STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

వలపు మేఘం

వలపు మేఘం

1 min
117

వలపుమేఘం కబురుతెస్తే ఈసడించుట న్యాయమేనా 

రాజహంసలు వెంటబడితే కసిరికొట్టుట న్యాయమేనా


మల్లెమాలలు మోసుకొస్తే మూతి తిప్పుట న్యాయమేనా 

వెన్నెలొలికిన రాత్రివేళల జ్వాలరేపుట న్యాయమేనా 


శశిని మించిన మోము చూపవు తీయతీయని మాటలాడవు

నిన్ను చూపే కలను కూడా చిదిమివేయుట న్యాయమేనా  


కనులలో వత్తులను వేస్తూ ఎన్ని వెలిగించాను తెలుసా

సుడిగాలిలా వచ్చేసి దీపములార్పివేయుట న్యాయమేనా 


తెరచుకొని నీవొచ్చినాకే మూసుకోమని వేడుకున్నా 

గుండెతలుపులు తెరవలేదని నిందలేయుట న్యాయమేనా


అంతరంగములోని కోరిక గొంతు విప్పుట నేర్వలేదే  

మనసు తెలిసిన దానివైనా జాగుచేయుట న్యాయమేనా


Rate this content
Log in

Similar telugu poem from Romance