ranganadh sudarshanam

Tragedy


4  

ranganadh sudarshanam

Tragedy


బంధం

బంధం

2 mins 423 2 mins 423

.....అనుబంధం...


లక్ష్మిని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోని నాకు ఆ బాధను భరించడం కష్టoగా ఉంది.


లక్ష్మిని కర్చీపై కూర్చో పెట్టి నీళ్లు పోస్తున్నారు..నన్ను తన తలపై నూనె రాసి నీళ్లు పోయామన్నారు.


అలా చేస్తుంటే నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది..


తలపై చేయి వేసినప్పుడల్లా నా లక్ష్మి అబ్బా జుట్టు చిక్కుపడుతుందండి అంటూచేతిని సున్నితంగా తీసి వేసేది.


నిజంగా లక్ష్మిది చాలా పెద్ద జుట్టు తల స్నానం చేసినప్పుడు మోకాళ్లను దాటే జుట్టును చూసి అమ్మ ఎప్పుడు దిష్టి తగులుతుందని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి వెళ్లి తలా ఆరబెట్టుకోమనేది.


అప్పుడప్పుడూ...

మదనా.. సుందారి

మాదనా..సుందారి

బండెడు కురులది

జమిలి పాపెడది

మదనా సుందారి..

అని పాడుతూ నా లక్ష్మిని ఉడికించేవాడిని


లక్ష్మి నుదుటిపై బొట్టుపెట్టమన్నారు..

వణికే చేతులతో బొట్టుపెడుతుంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిoడి లోకమంతా చీకటిగా మారినట్లనిపించింది. 


లక్ష్మి ఎప్పుడు నుదుటిపై కొంచం పైకని పెద్దగా బొట్టు పెట్టుకునేది..


ఆ బొట్టు ...అది పెట్టె విధానం లక్ష్మికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టాయని  చెప్పవచ్చు.


అమ్మ... ఆబొట్టుతో పాటు కుంకుమ బొట్టు తప్పకుండా పెట్టుకోమని చెప్పేది..


లక్ష్మి అలా రెండు బొట్లతో నిండైన ముత్తైదువులా కనిపించేది.


బొట్టు కాటుక పెట్టి..

నే కట్టిన పాటను చుట్టి..

ఆశపడే.. కళ్ళల్లో వూసులాడు

వెన్నెలబొమ్మా...అని పాడుతుంటే నా లక్ష్మి పరవశించి పొయేది..


పట్టె మంచం పై ఉన్న పా తపరుపు వత్తుకుంటుందని మెత్తటి కొత్తపరుపు పట్టుబట్టి కనిపించి oది నా లక్ష్మి ..ఇప్పుడెందుకు లే వద్దంటే అది నాకన్నా మేకే ఎక్కువ అవసరం అని చిలిపిగా చూస్తు . కొంటెగా నవ్వింది నా కాక్ష్మి..


ఇవ్వాళ కట్టెల తో కట్టి..దానిపై వేసిన పాత చాపపై వేసిన గడ్డిపాన్పు పై పడుకోవాడాన్ని చూసిన నాకు.. తెలియని బాధ 

గుండెను మెలిపెట్టి పిండినట్లయ్యింది.


పూల పల్లకిలో మంగళ వాయిద్యాలతో నాతోపాటు వూరేగుతూ మా ఇంటికి వచ్చినమా ఇంటి లక్ష్మి..


ఈనాడు ఒంటరిగా కట్టెల పాన్పు పై ఏ స్పర్శా లేకుండా అన్ని మరచిపోయి వూరేగుతూ నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోతుంది.. .


నా మనసుపై ప్రపంచంలోని కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టి దాడి చేస్తున్నట్లనిపించింది.


నాతోపాటు కష్టాలు..సుఖాలు పంచుకొని అనుక్షణం నన్ను ఒక తల్లిలా ఆదరించిన నా లక్ష్మి, 

నా గౌరవ మర్యాదలు ప్రాణప్రదంగా కాపాడి నలుగురి ముందు నన్ను తలెత్తుకునేలా నిలబెట్టిన నా లక్ష్మి...


నన్ను విడిచి..ఈ లోకాన్నీ విడిచి వెళ్ళిపోతుంది.


నాకేమి లేనప్పుడు కష్టాలలో తను నా ధైర్యమై పక్కన నిలబడింది.


నా అభివృద్ధికి అహోరాత్రులు శ్రమించి,కష్టాలన్ని చిరునవ్వుతో  భరించి, సుఖాన్ని నాకందించిన నా లక్ష్మి ఇక నాకు కనిపించదన్న వాస్తం నేను తట్టుకోలేకపోతున్నాను.


కానీ అశక్తుడిని ఆపలేనుగా....


పడుకున్నప్పుడు దగ్గరగా వెళ్ళి చేయివేస్తే అబ్బ ఎప్పుడు అదే ధ్యాస అని, వళ్ళు చూడండి ఎంత వేడిగా వుందో అంటూ నా శరీర వేడిని తట్టుకోలేక దూరం జరిగి పడుకునేది .. నా లక్ష్మి...


ఈ జీవన తరంగాలలో

ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము

ఎంత వరకీ బంధము..మేళగాళ్ళు సిట్యుయేషన్ సాంగ్...వాయిస్తూ వున్నారు.


నిజమే ..కదా...అనిపించింది.


కానీ నేడు తన శరీరాన్ని అగ్నికీలలు దహించి వేస్తున్నాయి ...పాపం ఎలా 

బరిచగలుగుతుందో ఆ మంటల తాపాన్ని.


నా కామాగ్నిని చల్లార్చి..నన్ను లోకానికి తండ్రిగా పరిచయం చేసిన నా లక్ష్మి శరీరం ..కొద్దీ క్షణాల్లో మంటల్లో మం డి బూడిద కాబోతోంది...


నా కళ్ళ వెంట కారే కన్నీటి కి ఈ మంటలను ఆర్పే శక్తి వుంటే బాగుండు అనుకున్నాను.  


నాతో జీవితం పంచుకున్న నా జీవిత భాగస్వామి అన్ని బంధాలు, బంధనాలు తెంచుకొని.. ఈలోకాన్నీ.. నన్ను శాశ్వతంగా వదిలి కానరాని లోకానికి వెళ్ళిపోతుంది.


అంతా ఇంతేకదా...ఈ లోకంలోని ఏబంధము బాగస్వామ్యము శాశ్వతమైనవి కావు..అంత మూన్నాళ్ల ముచ్చటే.


ఆట ముగియగానే అంతా అయిపోతుంది

నీటిబుడగలాంటి జీవితానికి ఎందుకో ఈ పట్టింపులు, కోపాలు తాపాలు

ఇవన్నీ పోయే ప్రాణం ముందు ఎంత..


ఈ లోకంలో శాశ్వతంగా మిగిలేది మనం మిగిల్చిన మంచి..అది పెంచి అందించిన కీర్తి మాత్రమే.


ఈ ఆలోచనల దొంతరలకు తెరపడి.. మూసకపోతున్న నా కనుపాపాలలో నా లక్ష్మి రూపం నిండుకుంది.. 


అచేతనమైన నా శరీరం నుండి విడివడిన ఆత్మ ..ఆత్మానుబంధమైన నా శాశ్వత భాగస్వామిని కళ్లారా చూసుకుంటూ ...మురిసిపోతూ..

తెలియని దారుల్లో ..పయనిస్తూ..

నా లక్ష్మిలో ఐక్యమవ్వడానికి ఆరాటపడుతోంది.


...సమాప్తం...Rate this content
Log in

More telugu story from ranganadh sudarshanam

Similar telugu story from Tragedy