అంతిమ తీర్పు
అంతిమ తీర్పు


జడ్జి గారు తన స్థానంలో ఆశీనులయ్యారు
కోర్ట్ హాలంతా కిక్కిరిసివున్నా నిశ్శబ్దoగా ఉంది.
సెషన్ ప్రారంభమైంది క్రమశిక్షణగా కోర్ట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
బంట్రోతు పేర్లు పిలుస్తున్నాడు.
ముద్దాయిలు,సాక్షులు,ఎవరిపేరు పిలవగానే వారు చేతులు కట్టుకొని లోనికి వెళ్లి రెండుచేతులు జోడించి జడ్జిగారి ముందు హాజరు చెప్పి...కేసు వాయిదా పడగానే వూపిరి పీల్చుకొని బైటికి వస్తున్నారు.
కొమ్ములు తిరిగిన రౌడీలు..పేరుమోసిన దొంగలు
అవినీతి తిమింగలాలు, మోసాలు చేసి జనాన్ని ముంచి దొరల్లా చలామణి అవుతున్న నాయకులంతా..అతివినయంగా ఒకటికి రెండు బొట్లు పెట్టుకొని, చొక్కా గుండీలన్ని పెట్టుకొని.. ఎప్పుడు తమ పేరొస్తుందో అని ఎదురు చూస్తున్నారు.
మరికొందరు అమాయకులు... గుండెలదురుతుండగా, తమను ఈ గండంనుండి బైట పడేయమని దేవుణ్ణి మొక్కుకుంటూ...బిక్కు బిక్కు మంటూ కోర్టుముందు తమ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
కార్లలో దిగే లాయర్లు..మోటార్ సైకిల్ పై వచ్చే లాయర్లు,ఆటోలో దిగే లాయర్లు ..అంతాఎవరి దారిలో వారు వస్తున్నారు.
కేసుకు ముందు తరువాత...ఎవరిస్తాయినిబట్టి వారు లాయర్లకు...అవినీతి సొమ్మో...అప్పుచేసిన సోమ్మో... కష్టపడి కూడబెట్టిన సొమ్మో సమర్పించుకుంటున్నారు.
కేసు ముందుకు రావాలంటే డబ్బులు..
రీకాల్ చెయ్యాలంటే డబ్బులు...
రాజీపడాలంటే డబ్బులు ..
అన్యాయం గెలవాలంటే డబ్బులు ....
న్యాయం గెలవాలంటే డబ్బులు..
ఇలా... కోర్టుకొచ్చినవాళ్ళoతా న్యాయం గెలవడం కోసమో,న్యాయాన్ని చంపడం కోసమో డబ్బులు ఇస్తూనే వున్నారు... తప్పదన్నట్లు.
ఎవరి ఆశ వారిది.
ఎవరో పెద్దమనిషి చెప్పినట్లు కోర్టు కేసులో ఓడినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచినవాడు.. ఇంటికొచ్చి ఎడిచాడట.
కోర్టుకొచ్చినవారూ ఎవరైనా ఎడవాల్సిందే....
ఇక్కడ లాయర్ను బట్టి న్యాయం మారుతుంది..
డబ్బునుబట్టి న్యాయం మారుతుంది...
అధికారాన్ని బట్టి న్యాయం మారుతుంది..
న్యాయం కూడా డబ్బులవైపు మారుతుంది...
కానీ న్యాయం న్యాయం వైపు మారటం కష్టం అవుతుంది.
న్యాయo ఒక్కోసారి అన్యాయమైపోతుంది..
ఎందుకoటే వందమంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు.. కానీ ఒక్క నిర్దోషి శిక్షించ బడకూడదన్న న్యాయ వ్యవస్థ మనది...
జడ్జి గారి ఆరోజు.. ఆరు నెలల క్రింద రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పావనిపై జరిగిన రేప్ కేసు విచారణ జరుగుతుంది.
ఆ ఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరగడం, ఆ కేసులో ముద్దాయి రాష్ట్ర మంత్రి కొడుకు కావడంతో..కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళా సoఘాలు, ప్రతిపక్ష పార్టీలు
గగ్గోలు పెట్టడంతో...రాష్ట్రంలో ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది.
ఫార్మాలిటీస్ పూర్తి కాగానే జడ్జి గారి ఆదేశంతో పావని చెప్పటం మొదలు పెట్టింది.
సార్ సందీప్ నేను ఒకే కళాశాలలో చదువుతున్నా ము.
ఆరోజు మార్చ్ ఎనిమిది..కాలేజి పూర్తి కాగానే ఎప్పటిలాగే నేను హాస్టలుకు వస్తున్నాను, నా వెనకాలే బైక్ పై వచ్చిన సందీప్ నాదగ్గరగా బైక్ ఆపి...నా విషయం ఏం చేసావు అన్నాడు.
నీకు చాలా సార్లు చెప్పాను సందీప్ నీ దండం పెడతాను నన్ను ఒదిలేయి, నాకు నా భవిష్యత్తు ముఖ్యం...మా అమ్మానాన్న నామీద ఎన్నో ఆశలతో చదివిస్తున్నారు.. నాకిలాoటివి నచ్చవు అన్నాను.
ఏం చూసుకొనే అంత పొగరు ఎర్రతోలుందనేనా..చూస్తా ఎలా ఒప్పుకోవో నేను తలుచుకుంటే..నిన్నేమైనా చేయగలను ..మర్యాదగా ఒప్పుకో అన్నాడు బెదిరిస్తూ..
నేను ససేమీరా అన్నాను.
నీ అంతు చూస్తాను అంటూ నాపైన యాసిడ్ తీసి పోస్తానని బెదిరించాడు..
నేను గట్టిగా అరిచాను జనాలంతా పోగయ్యారు...
అది చూసి సందీప్ బైక్ స్టార్ట్ చేసి... నీ సంగతి తరువాత చెప్తా అంటూ
వేలువూపుతూ బెదిరిస్తూ వెళ్ళిపోయాడు.
అంటూ కళ్లనుండి కారుతున్న నీళ్లను తూడ్చుకుంటు చెప్పసాగింది పావని.
తరువాత నేను హాస్టలుకు వెళ్ళాను..ఎప్పటిలాగే బోజనం చేసి పడుకున్నాను.
మధ్యరాత్రి బాత్ రూమ్ కు వెళ్లి వస్తున్నాను..ఇంతలో పవర్ ఆఫ్ అయ్యింది...నేను మెల్లగా చూసుకుంటూ నడుస్తూన్నాను.
బలంగా నా నోటిని గట్టిగా పట్టుకొని...స్టోర్ రూమ్ లోకి లాకెళ్లారు...అంటూ బోరున ఏడ్చింది పావని.
జరిగుంది జరిగినట్లు భయపడకుండా చెప్పమ్మా అన్నాడు జడ్జి గారు.
నేను బలవంతంగా తప్పించుకునే ప్రయత్నం చేసాను, నా ముక్కు దగ్గర ఎదో ఘాటైన వాసన అనిపించింది..స్పృహ కోల్పోయాను.
నా స్నేహితురాలు..ఎదో చప్పుడువినిపించి లేచిందిట, నేను పక్కన లేకపోవడంతో, మొబైల్ లైట్ వేసుకొని స్టోర్ వైపు వచ్చింది ..నా తలమీద బండరాయి వెయ్యటానాకి ప్రయత్నిస్తున్న సందీప్ అతని ఫ్రెండ్స్ రాయిని పక్కన పారేసి పారిపోయారట.
ఆ తరువాత చాలసేపటికి నాకు మెలుకువ వచ్చింది,కళ్ళు తెరిచాను...ఒళ్ళంతా పచ్చి పుండులా సలుపుతుంది..
అన్ని గాయాలే అక్కడక్కడ రక్తస్రావం అవుతుంది...గట్టిగా అరిచాను..
అమ్మ నా పక్కన ఏడుస్తూ కూర్చుంది.
నాన్ దూరంగా నిలబడి ఎడుస్తున్నాడు.
పోలీసులు వచ్చి నా స్టేట్మెంట్ రికార్డు చేసుసుకున్నారు అని ముగించింది.
ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా అని జడ్జి గారు అడిగారు.
తల అడ్డంగా వూపుతూ పావని ఇంకా ఏమిలేదనిలేదని చెప్పిoది.
ఎని క్రాస్ ఎక్సమినేషన్ అంటూ డిఫెన్సె లాయర్ను అడిగాడు జడ్జి.
ఎస్...యువరానర్ అంటూ పావని నిలుచున్న బోను దాగ్గరికి వచ్చాడు లాయర్
పావని...ఆరాత్రి ఆ చీకటిలో సందీప్ ను నువ్వు చూడలేదు కేవలం అనుమానిస్తున్నావు నిజమేనా,?
లేదు వచ్చింది ముమ్మాటికీ సoదీపే..గట్టిగా చెప్పింది పావని.
సరే ఆ రాత్రి మోబైల్ లైట్ లో చూసిన నీ స్నేహితురాలు ముగ్గురు వ్యక్తులను పారిపోతుంటే చూసాను..వారంతా మంకి క్యాపూలు పెట్టుకున్నారు గుర్తు పట్టలేను అని తన స్టేట్మెంట్ లో చెప్పింది కదా..అన్నాడు.
నాకు తెలియదు.. కానీ నేను చెప్పేది నిజం అంది పావని.
సరే మరి మిగిలిన ఇద్దరిని గుర్తుపట్టలేనన్నావు కదా.. నిజమేనా?
అవును..
ఎందుకు?
చీకటిలో వారు కనపడలేదు
దట్స్ గుడ్...మరి సందీప్ ఆ చీకటిలో ఎలా కనపడ్డాడు.
పావని మాట్లాడలేదు,ఉక్రోశంగా లాయర్ వైపు చూసింది.
దట్ సాల్ యవరానర్ అంటూ ముగించాడు లాయర్.
కేసు వాయిదా పడింది.
అంతా...బైటికి వెళ్లిపోయారు..
తన చాంబర్ లో కూర్చొని లాయర్ కను బొమ్మలు ఎగరేస్తూ
దొరికి పోయింది..కేస్ క్లోస్ అంటూ
గర్వాంగా సందీప్ వైపు చూసాడు.
సందీప్...సంతోషంగా థాంక్ యు సార్ అంటూ లాయర్ చేయ్యి పట్టుకున్నాడు.
కానీ నేను చెప్పిన పని చేసారా ఆరోజు రాత్రి నీకు ఆక్సిడెంట్ అయినట్లు..సూర్యాపేట స్టేషన్లో కేసునమోదైనట్లు అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సర్టిఫికె ,FIR తీసుకోమన్నాను ఏమైందిఅన్నాడు లాయర్.
అన్ని రెడీగా ఉన్నాయంటూ మంత్రిగారి PA లాయర్ కు ఆ పేపర్స్ అందించాడు.
ఇ లా ఒక అబలకు జరిగిన అన్యాయం...
లాయర్ తెలివితేటల వలన,
డాక్టర్ తప్పుడు రిపోర్ట్ వలన,
అధికార దుర్వినియోగం వలన,
లాంచగొండి తనం వలన,
సాక్షులను బెదిరించడం వలన
న్యాయం కోసం పోరాడే ఓ అబలను బ్రతికుండగానే చిత్రవధ చేసి మానసికంగా చంపదానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
కోర్టులో వాదనలన్ని పూర్తి అయ్యాయి ఒక నిజాన్ని సమాధిచేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తలో చెయ్యి వేసి పూర్తి చేశారు.
ఆరోజే జడ్జి గారు తీర్పు చెప్ప పోతున్నారు.
అంత ఉత్కంఠత ఏమి లేదు..
నేరం చేసిన వాళ్ళు తప్పక గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.
అన్యాయమైన వారికి మాత్రం ఎక్కడో చిన్న ఆశ
న్యాయం మీద, దేవుడిమీద ఉన్న నమ్మకం.
మంత్రి గారు కూడా ఆరోజు కోర్టులో దర్జాగా కూర్చొని ఉన్నాడు..న్యాయాన్ని కొని, అన్యాయాన్ని గెలిపించ బోతున్నాననే విజయ గర్వంతో.
జడ్జి గారు సీరియస్ గా ఎదో రాస్తున్నాడు.
కోర్టు ఆవరణలో ఎదో కలకలం రేగింది..
బంట్రోతు..జడ్జిగారి చెవిలో పావని వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మ హత్యా ప్రయత్నం చేశారని చెప్పాడు.
జడ్జి గారు ఒక్క క్షణం ఆగి మళ్ళీ రాయడం మొదలు పెట్టారు..తన పనిని పూర్తి చేసి..ఒక నిట్టూర్పు విడిచి.
తీర్పును చదవటం ప్రారంభించారు...
వివరాలన్నీ చదివి.....
తగిన సాక్షాధారాలు లేనందున ఈ కోర్టు సందీప్ ను నిర్దోషి గా ప్రకటిస్తూ విడుదల చేస్తుంది అని ముగించాడు.
కోర్టులో ధర్మ దేవత బలవంతంగా కళ్ళుమూసుకున్నట్లు....
గోడమీద గాంధీ గారు తీర్పును చూసి నవ్వుతున్నట్లనిపించింది....
ఒక్క నిముషం అన్నాడు జడ్జిగారు...
సందీప్ లాయర్ ను..సందీప్ ను,మంత్రిగారిని,సబ్ ఇన్స్పెక్టర్ ను
తన ముందుకు వచ్చి నిలబడమని ఆదేశించాడు..
అందరూ జడ్జి గారి ఆదేశాన్ని పాటిస్తూ
వరుసగా నిలుచున్నారూ..
అంతే....
ఢాం. ఢాం.. ఢాం.. ఢాం....అంటూ..
జడ్జి గారి దగ్గరున్న రివాల్వర్ నిప్పులు కక్కుతూ వదిలిన బుల్లెట్లు నలుగురిని కుప్ప కూల్చాయి.
వెంటనే తనను తాను కూడా కాల్చుకొని జడ్జి తన స్థానంలో ఒరిగి పోయాడు..ప్రశాంత వదనంతో..
అంతా క్షణాలలో జరిగి పోయింది..అంతా గందరగోళం..
బ్రేకింగ్ న్యూస్...
మై లాస్ట్ జడ్జిమెంట్..అంటూ జడ్జి గారు రాసిన పావని కేస్ జడ్జిమెంట్ సంచలనం సృష్టిస్తోంది.
చట్టప్రకారం వారు నిర్దోషులు..చట్టం వారిని ఏమి చేయలేదు.
నేను చాలా కేసులు చూసాను ఎన్నోసార్లు నిజం అని తెలిసినా తగిన సాక్షాధారాలు లేనందున ఆత్మసాక్షికి వ్యతిరేకంగా తీర్పులిచ్చాను, అది నా వృత్తి ధర్మo.
కానీ నేను ఓ ఆడపిల్ల తండ్రినే..ఎంతో వేదనతో అవమానంతో..అన్యాయానికి గురియైయిన
ఓ ఆడకూతురు..జీవితాన్ని తమ అధికార బలంతో,డబ్బు మదంతో అన్యాయం చేస్తుంటే భరించలేకపోయాను.కేసు నడుస్తున్నన్ని రోజులు సందీప్ లాంటి కామాంధుని పొగరు..పశ్చాత్తాపం లేని అతని ప్రవర్తనను చూసాను,ఎంతో ధైర్యంగా న్యాయవ్యవస్థపై అపారమైన విశ్వాసం చూపుతున్న, అమాయకురాలైన పావనిని చూసాను.కొడుకును మందలించకుండా వాడితప్పును సమర్ధించే రాక్షసుడిలాంటి తండ్రిని చూసాను,చివరకు వాళ్ళెంతకు తెగించారంటే
నన్ను కూడా వాళ్ళ డబ్బుతో కొనాలని చూసారు, వినలేదని, నాకు కుటుంబముందని జాగ్రత్త అని హేచ్చరించారా దుర్మార్గులు.
వీళ్ళను ఇలాగే వదిలేస్తే.. ఇంకెన్ని అ గాయిత్యాలైన చేస్తారు..అప్పుడప్పుడైన ధర్మం బ్రతికి తీరాలి..అందుకే నా ఆత్మ సాక్షిగా నా ఈ అంతిమ తీర్పు ఇచ్చాను.వాళ్లకు ఇదే సరిఅయిన శిక్ష అని నేను త్రికరణ శుద్దిగా భావిస్తున్నాను.
కానీ నా శిక్ష నుండి ఒక్క డాక్టర్ తప్పించుకున్నాడు
అందుకే ఒక బుల్లెట్ ఇంకా మిగిలి పోయింది.
నా ఈ అంతిమ తీర్పు.. నాకెంతో ఆనందాన్నిచ్చింది..చాలా ప్రశాంతగా ఉంది.
జై హింద్..
కొసమెరుపు...ఇక్కడ శిక్షను తప్పించుకున్న డాక్టర్ పాపికొండల పడవ మునకలో ప్రాణాలు కోల్పోయాడు.
..........సమాప్తం......
కామెంట్ చేస్తే సంతోషిస్తాను...రంగనాధ్