broken angel Keerthi

Drama Romance Action

4.6  

broken angel Keerthi

Drama Romance Action

అమృత సాగరం పార్ట్ 6

అమృత సాగరం పార్ట్ 6

4 mins
325



ఏమిటి నన్ను చూడగానే అందరూ సైలెంట్ అయిపోయారు అని అంటూ...చైర్ లో కూర్చుంది అమృత....

ఎం లేదు అమృత డార్లింగ్ ...సాగర్ కి ఒక మంచి సంబంధం చూస్తున్నాం....ఇందాక వచ్చిన పిల్ల మాకు అస్సలు నచ్చలేదు....రూపం ఒక్కటి బాగుంటే చాలా...అని చెడ మడ తిట్టేసం సాగర్ నీ...మీరే ఒక మంచి సంబంధం చూడండి అన్నాడు..అందుకే వెతికే పనిలో పడ్డం....


త్రిపుర తో పెళ్ళి క్యన్సెల్ అని అనగానే లోపల మనసు గంతులు వేసిన వెను వెంటనే మంచి సంబంధం చూస్తున్నాం అని చెప్పిన మాట విని మళ్ళీ మనసులో చివుక్కు మంది అమృత కి...


అందరూ...నాకు తెలిసిన అమ్మాయి అక్కడ వుంది ...ఇక్కడ వుంది ...ఇలాంటి అమ్మాయి ఇంకా ఎక్కడ వుండదు అంత మంచిది అని, ఏవేవో మాట్లాడుతున్నారు...అందరి మాటలూ వింటూ ఉంటే అమృత కి ఇంకా పిచ్చి లేస్తున్నాయి అవి....


అయిన అసలు సాగర్ కి నేను అంటే ఇంకా ఇష్టం వుందా ..అతని చూపులు చూస్తూ వుంటే వున్నట్టే అనిపిస్తుంది కానీ మాటలు ఎం చెప్పడంలేదు ఎలా తెలుసు కునేది...పోనీ నేను ఎం అయిన చెప్తా అని ఎదురు చూస్తున్నాడ...ఎం చేయాలి అస్సలు అర్థం కావడం లేదు...


పోనీ నేనే చెపితే ....

అప్పుడు నీపై ఎం ఉద్దేశం లేదు అని చెప్పి ఇప్పుడు నువ్వు అంటే ప్రేమ అని అంటే ఎం అనుకుంటాడో... అందరూ తన కోసం పెళ్లి సంబంధం చూస్తూ వుంటే నేను జలసి గా ఫీల్ అయ్యి చెప్పా అని అనుకుంటాడో... అప్పుడు తన దగ్గర డబ్బు ,హోదా లేవు కాబట్టి తన ప్రేమను ఒప్పుకోలేదు ఇప్పుడు అవి చూసి చెప్పాను అని అనుకుంటాడు ఏమో...

కానీ తనకి తను అంటే నాకు ఎంత ప్రేమని చెపితే అర్ధం చేసుకుంటాడు కావచ్చు...తననీ నేను ఎంత మిస్స్ అయ్యింది...తన కోసం ఎంత తాపత్రయ పడింది చెపితే తను తప్పక అర్ధం చేసుకుంటాడు ...సాగర్ మంచివాడు...

కానీ రేపు ఎం అయిన గొడవ వస్తె...నువ్వే మళ్ళీ నేను కావాలి అని వచ్చి పెళ్లి చేసుకున్న వుగా అని అయితే అనడు గా...ఆలోచిస్తూ ఉంటే బుర్ర వేడెక్కి పోతుంది...అమృత కి

అమృత ఓ...మేడం అనే మధు పిలుపు విని మళ్ళీ లోకం లోకి వచ్చింది...

ఎం ఆలోచిస్తున్నావు...మేము అందరం పెళ్లి సంబంధాలు వెతుకుతూ వుంటే...నువ్వు ఎం చెప్పవూ...

అదే ఆలోచిస్తున్న...ఒక అమ్మాయి వుంది...

సాగర్ కోరుకున్న జవాబు కాక మరో వేరే జవాబు వచ్చేలా ఉంది అని సాగర్ లోపల టెంక్షను పడతాడు....ఇక తను చెప్పేలా లేదు...నేనే మరో సారి నా ప్రేమ విషయం చెపితే అయిపోతుంది..అసలు తన మనసులో ఎం వున్నది తెలిసి పోతుంది కదా...ఎందుకు ఈ దాగుడు మూతలు...అని సాగర్ అమృత ముందుకి నడుస్తూ వెళ్ళడానికి చైర్ నుండి లేచి మెళ్ళి మెల్లి గా వెళ్తాడు...


అమృత చెప్పడం మొదలు పెట్టింది...అమ్మాయి పెద్ద అందగత్తె కాదు...మాములుగా నే వుంటుంది...చదువులో పర్లేదు బాగానే చదివింది...త్వరలో నే మంచి ఉద్యోగం రాబోతుంది...మధ్యతరగతి కుటుంబం....అస్తీ పాస్తులు ఎక్కొవ లేవు కానీ సాగర్ నీ తన మనసుని అర్ధం చేసుకోగల మంచి అమ్మాయి..ఆ...


అమృత మాట పూర్తి కాక ముందే సాగర్ ..కిందికి తల వంచి మాట్లాడుతున్న అమృత ముందుకి వచ్చి ...నిల్చున్నాడు...


కిందికి చూస్తూ వున్న అమృత సాగర్ తన దగ్గరికి రావడం గమనించి తల పైకి లేపి చూస్తుంది...

సాగర్ పక్కనే వున్న చైర్ నీ లాగి అమృత ఎదురుగా కూర్చొని...తన చేతులు పట్టుకున్నాడు...

ఒక్క సారి గా అందరూ షాక్ అయ్యారు...అమృత కూడా హడలి పోయింది...వెనక్కి అయ్యి తన చేతులు వెనక్కి లాగెయ్యబోయింది....

సాగర్ అగు అన్నట్లు అమృత కళ్ళల్లోకి చూస్తూ.... ఐ లవ్ యూ అమృత....అని చెప్తాడు...


అమృత సాగర్ కనుల లోకి నేరుగా చూసింది అందులో అంతా ఎదో మాయగా అనిపించింది అమృత కి...

సాగర్ ముందు అమృత చెయ్యి వదులు ఎవరయినా చూస్తే ఏమనుకుంటారు అని కూడా ఆలోచించవ....

కాసేపు ఆగండి అంటిలు....

ఏమిటి అని అందరూ మళ్ళీ ఒక్క సారి గా అన్నారు...

సారీ సారీ.... చెల్లెల్లు.

..ఆగండి నా బంగారు తల్లులు....

హా....అల రా దారికి అని మళ్ళీ ఒకే సారి అని....సైలెంట్ గా వుంటారు....

అమృత సైలెంట్ గా చూస్తోంది...

ఇక ఇలా అయితే సమాధానం చెప్పేలా లేదు అని....అమృత ....అని తన చేతుల వంక చూస్తూ...ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో...

అవునా...మరి కాళ్ళని ఎం అనుకోవాలి ...చేతుల అని వెనుక నుంచి వెటకారం గా అంది స్నేహ..

సాగర్ కోపంగా చూసినట్టే చూసి

..మళ్ళీ అభ్యర్థన గా చూస్తాడు...

ఆ చూపుకి...సరేలే కానియీ కానియి అని అంటుంది స్నేహ...

అమృత కి నవ్వు వచ్చిన రానట్టు వుంటుంది...నవ్వుని ఆపుతు...

అది గమనించి ...అమృత నువ్వు నవ్వుతున్నావ్ కదా...నిజం చెప్పు నికు నేను ఇష్టమే కానీ నేను ఎం అనుకుంటా అనో ఎలా చెప్పాలి అనో ఆలోచిస్తున్నావు కదా....


అమృత నవ్వుతూ లేదు...అని అంటుంది..


అవును ..నేను అంటే నికు ఇష్టం నాకు తెలుసు అది నీ కళ్ళలో కనిపిస్తుంది....అని తన కళ్ళలో ఎదో సమాధానం వెతుకుతూ అంటాడు...

లేదన్నగ నమ్మవా....


వుంది లేదంటే నేను నీ చెయ్యి పట్టుకున్న అప్పుడే నువ్వు లాగి కొట్టే దానివి...కానీ నేను నీ చెయ్యి కాసేపు పట్టుకొని వదిలేసాను తరువాత నికే తెలియకుండా నువ్వే నా చెయ్యి పట్టుకుని వున్నావు...కావాలంటే చూడు అని తన చూపులు కిందికి చూపాడు...అమృత కిందికి చూసి తన చెయ్యి వెంటనే వెనక్కి లాక్కుంది...

సిగ్గుతో కిందికి మొహం వేసి..ముందుకు జారిన తన కురులని చెవి వెనక్కి సర్దుతూ....సాగర్ వంక చూస్తుంది...

హా....అని ఒక్క సారి ఎదో తాకినట్టుగా వెనక్కి అవుతాడు..

ఎం అయింది అన్నట్లు అమృత గాబరా గా ముందుకు కదిలింది....

తనని తాను అదుపు చేస్తూ...నీ చూపు చాలు... నా పై నికు వున్న ప్రేమ నీ బాణం ల గుచ్చి మరి చూపిస్తుంది...

అమృత అమాంతంగా సాగర్ నీ హత్తుకుంటుంది...

అమృత హత్తుకోవడం తో సాగర్ కి కల నిజమా అని అర్థం కాలేదు...అమృత బుజాల పై చేతులు వేసి కొంచం ముందుకు జరిపి....ఇది నిజమేనా... కలనా...

అమృత సాగర్ వైపు ఓరగా చూస్తూ లాగి చెంప మీద కొట్టి మళ్ళీ గట్టిగా హగ్ చేసుకుంటుంది...నవ్వుతూ...


వామ్మో ...నిజమే అని సాగర్ ఆనందం తో అమృత నీ హగ్ చేసుకుంటాడు....


హాల్లో ఎక్స్ కూస్ మి...అని వెటకారం గా అంటుంది మధు...


ఇద్దరు మళ్ళీ మాములుగా కూర్చుంటారు...


సో...పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకు వి అయ్యి వెళ్తున్నవు అన్నమాట...

హ్...అని కాస్త నవ్వుతూనే చెల్లుమని అన్న చెంప నీ రుద్దుకుంటూ అంటాడు...


మధు సాగర్ దగ్గరికి వచ్చి తన చెంప నీ పక్కకి మళ్లించి...అయ్యో....బుగ్గ బాగానే కందిపోయింది అని అంటుంది...అమృత వంక చూస్తూ...

కల నిజమా అని అడిగితే మాత్రం అంత గట్టిగా కొట్టల...అమృత అని సాగర్ చెంప నీ చూస్తూ అంటుంది స్నేహ...


నేను కొట్టింది అందుకు కాదు....


మరెందుకు...


నాకు ప్రపోజ్ చేసినప్పుడు కాదు అన్నాను కానీ మరుసటి రోజు నుంచి అన్ని తన ఆలోచనలే...నా లో అప్పటి వరకు లేని ఒక కొత్త అనుభూతిని పుట్టించి కంటికి కనిపించకుండా మయం అయిపోయాడు....నాకు తనపై వున్న ఇష్టం ప్రేమ అని నేను తెలుసు కొనే లోపు కనిపించకుండా వెళ్లిపోయి...ఇప్పుడా వచ్చేది అని కోపం వచ్చింది అందుకే కొట్టాను అని సమాధానం చెప్పింది...


అమ్మ ... పొట్టిధాన లోపల ఇంత పెట్టుకొని బయటకి మాత్రం ఎం లేదు అన్నట్లు ఎం నటించవే అని అంటాడు సాగర్....


ఓయ్...అని అంటుంది అమృత...

ఓయ్ ఎంటి....ఓయ్...

మరేంటి ఓయ్...పొట్టి అంటున్నావు...

అంగుళం పొట్టిగా ఉన్నా పొట్టే అంటారు రా పోట్టోడా...అని అంటాడు సాగర్ నవ్వుతూ...

అబ్బా...సినిమా డైలాగ్ లా...అని నడుము మీద రెండు చేతులు వేసుకొని అంటుంది అమృత ....

అప్పుడప్పుడు మీకోసం వాడల్సిందే గా...


అంటే....

అంటే బంగారం .....కళ్ళలో ప్రేమ కనిపించింది...మనసులో మాట వినిపించింది అని అన్నమాట...

అంటే ఇంతక ముందు నువ్వు నాతో చెప్పినవి....

అంతేగా అని మళ్ళీ నాలిక కరుచుకొని ...నేను అందరి గురించి చెప్పాను ...నా గురించి కాదు అని అంటాడు...

హా...అవునా....అంటూ సాగర్ చేతిని వెనక్కి మెలి వేస్తుంది అమృత ....

అమ్మ...అంటూ కేక వేస్తాడు సాగర్...నీకంటే ఆ త్రిపుర నే నయం మాటలే గుచ్చుకుంటాయి...నువ్వు ఏకంగా చంపేసెల వున్నావు...


వీళ్ళ మాటలు వింటూ స్నేహితులు అంత నవ్వుతున్నారు...


అమృత సాగర్ ల...అసలు ప్రేమ కథ ఇప్పుడు మొదలు అయ్యింది...



...........సమాప్తం........















.




Rate this content
Log in

Similar telugu story from Drama