M.V. SWAMY

Drama

5  

M.V. SWAMY

Drama

కిడ్డీబ్యాంక్ డబ్బులతో

కిడ్డీబ్యాంక్ డబ్బులతో

1 min
34.9K


      కిడ్డీ బ్యాంక్ డబ్బులతో....(కథ)


       శోభనాద్రి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నాడు.లాక్ డౌన్ వల్ల కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు.కంపెనీ యజమాని శోభనాద్రికి ఫోన్ చేసి"ఈ నెల పూర్తి జీతం ఇవ్వలేకపోతున్నాను.సగం జీతమే నీ బ్యాంక్ అకౌంట్ కి పంపు తున్నాను,మిగతా జీతం తరువాత చూసుకుందాం"అని చెప్పాడు."ఈ అర్ధ జీతంతో సంసారం ఎలా గడపాలో అర్ధం కావడం లేదు"అని మనసులోనే అనుకొని దిగులుగా కూర్చున్నాడు శోభనాద్రి.ఇంతలో చిల్డ్రెన్ బెడ్ రూం నుండి ఏదో పగిలిన శబ్దం వినిపించింది.


        కుటుంబమంతా గబాలున అక్కడకు వెళ్లారు.శోభనాద్రి కొడుకులిద్దరూ కిడ్డీ బ్యాంక్ బాక్సులు పగలుగొట్టి.చిల్లర డబ్బులు లెక్కబెడుతున్నారు.శోభనాద్రి కొడుకులు మీద చిరాకు పడుతూ "ఆ డబ్బులు అవసరం ఇప్పుడేమి వచ్చింది,అవి తిరుపతి వెళ్ళేటప్పుడు పనికి వస్తాయని పొదుపు చేసుకుంటున్నాం కదా"అని అన్నాడు.


         "లేదు నాన్నగారూ ఈ డబ్బులుతో రోజుకి పది భోజనం పేకెట్స్ కొని మా బడి వెనక ఉన్న సంచార జాతుల వారికి ఇవ్వాలని అనుకుంటున్నాం"అని డైరెక్టుగా తండ్రికి చెప్పేసారు ఆ కొడుకులు.శోభనాద్రి భార్య కొడుకుల్ని ఏదో అనబోతే...భార్యను వారించి"ఎక్కడో పేకెట్స్ కొని ఎందుకు దానం చెయ్యడం! ఆ డబ్బులతో ఇంట్లోనే వంటచేసి రోజుకి ఇరవైమంది సంచార జాతుల వారికి ఇద్దాం,ప్రార్ధించే పెదవులు కన్నా...సాయమందించే చేతులే మిన్న"అని చిన్నగా నవ్వేశాడు.కాసేపు కుటుంబమంతా మౌనంగా ఉండిపోయింది."ఓకే ఇక మొదలెట్టండి వంట,ఇప్పటికే లేట్ అయ్యింది,పెట్టే భోజనమేదో ఆ నిరాశ్రయులకు టైంకి పెడితే వారికి ఫలితముంటుంది"అని శోభనాద్రి అనేసరికి అందరూ చకచకా వంట పనుల్లో నిమగ్నమయ్యారు,ఒక మంచి పని చేస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో...


         


Rate this content
Log in

Similar telugu story from Drama