broken angel Keerthi

Drama Tragedy Others

4.5  

broken angel Keerthi

Drama Tragedy Others

అమృత సాగరం పార్ట్ 2

అమృత సాగరం పార్ట్ 2

4 mins
375


బాబు...కిలో పుస్తకాలకు ఎంత?


20 రూపాలు అమ్మా..


ఏమిటి ...20 రూపాయలే యిస్తవ... చాలు ఆపు..మొన్నే మా ఎదురు ఇంటావిడ పుస్తకాలు అమ్మితే కిల కు 40 రూపాయలు ఇచ్చారు..అమయకుల్ల కనబడుతున్నా అని మరీ సగం ధరే చెప్పడం లో ఏదయినా న్యాయం వుందా...


అమ్మా...నేను కొనే ధర నేను చెపుతున్న...ఇస్తే యివ్వండి లేదంటే లేదు అంతే గాని ....వాళ్ళు అంత ఇచ్చారు నువ్వు ఇంత అని చెప్పకండి....అని కాస్త కోపంగానే అన్నాడు పాత సామాన్ల వాడు...


సరే సరే... నీ మాట కాదు నా మాట కాదు 30 కి తీసుకో ...

ఒక అద్ధగంట వాదన తరువాత అమ్మ అడిగిన ధరకు దిగాడు....


పుస్తకాలు కాస్త ఎక్కువ వున్నాయి...అని అక్కడే దగ్గర్లో వున్న తన భార్య కి ఫోన్ కొట్టాడు... ఆ ఫోన్ చూసి అమ్మ అవాక్కు అయ్యింది ..ఎందుకు అంటే అది స్మార్ట్ ఫోన్.. మా అమ్మ వాడేది డబ్బా పాత నోకియా మొబైల్ దానికి చుట్టూ చేతికి కట్టుకొనే రక్ష ల రబ్బరు బ్యాండు లు పెట్టీ వుంటాయి.... ఆ ఫోన్ వంకే చూస్తూ...ఎంత ఫోన్ ఓ అయిదు వేలు ఉంటుందా అని అంది నిర్లక్ష్యం గా...


హా...అయిదు వేలకు ఎం వస్తుంది...10 వేలు నా ఫోన్ అని అమ్మా చూపు నీ చూసి జేబులో పెట్టుకున్నాడు...


అబ్బో ..అన్నట్లు వాడి వంక చూస్తూ... మా అబ్బాయి కూడా ఎదో ఇలాంటి దే కొన్నాడు ..అదేదో పండు పేరు వుంటుంది... ఎంటే అది అని పేపర్ చదువుతూ అక్కడే కూర్చున్న అమృత నీ అడుగుతుంది పార్వతి...


ఆపిల్...అమ్మా . 


హా...ఆపిల్...30 వేలు అయింది...ఫోన్ కొనడం ఏమో కానీ...ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కుర్చుంటున్నడు...

ఒకరోజు అయితే రాత్రి పది గంటలకి కావచ్చు గదిలో నేను పడుకొని వున్న...

అరేయ్ చంపెయ్య్యర....నాకు దొరికాక నిన్ను చంపకుండా వదులతా అని ఎలా అనుకున్నవూ రా...వదిలే ప్రసక్తే లేదు..అని వినపడిన మాటలకి గుండె ఆగినంత పనైంది..

పరుగు పరుగున ముందు గదికి వచ్చి చూస్తె లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని మా పుత్ర రత్నం చేస్తున్న ఘనకార్యం అది...ఒక్క సారి గా ఓవెన్ లో 100 డిగ్రీ లో పెట్టిన రెట్టేల కాలిపోయింది నా ఒళ్ళు ...ఎన్ని సార్లు వద్దు అని చెప్పిన అసలు వింటే గా... పాఫ్ జి నో ఆఫ్ జి నో ఎదో అడుతాడు...


పబ్ జి అమ్మా అని ....సాగదీస్తూ చెప్పింది అమృత లోపల కూర్చొని పబ్ జి ఆడుతున్న తమ్ముడి వైపు చూస్తూ....


వీళ్ళ మాటలు విని....మీరు అంత కలిసి నా గేమ్ కి దిష్టి పెడుతున్నారు అందుకే ఓడిపోయిన అని అంటూ...ఫోన్ ఛార్జింగ్ పెట్టీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు...


పాత సామాను వాడి బార్య వచ్చింది...చంకలో ఏడాది పిల్లవాడిని ఎత్తుకుని తల మీద పెద్ద తట్ట తో....తనను అలా చూస్తూ వుండగానే వాళ్ళ భర్త కొన్ని పుస్తకాలు తీసి ఆమె బుట్ట లో వేసాడు....


అమ్మ ...ఒక్క సారి గా అరిచేసింది....

అరె ఆ పిల్ల బాబు నీ ఎత్తుకుని వుంది ....తల మీద అంత బరువు పెడితే మోయగలద...

ఆ మాట విని ఆ ఆడమనిషి నవ్వటం మొదలు పెట్టింది... మా పనే యిది కదా తల్లి...మాకు తప్పదు కదా... అని నవ్వుతూ ముందుకు కదిలింది...


అమ్మ వాళ్ళు వెళ్తుంటే అలానే చూస్తూ వుంది...


ఎం అయింది అమ్మా...వాళ్ళని అల చూస్తున్నావు..ఎం లేదు అమ్మూ...చంటి బిడ్డ నీ చంకలో వేసుకొని ఎన్ని తంటాలు పడాల్సిన అవసరం వారిది..పొట్ట కూటి కోసం ఎన్ని బరువులు మొస్తుంది..... ఈ కాలంలో కూడా పేద వాళ్ళు పేదవాళ్ళు గా నే వుంటున్నారు....డబ్బు అధికారం వున్న వాళ్ళు ఇంకా సంపన్నులు గా మారుతున్నారు.. ఎంటో అంటూ హ్మ్మ్...అని ఒక పెద్ద శ్వాస విడిచిన తరువాత...చూడు....పుస్తకాలు అమ్మితే 400 వచ్చాయి....


అవి కొనడానికి 4000 అయ్యాయి తెలుసా....అని వెటకారం గా అంటూ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కోసం వచ్చాడు అమిత్....


హా...వచ్చావా సుపుత్రా....ఎప్పుడు చూసినా ఆ దిక్కుమాలిన గేమ్ లు అడటమే తప్ప... పార్ట్ టైం జాబు ల గురించి అసలు ఆలోచించావా ఎప్పుడు అయినా...పక్కింటి సుధాకర్ నీ ఫ్రెండ్ కదా...రోజు సాయంత్రం ట్యూషన్లు చెపుతూ అయిదు ఆరు వేల వరకు సంపాదిస్తున్నాడు ..నువ్వు ఉన్నావు ఎందుకు...అని కోపం గా అంది పార్వతి..


అమ్మా... ఎదుటి వాళ్ళతో నన్ను పోల్చద్దు అని ఎన్ని సార్లు చెప్పాను.... అయినా ఇప్పుడు నువ్వు అమ్మిన పుస్తకాలు సెకండ్ హ్యాండ్ లో చదువుకొనే వాళ్ళకి అమ్మితే 2000 వచ్చేవి...అని గట్టిగా మాట్లాడుతూ బయటకి వెళ్ళి పోయాడు అమిత్...


వాడు చెప్పింది నిజమే అమ్మ అని అంది అమృతా....


సజ్జే మీద పడి మూల్గుతూ వుంటే ఎవరు చప్పుడు చేయలేదు కానీ...అమ్మితే మాత్రం అందరూ విరుచుకు పడుతున్నారు అని కోపంగా వెళ్లిపోయింది పార్వతి వంటగదిలోకి .......


ఇది ఎప్పుడు ఉండేదే కదా...అని మళ్ళీ పుస్తకం పట్టుకొని బాల్కనీ లో కూర్చుంది...  


అప్పటి వరకు ఎండ చాలా వుండే...కానీ ఒక్క సారి గా మబ్బులు కమ్ముకొని వాతావరణం చల్లగా అయిపోయింది ...వర్షం రావడం మొదలు పెట్టింది... ఎంటో  మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎది ఎండకలమో ఎది వానా కాలమో తెలియడం లేదు....అని మనసులో అనుకుంటూ ఆకాశం నుంచి జారీ పడుతున్న ఆ ఆకాశ గంగ ను చూస్తూ అలాగే కనులు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలీ వర్షాన్ని అనుభూతి చెందింది... బేద భావం లేకుండా అందరిపై సమానం గా కురుస్తున్న వర్షం నేలని తాకి ఒక అద్భుత మయిన గుబాళింపు నీ వెదజల్లు తు వుంటే...ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక క్షణం తననీ తాను మైమరచిపోయింది అమ్ము....


సజ్జేపై వున్న గులాబీ గుర్తు వచ్చి ఉలిక్కి పడి హడావిడిగా వెళ్ళి దాన్ని ఎవరు చూడకముందు తీసి ముస్తకం లో పెట్టేసింది....


అలానే అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుంది...ఎదురుగా ఉన్న అద్దం లో చూసుకుంటూ వుంటే తన ప్రతి రూపం తనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది....తన వంకే చూస్తూ నవ్వినట్టు అనిపించింది .. అప్రయత్నం గానే నా వంక చూస్తూ ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగింది అద్దం లో తన ప్రతిబింబాన్ని చూస్తూ...

సాగర్ అంటే నీకు ప్రేమ లేదు అన్నవ్ మరి ఎందుకు గులాబీ పువ్వు అంత జాగ్రత్త గా దాచవ్...

అది ఒక మరుపురాని అందమైన జ్ఞాపకం ....అందుకే దాచాను అంతే కాని ఇంకేం లేదు....అని సమాధానం చెప్పింది....


చాలు లే...నేను నీ మనసుని నాతో నువ్వు అబద్ధం చెప్పి ఎం సాధిస్తవు....


అవును నిజమే....నాకు సాగర్ అంటే ప్రేమ వుంది అనుకుంటా అది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు...నాది ప్రేమ లేక బ్రమ అని కూడా అర్థం కావడం లేదు...కానీ నిన్న జరిగిన సంఘటన గుర్తు వచ్చాక మాత్రం....సాగర్ తనను పెళ్లి చేసుకొనే అబ్బాయి అయితే బాగుండు అని అనిపించింది....నిన్న జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది అమృతా...


పెళ్లిచూపుల వాతావరణం...

బంధువులు ...ఫలహారాలు...డెకరేషన్ లు అన్ని అది తెలుగింటి పెళ్ళిచూపులు అని వుట్టిపడెల వుంది..


పెళ్ళికొడుకు తరుపున వాళ్ళు చాలామందే వచ్చారు.... బంధు జనం ఎక్కోవే వున్నారు అని కిటికీలోంచి వారిని గమనించిన అమ్ముకి అనిపించింది....


బయటకి వచ్చి వాళ్లకి కాఫీ లు ఇచ్చి... వాళ్ళ ముందు కూర్చుంది....


అందరూ కాసేపు అగంట్లో పెట్టిన బొమ్మని చూసినట్టు చూసి బాగుంది అని అన్నారు...అబ్బాయి అమ్మాయి తో మాట్లాడాలి అంట అని బహుశా వాళ్ళ అమ్మ గారు కావచ్చు అన్నారు...అమ్మ వంక చూసాను....తప్పదు కాసేపు అని అన్నట్లు చూసింది... లేచి నిలబడ్డాను... బాల్కనీ అక్కడ వుంది అని అంటూ సైగ చేస్తూ చూపించాను....అతను కూడా లేచి ముందు నడుస్తూ వెళ్ళాడు... వెను వెంటనే నేను కూడా... మా వెనుక వున్న బందు జనం జంట బాగుంది కదా అని మాట్లాడుకోవడం తన చెవిలో వినపడుతున్నాయి...కానీ వెనక్కి చూడకుండా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది....ఇంకా సంబంధం ఒప్పుకోక ముందే ఎందుకు జంట..మంట...అని మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ వెళ్ళింది...


అమృత పెళ్లి కి ఒప్పుకుందా?

సాగర్ నీ కలుస్తుందా?



Rate this content
Log in

Similar telugu story from Drama