AMARNATH P

Horror

4.1  

AMARNATH P

Horror

డెడ్ బాడీ

డెడ్ బాడీ

4 mins
937


అది ఊరి చివరున్న అందమైన బంగ్లా.ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి "సార్.మీరు ఒకసారి ఇక్కడకి రావాలి,ఇక్కడ ఇంటి నిండా శవాలే. మీరు త్వరగా ఊరి చివరున్న బంగ్లాకి రండి" అని అన్నాడు.

అప్పుడు ఈ మాటవిన్న వెంటనే ఆ పోలీసాఫీసర్ అక్కడికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఇంతలో తన ఫ్రెండ్ సి.ఐ.డి. ఆఫీసర్ పరుశురామ్ కి ఫోన్ చేసి ఈ విధంగా కాల్ వచ్చిందని చెప్పాడు. సి.ఐ.డి ఆఫీసర్ పరశురామ్ , అతని మిగతా టీమ్ తో అక్కడికి వెళ్లాడు. బంగ్లా వద్దకు చేరుకున్న వీరికి అక్కడ దూరంగా కొండమీద కనిపిస్తున్న బంగ్లా వద్ద ఐదుగురు వ్యక్తులలో ఒకడు పరుగెత్తుకుంటూ వీరి వద్దకు వచ్చి"సర్! సర్! మీరు నాతోపాటు ఇటుగా రండి.ఆ దారిలో పోతే అన్నీ ముళ్లులే ఉంటాయి" అని అనగా ,అతనితో పాటు ఆ వచ్చిన పోలీసాఫీసర్ , సి .ఐ.డి. ఆఫీసర్ , అతని టీమ్ వెళ్లారు.అయితే దారిలో వెళ్తూ ..."మీకు ఎలా తెలిసాయి ఇక్కడ శవాలున్నాయని? ,మీరు ఇక్కడికెందుకొచ్చారు?" అని పరుశురామ్ వారిని అడగ్గా వాల్లలో ఒకడు "సార్ ఈ బంగ్లా వెనకున్న అడవిలోకి కట్టెలుకొట్టుకోవడానికి వస్తుంటాం ,ఈ కొండదిగువనే మాగూడెసెలు ఉన్నాయి. ఈ రోజు మేము కట్టెలకని వచ్చినపుడు అలసిపోయి ఇక్కడ కనబడ్డ బంగ్లాలోకి సేదతీరడానికి వెళ్లాం,చూస్తే లోపల ఎక్కడ చూసినా రక్తం మరకలు , ఏ రూము చూసినా శవం , అందుకే భయంతో మీకు ఫోన్ చేశాం" అని అన్నాడు. సరే మా ఫోన్ నెంబర్ మీకెలా తెలిసిందని అన్నాడు పరశురాం టీంలో ఒకడు. దానికి వాళ్లు " సార్...!ఓ రోజు ఈ ఇన్స్పెక్టర్ సారు మా గూడెం వద్దకు వచ్చి ఎవరైనా అక్రమంగా ఎర్రచందనం కొడుతున్నా , అనుమానంగా ఎవరైనా తిరిగినా మాకు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాం అని  మాకు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారండి..." అని అన్నాడు. ఓ.....అదా.. సంగతి అని అన్నారు అందరు..

సరే....

లోపలికి చేరుకున్న వీరు బంగ్లా మొత్తం పరిశీలిస్తున్నారు. ఇంతలో ఆ ఫోన్ చేసిన వ్యక్తులు ఒక శవాన్ని తరువాత ఒకటి చూపించారు. ఆ దారుణం చూసిన టీమ్ నివ్వెరపోయారు.ఆఫీసర్ పరశురామ్ " ఓ గాడ్! ఇంత క్రూరంగా చంపారేంటయ్యా....! " అంటూ లోపలున్న అన్ని గదులూ చూశారు. అక్కడ ఉన్న రూములలో , ఒకొక్క రూములో ఒకొక్క శవం కనిపించింది.అందులో అన్నీ 18 సంవత్సరాలు గల ఆడపిల్లల శవాలు , ఆ శవాలపై బుల్లెట్ గాయాలున్నాయి. ఈ మధ్యే చంపబడినట్టుగా తెలుస్తోందని నిర్థారించుకున్నాడు పరుశురామ్.

వెంటనే క్రైమ్ స్కాడ్ ని పిలిపించాడు పరశురామ్. త్వరగానే అక్కడికి పెద్ద వ్యానులో చేరుకుని పనిని మొదలుపెట్టారు స్కాడ్. వారు కూడా ఈ శవాలు కంపుకొడుతుండడం బట్టి వాల్లు చంపబడి వారం అవుతోందని నిర్థారణ చేశారు.

ఆ స్కాడ్ ప్రతీ రూమ్ నీ వెతుకగా మొత్తం 12మంది ఆడపిల్లల శవాలు లభించాయి.ఇంకా కొన్ని రూముగదులలో శవాలు పూడ్చబడనట్టు గుర్తించారు స్కాడ్.అన్ని రూములనీ తవ్వి చూశారు అలా కూడా కొన్ని శవాలు దొరికాయి. అయితే ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే అన్ని శవాలకు కామన్ గా బుల్లెట్ గాయాలు , పంటి గాటులు , గోటితోగీరిన గుర్తులు , బట్టలు లేకుండా శవాలను పడేయడం. ఆ తర్వాత వారికి  అక్కడొక మనిషి ఎత్తుకంటే పెద్దగా ఉన్న ఒక పైపు కనబడింది. దానిలో టార్చ్పెలైటు వేసి చూడగా అందులో కూడా రెండు శవాలు ఉన్నట్టు గుర్తించారు.అయితే ఆ పైపుకి ఉన్న ప్రవేశం పైనున్న రూములకు కనెక్షన్ ఉన్నట్టు తెలుసుకున్నారు.అయితే ఆ రెండు శవాలు యాభైఏండ్ల మహిళలుగా గుర్తించారు.వాటిని పోస్ట్ మార్టంకి పంపించాడు ఆఫీసర్ పరుశురామ్.

ఇవ్వన్నీ చూస్తున్న పరశురామ్ ఆలోచనలో పడ్డాడు.ఫోన్ రింగు అవుతోంది...అయినా పట్టించుకోలేదు.మళ్లీ , మళ్లీ ఫోన్ రింగ్ అయి ఫోన్ కట్టైంది.ఈ సారి ఎవరని చూస్తే తన పదేళ్ల కొడుకు వినయ్ చేశాడని చూసాడు.అయినా తిరిగి కాల్ చేయాలనిపించలేదు పరశురామ్ కి.ఇప్పుడు తన ఆలోచన అంతా, ఆ శవాలు, వాటి కథేంటి ,అని వాటి గురించే ఆలోచిస్తోంది తన మైండ్ అంతా.

పరశురామ్ టీమ్ ఈ శవాలని చూసి నవ్వెరపోయారు , ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఇన్ని శవాలు ఒకే చోట దొరకడంతో వాల్లు ఆశ్చర్యం తో బిత్తరపోయారు.ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గర్భవతి శవం వారికి తారసపడింది ఆ శవం రెండు మూడు రోజుల కిందటిగా గుర్తించారు స్కాడ్. దానిని చూసిన పరశురామ్ కి మనస్సులో బాధ అయినా "మనం చేసే ఈ పనిలో జాలి , దయ , మమకారాలు ఉండకూడదు.వెంటనే ఈ శవాన్ని పోస్టుమార్టంకి పంపించండి" అని స్కాడ్ కి , అతని టీమ్ కి చెప్పి అక్కడినుండి బయటకు వెళ్లి తన జేబులోంచి సిగరెట్ తీసి కాలుస్తున్నాడు పరశురామ్.అసలే తన కూతురు భవ్య ఇంటినుండి వెళ్లిపోయి వారం అవుతోంది .తను ఏమైపోయిందనే బాధలో కేసుపై దృష్టి సారించలేకపోతున్నాడు. సిగరెట్ కాలుస్తూ , చూట్టూ ఉన్న ప్రదేశాన్ని చూసాడు.ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవి కమ్ముకొంది. ఆ అడవి మధ్యలో ఒక రహదారి కూడా ఉంది. ఈ ప్రదేశం ఆ అడవికి పెద్ద దూరం ఏమీ లేదు.హంతకుడు ఎవడో అని దీర్ఘంగా ఆలోచించసాగాడు.అనుమానంతో అటుగా నడవసాగాడు.దారిలో ఒక చోట ఆడవాల్ల  చెప్పులు కనబడ్డాయి , వాటిని చూసి ఇవి ఆ బంగ్లాలో చనిపోయిన వారివి అయిండొచ్చు అని మనసులో అనుకున్నాడు పరశురామ్.వాటిని అలాగే ఉంచి తన వద్దనున్న ఫోన్ తీసుకోని ఆ బంగ్లా వెనుకవైపున్న అడవిలోకి రమ్మని స్కాడ్ ని ఆదేశించాడు.వారు హుఠాహుఠిన చేరుకున్నారక్కడికి. పరశురామ్ వారికి ఆ చెప్పులను చూపించాడు.వారు వాటికి మార్క్ చేసి ఫోటోలు తీసుకున్నారు.

"ఇవ్వన్నీ చూస్తుంటే నిందుతుడు ఆ ఆడపిల్లల్ని ఇటువైపే తీసుకొచ్చాడని అనిపిస్తోంది సార్!"అన్నాడు స్కాడ్ లోని ఒకడు.వాళ్ళు అంతా అక్కడ రెడ్ స్టికర్ లు తగిలించి వెళ్లిపోయారు.

అలా ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయారు వాళ్ళు. పరశురామ్ కి case పై ఆసక్తి లేదు. అలా రెండు వారాలు గడిచింది.

ఓ రోజు అతని టీం అక్కడి వెళ్లారు. పరశురామ్ ఆ బంగ్లా వెనకకు వెళ్లి తిరుతుండగా ,ఇంతలో ఫోన్ వచ్చింది అతనికి . ఫోన్ లిఫ్ట్ చేసిన అతనికి " సార్.మీరు పంపించిన ఈ డెడ్ బాడీస్ అతికిరాతకంగా రేప్ చేయబడ్డారు.ఇందులో ఒక అమ్మాయి శరీరంలో ఒక యస్డి కార్డు దొరికింది సార్. అంతేకాదు బాడీలోని బుల్లెట్లు అన్నీ తీసి బద్రపరిచాము. చంపినవాడు చాలా కిరాతకుడు అయి ఉండాలి" అని అన్నాడు . "ఆ యస్డి కార్డ్ చాలా జాగ్రత్త! మనకున్న ఆధారం అదే. అలాగే ఆ బులెట్లు కూడా.సరే. ఇక ఉంటాను" అని ఫోన్ కట్ చేశాడు. అలా ఆ రోజు అంతా చాలా త్వరగా గడిచిపోయింది. ఇక చీకటి పడుతోంది.మిగతా రూములు పొద్దున వెతుకుదామని ఇంటి చుట్టూ రెడ్ కలర్ స్టికర్ డేంజర్ స్టికర్ ని మళ్లీ అతికించారు. అక్కడి నుండి ఇంటికి వెళ్లారు పరశురాం , అతని టీం , స్కాడ్ కూడా.

***ఉదయం 10 గంటలు***

మళ్లీ పరశురాం బృందం ఆ బంగ్లాలో గాలింపులు మొదలుపెట్టారు.అప్పుడు పైన ఉన్న రూములు వెతికిన వాల్లకు ఒక దృష్యం కనబడింది.Rate this content
Log in

Similar telugu story from Horror