కోవిడ్-19 వెర్సర్ ముగ్గురు మిత్రులు

కోవిడ్-19 వెర్సర్ ముగ్గురు మిత్రులు

2 mins
348


     కోవిడ్-19 వెర్సస్ ముగ్గురు మిత్రులు


      ఒక ఊర్లో పీర్ సాహెబ్, పీతాంబరం అనే మిత్రులు వుండేవారు. పీర్ సాహెబ్ దెయ్యాలను నమ్ముకొని బ్రతుకుతుంటే, పీతాంబరం దేవుడ్ని నమ్ముకొని జీవనంభృతి పొందేవాడు. అసలు విషయానికొస్తే పీర్ సాహెబ్ భూతవైద్యం చేసేవాడు, దెయ్యాలు, భూతాలు,ప్రేతాత్మలు, పిశాచులు సోకాయన్న అనుమానాలుతో వచ్చిన జనాల వద్ద భారీగా డబ్బులు తీసుకొని తాయెత్తులు, రక్షలు, పోములు కట్టి ఇచ్చేవాడు. ఇక పీతాంబరం దేవుడు మీద నమ్మకంతో తన దగ్గరకు వచ్చిన భక్తులకు యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు,పూజలు, పునస్కారాలు చెయ్యాలని, అలా అయితే మీ బ్రతుకులు భేషుగ్గా వుంటాయని ఎక్కువ మొత్తంలో దక్షణలు అందుకునేవాడు.


             చాలా కాలం ఇద్దరు మిత్రులు బ్రతుకులు బాగా గడిచాయి. ఒకసారి పత్రికల్లోనూ, టీవీలు, రేడియోలలోనూ 'ప్రపంచాన్ని ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ విశ్వవ్యాప్తం అయ్యింది, అందుకే గుడి గోపురాలు, మసీదులు,చర్చ్ లకు తీర్థయాత్రలకు, సంతలకు, జన సమర్ధమున్న సమావేశాలకు,ముఖ్యంగా ఎక్కువ మంది గుముగూడే ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్లవద్దు కోరి కోరి కోవిడ్-19 బారిన పడవద్దు' అన్న ప్రచారం మొదలై తక్కువ కాలంలోనే తీవ్రమయ్యింది. మిత్రులు పీర్ సాహెబ్, పీతాంబరంల లాభసాటి వ్యవహారాలు మూలబడ్డాయి, కరోనా వైరస్ భయంతో అందరూ ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు తప్ప పీర్ సాహెబ్ తాయెత్తులు కోసం,పీతాంబరం మంత్రాలు కోసం ఎవరూ రావడంలేదు.


               పీర్ సాహెబ్,పీతాంబరం కలిసి ఒకరి కష్టాలు మరొకరికి చెప్పుకొని, ఊర్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఉందని తెలుస్తుంది ఎందుకైనా మంచిది మన మిత్రుడు డాక్టర్ డేవిడ్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుందాం అనుకొని డాక్టర్ డేవిడ్ వద్దకు వెళ్లారు. మిత్రులను చూసి డాక్టర్ డేవిడ్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, ఇంతవరకూ మీ పంటలు పండాయి, ఇప్పుడు నా వంతు వచ్చింది, వైద్య పరీక్షలు మందులు పేరుతో కాస్తా ఎక్కువగానే డబ్బులు వసూలు చేస్తున్నాను, ఇంతకీ మీరు వచ్చిన పనేంటి అని అడిగాడు,పీర్ సాహెబ్, పీతాంబరం కోవిడ్-19 పుకారు వాళ్ల ఆదాయానికి ఎలా గండికొట్టిందో స్పష్టంగా చెప్పారు. ఇంతలో వీధి మైకు గట్టిగా వాగుతూ, కోవిడ్-19 వైరస్ సోకింది లేనిది తెలుసుకోవాలంటే కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేక పరికరాల సాయంతో అత్యాధునిక వైద్య పరీక్షల మూలంగానే నిర్ధారణ అవుతుంది, నకిలీ వైద్య పరీక్షలను నమ్మకండి అని గట్టిగా చెప్పింది. డాక్టర్ డేవిడ్ కూడా బిక్కమొహం వేసి ఇక నా దగ్గరికి ఎవరూ రారు అని దిగాలు పడిపోయాడు.


            ముగ్గురు మిత్రులు కలిసి వాళ్లకు చదువు చెప్పిన గురువు వద్దకు పోయి వాళ్ల బాధలు చెప్పుకున్నారు. గురువు ముగ్గురు శిష్యులను మందలించి, చాలా రోజులు నుండి నేనే మీకు కబురు పెట్టి బుద్ధి చెప్పాలను కున్నాను. మీరు మీ మీ వృత్తులను నమ్ముకొని న్యాయంగా బ్రతకాలి అంతేగాని హద్దులు దాటి ప్రజల నమ్మకాలను మీ స్వార్ధానికి వాడుకోరాదు. ఫీజులు, దక్షణలు, బక్షీజులు తీసుకోవడం న్యాయంగా ఉండాలి అని అంటూ... ఇప్పుడు మీ జీవం భృతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు,పీర్ సాహెబ్ మంచి నాణ్యమైన గుడ్డతో మాస్కులు కుట్టి తక్కువ ధరకు అమ్మి సాధారణ లాభాలు పొందవచ్చు. పీతాంబరం, తులసి, నిమ్మ, పసుపు, అల్లం, మిరియాలు వంటి సాంప్రదాయ ద్రవాలు తయారు చేసి, అమ్మి, కరోనా రోగ లక్షణాలు పెరగకుండా చేసి ప్రజల వద్ద న్యాయంగా డబ్బులు వసూలు చెయ్యవచ్చు, ఇక డాక్టర్ డేవిడ్ కరోనా వైరస్ లక్షణాలు,ఆ వైరస్ ఉధృతం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతూ రోగులకు ప్రాధమిక వైద్య పరీక్షలు, మందులు ఇచ్చి, రోగులను మోసం చెయ్యకుండా మెరుగైన వైద్యం కోసం నిర్ణీత ఆసుపత్రులకు రోగులను తీసుకొని వెళ్లి తగు ఫీజులు న్యాయంగా తీసుకోవచ్చు,తెలివిగా వ్యవహరించి ఎవ్వరినీ మోసం చెయ్యకుండా, మీకు తెలిసిన వృత్తుల్లోనే జీవన భృతి పొందండి అని చెప్పాడు. ముగ్గురు మిత్రులూ గురువుకి దండం పెట్టి అక్కడ నుండి కదిలారు, గురువాజ్ఞను పాటించడానికి సిద్ధమై....


Rate this content
Log in

Similar telugu story from Drama