హీరో - విలన్ - కమెడియన్
హీరో - విలన్ - కమెడియన్
నేను గమనించిన విషయమేమిటంటే ప్రతి మనిషిలో ఒక హీరో,విలన్,కమెడియన్ లక్షణాలు ఉంటాయి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు అతనిలోని కమెడియన్ లక్షణాలు బయటపడతాయి. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అదే మనిషి కోపంగా ఉన్నప్పుడు అతనిలోని విలన్ లక్షణాలు బయటపడతాయి. తనకు కోపం తెప్పించిన వ్యక్తికి హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. తనశత్రవుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే మనిషి తనకోసం తనకుటుంబం కోసం హీరోలా కష్టపడతాడు. అప్పుడు అతనిలో హీరో లక్షణాలు బయటపడతాయి. ఇలా మనిషి ప్రవర్తన పరిస్థితులబట్టి మారిపోతుంది. తప్పు చేసే అవకాశం, అవసరం లేకపోతే అందరూ హీరోలే. రకరకాల పరిస్ధితులు మనిషిని మహానుభావులుగా లేక రాక్షసులుగా మారుస్తాయి. బహుతక్కువ మందిలో క్లిష్ట పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే శక్తియిక్తులు ఉంటాయి. అలాంటి వారే నిజమైనహీరోలు.
