చందమామ🤱🌝
చందమామ🤱🌝
అందాల చిందేటి చందమామ, ఆదుకుదాము...
రావోయి చoదమామ..!
మల్లే పందిరి కింద బుల్లి బుజ్జాయుంది,బుజ్జితల్లికి లాలపోసి పొదువుగాని చoల్లగ చందమామ, మెల్ల మెల్లంగ రావోయి చందమామ...!
వెండి గిన్నెలో వేడి బువ్వపెట్టుకొను...
బంగారు గిన్నెలొ పాయాసంపోసుకొని...
తిoదాము రావోయి చoదమామ,నువ్వు
చక్కని చుక్కలతో సయ్యాట లాడుతూ...
మబ్బు గుర్రాలెక్కి డబ్బునా పొయ్యేవు.
మాట వినిపోవోయి చందమామ,ఒక్క
మాట దిగిరావోయి చoదమామ..!