Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

broken angel Keerthi

Drama Tragedy Others


4  

broken angel Keerthi

Drama Tragedy Others


అమృత సాగరం పార్ట్ 3

అమృత సాగరం పార్ట్ 3

7 mins 365 7 mins 365

ఏం లేదు అమృత...


మాతో కూడా చెప్పకూడదని అనుకుంటున్నావా...


అయ్యో...అల ఎం లేదు..


మరి అయితే చెప్పు...


ఎం లేదు అంతే ఎందుకు వినడం లేదు...


చెప్పే వరకు వదలము ..


ఎం లేదే...నేను పెట్టాలని అనుకున్న బిజినెస్ కి డబ్బులు కావలిగా...నాన్న నీ అడిగా....నా పెళ్లి కోసం దాచిన డబ్బు నుంచి అయిదు లక్షలు ఇచ్చారు...ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం వృధా కానివద్దు అని చాలా ఆశ పడ్డాను...నాన్న ఇచ్చిన డబ్బు తో బిజినెస్ స్టార్ట్ చేసాను....నేను అనుకున్న దానికంటే మంచి గుర్తింపు వచ్చింది...పక్కనే ఉన్న ఊరు ల నుంచి కూడా జనాలు వచ్చి కొనుగోళ్ళు చేసేవారు ..ఇంకా కొందరు కాస్త ఎక్కువ మొత్తం లో కొని వాళ్ళ ఇంటి దగ్గర్లో అమ్ముకొనే వారు....పేరు డబ్బు రెండు వచ్చాయి....నాన్న కి నాకు ఇచ్చిన పెట్టుబడి కి అయిదు రెట్లు అధికంగా బహుమతి గా అందించా...సంబర పడిపోయారు..కూతురు కొడుకు అయ్యింది అని అందరితో చెప్పుకున్నారు...


కానీ కాలం నాకు విషాదం మిగిల్చింది....ఆడదానికి ఆడది శత్రువు అని ఊరికే అనలేదు ....నాకంటే ముందు నుంచి వ్యాపారం చేస్తున్న మాలతి అనే అమ్మాయి...తనకంటే నాకు ఎక్కువ పేరు డబ్బులు వస్తున్నాయి అని కోపంగా ఒక రోజు నా దగ్గరికి వచ్చి...నన్ను బెదిరించింది ...


తన మాటలు నేను పట్టించుకోలేదు..తను రాజకీయం గా పరపతి వున్న అమ్మాయి...నన్నూ అమ్మాయిలను పడుపు వృత్తిలోకి దింపుతున్న అనే అభండం మోపి...జైలు కి పంపింది....నాన్న నీ అమాయకుడు నీ చేసి డబ్బు మొత్తం లాగేసారు...చివరికి ఇల్లు కూడా అమ్మేశాడు...నన్ను బయటకి రప్పించడానికి....నన్ను బయటకు తీసుకొని వచ్చిన రాత్రి ..నాన్న ఫ్యాన్ కి వురి వేసుకొని చనిపోయారు...కారణం నన్ను ఇక ఎవరు పెళ్లి చేసుకోరు అని ...నన్ను అల చూస్తూ బ్రతకలేను అని...అందరూ తన పెంపకాన్ని చూసి హేళన చేస్తున్నారు అని...లోకం గురించి అలోచించి నన్ను ఈ పాడు లోకం లో ఒంటరి నీ చేసి సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయాడు...అని కంటి నిండా నీళ్లు తెచ్చుకుంది...


తను చెప్పేది వింటు వున్న స్నేహితులు అంతా తన చుట్టూ చేరారు ...నువ్వు బాధా పడకు మేము నికు తోడు గా వున్నాం...అని తనని హత్తుకున్నారు...


లేని నవ్వు నీ తెచ్చుకొని.... అయినా మనం వచ్చింది పెళ్లిక లేక పోతే మన బాధలు చెప్పుకొని ఎడవడనికా...పదండి..పదండి అని నవ్వుతూ లేచింది స్నేహ...


అందరూ కూడా నవ్వు నీ తెచ్చుకొని నవ్వుతూ...పదా అని అంటారు....


ఆగండి ఆగండి...అని వెనుక నుంచి వచ్చిన పిలుపు విని..అందరూ వెనక్కి తిరిగి చూసారు....


అందరూ ఒక్క సారి గా తనను చూసి సాగర్ అని అంటారు...


ఎంటి అందరూ ఒకే సారి సాగర్...అని అన్నారు...ఏ నేను రాకూడదా...


అయ్యో అల ఎం లేదు...నువ్వు ఏమిటి ఇక్కడ అని అంటూ మధు అమృత వంక చూస్తుంది...అమృత మధు చూడటం గమనించింది ...నన్ను ఎందుకు చూస్తున్నావు అని అన్నట్లు గా తన వంక చూస్తుంది...


ఐయామ్ ఏ ఫోటో గ్రాఫర్... మేడమ్...


ఓ.......అని అందరూ గట్టిగా అంటారు...సాగదీస్తూ...


అబ్బో... అంత పెద్ద ఓ...ఎందుకు కానీ...


కానీ ఓ ఫోటో దిగుధం పట్టండి..


ముందు పెళ్లి అయితే చూద్దాం పదా...


ఇంకెక్కడ పెళ్లి...అయిపోయింది....


అందరూ ఒక్క సారి గా అవక్కు అయ్యారు...ఎప్పుడు..అని అందరూ ఒకే సారి ముక్తకంఠంతో అన్నారు....


మీరు అంతా ఒకే సారి ఎందుకు అంటున్నారు...పెళ్లి అయ్యి అద్దగంట అయ్యింది...ఆల్రెడీ అందరూ వాళ్ళ చేతిలో ఒక గిఫ్టు పెట్టీ బోజనాలు కూడా కానిస్తున్నరు...నన్ను లంచ్ చేసి రమ్మని అంటే వేరే మా వాడిని ఉంచి.....వచ్చాను...


అయ్యో .అని అందరూ ఒకే సారి అన్నారు...


హే....ఎంటి మీరు ఒకేలా అంటున్నారు... ట్విన్ సిస్టర్స్ లా...అదే...హాల్లో బ్రదర్ ల హాల్లో సిస్టర్స్ ఆ...


అందరూ చిన్నగా నవ్వి సైలెంట్ గా వుంటారు...


.మిమ్మల్ని చూస్తుంటే వింతగా ఉంది..అని నవ్వుతూ అంటాడు సాగర్...


అందరూ కొంచం కోపంగా చూస్తారు.


అంత కోపం వద్దు లెండి మాడిపోయి కర్ర కాకి నీ అయిపోత ..ముందే నెక్స్ట్ మంత్ నా ఎంగేజ్మెంట్...ఫోటోలు ఎడిట్ చెయ్యలేక చావలి మళ్ళీ...


ఓ...నీ ఎంగజే మెంట్ ఆ...ఎవరు ఆ లక్కీ గర్ల్....


అదిగో పెళ్లి కూతురు పక్కన నిలబడి ఫోటో దిగుతుంది చూడు... ఆ అమ్మాయే అని వేలు చూపిస్తూ అంటాడు...అందరూ తిరిగి చూస్తారు...


అరె హీరోయిన్ ల వుంది...చాలా బాగుంది అని అందరూ సాగర్ తో అంటూ వుంటే...అమృత కి లోపల అగ్ని గుండం పెలిపోయినట్టు కోపం వస్తుంది....మధు తన వంకే చూస్తోంది.... అది గమనించి అమృత తన కోపం నీ అణుచుకుంటూ బయటకు నవ్వుతూ చాలా బాగుంది అని అంటుంది...మధు కి అమృత మనసులో ఎలా ఫీల్ అవుతుంది అని అర్థం అయ్యింది...తను బయిట పడకుండా జాగ్రత్త పడటం చూసి నవ్వుకుంటూ...అస్సలు ఎం అయిన వుందా... సూపర్ వుంది...హీరోయిన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అన్న మాట మీరు...


హా....అవును...అవును....పదండి తింటూ మాట్లాడుకుందాం....అని అందరినీ తీసుకెళ్తాడు..అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేట్లు పట్టుకొని ఒక్కోటి నచ్చింది వేసుకుంటూ వెళ్తున్నారు...


హ్మ్మ్...అని విసుగ్గా అంది మధు....


ఎం అయిందే... అంత చిరాకుగా వున్నావు... అంది అమృత..


చీరకు లేదు ఎం లేదు...మన చిన్నప్పుడు పెళ్లి విందు ఎలా ఉండేది...అందరూ కూర్చొని వుంటే ...కావలసినవి అన్నీ వాళ్ళే ఒక్కోటి వడ్డిస్తూ వుంటే...పక్కన కూర్చున్న వాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెపుతూ తింటే..కడుపు నిండుగా అనిపించేది....

కానీ ఇప్పుడు చూడు...నిలబడి తింటూ... కాళ్ళ నొప్పి కి త్వరగా తినేసి ప్లేట్ పక్కన పెట్టేయాలి అని అనిపిస్తుంది..గ్లాస్ ఎక్కడ పెట్టాలి అర్ధం కాక ప్లేట్ లో నే ఒక మూలన పెట్టిన ఎక్కడ పైన పడుతుంది అని అదో రకంగా బయం ...


నువ్వు...నీ చాదస్తం కాకపోతే ఇప్పుడే అమ్మమ్మ లా ఆలోచిస్తావు ఏంటి...అని అంది అమృతా...


హ్మ్మ్.... అమ్మనో అమ్మమ్మనో రేపటి కాలంలో ఏదో ఒకటి కావాల్సిన దాన్నే గా...అవును సాగర్...నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నావ్ కదా... మరి నువ్వు ఇప్పుడు చేసుకునేది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా...


లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్...


అదేంటి...


అది అంటే.... తను నన్ను లవ్ చేసింది నేను పెళ్లి చేసుకుంటున్నాను.... తనది లవ్... నాది అరేంజ్డ్...


హ్మ్మ్....మరి నీ లవ్ మ్యారేజ్ సంగతి ఏమైంది...


ఏమైంది నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదు అంది.. నా దృష్టిలో నిజంగా ప్రేమించడం అంటే తన ఇష్టాన్ని గౌరవించడం తనకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూడటం... తనకి నేను నచ్చలేదు అది తన ఇష్టం తన ఇష్టాన్ని నేను కాదు అంటే నేను తననీ ప్రేమించిన వాడిని ఎలా అవుతాను... అందుకే నేను ప్రేమించిన అమ్మాయి కోసం నా ప్రేమని వదులుకున్నాను...


నికు బాధగా అనిపించలేదా...


ఎందుకు అనిపించదు...నేను కూడా మనిషినేగా...నా లైఫ్ లో కూడా ఒక పార్టనర్ వుండాలి అని ఆశ పడ్డాను..తననీ ప్రేమించాను...తన తో నా జీవితం ఎలా వుంటుంది అని ముందే కలలు కన్నాను...కలిసి బ్రతికితే తనతో ఎలా వుండాలి ఎం చేయాలి అని ఒక పెద్ద లిస్ట్ రాసిపెట్టుకున్న..కానీ బ్యాడ్ లక్ ఎం చేయాలి తను నన్ను కాదు అని వెళ్లిపోయింది...


సాగర్ చెప్పేది తన గురించేనా లేక వేరే వాళ్ళ గురించ అని ఆలోచిస్తూ కూర్చుంది అమృత...


అమృత ఎదో ఆలోచనలో ఉంది అని మధు సాగర్ ఇద్దరు గమనించారు...సాగర్ మధు ఒకరిని ఒకరు చూసారు..మధు తన ఫోన్ తీసి సాగర్ కి మెసేజ్ పెట్టింది...ఒక చేతితో తింటూనే మరో చేతితో చాటింగ్ చేస్తుంది...


సాగర్ ఫోన్ మెసేజ్ అలెర్ట్ రాగానే ప్లేట్ పక్కన పెట్టీ..ఒక్క నిమిషం అని పక్కకి వెళ్తాడు...


అందరూ మళ్ళీ మామూలుగానే ముచ్చట్లలో మునిగి పోయారు...మధు మాత్రమే సీరియస్ గా చాటింగ్ చేస్తుంది...


హాయ్ సాగర్...నేను మధు నీ...


హాయ్...ఏమిటి... ఇక్కడే ఉండి మెసేజ్ పెట్టావు...


ఎం లేదు..నిజం చెప్పు..నికు నిజంగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందా....


హా...అవును..


నిజం చెప్పు...నువ్వు నిజం చెపితే నికు మంచి జరుగుతుంది...లేదంటే నీ ఇష్టం...


అవును....నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాలేదు... ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు..మీ ముందు ఊరికే అలా 😍😍అయిన అల ఎలా గుర్తుపట్టావ్ అసలు ఎవరు గుర్తుపట్టలేదు కానీ....


ఆ..అమ్మయికి నీకు ఎంగేజ్మెంట్ అంటే...నువ్వు ఉన్నవని చూసి కూడా...నీ దగ్గరికి రాకుండా వుంటుందా...తను వున్న...నువ్వు వుంటవ...కనీసం ఒక్క సెల్ఫి అయిన దిగేవడివి...వెళ్ళి కాసేపు మాట్లాడే వాడివి...అయిన తను చూస్తే హీరోయిన్ ల వుంది...తానే స్వయంగా నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది అని డబ్బా కొట్టుకున్నపుడే తెలిసిపోయింది....😆


హీరో అన్నాక... ఆ మాత్రం...లేకుంటే ఎలా...


అబ్బా చా....నువ్వు హీరో నా....జిరో...వి


ఎందుకు అల అంటున్నావు...


మరి అమ్మాయిలు మీ అబ్బాయిల ల...కాదు...వాళ్ళకి లోపల ప్రేమ ఉన్న బయటకు చెప్పడానికి బయం వుంటుంది...కన్న వాళ్ళ పై ప్రేమ....ఇంకా ఎన్నో కారణాలు వుంటాయి ..నువ్వు అడగగానే ఒప్పుకుంటారా...చెప్పు...ఎన్ని సినిమాలు చూడలేదు..ప్రేమించిన అమ్మాయి కోసం ఒక్కో హీరో ఎన్ని కష్టలు పడాలి...మరి.. నువ్వేమో అంత సులువుగా ఒప్పుకోకపోతే వదిలేసి వెళ్లిపోయి...రెండు సంవత్సరాల తరువాత కలిసవు...


నువ్వు ఎం మాట్లాడుతున్నావు నాకు తెలియడం లేదు..


అమాయకుడిలా ఆక్టింగ్ చెయ్యకు కానీ...నువ్వు ఇంతక ముందు మాట్లాడింది అమృత గురించే కదా...నిజం చెప్పు...


అవును...అమృత గురించే...


ఇన్ని రోజులూ వదిలేసి వెళ్ళి...మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది ...


ఎవరు చెప్పారు...వదిలి వెళ్ళాను అని..


మరి ఇన్ని రోజులు కనపడలేదు.....


కనపడకపోతే లేనట్టే నా...నేను ఎప్పుడు తన వెంటే వున్న...కానీ తనకు కనపడలేదు...తనకు కనిపించకుండా ఎన్ని పాట్లు పడ్డానో నాకు మాత్రమే తెలుసు...నా కష్టం ఆ పై వాడికి కూడా రాకూడదు ...


ఎందుకు అంత కష్టాలు ఎం అయ్యాయి....


నీకేం తెలుసు...తనతో మాట్లాడాలి అని....కలిసి చేతిలో చెయ్యి వేసి నడవాలని....తన ఒడిలో వాలిపోవాలని...తన అడుగులకు నా అడుగులు కలపాలి అని...తన కళ్ళలోకి సూటిగా చూడాలని.....


అబ్బో....చాలానే వుందే....


చెప్పలేనంత వుంది...


అది సరే కానీ....మరి ఇన్ని రోజులు లేనిది ఎందుకు ఈ రోజు కలిశావు....


అది ఏమిటి అంటే....


హ్మ్మ్....చెప్పు....


అది...


హే... చెప్పు.... టెంక్షన్ పెట్టకు...


ఎం లేదు...మొన్న అమృత కి పెళ్లి చూపులు జరిగాయి కదా....


హా...అవును..


దానికి ముందు రోజు తను పార్లర్ కి వెళ్ళింది....తను బయటకి వస్తె చూడవచ్చు అని బయటే కూర్చున్న నా బైక్ పార్లర్ ముందు పార్క్ చేసాను....ఎంత సేపు అయిన రాకపోయే సరికి...దానికి ఎదురుగా వున్న టీ కొట్టు లో నేను మా ఫ్రెండ్ కలిసి కూర్చున్నాం....


అమృత బయటికి వచ్చి తన స్కూటీ కోసం వచ్చింది...మేము చూసుకోలేదు మా బైక్ తన స్కూటీ పక్కనే పార్క్ చేసాను అని...నా బైక్ మీద సాగర్ అని రాసి వుంటుంది... ఆ పేరు చూడగానే తను ఆగిపోయింది...తన మొహం లో ఒక చిరు నవ్వు....చాలా రోజుల నుంచి తన వెంటే తిరుగుతున్న కానీ ఆ నవ్వు నాకు ఎప్పుడు కనిపించలేదు....అది నా బైక్ అని తనకు అనిపించిందా....నా పేరు నీ చూడటమే కాక... ఆ పేరు వున్న చోట తాకి నవ్వింది ...నవ్వి చుట్టూ పక్కల చూసింది...రెండు నిమిషాలు అలాగే స్కూటీ పై వుంది...బహుశా ఎవరయినా వస్తారేమో అని...తను నాకోసమే ఎదురు చూసింది ఏమో అని నా మనసు కి అనిపించింది....అందుకే నా ఫ్రెండ్ నీ బండి దగ్గరికి పంపాను....తను తడబడుతునే.... ఈ బండి మీదేనా అని అడిగింది.....వాడిని....అవును అని చెప్పగానే అప్పటి వరకు వున్న నవ్వు మయం అయ్యి వెళ్లిపోయింది...

ఎక్కడో...లోపల ఎదో మూల నేను అంటే తనకు ఇష్టం వుంది కానీ తను బయట పడటం లేదు అని అనిపించింది....ఇక ఆ రోజు నుంచి నిద్ర రాలేదు...తెలుసా...


హ్మ్మ్.అబ్బో...చాలానే ఉంది...నిన్ను చూసినప్పుడు అమృత లో ఒక నవ్వు... నువ్వు ఆ అమ్మాయిని చూపించాక తనలో బాధా...రెండు నేను గమనించాను...


హా....అవును...నేను కూడా గమనించాను😍నువ్వే సహాయం చెయ్యాలి.... ప్లీజ్...హ్మ్మ్....సరే...అయితే ఆ అమ్మాయి నీ తీసుకురా...అమృత కి కాలెల తనతో నువ్వు ఫ్రీ గా వుండు... అప్పుడు అదే బయట పడుతుంది....దానికి నువ్వు అంటే ఇష్టం అని...


ఇంత మంచి ఐడియా నాకు రాలేదు చూడు... రియల్లీ నువ్వు గ్రేట్ మధు....కానీ ఎం చేయాలి ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు గా...ఆ అమ్మాయి నా ఫ్రెండ్...తను మోడలింగ్ చేస్తుంది...నేను దానికి చెప్తాను...హెల్ప్ చేస్తుంది...చనువు ఇచ్చింది కదా అని రెచ్చిపోయి పిచ్చి వేషాలు వేసవూ అంటే నా చేతిలో చచ్చావే....


ఈ ప్రపంచం లో అమృత తప్ప అందరు నా అక్కలు చెల్లెళ్లు....


అబ్బా చా...సినిమా డైలాగ్ ల...చాలు లే కానీ...జాగ్రత...


నువ్వు బయటకే కోపిష్టి వి కానీ మనసు వెన్నపూస... థాంక్స్ మధు...


నన్ను తిట్టి నట్ట లేక పోగిడినట్ట....

🤦🤦🤦🤦🤦సరేలే దా...


వస్తున్నా....🏃🏃🏃🏃🏃ఓ...మధు ముందు తిండి తినవే...మా అందరి తినడం అయిపోయింది....


అయ్యో...అయిపోయిందా....అంటూ అందరి వంక చూసింది...అమృత ప్లేట్ తప్ప అందరూ తినేశారు...అమృత నువ్వు ఎందుకు తినలేదు...


ఏమో...తినాలని అనిపించడం లేదు అని దిక్కులు చూస్తుంది...


ఎవరయినా వస్తున్నారా...ఎందుకు అల వేతుకుతున్నవు..


ఆ...ఎం లేదు మధు...నువ్వు తిను నాకు తినాలని లేదు....

.


ఎందుకే ఎం అయ్యింది....


ఎం లేదు...ఊరికే అంటూ దిక్కులు చూస్తుంది అమృత...


నీ ప్రేమని ఎలా బయట పెట్టాలి నాకు తెలుసు లే అని మనసులో అనుకుంటూ...చిన్న నవ్వు నవ్వి...అందరితో పాటు చెయ్యి కడుగుకోవడనికి వెళ్తుంది...మధు...


అమృత చూపులు మాత్రం ఎదో వెతుకుతున్నాయి.....


సాగర్ అమృత వెతకడం చూసి...వెనక నుండి వచ్చి...బూమ్ అని అంటాడు...అమృత ఒక్క సారి గా ఉలిక్కి పడి..వెనక్కి చూస్తుంది...వెనక్కి చూస్తూ స్లీప్ అయ్యి కింద పడిపోయే సమయం లో సాగర్ తననీ అదుపు చేయడానికి తన చెయ్యి పట్టుకుంటాడు...అనుకోకుండా తగిలిన మొదటి స్పర్శ వారి ఇరువురిని లోకం మరిచిపోయే ల చేసింది...చుట్టూ వున్న జనాలు అలానే స్తంభించి పోయినట్టు అనిపించింది...లోకం లో కేవలం వారు మాత్రమే ఉన్నారేమో అని అనిపించేంత ల వారిని వారు కూడా మరిచిపోయి ఒకరి కనుచూపులో మరొకరు లీనమై పెదవి దాటని మాటలను చూపులతో పలికిస్తున్నరు....ఇరువురి కనులు ఒకరికి ఒకరు ప్రశ్నలు...వాటికి సమాధానాలు కూడా కానిస్తున్నయి....


అలాంటి సమయాన ఒక్కసారి గా ఏవో నవ్వులు వినబడ్డాయి . ఇద్దరు తలలు పక్కకి మళ్లించి చూసారు...మధు ....అవును మధు పగల బడి నవ్వుతుంది...నవ్వుతూ మిగితా ఫ్రెండ్స్ కి కూడా చూపింది...అందరూ నవ్వుతున్నారు....

అమృత తననీ తాను సర్ధి చెప్పుకొని గబలున లేచి మన లోకం కి వచ్చింది...తననీ తాను లోలోపల తిట్టుకుంటూ జుట్టు సవరించుకుంటూ తననీ తాను కంట్రోల్ చేసుకోకుండా వేరే లోకం లో మునిగిపోయింది అని...ఆలోచిస్తూ మరోమారు కూడా సాగర్ వైపు చూసే ధైర్యం చెయ్యలేక పోయింది అమృత....వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది....


మధు అమృత వెళ్ళడం చూసి.....సాగర్ నీ చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళింది...


ఎం అయింది మధు....నన్ను ఎందుకు ఇలా లాక్కొని వచ్చావు....


తన వైపు వెటకారం గా చూసి....అయ్యో....బయపడకు నేను ఎం నిన్ను తినేయను లే....


సాగర్ సైలెంట్ అయిపోయాడు....


అయిన నేను నికు హెల్ప్ చేస్తా అన్నాను అని మరి ఎక్స్త్రలు చేస్తున్నావు ఏమిటి....దానికి నువ్వు ఇష్టం అని నాకు అనుమానం మాత్రమే ...నువ్వు రెచ్చిపోయి హద్దులు మీరావు అంటే నా చేతిలో చచ్చవే ...


అయ్యో...మధు నేను ఎం చేయలేదు తానే స్లీప్ అయ్యి పడబోతు వుంటే...పట్టుకున్న ..


చాలు చాలు ఎన్ని సినిమాలు చూడలేదు....రా ముందు త్రిపుర కి పరిచయం చేస్తాను...


త్రిపుర ....ఎవరు...కోపంగా చూస్తూ ...నికు కాబోయే పెళ్ళాం...


హా...అదేంటి ....


నువ్వే అన్నావు గా ఎల్లుండి ఎంగేజ్మెంట్ అని....పేరు కూడా తెలియదా....అని అంటూ ముందుకు కదిలింది...అయ్యో.... ఆ అమ్మాయా అని మధు నీ అనుకరిస్తూ వెంటే వెళ్ళాడు సాగర్...


త్రిపుర ఎవరు...

సాగర్ అమృత ల ప్రేమ కథ కంచికి చేరేనా....

లేక త్రిపుర రాక తో వాళ్ళ జీవితాలు ఎలా మారబోతున్నాు యి...నెక్స్ట్ పార్ట్ లో...
Rate this content
Log in

More telugu story from broken angel Keerthi

Similar telugu story from Drama