broken angel Keerthi

Drama Tragedy Others

4  

broken angel Keerthi

Drama Tragedy Others

అమృత సాగరం పార్ట్ 5

అమృత సాగరం పార్ట్ 5

4 mins
298


హాయ్ త్రిపుర నేను చెప్పింది ఈ అబ్బాయి గురించే....


హొ...హాయ్...పర్లేదు నా లవర్ అంటే ఆ మాత్రం వుండాలి లే అని సాగర్ నీ కింది నుంచి పైకి చూస్తూ అంటుంది..త్రిపుర .. అంతా ఒకే కానీ నువ్వు కొంచం ఎక్కువ చేసినట్టు లేదు...అని సాగర్ నీ అంటుంది...


నేనా...నేను ఎం చేసాను...


నేనే నిన్ను లవ్ చేసి నీ వెంట పడ్డాను అని....


హొ... అదా...ఏదో అలా అని అంటూ కాస్త సిగ్గు తో మెలికలు తిరుగుతూ చిరునవ్వు నవ్వుతూ అంటాడు....సాగర్...


అబ్బా...సిగ్గే...


ఎదో కొద్దిగా...


అసహ్యం గా వుంది...నవ్వుతూ వుంటే....అని అంటుంది త్రిపుర....


త్రిపుర నీ అపుతు....ఎం అనుకోకు సాగర్ దానికి ముక్కు సూటి తనం ఎక్కోవా....


సాగర్ కి త్రిపుర మాట్లాడిన పద్దతి కి చిర్రెత్తకొచ్చింది కానీ ఎం చేస్తాం...అవసరం మనది అని లోపల సర్ధి చెప్పుకొని...పర్లేదు మధు....అని అమృత వైపు వెళ్దామా అని అన్నట్లు....చేయి ముందుకు చాపి కాస్త వంగి చూపిస్తాడు....పదండి అని అంటూ....త్రిపుర ఆ చేతిని నెట్టేసి తన జెడ నీ వెనక్కి వేసుకొని వెళ్తుంది....

అబ్బో దీనికి పొగరు అందం తో పాటు సమానం గా వున్నట్లు వుంది అని తనపై తనకు జాలి వేసింది సాగర్ కి పెనం పై నుంచి మంట లో పడిన రొట్ట ల వుంది తన పరిస్థితి అని మనసులో అనుకుంటూ త్రిపుర వెంట వెళ్ళాడు....


అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు....త్రిపుర రాగానే నువ్వు సాగర్ కి కాబోయే భార్య వి కదూ ...సాగర్ నీ గురించి ఇందాకే చెప్పాడు రా..కూర్చో అని స్నేహ చైర్ నీ లాగి తన ముందు కి వేస్తుంది కానీ స్నేహ సరిగ్గా చూడలేదు దానిపై కూర్చొని ఎవరో అన్నం తిన్నారు కావచ్చు...చైర్ నీట్ గా లేదు...


త్రిపుర దీనిపై నేను కుర్చోవలా...హ్మ్మ్....అని పొగరుగా అంటుంది....


అయ్యో స్వారీ నేను చూడలేదు....


హ్మ్మ్... అది వెయ్యక ముందు చెయ్యవలసిన పని... బ్లేడి ఇడియట్స్ అని చిన్నగా అంటూ మొహం తిప్పుకుంది...


ఆ మాట అర్ధం అయ్యి కానట్టు అనిపించింది స్నేహ కి...కానీ తను ఎదో అంది అని మాత్రం అర్ధం అయ్యింది...


స్నేహ కి కోపం టన్నుల కొద్దీ వచ్చింది...


అమృత స్నేహ కి వచ్చిన కోపం నీ గమనించి ....స్నేహ చెయ్యి పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తుంది....కను సైగ లతో నే వారిస్తుంది...లేదు నన్ను అపవద్దు అని అన్నట్లు స్నేహ చూస్తుంది...వద్దు అన్నగా అని అన్నట్లు అమృత చూస్తుంది...సరేలే అన్నట్లు స్నేహ తననీ తాను కంట్రోల్ చేసుకుంటుంది....

అమృత తను కూర్చునీ వున్న కుర్చీ నీ కూర్చో త్రిపుర అని తన ముందు వేసి పక్కన ఒక టిషూ పేపర్ వుంటే ఆ చైర్ కాస్త క్లీన్ చేసుకొని కూర్చుంది...

థాంక్స్ అని త్రిపుర చైర్ లో కూర్చుని చెప్తుంది..


పర్లేదు త్రిపుర...


అవును సాగర్ నికు ఎలా పరిచయం..తననీ నువ్వు ఎప్పుడు చూసావు ...తను ఎందుకు నచ్చాడు...నీకు అని ప్రశ్నల వర్షం కురిపించింది స్నేహ...


వెయిట్ వెయిట్..ఏమిటి జస్ట్ మాట్లాడుతారు పరిచయం చేద్ధం అని తీసుకువస్తే ఇన్ని ప్రశ్నలు....


మా...ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మి కాబోయే భార్య ఎం అరిగిపోధు లే.....అని స్నేహ అంటుంది...


సాగర్ సైలెంట్ అయిపోతాడు... అరిగి పోతుంది అనో కరిగిపోతుంది అనో కాదు నా బాధ ...ఎక్కడ నిజం బయటపడుతుంది అని లోపల టేంక్షన్ పడుతూ మధు వైపు చూస్తాడు....మధు కూడా భయపడటం తన మొహం లో కొట్టచ్చినట్టు కనిపిస్తుంది...హ్మ్మ్.... ఇక నా పని గోవిందా. ...గోవిందా అని లోపల అనుకుంటాడు...



వుండు సాగర్...వాళ్ళు అడిగినవీ ఎం అయిన ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వచన్ సా ...అని సాగర్ వైపు చూస్తూ అంటుంది...


హ్మ్మ్...ఇదేంటి ఇలా అంటుంది...ఇప్పుడు ఎం చెప్తుంది అని లోపల అలోచిస్తు...బయటకి ఒక లేనినవ్వుని విసురుతాడు...


నేను ఒక మోడల్ నీ కదా...ఒక బట్టల షాప్ వాళ్ళునన్ను వాళ్ళ బట్టల షాప్ కి అడ్వర్టైజ్ మెంట్ చెయ్యమని అన్నారు .. మనల్ని అడగటానికి వచ్చిన వారిని కాదు అంటే ఎలా...అందుకే ఒకే అన్నా....


మీరు ఎలా కలిశారు అంటే.. ఎదో చెప్తున్నవు ఏమిటి...

ఆ షాప్ వానర్ మా...సాగర్ ఆ...


నో.... ఫొటోస్ దిగడానికి ఫోటో గ్రాఫర్ కవాలిగా ... వాళ్ళ షాప్ బట్టలు నేను వేసుకొని మోడలింగ్ చేస్తే సాగర్ నన్ను ఫోటో లు తీసాడు...


ఓ...తను తీసే ఫోటో లో నువ్వు క్లిక్ అయ్యావు..నీ కళ్ళలో సాగర్ క్లిక్ అయ్యాడు అన్నమాట....అంటూ అందరూ నవ్వుతారు...అమృత మాత్రం సైలెంట్ గా పక్కకి చూస్తూ వుంటుంది....


వాళ్ళ నవ్వు విని త్రిపుర కి చాలా కోపం వచ్చింది...సాగర్ నేను వెళ్తున్న అని అంటూ చైర్ నుంచి లేచింది త్రిపుర ...


అయ్యో...మేము జోక్ చేశాం ఆ మాత్రం దానికే ఇంత ఫీల్ అయితే ఎలా....


నాకు మిలా సిల్లీ జోక్స్ కి నవ్వటం రాదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది....


సాగర్..కూడా త్రిపుర వెంట నే త్రిపుర త్రిపుర అంటూ వెళతాడు...తన పిలుపు కి స్పందించకుండా అలానే వెళ్ళిపోతుంది త్రిపుర..



త్రిపుర ఆగు...ఆగు....


వాట్...


ఎం లేదు అల వెళ్లిపోతున్నా వు ఏమిటి.


మరి...ఎం చేయాలి..వాళ్ళు అనే మాటలు అన్నీ వింటూ వుండాలా...మా మమ్మీ ఏ నన్ను ఎం అనదు...నికు హెల్ప్ చేద్దాం అని వస్తె...వాళ్ళు నన్ను ఇన్సెల్ట్ చేస్తారా... బ్లెడి ఇడియట్స్ .....అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది...


వెయిట్ .... సారి చెప్తున్న గా వాళ్ళ అందరి తరుపున...


సారీ లేదు పూరీ లేదు...నువ్వు ఎం అయిన చేసుకో...నికు నచ్చింది చేసుకో...గుడ్ బాయ్...అని త్రిపుర కోపంగా తన స్కూటీ పై వెళ్ళిపోతుంది....


తను వెల్లెంత వరకు... అల అనకు అంటూ బ్రతిమిలాడినా సాగర్....హమ్మయ మొత్తానికి పీడ విరగడ అయ్యింది అని వెళ్ళగానే అంటాడు...అయిన ఈ అబద్ధాలతో పెట్టుకోవద్దు ..దెబ్బ తగిలితే మందు రాస్తే తగ్గుతుంది కానీ

..అబద్ధం చెపితే మాత్రం ఒక్క అబద్ధం కోసం వంద అబద్ధాలు అడవలసి వస్తుంది...హ్..అని పెద్ద శ్వాస తీసుకొని ...నా అమృత నీ కాక పట్టడానికి ఇక వేరే ఏదయినా మార్గం చూడాలి అంటూ మళ్ళీ వల్ల దగ్గరికి వెళ్ళాడు సాగర్...


అందరూ ఇంకా అక్కడే కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు... వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైర్ జరుపుకొని కూర్చున్నాడు...అక్కడ అమృత లేదు...చుట్టూ చూస్తున్నాడు..ఎక్కడ కనిపించలేదు...


ఎం అయింది దిక్కులు అల చూస్తున్నావు...


అహ..ఎం లేదు కానీ మీరు త్రిపుర తో అల ఎందుకు మాట్లాడరు...


నువ్వు ఎం అనుకున్న పరవాలేదు సాగర్...కానీ నీ మంచి కోరుకొనే స్నేహితులుగా చెప్తున్నాం ..నా మాట విను ఆ..అమ్మాయి నీకు మంచిది కాదు...అస్సలు సెట్ కాలేదు..


అవును సాగర్...నీ గురించి మాకు తెలుసు ...నీ లాంటి మంచి వాడికి అలాంటి అమ్మాయి మాకు ఇష్టం లేదు...అని అందరూ అన్నారు....


సరే... మరి ఎలాంటి అమ్మాయి నీ చేసుకుంటే బాగుంటుంది....మీరే ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టండి...


మేమా..


హ్మ్మ్..మీరే....


అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వుంటారు...


మధు కల్పించుకొని ...మన అమృత లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది కదా....


అందరూ మధు వైపు చూస్తారు....అంటే అలాంటి అమ్మాయి అని చెప్తున్న....


అందరూ మళ్ళీ సాగర్ వైపు చూస్తారు....


నాకు ఒకే అని నవ్వుతూ అంటాడు....


ఎంటి ఒకే ....నిజం చెప్పు సాగర్..నువ్వు అమృత నీ ఇంకా ప్రేమిస్తున్నా వు కదా...


హుమ్మ్...ఇంకా మీ దగ్గర దాయడం దేనికి...అవును అక్కయిలు...అమృత అంటే ఇంకా నాకు లవ్వే....కానీ తన మనస్సులో ఎం వుంది అని తెలియదు...ఎదో మూల...తనకి కూడా నేను ఇష్టం అని అనిపిస్తుంది...


హ్మ్మ్....లోపల ఇంత వుండీ బయటకి ఎం లేదు అన్నట్లు ఎలా ఉన్నడో చూడండి....అని సాగర్ వైపు నవ్వుతూ చూస్తున్నారు...అమృత రావడం గమనించి....

సరే...మీ ప్రేమ బాధ కి పరిష్కారం మేము చెప్తాం...నువ్వు కేవలం మేము అన్న వాటికి అవును అను అంతే...


సరే అక్కలు....ఆశీర్వదించి కానివ్వండి అక్కలు...


తధాస్తు....


అమృత రావడం చూసి అందరూ సైలెంట్ అయ్యారు...

అసలు వారికి ఎం తెలియదు అని అన్నట్లు గా వుండి పోయారు....








..




Rate this content
Log in

Similar telugu story from Drama