద్ తండ్రికి జయపూర్ కృత్రిమ కాళ్ళు అమర్చారు,రాంప్రసాద్ సిస్టర్ కుటుంబం కూడా ఆనారోగ్య సమస్యలు నుండి ఆర్ధిక పరమైన సమస్యలు నుండి బయట పడింది,రాంప్రసాద్ కి ఇన్ఫోసిస్ లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది,అన్నిటికంటే ముఖ్యంగా రాంప్రసాద్ పూర్వీకులుకు సంబంధించిన భూమి కోర్టు తగువు తీరి రాంప్రసాద్ కుటుంబానికి దఖలు అయ్యింది,ఆది మంచి ధర పలుకుతుంది.రాంప్రసాద్ కుటుంభం ఇప్పుడు మునుపటిలా సంతోషంగా ఉంది. రాంప్రసాద్ కుటుంబం పరిస్థితి కుదుటపడింది కాబట్టి ఇక వాళ్ళతో అతి చనువుగా ఉండటం, ఆ ఇంటికి రాకపోకలు నడపడం స్వార్ధం అనిపించుకుంటుందని సుబ్బలక్ష్మి కుటుంబం రాంప్రసాద్ ఇంటికి రాకపోకలు తగ్గించింది, కొన్నాళ్ళుకు ఆరెండు ఇల్లు మద్య రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి, రాంప్రసాద్ ఇంటి వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు, ఆర్ధిక, వ్యవహారాలు, భూమి వ్యవహారాలు ఒక దారిలోకి తెచ్చే పనులు ఒత్తిడి వల్ల రాంప్రసాద్, అతని కుటుంబం సుబ్బలక్ష్మి ఇంటివైపు చూడటానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది అంతే కాకుండా చాలా రోజులు వాళ్ళ సొంత వ్యవహారాలు మానేసి మన గురుంచి శ్రమించారు కాబట్టి వాళ్ళకి కొంత ప్రయవసీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూడా రాంప్రసాద్ కుటుంబం సుబ్బలక్ష్మి ఇంటి విషయాలు అంతగా పట్టించుకోలేదు. అన్నీ కష్టాలూ పోయాయి కాబట్టి కాస్తా రిలీఫ్ గురుంచి రాంప్రసాద్ కుటుంబం ఒక నెల రోజులకి ఉత్తర భారతదేశ యాత్ర పెట్టుకుంది, మీరూ మాతో రండి అని సుబ్బలక్ష్మి కుటుంబాన్ని రాంప్రసాద్ వాళ్ళు అడిగారు కానీ "మాకు వేరే పనులు ఉన్నాయి, ఈసారికి రాలేం, ఇప్పుడు మీరు వెళ్ళిరండి, మరోసారి అందరమూ కలిసి ఎక్కడికైనా టూర్ వేద్దాం"అని సుబ్బలక్ష్మి అనడంతో, రాంప్రసాద్ కుటుంబమే ఉత్తర భారత యాత్రకి వెళ్ళిపోయింది,


          "సుబ్బలక్ష్మి కుటుంబం రాంప్రసాద్ ని టార్గెట్ చేస్తున్నారు సాయం చేసిన నెపంతో ఆ ఇంటి కోడలు కావడానికి సుబ్బలక్ష్మి ప్రయత్నం చేస్తుంది" అని కొంతమంది పనీపాటు లేని అలగా జనాలు పుకార్లను షికార్లు కొట్టించడంతో కాస్తా మనస్తాపం చెంది,"కనీసం రాంప్రసాద్ కి పెళ్లి అయిపోయినంతవరకైనా ఈ ఊరికి దూరంగా వేరే ఊరు వెలిపోదాం, అయితే మన అడ్రస్ ఎవ్వరికీ తెలీనివ్వకూడదు" అని అనుకుంటూ, ఇంటిని ఒక మార్వాడీకి తాకట్టు పెట్టి ఒక రాత్రి ఎవ్వరికీ కంట పడకుండా ఊరు వదిలి వెళ్లిపోయారు సుబ్బలక్ష్మి కుటుంబం వారు.


అక్కడ రాంప్రసాద్ కుటుంబం అతని పెళ్లి గురుంచి చర్చింది. మరో అభిప్రాయం లేకుండా అందరూ రాంప్రసాద్ కి సుబ్బలక్ష్మిని ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఏకగ్రీవంగా నిర్ణయించారు. వెంటనే ఈ విషయాన్ని సుబ్బలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పడానికి రాంప్రసాద్ ప్రయత్నించాడు,సుబ్బలక్ష్మి కుటుంబంలోని అందరి ఫోన్లూ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చాయి, సరే ఎలాగూ కొద్దీ రోజుల్లో ఊరెళ్లిపోతాం కాబట్టి, సుబ్బలక్ష్మి ఇంటికే అందరమూ వెళ్లి ఈ శుభవార్త చెబుదాం అనుకున్నారు రాంప్రసాద్ కుటుంబం వారు.


వారంరోజుల్లో రాంప్రసాద్ కుటుంబం ఊరు చేరింది. వచ్చిన వెంటనే సుబ్బలక్ష్మి గురుంచి చూసాడు రాంప్రసాద్, ఆమె ఇల్లు తాలం వేసి ఉంది ,ఎక్కడికి వెళ్లారు అని వీధివాళ్లను అడిగాడు," తెలీదు ఇల్లు మార్వాడీకి తాకట్టు పెట్టి ఒక రాత్రి ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఊరు వదిలివెళ్లిపోయారు, అడ్రెస్ తెలీదు" అని వీధివారినుండి సమాధానం రావడంతో రాంప్రసాద్ చాలా బాధ పడ్డాడు, రాంప్రసాద్ ఇంటివారికి విషయం తెలిసి వాళ్లూ ఆందోళన చెందారు.


సుమారు మూడు నెలల పాటు సుబ్బలక్ష్మి కుటుంబం చిరునామా గురుంచి తీవ్రంగా ప్రయత్నించి, ఇక లాభం లేదని "రాంప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు" అని ఒక ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేసాడు రాంప్రసాద్, సుబ్బలక్ష్మికి అతనికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా.


"ఆంటీ ప్రసాద్ కి ఏమైంది... ఎప్పుడు అతనికి ఎలా ఉంది" అని ఆందోళనగా అడిగింది సుబ్బలక్ష్మి రాంప్రసాద్ తల్లికి ఫోన్ చేసి,రాంప్రసాద్ తల్లి "ముందు నువ్వు ఎలవున్నావు ఎక్కడ వున్నావు,నీ గురుంచే 'రాం' కలవరిస్తున్నాడు" ఆతృతగా అడిగింది సుబ్బలక్ష్మిని, " మేము విజయనగరం జిల్లా చినమేరంగి పల్లెలో ఉన్నాము, రేపు ఉదయాన్నే మనవూరు వచ్చి రాంప్రసాద్ ని చూస్తాను ఆంటీ " అని తామున్న చిరునామా ఎవ్వరికీ చెప్పకూడదు అన్న విషయం మర్చిపోయి రాంప్రసాద్ అణారోగ్యం బెంగతో టపీ మని చెప్పేసింది సుబ్బలక్ష్మి.


వెంటనే రాంప్రసాద్ కుటుంబం ఆగమేఘాల మీద చినమేరంగి చేరుకుంది. సుబ్బలక్ష్మి కుటుంబం వారు అవాక్కయ్యారు.సుబ్బలక్ష్మి మా ఇంటి కోడలు అని చెప్పేసి సుబ్బలక్ష్మికి బొట్టుపెట్టి, నిశ్చితార్థం తంతు హడావుడిగా జరిపించేశారు రాంప్రసాద్ కుటుంబంవారు చినమేరంగి పురోహితులు, గ్రామస్తులు సహకారంతో, సుబ్బలక్ష్మి మారుమాటాడానికి అవకాశమే ఇవ్వలేదు రాంప్రసాద్ అండ్ ఫ్యామిలీ. 


కథ సుఖాంతం అయ్యింది.ఆస్తులు అంతస్తుల ఆత్మీయతలు,అభిమానాలు గెలిచాయి, కులం కన్నా మంచి గుణాలే మెరిశాయి. మానవ సంబంధాలు మురిసాయి.



Rate this content
Log in

Similar telugu story from Drama