naveen surya

Fantasy

4.5  

naveen surya

Fantasy

హైదరాబాద్ To చెన్నై - 1

హైదరాబాద్ To చెన్నై - 1

4 mins
385



నా పేరు సత్యమూర్తి నా వయస్సు 28 ఎంటి వయస్సు ఏమో తక్కువ ఉంది పేరు ఏమో అనేగ మీ అనుమానం మా తాత గారి పేరు మా నాన్న కి 11 ఏళ్లప్పుడు తాత గారు చనిపోతే కొడుకు పుడితే పెట్టాలి అనుకుని ఆయన మీద ఇష్టం తో నాకు పెట్టారట 

ఇప్పటికీ కూడా మా లాంటి జనరేషన్ వాళ్ళకి ఇది. చాలా కామన్ 

నిజానికి నేను కూడా వాళ్ళ జనరేషన్ లో ఉండాల్సిన వాణ్ణి

కాబట్టి నాకు పెద్దగా నామోషీ గా అనిపించలేదు కాకపోతే ఇంట బయట సత్య అనే పిలుస్తారు నాకు కొంచెం పద్దతులు , పట్టింపులు ఉన్నాయి అచ్చం మా తాత గారిలా అన్నమాట. మా బామ్మ అంటుంది ఈ కాలం లో ఇట్లా ఉంటే ఎలా అని కాకపోతే మనం పట్టించుకోము అనుకోండి


నేను ఒక చిన్న కంపెనీ లో పెద్ద ఉద్యోగం చేస్తూ వయస్సుకు తగ్గ సంపాదిస్తూ హ్యాపీ గా ఉన్నాను పెద్ద కొలువు కదా క్లయిట్ మీటింగ్ లు అంటూ ప్రొఫెషనల్ ట్రిప్స్ అంటూ తిరగడం నాకు పరిపాటే 

ఎప్పటిలాగే క్లయింట్ మీటింగ్ కోసం రాత్రి 8 గంటల బస్సుకు విండో సీట్ ఉన్న టికెట్టు బుక్కు చేసుకుని ఆ తర్వాత ఆటో మాట్లాడుకుని బస్టాండ్ కు బయలుదేరాను . ఇంకొక 20 నిమిషాల్లో చేరుకుంటాను అనంగా ఒక అందమైన అమ్మాయి ఆటో కోసం చూస్తుంది . అమ్మాయి నీ దాటేసి డ్రైవర్ ముందుకు వెళ్లడం నేను అద్దం లో చూడడం .ఆటో అపలేదని అమ్మాయి మొహం చిట్లించడం చూసి నవ్వుకుని ఆటో ఆపమని చెప్పి వెళ్ళి దిగి ఎక్కడకి వెళ్ళాలి అంటే బస్టాండ్ దాకా అంటే నేను అటే పదండి పోదాం అని అడిగా . అపరిచితుడు తో ప్రయాణం అవసరమా అని అనుకుందో లేదా రావడం ఇష్టం లేక చెప్పిందో కానీ నేను క్యాబ్ లో వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించింది నేను చేసేదేం లేక ఆటో అద్దం లో అమ్మాయి ను చూస్తూ , ఆమె ఆలోచనల్లో మునిగి బస్టాండ్ వచ్చిందే మర్చిపోయా . ఇంతలో డ్రైవర్ సర్ వచ్చేశాం అంటే నేను ఈ లోకం లోకి వచ్చాను . ఎంత అయింది అని అడిగి తెలుసుకుని ఒక వంద నోటు ఒక యాభై నోటు ఇచ్చి బస్సు చూసుకుని వెల్లి నా సీట్ లో నేను కూర్చున్నాను 


మీటింగ్ ఉండటం వల్ల రేపు మాట్లాడాల్సిన విషయాలు , అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పేపర్స్ నీ తిరగేస్తున్నాను ఇంతలో డ్రైవర్ బస్సు మొదలు పెట్టడం ప్రయాణికులు రావడం తో బయలుదేరుతున్నాను అని ఒక చిన్న మెసేజ్ మమ్మీ కి పేట్టి ఇంకా పుస్తకం ఓపెన్ చేశాను 

(రైల్ మరియు బస్సు ప్రయాణ సమయం లో పుస్తకం చదవడం లేదా సినిమా చూడటం నాకు అలవాటైంది )

నేను పుస్తకం లో లీనమైన కాసేపటికి బస్సు బయలుదేరింది బస్సు రోడ్డెక్కుతుంది అనగా అపండి అని అరుచుకుంటూ , ఆయాసం తో , చేతిలో బట్టల బ్యాగ్ తో పరిగెడుతూ అమ్మాయి వస్తున్న అమ్మాయిని చూసి పుస్తకం పక్కన పెట్టి కిటికీ తెరచి చూసాను 


-------------------------------


అదే అమ్మాయి నేను ఇంతకు ముందు ఆటో లో వస్తు రోడ్డు పక్కన చూసి నాతో రండి అని అడిగిన అమ్మాయి అర్రే నాతో పాటు వచ్చి ఉంటే బాగుండేది కదా అనుకుంటూ బస్సు ఆపండి అని డ్రైవర్ కి చెప్పాను అమ్మాయి వెంటనే బస్సు ఎక్కి నా పక్క సీట్ లో కూర్చుంది పక్క సిట్ అంటే మరి నా పక్కనే అని అనుకోకండి నేను కూర్చున్న సిట్ పక్కన ఇంకో సిట్ లో కిటికీ వైపు కాకుండా కూర్చుంది ఇంకేం భాగ్యం నేత్రానందం తో తృప్తి పడుతూ చదివి చదవనట్లు పుస్తకం చదువుతూ జీవితం లో తొలిసారిగా ఒక అమ్మాయి నీ దొంగ చూపులు చూస్తూ ఉన్న ఈ సారి మాటలు కలపాలి అని ప్రయత్నిస్తే ఏమనుకుంటారెమో అని అలా చూస్తూ కూర్చున్న మనక అనుభవం కొత్త ఒక్క అమ్మాయి తో మాటలు ఎలా కలపాలో తెలియలేదు


అలా బస్సు హైదరాబాద్ పొలిమేర చేరుకునే సరికి మెల్లిగా నిద్రలోకి జారుకున్న . బస్సు జడ్చర్ల దగ్గర 10 గంటల 30 నిమిషాలకు భోజనం గురించి ఒక దాబా పక్కన ఆగింది నేను లేచి అమ్మాయి నీ చూస్తే ఎక్కడ కనపడలేదు సర్లే తినేసి పడుకుందాం అని వెళ్ళి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ కొక్ ఆర్డర్ చేసి వచ్చాక తిని బస్సు ఎక్కి నా సిట్ పక్కన ఆ అమ్మాయి సిట్ అంటే నా సిట్ పక్కన సిట్ కాదండోయ్ నా పక్క సిటు

ఎంటి అమ్మాయి ఇకడికి వచ్చి కూర్చుంది అనుకుని సర్లే కూర్చొని లే అనుకుంటూ నా సిట్ లో కూర్చున్న అమ్మాయి ఇళయరాజా పాటలు వింటుంది నేను అమ్మాయి వంకే చూస్తున్న . బస్సు బయలుదేరిన కాసేపటికి ఏవండీ ! నాకు విండో సిట్ కావాలి మీరు ఇక్కడ కుర్చోగలరా అని అడిగింది ఊ ! అన్నట్లు తల ఊపి లేచి నిల్చున్న అమ్మాయి అలాగే కూర్చుని పక్కకి జరిగింది నేను అమ్మాయి పక్కకు కూర్చున్న దాహమేసింది అనుకుంటా వాటర్ కోసం చూస్తే తాను తెచ్చుకున్నా నీళ్ళు అయిపోయాయి నేను ఇంకా నా బాటిల్ తీసి ఇచ్చాను అంతే మొత్తం తాగేశాక సారి

బాగా దాహం అయింది అంటే పర్లేదు లెండి అని నేను తిరిగి పడుకున్న తాను పడుకుంది 


బస్సు చెన్నై చేరుకుంది చూస్తే అమ్మాయి లేదు , పేరు తెలీదు ఎక్కడుంటుంది , ఏమి చేస్తుంది కూడా తెలీదు ఛ ! రాత్రి మాటలు కలిపింటే బాగుణ్ణు అనుకుని బస్సు దిగి క్యాబ్ ఎక్కి నేను కంపెనీ వారి గెస్ట్ హౌస్ కి చేరుకుని అక్కడ నుండి నేరుగా ఆఫీస్ కి వెళ్లి మీటింగ్ లు పూర్తి చేసుకుని అక్కడే లంచ్ చేసి గెస్ట్ హౌజ్ కి చేరుకోడానికి క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోయాను ఇక్కడ ఆశ్చర్యం కల్గించే విషయం ఏంటంటే నేను క్లయింట్ కోసం వెళ్ళిన ఆఫీస్ కి తాను ఉద్యోగం కోసం రావడం. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు చూసాను కానీ నా గొడవల్లో తనని పట్టించుకోలేదు వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్ కి ఫోన్ చేసి ఉదయం వచ్చిన అమ్మాయి వివరాలు తెలుసుకున్నాను పనిలో పనిగా అమ్మాయి రేపు ఆఫర్ లెటర్ గురించి రేపు వస్తుందన్న సంగతి తెలుసుకుని మేనేజర్ కి చెప్పాను ఇంకా కొన్ని మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి నేను రేపు ఆఫీస్ కి వస్తున్న అని . ఫోన్ పెట్టేశాక వాట్సప్ ఓపెన్ చేసి వివరాలను చదవడం స్టార్ట్ చేశాను 

తన పేరు సంధ్య అని , తనది కరీంనగర్ అని తెలిసింది ఓహో తనది కరీంనగర్ హా మన ఊరే అని తెలిసి సంబరపడి. నంబర్ సేవ్ చేసి డీపీ చూసాను అబ్బో ! ఫోటో ల కన్నా నిజంగానే బాగుంది అని అనుకుంటూ మిగిలిన వివరాలు చదవసాగాను పుట్టింది కరీంనగర్ అయితే ఉంటుంది హైదరాబాద్ అని క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయితే అతి బలవంతంగా చెన్నై చేరుకున్నట్లు ఉంది . అంటే అమ్మాయి ఏమి చెప్పలేదు నాకే అర్థం అయింది . హాబీలు చూస్తే పుస్తకాలు చదవడం , సినిమాలు చూడటం అంటూ రాసింది 

పర్లేదు మనలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనుకుని గెస్ట్ హౌజ్ చేరుకుని రేపు అమ్మాయి తో ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఊహించుకుంటూ పడుకుంటే పనిమనిషి సర్ ! భోజనం తెచ్చాను అంటూ లేపింది . లేచి మొహం , చేతులు కడుక్కుని తిని మళ్ళీ అమ్మాయి డీపీ తేరిపారా చూసి పడుకున్నాను









































Rate this content
Log in

Similar telugu story from Fantasy