STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

వర్షపు నదులు

వర్షపు నదులు

1 min
409


విదిలించిన మనో కలంలో.. 

నీ ఊహొకటి అందాల కవితై

అలరారి..


తెరలు తెరలుగా విస్తరించి 

నీలాల నింగిలో మెరుపల్లే

తళుకుమని..ఎద తోటలో 

పాటలా పల్లవించింది..


మనో మందిరంలో నీ చిత్రం 

మరులు పోతూ..

వేవేల వర్ణాల ఇంద్ర చాపమై 

మెరిసి జారుతుంటే..


కనుల వాకిళ్లలో కమనీయంగా 

వేలాడే శుభ తోరణంలా.. 

నీ రూపు చిక్కిన గుండెకి ..


వేవేల వేణు నాదాల శృతి గీతాల 

మంద్ర సంగీతమై నీ తలపుల 

కీర్తన ఢమరుక నాదమై గుండె లయల్లో.. 

అణువణువూ ప్రతిధ్వనించింది..


జాలెరుగని కాలాలు.. రంగులు మార్చే

ఋతువులు.. కలగలిసి..

మన కలయికని ఆపుతుంటే..


నీ ఉనికెరుగని తోటలు ..

వానలూ ఎదురవుతుంటే..


నీ ఊసెరుగని గాలి గందాలలో.. 

నీ పేరు తలవని

కూజితాలలో..


వెతల ఊటైన మనసులో..

నీలాలు కురిసే కళ్ళన్నీ..

వర్షపు నదులై రూపాంతరం

చెందుతున్నా..


నీ తలపుల ఉప్పెనల్లో.. 

నీ ఊసుల తరగల్లో..

మునిగి తేలుతూ.. 

సాంత్వన తెమ్మెరల్లో సేద

తీరుతూనే ఉన్నాను..


మూగపోయిన మస్తకంలో 

ఊహే లేని స్తబ్దతనై

నిలిచినా...

ఆశల నెత్తావంటి నీ తలపుల

పుప్పొడి మనసు తోటల్లో

పరిమళమై విస్తరిస్తుంటే..


ఆశల మెట్లెక్కి .. నింగిన మెరుస్తున్న

జాబిలంటి నిను చేరుకుందామని

వెన్నెలలో వెతుకులాటనై..

చీకటితో సైతం జోడీ కడుతున్నా..


నీ సమక్షమెరుగని మనసున.. 

శృతి లేని పాటలన్ని.. 

ఎదని కోసి గుబులుగుంటే..

నీ మాటల సంగీతంలో తడిసి

ముద్దవుతున్న మానసాన్ని

బుజ్జగిస్తూ..


చూపుల చుక్కానిలో నీ 

ఊహా చిత్రమే చిక్కుకుంటుంటే..

నిను కానని కనులు వర్ష సంద్రాలు 

గాక ఇంకేమిటి?..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational