t. s.

Inspirational

4  

t. s.

Inspirational

కలలు కనండి సాకారం చేసుకోండి

కలలు కనండి సాకారం చేసుకోండి

1 min
745


రాజు రాజు ఏంటిరా అంత డీప్ గా ఆలోచిస్తున్నావ్ దేని గురించి అడిగాడు సుబ్బు.

అరెయ్ సుబ్బు నేను మొన్న ఆదిత్య 369 సినిమా చూసారా ఎంత బావుందో నిజంగా మనకి కూడా అలా టైం మిషన్ దొరికితే బావుండురా అన్నాడు రాజు.

ఏంటిరా ఎప్పుడు చూసినా అలా ఊహల్లో తేలిపోతుంటావు.

చిన్నప్పుడు ఏమో అల్లా ఉద్దీన్ అధ్భుత దీపం సినిమా చూసి అలా మనకు అధ్భుత దీపం దొరికితే బావుండు అన్నావు.

ఇప్పుడు ఏమో టైం మిషన్ అంటున్నావు.

రేపు సహసవీరుడు సాగరకన్య చూసి సాగరకన్య దొరికితే బావుండు అంటావ ఏంటి ఎగతాళిగ అన్నాడు సుబ్బు.

రాజు, సుబ్బారావు చిన్ననాటి స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు.

అరే కాదురా నేను కూడా ఎప్పటికయినా గొప్ప సైంటిస్ట్ అవుతా టైం మిషన్ తయారు చేస్తా అన్నాడు రాజు.

పగటి కలలు కంటున్నావ చాల్లేరా పదా ఇంటికి పార్క్ నుండి బయలు దేరారు.

            *  *  *  *

రాజు కష్టపడి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాడు.

అదేంటిరా టైం మిషన్ కనిపెడతానన్నావు ఏమయింది

తయారు చేయవా అని అడిగాడు సుబ్బు.

టైం మిషన్ సినిమా వరకు చాలా బావుంది.

ఆదిత్య 369 లాంటి సినిమా మించి ఇంకోటి రాదు.

నాకు ఆ సినిమా బాగా నచ్చింది ముఖ్యంగా అలా టైం మిషన్ లో ప్రయాణం చేసి అన్ని శతాబ్దాల జీవన విధానం జీవించడం ఒక అధ్భుతం.

కానీ అది సినిమా వరకే.

మనం ఎన్ని రాజ్యాలు తిరిగినా మళ్ళీ ఇక్కడికే వచ్చి తీరాలి.

అందుకే పగటి కలలు మానేసి ఇలా అందరికీ ఉపయోగపడేవి తయారు చేద్దాం అనుకుంటున్నా.

మనకి అవసరమయ్యేవి ప్రతి మనిషికి తేలికగా అందుబాటులో దొరికేవి తయారు చేయాలనుకుంటున్నా. అందుకే ఇది చేశా.

అని పొలాల్లో ఎక్కువ మనుషుల సాయం లేకుండా వరినాట్లు వేస్తున్న ట్రాక్టర్ ని చూపించాడు. 


పడుకుని పగటి కలలు కనే బదులు మనకు అనుకూలంగా సాధ్యమైనవి సాధించడానికి ప్రయత్నం చేయాలి.

అప్పుడు ఏ కల అయినా సాకారమవుతుంది.



Rate this content
Log in