M.V. SWAMY

Drama

2  

M.V. SWAMY

Drama

దీపావళి

దీపావళి

2 mins
232


సుమిత్ర ఎనిమిదో తరగతి చదువుతుంది. సుమిత్రకి ప్రియాంక అనే స్నేహితురాలు ఉంది. ప్రియాంక తల్లి కిడ్నీల వ్యాధితో బాధ పడుతుంది. ఆమె ఆసుపత్రిలోనే ఉంటుంది. ఆమెకు రోజుకి ఐదువేల రూపాయలు ఆసుపత్రికి,మందులకి ఖర్చు అవుతుంది. ప్రియాంక వాళ్ల కుటుంబం బ్రతుకుతెరువు కోసం రాజస్థాన్ నుండి ఈ మధ్యనే మన ప్రాంతం వచ్చారు, అందుకే వాళ్లకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించవని ఆసుపత్రి వాళ్ళు అంటున్నారు.అందుకే ప్రియాంక తండ్రి మిఠాయిలు దుకాణం నడుపుతూ వచ్చిన డబ్బులుతోనే ప్రియాంక తల్లికి వైద్యం చేయిస్తున్నాడు.


అయితే తండ్రి తెచ్చిన డబ్బులు తల్లి ఆసుపత్రి ఖర్చులకే చాలక తలితండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రియాంక రోజూ సుమిత్రతో చెప్పి ఏడుస్తుండేది.ప్రియాంక బంధువులు కూడా పెద్దగా డబ్బులు ఉన్నవారు కాదని డబ్బులున్న బంధువులు ఎవరూ సాయం చెయ్యడం లేదని నాన్నమ్మ అమ్మ దగ్గర ఆసుపత్రిలో ఉంటే నేనూ, తమ్ముడు నాన్నకు సాయంగా వుంటున్నామని సుమిత్రతో ప్రియాంక చెబుతుండేది. ప్రియాంక కుటుంబం దుస్థితి చూసి సుమిత్ర చాలా బాధపడుతుండేది. బడికి దీపావళి ముందురోజు నరక చతుర్ధశి సెలవు ఇస్తున్నారని సుమిత్ర వారం రోజులు ముందుగానే తెలుసుకుంది. బడిలోని స్కూల్ గర్ల్స్ లీడర్ జయంతిని కలిసి ప్రియాంక కుటుంబం విషయం చెప్పింది.


ఏదోఒక విధంగా ప్రియాంకకు సాయం చెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వెంటనే స్కూల్లో బాయ్స్ లీడర్ తో మాట్లాడారు. అతను కూడా సరే అని అన్నాడు. గేమ్స్ పీరియడ్స్ లో స్టూడెంట్స్ సమాలోచన చేసుకున్నారు.దీపావళి సెలవుల ముందురోజు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనుమతితో విద్యార్థులు ఒక్కక్కరూ కనీసం ఐదు వందల రూపాయలకు తక్కువ లేకుండా దీపావళి సెలవులు తరువాత తేవాలని ప్రార్ధనా సమయంలో ప్రకటన చేశారు, అయితే అంత డబ్బులు తేలేనివారు ఇంట్లో ఇబ్బంది పెట్టవద్దని సూచన చేశారు, ఆ రోజు ప్రియాంక బడికి రాలేదు కాబట్టి సుమిత్ర ప్లాన్ ఆమెకు తెలీలేదు.విద్యార్థులు దీపావళి సామానులు కొనడం మానేసి తలిదండ్రులు దీపావళి వేడుకకు ఇచ్చిన డబ్బులు ప్రియాంక కుటుంబానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారని తెలిసి టీచర్స్ వీలైనంత ఎక్కువ మొత్తం డబ్బులు కూడబెట్టారు.విషయం తెలుసుకున్న పాఠశాల పేరెంట్స్ కమిటీవారు కొంత మొత్తాన్ని కూడబెట్టారు, ఈ కబురు ఊర్లో వారికి తెలిసి వాళ్ళు కొంత మొత్తాన్ని కూడబెట్టారు,అంతే కాదు పిల్లలు మంచి పనికే డబ్బులు కూడబెడుతున్నారని వారి వారి స్థోమతను బట్టి డబ్బులు పిల్లలకు ఇవ్వడానికి పేరెంట్స్ సిద్ధమయ్యారు. చుట్టుపక్కల గ్రామాల యువకులు ఈ సంగతి తెలుసుకొని కొంత డబ్బులు కూడబెట్టడానికి నిర్ణయించుకున్నారు.


పెద్దమనుషులు ద్వారా తెలుసుకున్న ఆ నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. వైద్యశాఖ మంత్రివర్యులుని సంప్రదించి ప్రియాంక తల్లికి ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు చెయ్యమని కోరాడు. వైద్యశాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తెచ్చి ప్రత్యేక ఆదేశాలు ముఖ్యమంత్రిచే అధికారులకు ఇప్పించారు. ప్రియాంక తల్లికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించమని అధికారులకు ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చారు.ఇదంతా వారం రోజుల్లోనే జరిగిపోయింది. సుమిత్ర తలిదండ్రులు కూతుర్ని మెచ్చుకొని పదివేల రూపాయలు ప్రియాంక కుటుంబానికి ఇచ్చారు. ప్రభుత్వం ప్రియాంక తల్లికి ఉచితంగా వైద్యం చేయించి, ఖరీదైన వైద్యం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపి ఆమె ఆరోగ్యం బాగుచేసి ఇంటికి పంపగా... ఆమె పౌష్ఠిక ఆహారం, కుటుంబ ఖర్చులకు, సుమిత్ర బృందం, టీచర్లు, పేటెంట్స్ కమిటీ, గ్రామస్తులు, ఇతరులు కూడబెట్టిన డబ్బులు పనికి వచ్చాయి.సుమిత్ర చొరవ గురుంచి తెలుసుకొని పత్రికలు ప్రముఖంగా ప్రచారం చేసి ప్రశంసించాయి. సుమిత్ర చేసిన ఉపకారం తెలుసుకొని ప్రియాంక కన్నీటితో సుమిత్రకు కృతజ్ఞతలు తెలిపింది, సుమిత్ర ప్రయత్నం వల్లే అమ్మకు సరైన వైద్యం అందింది.


కుటుంబం కుదుట పడిందని సంతోసించింది ప్రియాంక, ఈ దీపావళికి దీపావళి మందుగుండు సామానులు ఎక్కువ కాల్చలేకపోయినా ఒక పెద్ద మంచి పని చేసి మన ఐక్యత, స్నేహాధర్మం చూపమని సుమిత్ర ఒకరోజు పాఠశాల ప్రార్ధనా సమయంలో మిత్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక కుటుంబం కుల, మత, భాషా, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకున్న తెలుగువారికి ధన్యవాదాలు తెలిపి, భారతీయ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama