యవ్వనం..శ్రీనివాస భారతి
యవ్వనం..శ్రీనివాస భారతి


నీ యవ్వనాలు
నాలో కోర్కెలగుర్రాలు
ఆ నయనం
మీన సమానం
ఆ నాసిక
సంపెంగల ధిక్కారం
ఆ ఆధారాలు
దొండపండును ధిక్కరిస్తూ
ఆ మెడ
శంఖాన్నీ బెదిరిస్తూ
వక్షస్సు
పరిపూర్ణ యవ్వన భారంతో
నాభి
నూగారుతో ముచ్చటగా
మాతృత్వం
సృష్టి ని తనలో దాచేస్తూ....
ఊరువులు ,జఘనాలు
పద్మినీ స్త్రీని తలపిస్తూ
ఓహ్!
ఏం కలగన్నాను
వాస్తవంలో
నీలో ఏముంది
అనుమానపు దృక్కులు
వంకర తిరిగిన ముక్కు
ఎండిపోయిన పెదాలు
థైరాయిడ్ గొంతు
అంటుకు పోయిన వక్షస్సు
బెలూను నాభి
మరిచిపోయిన మాతృత్వం
కొవ్వు నిండిన శరీరం
వాస్తవం చేదు నిజం
అందుకే ఊహల్లో బ్రతికేస్తూ...
స్వప్న సుందరిని మిస్ వరల్డ్ చేస్తూ....
********&&&&&&&&&&&********