broken anjel Keerthi

Drama Tragedy Inspirational


3  

broken anjel Keerthi

Drama Tragedy Inspirational


భూమి topic 7

భూమి topic 7

4 mins 143 4 mins 143


కీర్తి సురేష్ గారు ఇందులో హీరోయిన్ గా ఎంచుకుంటున్నా...ఎందుకు అంటే మహానటి సినిమా లో 3 దశలను అభినయిస్తు దానికి అనుగుణంగా నటించారు...అదీ అందరితో కాదు.నాకు చాలా నచ్చింది అందులో వారి నటన.అందుకే ఈ కథ లో వారి నటన ని ఊహించి చూడండి....


భూమి లాంటి వారు మనలో ఎందరో.
(మన పాత స్కూల్ గంట మీకూ గుర్తుందా? )

స్కూల్ గంట మోగింది...పిల్లలు అందరు బయటకి పరుగు పెడుతున్నారు.అప్పుడే మన భూమి కూడా స్కూల్ నుంచి పరిగెడుతుంది .తన మువ్వల పట్టీలు చేస్తున్న సవ్వడి విని ముందు వెళుతున్న తన స్నేహితులు వెనక్కి చూస్తారు.


వెన్నల లాంటి రూపం తనది...పొడవాటి వాలు జడ..కూచిపూడి చేసే కుందనాల బొమ్మ లాంటి పెద్ద కళ్ళు వాటికి అద్దిన నల్లని కాటుక ...బంగారు రంగు లో మిలమిల మెరిసే నగుమోము.


 పిలవచ్చు కదే అల పరిగెత్తి రాకుంటే....


భూమి సమాధానం చిన్న చిరునవ్వు..


ఏమిటో నే తల్లి ...ప్రతిదానికీ చిరునవ్వు నవ్వి ఊరుకుంటావు మాటలు రాని ముగాధానిల..


మళ్ళీ అదే నవ్వు...


ఆలస్యం అయిన క్లాస్ కి పరుగు తీసింది 15 ఏళ్ల భూమి .నిశ్శబ్దం గా వున్న స్కూల్ వాతావరణం లో కేవలం తన కాలి మువ్వల చప్పుడు మాత్రమే వినపడింది.ప్రిన్సిపల్ అవి వేసుకొని స్కూల్ రావద్దు అంది...తనకి ఇష్టం అయిన మువ్వల పట్టీలు తీసి ఒక పెట్టెలో పెట్టింది.


తను 10 వ తరగతి లో ఫస్ట్ వచ్చింది అని నాన్న కొత్తబట్టలు కొనడానికి మార్కెట్ తీసుకెళ్ళాడు...తనకు ఎంతగానో నచ్చిన గుబురు ఫ్రాక్ నీ చూసింది .దాని కిందే వున్న ధర నీ కూడ చూసింది.నాన్న వచ్చేపుడు పర్సు లో పెట్టిన 500 గుర్తువచ్చింది. ఆ డ్రెస్ తనకి నచ్చలేదు అని చెప్పి 500 ధర పలికే చుడీదార్ తీసుకుంది...చిరునవ్వు నవ్వుతూ....థాంక్స్ నాన్న నాకు ఇది చాలా నచ్చింది అని నాన్న బుజం మీద తల వాలుస్తు అంది.తన ముద్దుల బిడ్డ కి నచ్చిన బట్టలు కొనగలిగా అని సంబర పడ్డాడు ఆ మధ్యతరగతి నాన్న...


అద్దం లో చూస్తు తన వాలు జడ నీ అల్లుతు తన వెంట పడి జడ నీ లాగిన పోకిరీలు గుర్తు వచ్చి జడని బారెడు కత్తరించింది ఆ జడ నీ చేతిలో పట్టి చూస్తూ .మళ్ళీ అదే చిరునవ్వు నవ్వింది.అమ్మ చివాట్లు పెట్టింది.ఎందుకు ఇలా చేసావే అని.నాన్న తనకి నచ్చినట్టు వుండనివ్వే అని బార్య కి సర్ధి చెప్పాడు.


జీన్స్ ప్యాంటు వేసుకొని వస్తున్న తననీ చూస్తూ అబ్బాయిలు చుసే చూపు కంటే ఇంటిపక్క ఆంటీలు చూసిన వెకిలి చూపులే తననీ ఎక్కొవ ఇబ్బంది పెట్టాయి.తన తల్లి తో "ఈ మధ్య రోజులు బాగాలేవు వదిన ఇలాంటి బట్టలు వేసి పంపితే రేపు జరగరానిది ఏదయినా జరిగితే మనమే బాధ పడాలి"అయిన నాకెందుకులే ఎదో మీ మంచి కోరి చెప్తున్నా అంటూ చెప్పి వెళ్ళిన పక్కింటి కాంతం పిన్ని మాటలు విన్న భూమి మళ్ళీ చిరునవ్వు నవ్వింది.మనం వేసే బట్టల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి అనే మాటను గుర్తు చేసుకున్న సమయం లో అప్పుడే వస్తున్న వార్తల్లో 9 నెలల పాప పై అత్యాచారం అని చూసి నవ్వలేక నవ్వుతూ ఆ బట్టలని మళ్ళీ పెట్టలో పెట్టింది.


డిగ్రీ లో చేరింది భూమి.తన వాలు కల్లని చూస్తూ ఓ పిల్ల కవి ఏకంగా నల్ల బోర్డు మీద కవిత రాశాడు. ఆ వాలు కళ్ళు తనవే అని భూమికి చివాట్లు పెట్టింది టీచర్.కాటుక డబ్బి నీ తీసి మళ్లీ నవ్వుతూ పెట్టెలో పెట్టింది భూమి.వృత్తి విద్య నేర్చుకునేందుకు చేరింది భూమి.తననీ ప్రేమిస్తున్నా అంటూ ప్రేమ లేఖ రాశాడు తన సహ విద్యార్థి.అతనంటే వున్న ఇష్టాన్ని కనుసైగతో కూడా చెప్పలేకపోయింది భూమి.అమ్మ నాన్న ఒప్పుకుంటారా అని ఆగిపోయింది.ప్రేమలేఖ ఇంట్లో దొరికింది అతను ఎవరని కూడా అడగక పెళ్లి చేసి పంపారు .తలవంచుకొని చిరునవ్వు నవ్వుతూ పెళ్లి చేసుకుంది.


ఆగిన చదువుని పూర్తి చేసేందుకు అవాంతరాలు.ఆలోచిస్తే పెద్దవి కాదు అల అని వధలలేము..చదువు ఆగింది.....


ఓ రోజు భర్త తో ఓ విందుకు వెళ్ళింది అల్లరిముకా భూమి అందాన్ని చూసి వివాహం అయింది అని కూడా ఆలోచించక సినిమా పాటలతో అల్లరి చేసారు.వారి మీద కోపం చూపలేక తనపై అరుస్తున్న భర్త నీ చూసి మళ్ళీ అదే చిరునవ్వు చిందిస్తూ తన సింగారాన్ని (రెడీ అయ్యే వస్తువులు'అవ్వాలి అనే

ఆశ ని)కూడా పెట్టే లో వేసేసింది.


పిల్లలు పుట్టారు వాళ్ళ బాగోగుల తో కాలం సగం గడిచింది.వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం మొదలయ్యింది. కాలిగానే వుంటున్న కదా స్కూల్ లో పాఠాలు చెపుతా అని అంది.సంపాదించి ఎవరికి పెడతావు అని హేళన చేశారు అత్తగారు.తన సర్టిఫికేట్ లు తీసుకెళ్ళి మళ్ళీ అదే పెట్టెలో వేసేసింది...


పిల్లలకి పిల్లలు పుట్టారు.ముసలిధి అయ్యింది అని ఏ పనికి రాదు అని విసుగుకోడం మొదలు పెట్టారు. ఈ సారి పెట్టెలో పెట్టడానికి తన దగ్గర ఏమి లేదు.తన ప్రాణం తప్ప.కళ్ళు మూసుకుని కాసేపు ఉండిపోయింది.తన గతం కల్ల ముందు తిరిగింది. ఆ పెట్టే నీ తెరిచింది.....కళ్ళలో కాంతిని నింపుకొని ముందుకు కదిలింది.తన వస్తువులని తిరిగి అమర్చుకుంది.తన మువ్వల సవ్వడి నీ వింటూ ముందుకి కదిలింది ఈ సారి పాఠం చెప్పడానికి కాదు తన జీవిత పాఠాన్ని అందరికీ తెలియచెప్పి...తన లాంటి భూమి ఇక వుండకూడదు అని.తనకి కనీసం 1% కూడా సంతృప్తి నీ ఇవ్వక చేసే త్యాగం కనీసం తననీ అర్ధం చేసుకోలేని వారి కోసం చేసి ఉన్న ఒక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా వుండాలి అని ఆశిస్తూ తన వాలు జడ ముందుకు వేసి కదిలింది ఆరుపదుల వయసులో..,

కాలం పెట్టే పరిక్షో

వీధి అందిచే శిక్షో


సమాజం పెట్టే విషమపరినామల్లో

తనని ఎప్పుడు ఓడించే క్షణాల్లో


నన్ను నేను 

అడగలేక అడుగుతున్న ప్రశ్నో


ఎటువైపు సాగుతుందో 

సమాధానం లేని జీవితానికి సాక్షో


అడుగడుగున అంతరాయలా

ప్రయాణంలో నా సహా స్నేహితురాలో


అపనిందలు మోస్తూ వెనక్కి వాలిన

క్షణాన నను ముందుకు నడిపే నా శ్రేయోబిలాషో


నేనేంటో నాకంటే ఎక్కువగా 

తెలిసిన నా ప్రీయసకో


కన్న కలల్ని పులుముకున్న కన్నిరునీ

పన్నిరుగా మలిచి నన్ను అల్లూకొనే నా ధైర్యమోో


ఏమని చెప్పను తన గురించి 

ఎలా చెప్పను తన గురించి


రూపంలేని తానే లేకుంటే 

నేను లేనని

తానే లేకుంటే ఈ ప్రతిరూపం 

పనికేరాదని

తెలిసిందా ఇప్పటికయినా 

తను ఎవరొనని


తెలియకపోతే చెప్పనా 

అదే నన్ను ప్రతిబింబించే నా మనస్సాక్షనీ!


ఇంత వరకు చేసింది ఇక చాలని

పరులకోసం నిను చంపుకొక ఇక పదమనీ


చేప్పింది నా మనస్సు

 నేడు నాకు చెప్పింది


కాలం పెట్టే పరీక్షలను 

అధిగమించి ముందుకు సాగిపో అని

లోకం నికు తోడు లేకున్నా

నీ చితి వరకు నికు నేను తోడస్తనని


చెప్పింది నా మనసు

నేడు నాకు చెప్పింది అని సాగర తీరాన కూర్చొని తన డైరీ లో రాసుకుంది భూమి.తన పెట్టే(సూట్కేస్) నీ పట్టుకొని మార్గం తెలియకపోయినా ముందుకు కదిలింది.తన లాంటి భూమి నీ వెతికి తన బతుకుని కాపాడాలని.


ఆ భూమి ఇప్పుడు చదివే ఈ భూమి కూడా కావచ్చు గా... ఆడవాళ్ళు అంటే ప్రేమ కి,త్యాగానికి,ఓర్పుకి చిహ్నం అని అంటారు. యే......ధైర్యానికి,పట్టుదలకు ఎందుకు చిహ్నం కాకూడదు. ఆధి శక్తి రూపం అంటారు ..మరి కోపం వస్తె ఆ శక్తి కోపంతో ఉగ్రరూపం దాల్చదా...అది కూడా శక్తి రూపమే కదా...కానీ అమ్మాయిలు కోప్పడితే...

"అమ్మాయికి కోపం పనికిరాదు "అని "అబ్బాయి అన్నాక ఆ మాత్రం కోపం వస్తుంది" అని మనం మాట్లాడే చిన్న చిన్న మాటలే పిల్లలకి పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చెల చేస్తాయి అని మరిచిపోకండి.అమ్మయి మనసు ఒక సముద్రం అని పోల్చాడు ఓ మహాకవి.దాన్ని ఈధలెము అమ్మాయి మనసు ని అర్ధం చేసుకోలేము అని అర్ధం.అర్ధం చేసుకొని తన మనసుని గెలుచుకున్న వాడు మాత్రం లోకాన్ని జయిస్తాడు.


అమ్మాయికి .....

తనకంటూ ఇష్టాలు వున్నాయి అని 

ఓ మనసు వుంది అని

కోరికలు ఉంటాయి అని 

ఆశలు కుడా వుంటాయి అని 

 అర్ధం చెసుకొని తనని తనల వుండనిచ్చితె చాలు తన మనసుని గెలవవచ్చు.

అధి ఒక్కటి చాలు భూమి లాంటి అమ్మాయిలు ఇక వుండరు.....కావచ్చు


Note:భూమి గురించి చెప్పిన దానిలో 90%నిజం అయితే మిగితా కథ కల్పితం.


 

Rate this content
Log in

More telugu story from broken anjel Keerthi

Similar telugu story from Drama